Tuesday, July 21, 2026

ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు_

*హైడ్రాకు రెండేళ్లు.. న‌గ‌రంలో సంబ‌రాలు*

*నెక్లెస్ రోడ్డులో ర్యాలీ తీసిన‌ న‌గ‌ర ప్ర‌జ‌లు*

*ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 20:

హైడ్రాకు రెండేళ్లు.. న‌గ‌ర‌వ్యాప్తంగా సంబ‌రాలు.. శ‌నివారం రోజు వివిధ ప్రాంతాల్లో జ‌రిగిన వేడుక‌లు నిరూపించాయి. పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడి మా కాల‌నీల‌కు జీవం పోశార‌ని కొన్ని కాల‌నీల్లో వేడుక‌లు చేసుకోగా.. చెరువుల‌ను పున‌రుద్ధ‌రించి అక్క‌డ ఆహ్లాద‌క‌ర‌ వాతావ‌ర‌ణం ఉండేలా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంద‌ని మ‌రి కొన్ని ప్రాంతాల వారు సంబ‌రాలు చేసుకున్నారు. కొండ‌లు గుట్ట‌ల‌తో ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం ఉన్న ప్ర‌భుత్వ భూములు క‌బ్జాలు కాకుండా చ‌ర్య‌లు తీసుకున్నారంటూ మ‌రి కొంత‌మంది వేడుక చేసుకున్నారు.  హైడ్రా ఫెన్సింగ్ వేసి కాపాడిన ప్ర‌భుత్వ భూముల్లో ట‌పాసులు పేల్చి కేరింతలు కొట్టారు.న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగ‌ర్‌, నెక్లెస్ రోడ్డుకు చేరుకుని  భారీ ర్యాలీ తీశారు. ఎన్‌టీఆర్ గార్డెన్ నుంచి లుంబినీ పార్కు వ‌ర‌కూ భారీ ర్యాలీ నిర్వ‌హించి ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసి న‌గ‌రానికి భ‌విష్య‌త్తునిచ్చిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిలువెత్తు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దేశానికే ఆద‌ర్శ‌మంటూ ప‌లువురు ఈ సంద‌ర్భంగా కితాబునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రాను విస్త‌రించి జిల్లాల్లో కూడా చెరువులు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు డిమాండ్ చేశారు. రెండేళ్ల‌లో 3315 ఎక‌రాల భూమిని కాపాడిన హైడ్రాను అభినందించారు. ఈ భూముల విలువ లెక్క‌ల్లో చూస్తే రూ. 1.50 ల‌క్ష‌ల కోట్లు అయినా.. ప్రాణ‌వాయువును అందించే పార్కుల రూపంలో.. భూగ‌ర్భ జ‌లాల‌ను పెంపొందించి.. వ‌ర‌ద‌ల క‌ట్ట‌డి చేసిన చెరువుల విభాగంలో చూస్తే విలువ అనంత‌మంటూ కీర్తించారు. హైడ్రా ఏర్పాటు చేయ‌డం ప్ర‌భుత్వ సాహ‌సోపేత నిర్ణ‌యంగా ప‌లువురు అభివ‌ర్ణించారు. అనంత‌రం స‌చివాల‌యంలో వివిధ శాఖ‌ల అధికారుల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేశారు.

నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల చొప్పున‌ ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి_

*క్యూర్ ప‌రిధిలో కొత్త  ఇందిర‌మ్మ ఇళ్ల నుంచే వ‌చ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తాం - మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి*

*త్వ‌ర‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు శుభవార్త‌*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 20:

హైద‌రాబాద్ ప్రాంతంలోని క్యూర్ ప‌రిధిలో తొలి విడ‌త‌గా 16 నియోజ‌వ‌ర్గాల్లో  ప్రయోగాత్మ‌కంగా నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల చొప్పున‌   ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామ‌ని, త్వ‌ర‌లో మ‌రో 8 నియోజ‌క‌వ‌ర్గాల‌లో కూడా ఈ ప‌ధ‌కం అమ‌లు చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తొలివిడ‌త‌లో 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో 8వేల ఇళ్లు,జూలై 21 నుంచి ఆగ‌స్టు 10 వ‌ర‌కు  ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ ప్రక్రియ జరుగుతుంది అని అన్నారు.త్వ‌ర‌లో మ‌రో 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో స్ధ‌లాల గుర్తింపు చేయడం జరుగుతుంది అని అన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఇళ్ల మంజూరులో రిజ‌ర్వేష‌న్‌,ఒక్కో ఇంటికి రూ.11 ల‌క్ష‌లు,రూ.5ల‌క్ష‌లు ప్ర‌భుత్వ స‌బ్సిడీ ఉంటుంది అని అన్నారు.రూ.40-60 ల‌క్ష‌ల విలువ‌చేసే స్ద‌లం ల‌బ్దిదారునిపేరిట ఉచిత రిజిస్ట్రేష‌న్ చేయడం జరుగుతుంది.ల‌బ్దిదారుని వాటా రూ.6 ల‌క్ష‌లు ఉంటుంది.నాలుగు విడ‌త‌ల్లో చెల్లింపు సౌక‌ర్యం కల్పించడం జరిగింది అన్నారు. పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేరేవ‌ర‌కు ఇందిర‌మ్మ ఇళ్ల య‌జ్ఞం కొన‌సాగుతుంద‌ని, చివ‌రి ల‌బ్దిదారునికి ఇల్లు అందేవ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని , ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని పేర్కొన్నారు.సోమ‌వారం నాడు స‌చివాల‌యంలో స‌హ‌చ‌ర మంత్రులు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్, మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌ త‌దిత‌రుల‌తో క‌లిసి క్యూర్ ప‌రిధిలోని ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా  ఇందిర‌మ్మ ఇళ్ల బ్రోచ‌ర్‌ , మీసేవ‌, వాట్సాప్ ద‌ర‌ఖాస్తు ల‌ను  ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కం పేరును ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స‌హేతుకంగా వివ‌రించిన న‌ల్గొండ జిల్లా న‌కిరేక‌ల్ గ్రామానికి చెంద‌ని కొండా నాగ‌రాజుకు ల‌క్ష రూపాయిల న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేసి మంత్రులు స‌త్క‌రించారు.రాష్ట్రంలో తొలివిడ‌త‌గా 4.50 లక్ష‌ల ఇళ్ల మంజూరు చేయ‌గా రెండ‌వ విడ‌త‌లో 2.50 ల‌క్ష‌ల ఇళ్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్నామ‌ని ఇప్ప‌డు క్యూర్ ప‌రిధిలో ల‌క్ష ఇళ్లు ప్రారంభిస్తూ 8ల‌క్ష‌ల ఇళ్లు పేద‌ల‌కు అందిస్తున్నామ‌ని అన్నారు. వ‌చ్చే నెలలోగా రెండు ల‌క్ష‌ల‌కు పైగా ఇళ్లు పూర్తికానున్నాయ‌ని అన్నారు. గ‌త పాల‌కులు ప‌నికిరాని ఆలోచ‌న కార‌ణంగా ఎన్నిక‌ల స‌మయంలో హైద‌రాబాద్‌కు  30-35 కిలోమీట‌ర్ల దూరంగా ఇళ్ళ‌ను నిర్మించ‌డం వ‌ల‌న కేవ‌లం 8-9 వేల మంది మాత్ర‌మే నివాసాల్లో దిగార‌ని , మిగిలిన వారు మంజూరు ప‌త్రాలు తీసుకున్నారే త‌ప్ప దిగ‌లేద‌న్న విష‌యం త‌మ ప‌రిశీల‌న‌లో వెల్ల‌డైంద‌న్నారు.ఈ ప‌రిస్ధితుల్లో  పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా నియోజ‌క‌వ‌ర్గాన్ని యూనిట్‌గా తీసుకొని పేద‌లు నివ‌సిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణాలు చేప‌డుతున్నాం.  
పేద‌ల నివాస ప్రాంతాల్లోనే 525 చ‌ద‌ర‌పు అడుగుల వైశాల్యంతో సుమారు 40-60 ల‌క్ష‌ల రూపాయిల విలువ క‌లిగిన స్ధలాల‌ను ఆడ‌ప‌డుచుల పేరిట రిజిస్ట్రేష‌న్ చేసి ఇస్తామ‌ని తెలిపారు. దీనిని ప‌దేళ్ల వ‌ర‌కు అమ్ముకునే అవ‌కాశం ఉండ‌ద‌ని, అయితే బ్యాంకులో రుణం కోసం త‌న‌ఖా పెట్టుకోవ‌చ్చున‌ని తెలిపారు. ఇళ్ల మంజూరులో  ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు  రిజ‌ర్వేష‌న్ ఉంటుంద‌న్నారు.ఒక‌వేళ ఇల్లు మంజూరు కాక‌పోతే క‌ట్టిన రూ.10 వేల రూపాయిలు తిరిగి చెల్లిస్తామ‌న్నారు. ప్ర‌భుత్వం ఒక్కో ఇంటికి రూ.5 ల‌క్ష‌ల రూపాయిల‌ను ఉచితంగా ఇస్తుంద‌ని, ఒక్కో ఇంటి నిర్మాణానికి 11 ల‌క్ష‌ల రూపాయిల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతున్నందున ల‌బ్దిదారుల నుంచి మిగిలిన ఆరు  ల‌క్ష‌ల రూపాయిల‌ను నాలుగు వాయిదాల్లో తిరిగి తీసుకుంటామ‌ని , ఆ మొత్తంలో ఈ 10 వేల రూపాయిల‌ను మిన‌హాయిస్తామ‌ని మంత్రి గారు తెలిపారు.ఏనియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌న్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా స్ధానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించి స్ధ‌లాల‌ను ఎంపిక చేయ‌డం జ‌రిగింది. ఈనెల 21వ తేదీ నుంచి మీసేవ‌, వాట్సాప్ ( నెంబ‌ర్ 8096958096), వెబ్‌సైట్  ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చున‌ని తెలిపారు. ల‌బ్దిదారుని కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండాల‌ని, ద‌రఖాస్తు దారుని పేరిట క్యూర్ ప‌రిధిలో స్ధ‌లం గానీ, స్వంత ఇల్లుకానీ ఉండ‌కూడ‌ద‌న్నారు. ఒక కుటుంబం నుంచి  ఒక ద‌ర‌ఖాస్తు మాత్ర‌మే స్వీక‌రిస్తార‌ని. అర్హ‌త బ‌ట్టి కేటాయింపు జ‌రుగుతుంద‌న్నారు. 360 డిగ్రీల ప‌రిధిలో  ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల వ‌డ‌పోత జ‌రుగుతుంద‌ని, అప్ప‌టికీ ఎక్కువ ద‌ర‌ఖాస్తులు వ‌స్తే అంద‌రి ముందూ బ‌హిరంగంగా లాట‌రీ తీసి ఇళ్లు మంజూరు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ప‌ధ‌కం కింద ప్ర‌తిపాదించిన 525 చ‌ద‌రపు  అడుగుల‌  ఫ్లాట్ లో ఒక బెడ్ రూమ్‌, హాల్‌, కిచెన్ ఉంటాయన్నారు.హైద‌రాబాద్ లోప్ర‌స్తుతం జ‌రుగుతున్న బోనాల జాతర శుభ సంద‌ర్బంలో క్యూర్ ప‌రిధిలో పేద‌ల ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టామ‌ని వచ్చే ఏడాది క్యూర్ ప‌రిధిలో కొత్త  ఇందిర‌మ్మ ఇళ్ల నుంచే వ‌చ్చే ఏడాది బోనాలు ఎత్తించే విధంగా నిర్మాణాలు శ‌ర‌వేగంగ‌గా పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా పేద‌వాని సంక్షేమం విష‌యంలో ఏమాత్రం రాజీ ప‌డ‌డం లేదు.  ఇందిర‌మ్మ ఇళ్ల పురోగ‌తిని బ‌ట్టి ప్ర‌తిసోమ‌వారం చెల్లింపులు జ‌రుపుతున్నాం. ఈ ప్ర‌భుత్వం పేద‌వాని గురించే కాకుండా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం గురించి కూడా ఆలోచ‌న చేస్తోంది. ఇళ్ల  విష‌యంలో   త్వ‌ర‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్రజానీకానికి కూడా శుభావార్త అందిస్తామ‌న్నారు.క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ఒక చారిత్రాత్మ‌క కార్య‌క్ర‌మ‌ని ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధర్‌బాబు  అన్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌న్నారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీనీ నిల‌బెట్టుకుంటున్నామ‌ని  ఉచిత బ‌స్సు, ఉచిత క‌రెంట్, అర్హులంద‌రికీ రేష‌న్ కార్డులు ఇందిర‌మ్మ ఇళ్లు ఇలా అనేక కార్య‌క్రమాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ హైద‌రాబాద్ ప‌రిధిలో పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణం చేప‌ట్ట‌డం శుభప‌రిణామం అన్నారు.
ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టే  నియోజ‌క‌వ‌ర్గాలు:
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి; 
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని జల్‌పల్లి; 
శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాయదుర్గం; 
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని తట్టిఅన్నారం, బండ్లగూడ; 
మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కౌకూర్; 
నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని  రెడ్‌హిల్స్ మ‌రియు  నీలోఫర్ ఆసుపత్రి సమీప పోలీస్ క్వార్టర్స్; 
ఖైరతాబాద్  అసెంబ్లీ నియోజకవర్గంలోని  హకీంపేట్ ద‌ర్గ  మరియు   జూబ్లీహిల్స్, ఎమ్మెల్యేకాలనీ
కార్వాన్  అసెంబ్లీ నియోజకవర్గంలోని కుల్సుంపురా సమీప  పోలీస్క్వార్టర్స్; 
బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలోని నందిముసలిగూడ; 
అంబర్‌పేట్   అసెంబ్లీ నియోజకవర్గంలోని  సిటీపోలీస్ లైన్స్  
కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీకాలనీ; 
మేడ్చల్   అసెంబ్లీ నియోజకవర్గంలోని పోచారం ఎల్‌ఐజీకాలనీ;
కుత్బుల్లాపూర్ అసెం బ్లీ  నియోజకవర్గంలోని  గాజులరామారం; 
సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పాటిగడ్డ; 
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మారేడ్‌పల్లి–మహేంద్రహిల్స్; 
మలక్‌పేట్ అసెంబ్లీ  నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం ఆర్అం డ్ బీ   క్వార్టర్స్ ఉన్నాయి.ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న‌మండ‌లి స‌భ్యులు అద్దంకి ద‌యాక‌ర్‌, శాస‌న‌స‌భ్యులు దానం నాగేంద‌ర్‌, మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాంధీ, మాధ‌వ‌రం కృష్ణారావు, కాలేరు వెంక‌టేష్ , ప్ర‌కాష్ గౌడ్‌, శ్రీ‌గ‌ణేష్‌,  మాజిద్ హుస్సేన్‌, కౌస‌ర్ మొహినుద్దీన్ ,జుల్ఫీక‌ర్ అలీ, జాఫ‌ర్ హుస్సేన్‌, ముబీన్‌, హౌసింగ్ శాఖ ఎండీ వి.పి. గౌత‌మ్‌, క‌లెక్ట‌ర్ ప్రియాంక ఆల‌, క‌మీష‌న‌ర్లు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటన_

*ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటన*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 20:

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు.రాత్రి కొడంగల్‌లో బసచేసి మరుసటి రోజు (22వ తేదీన) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

Sunday, July 19, 2026

భారత దేశంలో దాదాపు 23% పైగా ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు_

*అటకెక్కిన ఆటలు - చిన్నారుల భవిష్యత్తు ఇబ్బందుల్లో - అనూరాధ రావు అధ్యక్షురాలు బాలల హక్కుల సంఘం*

*భారత దేశంలో దాదాపు 23% పైగా ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు*

*ప్రైవేటు పాఠశాలల పరిస్థితి చూస్తే 50%*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15:

ఒకప్పుడు ప్రతి వీధిలో, ప్రతి పాఠశాలల్లోని మైదానంలో కబడ్డీ, ఖోఖో, దాగుడు మూతలు, తోక్కుడుబిళ్ల, క్రికెట్ లాంటివి ఆడుతుండె వారు.. రాను రాను ఈ విషయం కథలుగా చెప్పుకోవాల్సిన దుస్థితితో ఉన్నాం...
నేడు మైదానాలు ఖాళీగా ఉన్నాయి, పిల్లల చేతిలో బంతి, బ్యాటు ఏవి లేవు, వీరి చేతుల్లో మొబైల్ మాత్రమే ఉంది. మార్కులకు ఇచ్చే ప్రాధాన్యం ఆటలకు లేదు,ఆటల సమయం అంటే వృధా అనే ఫీలింగ్ ఉన్నారు అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాలలు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం - 5-17 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి. కాని నేటి పిల్లలు ఉదయం నుండి సాయంత్రం వరకు క్లాసులు, ట్యూషన్లు, హోం వర్కులు, కాస్త సమయం దొరిగితే మొబైల్లో బాగా బిజిగా గడిపేస్తున్నారు. ఫలితం పిల్లల్లో ఊబకాయం, కంటి సమస్యలు, బత్తికి గురికావడం,మానసిక సమస్యలు,ఏకాగ్రత లోపం, చదువుపై శ్రద్ద తగ్గడం,మధుమేహ ప్రమాదం పొంచి ఉంది అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆటలు కేవలం వినోదం కోసం కాదు. ఆటలు క్రమ శిక్షణను నేర్పిస్తాయి. జట్టుగా ఆడడం వల్ల స్నేహం మరియు ఏ సమస్య అయిన సమిస్టిగా ఎదుర్కోవచ్చు అని నేర్పుతుంది. ఓటమిని అంగీకరించి, మళ్లీ గెలుపు కోసం ప్రయత్నం చేయడం నేర్పుతాయి.
మన దేశం అత్యంత అధిక జనాభ కలిగిన దేశం కాని ప్రపంచ దేశాల వేదికలపై భారతదేశ పతాకం ఎగరాలంటే కచ్చితంగా పిల్లలకు క్రీడలు అవసరం.2024 ఒలింపిక్స్ లో మనదేశానికి 6 పతకాలు వచ్చాయి, 1 రజతం, 5 కాంస్యం సాధించాయి. అంటే ఎంత వెనుకబడి ఉన్నామో అర్ధం అవుతుంది.భారత దేశంలో దాదాపు 23% పైగా పాఠశాలలకు ఆట స్థలాలు లేవు,అవి ప్రభుత్వ పాఠశాలలు.ఇంక ప్రైవేటు పాఠశాలల పరిస్థితి చూస్తే 50% .చిన్న అపార్ట్మేంట్లలో,ఇరుకైన భవనాల్లో పాఠశాలలు నడుస్తున్నాయి.అనుమతులు తీసుకునే సమయంలో తప్పుడు సమాచారంతో సంప్రదించడం,అధికారుల పర్యవేక్షణ లేకపోవడం. కోర్టు ఆదేశాలు ఉన్న, ఆ ఆదేశాలను అమలు చేయకపోవడం.
ఇక తెలంగాణలో ఆట స్థలం లేని ప్రభుత్వ పాఠశాలలు 7967 ఉన్నాయి. 2273 పాఠశాలల్లో కరెంటు కనెక్షన్ కూడ లేదు అని రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.ఇకనైన ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలకు ఆట స్థలం ఉండేవింధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. విద్య తో పాటు సమాన ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వాలి. స్పోర్ట్స్ స్కూల్స్ ప్రతి జిల్లాలో ఏర్పాటుచేయాలి, టైం టెబుల్ లో కచ్చితంగా ప్రతి రోజు ఆటల కోసం ఒక గంట సమయం కేటాయించాలి.
కోర్టు ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పాఠశాలల అనుమతులు జారి చేసే సమయంలో అధికారులు తనిఖీలు నిర్వహించి, ఆటస్థలం ఉంటేనే ఇవ్వాలి. 
మీ పిల్లలను పాఠశాలలో చేర్పించే సమయంలో ఆట స్థలం ఉంటేనే జాయిన్ చేయండి.
పిల్లల ఆరోగ్యమే మహభాగ్యం.
భారత దేశ పతాకం ప్రపంచ దేశాల వేదికల పై ఎగరాలంటే క్రీడాకారుల అవసరం ఎంతో ఉంది.

స్కిల్స్ వ్యక్తిగత విజయానికే కాదు, సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది - సీఎం రేవంత్ రెడ్డి_

*స్కిల్స్ వ్యక్తిగత విజయానికే కాదు, సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15:

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శరవేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని యువత విద్యతో పాటు జీవితానికి, ఉపాధికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాలను నేర్చుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు.యువత తమలోని ప్రతిభను, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఎదగాలని “వరల్డ్ యూత్ స్కిల్స్ డే”సందర్భంగా పేర్కొన్నారు. స్కిల్స్ వ్యక్తిగత విజయానికే కాదు, సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది అని పేర్కొన్నారు.యువత ఎప్పటికప్పుడు స్కిల్స్ అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను ఆధునిక సాంకేతిక విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆధునిక ప్రపంచంలో వ్యవస్థలకు అవసరమైన నైపుణ్యత అందుబాటులో లేకపోవడం నిరుద్యోగానికి దారితీస్తోందని పేర్కొన్నారు."నేర్చుకోవడం ఆపొద్దు... స్కిల్స్ పెంచుకోవాలి... మీ విజయంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా మీ వంతు పాత్ర పోషించండి. నైపుణ్యమే ఆత్మవిశ్వాసానికి, ఉపాధికి, సుస్థిర భవిష్యత్తుకు మార్గం. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు" అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు_

*ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 18:

"జయ జయహే తెలంగాణ" గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి, తన కలాన్ని ఉద్యమ జెండాగా మలిచి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ప్రజాకవి అందెశ్రీ  జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ స్పూర్తిని అక్షరాల్లో ఆవిష్కరించిన అరుదైన కవి అందెశ్రీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ప్రతి గేయం ప్రజల హృదయాల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిందని పేర్కొన్నారు. అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, అది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, స్వాభిమానానికి స్వరంగా, భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సమాజానికి ఆయన అందించిన సాహిత్య సంపద చిరకాలం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ప్రజాకవి అందెశ్రీ  పేరు,ఆయన సాహిత్యం, ఆయన ప్రబోధించిన ఆత్మగౌరవ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి, తరతరాలను చైతన్యపరుస్తూనే ఉంటాయని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

నీట్-యూజీ (NEET-UG) పరీక్షల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల (TGSWREIS) విద్యార్థుల ప్రతిభ_

*నీట్-యూజీ (NEET-UG) పరీక్షల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల (TGSWREIS) విద్యార్థుల ప్రతిభ*

*విద్యార్థులను అభినందించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 18:

నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల (TGSWREIS) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులతో కలిసి విద్యార్థులు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

తాండూర్ నియోజక వర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు_

*తాండూర్ నియోజక వర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు*

*వికారాబాద్ జిల్లాకు రోడ్ల అభివృద్ధికి గాను 900 కోట్ల రూపాయల నిధులు*

*ప్రజా పాలన లో భాగంగా 30 మాసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 18:

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజక వర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు, బలోపేతం చేయడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి,  కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కందనెల్లి జెపిఆర్ గార్డెన్ లో  జరిగిన సభలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.... రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాల నిమిత్తం అత్యధిక నిధులను కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా  తాండూరు నియోజకవర్గానికి 290 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రోడ్ల సౌకర్యం మెరుగ్గా ఉంటే పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన అన్నారు.   మంజూరు అయిన పనులు వెంటనే చేపడతామని ఆయన అన్నారు.    ప్రజా పాలన లో భాగంగా 30 మాసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అర్హుడైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు  సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.  500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.మహిళల ఆర్థిక అభివృద్ధికి మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే 900 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని ఆ నీ సందర్భంగా తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరిచే దిశగా యంగ్ ఇండియా పాఠశాలలను స్థాపించడం జరుగుతుందని మంత్రి అన్నారు. కోర్టు కేసు పరిష్కారం అయిన వెంటనే  94 కోట్ల వ్యయంతో  రైల్వే ఓవర్ వే బ్రిడ్జి పనులను 18 వారాల్లో చేపడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. 261 కోట్ల వ్యయంతో  ప్రధాన రహదారులను నిర్మించేందుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.  రవాణా వ్యవస్థ మెరుగుపరిస్తేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి అన్నారు.కాగ్న నదిలో మురుగునీరు కలవకుండా 30 కోట్లను మంజూరు చేసి పనులు మొదలు పెట్టడం జరిగిందని మంత్రి అన్నారు.రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయలను మాఫీని ప్రభుత్వం చేపట్టిందన్నారు.   గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలు నిర్వహించి 70 వేల మందికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించదని మందు తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తూనే ఉదయం అల్పాహారం సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని ఆయన అన్నారు.తాండూర్ మున్సిపల్ పరిధిలో 571 మంది అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు మంత్రి తెలిపారు.అంతర్గత మురుగు కాలువల సమస్యలపై ప్రణాళికలు  సిద్ధం చేస్తే అనుమతులు ఇస్తామని మంత్రి అన్నారు.శాసన మండలి చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం పేదల అభ్యున్నతి కృషి చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేయబడుతుందన్నారు.  వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు ఇచ్చారని, రోడ్ల అభివృద్ధితో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. కర్ణాటక సరిహద్దు రోడ్లకు నిధులను కేటాయించి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.స్థానిక శాసనసభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.... తాండూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అధిక నిధులను తీసుకురావడం జరుగుతుందన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం 75 కోట్ల వ్యయంతో ఏటీసీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గత సంవత్సరం 165 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. బషీరాబాద్ రోడ్ల అభివృద్ధియే కాకుండా 30 పడకల ఆసుపత్రి, జూనియర్ కళాశాలలను మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఉమాశంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఇ.వెంకటాచారి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డిఓ అనిత, ఆర్ అండ్ బి ఎస్.ఇ వసంత నాయక్, ఆర్య వైశ్య కార్పొరేషన్ సంస్థ చైర్ పర్సన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కందనెల్లి సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు మరియు విద్యావ్యవస్థలో పారదర్శకత కోసం జరుగుతున్న పోరాటానికి మానవ హక్కుల వేదిక (HRF) మద్దతు_

*సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు మరియు విద్యావ్యవస్థలో పారదర్శకత కోసం జరుగుతున్న పోరాటానికి మానవ హక్కుల వేదిక  (HRF) మద్దతు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15:

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28, 2026 నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న పట్ల హ్యూమన్ రైట్స్ ఫోరమ్ (HRF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
NEET-UG 2026 పరీక్షా విధానంలో జరిగిన అక్రమాలపై విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా, గత 17 రోజులుగా శ్రీ వాంగ్‌చుక్ దీక్ష చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాగత వైఫల్యాల వల్ల తమ భవిష్యత్తును కోల్పోతున్న విద్యార్థులకు న్యాయం జరగాలని, అలాగే ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలని కోరుతున్న నిరసనకారులకు HRF సంపూర్ణ మద్దతు తెలుపుతోంది.
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల విశ్వసనీయత పదేపదే దెబ్బతినడం, మన విద్యాపాలనలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. ఇది దేశంలోని యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. శాంతియుత నిరసనకారుల ఆరోగ్యం క్లిష్ట పరిస్థితికి చేరుకునే వరకు వేచి చూడకుండా, వారితో వెంటనే చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిరసనకారుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని, బాధితులైన కుటుంబాలకు న్యాయం చేయాలని మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము.
నిరసన తెలపడం మరియు అసమ్మతిని వ్యక్తం చేయడం మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, అలాగే తప్పు జరిగినప్పుడు సర్దుకోవడం ప్రభుత్వం బాధ్యత.

S. జీవన్ కుమార్,
మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు
తిరుపతయ్య,
మానవ హక్కుల వేదిక - తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
M. సురేష్ బాబు,
మానవ హక్కుల వేదిక - హైదరాబాద్ యూనిట్ అధ్యక్షులు

Friday, July 17, 2026

సినియర్ సిటిజన్లకు బ్రతికే అర్హత లేదా? - మాదిరెడ్డి రవిందర్ రెడ్డి(హార్ట్ పెషేంట్ )శంభునిపల్లి గ్రామం, జమ్మికుంట_

*హైకోర్ట్ ఉత్తర్వులను గౌరవించని కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ*

*సినియర్ సిటిజన్లకు బ్రతికే అర్హత లేదా? - మాదిరెడ్డి రవిందర్ రెడ్డి(హార్ట్ పెషేంట్ )శంభునిపల్లి గ్రామం, జమ్మికుంట*

*మేము బ్రతికి ఉండగానే మా పేరిట ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయమని  కుతుర్లు అల్లుళ్లు కొడుతున్నారు - సహాకరిస్తున్న స్థానిక జమ్మికుంట సి.ఐ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15

వ్యవసాయ భూములను తమపేరిట పట్టాచేయలని కూతుర్లు అల్లుళ్లు, గత 9 నెలల నుండి ఇంట్లో అక్రమంగా ఉంటు కొడుతూ చంపాలని చూస్తున్నారు అని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామం కు చెందిన మాదిరెడ్డి రవిందర్ రెడ్డి తండ్రి: తిరుపతిరెడ్డి వయస్సు 70 సంవత్సరాలు మరియు మాదిరెడ్డి సుబాషిణి భర్త: రవిందర్ రెడ్డి వయుస్సు 67  సంవత్సరాలు.మాకు ముగ్గురు కూతుళ్ళు 1) పెద్దిరెడ్డి రమాదేవి 2) గుడిపాట మౌనిక 3) చిట్టెటి స్వాతి అందరికి వివాహాలు జరిగిన్నాయి. మొదటి కూతురు హైదరాబాద్ లో , రెండవ కూతురు హన్మకొండలో నివాసముంటున్నారు. మాకు ఉండటానికి ఇల్లు లేనందున మా చిన్న కూతురు శంభునిపల్లి గ్రామం లో 
కట్టుకున్న సొంత ఇంట్లో నివాసం ఉంటున్నాము.మా వృత్తి వ్యవసాయం.మాకు ఆరోగ్యం బాగాలేనందున మా వ్యవసాయ భూములు వేరేవాళ్లకి కౌలుకు ఇచ్చి వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాము. మా అన్న అయిన మాదిరెడ్డి రాజిరెడ్డి 70 సంవత్సరాల క్రితం సొంత అమ్మమ్మ అయిన వంగల మాణిక్యమ్మ గారికి దత్తత వెళ్లాడు.మా తండ్రి గారు అయిన తిరుపతి రెడ్డి 2020 సంవత్సరంలొ చనిపోగానే ఆస్తి కోసం మాకు వున్నటువంటి భూములపై మా అన్న కేసులు వేయగా  అట్టి కేసు పెండింగ్లో లో ఉంది.కేసు పెండింగ్ లో ఉండగా పై చెప్పిన మా కూతుళ్లు పెద్దిరెడ్డి రమాదేవి,గుడిపాటి మౌనిక మరియు వారి భర్తలు మా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి మమ్మల్ని కొడుతు తిడుతూ భయబ్రాంతులకు గురిచేసి ఇంట్లో నుండి గెంటివేశారు .మాకు తినడానికి తిండిలేక, ఉండటానికి గూడులేక కట్టుకోవడానికి బట్టలు లేకుండా, వైద్యానికి డబ్బులు లేక రోడ్ల మిద జీవనం వెళ్లతీస్తున్నాము.మా ఇంట్లోకి మేము వెళ్దాం అని ప్రయత్నించగా మాపై దాడి చేశారు.ప్రతి సంవత్సరం మాకు కౌలు ద్వారా వచ్చే ఆదాయము రాకుండా అడ్డుపడి స్థానిక సి.ఐ రామక్రిష్ణ  కౌలుకు చేసే వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించగా అతను కౌలుకు చేయలేదు. మేము సొంతంగా అయిన చేసుకుందాం అని భూమి మిదకు వెళ్లగా నా రెండవ కూతురు అయిన మౌనిక పైపు లైను, మోటరు, స్టాటరు, వైర్లు అన్ని పగలకొట్టి తీసుకెళ్లడం జరిగింది. ఇట్టి విషయం అయి ఆమెను అడగగా నా పై నా భార్యపై దాడికి దిగారు. ఇట్టి విషయమై స్థానిక పోలిసుస్టేషన్లో  అధికారులకు దరఖాస్తు ఇవ్వగా ఎలాంటి చర్యలు తీసుకొలేదు.గత ఎనమిది నెలలుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లినా దరఖాస్తు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు.మేము ఇట్టి విషయమై రెవెన్యూ అధికారులకు వయెవృద్దుల చట్టం కింద ఆశ్రయించగా వారు మా కూతుళ్లని నెల నెల పోషణ నిమ్మిత్తం డబ్బులు ఇవ్వమని మరియు ఇంట్లోనే ఉండమని భూములు రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించకూడదని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా స్థానిక పోలిసులను ఆశ్రయించగా ఎలాంటి ఫలితం లేదు.అట్టి అర్డరు తీసుకొని మా ఇంటి వెళ్లగా మరల ఇద్దరు కుతుర్లు అల్లుళ్లు కలిసి దాడికి ప్రయత్నం చేసారు. చివరంగా గౌరవ హై కోర్టును ఆశ్రయించంగా డబ్ల్యూ పి నెం. 20003/ 2026 మాకు భద్రత కల్పించమని స్థానిక సి.ఐ కి గౌరవ హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఆ తరువాత మేము తేది 1/07/2026 నాడు స్థానిక సి.ఐ ని సంప్రదించగా మాకు భద్రత కల్పించకుండ ఎలాంటి విచారణ లేకుండా మా దరఖాస్తు మూసి వేయడం జరిగింది.ఇట్టి విషయాన్ని సిరియస్ గా తీసుకున్న న్యాయ స్థానం 09.07.2026 నాడు తిరిగి మాకు మా కూతుర్లు అల్లుళ్ల నుండి భద్రత కల్పించమని సీఐ కి ఆదేశించడం అయినది.ఈరోజు అనగా 15/07/2026 హై కోర్ట్ ఉత్తర్వులను తీసుకెళ్లి సీఐ కూ చూపించాగా అతను ఆ ఆర్డర్ కాపీ ని చూసి మా మొఖం పైన విసిరేసి బయటకు వెళ్ళండి అని గద్దరించాడు. మేము ఇచ్చిన ఆర్డర్ కాపీ ని చూసిన తరువాత రసీదు ఇవ్వమని అడుగగా ఇది పోస్ట్ ఆఫీస్ కాదు పోలీస్ స్టేషన్ అని గద్దరించాడు.గతంలో స్థానిక సి.ఐ సినియర్ సిటిజన్ లు అయిన మమ్నల్ని పొలిసు స్టేషన్ కు పిలిచి మా భూములను మా కుతుర్లకు రిజిస్ట్రేషన్ చేయమని లేకపోతే మీ మిద తప్పుడు కేసులు పెడతామని బెదిరించినాడు.ఇట్టి భూముల పై కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా మా ఇద్దరు కుతుర్లుని ప్రోత్సహించి మా తల్లిగారు అయిన మాదిరెడ్డి ఈశ్వరమ్మ భర్త: లేట్ తిరుపతి రెడ్డి వయస్సు: 85 సంవత్సరాలు తో తప్పుడు కేసు పెట్టించినాడు. మాకు అనుమతిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ని, హాంమంత్రి ని , డైరెక్టర్ జనరల్ ఆప్ పోలిసు ను కలిసి వస్తావాలతో మా గోడు విన్నవించుకుంటామని మా మనవి. మా పై గతంలో హత్యా ప్రయత్నం చేయగా మా కుతుర్లు అల్లుళ్ల పై స్థానిక పొలిసు స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ 180/2026 కేసు నమోదు చేసారు. పోలీసు వారు ముందుగానే స్పందించి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చిఉండేది కాదు. మేము బ్రతికి ఉండగానే మా పేరిట ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయమని కొడుతున్న మరియు చంపే ప్రయత్నం చేస్తున్న మా కుతుర్లు అల్లుళ్లకు సహాకరిస్తున్న స్థానిక జమ్మికుంట సి.ఐ పై చట్టరిత్యా చర్యతీసుకోగలరు అలాగే మాకు మా కూతుర్లు మరియు అల్లుళ్ళ తో మరియు స్థానిక సీఐ తో ప్రాణభయం ఉంది. కేవలం మొదట్లో సీఐ చెప్పినట్లుగా మా కూతుర్ల పేరు మీద భూములను రిజిస్ట్రేషన్ చేయనందుకు మా ఈ దుస్థితి వచ్చింది. కావున మాకు న్యాయం చేయగలరని మనవి.

Wednesday, July 15, 2026

_న్యాయస్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేసిన కేసులలో తప్పించుకు తిరుగుతున్న నిందితులపై 'నాన్ బెయిలబుల్ వారెంట్ ' జారీ..._

*_ఇక రండి.. విచారణ ఎదుర్కోండి_*
_# 'అనంచిన్ని' చేతిలో జాబితా_

*_న్యాయస్థానంలో  చార్జ్ షీట్ దాఖలు చేసిన కేసులలో తప్పించుకు తిరుగుతున్న నిందితులపై 'నాన్ బెయిలబుల్ వారెంట్ ' జారీ చేసే విధంగా డిజీపి కార్యాలయం కసరత్తులు. ఇందులో అంతరాష్ట్ర నిందితులు, సాప్ట్ వేర్, ఆర్థిక, జర్నలిజం ముసుగులో ఉన్నవారు, సోషల్ మీడియాలో రెచ్చిపోయే మహిళలు ఉండటం గమనార్హం._*

*_25/07/2026న ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ Crime No: 191/2020_*
CC NO: CC/2403/2021
CNR No: TSKH030090112021

II Additional Junior Civil Judge -cum- II Additional Judicial Magistrate of First Class, Khammam నందు కేసు కలదు సార్.

ఈ కేసులో పట్నాయక్, సంకసర్ల సువర్ణ, ఎస్.కే.గౌస్ పాషా, బిరుదులు దేవరాజులకు సమ్మన్స్ ఇవ్వగలరు సార్..
(పట్నాయక్ ఫోన్ నెంబర్: PATNAYAK NEW NUMBER 
+91 l7997465678, 9000975405), సంకసర్ల సువర్ణ (ఫోన్ నెంబర్: 9959703779 ), ఎస్.కే.గౌస్ పాషా (ఫోన్ నెంబర్:  7731000786 ), బిరుదులు దేవరాజు (ఫోన్ నెంబర్: 8099662345)
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻

*_20/08/2026న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించి Crime No: 166/2020_*
CC No: CC/2377/2021
CNR No: TSKH030089052021

I Additional Junior Civil Judge -cum- Special Judicial Magistrate of First Class (Juvenile Court), Khammam

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*_27/07/2026న ఖమ్మం ఖానాపూరం పోలీస్ స్టేషన్ లో_* 
Crime No: 167/2020
CC NO: CC/2372/2021
CNR No: TSKH030089362021
*_Next Date: 18/06/2026న_* 
II Additional Junior Civil Judge -cum- II Additional Judicial Magistrate of First Class, Khammam నందు 
కేసు కలదు సార్.

ఈ కేసులో పట్నాయక్, సంకసర్ల సువర్ణ, ఎస్.కే.గౌస్ పాషా, బిరుదులు దేవరాజులకు సమ్మన్స్ ఇవ్వగలరు సార్..

🤝🤝🤝🤝🤝🤝🤝

*_ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్_* 
Crime No: 212/2020
CC NO: CC/3164/2021
CNR No: TSKH030171672021
*_Next Date: 29/09/2026న_* పట్నాయక్ కు సమ్మన్స్ ఇవ్వగలరు సార్.. ఈ కేసులో పట్నాయక్ ఒక్కడే నిందితుడు సార్...👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
సంకసర్ల సువర్ణకు నోటీసులు ఇవ్వాలంటే... 

03/09/2026
XIV Addl. Chief Metropolitan Magistrate

CC NO: CC/678/2023
CNR NO: TSHM010007532023
FIR NO: 693/2022

నకిలీ పత్రికా ప్రకటన హెచ్చరిక - హైడ్రా,_

*నకిలీ పత్రికా ప్రకటన హెచ్చరిక - హైడ్రా*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 14:

హుస్సేన్ సాగర్ సమీపంలోని ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ గురించి ఒక నకిలీ ఆంగ్ల పత్రికా ప్రకటన ప్రచారం చేయబడుతోంది.హైడ్రా (HYDRAA) అటువంటి పత్రికా ప్రకటనను ఏదీ విడుదల చేయలేదు లేదా జారీ చేయలేదు. ప్రచారం చేయబడుతున్న ఈ పత్రం ప్రామాణికమైనది కాదు. పౌరులు మరియు మీడియా ఈ నకిలీ పత్రాన్ని నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని కోరడమైనది.
ధృవీకరించబడిన సమాచారం కోసం దయచేసి హైడ్రా (HYDRAA) యొక్క అధికారిక సమాచార మార్గాలపై మాత్రమే ఆధారపడండి.

గ్రామీణ ప్రాంతాల్లో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల విప్లవం... ఇప్పుడు పట్టణ పేదల జీవితాల్లోకి_

*ఈ నెల 20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్లకు శ్రీకారం - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

*దశలవారీగా లక్ష ఇండ్ల నిర్మాణం*

*పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి వెయ్యి ఇండ్ల  వరకు నిర్మాణం*

*గ్రామీణ ప్రాంతాల్లో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల విప్లవం... ఇప్పుడు పట్టణ పేదల జీవితాల్లోకి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 14:

గ్రామీణ ప్రాంతాలల్లో ఇందిరమ్మ ఇండ్లతో పెద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం ఇప్పుడు అదే సంకల్పంతో క్యూర్ ప్రాధిలోని పేదల సొంతింటి స్వప్నాన్ని నిజం చేసేందుకు మరో చారిత్రాత్మక అడుగు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో దశల వారీగా లక్ష ఎల్.ఐ.జి. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నామని, ఇందుకు సంబంధించి ఇప్పటికే పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు.మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయం క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇండ్ల పై హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల పథకానికి శ్రీకారం చూడుతున్నామని  ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి పథకానికి సంబంధించిన విదివిధానాలను, దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు, టెండర్ల ప్రక్రియ, అమలు విధానం తదితర పూర్తి మార్గదర్శకాలను ప్రకటిస్తామని వివరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గానికి కనీసం 500 చొప్పున ఆయా స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైన చోట వెయ్యి వరకు నిర్మిస్తామని తెలిపారు.గత ప్రభుత్వం ఎలాంటి ముందుచూపు లేకుండా, హైదరాబాద్ నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అరకొరగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించడంవల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతామనే ఆందోళనతో చాలామంది అక్కడ నివసించలేకపోయారని అన్నారు.తమ ప్రభుత్వం మాత్రం పేదల జీవన వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే, వారి ఉపాధి, పిల్లల విద్య, వైద్య సౌకర్యాలు, రవాణా వంటి అంశాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలల్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మిస్తున్నామని, ఆ స్థలములో వారికి వాటా ఇస్తూ యాజమాన్య హక్కు కల్పిస్తూ వారి కుటుంబాలకు శాశ్వత ఆర్థిక భద్రతను కల్పిస్తున్నామన్నారు.క్యూర్ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాలల్లో స్థలాలను గుర్తించడం జరిగిందని, ఈ స్థలాలను ఇప్పటికే హౌసింగ్ విభాగం పొజిషన్ లోకి తీసుకుందని, ఎక్కడ ఎన్ని ఇండ్లు, ఎన్ని అంతస్తులు నిర్మించాలి, ఒక్కో ప్లాట్ విస్తీర్ణం, బిల్డింగ్ డిజైన్ లను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి  రెండు, మూడు రోజులల్లో తుది రూపును ఇస్తామని వెల్లడించారు.

హైదరాబాద్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది_

*హైదరాబాద్ లో "బ్రిక్స్" ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కార్యక్రమం*

*తెలంగాణ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు, 2026 ఆగస్టు 4-5 తేదీలలో హైదరాబాద్‌లో జరగనున్న 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షచేశారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 14:

హైదరాబాద్‌లో ఆగస్టు 4 మరియు 5 తేదీల్లో జరగనున్న రెండవ బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గ సమావేశం (BRICS Anti-Corruption Working Group Meeting) ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ రోజు సమీక్షచేశారు.సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశం, ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంపై దృష్టి సారించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు భారత ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ రెండవ బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గ సమావేశంలో 11 బ్రిక్స్ సభ్య దేశాల నుండి సుమారు 40 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. వీటితో పాటు, భారత ప్రభుత్వానికి చెందిన దాదాపు 40 మంది ఉన్నతాధికారులు కూడా చర్చల్లో పాల్గొంటారు.సమావేశం సందర్భంగా, భారత ప్రభుత్వంలోని సిబ్బంది మరియు శిక్షణ శాఖ (DoPT) జాయింట్ సెక్రటరీ శ్రీ సుశీల్ కుమార్ పటేల్ ఈ కార్యక్రమంపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి అవసరమైన సహకారం గురించి వివరించారు. సమావేశం సజావుగా సాగేందుకు భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, ఆరోగ్యం మరియు అత్యవసర వైద్య సేవలు, రవాణా, ప్రోటోకాల్, వసతి, వేదిక నిర్వహణ మరియు ఇతర నిర్వహణపరమైన అవసరాల విషయంలో ఆయన సహకారాన్ని కోరారు.ఏర్పాట్లను సమీక్షిస్తూ, ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసి, ముందుగానే సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్టమైన భద్రత, సమర్థవంతమైన రవాణా మరియు ట్రాఫిక్ నిర్వహణ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన పారిశుధ్యం మరియు పరిశుభ్రత, తగిన వైద్య సదుపాయాలు, అంతరాయం లేని పౌర సేవలు మరియు సంబంధిత ఏజెన్సీల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.ప్రధాన అంతర్జాతీయ సమావేశాలు మరియు సదస్సులను విజయవంతంగా నిర్వహించడంలో హైదరాబాద్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని, బ్రిక్స్ సమావేశం సమయంలో ఆ ప్రతిష్టను నిలబెట్టేలా కృషి చేయాలని ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు. భారత ప్రభుత్వంతో సన్నిహిత సమన్వయం పాటిస్తూ, నిర్ణీత గడువులోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చిన సంజయ్ జాజు, ఈ కార్యక్రమ నిర్వహణలో భారత ప్రభుత్వానికి తెలంగాణ పూర్తి సహకారం అందిస్తుందని, ప్రతినిధుల సౌకర్యం, భద్రత మరియు అనుకూలత కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి వైఏటీ&సీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, జీఏడీ (పోల్) ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, ప్రణాళికా కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఏడీజీపీ (లా&ఓ) మహేష్ భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, డైరెక్టర్ ప్రోటోకాల్ శివ లింగయ్య, ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి మరియు ఇతర అధికారులు హాజరయ్యారు.

జర్నలిస్టు గుండెల్లో జ్యోతి వెలిగించిన నాయకుడు...ఒక పేరు... ఒక నినాదం...డాక్టర్ కేకేయార్... డాక్టర్ కేకేయార్...!

*ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కేకేఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై ప్రజామిత్ర ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ విశ్వశ్వర్ రావు రాసిన పాట డివిడి ఆవిష్కరిస్తున్న డాక్టర్ కేకేఆర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 13:

మీడియా టుడే తెలుగు జాతీయ దినపత్రిక మరియు ఇంగ్లీష్ డైలీ న్యూస్ పత్రిక,మీడియా టుడే టీవీ, N24 న్యూస్ సంస్థల చైర్మన్ మరియు మేనజింగ్ డైరెక్టర్, AWJA అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే. కోటేశ్వరరావు (kkr)గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసి తాను స్వయంగా రాసిన పాట ను డీవిడీ లో అనువదించి kkr గారి చేతుల మీదుగా ఆవిషరించడం జరిగింది.ఈ సందర్బంగా విశ్వశ్వర్ రావు తాను రాసిన పాట గురించి అక్షర రూపంలో తెలియచేశారు.
*(పల్లవి:)*
ఎవరు ఆ యోధుడు... ఎవరు ఆ వీరుడు...
చీకటి జీవోలపై యుద్ధం చేసిన ధీరుడు...
జర్నలిస్టు గుండెల్లో జ్యోతి వెలిగించిన నాయకుడు...
ఒక పేరు... ఒక నినాదం...
డాక్టర్ కేకేయార్... డాక్టర్ కేకేయార్...!
*(చరణం – 1)*
ఏపీలో చీకటి జీవో రద్దు కోసం పోరాడిన సింహమే...
తెలంగాణ గర్జనగా నిలిచి ధ్వజమెత్తిన వీరుడే...
జంతర్ మంతర్ వీధుల్లో సమరభేరి మోగించినా...
పత్రికా స్వేచ్ఛ కోసం ఢిల్లీని కదిలించినా...
న్యాయం కోసం అడుగేస్తే వెనుకడుగు తెలియదయ్యా...
అన్యాయం కనిపిస్తే నిప్పులై రగిలేదయ్యా...
జర్నలిస్టు హక్కుల కోసం జాతీయ గళమయ్యా...
డాక్టర్ కేకేయార్... మా ఉద్యమ... పతాకమయ్యా...
*(పల్లవి)*
ఎవరు ఆ యోధుడు... ఎవరు ఆ వీరుడు...
చీకటి జీవోలపై యుద్ధం చేసిన ధీరుడు...
జర్నలిస్టు గుండెల్లో జ్యోతి వెలిగించిన నాయకుడు...
డాక్టర్ కేకేయార్... డాక్టర్ కేకేయార్...!
*(చరణం – 2)*
కరోనా కాలమొచ్చినప్పుడు కన్నీళ్లు తుడిచినవాడు...
నిర్లక్ష్య ప్రభుత్వాలను ప్రజాక్షేత్రంలో నిలిపినవాడు...
మనోజ్ మరణం వెనుక నిజం ప్రపంచానికి చెప్పినవాడు...
జర్నలిస్టు బాధలన్నీ దేశానికి వినిపించినవాడు...
పీటీఐ కార్మికులకు న్యాయం సాధించిన పోరాటం...
వందల కుటుంబాలకు మళ్లీ వెలిగించిన దీపం...
అలుపెరుగని పట్టుదలతో విజయగాథ రాసినవాడు...
కేకేయార్ అంటే ఉద్యమమే అని చాటినవాడు...

*(చరణం – 3)*
పేద విద్యార్థుల కలలకు విద్యాదీపం వెలిగించి...
హరితహారం స్వచ్ఛభారత్ సేవా మార్గం చూపించి...
స్త్రీజ్యోతి ఫౌండేషన్‌తో సమాజానికి తోడై...
సేవలోనే సంతోషమని జీవితాన్ని అంకితమై...
అవినీతి గుట్టురట్టు చేస్తూ కలాన్ని ఖడ్గం చేశాడు...
ప్రజల పక్షాన నిలబడి నిజం జెండా ఎగరేశాడు...
*(బ్రిడ్జ్)*
వృత్తులు ఎన్నో ఉండొచ్చు...
అందరూ జర్నలిస్టులు కాలేరు...
జర్నలిస్టులు ఎందరో ఉండొచ్చు...
అందరూ ఉద్యమనేతలు కాలేరు...
ఉద్యమనేతలు ఎందరో ఉండొచ్చు...
అందరూ కేకేయార్ కాలేరు...
అందరూ కేకేయార్ కాలేరు...
*(ఫైనల్ పల్లవి)*
జర్నలిస్టుల గుండె చప్పుడు...
ప్రజల హక్కుల యుద్ధనాదం...
నిజం కోసం నిరంతర పోరాటం...
అదే మా కేకేయార్ మార్గం...
జై జై కేకేయార్...
జర్నలిస్టుల సింహగర్జన...
జై జై కేకేయార్...
ప్రజాహితం కోసం ఉద్యమ జ్యోతి...
జై జై కేకేయార్...
జై జై కేకేయార్...!

SIR ఓటర్ ఎన్యూమరేషన్ ఫారం ప్రక్రియ పూర్తి చేసి BLO కు అందచేసిన మీడియా టుడే జర్నలిస్ట్ బాపట్ల కృష్ణమోహన్_

*SIR ఓటర్ ఎన్యూమరేషన్ ఫారం ప్రక్రియ పూర్తి చేసి BLO కు అందచేసిన మీడియా టుడే జర్నలిస్ట్ బాపట్ల కృష్ణమోహన్*

*అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడమే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR–2026) కార్యక్రమం ప్రధాన ఉద్దేశం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 13:

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ గాంధీ నగర్ కమ్యూనిటీ హలో లో తన ఓటర్ SIR ఎన్యూమరేషన్ ఫారం ప్రక్రియ పూర్తి చేసి BLO బందెల ప్రేమలత కు అందచేసిన సామజిక కార్యకర్త, ప్రజాసంకల్పం ఫౌండర్, మానవహక్కుల బాద్యులు, అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సోషల్ మీడియా కన్వినర్ (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ), మీడియా టుడే జర్నలిస్ట్ బాపట్ల కృష్ణమోహన్. ఈ సందర్బంగా  కృష్ణమోహన్ మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు (BLOలు)M. శ్రీనివాస్ రెడ్డి, BLO సూపర్‌వైజర్ రవికుమార్ తో మాట్లాడి కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, ఆన్‌లైన్ డిజిటైజేషన్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తి పారదర్శకతతో, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు.ప్రతి అర్హ ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఫారాలను పూర్తిగా నింపించి నిర్దేశిత గడువులోగా తిరిగి స్వీకరించేలా విస్తృత ప్రజా అవగాహన కల్పించాలని సూచించారు.బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, అందిన ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులో డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR–2026) కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో నింపి నిర్దేశిత గడువులోగా సంబంధిత బూత్ స్థాయి అధికారులకు (BLOలు) తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు.అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడమే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR–2026) కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.

అమ్మాయి వాంగ్మూలం వింటుంటే వళ్ళు జలదరించింది_

*30-32 మంది మానవ మృగాలు 13సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారం.*

*అమ్మాయి వాంగ్మూలం వింటుంటే వళ్ళు జలదరించింది*

*2012 లో జరిగిన నిర్భయ ఘటన ఇంకా కళ్ళ ముందే ఉంది, ఇది మరో నిర్భయ కేసు*

*అనూరాధ రావు అధ్యక్షురాలు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 13:

రాజస్థాన్లోని శ్రీనగర్ జిల్లాలో 
జూన్ 18, 2026 న ఇంటికి వెళ్లాలని ఆటో ఎక్కిన 13 సంవత్సరాల బాలిక, , హోటల్ జాయ్ ఇన్ ఈ బాలికను డ్రైవర్ నేను తీసుకెళ్లి, హోటల్ యజమాని మయాంక్ సైన్కు 50 వేలకు అమ్మేశాడు.అక్కడ నుంచి వివిధ హోటళ్లలో 30-32 మంది మానవ మృగాలు ఆ అమ్మాయిపై అత్యాచారం. చేశారు ఐదు రోజులు. ఆ పాపను చేతులు కట్టి, మద్యం తాగించి నరకం చూపించారు. బాలిక అరుపులు,బాధ, దుఃఖం ఎవరికి వినపడలేదు, కరగలేదు. పైశాచికత్వం ప్రదర్శించారు.జూన్ 22న పోలిసులు హోటల్ రైడ్ చేసినపుడు ఈ పాపను అపస్మారక స్థితిలో రక్షించి, హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం, కొన్సిలింగ్ చేస్తున్నారు.ఆ పాపకు జరిగిన గాయం మాయని గాయం. 2012 లో జరిగిన నిర్భయ ఘటన ఇంకా కళ్ళ ముందే ఉంది, ఇది మరో నిర్భయ కేసు.  P0CSO కేసు నమోక్ష అయ్యింది, కొంతమంది మృగాలను పట్టుకున్నారు,ఆ అమ్మాయి వాంగ్మూలం వింటుంటే వళ్ళు జలదరించింది.
అయితే ఇది ఒక్క కేసు కాదు ఆ లేక్కలు చూసే భయం వేస్తుంది.NCRB నివేదిక ప్రకారం భారత దేశంలో ప్రతి సం|| 1లక్ష పైగా P0CSO కేసులు నమోదు అవుతున్నాయి. రోజుకు సగటున 100 - - 120 మంది బాలికలపై లైంగిక దాడులు ఆవుతున్నాయి.రాజస్థాన్ పిల్లల పై జరిగే లైఃగిక దాడుల్లో మొదటి  రాష్ట్రాల్లో ఉంది.
రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర,  మధ్యప్రదేశ్, ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ సంఘటనలు జరుగుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సామూహిక అత్యాచారాలు మరియ ట్రాఫికింగ్ క్రైం గురించి నివేదికల ప్రకారం, ఎక్కువగా ఈ సమస్య ఉన్న దేశాలు - భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా, బ్రెసిల్, మెక్సికో, యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉంది.  కొన్ని దేశాల్లో ఈ క్రైం రేట్ అతి తక్కువగా ఉంది కారణం ఆ దేశాలు పిల్లల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు -కఠిన నిబంధనల,బలమైన చట్టలు, కఠిన శిక్షలు, నిరంతరం పోలీసింగ్, త్వరితగతిన న్యాయం దొరకడం, నిరంతరం సి సి టివీల పర్యవేక్షణ, చిన్న తరగతుల్లో సెక్సు ఎడ్యుకేషన్ ఇవ్వడం, సమాజం మంచి అవగాహనతో ఉండడం.ఆ దేశాలు- ఐస్లాండ్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, జపాన్, సింగపూర్, స్విట్జర్లాడ్జ్,ఉత్తర యూరప్ దేశాలు.ఈ దేశాల్లో జీరో క్రైం అని చెప్పుకోవచ్చు.సమస్యలు పునరావృతం కాకుండా,ఈ క్రైమ్స్ అధికం కావడానికి కారణాలు ఆలోచిద్దాం,ఇంత కౄరంగా ఎందుకు ప్రవర్తిస్తారు అని చూస్తే ,కారణం - *1.మానసిక రుగ్మతలు*. దాంట్లో రకరకాలు ఉన్నాయి. 
*పెడోఫిలియా*-అంటే చిన్నపిల్లలతో లైంగిక సంపర్కం చేయాలి అని ఆలోచిస్తారు, ఇది ఒక మానసిక వ్యాధి.
ఎంపతీలోపం - అంటే ఎదుటి వ్యక్తి లేదా ఇతరులు బాధలో ఉన్నప్పుడు లేదా సమస్యలను చెప్పుకుంటున్నప్పుడు ఎలాంటి భావోద్వేగ స్పందన చూపకపోవడం,నాకేం సంబంధం అనే భావన ఉన్న వ్యక్తులు.
*పవర్ ఫిలింగ్*  - ఇది ఒక మానసిక వ్యాధి. బలహీనులైన బాలికలపై, మహిళల పై హింస చేసి తాను బలవంతుడి అని అనుకోవడ.
*2.సామాజిక  కారణాలు* - బాలికలను / మహిళలను వస్తువులుగా చూడడం, కేవలం వారు శారీరక సుఖాన్ని ఇచ్చే వస్తువులుగా చూడడం.పోర్నోగ్రఫీ, హార్డ్ కోర్ కంటేంట్ ఎక్కువగా చూస్తారు, ఆ విధంగా నిజ జీవితంలో ప్రవర్తించాలి అని దాడులకు పాల్పడ్డారు.
*3. అసాంఘిక కార్యకలాపాలకు బానిసలు* - డ్రగ్స్కు  బానిసలు, మద్యానికి బానిసలు,మత్తు పదార్థాలకు బానిసలుగా మారి, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారు.
*4.సిస్టం ఫెయిల్యూర్* -  శిక్షల గురించి భయం లేక పోవడం, న్యాయం ఆలస్యం, చాలా లొసుగులు ఉండడం,పోలిసింగ్ బలహీనత, హోటల్స్ పై ట్రాన్స్ పోర్ట్ పై నియంత్రణ, నిఘా లేకపోవడం.
*5.నా కెందుకు అని మౌనం వహించే సమాజం*.
*6.రక్షణ వ్యవస్థ బలహీనం, బాలల రక్షణ వ్యవస్థ పూర్తిగా బలహీనం.*

ప్రస్తుతం మనం పరిష్కార మార్గాలు చూడాల్సిన సమయం: ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, కఠిన శిక్షలు / మరణశిక్ష /జీవిత ఖైదు లాంటివి త్వరగా అమలు చేయాలి దానికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎక్కువగా ఏర్పాటు చేయాలి.సమాజం మౌనం వీడాలి,గానం విప్పాలి, బాధితులకు అండగా ఉండాలి.  చిన్న తరగతుల్లోనే / పాఠశాల స్థాయి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పిల్లల్లో కాన్సిడెన్స్ పెంపొందించాలి. పాఠశాలల్లో ఆత్మరక్షణ కోసం కొన్ని మెళకువలు నెర్పించాలి కరాటే లాంటివి.
రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. నిరంతరం CCTV పర్యవేక్షణ ఉండాలి, ట్రాన్స్ పోర్టు కోసం ఉపయోగించే ఆటోలు, బస్సులు, కార్ల పై నిరంతరం నిఘా ఉండాలి.చిన్నారుల కోసం మన గళం విప్పాలి.ఈ పాపకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేయాలి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ ఆలోచనలు చెప్పండి ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల కంట్రోల్ చేయవచ్చు.

నల్లగొండ జిల్లాలో రెచ్చిపోతున్న భూ మాఫియా_

*నల్లగొండ జిల్లాలో రెచ్చిపోతున్న భూ మాఫియా*

*శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామంలో పడగ విప్పిన భూ మాఫియా*

*ప్రభుత్వ భూములు,చెరువు శిఖం భూములపై అక్రమాల ఆరోపణలు... ప్రశ్నించిన సామాజిక ఉద్యమకారుడిపై దాడి!*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 13:

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామంలోని ఎల్మరాజు కుంట అలుగుల ప్రాంతంలో ప్రభుత్వ భూమి, చెరువు శిఖం భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించి, అనంతరం అక్రమ పట్టాలు పొందినట్లు గ్రామస్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇట్టి విషయంపై గతంలో ఇప్పుడు దాడికి పాల్పడిన వ్యక్తులపై కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.మరియు కలెక్టర్ గారు ఇట్టి విషయం పై విచారణకు ఆదేశించడం కూడా జరిగింది.
*ఎల్ ఆర్ నెంబర్ (Lr.no.F1/3431/2025.తేది:-17/07/2025)*. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా రెచ్చిపోయి న భూ ఆక్రమణదారులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయి రెవెన్యూ విచారణ నిర్వహించి, నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదే ప్రాంతంలో ఊటుకూరు నుండి కొండారం వైపు వెళ్లే ప్రజా బాటతో పాటు రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిని కూడా అడ్డుకుంటూ, ప్రభుత్వ భూమిలోని మట్టిని రైతులు తీసుకెళ్తున్న సమయంలో పనులను నిలిపివేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని వ్యక్తిగత ఆస్తిగా చూపించి ప్రజల రాకపోకలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.ఈ సందర్భంగా రైతులందరికీ ఉపయోగపడే ప్రజా బాటను మూసివేయడం సరికాదని, సమస్యను చట్టబద్ధంగా పరిష్కరించాలని *సామాజిక ఉద్యమకారుడు వేముల శ్రీను సూచించగా, ఆయనపై దాడి జరిగి తీవ్రంగా గాయపడ్డారని ఆరోపణలు* ఉన్నాయి.ప్రభుత్వ భూములను కాపాడాలని అడిగితే దాడులా? ప్రజల హక్కుల కోసం మాట్లాడితే హత్యాయత్నమా? ఇదేనా ప్రజాస్వామ్యం?.ఈ ఘటనపై గ్రామ ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే పేరును వాడుకుంటూ ప్రజల్లో ఎమ్మెల్యేను బధనాం చేస్తూ... అతని ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న, చెప్పబడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్  మరియు ఆయన సోదరుల పాత్రపై వస్తున్న ఆరోపణలను కూడా సమగ్రంగా విచారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ, ఆర్థిక లేదా ఇతర ప్రభావాలకు అతీతంగా నిజానిజాలను వెలికితీసి, ఎవరి ప్రమేయం ఉన్నా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గ్రామాలలో ఇలాంటి భౌతిక దాడులను ప్రోత్సహిస్తున్న  భూ కబ్జాకోరులు, మాఫియా అక్రమ దారుల ను ఉపేక్షించవద్దు. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు ప్రజల ఆస్తి. వాటిని ఆక్రమించే హక్కు ఎవరికీ లేదు. ప్రజా బాటలను మూసివేసే హక్కు ఎవరికీ లేదు. ప్రశ్నించే గొంతులను అణచివేసే హక్కు ఎవరికీ లేదు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా విచారణ జరిపి, ప్రభుత్వ భూముల రికార్డులను బహిర్గతం చేయాలి. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వేముల శ్రీనుపై జరిగిన దాడి ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ నిర్వహించి, దోషులను చట్టం ముందు నిలబెట్టాలి.భూ మాఫియా ఎంతటి ప్రభావశీలులైనా చట్టం కంటే గొప్పవారు కాదు. ప్రభుత్వ భూములను కాపాడటం, ప్రజల హక్కులను రక్షించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత. న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్యవాదులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తాయి.

తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి తో Bplkm✍️

తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి ని & హైకోర్ట్ సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి బాలకిష్టి ని మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా టుడే జాతీయ తెలుగు దినపత్రిక & అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సోషల్ మీడియా (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) కన్వినర్ బాపట్ల కృష్ణమోహన్.

https://x.com/Praja_Snklpm/status/2076537960850211150?t=8n5K00aaFqwFCJ8aPxeG8w&s=08

*_మీడియా టుడే :జాతీయ తెలుగు దినపత్రిక_*
media today pages 13-7-2026 epaper.mediatodaydaily.in/index.php?date…

*_తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి ని & హైకోర్ట్ సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి బాలకిష్టి ని మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా టుడే జాతీయ తెలుగు దినపత్రిక జర్నలిస్ట్ & అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సోషల్ మీడియా (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) కన్వినర్ బాపట్ల కృష్ణమోహన్._*
*@high_assn93719 @IPRTelangana*

అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే. కోటేశ్వరరావు (kkr) సర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు_

https://x.com/i/status/2076200108593402254

*_మీడియా టుడే తెలుగు జాతీయ దినపత్రిక & ఇంగ్లీష్ డైలీ న్యూస్ పత్రిక,మీడియా టుడే టీవీ, N24 న్యూస్ సంస్థల చైర్మన్ & మేనజింగ్ డైరెక్టర్, AWJA అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే. కోటేశ్వరరావు (kkr) సర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు🌹_*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #KkrAWJA #TJSS #AWJA #TGJAC*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*#Journalist*
*Bplkm✍️*

*@PIB_India @PTI_News @PCITweets @PressCouncil_IN @PTI_News @PressClubHyd @IPRTelangana @IPR_AP @IPRAndhra*

*_COPY TO GROUP LINK MEDIA_*

Monday, July 13, 2026

తెలంగాణలో 80 వేల మంది మైనారిటీ విద్యార్థుల కోసం ఏఐ(AI) విప్లవానికి శ్రీకారం చుట్టిన మంత్రి మహ్మద్ అజహరుద్దీన్_

*తెలంగాణలో 80 వేల మంది మైనారిటీ విద్యార్థుల కోసం ఏఐ(AI) విప్లవానికి శ్రీకారం చుట్టిన మంత్రి మహ్మద్ అజహరుద్దీన్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 11:

భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మైనారిటీ విద్యార్థులను సిద్ధం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది అని మైనారిటీల సంక్షేమం మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) పరిధిలోని 205 పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న దాదాపు 80 వేల మంది విద్యార్థుల కోసం ఏఐ(AI) రెడీనెస్ మరియు డిజిటల్ సేఫ్టీ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది అని చెప్పారు.MASK NextGen మరియు డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 80 వేల మంది మైనారిటీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏఐ(AI) సన్నద్ధత కార్యక్రమం ప్రారంభం చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని TMREIS, MASK NextGen మరియు డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (DCPL) సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేయడానికి డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను గ్లోబల్ ఇంప్లిమెంటేషన్ మరియు స్ట్రాటజిక్ పార్ట్నర్‌గా ఎంపిక చేశారు.ఈ కార్యక్రమం ఆగస్టు 15, 2026 నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం మరియు విద్యార్థులకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా, సామాజిక బాధ్యతతో కూడిన భాగస్వామ్య విధానంలో పూర్తిగా ఉచితంగా అందించనున్నారు.మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థులు కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భవిష్యత్‌కు అవసరమైన నైపుణ్యాలు మరియు అవకాశాలను పొందేలా తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు."కృత్రిమ మేధస్సు భవిష్యత్తు. ఇది ప్రపంచాన్ని అపూర్వమైన వేగంతో మార్చుతోంది. ఈ సాంకేతిక విప్లవంలో మన విద్యార్థులు వెనుకబడకుండా ఉండేందుకు TMREIS విద్యాసంస్థల్లో ఏఐ AI విద్య మరియు డిజిటల్ సేఫ్టీ శిక్షణను ప్రవేశపెడుతున్నందుకు మేము గర్విస్తున్నాం అని అన్నారు."
"మేము MASK NextGen‌తో మూడు సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల జ్ఞానం, డిజిటల్ అవగాహన, విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యం మరియు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయని నాకు నమ్మకం ఉంది.ఏఐAI ఇప్పుడు శాశ్వత వాస్తవం. మన పిల్లలు ఈ రంగంలో నాయకులుగా ఎదగడానికి సిద్ధంగా ఉండాలి." మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ మహిళా సాధికారత మరియు యువతులకు సమాన అవకాశాల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు."మహిళా సాధికారతకు మరియు మహిళల ఉపాధి అవకాశాల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. మన బాలికలు అత్యుత్తమ విద్యను పొందాలి, సాంకేతిక పరిజ్ఞానంపై ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి మరియు తమ తమ రంగాల్లో నాయకులుగా ఎదగాలి. బాలికల విజయానికి మార్గాలను సృష్టించడం మా అత్యున్నత ప్రాధాన్యతల్లో ఒకటి."ఏఐ AI రెడీనెస్ మరియు డిజిటల్ సేఫ్టీ కార్యక్రమం ద్వారా విద్యార్థులు భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన కీలక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు, సాంకేతికతను బాధ్యతాయుతంగా మరియు సురక్షితంగా వినియోగించే విధానాలను కూడా నేర్చుకుంటారని మంత్రి తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించిన MASK NextGen వ్యవస్థాపకురాలు మరియు CEO శ్రీమతి అవ్ని త్రివేది, డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన శ్రీ జోసెఫ్ క్రిస్టోఫర్, TMREIS కార్యదర్శి శ్రీ బి. షఫియుల్లా మరియు TMREIS అధ్యక్షుడు శ్రీ ఫహీమ్ ఖురేషీ కృషిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు."విద్య మరియు సాంకేతికత ద్వారా మన పిల్లలను సాధికారులుగా తీర్చిదిద్దాలనే ఉమ్మడి దృక్పథంతో పనిచేసిన అన్ని భాగస్వాముల కృషి వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మరియు మన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది." ఈ పాఠ్యాంశాన్ని గేమిఫైడ్ మరియు స్వీయ-అభ్యాస డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించనున్నారు. ఇందులో కృత్రిమ మేధస్సు, డిజిటల్ భద్రత, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, విమర్శనాత్మక ఆలోచన మరియు ఆవిష్కరణలపై ఇంటరాక్టివ్ మాడ్యూల్స్ ఉంటాయి.ఈ కార్యక్రమం దేశంలో మైనారిటీ విద్యార్థుల కోసం చేపట్టబడుతున్న అతిపెద్ద AI విద్యా కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా, తెలంగాణను సాంకేతికత, ఆవిష్కరణలు మరియు సమగ్ర అభివృద్ధికి గ్లోబల్ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయాణంలో ఇది మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.

Saturday, July 11, 2026

అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ 50వ వార్షికోత్సవ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షులు కు ఆహ్వానం_

*అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ 50వ వార్షికోత్సవ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షులు కు ఆహ్వానం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,జులై 10:
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఉన్న ఇస్కాన్ దేవాలయం (శ్రీ శ్రీ రాధా మదన్‌మోహన్ మందిర్)50వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరుకావాలని టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు వారి సతీమణినికి ఆలయ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వేడుకల ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు.ఈ ఆహ్వాన కార్యక్రమంలో రమ్యరావు పాల్గొన్నారు.ఒక ప్రముఖమైన, ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రం ఈ టెంపుల్. ఇది నాంపల్లి స్టేషన్ రోడ్డులో, జి. పుల్లారెడ్డి స్వీట్స్‌కు సరిగ్గా ఎదురుగా ఉంది.1976లో స్థాపించబడి, శ్రీల ప్రభుపాదచే ప్రారంభించబడిన ఈ దేవాలయం శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది. ఇది నిత్య భక్తి, భగవద్గీత బోధనలు మరియు ధ్యానానికి ఒక ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.

మంత్రి దామోదర్ రాజనర్సింహ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి_

*మంత్రి దామోదర్ రాజనర్సింహ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,జులై 10:

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సి. దామోదర్ రాజనర్సింహ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని పలు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానల ఏర్పాటు కోసం వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ దవాఖానల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ప్రాథమిక చికిత్సలు, అవసరమైన మందులు సకాలంలో అందించడంతో పాటు ఆరోగ్య సేవలు మరింత చేరువ అవుతాయని ఎమ్మెల్యే వివరించారు.వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మరణించిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం _


హైదరాబాద్ ఆశాడ బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా-జమున తెహజీబ్‌కు ప్రతీక_

*హైదరాబాద్ ఆశాడ బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా-జమున తెహజీబ్‌కు ప్రతీక*

*గోల్కొండ బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక*

*బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో అధికారులకు మంత్రి కొండా సురేఖ దిశా నిర్దేశం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 10:

పండుగల సందర్భాల్లో హిందూ, ముస్లిం సమాజాల పరస్పర సహకారం,వారు ప్రదర్శించే లౌకిక స్ఫూర్తి యావత్ దేశానికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నది.జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఆషాడ బోనాల ఉత్సవాల్లో తొలి బోనం గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనయితీగా వస్తున్నది.భక్తులు సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని, నిండు మనసుతో ప్రభుత్వాన్ని దీవించి, సంతృప్తిగా ఇళ్లకు తిరిగి వెళ్లేలా అన్ని ప్రభుత్వ శాఖలు కలసికట్టుగా పని చేయాలి. దైవానికే అంకితమైన శివసత్తులకు బోనాల సమర్పణలో  అన్ని శాఖలు సహకరించాలి.గోల్కొండ కోటలో జరిగిన జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో అధికారులకు మంత్రి కొండా సురేఖ దిశా నిర్దేశం చేశారు.అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆషాడ బోనాల జాతర పోస్టర్, బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ గారు.హైదరాబాద్ లో ప్రతి ఏటా నిర్వహించే ఆశాడ బోనాల ఉత్సవాలు ఇక్కడి గంగా జమున తెహజీబ్ ప్రత్యేకతను చాటుతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాల నిర్వహణ, ముస్లిం పండుగల సందర్భాల్లో హిందూ, ముస్లిం సమాజాల పరస్పర సహకారం,  వారు ప్రదర్శించే లౌకిక స్ఫూర్తి యావత్ దేశానికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నదని మంత్రి అన్నారు.
ఈ రోజు హైదరాబాద్ లోని గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారి దేవస్థానంలో మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో  బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పై సంబంధిత అధికారులకు మంత్రి సురేఖ దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌,  దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ, జిహెచ్ఎంసి, ఐ అండ్ పి ఆర్ తదితర శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ గారు గోల్కొండ జగదాంబికా అమ్మవారి చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ,  జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఆషాడ బోనాల ఉత్సవాల్లో తొలి బోనం గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనయితీగా వస్తున్నదని అన్నారు.  జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే గోల్కొండ బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.జూలై 16న లంగర్ హౌస్ కూడలి నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి బోనం సమర్పణ, తొట్టెలు రథం ఊరేగింపు, మెట్ల పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి జూలై 16, 19, 23, 26, 30, ఆగష్టు 2,6,9,13 తేదీల్లో నిర్వహించే ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్, పార్కింగ్, క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, అగ్నిమాపక, ప్రత్యేక బస్సులు తదితర ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని స్పష్టం చేశారు.
దేవాలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మొబైల్ టాయిలెట్లు, తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా 
గోల్కొండ కోట పరిధిలోని రహదారులు, మెట్లు, విద్యుత్ దీపాలు, హైమాస్ట్ లైట్లు, సూచిక బోర్డులు, షెడ్లు తదితర సౌకర్యాలు ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. అలాగే భక్తుల దర్శనం సాఫీగా సాగేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని ఆదేశించారు.బోనాల ఉత్సవాలు కొనసాగినన్ని రోజులు పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.  అనుమానితుల ఫొటోలతోకూడిన వాల్ పోస్టర్లను ప్రదర్శిస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. జిహెచ్ఎంసి కాలపరిమితిని నిర్దేశించుకుని పనులు సకాలంలో పూర్తి చేయాలని మంత్రి నిర్దేశించారు. విద్యుత్ శాఖ కరెంటు వైరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. చిన్న పిల్లలు, వృద్ధులు గర్భిణీలు బాలింతల విషయంలో అన్ని శాఖలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొండ సురేఖ ఆదేశించారు.దైవానికే అంకితమైన శివసత్తులకు బోనాల సమర్పణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సహకరించాలని మంత్రి సురేఖ ఆదేశించారు. భక్తులు సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని, నిండు మనసుతో ప్రభుత్వాన్ని దీవించి, సంతృప్తిగా ఇళ్లకు తిరిగి వెళ్లేలా అన్ని ప్రభుత్వ శాఖలు కలసికట్టుగా పని చేయాలని మంత్రి సురేఖ గారు ఆదేశించారు. గోల్కొండ బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహోత్సవమని పేర్కొన్న మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు అన్ని విధాలా కట్టుబడి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా  అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆషాడ బోనాల జాతర పోస్టర్, బ్రోచర్ ను మంత్రి కొండా సురేఖ గారు ఆవిష్కరించారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారి దేవస్థానానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ గారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రి సురేఖ గారు ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జగదాంబికా అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా వర్షాలతో, పాడిపంటలతో పచ్చగా వుండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి కొండా సురేఖ అమ్మవారిని ప్రార్థించారు.