Wednesday, August 31, 2022

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక విగ్రహాల పంపిణీ

https://youtu.be/mhx2P5uU5Zc   *#పర్యావరణపరిరక్షణ లో భాగంగా #HMDA & #హైదరాబాద్ జిందాబాద్ & #ప్రజాసంకల్పం(NGO) ఆధ్వర్యంలో #GHMC ఉప్పల్ సర్కిల్ #రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ చౌరస్తా లో మట్టితో చేసిన వినాయక విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి #రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధి #ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మక్బుల్ జానీ సర్ గారు మరియు #GHMC ఉప్పల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ACP అధికారి వెంకట రమణ సర్ గారు మరియు హైకోర్టు న్యాయవాది ఆనంద సర్ గారు  పాల్గొన్నారు*


*https://youtu.be/_hWFkWnZf-4*  *పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలి.... అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు 🙏.... Bplkm🪶*



ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి కి తొలి పూజ చేసిన గవర్నర్ తమిళిసై

ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి కి తొలి పూజ చేసిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా భాగ్యనగరానికి ప్రత్యేకత తీసుకొచ్చిన 'ఖైరతాబాద్‌ గణేశ్‌' వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ చేశారు. ఈ ఏడాది 'పంచముఖ మహాలక్ష్మి గణపతి'గా గణనాథుడు దర్శనమిస్తున్నాడు.ప్రపంచవ్యాప్తంగా భాగ్యనగరానికి ప్రత్యేకత తీసుకొచ్చిన 'ఖైరతాబాద్‌ గణేశ్‌' వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ చేశారు. ఈ ఏడాది 'పంచముఖ మహాలక్ష్మి గణపతి'గా గణనాథుడు దర్శనమిస్తున్నాడు.
ఈసారి 50 అడుగులతో ఏర్పాటు చేసిన బడా గణేశ్‌ను మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితోనే తీర్చిదిద్దారు. వినాయకుడితో పాటు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, త్రిశక్తిగా పిలుచుకునే మహాగాయత్రిదేవీ కొలువుదీరారు. ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తు్న్నారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Tuesday, August 30, 2022

మంత్రి KTR కు కరోనా పాజిటివ్.... ట్విట్టర్ ద్వారా వెల్లడి...!

*మంత్రి KTR కు కరోనా పాజిటివ్.... ట్విట్టర్ ద్వారా వెల్లడి...!*

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి కరోనా బారినపడ్డారు.ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు కేటీఆర్‌. లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని తెలిపారాయన. స్వల్ప లక్షణాలతోనే ఆయన కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ దయచేసి పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని ఆయన అభ్యర్థించారు

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

కేజ్రీవాల్ పై.... అన్నా హజారే ఫైర్

*అధికారమనే మత్తులో*
*మునిగిపోయారు.... కేజ్రీవాల్ పై.... అన్నా హజారే ఫైర్*

దిల్లీ: ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికార మత్తులో ఉన్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే  ఘాటు వ్యాఖ్యలు చేశారు.దిల్లీ మద్యం పాలసీ పై విమర్శలు ఎక్కుపెడుతూ తాజాగా ఆయన కేజ్రీవాల్‌కు ఓ లేఖ రాశారు. 'మద్యం మాదిరే.. అధికారం కూడా మత్తు కలిగిస్తుంది. మీరూ ఆ మత్తులో మునిగిపోయినట్లు కనిపిస్తోంది' అంటూ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం.. ఏ ఇతర పార్టీలకు భిన్నంగా లేదని వ్యాఖ్యానించారు. ఇది చాలా బాధకరమన్నారు. 'టీం అన్నా' ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉంటే.. ఇప్పుడు ఇటువంటి తప్పుడు ఎక్సైజ్‌ విధానాలు ఎక్కడా వచ్చేవి కాదన్నారు.

'మీరు సీఎం అయిన తర్వాత మొదటిసారి రాస్తున్న లేఖ ఇది. ఎందుకంటే.. దిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీపై ఇటీవల వెలువడిన వార్తాకథనాలపై కలత చెందా. గతంలో మీ 'స్వరాజ్' పుస్తకంలో మద్యం విధానాలపై ఆదర్శప్రాయ విషయాలు పొందుపరిచారు. దానికి నాతో ఉపోద్ఘాతం రాయించారు. స్థానికుల ఆమోదం లేకుండా మద్యం దుకాణాలు తెరవకూడదని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆదర్శాలను మరిచిపోయారు. మీ మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందని తెలుస్తోంది. బలమైన లోక్‌పాల్, లోకాయుక్తాలను తీసుకురావడాన్ని పక్కనబెట్టి.. ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకమైన మద్యం పాలసీని తీసుకువచ్చారు' అని విమర్శించారు.

మద్యం పాలసీలో మహారాష్ట్రతోపాటు తన గ్రామమైన రాలేగావ్‌ సిద్ధిలను ఆదర్శంగా పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వంపైనా ఇలాంటే ఆశలే పెట్టుకున్నట్లు.. కానీ, ఇలా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఇతర పార్టీల మాదిరే దిల్లీలోనూ జనాలు.. అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారమన్న వలయంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఒక పెద్ద ఉద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీకి ఇది తగదు' అని లేఖలో రాసుకొచ్చారు. అన్నా హజారే ఆధ్వర్యంలో 2011-12 సమయంలో దేశంలో పెద్దఎత్తున అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. అందులో కేజ్రీవాల్‌ సైతం పాల్గొన్నారు. అయితే.. అన్నాహజారే పలు సందర్భాల్లో ఆప్‌పై విమర్శలు గుప్పించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Monday, August 29, 2022

వికటించిన కుటుంబ నియంత్రణ

*వికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్....ఇద్దరు మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమంగా*

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫైయిలై ఇద్దరు మృతి చెందారు.
ఈ నెల 25న ఇబ్రహీంపట్నంలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.

ఇది చేసిన రెండు రోజుల తర్వాత నలుగురు మహిళలు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఇందులో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకరు మాడుగులకు చెందిన మమత కాగా, మరొకరు మంచాల మండలం లింగంపల్లికి చెందిన మైలారం సుష్మా. వైద్యుల నిర్లక్ష్యంతోనే వీరివురు మరణించారని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Saturday, August 27, 2022

కేసీఆర్ పోటీచేసినా గెలుస్తా..... కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

*కేసీఆర్ పోటీచేసినా గెలుస్తా..... కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి*

*మునుగోడులో పోటీచేయాలని సీఎంకు రాజగోపాల్‌రెడ్డి సవాల్‌*

మునుగోడు: మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్‌ పోటీచేసినా విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ నియంత పాలనను అంతమొందించేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానన్నారు.  మునుగోడులో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Friday, August 26, 2022

మోదీనే నెంబర్.... వన్

*మోదీనే నెంబర్.... వన్*

*ప్రపంచ అత్యుత్తమ నేతల్లో టాప్‌ : సర్వే వెల్లడి*
*5వ స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌*

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75 శాతం ప్రజామోదం ఉందని 'మార్నింగ్‌ కన్సల్ట్‌' అనే సర్వే సంస్థ వెల్లడించింది. ప్రపంచ నాయకులు అందరికంటే అధిక జనాదరణ ఉన్న నేతగా మోదీనే ముందున్నారని స్పష్టం చేసింది. మొత్తం 22 మంది దేశాధినేతల్లో మోదీ అత్యధిక రేటింగ్‌ సంపాదించుకున్నారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ చేపట్టిన సర్వేలో ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ 41 శాతం అప్రూవల్‌ రేటింగ్‌తో 5వ స్థానంలో నిలవడం గమనార్హం.

63 శాతం ఆమోదంతో రెండోస్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యువల్‌ లోపెజ్‌ ఒబ్రాడార్‌ ఉండగా, 54 శాతంతో మూడోస్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో 39 శాతం, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో.. అమెరికా అధ్యక్షుడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అమెరికా డేటా ఇంటెలిజెన్స్‌ సంస్థ 'మార్నింగ్‌ కన్సల్ట్‌' పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని అంచనా వేస్తుంటుంది. ఇంటెలిజెన్స్‌ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, దక్షిణ కొరియా, స్వీడన్‌ వంటి దేశాల్లోనూ ఈ సంస్థ సర్వే నిర్వహించింది.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

CJI NV Ramana: ఆ విషయంపై సరైన దృష్టి సారించలేకపోయా.. సారీ!

CJI NV Ramana: ఆ విషయంపై సరైన దృష్టి సారించలేకపోయా.. సారీ!

ధర్మాసనం నుంచి చివరిసారి మాట్లాడిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

CJI NV Ramana: ఆ విషయంపై సరైన దృష్టి సారించలేకపోయా.. సారీ!

ఈనాడు, దిల్లీ: కేసుల పెండింగే ఇప్పుడు న్యాయవ్యవస్థ ముందున్న ప్రధాన సవాల్‌ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. కేసుల లిస్టింగ్‌, పోస్టింగ్‌ల అంశంపై తాను తగినంత దృష్టి సారించలేకపోయానని, అందుకు సారీ చెబుతున్నానని తెలిపారు. శుక్రవారం పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయన చివరిసారి ధర్మాసనంపై నుంచి మాట్లాడారు. ‘‘నేను ఈ స్థాయికి చేరడానికి నా జీవన ప్రస్థానంలో ప్రతి ఒక్కరూ సాయం చేశారు. ఈ గొప్ప వ్యవస్థలో 22 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు భాగస్వామిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. అత్యంత సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నా. భారతీయ న్యాయవ్యవస్థ సమయానుకూలంగా, ప్రజాస్వామ్య పరిస్థితులకు తగ్గట్టు ఎదుగుతూ వచ్చింది. అందువల్ల దాని తీరును ఒక తీర్పును బట్టి అంచనావేయడానికి వీల్లేదు. ఈ వ్యవస్థ గొప్పతనాన్ని న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి రక్షించారు. వ్యవస్థ విశ్వసనీయతను కాపాడుకోలేకపోతే ఇక్కడివారు ప్రజల నుంచి గౌరవ మర్యాదలను పొందలేరు. లాయర్ల అప్రమత్తత, భాగస్వామ్యంతోనే న్యాయవ్యవస్థ బలోపేతం సాధ్యమవుతుంది. మీ  సహకారం వల్లే ఈ దేశ న్యాయవ్యవస్థలో మార్పు సాధ్యమైంది’’ అని పేర్కొన్నారు.

తన పదవీ కాలమంతా సంక్లిష్టంగా సాగిందని, అయినప్పటికీ అన్నివర్గాలూ సహకరించాయని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. ‘‘రోజువారీ పనితీరును సంస్కరించడానికి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడమే మార్గం. కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలు కనుక్కోవాలి. మేం కొన్ని విధానాలను అభివృద్ధి చేసినప్పటికీ పలు సమస్యల కారణంగా వాటిని కొనసాగించలేకపోయాం. కొవిడ్‌ సమయంలో రోజువారీగా కోర్టులను నడపడమే పెద్ద సమస్య అయింది. మిగతా వాణిజ్య సంస్థల్లా మేం మార్కెట్‌ నుంచి నేరుగా సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. నేను సీజేఐగా పనిచేసిన 16 నెలల్లో కొవిడ్‌ కారణంగా పూర్తిస్థాయి విచారణలు 55 రోజులే జరిగాయి. నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీకీ బిగ్ షాక్.....ఆజాద్ రాజీనామా....!

*కాంగ్రెస్ పార్టీకీ బిగ్ షాక్.....ఆజాద్ రాజీనామా....!*

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌.. హస్తం పార్టీకి ఊహించని షాకిచ్చారు. తాను కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.దీంతో, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి బిగ్‌ షాక్‌ తగిలింది.

ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపించారు. తన రాజీనామా లేఖలో రాహుల్‌ గాంధీ తీరును ఆజాద్‌ తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీకి వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యాకే పార్టీ నాశనమైందని విమర్శలు గుప్పించారు. సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందని ఫైర్‌ అయ్యారు. రాహుల్‌ గాంధీది.. చిన్నపిల్లల మనస్తత్వం.. సీనియర్లు అందరిని రాహుల్‌ పక్కన పెట్టేశారంటూ పేర్కొన్నారు. హోదా లేనప్పటికీ అన్నింటిలో రాహుల్‌ జోక్యం పెరిగిందని ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. ఇటీవలే కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీకి పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ గట్టి షాకిచ్చారు. ఆయనను జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్‌ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్‌ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, బీజేపీ మాత్రం ఆజాద్‌కు అరుదైన గౌవరం ఇచ్చింది. ఈ ఏడాది పద్మభూషణ్‌ ఇచ్చి గౌరవించింది

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Wednesday, August 24, 2022

CJI NV Ramana: ఉచితాలపై సుప్రీం కోర్టులో విచారణ.. సీజేఐ కీలక వ్యాఖ్యలు

CJI NV Ramana: ఉచితాలపై సుప్రీం కోర్టులో విచారణ.. సీజేఐ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ (Delhi): రాజకీయ పార్టీల ఉచిత హామీల (Free guarantees)పై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సీజేఐ ఎన్‌వి రమణ (CJI NV Ramana) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉచితాలపై కేంద్ర ప్రభుత్వమే అఖిలపక్ష కమిటీని ఎందుకు వేయకూడదని ప్రశ్నించారు. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసే ఆసక్తిలో లేదని కేంద్రం తరపు న్యాయవాది తెలిపారు. ఎన్నికల్లో పార్టీలు ప్రజలకు రకరకాల హామీలు ఇస్తుంటాయని, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రేపు అధికారంలోకి రావచ్చునని ఎన్‌వి రమణ అన్నారు. అధికార పార్టీ ఆర్థిక అంశాల్లో చూసి వ్యవహరించాలని సూచించారు. పదవి కాలం ముగియబోతున్న జడ్జి వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యత ఉండదన్నారు. ఎన్నికల ఉచిత హామీల కేసును విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. 

విద్యార్థి వీసాకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు... అమెరికా వెసులుబాటు

*విద్యార్థి వీసాకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు*


*ఒకసారి తిరస్కరణకు గురైనవారికి అమెరికా వెసులుబాటు*

*ఇంటర్వ్యూలకు మొదలైన స్లాట్ల కేటాయింపు*

*హైదరాబాద్‌.....*
తమ దేశంలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు అమెరికా శుభవార్త చెప్పింది. విద్యార్థి వీసా(ఎఫ్‌-1) దరఖాస్తు ఒకసారి తిరస్కరణకు గురైనా అదే విద్యా సంవత్సరంలో మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.అమెరికాలో విద్యా సంవత్సరం ఇటీవల ప్రారంభం అయింది. వీసాలకు ఒత్తిడి తగ్గటంతో తిరస్కారానికి గురైన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గడిచిన రెండు మూడేళ్లలో పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు వీసాలు మంజూరు చేశారు. కొవిడ్‌ విజృంభణతో అమెరికా విద్యా సంస్థల్లో సైతం చేరే దేశీ విద్యార్థుల సంఖ్యా తగ్గింది. పరిస్థితులు సద్దుమణగడంతో యూఎస్‌ వెళ్లేందుకు ఆసక్తి చూపే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో తొలిసారి విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఒకదఫా విద్యార్థి వీసా తిరస్కారానికి గురైన పక్షంలో ఆ ఏడాదిలో మళ్లీ దరఖాస్తు చేసుకునే విషయంలో పరిమితులు విధించింది. అర్హులైన వారి అవకాశాలకు ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. తాజాగా దానిని సడలించింది. కరోనా ముందు వరకు దేశవ్యాప్తంగా ఏటా 50 నుంచి 60 వేల వరకు ఎఫ్‌-1 వీసాలను భారతీయ విద్యార్థులకు జారీ చేసేవారు. ఒకదశలో ఆ సంఖ్య 62 వేలు సైతం దాటినట్లు అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి ఒకరు ఇటీవల స్పష్టం చేశారు.

అత్యవసర అపాయింట్‌మెంట్‌

తిరస్కారానికి గురైన విద్యార్థులు మరోదఫా వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ఈ నెలలో యూఎస్‌ కొన్ని స్లాట్లు విడుదల చేసింది. ఇప్పటికీ స్లాట్లు లభించని విద్యార్థులు అత్యవసర అపాయింట్‌మెంట్‌ వెసులుబాటునూ ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది.

*ఇంటర్వ్యూ అధికారి మారతారు*
తిరస్కరణకు గురైన విద్యార్థి వీసా(ఎఫ్‌-1) దరఖాస్తుదారులు ఎవరైనా మరోదఫా ఇంటర్వ్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్లీ దరఖాస్తు చేసుకున్నప్పుడు మునుపటి అధికారి కాకుండా మరొకరు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ నెలలో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా సుమారు 15 వేల వరకు విద్యార్థి వీసా స్లాట్లు విడుదల చేశాం.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Tuesday, August 23, 2022

బ్రేకింగ్ న్యూస్....బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్

*బ్రేకింగ్ న్యూస్....*

*బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్*

*బిజెపిలో అన్ని బాధ్యతలు నుండి తొలగింపు*

భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పార్టీ వేటుపడింది. మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీ స్పందించింది. భారతదేశ విచ్చినానినికి, దేశ సమగ్రతకు భంగం కల్పించేలా ఆయన వ్యాఖ్యలు ఉండడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీ లైన్ దాటారన్న నెపంతో రాజాసింగ్ ను సస్పెన్షన్ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. గతంలో నుపూర్ వ్యాకలకంటే దారుణంగా రాజాసింగ్ మాట్లాడారని  వాదన మొదలైంది. ఇప్పటికే ఎల్బీనగర్, బాలాపూర్ పోలీస్స్టేషన్లో రాజాసింగ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. రాజాసింగ్ పై చర్య తీసుకోకపోతే దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం కేంద్రం వద్ద ఉంది. భారతీయ జనతా పార్టీ లైన్ దాటి ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపణలు మిన్నంటాయి. ప్రస్తుతం రాజాసింగ్ 10 రోజుల్లో పార్టీకి జవాబు ఇవ్వాల్సి ఉంది. రాజాసింగ్ కు నోటీసులు జారీ అయ్యాయి.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Monday, August 22, 2022

జీవో 111 అమలుపై 15 ఏండ్లు అయినా కౌంటర్ దాఖలు చేయరా....?

*జీవో 111 అమలుపై 15 ఏండ్లు అయినా కౌంటర్ దాఖలు చేయరా....?*

*హైకోర్టు ఆదేశాలను లైట్‌గా తీసుకుంటున్నారు...*

*రాష్ట్ర ప్రభుత్వానికి చివరి అవకాశంగా 2 వారాల గడువు: హైకోర్టు*

*హైదరాబాద్‌....*
ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలను పరిరక్షించే ఉద్దేశంతో జారీచేసిన 111 జీవో ను పటిష్ఠంగా అమలు చేసే అంశంపై 15 ఏండ్లుగా ప్రభు త్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ స్పందన తెలియజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటికీ .. తమ ఆదేశాలను ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటున్నదని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ శాఖ ముఖ్య కార్యదర్శికి రూ. 25వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. జీవో 111ను కఠినంగా అమలుచేయాలని కోరుతూ పలు ఎన్జీవోలకు చెందిన డాక్టర్‌ ఎస్‌.జీవానందరెడ్డి, ఒమిమ్‌ మానెక్‌ షా డెబెరా 2007లో వేర్వేరు గా పిటిషన్లు దాఖలు చేశారు. ఈపిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని ఽధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్‌కు తాగునీటిని అందించే జంట జలాశయాల పరిరక్షణను ప్రమాదంలో పడేసేలా ప్రభుత్వం ఇటీవల జీవో 69ను జారీచేసిందని తెలిపారు. జీవో 111లోని ఆంక్షలను జీవో 69 ద్వారా ఎత్తేసి, కొత్త ఆంక్షలు విధిస్తామని ప్రభుత్వం పేర్కొన్నదని తెలిపా రు. జీవో 111లోని ఆంక్షలను సడలించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు జారీచేశాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల ను ధిక్కరిస్తూ ప్రభుత్వం జీవో 111 ఆంక్షలను ఎత్తేసేందుకు జీవో 69 జారీచేసిందని తెలిపారు. జీవో 69ను సైతం తాము మధ్యంతర పిటిషన్‌ ద్వారా సవాల్‌ చేశామని పేర్కొన్నారు. కొత్త ఆంక్షలు ఎలా ఉంటాయి?, అలాగే నిపుణుల కమిటీ ఏర్పాటుకు సం బంధించిన వివరాలను హైకోర్టు ఎదుట ఉంచే విధంగా ఆదేశాలు జారీచేయాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ పిటిషన్‌లలో కౌంటర్‌ ఇంకా ఎప్పుడు దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాదులను ప్రశ్నించింది. ''ఇప్పటికే 15 ఏండ్లు గడిచిపోయాయి. కౌంటర్‌ దాఖలు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ప్రభుత్వ స్పందన తెలియజేయడానికి చివరి అవకాశం ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు''

అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ న్యాయవాదుల వ్యవహారశైలి బాధాకరమని... హైకోర్టు ఆదేశాల ప్రాము ఖ్యం ఎలాంటిదో వారు అర్థంచేసుకోవడం లేదని వ్యాఖ్యానించింది. హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాది వై.రామారావు చివరి అవకాశం ఇవ్వాలని పదేపదే విజ్ఞప్తి చేయడంతో చిట్టచివరి అవకాశంగా రెండు వారాలపాటు గ డువు మంజూరు చేసింది. విచారణను సెప్టెంబర్‌ 14కు వాయిదావేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Sunday, August 21, 2022

మునుగోడు బాధ్యత అందరిదీ.....!

*మునుగోడు బాధ్యత అందరిదీ.....!*

*రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్న కాంగ్రెస్‌ అధిష్టానం*

*నేడు ఢిల్లీలో ప్రియాంకతో సమావేశం*

*రేవంత్, భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌ తదితరులకు ఆహ్వానం*

*ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం*
హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను తెలంగాణ ముఖ్య నేతలందరి భుజాలపై పెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీకి రావాలని, సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని పార్టీ నేతలను హైకమాండ్‌ ఆహ్వానించింది.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు నల్లగొండ జిల్లా ముఖ్య నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర్‌ రెడ్డి, మునుగోడు ఉప ఎన్నిక ప్రణాళిక, వ్యూహ కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఈ సమావేశానికి వెళ్తారని తెలుస్తోంది. వీరితో పాటు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్‌ జావేద్, రోహిత్‌ చౌదరి, పార్టీ తరఫున సర్వేలు నిర్వహిస్తున్న సునీల్‌ కనుగోలు కూడా ప్రియాంకతో జరిగే భేటీలో పాల్గొననున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక అంశమే ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల నివేదికలను పరిశీలిస్తారని, నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించి అభ్యర్థి ఎవరయితే బాగుంటుందన్న దానిపై కూడా సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వస్తారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.... కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది!

*రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.... కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది!*

మునుగోడు : సీఎం కేసీఆర్‌  సర్కార్‌ని పడగొట్టేందుకు ఇది ఆరంభమని కేంద్రమంత్రి అమిత్‌ షా  అన్నారు.మునుగోడులో బీజేపీ (Bjp) నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఉపఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy)ని గెలిపిస్తే కేసీఆర్‌ ప్రభుత్వం పడిపోతుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తానని కేసీఆర్‌ చెప్పారని.. కానీ ఇప్పుడు మాట తప్పారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక.. విమోచన దినోత్సవం నిర్వహిస్తామని అమిత్‌షా తెలిపారు.

''నిరుద్యోగ యువతకు 3 వేలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది ఇప్పటివరకు కూడా అమలు కాలేదు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం హామీ ఏమైంది?. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ చెప్పారు.. కానీ అది జరగలేదు. మళ్లీ గెలిపిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ వస్తారు. పేదలకు ఇల్లు ఇస్తామన్నారు?.. ఇచ్చారా?. మోదీ ఇచ్చే టాయిలెట్లను కూడా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారు. దళిత కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని హుజూరాబాద్‌లో చెప్పారు. ఎంత మంది దళితులకు రూ.10 లక్షలు వచ్చాయి?. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఎవరికైనా ఇచ్చారా?. గిరిజనులకు ఎకరం భూమి ఎక్కడైనా ఇచ్చారా?. రాష్ట్రంలో 2014 నుంచి టీచర్ల నియామకాలు జరగలేదు. గిరిజనులకు ఎకరం భూమి ఎక్కడైనా ఇచ్చారా?. '' అని అమిత్‌ షా ప్రశ్నించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Saturday, August 20, 2022

ఈసారి బీజేపీకి ఓటు పడిందంటే.....కేసీఆర్

*ఈసారి బీజేపీకి ఓటు పడిందంటే.....కేసీఆర్*

మునుగోడు: కేంద్రప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ .. ప్రతి వేదికపై కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. మునుగోడు లో టీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో ప్రజాదీవెన సభ నిర్వహించారు.ఈ సభలో ప్రధాని మోదీ  కేంద్రమంత్రి అమిత్‌షా ను కేసీఆర్ టార్గెట్ చేశారు. కృష్ణానది జలాలను ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయమంటే మోదీ చేయలేదని తప్పుబట్టారు. తమ ప్రశ్నలకు అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడులో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవాచేశారు. ఈసారి బీజేపీకి ఓటు పడిందంటే.. బావి కాడ మీటర్లు ఉన్నట్టేనని హెచ్చరించారు. ప్రజల మద్దతుతోనే తాను మీటర్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని తెలిపారు.

''రైతులకు అనవసరంగా డబ్బులు పంచిపెడుతున్నామని అంటున్నారు. రైతుబంధు, పింఛన్లు ఎందుకు ఇస్తున్నారని మమ్మల్ని నిలదీశారు. సంక్షేమ పథకాలు బంద్‌ పెట్టాలని అంటున్నారు. మీటర్లు పెట్టే బీజేపీ కావాలా?, మీటర్లు వద్దనే టీఆర్‌ఎస్‌ కావాలా?.. ఈడీకి దొంగలు భయపడుతారని మేమెందుకు భయపడతాం?.. మీరు గోకినా.. గోకకపోయినా.. నేను గోకుతా. ప్రధాని మోదీ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగింది?.. బ్యాంకులు, రైళ్లు, రోడ్లు అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోంది. ఇక రైతులు, భూములను కూడా కేంద్రం అమ్మేస్తుందేమో?.. ఢిల్లీలో మా నీళ్ల సంగతేంటని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అడగరు. బావికాడ మీటర్‌ పెట్టు కేసీఆర్‌ అంటున్నారు. చచ్చినా పెట్టా అని కేంద్రానికే చెప్పా. ఎరువుల ధరలు పెంచాలి, కరెంట్‌ రేటు పెంచాలి. మోదీ పాలనలో పండిన పంటలకు ధర రాదు. మోదీ దోస్తులు సూట్‌ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. కార్పొరేట్‌ వ్యవసాయం చేద్దామనే కుట్ర జరుగుతోంది'' అని మోదీ తెలిపారు.

కొట్లాడటం తెలంగాణ ప్రజలకు కొత్త కాదని, కొట్లాడటం మొదలుపెడితే ఎక్కడిదాకా అయినా వెళ్తామని కేసీఆర్‌ హెచ్చరించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎందుకు తేల్చరు? అని ప్రశ్నించారు. మునుగోడు ఫ్లోరైడ్‌ సమస్యతో ఎలా గోసతీసిందో అందరికీ తెలుసన్నారు. ఫ్లోరైడ్‌ సమస్యతో ఎలా బాధపడిందో మనం చూశామని, జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యను ఎవరూ పరిష్కరించలేదని చెప్పారు. ఉద్యమం సమయంలో తాను అనేకసార్లు సమస్యను ప్రస్తావించానని, నల్లగొండ నగరా పేరుతో 15 రోజుల పాటు జిల్లా మొత్తం తిరిగానని తెలిపారు. శివన్నగూడెం గ్రామంలో నిద్ర కూడా చేశానని కేసీఆర్ గుర్తుచేశారు. మిషన్‌ భగీరథ పేరుతో ఫ్లోరైడ్‌ లేని నీళ్లు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాను నో మ్యాన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు కూడా హెచ్చరించారని, ఫ్లోరైడ్‌ బాధితుడిని ఢిల్లీకి తీసుకెళ్లి చూపించినా ఎవరూ వినలేదని పేర్కోన్నారు. మునుగోడులో గోల్‌మాల్‌ ఉపఎన్నిక వచ్చిందన్నారు. ఎవరి కోసం ఈ ఉపఎన్నికల వచ్చింది.. ఇక్కడ ఉపఎన్నికల రావాల్సిన అవసరం ఏముంది? అని సీఎం ప్రశ్నించారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా.. ఇప్పుడు ఉపఎన్నిక ఎందుకని నిలదీశారు.

''కలిసి ఉండాలని కామ్రేడ్లకు చెప్పాను. అందుకే మాకు మద్దతు ఇచ్చారు. టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐకి ధన్యవాదాలు. సీపీఐ ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఈ ఐక్యత మునుగోడు నుంచి ఢిల్లీ వరకు ఇలాగే కొనసాగాలి. దేశంలో ప్రగతిశీల శక్తులన్నీ ఏకం చేసి ముందుకు సాగాలి. భవిష్యత్‌లో సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తాయి'' అని కేసీఆర్‌ ప్రకటించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Thursday, August 18, 2022

అన్ని దారులు మునుగోడు.... వైపే

*అన్ని దారులు మునుగోడు.... వైపే*

నల్గొండ

*రెండు రోజుల వ్యవధిలో సీఎం కేసీఆర్‌, కేంద్ర హోం* *మంత్రి అమిత్‌షా బహిరంగ సభలు ఉండటంతో అధికార తెరాస, భాజపా* *ముఖ్య నేతలంతా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మకాం వేశారు*

*మండలాల వారీగా జనసమీకరణపై స్థానిక* *సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.*

క్షేత్రస్థాయిలో జనసమీకరణపై గత కొన్నాళ్లుగా తెరాస ఇన్‌ఛార్జ్‌లు దృష్టి పెట్టినా... స్థానిక నాయకత్వం పట్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధుల అసంతృప్తి ఇంకా రగులుతూనే ఉంది. సీఎం సభకు తమను ఆహ్వానించలేదని కొంత మంది నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు నిఘా వర్గాలతో పాటూ పలు మార్గాల ద్వారా తెరాస అధిష్ఠానం తెలుసుకుంటూ మార్గదర్శనం చేస్తుండటంతో తమకు ఇష్టం లేకపోయినా కొంత మంది నేతలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే సీఎం సభ అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

*క్షేత్రంలోకి భాజపా ముఖ్య నేతలు*
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేయాలనే తలంపుతో మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పార్టీ నియమించిన ఇన్‌ఛార్జ్‌లు గురువారం అన్ని మండలాల్లో పార్టీ క్యాడర్‌తో సమీక్షలు నిర్వహించారు. చౌటుప్పల్‌, నాంపల్లి మండలాల్లో జరిగిన సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ సైతం ఇక్కడే మకాం వేశారు. అమిత్‌షా సభకు ఇంకా రెండు రోజులే ఉండటం, సీఎం సభ సైతం రేపు (20న శనివారం) ఉండటంతో అంతకు మించి జనసమీకరణ చేయాలని పార్టీ ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలంతా క్షేత్రస్థాయిలో దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజకవర్గాన్ని వీడకుండా ఎప్పటికప్పుడు వారి వ్యూహాలకు చెక్‌పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
*కార్యకర్తలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్‌*
తెరాస, భాజపాల నుంచి వస్తున్న ఆఫర్‌లతో ఆయా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న తమ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులను కాపాడుకునే పనిలో కాంగ్రెస్‌ పార్టీ నిమగ్నమైంది. ఉప ఎన్నిక ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటు మండలాల వారీగా ఉన్న ఇన్‌ఛార్జ్‌లు అసంతృప్తితో ఉన్నవారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఏడాది కాలం ఓపికగా ఉంటే వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని నచ్చజెబుతున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

ఎస్కలేటర్ దిగుతూ కింద పడిన విద్యార్థులు

*ఎస్కలేటర్ దిగుతూ కింద పడిన విద్యార్థులు*

*12 మంది పిల్లలు, ఓ ఉపాధ్యాయురాలికి గాయాలు*
*గాంధీ సినిమా ప్రదర్శిస్తున్న హైదరాబాద్‌ ఆర్‌కే సినీఫ్లెక్స్‌లో ఘటన*

జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రదర్శిస్తున్న 'గాంధీ' చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన విద్యార్థులు ఎస్కలేటర్‌ దిగుతూ పడిపోయి గాయపడిన ఘటన హైదరాబాద్‌లో కలకలానికి కారణమైంది. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలూ గాయపడ్డారు. జూబ్లీహిల్స్‌ భారతీయ విద్యా భవన్స్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు 'గాంధీ' చిత్రాన్ని వీక్షించేందుకు గురువారం ఉదయం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పీవీఆర్‌ ఆర్‌కె సినీఫ్లెక్స్‌కు వచ్చారు. ఎస్కలేటర్‌ ఎక్కి పైకి వెళ్లారు. దాన్నుంచి దిగే సమయంలో తరబాటుకు గురై 12 మంది విద్యార్థులు కిందపడి గాయపడ్డారు. వాళ్ల వెంట ఉన్న ఉపాధ్యాయురాలు కూడా గాయాలపాలయ్యారు. వారిని పాఠశాల సిబ్బంది జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఉపాధ్యాయురాలితోపాటు 8 మంది విద్యార్థులను డిశ్ఛార్జి చేసినట్లు, శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో నలుగుర్ని(అభినవ్‌, తరుణ్‌, హాసిని, క్రితిన్‌) ఆసుపత్రిలోనే ఉంచినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బాధిత విద్యార్థులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పరామర్శించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Wednesday, August 17, 2022

పార్లమెంటరీ బోర్డును ప్రకటించిన బిజెపి.... తెలంగాణ నుంచి అతనికే చాన్స్

*పార్లమెంటరీ బోర్డును ప్రకటించిన బిజెపి.... తెలంగాణ నుంచి అతనికే చాన్స్*

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ బుధవారం కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. 11 మందితో పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయగా..11 15 మంది సభ్యులతో బీజే పీ కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఇక, తెలంగాణకు చెందిన కె లక్ష్మణ్‌కు రెండు కమిటీల్లోనూ అవకాశం దక్కింది.

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జేపీ, నడ్డా బీఎస్‌ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్‌, కే లక్ష్మణ్‌, ఇక్బాల్‌ లాల్‌పుర, సుధా యాదవ్‌, సత్యనారాయణ జాతియా, బీఎల్‌ సంతోష్‌లను సభ్యులుగా నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డును జేపీ నడ్డా నియమించారు.

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ముగ్గురు కొత్త నేతలకు చోటు కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, తెలంగాణ నుంచి ఎంపీ కే లక్షణ్‌కు అవకాశం లభించింది. ఇక కొత్త పార్లమెంటరీ బోర్డులో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు స్థానం దక్కలేదు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

సమాజంలో విద్వేషం పెచ్చరిల్లుతే కోలుకోవడం చాలా కష్టం...... CM KCR

*సమాజంలో విద్వేషం  పెచ్చరిల్లుతే కోలుకోవడం చాలా కష్టం...... CM KCR*

హైదరాబాద్‌: పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరుగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)ను శామీర్‌పేట అంతాయిపల్లి వద్ద సీఎం కేసీఆర్‌ ప్రారంభిచారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... మేడ్చల్‌ జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదని, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైందని సీఎం వివరించారు.

''రాష్ట్రంలో కొత్తగా 10లక్షల పింఛన్లు అందిస్తున్నాం. అందరికీ కొత్త కార్డులు ఇస్తున్నాం. 24 గంటలు కరెంటు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. హైదరాబాద్‌లో కరెంటు పోదు.. దేశ రాజధాని దిల్లీలో 24గంటలు కరెంటు రాదు. మెదడు రంగరించి.. హృదయంతో ఆలోచిస్తేనే మంచి పనులు చేయగలుగుతాం. మేడ్చల్‌ జిల్లా ఎమ్మెల్యేలకు గతంలో రూ. 5కోట్ల చొప్పున నిధులు కేటాయించాం.. వాటికి అదనంగా మరో రూ.10కోట్లు చొప్పున మంజూరు చేస్తున్నా. తెలంగాణ ధనిక రాష్ట్రమని ఉద్యమ సమయంలోనే చెప్పా. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ.లక్ష ఉండేది. ఈరోజు రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2,78,500. దేశంలోనే ఇది అత్యధికం. ఇవాళ మన జీఎస్‌డీపీ రూ.11.55లక్షల కోట్లు. బారతదేశంలో అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ ఉంది. అవినీతి రహిత పాలన వల్లే ఇది సాధ్యమైంది. దేశంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులు. పేద బిడ్డ పెళ్లి జరిగితే రూ.లక్ష సాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే.

గతంలో ముసలివాళ్లను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేవారు. ఆసరా పింఛను పుణ్యమా అని.. అత్తలు, అమ్మలకు డిమాండ్‌ పెరిగింది. వృద్ధుల దగ్గర ఇవాళ రూ.50.. 60వేలు నిల్వ ఉంటున్నాయి. ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, కిడ్నీ బాధితులకు పింఛన్లు అందిస్తున్నాం. మిషన్‌ భగీరథ ద్వారా నీటి కొరత తీర్చుకున్నాం. కరోనా రాకుంటే మరో 500 గురుకులాలు ఏర్పాటు చేసే వాళ్లం. గతంలో ముంబయి, దుబాయికి వలస వెళ్లేవారు. రాష్ట్రంలో ఎవరూ ఉపవాసం ఉండే పరిస్థితి లేదు. దాదాపు 12 రాష్ట్రాల నుంచి పేదలు తెలంగాణకు వచ్చి బతుకుతున్నారు. 60 ఏళ్ల కింద తెలంగాణ సమాజం నిద్రాణమై ఉండేది. అందుకే 58 ఏళ్లు గోస పడ్డాం. దేశంలో జరిగే పరిణామాలపై గ్రామాల్లో, బస్తీల్లో చర్చ జరగాలి. టీవీలు, పేపర్లలో వార్తలు చూసి వదిలేయెద్దు... ఆలోచించండి. చైతన్యవంతమైన సమాజం ఉంటేనే ముందుకు పురోగమిస్తాం. భారతదేశాన్ని కులం, మతం పేరుతో విడదీసే ప్రయత్నం జరుగుతోంది. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం చాలా కష్టం. చైనా మాదిరిగా అందరూ కులమత రహితంగా ముందుకు సాగాలి. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి. నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వాళ్లు ఉంటారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం పొరపాటు చేసినా గోస పడతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 58 ఏళ్లు దగా పడ్డాం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మన వనరులు కాపాడుకొని భవిష్యత్‌ తరాలకు అందించాలి'' అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Tuesday, August 16, 2022

కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

*కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం*

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.న్యాయమూర్తులుగా జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, జస్టిస్‌ నగేష్‌ భీమపాక, జస్టిస్‌ పుల్లా కార్తీక్‌, జస్టిస్‌ కాజ శరత్‌, జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. నూతన న్యాయమూర్తులకు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అభినందనలు తెలిపారు.
*కొత్త న్యాయమూర్తుల నేపథ్యమిదీ....*

*జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్‌*
కరీంనగర్‌ మంకమ్మతోటలో 1967 ఆగస్టు 16న జన్మించారు. తండ్రి ఇ.వి.రాజేశ్వర్‌రావు (హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌), తల్లి ఇ.వి.బాలకుమారి (ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు). కరీంనగర్‌ ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1992లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది అదే ఏడాది బార్‌ కౌన్సిల్‌లో నమోదయ్యారు. కొంత కాలం కరీంనగర్‌లో ప్రాక్టీస్‌ చేశారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది దివంగత రామ్‌జెఠ్మలానీ వద్ద జూనియర్‌గా పనిచేశారు. రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు. 2021లో సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.
*జస్టిస్‌ నగేష్‌ భీమపాక*
భద్రాచలంలో మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు భూపతిరావు, శాంతమ్మలకు 1969 మార్చి 8న జన్మించారు. అక్కడే ప్రాథమిక, ఉన్నత విద్యనభ్యసించి ఏలూరు సీఆర్‌ రెడ్డి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. లాలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ను హైదరాబాద్‌ నిజాం కాలేజీలో పూర్తి చేశారు. 1993లో బార్‌ కౌన్సిల్‌లో నమోదై హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. సివిల్‌, క్రిమినల్‌, రాజ్యాంగ, కార్మిక, రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలతో పాటు ఆర్బిట్రేషన్‌ చట్టాలకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, పరిశ్రమల శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
*జస్టిస్‌ పుల్లా కార్తీక్‌*
జగిత్యాలలో ఒగ్గు హనుమంతు, పోచమల్లమ్మలకు 1967 జూన్‌ 4న జన్మించారు. అక్కడి ప్రభుత్వ పాఠశాల,కళాశాలల్లో పాఠశాల విద్యతో పాటు ఇంటర్‌ చదివారు. డిగ్రీ, పీజీలను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఉస్మానియాలోనే లా, ఎల్‌ఎల్‌ఎంలు చదివారు. 1996లో బార్‌కౌన్సిల్‌లో నమోదయ్యాక హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2015లో ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌లో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించి, 2017 నుంచి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

*జస్టిస్‌ కాజ శరత్‌*
భద్రాచలంలో సీతారామయ్య, లలితాంబలకు 1971 జనవరి 29న జన్మించారు. పాఠశాల విద్యతో పాటు డిగ్రీని భద్రాచలంలోనే పూర్తి చేశారు. ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీలో ఎంఏ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1997లో బార్‌కౌన్సిల్‌లో నమోదయ్యాక కొత్తగూడెం, భద్రాచలం జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అనంతరం 2002 నుంచి హైకోర్టులో అన్ని రకాల కేసుల్లోనూ వాదనలు వినిపిస్తున్నారు.

*జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాసరావు*
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 1969 ఆగస్టు 31న జన్మించారు. తండ్రి జె.మాణిక్యరావు. ఉస్మానియాలో బీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1999లో బార్‌కౌన్సిల్‌లో నమోదై హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా కొనసాగుతున్నారు.

*జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు*
మహబూబాబాద్‌ జిల్లా సూదనపల్లిలో ఎన్‌.సత్యనారాయణరావు, గిరిజాకుమారిలకు 1969 జూన్‌ 30న జన్మించారు. పాఠశాల విద్య వరంగల్‌ సరస్వతి శిశుమందిర్‌, కాలేజీ విద్య గోవిందరావుపేటలో పూర్తిచేశారు. పెండేకంటి లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. 2001లో హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, తెలంగాణలో యూజీసీ, ఎస్‌ఎఫ్‌ఐవో, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ట్రైబ్యునల్‌ ప్యానెల్‌ న్యాయవాదిగా, 2019 నుంచి అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా సేవలందిస్తున్నారు. సివిల్‌, ఆర్థిక నేరాలు, కార్పొరేట్‌ లా, మోటారు ప్రమాదాలు, సర్వీసుకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Sunday, August 14, 2022

దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామి..... కేసీఆర్

*దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామి..... కేసీఆర్*

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలను పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారుఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం మాట్లాడారు. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిదని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1.25 కోట్ల జెండాలను ప్రతి ఇంటికీ చేర్చామని.. రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని చెప్పారు.మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నాం. వారి పోరాటాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. అహింసా మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోంది. దేశానికి రాష్ట్రం దిక్సూచిగా మారింది. ఎన్నో అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటోంది. బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ మారింది. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. సాగులో 11.6 శాతం వృద్ధిరేటు సాధించాం. గొర్రెల పెంపకంలో దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచాం. గ్రామీణ జీవన విధానంలో అగ్రస్థానంలో నిలిచాం. 11.1 శాతం వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానంలో ఉన్నాం. దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామిగా నిలిచింది'' అని కేసీఆర్‌ అన్నారు

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Saturday, August 13, 2022

మునుగోడు ఉపఏన్నిక ఎందుకోసం?? ఎవరి లబ్ది కోసం??

*ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది*

*మునుగోడు ఉపఏన్నిక ఎందుకోసం?? ఎవరి లబ్ది కోసం??*

*#మునుగోడు ఉపఎన్నిక సందర్బంగా #తెరాస & #బీజేపీ & #కాంగ్రెస్ పార్టీల ఖర్చు దాదాపు 1000కోట్లు అని రాజకీయ విశ్లేషకుల చర్చ*

*మునుగోడు ఓటరు మహాశయులారా ఆలోచించండి మీ నియోజకవర్గం లో #ప్రభుత్వ బడులు & #ప్రభుత్వ ఆసుపత్రి & #రహదారులు సక్కగా ఉన్నాయా ?? ఇకపోతే #రైతులు సంతోషంగా వున్నారా ?? #నిరుద్యోగులారా మీకేమైన న్యాయం జరిగిందా  ??*

*అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని... గతం మరిచిపోకుండా ఓటు వేయండి*

*మీకు ఏ రాజకీయ పార్టీ నచ్చకుంటే  "నోటా" కు వేయండి... మీ సంకల్పం ఏమిటో దేశానికి సాటిచెప్పండి.... Bplkm🪶*

*Copy to Group link Media*
13/08/2022
*Bapatla Krishnamohan*
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/ 

Friday, August 12, 2022

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

*తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.... రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి!*

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్‌, 30, 31న అగ్రికల్చర్‌, ఫార్మా ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్‌కు 1,56,812 మంది, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
*త్వరలోనే కౌన్సెలింగ్‌: మంత్రి సబిత....!*
ఫలితాలు విడుదల చేసిన అనంతరం మంత్రి సబిత మాట్లాడారు. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌లో 88.34 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆమె చెప్పారు. విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభవుతుందన్నారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కౌన్సెలింగ్‌ సెంటర్‌లో కళాశాలలు, కోర్సుల వివరాలు వెల్లడిస్తారని మంత్రి వివరించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Thursday, August 11, 2022

నేర నిర్ధారణ జరిగిన ప్రజాప్రతినిధులపై.... జీవితకాల నిషేధం

*నేర నిర్ధారణ జరిగిన ప్రజాప్రతినిధులపై.... జీవితకాల నిషేధం*

*పిల్‌ విచారణకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సమ్మతి....!*

దిల్లీ: నేర సంబంధ కేసుల్లో శిక్షపడిన చట్టసభల సభ్యులను అనర్హులుగా ప్రకటించడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలన్న పిల్‌ను విచారణకు చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందినేర నిరూపణ జరిగిన వ్యక్తులను శిక్షించడంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర తారతమ్యత ఉంటుందన్న పిటిషనర్‌ వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసు విచారణకు తేదీని నిర్ణయిస్తామని తెలిపింది. జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమా కోహ్లి ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌కు నేర సంబంధిత కేసులో శిక్ష పడితే అతను శాశ్వతంగా ఉద్యోగాన్ని కోల్పోతాడని, అదే ఒక ప్రజాప్రతినిధి శిక్ష పూర్తయిన ఆరేళ్ల తర్వాత మళ్లీ చట్టసభలకు ఎన్నికవ్వడానికి అర్హుడవుతారని పిటిషనర్‌ అశ్వినీ ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఇందుకు అవకాశం కల్పిస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(1) చట్టబద్ధతనూ పిటిషనర్‌ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల సత్వర విచారణకు దేశంలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌ కూడా సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Tuesday, August 9, 2022

తక్షణమే 50లక్షల వ్యాక్సిన్ లు పంపండి కేంద్రానికి.....మంత్రి హరీష్ రావు లేఖ

*తక్షణమే 50లక్షల వ్యాక్సిన్ లు పంపండి కేంద్రానికి.....మంత్రి హరీష్ రావు లేఖ*

హైదరాబాద్: తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత ఉందని.. వెంటనే పంపాలని కేంద్రాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు.ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు ఆయన లేఖ రాశారు. రోజుకు 1.5లక్షల డోసులు మాత్రమే పంపిణీ చేస్తున్నామని.. డిమాండ్‌కు సరిపడా వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా కావడం లేదన్నారు. తక్షణమే 50లక్షల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ డోసులను తెలంగాణకు పంపాలని కేంద్రమంత్రిని కోరారు. వ్యాక్సినేషన్‌లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Monday, August 8, 2022

9 నుండి 21 వ తేదీ వరకు అన్ని థియేటర్లలో 'గాంధీ' మూవీని స్పెషల్ షో..ఉచితంగా

*9 నుండి 21 వ తేదీ వరకు అన్ని థియేటర్లలో 'గాంధీ' మూవీని స్పెషల్ షో..*

*ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఐదవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులందరికీ ఉచితం.*

*వివిధ శాఖలకు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశాలు.*

రంగారెడ్డి జిల్లా:స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్న నేపథ్యంలో, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ కోర్టుహాల్ లో వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ అమోయ్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వజ్రోత్సవాల్లో భాగంగా నేటి నుండి 22వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు.తొలి రోజున ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఉత్సవాలు ప్రారంభిస్తారని,9న జిల్లా స్థాయిలో నిర్వహించే సమావేశానికి మండల స్థాయి ముఖ్య అధికారులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.ఈ నెల 9 నుండి 21 వ తేదీ వరకు అన్ని థియేటర్లలో 'గాంధీ' మూవీని స్పెషల్ షోగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రదర్శించబడే గాంధీ మూవీకి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా ప్రవేశం కల్పించాలన్నారు.థియేటర్ల సంఖ్యకు అనుగుణంగా, ఆయా పాఠశాలల వారీగా విద్యార్థులను థియేటర్లలో గాంధీ మూవీని చూపించాలని, ఈ సందర్భంగా విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, 10వ తేదీన నియోజకవర్గాల స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీ, వార్డు పరిధిలో వన మహోత్సవం కార్యక్రమం చేపట్టి ఒకే చోట కనీసం 750 చొప్పున ఆకర్షణీయమైన మొక్కలు నాటాలని ఆదేశించారు. ఆ ప్రాంతాన్ని ఫ్రీడమ్ పార్క్ గా సంబోధించడం జరుగుతుందన్నారు. 11న మున్సిపల్, మండల స్థాయిలో ఫ్రీడమ్ రన్ నిర్వహించాలని, 12న జాతీయ సమైక్యతా రక్షాబంధన్, 13న ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఉద్యోగులతో ర్యాలీలు నిర్వహించి మైదానాల్లో త్రివర్ణ బెలూన్లను ఎగుర వేయాలన్నారు. 14న జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో జానపద కళాకారుల ప్రదర్శనలు, బాణాసంచా కాల్చడం, 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 16న అన్ని ప్రాంతాల్లో నిర్ణీత సమయంలో సామూహిక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనం, 17న జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం, 18 ఉద్యోగులు, యువతకు ఫ్రీడమ్ కప్ పేరిట క్రీడా పోటీల నిర్వహణ, 19న అనాధ, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులు, జైళ్లలో పండ్ల పంపిణీ, 20న స్వయం సహాయక సంఘాలు, మహిళలకు రంగోలి పోటీలు నిర్వహించడం జరుగుతుందని, 22న హైదరాబాద్ లోని ఎల్.బీ స్టేడియంలో ముగింపు సంబరాలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని స్థాయిలలో అధికారులు ఈ ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలను అనుసరిస్తూ వాటి నిర్వహణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. 15వ తేదీన ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసేలా ఇంటింటికి జెండాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్, హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ హరిప్రియ, హైదరాబాద్ డిఆర్ఓ సూర్యలత, జిల్లా విద్యాధికారులు, పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Sunday, August 7, 2022

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం.... పవర్ కట్......!

*రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం.... పవర్ కట్......!*

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పవర్ కట్ (Power Cut) నిర్వహిస్తున్నట్లు పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్  విద్యుత్ జేఏసీ ప్రతినిధులు  ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వ  ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు‎ కు నిరసనగా మహాధర్నా  చేపడుతున్నట్లు తెలిపారు. మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నేతలు మాట్లాడుతూ ''కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 8న (సోమవారం) పార్లమెంట్‌లో విద్యుత్ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించాలి. ఒక వేళ విద్యుత్ సరఫరా‎లో అంతరాయం వస్తే పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతాం. దానికి వినియోగదారులు సహకరించాలి. విద్యుత్ బిల్లును ప్రవేశపెడితే విధులు బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగుతాం.'' అని హెచ్చరించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల డిమాండ్లు.... న్యాయమైనవే..... గవర్నర్ తమిళిసై

*బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల డిమాండ్లు.... న్యాయమైనవే..... గవర్నర్ తమిళిసై*

బాసర: బాసర ట్రిపుల్‌ ఐటీ  విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై తన వంతు ఒత్తిడి తీసుకొస్తానని గవర్నర్‌ తమిళి సై  స్పష్టం చేశారుసమస్యల పరిష్కారం కోసం పిల్లలు ఎండలో, వానలో నిరసన తెలపడం ఒక తల్లిగా తనను కలిచి వేసిందని.. అందువల్లే ఓ అమ్మగా వచ్చి ఇక్కడి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. ఆదివారం నిర్మల్‌ జిల్లా ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్‌ ఐటీతో పాటు నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని గవర్నర్‌ సందర్శించారు. మొదటగా గవర్నర్‌ నిర్మల్‌ జిల్లా ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్‌ ఐటీని గవర్నర్‌ సందర్శించారు. ఉదయం వేళ విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. విద్యార్థి వసతి గృహలు, తరగతి గదులు, భోజన శాలలన్నింటినీ పరిశీలించారు. సుమారు నాలుగు గంటల పాటు గవర్నర్‌ ట్రిపుల్‌ ఐటీలో గడిపారు. ఆ తర్వాత విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ట్రిపుల్‌ ఐటీలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరారు. నాణ్యమైన భోజనం అందడం లేదని, లైబ్రీలో సరైన సౌకర్యాలు లేవని, గత కొన్నేళ్ల నుంచి స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌ జరగడం లేదని గవర్నర్‌ దృష్టికి తెచ్చారు

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Saturday, August 6, 2022

అక్కడికి(OU) వెళ్లడానికి కేసీఆర్ ఎందుకు ఆసక్తి చూపించడం లేదు

అక్కడికి(OU) వెళ్లడానికి కేసీఆర్ ఎందుకు ఆసక్తి చూపించడం లేదు

Courtesy by : V6 మీడియా 
అక్కడికి వెళ్లడానికి కేసీఆర్ ఎందుకు ఆసక్తి చూపించడం లేదు?

మనం చదువుకున్న స్కూలో, కాలేజీలోనో ఏదైనా కార్యక్రమానికి మనను గెస్ట్ గా పిలిస్తే ఎంత సంతోషపడతాం. అక్కడి వెళ్లి వేదికపై మాట్లాడటం.. గొప్పగా భావిస్తాం. అది చదువుకున్న ప్లేసే కాదు.. ఆయన ఎదగడానికి పునాది కూడా అదే. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అక్కడికెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు.

అమ్మలా విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా....గవర్నర్ తమళిసై

*అమ్మలా విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా....గవర్నర్ తమళిసై*

బాసర: ఒక అమ్మలా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే బాసర వచ్చానని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై చెప్పారు. గతకొన్ని రోజులుగా బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గవర్నర్‌ అక్కడ పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా సరస్వతీ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. ఆలయంలో గవర్నర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కుంకుమ పూజ, మహాహారతి నిర్వహించారు. అమ్మవారి చరిత్రను వేద పండితులను అడిగి తెలుసుకున్నారు. ఆలయం తరఫున ఈవో సోమయ్య గవర్నర్‌ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భగా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానని చెప్పారు. ట్రిపుల్ఐటీలోని సమస్యలపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు తనకు ఫిర్యాదు చేశారన్నారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్‌ వెల్లడించారు. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ట్రిపుల్‌ ఐటీలోకి మీడియాకు పోలీసులు అనుమతించలేదు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

ఉస్మానియా ఆస్పత్రిలో మహిళపై దాడి

Hyderabad Crime: ఉస్మానియా ఆస్పత్రిలో మహిళపై దాడి 


Courtesy by : Sakshi Media 
మహిళను కొడుతున్న డ్రైవర్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిలో ఓ మహిళపై దాడి చేసిన ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్‌ ఆరీఫ్‌ను అఫ్జల్‌గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్లు ఆస్పత్రి ప్రధాన గేటు ఎదుట, మార్చురీ వద్ద తిష్టవేసి రోగులను ముక్కుపిండి మరీ అధిక డబ్బులు వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆస్పత్రి ఆవరణలో ఫరీనా (45) అనే మహిళతో డ్రైవర్‌కు స్వల్ప వివాదం చోటు చేసుకుంది.

దీంతో అతను ఆమెపై దాడి చేసి, పక్కనే ఉన్న సెక్యురిటీతో కర్ర తీసుకొని కొట్టాడు. ఈ సంఘటనను గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. అఫ్జల్‌గంజ్‌ పోలీసులు ఆరీఫ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో తిష్టవేసి రోగులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌  నాగేందర్‌ తెలిపారు. 

Friday, August 5, 2022

అసెంబ్లీ..... రద్దు....??

*అసెంబ్లీ..... రద్దు....?*

హైదరాబాద్‌, ఆగస్టు,: మునుగోడు ఉప ఎన్నికల కంటే ముందే మొత్తం అసెంబ్లీని రద్దు చేసేస్తే? ముందస్తు ఎన్నికలకు వెళ్తే? టీఆర్‌ఎ్‌సలో ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఇదే.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే... బీజేపీ చేతిలో ఓడిపోతే... ఇక రాష్ట్రవ్యాప్తంగా సంచలన పరిణామాలు, భారీగా వలసలకు అది కారణమవుతుంది. దానికి మించి బీజేపీ బలంగా ఉందన్న సంగతి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మనసుల్లో నాటుకుపోతుంది. అందునా.. బీజేపీ బలంగా లేదని భావిస్తున్న నల్లగొండ జిల్లాలోనే ఆ పార్టీ గెలిస్తే ఒక్కసారిగా రాజకీయ వాతావరణమే మారిపోతుంది. ఊహించని పరిణామాలు తెర మీదకు వస్తాయి. పైగా మునుగోడు ఉప ఎన్నిక విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కాకుండా ఏకంగా కేంద్ర పార్టీనే రంగంలోకి దిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా దగ్గరి నుంచి ప్రతి వ్యవహారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కనుసన్నల్లోనే జరిగింది. 'రాజీనామా చేయండి, ఉప ఎన్నికల్లో గెలిపిస్తాం' అన్న భరోసా అక్కడి నుంచే వచ్చింది. అంటే ఈ ఎన్నికలపై హుజూరాబాద్‌ కంటే సీరియ్‌సగా బీజేపీ అధినాయకత్వం దృష్టి పెట్టనుందని స్పష్టమైంది. అలాంటి పరిస్థితుల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే, ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో పరిస్థితి చేజారి పోతుందే మోనన్న ఆందోళన టీఆర్‌ఎ్‌సలో ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో ఫలితాలు ఎలాగైనా ఉండొచ్చు.

ఆ సంకేతాలు రాష్ట్రం మొత్తం చేరకముందే, మునుగోడు ఉప ఎన్నికలనే సెమీ ఫైనల్‌ను ఆడకుండా నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోతే బాగుంటుందనే ఆలోచన అధికార పార్టీలో కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన టీఆర్‌ఎ్‌సకు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు కొత ్త కాకున్నా... నెల రోజుల క్రితం ఆయన తనకు తానుగా ముందస్తు ఎన్నికల సవాల్‌ను విసిరారు. దానిపై కొంత కలకలం రేగింది. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా సై అంటే సై అన్నాయి. తాము అసెంబ్లీని రద్దు చేసేందుకు సిద్ధమేనని, ఎన్నికల తేదీలను ఇప్పుడే ప్రకటిస్తేనే చేస్తామంటూ టీఆర్‌ఎస్‌ కౌంటర్‌ ఇచ్చింది. దీంతో ఆ అంశాన్ని అప్పటికి అలా ముగించేశారు. అయితే, ఇప్పుడు మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికలు అనివార్యమైన నేపథ్యంలో అదే ముందస్తు ప్రతిపాదనపై ఆ పార్టీలో తాజా చర్చకు తెర లేచిందని సమాచారం. ప్రగతి భవన్‌ లాబీల్లో కూడా కొందరు కీలక నేతల మధ్య ఈ చర్చ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, అఽధినేత కేసీఆర్‌ నోటి నుంచి మాత్రం దీనిపై నేతల వద్ద ఎలాంటి మాట బయటకు రాలేదు. ఈటల రాజేందర్‌ రాజీనామాతో జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నాటికి టీఆర్‌ఎ్‌సలో అత్యంత ధీమా కనిపించేది. ఆ ఎన్నికలను పార్టీ అత్యంత ధీమాతో ఎదుర్కొంది. బీజేపీని, రాజేందర్‌ను ఓడించగలమనే బలమైన విశ్వాసంతోనే ఎన్నికలకు వెళ్లింది.

ఫలితం ప్రతికూలంగా వచ్చినాపోరాటం మాత్రం గెలుపుపై నమ్మకంతో, ధైర్యంగా చేసింది. పార్టీ పరంగానే కాకుండా...రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా సర్వశక్తులూ ఒడ్డింది. అనేక ఉచిత పథకాలను ప్రకటించింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్న దళితబంధు పథకం ఆ ఉప ఎన్నికల్లోనే పుట్టింది. ప్రతి గ్రామానికి కొత్తరోడ్లు వేశారు. కొత్త రేషన్‌కార్డులు, కొత్త ఫించన్లు...ఒకటేమిటి? ఏదంటే అది ఇచ్చేశారు. అయినా ఉప ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. దాంతో ఇప్పుడు మళ్లీ మునుగోడు ఉప ఎన్నికలకు వెళ్లేందుకు ఆ ధైర్యం, స్థైర్యం అదే ఆత్మవిశ్వాసం ఉన్నాయా? అంటే లేవనే పరిస్థితే నెలకొంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే! అన్న ఆలోచనే ఆ పార్టీని భయంలోకి నెట్టేస్తోంది. గెలుపు మనదే అన్నంత ధీమా కనిపించడం లేదు. అది కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానం అయినా... అధికారంలో ఉన్న పార్టీగా ఉప ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్యత టీఆర్‌ఎ్‌సది. అది కూడా పక్కన పెడితే బీజేపీ తమకు పోటీ కాదని, ఆ పార్టీ తమను ఓడించలేదని వచ్చే సాధారణ ఎన్నికల్లో ఘంటాపథంగా చెప్పాలంటే ఈ ఉప ఎన్నికల్లో విజయం తప్పనిసరి. రాజకీయ బలాబలాల్లో తేడా వస్తే గోడ దూకేసేందుకు సిద్దంగా ఉన్న నేతల్ని నిలువరించాలన్నా కూడా గెలిచి తీరాలి. ఈ తప్పనిసరి పరిస్థితే ఇప్పుడు టీఆర్‌ఎ్‌సలో భయాన్ని నింపుతోందనే వాదన ఉంది. ఇంత సవాల్‌ను ఎదుర్కోవడం బదులు అసెంబ్లీని రద్దుచేసి సాధారణ ఎన్నికలకు వెళ్లిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.

*బీజేపీ గెలిస్తే.. ఇక విస్ఫోటమే...*
వాస్తవానికి ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ అంచనాల ప్రకారమే నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీకి బలం లేదు. మిగతా జిల్లాల్లో ఆ పార్టీకి కొన్నిచోట్ల బాగా బలం, మరి కొన్నిచోట్ల కొంతమేర మాత్రం బలం ఉందనేది అంచనా. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రం కచ్చితంగా బీజేపీకి ఇప్పటికైతే బలం లేదు. మరి అలాంటి బలం లేని నల్గొండ జిల్లాలోనే బీజేపీ గెలిస్తే ఆ ప్రభావం అణు విస్ఫోటంలా అన్ని వైపులకు వ్యాపిస్తుంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పెద్ద ఎత్తున రాజకీయ చేరికలు చోటు చేసుకుంటాయి. బలం లేని ఆ రెండు జిల్లాల్లో బీజేపీ బలోపేతం కావడమే కాకుండా, ఇప్పటికే బలమున్న మిగతా జిల్లాల్లో మరింత బలోపేతమవుతుంది. ఇదే జరిగితే, ఆ తర్వాత సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడం కత్తిమీద సామే.

ఆ పరిస్థితి రాకుండా, గతం నుంచీ అంటున్న ముందస్తు ఎన్నికల ప్రణాళికను బయటకు తీస్తే, అసెంబ్లీని రద్దు చేసి నేరుగా సాధారణ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆ పార్టీలో నడుస్తోంది. ఇదొక్క ఉప ఎన్నికే కాదు. ఈ ఉప ఎన్నిక అనంతరం కూడా మరికొన్ని ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రె్‌సకు రాజీనామా చేస్తే... ఏకంగా ఎంపీ స్థానానికే ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్రంలో మరో 12 ఉప ఎన్నికలు ఉన్నాయని బహిరంగంగా చెబుతున్నారు. అన్ని ఉప ఎన్నికలు ఉన్నాయా? లేదా అన్నదాన్ని పక్కనపెడితే ఉప ఎన్నికల ద్వారా బీజేపీ విసిరే సవాళ్లను తట్టుకోవడానికి సిద్దంగా ఉండాల్సిందే. వాటిల్లో గెలిస్తే అధికార పార్టీ కదా! గెలిచిందిలే అంటారు. అదే ఓడిపోతే మాత్రం అధికార పార్టీగా ఉండి కూడాఓడిపోయిందంటే ఇక వచ్చే ఎన్నికల్లో కష్టమే అన్న భావనకు ప్రజలు వచ్చేందుకు అవకాశం ఇచ్చినట్లుంటుంది. ఈ నేపథ్యంలో ఉన్నఫళంగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న గతకాలపు ఆలోచనను వర్తమానంలోకి తేవాలన్న వాదన టీఆర్‌ఎస్‌ నేతల్లో వినిపిస్తోంది.

విపక్షాల్లోను మళ్లీ అదే చర్చ

అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందేమో అన్న చర్చ బీజేపీ, కాంగ్రె్‌సలలోను జరుగుతోంది. కేసీఆర్‌ వచ్చే ఏడాది చివరి వరకు ఆగకుండా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే ఎన్నికలకు వెళ్లేలా అసెంబ్లీని రద్దు చేస్తారనే వాదన వచ్చింది. అప్పుడు కేసీఆర్‌ విసిరిన ముందస్తు సవాల్‌కు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా సై అన్నారు. అమిత్‌షా కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చు, సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ మునుగోడు ఉప ఎన్నికలకు కాకుండా ముందస్తు ఎన్నికలకే కేసీఆర్‌ మొగ్గు చూపొచ్చని, దానికి తామూ సిద్ధమేనని విపక్ష పార్టీలు అంటున్నాయి.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

తర్వాత సీఎం అభ్యర్థి మీరేనా.....?

*తర్వాత సీఎం అభ్యర్థి మీరేనా.....?*
*నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఏంటంటే....?*

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల నుంచి సలహాలు తీసుకోవడంతో పాటు, వారి సమస్యలు పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.అంతేకాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. కాలిగాయంతో గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన ఆయన.. తాజాగా ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో '#AskKTR' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
*నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలు.. కేటీఆర్‌ సమాధానాలు*

*ప్రశ్న: మీ ఆరోగ్యం ఎలా ఉంది?* *కేటీఆర్‌*: నేను ఆరోగ్యంగానే ఉన్నా బ్రదర్‌ప్రశ్న: తర్వాతి ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు?తెరాస నుంచి సీఎం అభ్యర్థి మీరేనా?

కేటీఆర్‌: కేసీఆర్‌ గారి రూపంలో సమర్థుడైన సీఎం మనకు ఉన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన హ్యాట్రిక్‌ కొడతారు.

ప్రశ్న: భాజపా నాయకులు ప్రచారంలో దూసుకుపోతుంటే తెరాస పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు?

కేటీఆర్‌: ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ.

ప్రశ్న: నేటి యువత రాజకీయాల్లోకి రావచ్చా?ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయాలపై మీ మోటో ఏంటి? ఎలాంటి నేపథ్యం లేకుండా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరేం చెబుతారు?

కేటీఆర్‌: ప్రస్తుత పరిస్థితుల్లో యువత కచ్చితంగా రాజకీయాల్లో రావాలి. ఎలాంటి నేపథ్యం లేకుండా మన సీఎం సర్‌తో సహా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు.

*ప్రశ్న: సెక్రటేరియట్‌ ఎప్పుడు రెడీ అవుతుంది సర్‌?*
కేటీఆర్‌: దసరాకు సిద్ధమవుతుందని నేను ఆశిస్తున్నా.

కేటీఆర్‌ సర్‌ మిమ్మల్ని బిగ్‌స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నాం. ఏదైనా అవకాశం ఉందా?

కేటీఆర్‌: ఇప్పటివరకూ నా రాజకీయ ప్రసంగాలను చూడకపోతే 'బిగ్‌స్క్రీన్‌'పై చూడొచ్చు.

ఆరు నెలల్లో సీఎం కేసీఆర్‌ మూడుసార్లు ప్రొటోకాల్‌ ఉల్లంఘించారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తే సాదరంగా ఆహ్వానించరా? తెలంగాణ సీఎం.. ప్రధానికన్నా గొప్పవారా? హిందీలో సమాధానం ఇవ్వగలరు!

కేటీఆర్‌: ప్రొటోకాల్‌ను స్పష్టంగా పాటించాం. ప్రైవేటు విజిట్‌లకు వచ్చిన ప్రధానిని సీఎం సాదరంగా ఆహ్వానించాల్సిన అవసరం లేదు. మరొక విషయం దీనిని హిందీలో రాయాల్సిన అవసరం లేదు.

జాతీయ జెండాను వాట్సప్‌ డీపీగా మార్చాలని పీఎం చెప్పడం వల్ల దేశ జీడీపీ పెరుగుతుందా?

కేటీఆర్‌: సామాజిక మాధ్యమాల ప్రొఫైల్‌ పిక్‌ మారిస్తే ఏం జరుగుతుంది? జీడీపీ మారితేనే దేశం ముందుకు వెళ్తుంది.

విద్యుత్‌ రంగంలో సంస్కరణలపై మీ విధానం ఏంటి?
కేటీఆర్‌: భారత్‌ లాంటి దేశంలో సమతుల్యత అనేది అవసరం. పూర్తిగా ప్రైవేటీకరిస్తే రాయితీలు పొందే రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయి.

ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించడంలో ఎంతో గొప్పగా చేస్తున్నారు. కానీ జీహెచ్‌ఎంసీ పరిధిలో దోమల నివారణ ఎందుకు చేయలేకపోతున్నారు?
కేటీఆర్‌: ఈ విషయంలో మనం కూడా మనవంతు కృషి చేయాలి. అందుకే '10 మినిట్స్‌ - 10 ఏఎం' కార్యక్రమాన్ని తీసుకొచ్చాం.

మన రాష్ట్రంలో బ్యాడ్మింటన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇతర క్రీడలనూ ఎందుకు ప్రొత్సహించకూడదు?
కేటీఆర్‌: తప్పకుండా చేద్దాం.

తర్వాత వచ్చే ఎన్నికలకి మన ప్రత్యర్థిగా ఏ జాతీయ పార్టీతో పోరాడాలి?రెండు జాతీయ పార్టీలతో ఒకేసారి యుద్ధం సాధ్యమేనా?మన ప్రధాన ప్రత్యర్థిగా ఎవరిని చూడాలి?
కేటీఆర్‌: జాతీయ పార్టీలే ఎందుకు? పోరులో ఇంకా చాలా మంది ఉన్నారు.

తెలంగాణ అంటే హైదరాబాద్‌ ఒక్కటే కాదు.. జిల్లాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయాలి సర్..
కేటీఆర్‌: అన్ని జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించాం బ్రదర్‌.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్..... దాసోజు శ్రవణ్......గుడ్ బై....!

*తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్..... దాసోజు శ్రవణ్......గుడ్ బై....!?*

హైదరాబాద్‌: తెలంగాణలో రాజ్‌గోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌ ముగియకముందే.. కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగలనుందా?. కాంగ్రెస్‌ పార్టీకి వీడేందుకు ముఖ్యనేత దాసోజు శ్రవణ్‌ నిర్ణయించుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది.ప్రస్తుతం ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్‌.. గత ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ కూడా చేసి ఓడిపోయారు. అయితే..

పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఈ పరిణామంపై దాసోజు శ్రవణ్‌ అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయంత్రం ప్రెస్‌ మీట్‌ నిర్వహించి.. తన రాజీనామా నిర్ణయాన్ని దాసోజు శ్రవణ్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Thursday, August 4, 2022

హైదరాబాద్ కు భారీ వర్ష సూచన

*హైదరాబాద్ కు భారీ వర్ష సూచన*

హైదరాబాద్.....ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం నగరంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.సాధారణ జనజీవనం స్తంభించింది. వర్షంతో పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఇక్కట్లు తలెత్తాయి. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.ఎగువ ప్రాంతాల్లో తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలతోపాటు మూసీలోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు గండిపేట్‌ జలాశయంలోనికి 1800 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. ఆరు గేట్లను ..నాలుగు అడుగుల మేర తెరచి 2328 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. హిమాయత్‌సాగర్‌లోనికి 2500 క్యూసెక్కుల వరద నీరు చేరగా..నాలుగు గేట్లను రెండు అడుగుల మేర తెరచి 2532 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి ప్రకటించింది.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Wednesday, August 3, 2022

ఉచితాలకు అడ్డుకట్ట వేద్దాం...... కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

*ఉచితాలకు అడ్డుకట్ట వేద్దాం...... కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన*

*మార్గాలపై మేధోమథనం చేయండి*

*విపక్షాలతో, సంస్థలతో చర్చించండి*

న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు చేసే ఉచిత వాగ్దానాలు తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.వీటిని వ్యతిరేకించడానికి, పార్లమెంటులో చర్చించడానికి ఏ పార్టీ కూడా ఇష్టపడదు. ఇవి కొనసాగాలనే కోరుకుంటుంది. కాబట్టి ఈ పోకడకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఫైనాన్స్‌ కమిషన్, ఆర్‌బీఐ వంటి సంస్థలు మేధోమథనం చేసి నిర్మాణాత్మక సూచనలివ్వాలి.

విపక్షాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి'' అని సూచించింది. ఉచిత పథకాలను ప్రకటించే పార్టీల గుర్తింపును, వాటి ఎన్నికల గుర్తును రద్దు చేసేందుకు ఎన్నికల సంఘానికి అధికారాలు కల్పించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ్‌ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మానసం బుధవారం విచారణ జరిపింది.

ఈ విషయంలో ఏమీ చేయలేమని మాత్రం కేంద్రం, ఎన్నికల సంఘం చెప్పొద్దని, కూలంకషంగా పరిశీలించి సలహాలివ్వాలని స్పష్టం చేసింది. పిల్‌లో లేవనెత్తిన అంశాలకు కేంద్రం కూడా మద్దతిస్తోందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు. ''ప్రజాకర్షక పథకాలతో ఇష్టారీతిన ఉచితాల పంపకం మున్ముందు ఆర్థిక వినాశనానికి దారి తీస్తుంది. ఉచితాల ద్వారా తన కుడి జేబులోకి కొంత వస్తున్నా తర్వాత్తర్వాత ఎడమ జేబుకు ఎంత కోత పడుతుందో సగటు పౌరుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు.

కనుక ఓటర్లు తమ ఓటు హక్కును తెలివిడితో ఉపయోగించుకునే వీల్లేకుండా పోతుంది'' అంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఈ అంశం ఈసీ పరిధిలోనిదని ఇప్పటిదాకా కేంద్రం చెబుతూ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశమై కేంద్రానికి సలహాలిచ్చేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలిస్తామని ధర్మాసనం సంకేతాలిచ్చింది. దీనిపై గురువారం కూడా విచారణ కొనసాగనుంది.

*సుజీవన్ వావిలాల🖋️*
ప్రజల పక్షం 

Tuesday, August 2, 2022

బాసర @sgc_rguktb లో మళ్ళీ ఫుడ్ పాయిజన్..!!

బాసర @sgc_rguktb లో మళ్ళీ ఫుడ్ పాయిజన్..!!
గుట్టుచప్పుడు కాకుండా త్రిబుల్ ఐటీ హాస్పిటల్లో చికిత్సలు.
బాసర త్రిబుల్ ఐటీ లో గత పదిరోజుల క్రితమే ఫుడ్ పాయిజన్ జరిగి వందలాది మంది విద్యార్థులకు అస్తవ్యస్త గురికాగా,నిజామాబాద్ నిర్మల్ హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స అందించారు.అది మరువకముందే మరో నలుగురు  విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగినట్లు. అంతర్జాలం ద్వారా విద్యార్థులు పంపిన ఫోటోలు ప్రకారం తెలుస్తుంది. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులను త్రిబుల్ ఐటీ ఆస్పత్రిలోనే చికిత్స నిర్వహిస్తూన్నారని,కొందరు పేరెంట్స్ పంపిన వివరాలు ప్రకారం తెలుస్తోంది. త్రిబుల్ ఐటీ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తూ విద్యార్థుల విద్యార్థులతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.ఆరోగ్యం క్షీణిస్తున్నా విషజ్వరాలు వస్తున్నా,సమాచారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.
#askktr @sdf4thepeople @rayadasm  @AnooradhaR #Balalahakkulasangham
 ... #SaveRGUKT
 @1cbe3fccfebe443
@TSEduDept
@RSPraveenSwaero @RamaNishani @BarathalaSwapna

https://t.co/p9Jpl3wtrP https://t.co/PFvGDNYnSC

Monday, August 1, 2022

ఈ రోజు (9 - 11)ఆ రెండు గంటలు బయిటికి రావద్దు

 ఆ రెండు గంటలు బయటికి రావొద్దు.. ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక

ఆ రెండు గంటలు బయటికి రావొద్దు.. ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
Courtesy by : Disha Web  2 Aug 2022 8:51 AM దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. నేడు నగరానికి భారీ వర్ష సూచన ఉందని.. ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య భారీ వర్షం పడే అవకాశం ఉందని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. కావున ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాలు పడటం వల్ల వరద నీటితో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రోడ్లపై చేరే వరద నీరు వెళ్లేందుకు కనీసం గంట సమయం పడుతుందని.. కనుక వర్షం తగ్గిన గంట తర్వాత ప్రజలు బయటకు రావాలని సూచించారు. వరదలు ఎక్కువగా ఉండే రూట్లలో ప్రయాణించకుండా వాహనాదారులు ఇతర మార్గాల్లో ప్రయాణించేలా చూసుకోవాలని సీపీ రంగనాథ్ తెలిపారు.

న్యాయవాది దారుణ హత్య


న్యాయవాది దారుణ హత్య

న్యాయవాది దారుణ హత్య
  • కాపు కాసి మట్టుపెట్టిన దుండగులు
  • సుపారి హత్యగా పోలీసుల అనుమానం
  • ములుగు జిల్లాలో తీవ్ర కలకలం

ములుగు, ఆగస్టు1(నమస్తే తెలంగాణ)/ములుగు రూరల్‌: భూ వివాదాలు, ఎర్రమట్టి మైనింగ్‌ వ్యవహారాలు ప్రముఖ న్యాయవాది, మైనింగ్‌ వ్యాపారి హత్యకు దారితీశాయి. సోమవారం రాత్రి జిల్లాకేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోజాతీయ రహదారిపై జరిగిన హత్యతో ములుగు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాలలోకి వెళితే… జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండకు చెందిన ప్రముఖ న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి (56) హనుమకొండలోని అడ్వకేట్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

ములుగు జిల్లా పరిధి మల్లంపల్లిలో ఎర్రమట్టి మైనింగ్‌ వ్యాపారం చేస్తూ అంచలంచెలుగా ఎదిగాడు. దీంతో పాటు శ్రీనగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద పెట్రోల్‌ బంక్‌ను సైతం నిర్వహిస్తూ మల్లంపల్లిలో సుమారు 280 ఎకరాల మైనింగ్‌ భూములకు యజమానిగా మారాడు. ఇదే క్రమంలో న్యాయవాదిగా హనుమకొండ, ములుగు కోర్టులలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

సోమవారం ములుగుకు వచ్చి తిరిగి తన వాహనంలో డ్రైవర్‌ సారంగంతో కలిసి హనుమకొండకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ములుగు దాటిన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందికుంట క్రాస్‌ వద్ద కాపు కాసిన ఐదుగురు గుర్తుతెలియని దుండగులు కారు ఆపి మల్లారెడ్డిపై విచక్షణారహితంగా కత్తులతో నరికి హత్యచేశారు. అనంతరం కత్తిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.


Hyderabad: Musi river is flooding more now due to encroachments

Hyderabad: Musi river is flooding more now due to encroachments

The Musi river in Hyderabad has been flowing, as both the Osman Sagar and Himayat Sagar lakes, which were built to prevent water from entering the river about a decade ago, have been reaching their full tank levels from the last three years.

Hyderabad: Over the past week, many gates of the Osman and Himayat Sagar reservoirs have been lifted to release excess rainwater once both the lakes were full. As a result, several homes built on the downstream riverbed of the Musi river have been flooded, and thousands of people have been affected.

The activists here in Hyderabad also are opposing the release of water from both the lakes in the Musi river before the water reaches the Full Tank Level (FTL). In fact, due to heavy rains water was released from the Himayat Sagar for the third consecutive year this time since 2020. That it was released in 2010. Similarly, water from the Osman Sagar was released for the second consecutive year.

Noted activist Lubna Sarwat, through a press statement, said that Hyderabad Metropolitan Water Supply and Sewerage Board’s (HMWS&SB) move is “illegal and immoral”. The FTL level of Himayat Sagar is 1,763.5 feet while for Osman Sagar is 1,790. Both lakes were essentially built to stop water from flooding Hyderabad after the great Musi river floods in 1908. About 15,000 people are said to have died in it.

Sarwat complained that the present FTL marked by the authorities is due to the shrinkage of the water bodies. “The storage capacities are down due to vast encroachments in Himayat Sagar and Osman Sagar by the land mafia,” she added. The Musi river runs across a 50-kilometre-odd radius around Hyderabad and has been more or less turned into a sewer today.

Several illegal constructions in catchment areas – Fact Finding report

With the help of a report of a fact-finding visit, Sarwat stated that there were constructions, compound walls, fences and vast land stretches inside the FTL boundaries of both lakes. FTL pillars of HMWS&SB had been found uprooted, she claimed. “The authorities must take up dredging of landfills inside the FTL boundaries and remove all encroachments. Both Osman Sagar and Himayat Sagar, which are tributaries of the Musi river, must be brought back to their original water holding capacity, she added. 

Another activist, who did not want to be named, said that large-scale encroachments of the lakes began years ago. “The catchment areas of the Osman Sagar and Himayat Sagar began before the relaxation of GO 111. The catchment area of Himayatsagar and Osmansagar, according to the government agencies, is about 584 sq km i.e., 58,400 hectares. Because of all this, the Musi river in Hyderabad gets flooded easily,” he added.

A total of 84 villages in Shamsabad, Moinabad, Chevella, Rajendernagar, mandals mainly fall in catchment areas as per the now revoked G.O 111. In recent years, a lot of real estate activity started in these mandals with ventures coming up on acres of land. Plots have also been sold for villas and farmhouses and other developmental activities near the Osman Sagar and Himayat Sagar. What is happening is ironic, given that these two lakes are supposed to protect Hyderabad from the Musi river during rains.

Realtors were waiting for GO 111 or be scrapped

Realtors from and around Hyderabad were confident that the state government revoke GO 111. It finally happened this year and has paved the way for a real estate boom. With that, as more construction happens, rainwater will fill up the Osman Sagar and Himayat Sagar sooner. That will lead to the water board having to release water into the Musi river sooner. Finally, homes on riverbeds of the Musi in Hyderabad will be frequently flooded. 

“After real estate activity picked up across mandals, small ponds, village tanks, wells and other water bodies were filled up by developers. Due to that, several water storage points in the catchment areas of Osman Sagar and Himayat Sagar have disappeared. Both lakes now fill up faster and Hyderabad is likely to get flooded more easily,” added the activist.

The Himayat Sagar feeds on the river stream Esa while the Osman Sagar on the river Musa (both together meet at Tipu Khan bridge, and are hence called Musi). Very few people are aware that Esa is the tributary of the Musi river and that it originates somewhere near Pargi. Musa river originates from Vikarabad at Ananthagiri Hills, about 90 kilometres from Hyderabad.

Compared to the catchment areas around Osman Sagar, there are more encroachments around Himayat Sagar. It is higher in the Shamshabad mandala, said, activists. If water is not released from Himayat Sagar due to rains, colonies in Shamshabad are likely to get submerged. Rainwater from Muchintala in Shamshabad also makes its way to the Himayat Sagar. Similarly, the water from Moinabad mandal and Shankarpally mandal makes its way to Osman Sagar. 

Osman & Himayat Sagar have gone dry in the past

Both the reservoirs were constructed by building dams on the Musi (also known as Moosa) river and Esa River to protect Hyderabad from floods. The proposal to build the dams came after a major flood during the reign of the sixth Nizam Mahbub Ali Khan (1869-1911) in 1908, in which more than 15,000 people were killed.

Recently the Telangana government revoked GO 111 as it was felt Hyderabad no longer depends on these two reservoirs for water supply. Hence, it said that there was no need to continue with the restrictions on development in the catchment radius of the Himayat Sagar and Osman Sagar, both of which are tributaries of the Musi river.

Hyderabad’s drinking water requirement has increased to more than 600 million gallons per day (MGD). It is being drawn from other sources including the Krishna River. Water from the Osman Sagar and Himayat Sagar reservoirs amounts to just about 1 percent of the daily requirement.

Activist Dr Lubna Sarwath, who is also the president of the Water Resources Council, said that before the government revoked GO 111, there were already over 10,000 illegal constructions around the two lakes. The Osman Sagar and Himayat Sagar, along with several other smaller water bodies in Hyderabad, are victims of real estate encroachments. The riverbed of the Musi river has also been occupied by thousands of people now, many of whom have built cement homes. 

As per the EPTRI Study Report of 2007, inflows into the Osman and Himayat Sagar lakes were dwindling. Both had become defunct for a while, as the Musi river continued to work as a sewer for Hyderabad. Many times both lakes have dried up ( reduced to their ‘dead storage levels’) due to massive obstructions and diversions of inflows due to the construction of check dams/water harvesting structures. There are more than 28000 such structures in number for the 2 lakes in their entire catchment areas.

‘Govt should act’

However, with unprecedented rainfalls over the last three years, inflows have sharply increased into the Osman and Himayat Sagar. “Had the authorities prevented encroachments and illegal structures in the catchment areas, it would not have been this way. The government should have protected small water bodies that stored water as well. Then the situation would not have been so bad for colonies on the river bed of the Musi river,” points out another activist. 

With doors of the Musi River being opened like never before in the last 20 years, low-lying areas are getting inundated across Hyderabad. The city administration itself is not aware of the magnitude of the damage it might cause. Several areas alongside the Musi River at Chaderghat, Moosarambagh, Nagole and beyond bear brunt of the disproportionate release of water.