Wednesday, August 25, 2021

హెచ్‌సీయూ వీసీగా ప్రొఫెసర్‌ ఆర్‌ఎస్‌ సర్రాజు

హైదరాబాద్ : 26/08/2021

హెచ్‌సీయూ వీసీగా ప్రొఫెసర్‌ ఆర్‌ఎస్‌ సర్రాజు

హెచ్‌సీయూ వీసీగా ప్రొఫెసర్‌ ఆర్‌ఎస్‌ సర్రాజు

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 


కొండాపూర్‌, ఆగస్టు 25 : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా సెంటర్‌ ఫర్‌ దళిత్‌, ఆదివాసీ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ఎస్‌ సర్రాజును నియమించినట్టు వర్సిటీ యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రొఫెసర్‌ సర్రాజు ఇటీవలే మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా విభాగం హిందీ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమితులయ్యారు. హెచ్‌సీయూలో హిందీ విభాగం హెడ్‌గా విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన సర్రాజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1977లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో హిందీ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌లో ఎంఏ చేశారు. 1990లో ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ లెక్చరర్‌గా విధులు ప్రారంభించిన ఆయన 1996 నుంచి హెచ్‌సీయూలో హిందీ అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు. రష్యా, సౌతాఫ్రికా, యూఎస్‌ తదితర దేశాల్లో ప్రొఫెసర్‌గా సేవలందించారు.

No comments:

Post a Comment