Sunday, August 22, 2021

బిగ్ వ్యాక్సినేషన్ డ్రైవ్.. సర్వం సిద్ధం

హైదరాబాద్ : 22/08/2021

బిగ్ వ్యాక్సినేషన్ డ్రైవ్.. సర్వం సిద్ధం

బిగ్ వ్యాక్సినేషన్ డ్రైవ్.. సర్వం సిద్ధం

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ పరిధిలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇంటింటికి తిరిగి టీకాలు అందించనున్నారు. సోమవారం నుంచి 15 రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగుతుంది. నగరంలోని 4,846 కాలనీలు, మురికివాడలతో పాటు కంటోన్మెంట్ జోన్‌ లోని 360 ప్రాంతాల్లో టీకాలు వేయనున్నారు.

ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారితో పాటు, రెండో డోసు వేసుకోవాల్సిన వారికి టీకా అందించనున్నారు అధికారులు. ఈ డ్రైవ్ తో హైదరాబాద్ లో వంద శాతం టీకా పంపిణీ చేస్తామని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 175, కంటోన్మెంట్‌ లో 25 మొబైల్ వ్యాక్సిన్ వాహనాలను కూడా సిద్ధం చేశారు. ప్రతీ వాహనంలో ఇద్దరు సిబ్బందితోపాటు ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. ఈ 15 రోజులు ప్రతీ కాలనీకి వెళ్లి ఇంటింటికీ వ్యాక్సిన్ అందిస్తారు.

No comments:

Post a Comment