హైదరాబాద్ : 18/08/2021
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీకి ప్రమోషన్
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీకి ప్రమోషన్ వచ్చింది. ఆమెను సుప్రీంకోర్టు జస్టిస్ గా ఎలివేట్ చేసేందుకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. మొత్తం 9 మంది జడ్జీలను సుప్రీంకోర్టుకు ఎలివేట్ చేసేందుకు కొలీజియం సిఫారసు చేయగా... అందులో జస్టిస్ హిమా కోహ్లీ సహా ముగ్గురు మహిళా న్యాయమూర్తులున్నారు. కర్ణాటక హైకోర్టు జడ్జ్ జస్టిస్ బీవీ నాగరత్న, గుజరాత్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ బేలా త్రివేదీలను కొలీజియం సిఫారసు చేసింది. వీరిలో జస్టిస్ బీవీ నాగరత్న భవిష్యత్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశాలున్నాయి. 2027లో ఆమె భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆమె దేశ మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకెక్కనున్నారు. బీవీ నాగరత్న తండ్రి జస్టిస్ ఈఎస్ వెంకట్రామయ్య 1989 లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా పనిచేశారు.
Q న్యూస్ మీడియా సౌజన్యంతో
No comments:
Post a Comment