Monday, January 30, 2023

తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం....సర్కార్ కు రిలీఫ్....!

*తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం....సర్కార్ కు రిలీఫ్....!*

హైదరాబాద్‌: తెలంగాణ 2023-24 బడ్జెట్‌కు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.ఇదిలా ఉంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఫిబ్రవరి 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభయ సభలకు ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. ఆ మరుసటి రోజున గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఇదిలా ఉండగా..

తెలంగాణ బడ్జెట్‌కు ఎట్టకేలకు గవర్నర్‌ ఆమోద ముద్ర లభించింది. బడ్జెట్‌ సమావేశాల్లో తన ప్రసంగం ఉంటుందా? అనే అభ్యంతరం లేవనెత్తిన గవర్నర్‌.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. దీంతో సర్కార్‌ హైకోర్టును ఆశ్రయించగా.. ఇరు పక్షాలను చర్చించుకుని ఓ కొలిక్కి తీసుకురావాలని బెంచ్‌ సూచించింది. దీంతో బడ్జెట్‌ సమావేశాల్లో ప్రసంగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి గవర్నర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందడంతో ఈ వివాదం ముగిసినట్లయ్యింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు....కోర్టులు కలగజేసుకోవచ్చు

*రాజ్యాంగ  ఉల్లంఘన జరిగినప్పుడు....కోర్టులు కలగజేసుకోవచ్చు*

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) తీరుపై తెలంగాణ సర్కార్  హైకోర్టు ను ఆశ్రయించింది. బడ్జెట్‌ ను ఆమోదించడంలేదంటూ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.పిటిషన్‌ను విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ ధవే వాదనలు వినిపించారు.

*దుష్యంత్ ధవే వాదనలు.....!*
రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు కలగజేసుకోవచ్చునని, 1974లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఆర్టికల్ 174, 153 ప్రకారం గవర్నర్ విధులను ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉంటుందన్నారు. పలు సుప్రీంకోర్టు కాపీలను ప్రస్తావించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి గవర్నర్‌ను సంప్రదించారని.. అయినా గవర్నర్ సంతకం చేయలేదని అన్నారు. అసెంబ్లీలో తన ప్రసంగం ఉందా అని గవర్నర్ అడిగారని, కోర్టుకు రావడం ... గవర్నర్‌పైనే పిటిషన్ దాఖలు చేయటం తమ ఉద్దేశం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

కాగా వాదనలు ప్రారంభంకాగానే న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారని ధర్మాసనం దుష్యంత్ ధవేను ప్రశ్నించింది. ఇలాంటి విషయాల్లో మేము కలగజేసుకుంటే కోర్టు పరిధి దాటి వ్యవహరిస్తుందని మీరే అంటారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వాదనలు కొనసాగుతున్నాయి. భోజన విరామం సమయం కావడంతో తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

గవర్నర్ తమిళిసై విషయంలో..... వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కార్

*గవర్నర్ తమిళిసై విషయంలో..... వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కార్*

హైదరాబాద్‌: గవర్నర్ తమిళిసై విషయంలో తెలంగాణ సర్కార్‌ వెనక్కి తగ్గింది. గవర్నర్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది.అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ తరఫు లాయర్‌ దుశ్యంత్‌ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. గవర్నర్‌ ప్రసంగంతోనే సమావేశాలు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు.

గవర్నర్‌ ప్రసంగం నేపథ్యంలో బడ్జెట్‌ తేదీ మార్పుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 3వ తేదీ బదులు 6వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

బడ్జెట్‌ సిఫార్సులకు ఇంకా గవర్నర్‌ ఆమోద ముద్ర పడని నేపథ్యంలో.. ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఈ నాటకీయ పరిణామల నడుమ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు సోమవారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం గమనార్హం

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, January 29, 2023

సమరానికి సై.... పార్లమెంట్ లో భారాస వ్యూహంపై MP లకు కేసీఆర్ దిశా నిర్దేశం

సమరానికి సై.... పార్లమెంట్ లో భారాస వ్యూహంపై MP లకు కేసీఆర్ దిశా నిర్దేశం*

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన భారాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భారాస ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. దాదాపు 3గంటల పాటు జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని భారాస పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని, ప్రతి బడ్జెట్‌లోనూ వివక్ష ప్రదర్శిస్తున్నారని, ఆర్ధిక అంశాలపై ఆంక్షలు విధించడం, రైతుల విషయంలో వివక్ష చూపడం.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు.

తెలంగాణకు రావాల్సిన విభజన హామీలు, ప్రాజెక్టులు, ఆర్థిక పరమైన అంశాలపై రాజీలేని పోరాటం చేయడంతో పాటు, జాతీయ అంశాలపై కూడా స్పష్టమైన వైఖరితో వ్యవహరించాలని సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు సూచించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను భాజపా కూలదోస్తోందన్న విషయాలను ప్రధానంగా ప్రస్తావించాలని, దానిపై చర్చ లేవనెత్తాలని సీఎం కేసీఆర్‌ సూచించినట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపైనా ఎండగట్టాలని, సానుకూలంగా ఉన్న మిగతా పార్టీలతో కలిసి వీటన్నింటిపై వ్యూహాత్మకంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం గతంలో ఏవిధంగా పోరాడారో అలాగే పోరాడాడుతూ.. జాతీయ అంశాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, January 27, 2023

GHMC ఎంప్లాయీస్ యూనియన్ (BMS) వినతిపత్రం


భాగ్యనగర మున్సిపల్ GHMC ఎంప్లాయీస్ యూనియన్ (BMS) అధ్వర్యంలో  GHMC కమిషనర్ శ్రీ DS. లోకేష్ కుమార్ గారిని  మర్యాదపూర్వంగా కలవడం జరిగింది, ఎంప్లాయీస్ యొక్క సమస్యల గురించి వాటి యొక్క పరిష్కారం కోసం కలవడం జరిగినది, మొదటిగా ఎంప్లాయీస్ పదొనతి క్లాస్ -iv నుండి సూపరింటెండెంట్ స్థాయీ వరకు పదొనతలు, మరియు కొత్తగా HRMS లో పెన్షనర్ యొక్క డేటా ఎంట్రీ కి సంబంధించి ఉద్యోగులూ పనికి ఒత్తిడి అయితుందని పేన్షనర్ యొక్క సర్వీస్ రిజిస్టర్ బెస్ చేసుకొని చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరడమైనది.ఇందుకు కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు, ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ. T. కృష్ణా, ప్రధాన కార్యదర్శి,  శ్రీ. రాధ క్రిష్ణ Addl జనరల్ సెక్రటరీ, శ్రీ. జయకృష్ణ, సెక్రెటరీ, ఖైరతాబాద్ జోనల్ అధ్యక్షులు శ్రీ. G. సుదర్శన్, ఖైరతాబాద్ జోనల్ సెక్రెటరీ. శ్రీ. R. వెంకటేష్, సికంద్రబాధ జోన్ అధ్యక్షులు శ్రీ. K. రాజు, LB నగర్ జోన్ అధ్యక్షులు శ్రీ. M.యాదయ్య.

ప్లోరోసిస్ భాదితుడు స్వామి మృతి..... KTR తీవ్ర దిగ్భ్రాంతి

*ప్లోరోసిస్ భాదితుడు స్వామి మృతి..... KTR తీవ్ర దిగ్భ్రాంతి*

చౌటుప్పల్‌: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి (32) శనివారం ఉదయం మృతిచెందాడు. ట్రై సైకిల్‌ పైనుంచి కింద పడి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందారు.ఈ వార్త తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి మృతిపై ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ స్పందించారు. ''స్వామి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఫ్లోరోసిస్‌ నివారణ, బాధితుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు ఆయన. ఎంతో మందికి ఆయన ప్రేరణ. స్వామి ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి'' అని సంతాపం ప్రకటించారు.

గతంలో స్వామికి మంత్రి కేటీఆర్‌ ఇల్లు కట్టించారు. జీవనోపాధి కోసం ఆయనకు సెలూన్‌ ఏర్పాటు చేయించారు. మూడు నెలల క్రితం ఆయన ఇంటి గృహ ప్రవేశానికి కూడా కేటీఆర్‌ హాజరయ్యారు. ఆ సందర్భంగా దిగిన ఫొటోను కేటీఆర్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️

కోర్టు దిక్కరణ కేసు మంత్రి పువ్వాడ కు.... హైకోర్టు నోటీసులు!

*కోర్టు దిక్కరణ కేసు మంత్రి పువ్వాడ కు.... హైకోర్టు నోటీసులు!*

హైదరాబాద్: మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు నోటీసు పంపింది. మమతా మెడికల్ కాలేజీ ఛైర్మన్ హోదాలో ఉన్న ఆయన విద్యార్థుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులు తిరిగి ఇ‍వ్వనందుకు చర్యలు తీసుకుంది.పీజీ వైద్య కోర్సులకు విద్యార్థుల నుంచి 2017 జీవో ప్రకారం పెంచిన ఫీజులు తీసుకుంది మమత కాలేజీ. 2016 జీవో ప్రకారం పాత ఫీజు తీసుకోవాలని వైద్య కళాశాలలకు హైకోర్టు గతేడాది ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల నుంచి కాలేజీలు వసూలు చేసిన అధిక ఫీజు తిరిగి ఇవ్వాలని చెప్పింది.

అయితే మమత మెడికల్ కాలేజీ తమకు రావాల్సిన ఫీజు తిరిగి ఇవ్వడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై వివరణ ఇవ్వాలని పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసు పంపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Thursday, January 26, 2023

అందరికీ స్వతంత్ర భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🙏

*అందరికీ స్వతంత్ర భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🙏*

*#గణతంత్రదినోత్సవం*
*#RepublicDay2023*
 
*Bplkm🪶*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/

https://www.instagram.com/p/Cn3ECyrvWGN/?igshid=NDdhMjNiZDg=

రాష్ట్రాభివృద్ధికి రాజ్ భవన్ సహకారం.... గవర్నర్....!

*రాష్ట్రాభివృద్ధికి  రాజ్ భవన్ సహకారం.... గవర్నర్....!*

హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

''ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉంది.

శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది. వైద్యం, ఐటీ రంగాల్లో భాగ్యనగరం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌ అనుసంధానమై ఉంది. ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోదీ వందేభారత్‌ రైలును కేటాయించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో రాజ్‌భవన్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. వారిలో పోషకాహార సమస్య నివారణకు కృషి చేస్తున్నాం'' అని గవర్నర్‌ తెలిపారు. ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు ఎం.ఎం.కీరవాణి, చంద్రబోస్‌ తదితరులు పాల్గొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, January 25, 2023

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా.... MLA తో ప్రాణాహాని ఉందని ఆరోపణ....!

*జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా.... MLA తో ప్రాణాహాని ఉందని ఆరోపణ....!*

జగిత్యాల: తెరాస జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ వేధింపులు భరించలేక పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.బుధవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ.. ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి కంటతడిపెట్టారు. ప్రశ్నించడంతోనే ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

''మీకు పిల్లలు ఉన్నారు. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరించారు. డబ్బుల కోసం డిమాండ్‌ చేశారు. మేము ఇచ్చుకోలేం అని చెప్పాం. దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్షగట్టారు. అన్ని పనులకు అడ్డొస్తూ చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయొద్దని హుకుం జారీ చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి నరకప్రాయంగా ఉంది. నడిరోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యా. ఎమ్మెల్యేతో పోలిస్తే మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి చిన్నది అంటూ అవమానించారు. ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లా. చెప్పకుండా వార్డు సందర్శన చేసినా వారి దృష్టిలో నేరమే. ఒక్క పనికూడా నా చేతులతో ప్రారంభించకుండా చేశారు. జిల్లా కలెక్టర్‌ను కలవొద్దని ఆదేశించారు. అనుకూలంగా ఉన్న కొద్దిమంది కౌన్సిలర్లను కూడా ఇబ్బంది పెట్టారు. అందరిముందూ అవమానించేవారు. బీసీ మహిళననే కక్షగట్టారు. సబ్బండ వర్గాలు రాజకీయాలకు పనికిరారా? పేరుకే మున్సిపల్‌ ఛైర్మన్‌ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యేదే. నాకు మాట్లాడే స్వేచ్ఛకూడా ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదవాలి. కవితను కూడా కలకూడదు, కేటీఆర్‌ పేరు ప్రస్థావించకూడదు అని హుకుం. ఆశీర్వదిస్తూ కవిత ఇంటికి వస్తే వేధింపులు. ఎమ్మెల్యేతో మా ప్రాణాలకు ముప్పు ఉంది. మా కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యే సంజయ్‌ కుమారే కారణం. రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని వేడుకుంటున్నా'' అని శ్రావణి మీడియా సమావేశంలో వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, January 24, 2023

హైదరాబాద్​కు ఎల్లో అలర్ట్!!

*హైదరాబాద్​కు ఎల్లో అలర్ట్* 
        
*టెంపరేచర్​ 11 డిగ్రీలకు పడిపోయే అవకాశం*

*రేపటి నుంచి విపరీతంగా మంచు కురిసే చాన్స్*

*సిటీవాసులు అప్రమత్తంగా ఉండాలి: వాతావరణ శాఖ*

హైదరాబాద్‌‌లో గురువారం నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. సుమారు 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు సిటీకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి విపరీతంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని, సిటీవాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ముఖ్యంగా సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. పొగమంచు కారణంగా ఉదయం, సాయంత్రం ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక యాక్సిడెంట్లు జరిగే చాన్స్​ ఉందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, పిల్లలు, పెద్దలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బుధవారం15 డిగ్రీలు, గురువారం 12 డిగ్రీలు, శుక్రవారం 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

*సుజీవన్ వావిలాల*🖋️

Monday, January 23, 2023

ఇంకా ఇరవై మూడేనా....!

ఇంకా ఇరవై మూడేనా...!
లెటేస్ట్ సర్వే రిపోర్ట్ లో కారు స్పీడెంత .?
20 మంది సిట్టింగులపై ఎర్రబెల్లి కామెంట్స్
20 కాదు 40 మంది ఎమ్మెల్యేలకు నో టికెట్.?
అభ్యర్థుల షార్ట్ లిస్ట్ రెడీ చేసిన కాక
బీజేపీ, కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఖరారు అయ్యాక ప్రకటించే ఛాన్స్
శనార్తి తెలంగాణ, హైదరాబాద్ :
ఏడాది కిందే కారు సర్వీస్ కు వచ్చిన సంగతి తెలిసిందే. స్పీడు ఏకంగా 23కి పడిపోయిందని క్లారిటీ వచ్చింది. పీకే ఇచ్చిన సర్వే రిపోర్టులో, సీఎం కేసీఆర్ సొంతంగా చేయించుకున్న సర్వేలోనూ ఇదే తేటతెల్లం అయింది. కట్ చేస్తే.. సిట్టింగులకు నో టికెట్లు అనే స్టేట్మెంట్ల నుంచి మళ్లీ సిట్టింగులకే సీట్లు అనే స్పష్టత దాకా కేసీఆర్ యూటర్న్ రాజకీయాలు నడిశినయి. మరీ.. ప్రస్తుతం కారు స్పీడెంత అంటే.. ? గదే 23 బిలో అంటున్నయి లేటెస్ట్ సర్వేలు. అంతేకాదు.. ఇంకా ఆలస్యం చేస్తే.. పదికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశినయని సమాచారం. ఈ నేపథ్యంలోనే ముందస్తుకు పోవడంతో పాటు.. మళ్లీ సిట్టింగులకు సీట్లు ఇస్తానని చేసిన ఒట్టుని తీసి గట్టుమీద పెట్టే పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు అంత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.
ఈ క్రమంలోనే కోవర్టు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ముద్రపడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కాక రంగంలోకి దింపినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది సిట్టింగ్ లను మార్చితే 100 సీట్లు గ్యారంటీ అని ఇటీవల ఎర్రబెల్లి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ చేయించిన లేటెస్ట్ సర్వేలతో పాటు, పీకే ఇచ్చిన తాజా సర్వేలోనూ.. పార్టీ చరిష్మా తగ్గిందని తేలిందని టాక్. దీనికి మళ్లీ సిట్టింగులకే సీట్లు అనే స్పష్టత ఓ కారణమని చెబుతున్నారు. ఎర్రబెల్లి కేవలం 20 మంది సిట్టులను మార్చితే .. 100 గెలుస్తం అన్నారు. కానీ 20 కాదు 40 మందికి నిరాశ తప్పదని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్ లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారని చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకు నో టికెట్లు అనే సంకేతాలు ఏడాది క్రితమే గులాబీ పార్టీ నుంచి వెలువడ్డాయి. ఐతే రోజురోజుకు పుంజుకుంటున్న బీజేపీ సిట్టింగులకు మరో బలమైన ఆప్షన్ గా మారింది. ఎన్నికలకు ఆర్నేళ్ల ముందే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కమలం పార్టీలో టికెట్ బుక్ చేసుకునే వరకు పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ పార్టీ విస్తృతస్థాయి వేదికగా మళ్లీ సిట్టింగులకే సీట్లు అనే స్పష్టత ఇచ్చారు. దీంతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం మానేసి.. సొంత నియోజకవర్గంలో మరోసారి ఓట్లు అడుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వాళ్లు ఎన్ని రకాలుగా కింద మీద పడ్డా ఈసారి గెలిచే అవకాశాలు లేవని లేటెస్ట్ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి తో కాక 20 మందికి టార్గెట్ ఫిక్స్ చేసినట్లు కనబడుతుంది.
ఆఖరి నిమిషయంలో ఆగం చేసే పని :
సిట్టింగులలో చాలా మందికి టికెట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా రెడీ చేసుకున్నారు. కాకపోతే.. హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడే కాదు. బీజేపీ, కాంగ్రెస్ లలో నియోజకవర్గాల వారీగా ఓ జాబితా రెడీ అయినా తర్వాత.. సిట్టింగులకు నో టికెట్.. మళ్లీ అధికారంలోకి వస్తే.. నామినేటెడ్ పోస్టుల పేరిట చల్లబరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తున్నది. మొత్తానికి.. కేసీఆర్ ను నమ్మి మరోసారి టికెట్ ఖాయమని ధీమాగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఘోరాతి ఘోరంగా మోసపోబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త.. అంటూ శనార్తి తెలంగాణ హెచ్చరిస్తున్నది.

Courtesy by : Q న్యూస్ మీడియా 

స్మితా సభర్వాల్ ఇంట్లో చొరబడిన అధికారి సస్పెన్షన్....!

*స్మితా సభర్వాల్ ఇంట్లో చొరబడిన అధికారి సస్పెన్షన్....!*

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి, సీనియర్‌ ఐఏఎస్‌ స్మితా సభర్వాల్‌ ఇంట్లోకి చొరబడిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌రెడ్డిని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్‌ ఆదేశాలను చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూశాఖ అధికారులు అందించనున్నారు. మరోవైపు చొరబడిన వ్యవహారంపై పోలీసు నిఘావర్గాలు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, January 21, 2023

బిఎస్పి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరసన దీక్ష విజయవంతం

*బిఎస్పి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరసన దీక్ష విజయవంతం*

*అగ్రకుల పార్టీల్లోని బీసీలు నిజమైన బీసీలకు పుడితే బీసీల కోసం పోరాటం చేయాలని జర్నలిస్టు తెలంగాణ విట్టల్ డిమాండ్*

*బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు బీసీ వ్యతిరేక పార్టీలు జాజుల శ్రీనివాస్ గౌడ్*

*దీక్షలో పాల్గొన్న షాద్నగర్ బిఎస్పి నాయకులు*

భారతదేశంలో జనాభాలో 52 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ 27% నుండి 52 శాతానికి పెంచాలని బహుజన్ సమాజ్ పార్టీ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సికింద్రాబాద్ ఉమ్మడి జిల్లాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా బహుజన్ సమాజ్ పార్టీ బీసీ స్టీరింగ్ కమిటీ మెంబర్స్ డాక్టర్ సాంబశివ గౌడ్ చంద్రశేఖర్ ముదిరాజ్ శ్రీనివాస్ యాదవ్  తెలంగాణ విటల్ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు జనాభాలో మెజార్టీ శాతం ఉన్న బీసీలను అగ్రకుల పార్టీలు వాడుకొని అభివృద్ధిలో వెనక్కి నెట్టేస్తున్న విషయాన్ని గుర్తుతెరిగి బహుజన్ అంత ఏకమై బీసీల రిజర్వేషన్ను జనాభాకు తగ్గ స్థాయిలో సాధించుకోవడానికి ఏకం కావాల్సిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు అదేవిధంగా దేశ సంపదలో ఉత్పత్తిదారులుగా ఉన్నటువంటి బీసీలను అగ్రకుల పార్టీలు కుట్రపూరితంగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మోసం చేస్తున్నాయని విమర్శించారు,  అదేవిధంగా జర్నలిస్ట్ *తెలంగాణ విటల్* మాట్లాడుతూ అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు నిజమైన బీసీలకే పుడితే, బీసీల తరఫున గొంతేటి మాట్లాడాలని, వారి తరఫున పోరాటం చేయాలని, మీరు బీసీల తరఫున ఉంటారా చెంచాలుగా ఉంటారా తెలుసుకోవాలని సవాల్ విసిరారు,  అదేవిధంగా తెలంగాణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు *జాజుల శ్రీనివాస్ గౌడ్* మాట్లాడుతూ బీసీలను గల్లీలో కేసీఆర్ మోసం చేస్తే, ఢిల్లీలో నరేంద్ర మోడీ బిజెపి పార్టీ మోసం చేస్తున్నారని ,ఇప్పటికైనా బీసీలు ఈ కుట్రలను పసిగట్టి అగ్రకుల పార్టీలైన బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలని, ఆ పార్టీలను పాతరేయాలని పిలుపునిచ్చారు, బీసీల తరఫున పోరాటం చేస్తున్న బీఎస్పీకి అండగా ఉండాలని , బీఎస్పీ పార్టీ జనాభాకు తగ్గ ఎమ్మెల్యే ,ఎంపీ సీట్లు ఇస్తుంటే, బిజెపి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు ఇయట్లేదో బీసీలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు, కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి. లింగం , షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ , ఫరూక్నగర్ మండల అధ్యక్షులు తుప్పరి కుమార్ ,కొత్తూరు మున్సిపాలిటీ అధ్యక్షులు గట్టు విష్ణు ,కొత్తూరు మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు రేనెట్లా జలంధర్ గౌడ్ , వెలిజర్ల సెక్టార్ సెక్రెటరీ లింగారం లక్ష్మయ్య, బీఎస్పీ సీనియర్ నాయకులు దొబ్బల రమేష్ తదితరులు పాల్గొన్నారు

సుజీవన్ వావిలాల !

Friday, January 20, 2023

తిరుమలలో డ్రోన్ కలకలం....!

*తిరుమలలో డ్రోన్ కలకలం....!*

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన వీడియో ఒకటి కలకలం సృష్టించింది. ఈ వీడియో శుక్రవారం సాయంత్రం సోషల్‌ మీడియాలో కనిపించడంతో తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు.ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. విమానాలను సైతం శ్రీవారి ఆలయం వైపునకు వెళ్లకుండా చూడాలని గతంలోనే పలువురు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంపై నుంచి డ్రోన్‌ ద్వారా చిత్రీకరించిన వీడియో ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. డ్రోన్‌తో చిత్రీకరించినా తితిదే విజిలెన్స్‌ అధికారులు గుర్తించలేకపోవడం భద్రతా వైఫల్యంగా భక్తులు భావిస్తున్నారు. శ్రీవారి ఆలయం ఎదుట గొల్లమండపంపై, శ్రీవారి ఆలయంపైన నిరంతరం భద్రతా సిబ్బంది నిఘా ఉంటుంది. అలాంటిది భద్రతా సిబ్బంది ఎవరూ ఈ డ్రోన్‌ చిత్రీకరణను గుర్తించలేకపోయారు. మరోవైపు తిరుమల వ్యాప్తంగా 1600కు పైగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. అందులోనూ ఈ డ్రోన్‌ వ్యవహారం బయటపడకపోవడం గమనార్హం.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, January 17, 2023

NTR కు నారా నందమూరి కుటుంబ సభ్యుల నివాళులు!

*NTR కు నారా నందమూరి కుటుంబ సభ్యుల నివాళులు!*

హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌ 27వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో నందమూరి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. నారా భువనేశ్వరి, బాలకృష్ణ, రామకృష్ణ, సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ తదితరులు ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ కుమారుడిగా పుట్టడం పూర్వజన్మ సుకృతమన్నారు. టీడీపీ రూపంలో ఎన్టీఆర్‌ తమకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారన్నారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని బాలయ్య పేర్కొన్నారు.

సుహాసిని మాట్లాడుతూ... అందరం కలిసి పార్టీకి పునర్వైభవం తీసుకువద్దామని సుహాసిని కోరారు. ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాముడైనా, రావణ బ్రహ్మ అయినా ఎన్టీఆరేనన్నారు. ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ''ఆరాధ్య కథానాయకుడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి. నటుడిగా ఎన్టీఆర్ అనేక చారిత్రాత్మక చిత్రాలు నిర్మించారు. 1982 లో ప్రజలకు సేవ చేసేందుకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ కృషి చేశారు. ఎన్టీఆర్ ప్రపంచ స్థాయికి తెలుగు వారి కీర్తిని ఇనుమడించారు. ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది అందరికీ గర్వకారణం'' అని పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల🖋️* 

నిజాం రాజు ముకరం జాకు సీఎం కేసీఆర్ నివాళులు....!

*నిజాం రాజు ముకరం జాకు సీఎం కేసీఆర్ నివాళులు....!*

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సంస్థానం 8వ నిజాం రాజు బర్కత్‌ అలీ ఖాన్‌ ముకరంజా బహదూర్‌ (89) టర్కీలో మరణించిన విషయం తెలిసిందే.
అనంతరం, సోమవారం ముకరంజా పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. సోమవారం సాయంత్రం ముకరంజా పార్థీవ దేహాన్ని చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచారు.కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ముకరంజా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చౌమహల్లా ప్యాలెస్‌కు వెళ్లిన కేసీఆర్‌.. నిజాం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడున్న వారితో కాసేపు మాట్లాడారు. ఇదిలా ఉండగా.. ప్రజల సందర్శనార్థం రేపు ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు ముకురం జా పార్థీవ దేహాన్ని అక్కడే ఉంచనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మక్కా మసీదులో ముకరం జా అంత్యక్రియలు జరుగనున్నాయి. మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల ప్రాంగణంలో ముకరంజా ఖననం కోసం నిజాం ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18న నిర్వహించే ముకరంజా అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు సోమవారం పరిశీలించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, January 16, 2023

ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ షెడ్యూల్..

*ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ షెడ్యూల్..* 


 *• తేదీ : 17.1.2023* రాత్రికి జాతీయ నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటారు.
• *యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్* కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  స్వాగతం పలుకుతారు. 
• *ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి* , పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కి మంత్రి మహమూద్‌ అలీ  స్వాగతం చెబుతారు. ప్రొటోకాల్ చూస్తారు.
 *• కేరళ సీఎం పినరయి విజయన్* కి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, 
• *సీపీఐ జాతీయనేత డి.రాజాకు* - బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్‌ స్వాగతం స్వాగతం పలుకుతారు.   
 *• తేదీ 18.1.2023* ఉదయం జాతీయ నేతలంతా సీఎం కేసీఆర్ గారితో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు.
• ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో కలిసి వారంతా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
• యాదాద్రి నుంచి రెండు హెలీకాప్టర్లలో ఖమ్మంకు బయలుదేరుతారు.
• నేరుగా సీఎం కేసీఆర్‌ తో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్‌ చేరుకొని, రాష్రంరులో చేపట్టే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
• ఖమ్మం సభా వేదిక ముందు ప్రధాన నాయకులకు ప్రత్యేక సెక్టార్‌ ఉంటుంది.
• మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు సభావేదిక ముందు ఆసీనులవుతారు.
• సీఎం కేసీఆర్‌ తో సభా వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలే ఉంటారు.
• *18వ తేదీ మ. 2 నుంచి సా. 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది.*

*సుజీవన్ వావిలాల*🖋️

ప్రవాసుల మద్దతు గొప్పగా ఉంటుంది.... మంత్రి KTR....!

*ప్రవాసుల మద్దతు గొప్పగా ఉంటుంది.... మంత్రి KTR....!*

దావోస్‌: స్విట్జర్లాండ్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ దావోస్‌ వెళ్లారు. ఈ సందర్భంగా దావోస్‌ చేరుకున్న కేటీఆర్‌కు అక్కడి స్థానిక తెలుగువారు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం నిర్వహించిన 'మీట్‌ అండ్‌ గ్రీట్‌' కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

''దేశంలో ఉన్న వాళ్లతో పోల్చుకుంటే ప్రవాస భారతీయులకు దేశ వ్యవహారాలు, స్థానికంగా ఉన్న అంశాలు, అభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. దావోస్ వచ్చిన ప్రతిసారీ స్విట్జర్లాండ్ నుంచి ప్రవాస భారతీయులు ఇచ్చే మద్దతు గొప్పగా ఉంటుంది. మానవ జీవితం పరిమిత కాలమనే సిద్ధాంతాన్ని నమ్మి, సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ శాఖ వలన కొంత ప్రచారం లభిస్తోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన పనితీరుతో గొప్ప ప్రగతిని సాధిస్తున్నాయి. అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని సాధించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు సైతం దేశంలో ఆదర్శ గ్రామాలు, పట్టణాలుగా గుర్తింపు పొందాయి'' అని కేటీఆర్‌ పేర్కొన్నారు. అనంతరం ప్రవాస భారతీయులు నిర్వహించిన మకర సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన స్థానిక తెలుగువారికి కేటీఆర్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.నేటి నుంచి ఐదు రోజుల పాటు దావోస్‌ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుంది. 'విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం'' అనే అంశంపై ఈ సదస్సును నిర్వహించనున్నారు. దాదాపు 52 దేశాల అధినేతలు, 130 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారు. ఆర్థిక, ఇంధన, ఆహార సంక్షోభాల పరిష్కారంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చకు రానుంది. ప్రపంచ ఆర్థిక సదస్సుకు భారత్‌ నుంచి కేంద్ర మంత్రులు మున్‌సుఖ్‌ మాండవీయ, అశ్వీనీ వైష్ణవ్‌, స్మృతి ఇరానీ, ఆర్‌కే సింగ్‌, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, పలువురు సీఎంలు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఇతర ప్రతినిధులు హాజరుకానున్నారు

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, January 15, 2023

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారు.

*తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారు....*

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 17వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడించారు.ఫిబ్రవరి 17వ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజున సచివాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

*సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో టీచర్స్‌ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది*.

*ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాలతో​ మంత్రులు హరీష్‌ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. భేటీ సందర్బంగా బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. ఇందుకు తగినట్టు మంత్రులు కార్యచరణను రూపొందిచనున్నారు* 

Friday, January 13, 2023

హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం కీలక ప్రకటన.....!

*హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం కీలక ప్రకటన.....!*

*అమెరికా స్టూడెంట్‌ వీసాపై 19న ప్రత్యేక సెషన్‌....!*

హైదరాబాద్‌, : అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌లో ప్రత్యేక సమాచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం తెలిపింది.ఈ నెల 19న సాయంత్రం 3.30-4.30 గంటల మధ్య 'వర్చువల్‌ స్టూడెంట్‌ వీసా ఇన్ఫర్మేషన్‌ సెషన్‌' ఉంటుందని ట్వీట్‌ చేసింది. ఇది పూర్తిగా ఉచితమని పేర్కొంది. ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు 19 జూమ్‌ లింక్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఎఫ్‌-1 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు అమెరికన్‌ కాన్సులేట్‌ వీసా అధికారి సూచనలు ఇస్తారు. దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు, ఇంటర్వ్యూ, వీసా నిబంధనల గురించి వివరిస్తారు. విద్యార్థి వీసాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఈ సెషన్‌లో ఇస్తామని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయం తెలిపింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ప్రభుత్వ ఆసుపత్రికీ చికిత్సకోసం వచ్చి ఇద్దరు బాలింతల.... మృతి

*ప్రభుత్వ ఆసుపత్రికీ చికిత్సకోసం వచ్చి ఇద్దరు బాలింతల.... మృతి*

మలక్‌పేట: హైదరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు బాలింతల మృతితో నగరంలోని మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ బాధితుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన మహేశ్‌.. తన భార్య సిరివెన్నెల (23)తో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మహేశ్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్యను ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆపరేషన్ చేసి వైద్యులు కాన్పు చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అస్వస్థతకు గురికావడంతో వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల ప్రాణాలు కోల్పోయింది. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందంటూ ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద బైఠాయించారు.మరోవైపు తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జగదీశ్‌.. తన భార్య శివాణిని ఈ నెల 9న మలక్‌పేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో శివాని బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో మలక్‌పేట్‌ ఆస్పత్రి వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాని కూడా ప్రాణాలు కోల్పోయింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, January 11, 2023

సీఎస్ శాంతికుమారికి సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు

సీఎస్ శాంతికుమారికి సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు
హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర మొట్ట మొద‌టి మ‌హిళా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శాంతి కుమారికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న‌కు సీఎస్‌గా అవ‌కాశం క‌ల్పించినందుకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను శాంతికుమారి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్‌మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 

Monday, January 9, 2023

అవ్వకు ఇల్లు కట్టించిన SI.... రాజారాం

*అవ్వకు ఇల్లు కట్టించిన SI.... రాజారాం*

వరంగల్‌ జిల్లా నల్లబెల్లికి చెందిన మేడిపల్లి సమ్మవ్వ(సమ్మక్క) కుమారుడు సంపయ్య ఇరవై ఏళ్లక్రితం చనిపోగా, భర్త అయి లయ్య ఏడాది క్రితం అనారో గ్యంతో కాలం చేశాడు.దీంతో ఎవరూ లేని ఆమె గ్రామంలో భిక్షాటన చేస్తూ బతుకుతోందని స్థానికులు ఎస్సై నార్లాపురం రాజారాం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన 'ఆమె అనాథ కాదు.. బాగోగులు నేను చూసుకుంటా.. ఉండేందుకు ఇల్లు కటించే బాధ్యత నాదే'' నని చెప్పి...

అన్నట్టుగానే సొంత డబ్బులతో ఇల్లు కట్టించి సోమవారం గృహప్రవేశం చేయించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఏసీపీ సంపత్‌రావు ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్‌ కటింగ్‌ చేసి గృహప్రవేశం చేశారు. అనంతరం సమ్మవ్వకు ఏసీపీ చేతుల మీదుగా నిత్యవసర సరుకులు అందించారు. అనాథ అవ్వను దత్తత తీసుకున్న రాజారాంను అందరూ అభినందించారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, January 7, 2023

ఏపీ ఎన్నికల బరిలో... బిఆర్ఎస్ సీట్లు ఇవే.!

*_ఏపీ ఎన్నికల బరిలో... బిఆర్ఎస్ సీట్లు ఇవే.!_*
_● పెద్ద ప్లానే ఇది.._
_● జగన్ సహకారం.!_
_● 'కాపు' కాసి మరీ.._
_● వలసల క్యూ లో దొంగల బ్యాచ్.!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009, 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*

*_ఎట్టకేలకు కేసీఆర్ జాతీయ పార్టీ ఎత్తుగడలు మొదలెట్టారు. ఆంధ్రోళ్ళను తిట్టిన తిట్లు తిట్టిన కేసీఆర్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో 20 స్థానాల్లో పోటీ చేయాలని భావించటం.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను వేడెక్కించనున్నది. రాజకీయ పార్టీల పొత్తులు, సరికొత్త ఎత్తుగడలతో ఉభయ రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ దాదాపు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ పేరుతో జాతీయ పార్టీగా ముందుకెళ్లడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు అధ్యక్షుడిని కూడా ప్రకటించారు._*

*_'కాపు' కాసి..._*
ఏపీ రాజకీయం, సామాజిక వర్గాలను వేరువేరుగా చూడలేమనే విషయాన్ని గుర్తెరిగిన కేసీఆర్ కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌‌కు ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. జగన్ ప్రోద్భలంతోనే బీఆర్‌ఎస్ ఏపీలో రాజకీయం మొదలుపెట్టిందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో ఏపీలో బీఆర్‌ఎస్ రాజకీయానికి సంబంధించి తాజాగా మరో ప్రచారం ఊపందుకుంది. ఏపీలో వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్ ఉవ్విళ్లూరుతుందట. అంతేకాదు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగొచ్చనే వాదన బలంగా వినిపిస్తుండటంతో ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ స్థానాల్లో పోటీ చేయాలో కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారని సమాచారం.

*_20 స్థానాల్లో కసరత్తులు_*
ఏపీలో మొత్తం 20 స్థానాల్లో పోటీ చేయాలని బీఆర్‌ఎస్ డిసైడ్ అయిందని టాక్ నడుస్తోంది. వీటిల్లో మెజార్టీ స్థానాలు అసెంబ్లీ సీట్లు కాగా, రెండుమూడు లోక్‌సభ స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలపాలని బీఆర్‌ఎస్ భావిస్తుందని తెలిసింది. మరీ ముఖ్యంగా.. ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపితే గెలిచినా, ఓడినా రాజకీయంగా ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందనేది కేసీఆర్ స్ట్రాటజీగా తెలుస్తోంది. పైగా.. సరిహద్దు జిల్లాలయితే రాష్ట్ర విభజన సెగ కాస్త తక్కువగా ఉంటుందని అధిష్టానం భావిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే.. ఏఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపాలనే విషయమై బీఆర్‌ఎస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టిందట.

*_సర్వే కూడా..._*
ఈ మేరకు ఏపీలోని కొన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్ ఒక సర్వే కూడా నిర్వహించిందని టాక్. ఏపీలోని ఇతర రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నయంగా బీఆర్‌ఎస్‌‌ను ప్రజలు ఎంచుకునే అవకాశం ఉందా ?, బీఆర్‌ఎస్‌కు ఓటేసేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారా ? తెలంగాణలో కేసీఆర్ సంక్షేమ పథకాల పట్ల ఏపీ ప్రజలు సానుకూలంగా ఉన్నారా? వంటి ప్రశ్నలను ఆ సర్వే బృందం ప్రజలను అడిగారట. ఈ తరహా సర్వేలే గత నెల కర్ణాటక, మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ చేయించిందని తెలిసింది. కర్ణాటకలో 2023 ఏప్రిల్, మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అక్కడ కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని బీఆర్‌ఎస్ డిసైడ్ అయింది.

*_సరిహద్దుల్లో అయితే..._*
ఇక.. ఏపీలో బీఆర్‌ఎస్ పోటీ చేయాలని భావిస్తున్న జిల్లాల విషయానికొస్తే.. సరిహద్దు జిల్లాలే ప్రధానంగా కేసీఆర్ పార్టీ అభ్యర్థులను నిలపనుంది. గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కర్నూలు, కృష్ణ జిల్లాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట స్థానాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ రెండు స్థానాల్లోనే ఎందుకంటే.. జగ్గయ్యపేట, నందిగామ ఈ రెండు నియోజకవర్గాలు తెలంగాణలోని కోదాడకు దగ్గరగా ఉంటాయి. నందిగామ, కోదాడ మధ్య దూరం ఇంచుమించు 45 కిలోమీటర్లు కాగా, జగ్గయ్యపేట, కోదాడ మధ్య దూరం కేవలం 23 కిలోమీటర్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ రెండు స్థానాల్లో అయితే కోదాడకు రాకపోకల కారణంగా తెలంగాణతో సంబంధాలను కలిగి ఉంటారని, అందువల్ల రాష్ట్ర విభజనకు కారణం కేసీఆర్ అనే వ్యతిరేక భావన తక్కువగా ఉంటుందని బీఆర్‌ఎస్ భావిస్తోంది. గుంటూరు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీకి కూడా పోటీ చేయాలని కేసీఆర్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మాచర్ల కూడా నల్గొండ జిల్లాకు సమీపంలో ఉండే ప్రాంతం.

*_ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే.. అభ్యర్థులు వీరే.!_*
వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఏపీలోని కొన్ని స్థానాల్లో అయినా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గుంటూరు-2 నుంచి పోటీ చేయాలని, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి నిలపాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. గుంటూరు, విశాఖపట్టణం లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కూడా కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఉండవల్లి అరుణ్ కుమార్, కొణతాల రామకృష్ణ వంటి వారిని కూడా బీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూసుకుంటే.. రాజకీయంగా ఎంతో కొంత ప్రభావం చూపించడానికో లేక ఏదో ఒక పార్టీకి మేలు చేయడానికో, కీడుకో తెలియదు గానీ ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ ఫిక్స్ అయి ఆ దిశగా వడివడిగా అడుగులేస్తుందనే విషయం మాత్రం స్పష్టమైంది.

బాక్స్:
*_దొంగల బ్యాచ్.!_*
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా పెట్టిన బీఆర్ఎస్ లోకి ఉత్తరాంధ్ర నుంచి పలువురు చేరుతున్నారు. వివిధ కేసులున్న వారు ఢిల్లీ, హైద రాబాద్ వెళ్లి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదన వచ్చినప్పుడు అనేక సంఘాలు పుట్టుకొచ్చాయి. అలా పుట్టుకు వచ్చిన సంఘమే ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ, ఉత్తరాంధ్ర విద్యార్థి జేఏసీ. వాటికి వరుసగా జేటీ రామారావు, లగుడు గోవిందరావు స్వయం ప్రకటిత అధ్యక్షులు. అయితే శ్రీకాకుళం జిల్లాలో > సుమారు 54 విద్యా సంస్థలను బెదిరించి రూ.8.5 లక్షలు వసూలు చేశారనే అభియోగంపై 2016 జూలైలో లగుడు గోవిందరావు, జేటీ రామారావులతో పాటు మరో ఇద్దరిని పోలీ సులు అరెస్టు చేశారు. వీరు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ల్లోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, విద్యా శాఖ విజిలెన్స్ అధికా రులమని చెప్పి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలను బెదిరించారని పోలీసులు అప్పట్లో వెల్లడించారు. ఇప్పుడు అదే లగుడు గోవిందరావు వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఢిల్లీ వెళ్లి కేసీఆర్ను కలిసి ఫొటోలు దిగారు. తాజాగా జేటీ రామారావు కూడా సోమవారం హైదరాబాద్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

MP అసదుద్దీన్ కు రెండు ఓట్లు.... కాంగ్రెస్ ఫిర్యాదు....!

*MP అసదుద్దీన్ కు రెండు ఓట్లు.... కాంగ్రెస్ ఫిర్యాదు....!*
*వేర్వేరు చిరునామాలతో నమోదు...!*

హైదరాబాద్‌: ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించిన ఓటరు జాబితాలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్‌ ఒవైసీకి రెండు వేర్వేరు చిరునామాలతో రెండు చోట్ల ఓట్లున్నట్టు తేలింది.సాధారణ పౌరులకు ఇలా ఉన్నట్టు అడపాదడపా వినడం సాధారణమే అయినా.. ఒక ఎంపీకి నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల ఓటర్ల జాబితా లో పేరుండటం చర్చనీయాంశమైంది.

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ (ఎపిక్‌ నంబర్‌) టీడీజడ్‌1557521తో హైదర్‌గూడ ఉర్దూ హాల్‌ లేన్‌ చిరునామాతో మదీనా హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఒక ఓటుంది. రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎపిక్‌ నంబర్‌ కేజీవై0601229తో మైలార్‌దేవ్‌పల్లిలో సెయింట్‌ ఫియాజ్‌ స్కూల్‌ పోలింగ్‌స్టేషన్‌లో మరో ఓటుంది.

*ఎన్నికల సంఘానికి టీపీసీసీ ఫిర్యాదు*
ఈ పరిణామాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ముమ్మాటికీ నిబంధనలకు విరుద్ధమేనని వాదిస్తోంది. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి రెండు చోట్ల ఓటు హక్కు ఉండటంపై తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, January 4, 2023

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచితాలను పంచుతున్నాయి

*పన్ను చెల్లింపుదారుల ఆల్ ఇండియా ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది,ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అవుతుంది.*

 ఏ ప్రభుత్వం పాలించినా, ఈ సంస్థ ఆమోదం లేకుండా, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత పంపిణీ లేదా రుణమాఫీలను ఏ ప్రభుత్వమూ ప్రకటించలేము.
 డబ్బు మా పన్ను చెల్లింపులకు చెందినది కాబట్టి, దాని వినియోగాన్ని పర్యవేక్షించే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి.
 రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచితాలను పంచుతూ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఇది వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.  ఏ పథకాలు ప్రకటించినా ప్రభుత్వం ముందుగా వాటి బ్లూప్రింట్‌లు ఇచ్చి ఈ సంస్థ నుంచి సమ్మతి తీసుకోవాలి.  ఎంపీలు & ఎమ్మెల్యేల జీతాలు మరియు వారు పొందే ఇతర విచక్షణారహిత ప్రయోజనాలకు కూడా ఇది వర్తిస్తుంది.
 ప్రజాస్వామ్యం కేవలం ఓటుకే పరిమితమా?  ఆ తర్వాత పన్ను చెల్లింపుదారులకు మనకు ఎలాంటి హక్కులు ఉంటాయి?
 పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలను జవాబుదారీగా ఉంచి, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే హక్కు కూడా పన్ను చెల్లింపుదారులకు ఉండాలి.  వారు అన్ని తరువాత "సేవకులు", పన్ను చెల్లింపుదారులచే చెల్లించబడతారు.
 అటువంటి "ఉచితాలను" రీకాల్ చేసే హక్కు కూడా వెంటనే అమలు చేయాలి.
 *మీరు అంగీకరిస్తే, దయచేసి వీలైనంత ఎక్కువ మందిని సంప్రదించండి.దీన్ని చేయడానికి, పోస్ట్‌ను భాగస్వామ్యం చేయండి.మీ స్నేహితుల్లో / వాట్సాప్ గ్రూప్ లలో / ఇంస్టాగ్రామ్ / fb.... సోషల్ మీడియా లో, ఒక్కొక్కరు కనీసం 10 మంది మిత్రులకు పంపండి.*
 *దయచేసి ఈ సందేశాన్ని వైరల్ చేయడానికి షేర్ చేయండి🙏.... Bplkm🪶*

 https://www.nationalheraldindia.com/india/sc-forming-panel-to-examine-issue-of-freebies-by-political-parties-is-burial-by-committee-experts

సర్పంచుల ధర్నాకు హైకోర్టు అనుమతి

సర్పంచుల ధర్నాకు హైకోర్టు అనుమతి*

*రాష్ట్రంలోని సర్పంచుల ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సర్పంచుల ధర్నాకు అనుమతి ఇవ్వాలని మహేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు సర్పంచుల ధర్నాకు అనుమతిచ్చింది. అయితే 300మందికి మించి ఉండకూడదని హైకోర్టు సూచించింది. ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.*

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, January 2, 2023

27 మెట్రో స్టేషన్లలో ఉద్యోగుల ఆందోళన

*27 మెట్రో స్టేషన్లలో ఉద్యోగుల ఆందోళన*

హైదరాబాద్‌: నగరంలోని మెట్రో రైలు టికెట్‌ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్లలోనూ ఆందోళన చేపట్టారుఆయా స్టేషన్ల వద్ద టికెటింగ్‌ ఉద్యోగులు ధర్నాలకు దిగి తమ నిరసన తెలుపుతున్నారు.

గత కొంతకాలంగా సరైన జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు మెట్రో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్నప్పుడు రిలీవర్‌ సరైన సమయానికి రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం భోజనం చేయడానికీ సమయం ఇవ్వడం లేదని ఆక్షేపించారు. వేతనాలు పెంచే వరకు విధులకు హాజరుకాబోమని తేల్చిచెప్పారు. దీనిపై కాంట్రాక్ట్‌ ఏజెన్సీ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

అన్ని ఏజెన్సీలతో ఈడీ అనుసంధానం...!

*అన్ని ఏజెన్సీలతో ఈడీ అనుసంధానం...!*

న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అవకతవకల సత్వర గుర్తింపునకు వీలుగా ఇతర ఏజెన్సీల డేటాతో సులభంగా యాక్సెస్‌ చేసుకునేలా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధంచేసుకుంది.సీబీఐ, నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌ (ఎన్‌ఐజీ), ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ), కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)తో పాటు ఇతర ఏజెన్సీల వద్ద ఉన్న వివరాలను సరిపోల్చుకునే వ్యవస్థను సిద్ధంచేసుకుంది.

కోర్‌ ఈడీ ఆపరేషన్‌ సిస్టమ్‌ పేరుతో అభివృధ్ధి చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, వారి ఆర్థిక లావాదేవీలు, వారిపై నమోదైన కేసులు, అనుబంధ పత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా పొందటం సులభం కానుంది. ఆర్థిక నేరాల పరిశోధనలో వేగాన్ని పెంచేందుకు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకునేందుకు ఇది దోహదపడనుంది.

*సుజీవన్ వావిలాల*🖋️