భూమి కోసం అధికారి కాళ్లపై పడ్డ రైతన్న..!
ధరణి సూపర్.. భూ తగాదాలు తగ్గాయి అంటూ గోల్కొండ కోట వేదికగా సీఎం కేసీఆర్ డబ్బాలు కొట్టుకున్నారు. అయితే అదే సమయంలో భూపాలపల్లి జిల్లా కొండాపూర్ కు చెందిన ఓ రైతు జాయింట్ కలెక్టర్ కాళ్లపై పడ్డాడు. తమ భూమికి పట్టా చేయమంటూ వేడుకున్నాడు.
సదయ్య అనే రైతుకు కొండాపూర్ శివారులో 8/151 సర్వే నెంబర్ లో రెండు ఎకరాల 20 గుంటల భూమి ఉంది. ఇది 40 ఏళ్ల నుంచి వారసత్వంగా సాగు చేసుకుంటున్నాడు ఆ రైతు. కానీ.. ములుగుకు చెందిన వ్యక్తి అదే భూమిని రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని పట్టా పొందాడు. ఈ క్రమంలోనే జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలతను కుటుంబసభ్యులతో కలిశాడు సదయ్య.
తమ వారసత్వ భూమిని పట్టా చేయాలని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు. జేసీ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. తమ భూమికి ఎవరో పట్టా పొంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని జరిగిందంతా వివరించాడు.
No comments:
Post a Comment