Saturday, August 7, 2021

కోట్ల కబ్జోత్సవం....జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ

హైదరాబాద్ : 08/08/2021

కోట్ల కబ్జోత్సవం

కోట్ల కబ్జోత్సవం

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

– జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ అక్రమాలపై.. తొలివెలుగు కథనానికి స్పందన
– తొలివెలుగు రాసింది అక్షరాలా నిజమని…
– 200 ఫైల్స్ మిస్ అని ఒప్పుకున్న సొసైటీ
– గత అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సొసైటీ
– ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..?

తొలివెలుగు చెప్పిందే నిజమైంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. తొలివెలుగు రాసిన ప్రత్యేక కథనాలకు స్పందించిన ప్రస్తుత సొసైటీ… గతంలో ఎన్నో అక్రమాలు జరిగాయని గుర్తించి… తొలివెలుగు కథనాలు వంద శాతం నిజమని ఒప్పుకుంది. దాదాపు 200 ఫైల్స్ మిస్ అయ్యాయని వాటిపై దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి కంప్లయింట్ చేసింది కమిటీ.

ఎప్పుడైనా ఫిర్యాదు రాగానే క‌మిటీల మీద క‌మిటీలు వేసి విచార‌ణ‌ జ‌రిపిస్తుంది ప్రభుత్వం. గతంలో అసెంబ్లీ హౌస్ కమిటీ వేసి ఎటూ తేల్చలేదు. ఇప్పుడు కనీసం ఆ మాటే ఎత్తడం లేదు. త‌మ‌కు న‌చ్చిన వారి విష‌యంలో ఒక‌లా.. న‌చ్చ‌ని వారి విష‌యంలో మ‌రోలా కేసీఆర్ వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రానిక్ మీడియాలో మంచి పొలిటికల్ స్టోరీలు ఇస్తారనే పేరున్న ఛానల్ లో కొన్నాళ్ల క్రితం వాటాల్లో చేతులు మారాయని వినికిడి. అందుకే ఆ ఎన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

హైద‌రాబాద్ లోని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జూబ్లీహిల్స్ హౌసింగ్ కోఆప‌రేటివ్ సొసైటీ.. కొన్నేళ్ళుగా అక్ర‌మాల కూపంలో కూరుకుపోయింది. తొలివెలుగు వాటిపై వరుసగా కథనాలు ఇస్తోంది. గ్రీన్ కో.. ఏలుకో అని 450 కోట్ల వ్యవహారం వెలుగులోకి తెచ్చింది. రిటైర్డ్ పోలీస్ అధికారి ఆగడాలను ప్రజల ముందు పెట్టింది. ఈ విష‌యాలు అన్నీ తెలిసి కూడా తెలంగాణ స‌ర్కార్ మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకునేందుకు ఆస‌క్తి చూపించ‌క‌పోగా.. అక్ర‌మార్కుల‌కు అండగా నిల‌బ‌డుతోంద‌ని.. వారిని కాపాడేందుకు విశ్వప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ప్రస్తుత సొసైటీ స‌భ్యులు విమ‌ర్శిస్తున్నారు.

ప్రభుత్వం రంగంలోకి దిగి గ‌త 15 ఏళ్ల నాటి రికార్డుల‌ను ప‌రిశీలిస్తే.. ఇందులో జ‌రిగిన వేలాది కోట్ల రూపాయ‌ల అక్ర‌మాల గుట్టు ర‌ట్టవుతుంద‌ని చెబుతున్నారు. తాజాగా సొసైటీకి సంబంధించి ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా 200 వ‌ర‌కూ ఫైళ్లు మాయమైనట్లు గుర్తించారు. 15 ఏళ్లుగా సొసైటీని గుప్పిట్లో పెట్టుకున్నారు పెద్ద‌లు. ఉన్న ఫైళ్ల‌లోనే అక్ర‌మాలు కుప్ప‌లు తెప్ప‌లుగా ఉన్నాయి. మ‌రి.. మిస్ అయిన ఫైళ్ళ‌లో ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఎంత దోపిడీ జ‌రిగింది… అస‌లు ఈ ఫైళ్లు తిరిగి వ‌స్తాయా లేదా అన్న‌ది ఇప్పుడు ఓ పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

సొసైటీ నూత‌న పాల‌క వ‌ర్గం.. క్రితం ఫైళ్ల మిస్సింగ్ వ్య‌వ‌హారంపై రిజిస్ట్రార్, క‌మిష‌న‌ర్ ఆఫ్ సొసైటీస్ కి కూడా ఫిర్యాదు చేసింది. జరిగిన అక్ర‌మాలకు గ‌త క‌మిటీకి ప్రెసిడెంట్ గా ఉన్న న‌రేంద్ర చౌద‌రితోపాటు అప్ప‌టి కార్య‌ద‌ర్శి హ‌నుమంత‌రావు, ఇత‌ర క‌మిటీ సభ్యులే బాధ్య‌త వహించాల్సి ఉంటుంద‌ని ప్రభుత్వంలోని ఓ అధికారి తొలివెలుగుకి తెలిపారు

No comments:

Post a Comment