Wednesday, May 31, 2023

కేసీఆర్ సర్కార్ పైన ఒవైసీ గరం గరం...!

*అడిగిన ఒక్క పని చేయలేదు.... కేసీఆర్ సర్కార్ పైన ఒవైసీ గరం గరం...!*

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌తో ఎంఐఎం పార్టీకి ఉన్న రాజకీయ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏనాడూ అవి ఒకరికొకరు మద్దతు అని ప్రకటించుకున్న దాఖలాలు లేవు.అలాగే పరస్పర విమర్శలకు దూరంగా ఉంటూ వస్తున్నాయి. దీనిని ఆసరాగా తీసుకునే బీజేపీ.. బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై విమర్శలు చేస్తూ వస్తోంది కూడా. ఈ క్రమంలో తాజాగా మజ్లిస్‌ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ మా చేతుల్లో ఉందని కొందరు అంటుండడం హాస్యాస్పదంగా ఉందంటూ అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు. మేం అడిగిన ఒక్క పని కూడా బీఆర్‌ఎస్‌ చేయలేదని పేర్కొన్నాయన. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ తీరుపై ఆగ్రహం వెల్లగక్కారు. 'ఓల్డ్‌ సిటీలో ఎందుకు మెట్రో నిర్మించడం లేద'ని సర్కార్‌ను నిలదీశారు. అంతేకాదు.. దళిత బంధులా.. ముస్లిం బంధు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీపై తొలిసారిగా తీవ్ర విమర్శలకు దిగారు ఒవైసీ. అదీ సూటి విమర్శలతో కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

*సుజీవన్ వావిలాల*🖋️

Tuesday, May 30, 2023

జిల్లాల పర్యటనకు సిద్దమైన.... సీయం కేసీఆర్....!

*జిల్లాల పర్యటనకు సిద్దమైన.... సీయం కేసీఆర్....!*

ఓ వైపు తెలంగాణ దశాబ్ది వేడుకలు... మరోవైపు సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలతో బీఆర్ఎస్ సర్కార్ ఇప్పటి నుంచే ప్రచార పర్వానికి పదును పెట్టింది.ఇప్పటికే ఆత్మీయసమ్మేళనలతో ప్రజల మధ్యలో ఉన్నా గులాబీ లీడర్లకు ఇప్పుడు కేసీఆర్ జిల్లా పర్యటనలు మరింత ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పదేళ్ల పండుగ మరింత కళకళ లాడనుంది.

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. అధికార, విపక్షాలు ఎన్నికలను ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే... హ్యాట్రిక్ కోసం సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు. ఇప్పటి నుంచే తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు.ఇప్పటికే నియోజవకర్గాల వారిగా ఆత్మీయ సమ్మేళనలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా పార్టీ శ్రేణులను సీఎం కేసీఆర్ యాక్టివ్ చేశారు. మండలాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల మధ్య ఉన్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ఈ వేడుకల్లో బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కేసీఆర్ కేడర్‌కు దిశానిర్ధేశం చేశారు. అందుకు అనుగుణంగా 21 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను డిజైన్ చేశారు.

తొలిరోజు అమర వీరులకు నివాళులర్పించి పదేళ్ళ పండుగను మొదలు పెట్టి...జూన్ 22న ప్రతిష్టాత్మంగా నిర్మించిన అమరవీరుల స్మారకస్థూపం ప్రారంభోత్స వేడుకలతో ఈ కార్యక్రమాన్ని ముగించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అయితే పదేళ్ల పండుగలోనే సీఎంకేసీఆర్ జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. దశాబ్ది వేడుకలు ముగిసిన తర్వాత జిల్లా పర్యటనలను మొదలుపెట్టాలని భావించిన సీఎం కేసీఆర్ దాని కంటే ముందే జిల్లా టూర్స్‌కు సిద్దం అయ్యారు.

ఇందులో భాగంగా జూన్ 4న నిర్మల్ జిల్లా, 6న నాగర్‌కర్నూల్, 9న మంచిర్యాల, 12న గద్వాల జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ఈ పర్యటనలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌లను , ఎస్పీ కార్యాలయాలతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలను చేయనున్నారు. ప్రతీ చోట బహిరంగ సభలు ఏర్పాటు చేసి... తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరించనున్నారు.

తెలంగాణలో షెడ్యూల్ పరంగా డిసెంబర్‌లోపు అసెంబ్లీఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నాయి. దీంతో 45 రోజుల ముందే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు పదేళ్ళ పండుగలో ప్రతి రోజు సంబురాలు జరుపుకుంటూనే ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా సీఎం జిల్లాల పర్యటన సాగనుంది.

*సుజీవన్ వావిలాల*🖋️

Monday, May 29, 2023

ధరణి పేరుతో పెద్ద కుట్ర జరుగుతుంది.... గద్దర్....!

*ధరణి పేరుతో పెద్ద కుట్ర జరుగుతుంది.... గద్దర్....!*
తెలంగాణరాష్ట్రంలో ధరణి పేరుతో పెద్ద కుట్ర జరుగుతుందని ఆరోపించారు ప్రజా యుద్ధనౌక గద్దర్. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద అలైన్మెంట్ మార్చాలని త్రిపుల్ ఆర్ బాధ్యత రైతులు కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద రెండు రోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా తొలిరోజు దీక్షలో పాల్గొన్నారు గద్దర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం కాలం నుండే తెలంగాణలో భూ సమస్యలు ఉన్నాయన్నారు.
పంట పెట్టుబడి సాయం పేరుతో బంజరు భూములుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. పశ్చిమబెంగాల్ లో కూడా భూ పోరాటాలు జరిగాయని.. ప్రపంచ యుద్ధాలు కూడా భూమి కోసమే జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణలో గత పదిహేళ్లుగా రైతులు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్న గద్దర్.. భువనగిరి సభ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైందన్నారు. పార్లమెంటులో రైతు చట్టాలు చేస్తే పంజాబ్ రైతులు పోరాడి రద్దు చేశారని.. తెలంగాణలో కూడా అదే విధంగా భూ సేకరణ విధానాన్ని రద్దు చేద్దామన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

లంగనిర్ధారణ పరీక్షలు....18 మంది అరెస్ట్...!

*యథెచ్చగా లంగనిర్ధారణ పరీక్షలు....18 మంది అరెస్ట్...!*

వరంగల్లోని పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో యథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రులపై పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి.
దీంతో ఆయా ఆస్పత్రులపై నిఘా పెట్టిన పోలీసులు.. లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. వీరి నుంచి 18 సెల్ఫోన్లు, రూ. 73 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న లోటస్ ఆస్పత్రి యజమాని, వైద్యులను అరెస్టు చేశామని సీపీ పేర్కొన్నారు. నర్సంపేట కేంద్రంగా పెద్ద ఎత్తున దందా జరగుతోందన్నారు. ఆయుర్వేద వైద్యులు కూడా గర్భస్రావాలు చేస్తున్నారని తెలిపారు. ఈ చర్యలకు పాల్పడుతున్న వైద్యులు, సిబ్బంది అందరినీ పట్టుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే వైద్య శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. గర్భస్రావాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని సీపీ పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వేముల ప్రవీణ్, వేములసంధ్యారాణి, డాక్టర్ బాల్నె పార్ధు, డాక్టర్ మోరం అరవింద, డాక్టర్ మోరం శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్ రెడ్డి, కైత రాజు, కల్లా అర్జున్, డీ ప్రణయ్ బాబు, కీర్తి మోహన్, బాల్నె అశలత, కొంగర రేణుక, భూక్యా అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్ ఉన్నారు. మరికొద్ది
మంది నిందితులు పరారీలో వున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, May 28, 2023

జమ్మికుంట మండలంలో బలగం సినిమా క్లైమాక్స్ సీన్ రిపీట్

*జమ్మికుంట మండలంలో బలగం సినిమా  క్లైమాక్స్ సీన్ రిపీట్*

కరీంనగర్ జిల్లా:మే 28
జమ్మికుంటలో బలగం సినిమా సన్నివేశం రిపీటయ్యింది. ఐదు రోజులనాడు ఆడపిల్లల పండుగ చేసి..కాకికి పెట్టగా సినిమాలో అది ముట్టకపోవటం చూశాం. అందులో అల్లుడు ఫారిన్ మందు తీసుకొచ్చి మొత్తం బాటిల్‌ మందును శాఖ పెడతాడు. అయినా కాకి రాదు. అంతే కాదు.. క్లైమాక్స్‌లో దినకర్మ రోజు కూడా పిట్ట ముట్టదు..చివరికి కొమురయ్యకు ఎంతో ఇష్టమైన ఫొటోను తీసుకొచ్చి పెట్టగానే..పిట్ట వచ్చి భోజనం ముడుతుంది. అయితే.. ఇక్కడ కూడా అలాంటి సన్నివేశమే జరిగింది. తెలంగాణ రాష్ట్రమంతా బలగం సినిమాకు ఎంతగా కనెక్టయ్యిందంటే..ఆ సినిమా చూసి ఏళ్ల కింద విడిపోయిన అన్నదమ్ములు, అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెల్లు.. ఇలా చాలా మంది కలిసిపోయారు. అంతే కాదు..ఆ సినిమా క్లైమాక్స్‌లో జరిగిన సన్నివేశాలే ఇప్పుడు గ్రామాల్లో రిపీటవుతున్నాయి. కరీంనగర్‌జిల్లా ఆబది జమ్మికుంటలో అదే జరిగింది. గ్రామానికి చెందిన పూదరి వెంకటరాజం గౌడ్ 5 రోజుల క్రితం చనిపోయాడు. ఆయన ముగ్గురు కొడుకులు, బంధువులు ఆయనకు ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలన్ని తయారు చేసి కాకికి పెట్టారు. అయితే.. బలగం సినిమాలో చూపెట్టినట్టే..ఆ నైవేద్యాన్ని ఒక్క పిట్ట కూడా వచ్చి ముట్టలేదు. వెంకటరాజం కొడుకులు రకరకాల ప్రయత్నాలు చేశారు.అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇంకేమైనా మర్చిపోయామా..అంటూ చెక్ చేసుకున్నారు.

వెంకటరాజంకు చిన్నతనంలో పేకాట అంటే చాలా ఇష్టమని తెలుసుకొని ఒక ప్లేట్లో పేక ముక్కల కట్టను..వాటితో పాటు 10 రూపాయల నోటును తీసుకొచ్చి పెట్టారు. అది పెట్టిన కొదిసేపటి తర్వాత పక్షి వచ్చి ముట్టింది. ఆహార పదార్థాలను తినడంతో కుటుంబ సభ్యులు మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిచిందని భావిస్తున్నట్లు ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. ఏదిఏమైనా ఒక సినిమా వీరి ఆలోచనా విధానాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది...

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, May 27, 2023

ఎన్టీఆర్ శత జయంతి నివాళులు

*ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్....!*

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి రామకృష్ణతో పాటు పలువురు నివాళులర్పించారు.ఎన్టీఆర్ శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు.. రాజకీయ రంగంలోనూ అగ్రగామిగా వెలుగొందారని తెలిపారు. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, May 26, 2023

ID చిత్రానికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

*_మనోడి IDకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు_*
_★  ‘చార్లీ 777’ని వెనక్కి నెట్టి మరీ.._
_★ ఓక్‌విల్లే ఫెస్టివల్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఆర్ట్‌ లో ప్రదర్శనకు అర్హత_
_★ ఇప్పటికే 37 అవార్డులు గెలుచుకున్న‘ID’ సినిమా_
_★ తక్కువ బడ్జెట్ తో హై రేంజ్ పిక్చర్_
_★ నిర్మాతలలో ఒకరు హర్ష ప్రతాపనేని_
_★ విమర్షకుల ప్రశంసలు_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_తెలుగు చిత్రాల స్టైల్ మారింది. గతంలో అర డజను పాటలు, ఫైట్లతో 'క్రాఫ్ చెదరని' హిరోయిజానికి కాలం చెల్లింది. యువతరం కొత్త ప్రయోగాలతో, విన్నూత్న ఆలోచనలతో దూసుకెళుతోంది. దానికి తోడు అవార్డుల వేటలో కూడా వారు పోటీ పడటం ఆహ్వానించదగ్గ పరిణామం. 'ఐడి' అనే ఈ డార్క్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ చిత్రం అత్యున్నత గౌరవాన్ని గెలుచుకుంది. ‘బలగం’, ‘సీతారామం’ లాంటి తెలుగు సినిమాలను వెనక్కి నెట్టి, విమర్శకుల ప్రశంసలు పొందిన కన్నడ చిత్రం ‘చార్లీ 777’ని ఓడించి ‘ఐడి’ చిత్రం ఈ అవార్డును గెలుచుకుంది._*

*_గతంలో...:_*
_ఓటిటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘గతం’ మేకర్స్ రూపొందించిన రెండవ తెలుగు చిత్రం ‘ఐడి’ అరుదైన గుర్తింపు దక్కించుకుంది.
ఈ సినిమాకు కిరణ్ రెడ్డి కొండమడుగుల దర్శకత్వం వహించారు. చిత్రోమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా  రూపొందింది. హర్ష ప్రతాప్,  సృజన్ యరబోలు (ఎస్ ఒరిజినల్స్)తో కలిసి సుభాష్ రావాడ, భార్గవ పోలుదాసు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో భార్గవ పోలుదాసు, రాకేష్ గలేబే ప్రధాన పాత్రలు పోషించారు.  శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. హాలీవుడ్ డిపి హొరాసియో మార్టినెజ్ సినిమాటోగ్రాఫీ అందించారు. కాటెరినా పిక్కార్డో ప్రొడక్షన్ డిజైన్‌ పనులను పర్యవేక్షించారు. తెలుగు సినిమా ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేశారు._

*_ఇప్పటికే 37 అవార్డులు గెలుచుకున్న‘ఐడి’ సినిమా:_*
_ఇక ఈ ప్రతిష్టాత్మక ‘ఐడి’ సినిమా ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్‌లో సంచలనం కలిగిస్తోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు 37 అవార్డులు అందుకుంది. 31 అఫీషియల్ సెలెక్షన్స్ ను సాధించింది. 5 హానరబుల్ మెన్షన్స్ ను అందుకుంది.  4 నామినేషన్లను పొందింది._

*_ఓక్‌విల్లే ఫెస్టివల్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఆర్ట్‌ లో..:_*
_‘ఐడీ’ సినిమా త్వరలో కెనడియన్ స్క్రీన్ అవార్డ్‌లకు (ఆస్కార్‌ల మాదిరిగానే) క్వాలిఫైయింగ్ ఫెస్టివల్ అయిన ప్రముఖ ఓక్‌విల్లే ఫెస్టివల్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఆర్ట్‌ లో ప్రదర్శించబబడనుంది. ఈ చిత్రం భారత్ తో పాటు  అమెరికాలో మంచి ప్రజాదరణ దక్కించుకుంది._   

*_సంతోషం వ్యక్తం చేసిన ఫిల్మ్ మేకర్స్ బృందం:_*
_ఈ చిత్రానికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం  పట్ల ఫిల్మ్ మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. తాము ఈ సినిమా కోసం పడిన కష్టానికి తగిన ఫలితం లభిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా మరిన్ని అవార్డులను గెలుచుకుంటుందనే దీమా తమకు ఉందని వెల్లడించారు. అటు ఈ చిత్రం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోవడం పై సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ‘చార్లీ 777’ లాంటి కన్నడ చిత్రాలను వెనక్కి నెట్టి ఈ చిత్రం ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఇప్పటికే తెలుగు చిత్రాలు ‘సీతారామం’, ‘బలగం’ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను దక్కించుకున్నాయి. బెస్ట్ మూవీగా ‘సీతారామం’ ఎంపిక కాగా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో ‘బలగం’ చిత్రం అవార్డు అందుకుంది.  ‘బలగం’ చిత్రం అంతర్జాతీయ అవార్డుల వేడుకలో సత్తా చాటింది.  ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డు వేడుకలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది._

*_చివరిగా...:_*
_ఖమ్మం ఏసీపీ గణేష్ పెద్ద కుమారుడే ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన హర్ష ప్రతాపనేని. ఆల్ ద బెస్ట్.విష్ యు గుడ్ లక్._

తెలంగాణ పోలీస్ అత్యుత్సాహం

https://twitter.com/Praja_Snklpm/status/1661994105201901572?t=MGvlkX3Q3YhL7gu_i-1cDQ&s=08                                                                                                       

*#తెలంగాణ @TelanganaDGP సారూ #FriendlyPolicing అంటే ఇదేనా ??..... Bplkm🪶*

*@TelanganaCOPs*
*#Telanganapolice*

*@HRF_Humanrights Respond plz*

*#IndianConstitution #laws*
*#HumanRights #askktr #ktr*

*@Murali_IASretd @RSPraveenSwaero @dr_mvreddy @tkp1080 @zson_bakka @RaviVattem @BplplH*

Thursday, May 25, 2023

జంట నగరాలను కాపాడుకుందాం!!(GO 111)

జంట జలాశయాలను రక్షించుకుందాం !  
జంట నగరాలను కాపాడుకుందాం!! 

జీవో.111 రద్దు పై సదస్సు పిలుపు. 
జీవో  111 రద్దు పర్యవసానాలపై హైదరాబాద్ జిందాబాద్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం, తెలంగాణ  సమాఖ్య, టీఎస్ఎంఎఫ్ ఆధ్వర్యంలో  సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి లోని గురుస్వామి సెంటర్ హాల్లో సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రముఖ పర్యావరణవేత్తలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్ దొంతి  నర్సింహారెడ్డి, రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ కే. బాబు రావు, ఆకునూరి మురళి ఐ.ఏ.ఎస్, హైకోర్టు అడ్వకేట్ రచనా రెడ్డి, హైదరాబాద్ జిందాబాద్ నాయకులు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి,  హైదరాబాద్ జిందాబాద్ నాయకులు ఎం. శ్రీనివాసరావు, ఇంజనీర్ పిట్ల నాగేష్ తదితరులు పాల్గొన్నారు. 
తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు.

111 GO రద్దుతో పట్నానికి పాడె

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు!

*కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు!*
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను కేంద్రం ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వానికి దీటుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో వేడుకలు జరపాలని నిర్ణయించింది.ఈ వేడుకల్లో భాగంగా మువ్వన్నెల జెండా ఆవిష్కరణ, పారా మిలటరీ దళాలు కవాతు చేయనున్నాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పలువురు కేంద్ర మంత్రులు రానున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు భాజపా శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, May 23, 2023

అక్రమ బంగారం

శంషాబాద్....

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా అక్రమ బంగారం గుర్తింపు

రియాద్ నుండి హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద భారీగా అక్రమ బంగారం గుర్తింపు

ప్రయాణికులు అక్రమ బంగారాన్ని పొడిగా తయారుచేసి దానిని షూస్ లో దాచుకొని తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు

నిందితుల వద్ద నుండి బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 1.13.13.558 కోట్లు ఉంటుందని అంచనా వేశారు కస్టమ్స్ అధికారులు

అడ్వకేట్ హత్యకు బిఆర్ఎస్ MLA ప్లాన్

https://youtu.be/quis4qbyjYM                                      
 *#తెలంగాణ లో రాజ్యాంగం కల్పించిన న్యాయమైన #హక్కులకు అనుగుణంగా ప్రశ్నించే వారిమీద ఈ ప్రభుత్వం & #ప్రజాప్రతినిధులు అమానుషంగా దాడులు చేస్తుంటే కండ్లు మూసుకొని వున్న మేధావులారా ఇంకెన్నాళ్లు మౌనంగా వుంటారు ??..... Bplkm🪶*                                            *@TelanganaDGP* *@HRF_Humanrights*    *#JournalistRaghu*                           *#manatolivelugunews*                                           https://twitter.com/Praja_Snklpm/status/1660945356388196353?t=W_p2boglyHMf8wEh1t5_IQ&s=19

Monday, May 22, 2023

డబ్బు బలం చూసుకొని విర్రవీగుతున్న పొంగులేటి.... పువ్వాడ.....!

*డబ్బు బలం చూసుకొని విర్రవీగుతున్న పొంగులేటి.... పువ్వాడ.....!*

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి  డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నాడని మంత్రి పువ్వాడ అజయ్‌  ఆగ్రహం వ్యక్తంచేశారు.బీఆర్‌ఎస్‌లో (BRS) ఉంటూ సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేసిన చరిత్ర పొంగులేటిదని ఆరోపించారు. తనను తాను అతిగా ఊహించుకుంటున్నాడని, ఆయనకు ఓ సిద్ధాంతం, విలువ లేవని విమర్శించారు. ఏ పార్టీలోకి పోవాలో తేల్చుకోలేని దుస్థితిలో పొంగులేటి ఉన్నాడని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో  పువ్వాడ అజయ్‌ ఓటమి ఖాయమని పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా అని ఫైరయ్యారు. పేదలను దోచిన దోపిడీదారులే పొంగులేటి పంచన చేరారని విమర్శించారు. పద్ధతి మార్చుకోవాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) ఎన్నిసార్లు చెప్పినా మారలేదని చెప్పారు.

బీఆర్‌ఎస్‌లో ఉండి బాగా సంపాదించాడని, ఇప్పుడు అదే డబ్బుతో రాజకీయ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొంగులేటి డబ్బులకు ఖమ్మం ప్రజలు అమ్ముడుపోరని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి.. ఇవాళ ఎలాంటి స్థితిలో ఉన్నాడని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లను ఉపయోగించుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పారు. కాంట్రాక్టర్‌గా పనులు చేయకుండానే వందల కోట్లు బొక్కావని ఆరోపించారు. ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేక ఫ్రస్టేషన్‌లో ఉన్నారని, అందుకే బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారని వెల్లడించారు. పొంగులేటి ఆత్మీయ సమావేశాలకు జనాల స్పందన కరువైందని విమర్శించారు. ఖమ్మం అభివృద్ధిమీద కొందరు కడుపులో విషం నింపుకున్నారని చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూత!

*ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూత!*

ప్రముఖ నటుడు శరత్‌బాబు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన బెంగుళూరులో చికిత్స తీసుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. మొదట్లో శరత్ బాబు హెల్త్ నిలకడగానే ఉన్నప్పటికీ.. ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.

శరత్ బాబు.. అసలు సేరు సత్యం బాబు దీక్షితులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకున్న శరత్ బాబు.. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో తనదైన ముద్ర వేశారు. 1973లో రామరాజ్యం సినిమాతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన శరత్ బాబు.. ఇప్పటి వరకు 220కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారు. కన్నెవయసు, మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు శరత్ బాబు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, May 21, 2023

ప్రజల హక్కుల కోసం

*రేపు జరగబోయే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం*

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్లు నిర్మాణానికి ప్రభుత్వం ఉపసంహరించుకున్నందున ఆ యొక్క రిజర్వాయర్ ను నిర్మాణం చేపట్టాలని రేపు అఖిలపక్ష పార్టీలు నిర్వహిస్తున్న మహాధర్నకు మీడియా ద్వారా ఈ కింద పేర్కొనబడిన సంఘాల ప్రతినిధులకు ఆహ్వానం పంపుతున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు, షాద్ నగర్ నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటితోపాటు సాగునీటిని అందిస్తామని నమ్మించి ప్రజల్ని మోసం చేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, ప్రజా వ్యతిరేక విధానాలను, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిఆర్ఎస్ పార్టీ పై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టుటకు షాద్ నగర్ నియోజకవర్గం ప్రజల పక్షాన రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన మనమందరం కూడా నిలబడవలసిన అవసరం ఉంది, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడే మీరు ఈ  న్యాయబద్ధమైన ఈ ప్రజా ఉద్యమానికి మీ మద్దతును ప్రకటిస్తూ ఈ మహాధర్నలో పాల్గొనాలని  కోరుతూ మీడియా ద్వారా ఆహ్వానం పంపుతున్నాం.

*మహాధర్నకు ఆహ్వానింపబడిన ప్రజా సంఘాలు*

1) MRPS
2) T MRPS
3) LHPS
4) నవ తెలంగాణ చైతన్య సమితి
5) బీసీ సంక్షేమ సంఘం
6) రజక సంఘం
7) ముదిరాజ్ సంఘం
8) గౌడ సంఘం
9) మాల మహానాడు
10)అఖిల భారత యాదవ   సంఘం
11) శాలివాహన(కుమ్మర) సంఘం
12) పద్మశాలి సంఘం
13) ఉపాధ్యాయ సంఘాలు
14) విద్యార్థి సంఘాలు
15) మహిళా సంఘాలు
16) DSP
17) షాద్ నగర్ రెడ్డి సేవాసమితి
18) రైతు సంఘాలు
అదేవిధంగా షాద్ నగర్ నియోజకవర్గం  పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న యువజన సంఘాలు, అంబేద్కర్ వాదులు పూలే వాదులు, ప్రజాస్వామ్య వాదులు, అందరు కలసి షాద్ నగర్ ప్రజల పక్షాన నిలబడాలని అఖిలపక్ష మహాధర్నా ఆహ్వానం పంపుతున్నాం.

*స్థలం*: బ్లాక్ ఆఫీస్ షాద్నగర్ ముందు ఉన్న మహనీయుల విగ్రహాల దగ్గర,

*సమయం*: 10:00Am

*తేదీ*:  22 -05- 2023
సోమవారం రోజున

              ఇట్లు
      *దొడ్డి శ్రీనివాస్*
అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గం
    *అఖిలపక్ష పార్టీల ప్రతినిధి* 

నా కాన్వాయ్ కు జీరో ట్రాఫిక్...ప్రోటో్కాల్ వద్దు..

*నా కాన్వాయ్ కు జీరో ట్రాఫిక్...ప్రోటో్కాల్ వద్దు.... సీయం సిద్దిరామయ్య!*

బెంగళూరు: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాహన శ్రేణికి ఉన్న 'జీరో ట్రాఫిక్‌' ప్రోటోకాల్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారుఈ విషయాన్ని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌కు తెలియజేసినట్టు ఆయన వెల్లడించారు. సీఎం 'జీరో ట్రాఫిక్‌' ప్రోటోకాల్‌ కారణంగా రోడ్లపై ట్రాఫిక్‌ స్తంభించి ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిద్ధరామయ్య తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, May 20, 2023

ఆ కాలేజీల ప్రవేశాల్లో జోక్యం చేసుకోవద్దు

ఆ కాలేజీల ప్రవేశాల్లో జోక్యం చేసుకోవద్దు.... హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు....!*

హైదరాబాద్: రాష్ట్రంలోని సుమారు 50 కాలేజీల్లో దోస్త్‌ (DOST)తో సంబంధం లేకుండా డిగ్రీ ప్రవేశాలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.పిటిషన్లు వేసిన కళాశాలల ప్రవేశాల్లో జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సులకు 2016-17 నుంచి ప్రభుత్వం ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపడుతోంది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. అభిప్రాయాలు తెలుసుకోకుండా తమ కాలేజీల్లో ప్రవేశాలు, ఫీజులను నియంత్రించడం తగదని.. ప్రభుత్వం, యూనివర్సిటీలు చట్టపరిధి దాటి వ్యవహరిస్తున్నాయని వాదించాయి. వాదనలు విన్న హైకోర్టు గతంలో మాదిరిగానే నేరుగా కాలేజీలు ప్రవేశాలు జరపొచ్చునంటూ 2017లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ పిటిషన్‌ ఇప్పటికీ హైకోర్టులో పెండింగులోనే ఉంది. ఆ తర్వాత ఏటా ఉన్నత విద్యా మండలి దోస్త్ నోటిఫికేషన్ ఇస్తూనే ఉంది. సుమారు యాభైకి పైగా కాలేజీలు ప్రతి ఏడాది హైకోర్టును ఆశ్రయిస్తూ మధ్యంతర ఉత్తర్వులతో ప్రవేశాలు జరుపుతున్నాయి.

ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఇటీవలే దోస్త్ నోటిఫికేషన్ విడుదల కావడంతో సుమారు 50 ప్రైవేట్ కాలేజీలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించాయి. తమ అభ్యంతరాలు అలాగే ఉన్నాయని.. ప్రభుత్వం నుంచి స్పందన లేదని కాలేజీల యాజమాన్యాలు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. ఏటా పిటిషన్లు వేసి మధ్యంతర ఉత్తర్వులతో ప్రవేశాలు చేస్తున్నామని.. కేసులు పెండింగులోనే ఉన్నాయని కాలేజీ యాజమాన్యాల తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషన్లు వేసిన కాలేజీల్లో గతంలో మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా ప్రవేశాలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి జోక్యం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై పెండింగులో ఉన్న పిటిషన్లన్నీ తమ ముందుంచాలని ఉన్నత విద్యా మండలిని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఉన్నత విద్యా మండలిని, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను ఆదేశిస్తూ విచారణను జూన్ 15కి వాయిదా వేసింది

*సుజీవన్ వావిలాల*🖋️ 

దుకాణాల్లో ఆ నోటును తీసుకోవడం నిలిచిపోయింది

*నిమిషాల వ్యవధిలోనే నిలిచిపోయిన ట్రాన్సక్షన్*

*హైదరాబాద్*

రెండు వేల రూపాయల నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకుంటా మంటూ రిజర్వు బ్యాంకు ప్రకటన చేసిన నిమిషాల వ్యవధిలోనే హైదరాబాద్‌లోని దుకాణాల్లో ఆ నోటును తీసుకోవడం నిలిచిపోయింది. షాపింగ్ మాల్స్, వైన్ షాప్స్, పెట్రోలు బంకుల్లో నోటును తీసుకోడానికి సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు నేరుగా తీసుకునే వెసులుబాటు ఉన్నా తీసుకోడానికి సుముఖంగా లేరు.
సెప్టెంబరు 30వ తేదీ వరకు లీగల్‌గా చెలామణి చేసుకునే అవకాశం ఉన్నా దుకాణాలు సిద్ధపడడంలేదు. మద్యం దుకాణాల్లో సైతం ఈ నోటు తీసుకోడానికి ఆసక్తి చూపడంలేదు. సూపర్ మార్కెట్లలో సైతం ఇదే ధోరణి వ్యక్తమవుతున్నది. ఈ నోటును తీసుకుంటే మళ్ళీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే సమయంలో చిక్కులు వస్తాయన్న అనుమానమే ఇందుకు కారణం. వ్యాపార లావాదేవీల్లో భాగంగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోడానికి ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ రిస్కు ఉంటుందేమో అనే అనుమానంతో నోటును తీసుకోడానికి ఇష్టపడడంలేదు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, May 19, 2023

*రూ.2000 నోటు రద్దు.

*రూ.2000 నోటు రద్దు.. రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం..*

*2000 నోట్లను ఉపసంహరించుకన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది.*

రూ.2,000 నోట్లను సర్క్యులేషన్ లో ఉంచొద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది.

సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని, మే 23 నుంచి ఆర్బీఐ రీజినల్ ఆఫీసుల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. ఆర్బీఐ చెప్పిన గడువు వరకు రూ. 2000 డినామినేషన్ చట్టబద్ధంగా చెల్లుబాటులో కొనసాగుతున్నప్పటికీ.. తక్షణం ఇప్పటి నుంచే అమలులోకి వచ్చేలా రూ.2000 డినామినేషన్ నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. దేశంలోని అన్ని బ్యాంకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోటు మార్పిడి చేసుకోవచ్చు. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ. 2 వేల నోటు ఉపసంహరణ. ఒక్కొక్కరు ఒక్కో విడతలో 10 రూ. 2 వేల నోట్లను మార్చుకునే అవకాశం.

శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, సెంట్రల్ బ్యాంక్ ఇలా పేర్కొంది: "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క "క్లీన్ నోట్ పాలసీ" ప్రకారం, ₹2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ విత్ డ్రాను సమాయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రజలకు తగిన సమయం అందించడానికి సెప్టెంబర్ 30, 2023 వరకు గడవు ఇచ్చినట్లు పేర్కొంది.

ప్రస్తుతం రూ. 2000 డినామినేషన్ నోట్లలో దాదాపుగా 89 శాతం మార్చి 2017కు ముందు జారీ చేయబడ్డవే అని.. మార్చి 31, 2018 నాటికి చెలామణిలో గరిష్టంగా ఉన్న 37.3 శాతం అంటే రూ. 6.73 లక్షల కోట్ల నోట్ల విలువ నుంచి రూ. 3.62 లక్షల కోట్లకు తగ్గిందని.. మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో కేవలం 10.8 శాతం మాత్రమే రూ. 2000 నోట్లు ఉన్నాయని తెలిపింది.

ఏ బ్యాంకులోనైనా ఒకే సారి అంటే పది రూ. 2000 నోట్లు అంటే రూ. 20,000 మాత్రమే మార్చుకోవచ్చనే పరిమితి విధించింది. నవంబర్ 2016లో పాత నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టారు. 2018-19లో రూ. 2,000 నోట్ల ముద్రణను ఆపేశారు.

Upcoming Elections

🔴 *Upcoming Elections*🔴 

|| *_ఏ అసెంబ్లీ గడువు ఎప్పటితో ముగుస్తుంది?*|| 
    
◻️ *ఛత్తీస్‌గఢ్‌(90 సీట్లు)*- నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 3తో అసెంబ్లీ గడువు ముగియనుంది)
    
◻️ *మధ్యప్రదేశ్‌(230)*  నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 6తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)
    
◻️ *మిజోరం(40)*- నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2023 డిసెంబర్‌ 17తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)
    
◻️ *రాజస్థాన్‌(200)* -డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 14తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)
    
◻️ *తెలంగాణ(119)* -నవంబర్‌- డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 16తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)

Wednesday, May 17, 2023

ఇవాళ్ళ కొత్త సచివాలయంలో మొదటి కేబినెట్‌ సమావేశం...

*ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ...*

*కొత్త సచివాలయంలో మొదటి కేబినెట్‌ సమావేశం...*

*జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ దశాబ్ది వేడుకలు...*

*గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేర్ల ఖరారుతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం...* 

పత్రిక ప్రకటనతేదీ:-17-05-2023

పత్రిక ప్రకటన
తేదీ:-17-05-2023


విషయం:- అనుమతి లేకుండా యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల నుండి అక్రమ ఫీజు వసూళ్లకు పాల్పడిన శ్రీనిధి, గురునానక్  విద్యాసంస్థల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని - ఎస్ఎఫ్ఐ రాథోడ్ సంతోష్ డిమాండ్...

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ....ఎలాంటి గుర్తింపు లేని యూనివర్సిటీ పేరుతో మోసం చేస్తూ అక్రమంగా ఫీజు వసూళ్లకు పాల్పడుతున్న శ్రీనిధి, గురు నానక్ విద్యా సంస్థల వల్ల వేలాది మంది విద్యార్థులు వారి తల్లితండ్రులు ఆర్థికంగా,మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని డిమాండ్ చేశారు..
ఈ రెండు యూనివర్సిటీల యాజమాన్యాలు విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియ నుండి ఐడెంటిటీ కార్డు మొదలుకొని ఫీజు రసీదు వరకు అన్ని యూనివర్సిటీల పేరుతో నమ్మించి, మోసం చేశారని విద్యార్థులు భవిష్యత్తుపై ఎన్నో  ఆశలు పెట్టుకొని కళాశాలలో చేరిన విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్న యూనివర్సిటీ కళాశాల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఇప్పుడు ఉన్న ఇంజనీరింగ్ విద్యాసంస్థల గుర్తింపును కూడా రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాము.అక్రమ దందాకు పాల్పడిన సదరు శ్రీనిధి మరియు గురు నానక్ విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలుతీసుకొని విద్యార్థులు మరియు వారి తల్లితండ్రులకు న్యాయం చెయ్యాలని ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాం.. విద్యార్థులను గుర్తింపు లేని యూనివర్సిటీలో నుంచి కాపాడకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని విద్యాధికారులకు, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జీవన్,ఆనంద్, ప్రసాద్,శ్రీను,వంశీ,శివ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు...


ధన్యవాదములతో...

*ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్.....*
9618604620

Tuesday, May 16, 2023

BJYM కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం

BJYM తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో

రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న అన్ని ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని,అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం మొదలుకాగానే విద్యార్ధులకి సమయానికి పుస్తకాలూ యూనిఫామ్ , నాణ్యమైన భోజనం అందచేయాలని,మౌలిక వసతులు , భవనాలు క్రీడా ప్రాంగణాలు ప్రహరీ గోడలు లేని విద్య సంస్థల పర్మిషన్ రద్దు చేసి మూసి వేయాలని ఈరోజు కరీనగర్ జిల్లా కలెక్టర్ R V కన్నన్ గారికి వినతి  పత్రం అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో BJYM తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి బండారి ,జిల్లా ఉపాధ్యక్షులు జశ్వంత్ ,జిల్లా కార్యదర్శి ( అసెంబ్లీ ఇంఛార్జి) జూపల్లి ధీరజ్ ,జిల్లా కార్యదర్శి తిప్పర్తి నికేష్,మహేష్  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Courtesy by : జూపల్లి ధీరజ్ 

Monday, May 15, 2023

బీఆర్‌ఎస్‌ కీలక భేటీ... సీఎం కేసీఆర్‌

*కర్ణాటక ఎఫెక్ట్.... కాంగ్రెస్ తోనే ఫైట్... మారిన బీఆర్ఎస్ ఫోకస్....!*


*రేపు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ కీలక భేటీ*

*అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే దిశగా మార్గనిర్దేశనం*
*వివిధ వర్గాలతో మమేకమయ్యేలా వినూత్న కార్యక్రమం రూపకల్పన*
హైదరాబాద్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ బీజేపీని అనూహ్యంగా మట్టికరిపించడంతో ఇక్కడ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. తెలంగాణలో మతతత్వ రాజకీయాలు పనిచేయవనే నమ్మకంతో ఉంది. దీంతో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కీలక భేటీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

మే 17న మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ లెజిస్లేటరీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త భేటీ కేసీఆర్‌ అధ్యక్షతన జరగనుంది. సమావేశానికి హాజరు కావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం అందింది. ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యంగా మారింది.

*సుజీవన్ వావిలాల*🖋️

నేను వంటరినీ....135 స్థానలు గెలిపించుకున్న.... DK శివ కుమార్....!

*నేను వంటరినీ....135 స్థానలు గెలిపించుకున్న.... DK శివ కుమార్....!*

బెంగళూరు: పార్టీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు కోసం ఎంతో కష్డపడ్డానని, కర్ణాటకను కాంగ్రెస్‌కు ఇవ్వాలన్న లక్ష్యం సాధించానని, సీఎం ఎవరన్నదానిపై ఇక హైకమాండ్‌దే తుది నిర్ణయమని డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు.ఒకవైపు సీఎం అభ్యర్థిపై పార్టీ హైకమాండ్‌ మల్లగుల్లాలు పడుతున్న వేళ.. సీనియర్‌ నేత సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లడం తెలిసిందే. అయితే డీకే శివకుమార్‌ మాత్రం బెంగళూరులో ఉండిపోయారు.

ఇవాళ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల నడుమ తన ఫామ్‌హౌజ్‌లో చేసుకున్నారాయన. అనంతరం బెంగళూరులోని నివాసానికి చేరుకున్నారు. అక్కడ మద్దతుదారులతో భేటీ అయిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.

కర్ణాటక పీసీసీ చీఫ్‌, సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్‌ తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు.'' ఇవాళ నా పుట్టినరోజు. వేడుకల్లో పాల్గొనేందుకు ఇక్కడే ఉండిపోయా. తర్వాత ఢిల్లీకి వెళ్తా. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డా. 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ధైర్యం కోల్పోలేదు. కాంగ్రెస్‌ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చాను. నా టార్గెట్‌ కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడం. నా అధ్యక్షతన 135 స్థానాలు గెలిపించుకున్నా. గెలుపు కోసం నేతలంతా సహకరించారు.

.. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. సిద్ధరామయ్యతో ఎలాంటి విభేధాలు లేవు. నా బర్త్‌డే వేడుకల్లో కూడా ఆయన పాల్గొన్నారు. సీఎం ఎవరన్నదానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నాకంటూ ఉన్న మద్దతు దారుల సంఖ్యను చెప్పను. ఎందుకంటే నేను ఒంటరిని.. ఒంటరిగానే పార్టీని గెలిపించుకున్నా. ఢిల్లీ వెళ్లి నా గురువును కలుస్తా. సీఎం అభ్యర్థి ఎవరు అనేదానిపై హైకమాండ్‌ తుది నిర్ణయం తీసుకుంటుంది. సోనియా, రాహుల​, ఖర్గేలు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు అని శివకుమార్‌ పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, May 14, 2023

అమాయకులైన ఎస్టి లకు చెందిన 500 లకు పైగా ఇళ్లను కూల్చివేశారు


అక్రమ కట్టడాలపై ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై తక్షణమే కటిన చర్యలు తీసుకుంటాము అని ప్రగల్బాలు పలుకుతున్న మీరు ప్రభుత్వ భూములను చెరువులను ఆక్రమిస్తున్న బడా రియల్ ఎస్టేట్ బాబులను రాజకీయ నాయకులను మున్సిపల్ చైర్మన్ లను ఏమీ చేయలేకపోతున్నారు కానీ అమాయకులైన ఎస్టి లకు చెందిన 500 లకు పైగా ఇళ్లను సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల్ ఐలాపూర్ గ్రామంలో తెల్లవారుజామున మూడు గంటలకు ఇంట్లో ఉన్న వారిని పోలీసుల సహాయంతో బలవంతంగా బయటికి వెళ్లగొట్టి నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు వందలాది గిరిజనులను రాత్రికి రాత్రి నిరాశ్రయులుగా చేశారు. ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా దారిద్యరేఖకు దిగువున జీవిస్తున్న వారు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు.
బడాబాబులు ఆ స్థలంలో వెంచర్ చేసి ఈ అమాయకులకు ప్లాట్లు అమ్ముతున్నప్పుడు మీ అధికారులు నిద్రపోతున్నారా?
విద్యుత్ శాఖ ఆ ఇళ్లకు కరెంటు కనెక్షన్ ఎలా ఇచ్చింది?
గ్రామపంచాయతీ టాక్స్లు ఎలా వసూలు చేసింది?
వాటర్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు?
అన్ని ఇల్లు నిర్మాణాలు జరుగుతున్నప్పుడు  గ్రామపంచాయతీ కానీ, మున్సిపల్ అధికారులు కానీ, రెవిన్యూ అధికారులు కానీ, ఇన్ని రోజులు ఎందుకు ఆపలేదు? ఎందుకు స్పందించలేదు?
కష్టపడి సంపాదించిన డబ్బుతో బీదవాళ్లు తక్కువలో ఇల్లు వస్తున్నాయని అక్కడ భూమి కొనుగోలు చేసి కష్టపడి కట్టుకోవడం జరిగింది. కొన్న వారిని శిక్షించారు సరే, మరి అమ్మిన వారి సంగతేంటి? అమ్మిన వారి దగ్గర నుంచి తక్షణమే డబ్బు రికవరీ చేయాలి క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలి దాని వెనుక ఉన్న బడా బాబులను వదిలిపెట్టదు.
ఎటువంటి నోటీసు లేకుండా ఎలా కూల్చి వేస్తారు?
ఆ భూమి ప్రభుత్వాన్ని ది అని ఇంతవరకు కోర్టు తీర్పు ఇవ్వలేదు, ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వానికి మధ్య కేసు హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, స్టేటస్ కు ఆర్డర్స్ ఉన్నాయి, మరి అటువంటి అప్పుడు అక్కడ విచ్చలవిడిగా అమాయకులకు ఇళ్ల స్థలాలు అమ్ముతుంటే, ఇళ్ల నిర్మాణాలు చేపడుతుంటే రెవిన్యూ మరియు పంచాయతీ అధికారులు నిద్రపోతున్నారా?
How can the Govt departments escape from Vicarious liability?
అక్కడ ఇల్లు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరికి తక్షణం అమీన్పూర్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించి ఆదుకోవాలని ఒక సామాజిక కార్యకర్తగా న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తున్నాను. @TelanganaCS @TelanganaCMO @BRSHarish
@GMRMLAPTC @arvindkumar_ias @PIBHyderabad @Collector_SRD

V. RAVIKRISHNA 
Advocate 
9618531012.

https://twitter.com/RaviVattem/status/1657714449179090944?t=fNRMaX4AqHIBpO4knGisGw&s=19

Saturday, May 13, 2023

తెలంగాణ శాసనసభ్యులు మొత్తం 74మందిపై క్రిమినల్ కేసులు

*_ఎమ్మెల్యేల మెడకు కేసుల ఉచ్చు_*
_★ మొత్తం 74మందిపై క్రిమినల్ కేసులు_
_★ అధికార పార్టీ వారే అధికం_
_★ పటాన్ చెర్వు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డిపై సుప్రీం లో పిటిషన్_
_★ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఫోర్జరీ కేసు_
_★ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి ఎన్నికపై హైకోర్టు ఆదేశాలు_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)

*_తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యులు 119 మంది కాగా... 45 మంది మాత్రమే ఎలాంటి క్రిమినల్ కేసులు లేనివారు. 74 మంది  శాసనసభ్యులపై క్రిమినల్ కేసులతో సహజీవనం చేస్తున్నారు. ఇది గత ఎన్నికల్లో వారు సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం అందిన అధికార సమాచారం. గత ఐదేళ్ళలో ఓ నలుగురు ప్రజాప్రతినిధులు తప్ప అధికార పార్టీ నేతలంతా సఛ్ఛీలురుగా ఉండటం గమనార్హం.  అయితే గతంలో తెరాస కాస్త భరాస మారింది. జంప్ జిలానీలు అదనపు ఆకర్షణ. రికార్డుల ప్రకారం గెలిచిన పార్టీలను ప్రస్తావిస్తూ 'ఘంటారావం' అందిస్తున్న నేర చరితుల ఎమ్మెల్యేల జాబితా ఇది._*

*https://m.facebook.com/story.php?story_fbid=pfbid0BRjj3ny5WfKHvSLB57S8HToRP4R27CvN658yExkcdKrkXakANshEdo4NRUZsfuWXl&id=100063772548665&mibextid=Nif5oz*


*_క్రిమినల్ రికార్డులతో తెలంగాణ ఎమ్మెల్యేల జాబితా_*

 క్ర.సం.   
నియోజకవర్గం పేరు 
అభ్యర్థి పేరు
పార్టీ 
క్రిమినల్ కేసుల సంఖ్య

 1. ఆదిలాబాద్ జోగు రామన్న (బిఆర్ఎస్) 3

 2. బోధ్ (ఎస్టీ), బాపు రావు రాథోడ్ (బిఆర్ఎస్) 0

 3. అశ్వారావుపేట (ఎస్టీ), మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ) 1

 4. భద్రాచలం (ఎస్టీ), పోడెం వీరయ్య (కాంగ్రెస్) 2

 5. కొత్తగూడెం, వనమా వెంకటేశ్వరరావు ( కాంగ్రెస్) 2

 6. పినపాక (ఎస్టీ), రేగా కాంతారావు (కాంగ్రెస్) 4

 7. ఇల్లందు (ఎస్టీ), రాంబాయి అలియాస్ హరిప్రియ బానోత్ (కాంగ్రెస్) 3

 8. అంబర్‌పేట, కె. వెంకటేశం (బిఆర్ఎస్) 1

 9. బహదూర్‌పురా, మొహమ్మద్ మోజమ్ ఖాన్ (ఏఐఎంఐఎం) 0

 10. చంద్రాయణగుట్ట, అక్బరుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం) 14

 11. చార్మినార్, ముంతాజ్ అహ్మద్ ఖాన్  (ఏఐఎంఐఎం) 2

 12. గోషామహల్, టి.రాజాసింగ్ (భాజపా) 43

 13. జూబ్లీహిల్స్, మాగంటి గోపీనాథ్ (బిఆర్ఎస్) 0

 14. కార్వాన్, కౌసర్ మొహియుద్దీన్  (ఏఐఎంఐఎం) 2

 15. ఖైరతాబాద్, దానం నాగేందర్ (బిఆర్ఎస్) 3

 16. మలక్‌పేట్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల  (ఏఐఎంఐఎం) 0

 17. ముషీరాబాద్, ముటా గోపాల్ (బిఆర్ఎస్) 0

 18. నాంపల్లి, జాఫర్ హుస్సేన్  (ఏఐఎంఐఎం) 8

 19. సనత్‌నగర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ (బిఆర్ఎస్) 2

 20. సికింద్రాబాద్, టి. పద్మారావు (బిఆర్ఎస్) 16

 21. సికింద్రాబాద్ కాంటోన్మెంట్ (ఎస్సీ), జి సాయన్న (బిఆర్ఎస్) 4

 22. యాకుత్‌పురా, సయ్యద్ అహ్మద్ పాషా క్వాద్రీ  (ఏఐఎంఐఎం) 3

 23. ధర్మపురి (ఎస్సీ), ఈశ్వర్ కొప్పుల (బిఆర్ఎస్) 0

 24. జగిత్యాల, ఎం.సంజయ్ కుమార్ (బిఆర్ఎస్) 0

 25. కోరుట్ల, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (బిఆర్ఎస్) 1

 26. స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ), డాక్టర్ తాటికొండ రాజయ్య (బిఆర్ఎస్) 1

 27. జనగామ, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (బిఆర్ఎస్) 1

 28 పాలకుర్తి, ఎర్రబెల్లి దయాకర్ రావు (బిఆర్ఎస్) 0

 29. భూపాలపల్లి‌‌, గండ్ర వెంకట రమణా రెడ్డి (కాంగ్రెస్) 4

 30. ములుగు (ఎస్టీ), అనసూయ దన్సరి (కాంగ్రెస్) 0

 31. అలంపూర్ (ఎస్సీ)  అబ్రహం (బిఆర్ఎస్) 0

 32. గద్వాల్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (బిఆర్ఎస్) 3

 33. జుక్కల్ (ఎస్సీ), హన్మంత్ షిండే (బిఆర్ఎస్) 3

 34. కామారెడ్డి, గంప గోవర్ధన్ (బిఆర్ఎస్) 0

 35. ఎల్లారెడ్డి, జాజాల సురేందర్ (కాంగ్రెస్) 0

 36. చొప్పదండి (ఎస్సీ), రవిశంకర్ సుంకె (బిఆర్ఎస్) 0

 37. హుజూరాబాద్, ఈటల రాజేందర్ (బిఆర్ఎస్) 3

 38. కరీంనగర్, గంగుల కమలాకర్ (బిఆర్ఎస్) 7

 39. మానకొండూర్ (ఎస్సీ), ఎరుపుల బాలకిషన్ (బిఆర్ఎస్) 4

 40. ఖమ్మం, అజయ్‌కుమార్ పువ్వాడ (బిఆర్ఎస్) 1

 41. మధిర (ఎస్సీ), భట్టి విక్రమార్క మల్లు (కాంగ్రెస్) 0

 42. పాలేరు, కందాల ఉపేందర్ రెడ్డి (కాంగ్రెస్) 3

 43. సత్తుపల్లి (ఎస్సీ), సండ్ర వెంకట వీరయ్య (టీడీపీ) 3

 44. వైరా (ఎస్టీ), లావుడ్య రాములు (కాంగ్రెస్) 1

 45. ఆసిఫాబాద్ (ఎస్టీ), ఆత్రం సక్కు (కాంగ్రెస్) 45

 46. ​​సిర్పూర్ కాగజ్ నగర్, కోనేరు కోనప్ప (బిఆర్ఎస్) 41

 47. డోర్నకల్ (ఎస్టీ), ధర్మసోత్ రెడ్యా నాయక్ (బిఆర్ఎస్) 2

 48. మహబూబాబాద్, బానోత్ శంకర్ నాయక్ (బిఆర్ఎస్) 0

 49. దేవరకద్ర, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి (బిఆర్ఎస్) 0

 50. జడ్చర్ల, చర్లకోల లక్ష్మా రెడ్డి (బిఆర్ఎస్) 2

 51 మహబూబ్ నగర్, శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల (బిఆర్ఎస్) 1

 52. మక్తల్, చిట్టెం రామ్ మోహన్ రెడ్డి (బిఆర్ఎస్) 4

 53. నారాయణపేట, ఎస్.రాజేందర్ రెడ్డి (బిఆర్ఎస్) 1

 54. బెల్లంపల్లి (ఎస్సీ), దుర్గం చిన్నయ్య (బిఆర్ఎస్) 0

 55. చెన్నూరు (ఎస్సీ), బాల్క సుమన్ (బిఆర్ఎస్) 1

 56 మంచిర్యాల, నడిపెల్లి దివాకర్ రావు (బిఆర్ఎస్) 1

 57. మెదక్, పద్మా దేవేందర్ రెడ్డి.  ఎం (బిఆర్ఎస్) 3

 58. నర్సాపూర్, చిలుముల మదన్ రెడ్డి (బిఆర్ఎస్) 2

 59. కూకట్‌పల్లి‌ మాధవరం కృష్ణారావు (బిఆర్ఎస్) 1

 60. మల్కాజ్‌గిరి హనుమంతరావు మైనంపల్లి (బిఆర్ఎస్) 3

 61. కుత్బుల్లాపూర్, వివేకానంద్ (బిఆర్ఎస్) 1

 62 ఉప్పల్, బేతి సుభాస్ రెడ్డి (బిఆర్ఎస్) 11

 63. అచ్చంపేట (ఎస్సీ), గువ్వల బాలరాజు (బిఆర్ఎస్) 1

 64. కొల్లాపూర్, బీరం హర్షవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్) 0

 65. నాగర్‌కర్నూల్, మర్రి జనార్దన్ రెడ్డి (బిఆర్ఎస్) 0

 66. దేవరకొండ (ఎస్టీ), రమావత్ రవీంద్ర కుమార్ (బిఆర్ఎస్) 1

 67. మిర్యాలగూడ, నల్లమోతు భాస్కర్ రావు (బిఆర్ఎస్) 0

 68. మునుగోడు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (బిఆర్‌ఎస్) 2

 69. నాగార్జున సాగర్, నోముల భగత్ (బిఆర్ఎస్) 0

 70. నక్రేకల్ (ఎస్సీ), చిరుమర్తి లింగయ్య (కాంగ్రెస్) 0

 71. నల్గొండ, కంచర్ల భూపాల్ రెడ్డి (బిఆర్ఎస్) 0

 72. ఖానాపూర్ (ఎస్టీ) అజ్మీరా రేఖ (బిఆర్ఎస్) 0

 73. ముధోల్, గడ్డిగారి విట్టల్ రెడ్డి (బిఆర్ఎస్) 1

 74. నిర్మ,ల్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (బిఆర్ఎస్) 7

 75. ఆర్మూర్, ఆశన్నగారి జీవన్ రెడ్డి (బిఆర్ఎస్) 0

 76. బాల్కొండ, వేముల ప్రశాంత్ రెడ్డి (బిఆర్ఎస్) 0

 77 బాన్సువాడ, పోచారం శ్రీనివాస్ రెడ్డి (పరిగె) (బిఆర్ఎస్) 1

 78. బోధన్, షకీల్ అమీర్ మహ్మద్ (బిఆర్ఎస్) 3

 79. నిజామాబాద్ (రూరల్), బాజిరెడ్డి గోవర్ధన్ (బిఆర్ఎస్) 0

 80. నిజామాబాద్ (అర్బన్), బిగాల గణేష్ (బిఆర్ఎస్) 0

 81. మంథని, దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్) 0

 82. పెద్దపల్లి‌ మనోహర్ రెడ్డి దాసరి (బిఆర్ఎస్) 1

 83. రామగుండం, కోరుకంటి చందర్ పటేల్ (ఏ.ఐ.ఎఫ్.బి) 3

 84. సిరిసిల్ల, కల్వకుంట్ల తారక రామారావు (బిఆర్ఎస్) .2

 85. వేములవాడ, రమేష్ చెన్నమనేని (బిఆర్ఎస్) 0

 86. చేవెళ్ల (ఎస్సీ), కాలె యాదయ్య (బిఆర్ఎస్) 2

 87. ఇబ్రహీంపట్నం, మంచిరెడ్డి కిషన్ రెడ్డి (బిఆర్ఎస్) 1

 88. కల్వకుర్తి, గుర్కా జైపాల్ యాదవ్ (బిఆర్ఎస్) 0

 89. ఎల్.బి. నగర్, దేవి రెడ్డి సుధీర్ రెడ్డి (కాంగ్రెస్) 0

 90. మహేశ్వరం పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్) 2

 91. రాజేంద్రనగర్,  ప్రకాష్ గౌడ్ (బిఆర్ఎస్) 2

 92. శేరిలింగంపల్లి, అరెకపూడి గాంధీ (బిఆర్ఎస్) 1

 93. షాద్‌ నగర్, అంజయ్య యెలగానమోని (బిఆర్ఎస్) 0

 94. ఆందోల్ (ఎస్సీ) క్రాంతి కిరణ్ చంటి (బిఆర్ఎస్) 0

 95. నారాయణఖేడ్, మహారెడ్డి భూపాల్ రెడ్డి (బిఆర్ఎస్) 9

 96. పటాన్ చెరువు, గూడెం మహిపాల్ రెడ్డి (బిఆర్ఎస్) 0

 97. సంగారెడ్డి, తూరుపు జయప్రకాష్ రెడ్డి (కాంగ్రెస్) 0

 98. జహీరాబాద్ (ఎస్సీ) కొణింటి మాణిక్ రావు (బిఆర్ఎస్) 2

 99. దుబ్బాక, సోలిపేట రామలింగారెడ్డి (బిఆర్ఎస్) 4

 100. గజ్వేల్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (బిఆర్ఎస్) 64

 101. హుస్నాబాద్, సతీష్ కుమార్ వొడితెల (బిఆర్ఎస్) .0

 102. సిద్దిపేట, తన్నీరు హరీశ్‌రావు (బిఆర్ఎస్) 1

 103. హుజుర్‌నగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి నలమడ (కాంగ్రెస్) 1

 104. కోదాడ, బొల్లం మల్లయ్య యాదవ్ (బిఆర్ఎస్) 0

 105. సూర్యాపేట, గుంటకండ్ల జగదీష్ రెడ్డి (బిఆర్ఎస్) 17

 106. తుంగతుర్తి (ఎస్సీ) గాదరి కిషోర్ కుమార్ (బిఆర్ఎస్) 0

 107. కొడంగల్, పట్నం నరేందర్ రెడ్డి (బిఆర్ఎస్) 2

 108. పరిగె, కె.మహేష్ రెడ్డి (బిఆర్ఎస్) 0

 109. తాండూరు, రోహిత్ రెడ్డి (కాంగ్రెస్) 0

 110. వికారాబాద్ (ఎస్సీ,) డాక్టర్ ఆనంద్ మెతుకు (బిఆర్ఎస్) 0

 111. వనపర్తి, సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి (బిఆర్ఎస్) 0

 112. నర్సంపేట, పెద్ది సుదర్శన్ రెడ్డి (బిఆర్ఎస్) 3

 113. పరకాల, చల్లా ధర్మారెడ్డి (బిఆర్ఎస్) 5

 114 . వార్ధనపేట (ఎస్సీ) అరూరి రమేష్ (బిఆర్ఎస్) 0

 115 .  వరంగల్ తూర్పు, నరేందర్ నన్నపునేని (బిఆర్ఎస్) 1

 116. వరంగల్ వెస్ట్, దాస్యం వినయ్ భాస్కర్ (బిఆర్ఎస్) 2

 117. అలేరు‌ గొంగిడి సునీత (బిఆర్ఎస్) 1

 118. భువనగిరి, పైళ్ల శేఖర్ రెడ్డి (బిఆర్ఎస్) 0

 119. మేడ్చల్,  మల్లా రెడ్డి (బిఆర్ఎస్) 1

బాక్స్:1

*_ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై సుప్రీంకోర్టులో పిటిషన్_*
పటాన్ చెర్వు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2014లో పటాన్ చెరువు సమీపంలోని ఒక ఫ్యాక్టరీపై దాడి ఘటనలో మహిపాల్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. అనంతరం ఈ కేసు జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టుకు వెళ్లింది. ఈ కేసులో హైకోర్టు స్టే ఇవ్వడంతో దానిని సవాల్ చేస్తూ ఎం.ఏ.ముఖీమ్ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్థానిక కోర్టు అన్ని విషయాలు పరిశీలించి, ట్రయల్లోని సాక్ష్యాల ఆధారంగా ఎమ్మెల్యేను దోషిగా తేల్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని, ఎమ్మెల్యేను దోషిగా నిర్ధారిస్తూ స్థానిక కోర్టు తీర్పును కొనసాగించాలని పేర్కొన్నారు.

బాక్స్:2
*_జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఫోర్జరీ కేసు_*
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే కుమార్తె తుల్జాభవానిరెడ్డి ఫిర్యాదుతో యాదగిరిరెడ్డితో పాటు ఆయన భార్య పద్మలతారెడ్డి, కుమారుడు పృథ్వీరాజారెడ్డిలపై కూడా కేసు నమోదైంది. సుమారు నాలుగు నెలల కిందట ఓ స్థలం విషయంలో మేడ్చల్‌ రంగారెడ్డి జిల్లా 6వ అదనపు కోర్డును తుల్జాభవానిరెడ్డి ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఉప్పల్‌ పోలీసులు 406, 420, 463, 464, 468, 471, ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ, 156(3) సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తన సొంత కూతురు భవానీరెడ్డితో ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో తనపై ఫోర్జరీ కేసు పెట్టించడం తన రాజకీయ ప్రత్యర్థులు పన్నిన కుట్రలో భాగమేనని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపించారు.

బాక్స్:3
*_జూన్ 19న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి కేసు_*
 ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి ఎన్నిక చెల్లదని పేర్కొంటూ దాఖలైన ఎలక్షన్ పిటిషన్ ఆసక్తి ఉన్నవారు ఇంప్లీడ్ అయ్యేందుకు వీలుగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వా లని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని, ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించారని పేర్కొంటూ సైని సతీశ్ కుమార్ 2019లో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు పెండింగ్లో ఉండగానే ఆయన చనిపోయారు. ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951 ప్రకారం.. పిటిషనర్ చనిపోయి, ఇతరులెవరూ ఇంప్లీడ్ కాకపోతే ఆ పిటిషన్ ను ముగించాల్సి ఉంటుంది. చట్టంలోని సెక్షన్ 112 ప్రకారం ఇతరులెవరైనా ఇంప్లీడ్ అయ్యేందుకు వీలుగా పిటిషనర్ చనిపోయినట్లు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని జస్టిస్ ఎం. లక్ష్మణ్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

మా నాన్నే సీఎం కావాలి

*మా నాన్నే సీఎం కావాలి.... సిద్ధిరామ్మయ్య కుమారుడు....!*

మైసూర్‌: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సిద్ధరామయ్య  కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గట్టుగా తన తండ్రి పూర్తి మెజార్టీ సాధిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని వ్యాఖ్యానించారు. భాజపాకి అధికారం దూరం చేసేందుకు మేం చేయాల్సిందంతా చేస్తాం. కాంగ్రెస్ పూర్తిస్థాయి మెజార్టీ సాధిస్తుంది. ఇతర పార్టీల మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కర్ణాటక ప్రయోజనాల కోసం మా నాన్న ముఖ్యమంత్రి కావాలి. ఒక కుమారుడిగా నా తండ్రిని సీఎంగా చూడాలని అనుకుంటున్నాను. అంతకుముందు ఆయన నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందించింది. ఇంతకాలం భాజపా పాలనలో కొనసాగిన అవినీతి, విధానపరమైన లోపాలను ఆయన సరిచేస్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ముఖ్యమంత్రి కావాలి' అని మీడియాతో మాట్లాడుతూ యతీంద్ర (Yathindra) వ్యాఖ్యానించారు. వరుణ నియోజవర్గం నుంచి తన తండ్రి భారీ ఆధిక్యంతో విజయం సాధిస్తారని చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

గెలిచిన గాలి జనార్దన్ రెడ్డి

*15 మందిని పోటీకి దించినా.. తానొక్కరే గెలిచిన గాలి జనార్దన్ రెడ్డి*

మైనింగ్ కింగ్ గాలి జనర్దన్ రెడ్డి.. కల్యాణ రాజ్య సమితి పక్ష పేరుతో పార్టీ పెట్టి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఫలితాలు ఆయనకు ఏ మాత్రం అనుకూలంగా రాలేదు. మొత్తం 15 మంది అభ్యర్థులను బరిలో నిలిపితే.. ఆయన మాత్రమే గెలిచారు. 

గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి.. కేవలం 2,700 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయనకు 46,031 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ అన్సారీకి 43,315 ఓట్లు పడ్డాయి. 

బళ్లారి సిటీ నుంచి గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ బరిలో నిలిచారు. ఇక్కడ జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయడం గమనార్హం. వీరిద్దరి నడుమ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి లబ్ధి పొందారు. అరుణకు 27,348 ఓట్లు, సోమశేఖర రెడ్డికి 23,335 ఓట్లు రాగా, భరత్ రెడ్డికి 37,578 ఓట్లు పడ్డాయి.

గాలి జనార్దన్ రెడ్డి పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ కు భారీగా ఓట్లు పడటం గమనార్హం. జనార్దన్ రెడ్డి బొటాబొటి మెజారిటీతో గెలవగా.. బళ్లారిలో ఆయన భార్య గట్టి పోటీ ఇచ్చారు. జనార్దన్ రెడ్డి పోటీ వల్ల అధికార బీజేపీకి దెబ్బపడగా.. ఓట్ల చీలికతో కాంగ్రెస్ లబ్ధిపొందింది.

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, May 12, 2023

శ్రీవారి ఆనందనిలయం చిత్రీకరణ కేసులో నిందితుడి అరెస్టు

*శ్రీవారి ఆనందనిలయం చిత్రీకరణ కేసులో నిందితుడి అరెస్టు*

Courtesy by : అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

*_శ్రీవారి ఆలయంలోని ఆనందనిలయాన్ని మొబైల్‌ద్వారా వీడియో తీసిన నిందితుడిని అరెస్టు చేశామని తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య తెలిపారు. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన రాహుల్‌రెడ్డిని(19)ని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏఎస్పీ వెల్లడించారు._*

*_'స్టేటస్' కోసం.._*
నిందితుడు రాహుల్‌రెడ్డి కరీంనగర్‌లో సీఏ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు చెప్పారు. ఇతను ఆలయాలను సందర్శించిన సమయంలో తన సెల్‌ఫోన్‌లో ఆలయాన్ని వీడియోతీసి స్టేటస్‌లో పెట్టుకునేవాడని తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీ సాయంత్రం రాహుల్‌రెడ్డి తన సెల్‌ఫోన్‌ తీసుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శనానికి వెళ్లాడు. ఈ సందర్భంగా అతడు ఉద్దేశపూర్వకంగానే సెల్‌ఫోన్‌ను భద్రతా సిబ్బంది తనిఖీలకు దొరక్కుండా దాచుకుని వెళ్లాడు. ఆలయంలోకి వెళ్లిన ఇతను స్వామివారిని మరుసటి రోజు అర్ధరాత్రి 12.15 నుంచి 12.20 గంటల సమయంలో దర్శించుకుని 8వ తేదీన ఆలయం వెలుపలకు వచ్చాడు. అనంతరం ఆలయం వెలుపల బంగారు బావి వద్ద నుంచి వీడియోను చిత్రీకరించినట్లు తెలిపారు.

*_ఇలా బయటకు వచ్చాయి..._*
గర్భాలయంలో చిత్రీకరణ చేయలేదని ఏఎస్పీ వెల్లడించారు. చిత్రీకరించిన వీడియోను తన స్టేటస్‌లో పెట్టుకోవడంతోపాటూ తన చెల్లెలికి పంపాడు. అనంతరం 3 గంటలకు తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయానికి వెళ్లి అక్కడి నుంచి తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుని రైలులో స్వస్థలానికి చేరుకున్నాడు. ఇంతలో సదరు వీడియో మీడియా, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తన సెల్‌ఫోన్‌లోని వీడియోను తొలగించి ఆఫ్‌చేశాడు. కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో వారు రాహుల్‌ చేసిన పని తప్పుగా భావించి వారి ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. ఆలయంలో వీడియో చిత్రీకరణపై తితిదే విజిలెన్స్‌ అధికారులు తిరుమల వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*_వన్‌టౌన్‌ సీఐ ఆధ్వర్యంలో.._*
ఎస్‌ఐలు సాయినాథ్‌ చౌదరి, సుధాకర్‌లతో రెండు ప్రత్యేక బృందాలను, ఒక టెక్నికల్‌ టీమ్‌ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి క్లూస్‌లేని ఈ వీడియో చిత్రీకరణ కేసును సాంకేతికంగా, సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితుడిని పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడు ఆకతాయితనంతోనే ఈ నేరానికి పాల్పడ్డాడని దర్యాప్తులో గుర్తించామన్నారు. అతని సెల్‌ఫోన్‌లోని ఇతర ఆలయాలకు సంబంధించి తీసుకున్న వీడియోలను పరిశీలించామని తెలిపారు. చిన్నవయస్సులోనే భక్తిభావం కలిగిన ఇతను అత్యుత్సాహంతో, ఆకతాయిగా చేసిన తప్పునకు చట్టప్రకారం చర్యలు తప్పవని చెప్పారు.

ట్విటర్‌ సీఈఓగా లిండా యాకరినో?

*ట్విటర్‌ సీఈఓగా లిండా యాకరినో?* 
_◆ ఇంతకీ ఎవరీమె?_
_◆ మరో ఆరు వారాల్లో అదే నిజం.!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు కొత్త సీఈఓ రావడం ఖాయమైంది. ఈ బాధ్యతల్ని ఓ మహిళ తీసుకోనున్నట్లు ప్రస్తుత సీఈఓ ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. అయితే, ఆమె ఎవరనేది మాత్రం బహిర్గతం చేయలేదు. మరో ఆరు వారాల్లో ఆమె బాధ్యతలు తీసుకోవటం ఖాయం. అయితే, అమెరికా కార్పొరేట్‌ వర్గాలకు సుపరిచితమైన 'లిండా యాకరినో  కొత్త సీఈఓ' అని ఈ రచయిత తన అనుభవపూర్వకంగా చెపుతున్నారు. 

*_ఎవరీ లిండా?_*
లిండా ప్రస్తుతం ఎన్‌బీసీయూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె ట్విటర్‌ను ముందుకు నడిపే బాధ్యతలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ఆమెతో మస్క్‌ గత కొన్ని వారాలుగా చర్చలు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. దాదాపు ఆమె పేరే సీఈఓగా ఖరారు కావొచ్చని ట్విటర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

*_ఇంటర్వ్యూ కూడా.._*
యాకరినో గత నెల ఓ కార్యక్రమంలో మస్క్‌ను ఇంటర్వ్యూ కూడా చేశారు. వీరివురి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది.

*_ఇదీ జీవితం.._*
ఎన్‌బీసీయూనివర్సల్‌లో లిండా  దశాబ్ద కాలంగా పనిచేస్తున్నారు. వాణిజ్య ప్రకటనల ప్రభావం మరింత మెరుగుపరిచే అంశాలపై ఆమె పనిచేస్తున్నారు. కంపెనీ ప్రవేశపెట్టిన ప్రకటనల ఆధారిత పికాక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌లో ఆమెది కీలక పాత్ర. 
    అంతకు ముందు టర్నర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో యాకరినో 19 ఏళ్ల పాటు పనిచేశారు. యాడ్‌ సేల్స్‌ను డిజిటల్‌ రూపంలోకి మార్చడంలో కీలకంగా వ్యవహరించారు.
    పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో లిండా లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ చదివారు. ట్విటర్‌లో మస్క్‌ చేస్తున్న మార్పులకు ఆమె ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ట్విటర్‌ మస్క్‌ చేతికి వచ్చినప్పటి నుంచే ఆమె సీఈఓగా ఉండడానికి ఆసక్తి వ్యక్తం చేసినట్లు సన్నిహితులు తెలిపారు. అయితే, కంపెనీలో కీలక మార్పులు పూర్తయ్యే వరకు ఎలాన్‌ మస్క్‌కు సమయం ఇవ్వాలని ఆమె భావించారట!

☛ మరోవైపు యాకరినోతో పాటు ట్విటర్‌లో ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ విభాగానికి ఇంఛార్జిగా ఉన్న ఎల్లా ఇర్విన్‌ కూడా సీఈఓ రేసులో ఉన్నట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పేర్కొంది. ఇటీవల పదోన్నతి పొందిన ఆమె ఎలాన్‌ మస్క్‌తో కలిసి చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్విటర్‌కు కొత్త సీఈఓను నియమిస్తామనని ఎలాన్‌ మస్క్‌ గతంలోనే సంకేతాలిచ్చారు. ఇప్పటికే స్పేస్‌ఎక్స్‌, టెస్లా సహా మరికొన్ని కంపెనీలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. విశ్రాంతి లేకుండా పని ఉంటోందని గతంలో ఓసారి ఆయనే స్వయంగా చెప్పారు. మరోవైపు ట్విటర్‌ సీఈఓగా తాను వైదొలగాలా అని గత డిసెంబర్‌లో పోల్‌ నిర్వహించారు. 57.5 శాతం మంది ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. మరోవైపు ట్విటర్‌ సీఈఓ పదవిపై మస్క్‌ గతంలో కొన్ని పరుష వ్యాఖ్యలు చేశారు. సీఈఓ కుర్చీలో శునకాన్ని కూర్చోబెట్టిన ఫొటో ట్వీట్‌ చేశారు. మరోవైపు ట్విటర్‌ను ముందుకు నడిపించే ‘‘తెలివి తక్కువ’’ వ్యక్తి దొరికే వరకు తానే సీఈఓగా కొనసాగుతానని కూడా వ్యాఖ్యానించారు.

ఆ ఐదుగుర్నీ కస్టడీకి ఇవ్వండి

*ఆ ఐదుగుర్నీ కస్టడీకి ఇవ్వండి.. కోర్టులో ఈడీ పిటిషన్‌*

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

*_టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు._*

*_జైలులోనే ప్రశ్నిస్తాం.._*
రేణుక, డాక్యానాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, షమీమ్‌ల నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతించాలని కోరారు. చంచల్‌గూడ జైలులోనే నిందితులను ప్రశ్నించడానికి అనుమతించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు జైలు పర్యవేక్షకుడిని ఆదేశించాలని కోరడంతో నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 

*_కౌంటర్ పిటిషన్ అనంతరం.._*
నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశాక వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈడీ అధికారులు ఇప్పటికే ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచల్ గూడ జైల్లో విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అదేవిధంగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రాంచంద్రన్, అధికారులు సత్యనారాయణ, శంకరలక్ష్మిలను కార్యాలయానికి పిలిచి వాళ్ల వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. 
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు రేణుక, రమేష్, ప్రశాంత్ రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, నీలేష్ నాయక్‌లతో పాటు ఇతర నిందితులు కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సిట్ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన తర్వాత నిందితుల బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు ఇప్పటి వరకు 27మందిని అరెస్ట్ చేశారు.

జడ్జీకి ప్రమోషన్‌పై సుప్రీం స్టే..!

రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్‌పై సుప్రీం స్టే..!

Courtesy by :(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

*_గుజరాత్‌ లో కింది కోర్టుల్లో పనిచేసే 68 మంది న్యాయమూర్తులకు ఆ రాష్ట్ర హైకోర్టు కల్పించిన పదోన్నతిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వీరిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష విధించిన సూరత్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ హరీశ్‌ హస్ముఖ్‌భాయ్‌ వర్మ కూడా ఉన్నారు. వీరి పదోన్నతి చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది._*

*_'సీనియారిటీ- కమ్- మెరిట్‌’ ఆధారంగా.._*
హరీశ్‌ హస్ముఖ్‌భాయ్‌ సహా 68 మంది న్యాయమూర్తులను జిల్లా జడ్జీ కేడర్‌కు ప్రమోట్‌ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుజరాత్‌ హైకోర్టు సెలక్షన్‌ జాబితాను జారీ చేసింది. అయితే, ఈ జాబితాను సవాల్‌ చేస్తూ సివిల్‌ జడ్జీ కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘మెరిట్- కమ్- సీనియారిటీ’ ఆధారంగా కాకుండా.. ‘సీనియారిటీ- కమ్- మెరిట్‌’ ఆధారంగా నియామకాలు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు.

*_ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు.._*
గుజరాత్‌ ప్రభుత్వం, గుజరాత్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పటికీ.. గుజరాత్‌ ప్రభుత్వం ఆ న్యాయమూర్తులకు ప్రమోషన్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తాజాగా మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. గుజరాత్‌ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిసి కూడా ప్రభుత్వం వారికి పదోన్నతి కల్పించడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది.

*_ఉత్తర్వులలో.._*
‘‘ఈ కోర్టు నిర్ణయానికి విభిన్నంగా ఆ న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించడం చట్టవిరుద్ధం. ఆ ప్రమోషన్‌ జాబితా అమలుపై స్టే విధిస్తున్నాం. పదోన్నతి దక్కిన న్యాయమూర్తులు తిరిగి వారి గత పదవుల్లోకి వెళ్లిపోవాలి’’ అని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తగిన ధర్మాసనం తదుపరి విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది.

*_గతంలో.._*
2019 నాటి ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి హస్ముఖ్‌ వర్మ ఈ కేసును విచారించి.. రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుతో కాంగ్రెస్‌ నేత తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

అందరూ బెంగళూరు వచ్చేయండి

*అందరూ బెంగళూరు వచ్చేయండి....ప్రలోభాల భయంతో అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు....!*

బెంగళూరు: ఇన్ని రోజులు కర్ణాటక ప్రచారంతో హోరెత్తింది. ఓటింగ్‌ ముగిసిన నాటి నుంచి ఇప్పుడు నేతల్లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి.ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ప్రకారం హంగ్‌కు ఎక్కువ అవకాశం ఉండటంతో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. 'ఆపరేషన్ కమలం'లో తమ ఎమ్మెల్యేలు చిక్కకూడదని కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అభ్యర్థులు బెంగళూరు వచ్చేయాలని, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండాలని సూచించింది. రేపు ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో హస్తం పార్టీ ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది. హంగ్‌ అవకాశం ఉంటుందని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించినప్పటికీ.. భాజపా, కాంగ్రెస్ తమకే పూర్తిస్థాయి మెజార్టీ దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే అంచనాలకు తగ్గట్టుగా హంగ్ వచ్చినా.. అధికార పీఠం కోసం ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు రెండుపార్టీలు వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, May 10, 2023

తిరుమలలో తెలంగాణ గవర్నర్ తమిళసై కీలక వ్యాఖ్యలు

*తిరుమలలో తెలంగాణ గవర్నర్ తమిళసై కీలక వ్యాఖ్యలు*

తిరుపతి: మే 10
తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం స్వామి వారి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా బాగుండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నట్లు గవర్నర్  చెప్పారు. బ్రేక్ సమయంలో మార్పు తీసుకురావడం చాలా మంచి నిర్ణయంమన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని ముందు అందరూ సమానమే అంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఆనందదాయకమని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆహ్వనం లేకపోవడంతోనే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ,సచివాలయం ప్రారంభోత్సవాలకు హజరు కాలేదని చెప్పారు. ఆహ్వనించామని వారు పేర్కోనడంతోనే తాను ఆహ్వనం అందలేదని చెప్పాల్సి వచ్చిందన్నారు. ఆహ్వనం పంపలేదని తాను ఎవరిని అడగలేదని గవర్నర్ చెప్పుకొచ్చారు.

Courtesy by : సుజీవన్ వావిలాల 

ప్రత్యేక న్యాయస్థానం ఎదుటకు ఇమ్రాన్‌ ఖాన్‌..!

*ప్రత్యేక న్యాయస్థానం ఎదుటకు ఇమ్రాన్‌ ఖాన్‌..!*

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

పాక్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్ ను ఎట్టకేలకు ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఆయన్ను 14 రోజుల రిమాండ్‌కు ఇవ్వాలని ఎన్‌ఏబీ కోరింది. బుధవారం ఇస్లామాబాద్‌ పోలీస్‌ లైన్స్‌లోని ప్ర కార్యాలయంలోని కొత్త అతిథి గృహాన్ని న్యాయస్థానంగా మార్చేశారు. ఇక్కడ ఖాన్‌పై నమోదైన రెండు కేసులను విచారించనున్నారు. యాంటీ అకౌంటబిలిటీ కోర్టు నెంబర్‌ 1 ఈ న్యాయస్థానంలో జడ్జిగా మహమ్మద్‌ బషీర్‌ వ్యవహరించారు. గతంలో నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియంపై నమోదైన అవినీతి కేసులను ఈ న్యాయమూర్తే విచారించారు. అప్పట్లో ఆమెకు శిక్షపడింది.  

*_అల్‌-ఖాద్రీ ట్రస్ట్‌ భూములపై.._*
విచారణ సందర్భంగా ఖాన్‌ను 14 రోజులపాటు రిమాండ్‌కు ఇవ్వాలని ఎన్‌ఏబీ (నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో) లాయర్లు కోరారు. దీనిని ఇమ్రాన్‌ తరపున న్యాయవాద బృందం తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాదు.. తక్షణమే ఇమ్రాన్‌ను విడుదల చేయాలని కోరింది. అనంతరం న్యాయమూర్తి విరామం తీసుకొన్నారు.  వాస్తవానికి నేడు ఇమ్రాన్‌ను కలిసేందుకు న్యాయసలహా బృందానికి తొలుత అనుమతులు లభించలేదు.. కానీ, కొద్దిసేపటి తర్వాత ఖాన్‌ను కలిసేందుకు వారిని అనుమతించారు. 

*_ఇమ్రాన్‌ ఖాన్‌ మరో కేసులో.._*
జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి హుమాయున్‌ దిలావర్‌ ఎదుట కూడా హాజరుకానున్నారు. ప్రభుత్వానికి చెందిన బహుమతులు విక్రయించిన విషయంలో ఇమ్రాన్‌ ఎదుర్కొంటున్న ఆరోపణలపై ఇక్కడ విచారించనున్నారు.

*_ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన..._*
పీటీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు విచారణ కేంద్రం వద్ద గుమిగూడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో పాటు మీడియా ప్రతినిధులకు కూడా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. మరోవైపు పీటీఐ ఉపాధ్యక్షుడు షా మహమూద్‌ ఖురేషీ, కార్యదర్శి అసద్‌ ఉమర్‌ను కూడా పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో వీరు ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయడానికి యత్నించారు. కానీ, అంతకు ముందే ఉగ్రవాద వ్యతిరేక బృందం పోలీసులు అసద్‌ ఉమర్‌ను అరెస్టు చేశారు. ఇక పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దాదాపు 1000 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ జరిగిన అల్లర్లలో దాదాపు 130 పోలీసు అధికారులు గాయపడ్డారు. 

*_అవినీతి కేసులో.._*
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను మంగళవారం పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేశారు. ఓ అవినీతి కేసుకు సంబంధించి ఇస్లామాబాద్‌ హైకోర్టులో విచారణకు హాజరైన ఆయనను కోర్టు బయట అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్‌ఐ కనుసన్నల్లోని సైన్యం తనను చంపడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించిన నేపథ్యంలో పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత అయిన 70 ఏళ్ల ఇమ్రాన్‌ను అరెస్టు చేయడం గమనార్హం. ఆయన అరెస్టుతో దేశవ్యాప్తంగా విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆర్మీ ప్రధాన కార్యాలయంపైనా ఇమ్రాన్‌ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. 

*_లాహోర్‌ కోర్‌ కమాండర్‌ ఇంట్లో నుంచి నెమళ్ల అపహరణ.._*
ఇమ్రాన్‌ అరెస్టుతో ఆగ్రహించిన పీటీఐ కార్యకర్తలు లాహోర్‌లోని కోర్‌కమాండర్‌ ఇంటిపై దాడిచేశారు. అక్కడి తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న నెమళ్లను కొందరు కార్యకర్తలు అపహరించి ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వీటిని ఎందుకు తీసుకెళుతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘ప్రజల డబ్బుతో కొన్నవి’ అని వారు జవాబివ్వడం గమనార్హం.

స్కామ్ ల కోసమే సోమేశ్ కుమార్

*స్కామ్ ల కోసమే సోమేశ్ కుమార్ ను మళ్ళీ తీసుకొచ్చారు.... భట్టి*

మామిడిపల్లి: రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఇంకా పదవుల కోసం పాకులాడొద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. రిటైర్‌ అయ్యాక కూడా పదవులు పట్టుకు వేలాడటం సరికాదని ఆయన హితవు పలికారు.రిటైర్డ్‌ అధికారులు వైదొలగి యువతకు అవకాశాలు ఇవ్వాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి ఎక్స్‌రోడ్‌లో భట్టి మీడియాతో మాట్లాడారు. 30ఏళ్ల కోసం టోల్‌ వసూలు చేసే అధికారం ఎవరైనా ఇస్తారా? వచ్చే 30 సంవత్సరాల ఆదాయం ఇప్పుడు తీసుకుంటే.. రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలని ప్రశ్నించారు. స్కామ్‌ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను మళ్లీ తీసుకొచ్చారని ఆరోపించారు. సోమేశ్‌ తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టాలని భట్టి డిమాండ్‌ చేశారు.

''సోమేశ్‌ కనుసన్నల్లోనే హైదరాబాద్‌ చుట్టూ ₹లక్షల కోట్ల భూములు చేతులు మారాయి. ఫార్మాసిటీ కట్టాలంటే పేదల భూములు ఎందుకు? గజ్వేల్‌, సిరిసిల్లలో ప్రభుత్వ భూములు లేవా? కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్‌ గుంజుకున్న భూములు తిరిగి ఇచ్చేస్తాం. కాంగ్రెస్‌ సంక్షేమంలో కోత పెట్టడం తప్ప భారాస చేసిందేమీ లేదు. అసైన్డ్‌దారులూ.. మీ భూములు మీరు కాపాడుకోండి. కేసీఆర్‌ ప్రభుత్వం అసైన్డ్‌ భూములు కూడా లాగేసుకుంటోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అసైన్డ్‌దారులకు అండగా నిలిచి భూములను హక్కుదారులకే ఇస్తాం. ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీల గురించి మాట్లాడే అర్హత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కి లేదు. కేటీఆర్‌.. ప్రజల కోసం పనిచేస్తారా? కంపెనీల కోసం చేస్తారా? ఇబ్రహీంపట్నంలోని పేదల వద్దకు, ఉస్మానియా వర్సిటీకి కేటీఆర్‌, తలసాని సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వెళ్లగలరా? ఆ దమ్ము ఉందా?'' అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

తలసాని వర్సెస్.... రేవంత్ రెడ్డి....!

*తలసాని వర్సెస్.... రేవంత్ రెడ్డి....!*

హైదరాబాద్: తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డిని పొట్టోడు.. వీడు వాడు అంటూ సంబోధించి 'నా కొడకా...పిసికితే ప్రాణం పోతది' అంటూ మంత్రినన్న విషయాన్ని కూడా మర్చిపోయి తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్‌ సభలో ప్రియాంకగాంధీ  యూత్‌ డిక్లరేషన్‌  ఎందుకు ప్రకటించారో వారికే తెలియాలని మంత్రి తలసాని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో దేశాన్ని 45-50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీకి.. పేదలకు రూ.2 వేల పింఛన్‌, 24 గంటల కరెంట్‌, ఇంటింటికి తాగునీరు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిన పాపం కాంగ్రెస్‌దేనన్నారు. ''ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతుండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు.. పిసికితే పాణం పోతది'' అని పరోక్షంగా రేవంత్‌రెడ్డినుద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చాలా కాలం దున్నపోతులతో తిరిగి.. ఆయన కూడా దున్నపోతు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు. పిసుకుడు సంగతి దేవుడెరుగు.. అతను నమిలే పాన్ పరాక్ మానేస్తే బాగుంటుందని రేవంత్ సూచించారు. ప్రజాప్రతినిధులుగా యువకులకు ఆదర్శంగా ఉండాలన్నారు. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్ పరాక్‌లు నమిలే వారు కూడా తన గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదన్నారు. '' ఒకవేళ ఆయనకు అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో, ఎక్కడకు రావాలో తారీఖు చెబితే వస్తా.. ఎవరేం పిసుకుతారో చూద్దాం. కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా.. రేవంత్ రెడ్డిని పిసకడం అంటే..?'' అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, May 8, 2023

పట్టాదారు పాసుపుస్తకం తరహాలో.... పెళ్లిపత్రిక

*పట్టాదారు పాసుపుస్తకం తరహాలో.... పెళ్లిపత్రిక*

కరీంనగర్‌: ఓ యువ అధికారి తన వివాహానికి వినూత్నంగా పెళ్లి పత్రిక రూపొందించారు. పట్టాదారు పాసుపుస్తకం తరహాలో శుభలేఖలను ప్రింట్‌ చేయించారు.శివరాజ్‌.. ఎరువుల సంస్థలో కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 12న కరీంనగర్‌లోని రెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో లాస్యశ్రీతో ఆయనకు వివాహం జరగనుంది. పనిచేస్తున్న సంస్థపై అభిమానం, ఓ రైతు కుమారుడిగా వ్యవసాయంపై మక్కువతో పెళ్లిపత్రికను పట్టాదారు పాసుపుస్తకం తరహాలో రూపొందించినట్లు శివరాజ్‌ తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, May 7, 2023

హెచ్ ఆర్ మేనేజర్ వేధింపులు... ఆత్మహత్య

*హెచ్ ఆర్ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక పోతున్నా....అమ్మా నాన్న నన్ను క్షమించండి.....!*

కొత్తూరు(రంగారెడ్డి జిల్లా): అమ్మా.. నాన్నా.. క్షమించండి.. మీతో కలిసి జీవించాలి అనుకున్నాను. కానీ, తప్పడం లేదు. కొంత కాలంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నా.మా కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ వేధింపులు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటూ యువకుడు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధి స్టేషన్‌ తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మున్సిపాలిటీలో వాటర్‌మెన్‌గా పనిచేస్తున్న పాశం గోపాల్‌, అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. చిన్న కుమారుడు సురేష్‌(29) సమీపంలోని వావిన్‌ పరిశ్రమలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. హెచ్‌ఆర్‌ మేనేజర్‌ రవికుమార్‌ కూన వేధింపులు తాళలేక ఉద్యోగానికి రాజీమా చేశాడు. నోటీస్‌ పీరియడ్‌లో భాగంగా ఈ నెల 5 వరకు పనిచేశాడు. ఆదివారం ఇంట్లోవారు బంధువుల పెళ్లికి వెళ్లడంతో సురేష్‌ ఇంట్లో చీరతో ఉరివేసుకున్నాడు.

మధ్యాహ్నం కుటుంబీకులు తిరిగివచ్చేటప్పటికే అతను మృతి చెందాడు. తల్లి అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్‌ వివరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని.. అన్నావదినలు, చెల్లి, పిల్లల్ని విడిచి వెళుతున్నందుకు బాధగా ఉందంటూ సురేష్‌ లేఖలో పేర్కొన్నాడు. అనూహ్య ఘటన నేపథ్యంలో కుటుంబీకుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఓకే ఇంట్లో.... 146ఓట్లు

*ఓకే ఇంట్లో.... 146ఓట్లు*

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టలో ఇంటినెంబరు 10-4-55/బి చిరునామాలో ఐదు కాదు..పది కాదు ఏకంగా వంద ఓట్లున్నాయి. మీ దగ్గర వందేనా మేమింకా ఎక్కువే అన్నట్లు అదే నియోజకవర్గం మైలార్‌గడ్డలో 11-1-748గా ఉన్న ఇంటి నెంబరుతో 146 ఓట్లున్నాయి.ఓటరు జాబితాలో ఒకే ఇంట్లో ఉన్న ఈ ఓటర్ల సంఖ్యను చూసి హతాశులైన అధికారులు నిజానిజాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.

● ఇలా ఒకే చిరునామాలో 50 నుంచి 100, అంతకంటే ఎక్కువే ఓటర్లున్న ప్రాంతాలు ఒక్క సికింద్రాబాద్‌ నియోజకవర్గానికే పరిమితం కాలేదు. హైదరాబాద్‌ జిల్లాలోని చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్‌, మలక్‌పేట తదితర నియోజకవర్గాల్లోనూ ఇలా ఒకే ఇంటి చిరునామాలో భారీసంఖ్యలో ఓటర్లున్నట్లు తెలిసింది. దీంతో సంబంధిత అధికారులు వాటి పరిశీలనను చేపడుతున్నారు. బోగస్‌లుంటే సరిదిద్దే చర్యలు చేపట్టనున్నారు.

*మొదలైన ఎన్నికల కసరత్తు...*
రాష్ట్రంలో ఆరేడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. జిల్లా, అసెంబ్లీ ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు, తదితరమైన వాటితో చేపట్టాల్సిన చర్యలపై అప్రమత్తం చేస్తోంది. జాబితా నుంచి ఓటర్లను తొలగించే పక్షంలో ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంతోపాటు నిబంధనల కనుగుణంగా తొలగించాలని సూచించింది. అంతేకాదు..ఇప్పటికే తొలగించిన ఓటర్లను మరోమారు పునఃపరిశీలించాలని కూడా ఆదేశించడంతో అందుకనుగుణంగా సంబంధిత ఎన్నికల అధికారులు ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలగించిన ఓటర్లతోపాటు ఒకే ఇంట్లో ఎక్కువ ఓటర్లున్న వారివిసైతం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడమే కాకుండా అలాంటి ఇళ్లకు ఫిజికల్‌ ఫైళ్లను కూడా నిర్వహించాలని సూచించడంతో ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

*ఒకే ఇంట్లో ఆరుగురికి మించితే..*
ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఒకే ఇంట్లో ఆరు కంటే ఎక్కువ ఓట్లున్నా కూడా పరిశీలిస్తూ ఫిజికల్‌ ఫైళ్లను నిర్వహించే చర్యలు చేపట్టారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, May 6, 2023

అక్రమ అడ్మిషన్లు చేసిన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి... టి.వీరేందర్ గౌడ్


*"అక్రమ అడ్మిషన్లు చేసిన కాలేజీ యాజమాన్యంపై చర్యలు చేపట్టకుండా బాధితులైన విద్యార్థుల మీద పోలీసుజులం ప్రదర్శించడం ఏమిటి: వీరేందర్‌ గౌడ్‌"*

➡️ ఇబ్రహీంపట్నం పరిధిలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ మరియు గురునానక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో అడ్మిషన్లు పొందిన దాదాపు 4,000 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించని నేపథ్యంలో..

➡️ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ అనుమతులు లేకుండా అక్రమంగా అడ్మిషన్లు చేసుకొని వేలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాలేజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా, విద్యార్థులకు సంఫీుభావంగా ఏబివిపి కార్యకర్తలు కాలేజీ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుండగా,పోలీసులు వచ్చి లాఠీ చార్జ్‌  చేశారు.కొందర్ని అక్రమంగా నిర్బంధించారు.

➡️ విషయం తెలుసుకొన్న వెంటనే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తూళ్ల వీరేందర్‌ గౌడ్‌ ఏబివిపి కార్యకర్తలను,విద్యార్థులను పరామర్శించారు.

➡️ అక్రమ అడ్మిషన్లు చేసిన కాలేజీ యాజమాన్యంపై చర్యలు చేపట్టకుండా బాధితులైన విద్యార్థుల మీద పోలీసుజులం ప్రదర్శించడం ఏమిటని వీరేందర్‌ గౌడ్‌ ప్రశ్నించారు. 

➡️ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంటూ ప్రభుత్వం విద్యార్థులకి న్యాయం చేయాలని, కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️ తరువాత తోపులాటలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రిలో పరామర్శించారు..

➡️ ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్త అశోక్ గౌడ్ గారు,బీజేపీ ఓబిసి మోర్చా కార్యవర్గం సభ్యులు కౌకుంట్ల రవితేజ గారు,రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ బి.మహేష్ యాదవ్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు..