హైదరాబాద్ : 07/08/2021
*ఇదేం విచిత్రం....షీ టాయిలెట్లలో షాపులా.....!?*
*రామంతాపూర్*: వివిధ పనుల నిమిత్తం ఇళ్లనుంచి బయటకు వచ్చే నగర మహిళలు అత్యవసర పరిస్థితుల్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళల ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ షీ టాయిలెట్ల ఏర్పాటు చేసింది. అయితే వాటి నిర్వహణ అగమ్యగోచరంగా తయారవడం మహిళల పాలిట శాపంలా తయారవుతోంది.
వివరాలివీ... రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి ఐడీఏ ఉప్పల్ సమీపంలో మోడ్రన్ బేకరీ ఎదురుగా ఉన్న బస్టాండ్ ఆనుకొని షీ టాయిలెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ షీ టాయిలెట్లను బస్సుల కోసం ఎదురు చూసే మహిళలతో పాటు స్థానికంగా ఉన్న ఐడీఏ ఉప్పల్‌లో పలు ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మికులు వినియోగిస్తుంటారు.
అయితే షీ టాయిలెట్ అని చూడకుంగా వీటిని ఆనుకొని షాపులు ఏర్పాటు చేశారు. ఈ షాపులను పురుషులే నిర్వహిస్తున్నందున చాలామంది మహిళలు షీ టాయిలెట్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపడంలేదు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యాలకు గురవుతున్నారు. ఈ టాయిలెట్లను ఆనుకొని ఉన్న షాపులను దూరంగా తరలించాలని లేదా ఈ షీ టాయిలెట్‌ను మహిళలే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు.
*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com
No comments:
Post a Comment