Monday, February 28, 2022

స్థిరాస్తి వ్యాపారులపై కాల్పులు..... ఒకరి మృతి!

*స్థిరాస్తి వ్యాపారులపై కాల్పులు..... ఒకరి మృతి!*

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కాల్పులు కలకలం రేపాయి.కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వాహనంలో ఉన్న స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి రాఘవేందర్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దుండగులు ఒక్కసారిగా తమపై కాల్పులు జరిపారని అంబర్‌పేటకు చెందిన రాఘవేందర్‌రెడ్డి తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. ఈ ఉదయం కర్ణంగూడకు వెళ్లే మార్గంలో స్థానికులు ఓ స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. కారుపై రక్తపు మరకలు ఉండటంతో దగ్గరికి వెళ్లి చూడగా అందులోని ఓ వ్యక్తి స్పృహలో లేకపోవడాన్ని గమనించారు. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వ్యక్తిని హైదరాబాద్‌ బీఎన్‌రెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తి శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందినట్లు.. అతడి స్వగ్రామం అల్మాస్‌గూడగా గుర్తించారు.

బాధితుడిని పరీక్షించిన వైద్యులు అతడి ఛాతీ కింద భాగంలో బుల్లెట్‌ గాయమైందని.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాహనం నంబర్‌ ఆధారంగా బాధితుడు అంబర్‌పేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారిగా గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. తొలుత స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు భావించారు కానీ కాల్పులు జరిగినట్లు తేలింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారంలో వీరికి ఏమైనా గొడవలున్నాయా? కాల్పులు జరపడానికి ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతుడు శ్రీనివాస్‌రెడ్డి, రఘు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పటేల్‌గూడలోని 22 ఎకరాల్లో శ్రీనివాస్‌రెడ్డి, రఘు, మట్టారెడ్డి వెంచర్‌ వేశారు. వెంచర్‌ విషయంలో ఈ ముగ్గురి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున ఐదు గంటలకు శ్రీనివాస్‌రెడ్డి, రఘు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వెంచర్‌ విషయంలో మాట్లాడదామని వీరిద్దరినీ మట్టారెడ్డి పిలిపించారంటూ బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. కాల్పులకు అతడే కారణమని వారు  అనుమానిస్తున్నారు. దీంతో మట్టారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు

*link Media ప్రజల పక్షం🖋️ 

ఆ అప్లికేషన్ పై సంతకాలు చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఆ అప్లికేషన్ పై సంతకాలు చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

Courtesy by : తొలివెలుగు మీడియా ట్విట్టర్ 

యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు అప్లికేషన్ ఫామ్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ సోమవారం సంతకాలు చేశారు.

ఈ విషయాన్ని ఉక్రెయిన్ పార్లమెంట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అంతకు ముందు రష్యా దాడుల నేపథ్యంలో ప్రత్యేక విధానం కింద తమకు ఈయూలో వెంటనే సభ్యత్వం కల్పించాలని జెలెన్ స్కీ కోరారు.

‘ అందరు యురోపియన్లతో కలిసి ఉండాలన్నదే మా లక్ష్యం. అన్నిటికన్నా ముఖ్యంగా సమాన హోదా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అది ఖచ్చితంగా సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను” అని అన్నారు.

ఉక్రెయిన్ కు అదనపు ఆయుధాలను పంపేందుకు బ్రెస్సెల్స్ నిర్ణయించినట్టు ఈయూ విదేశీ విధానాల చీఫ్‌ జోసెఫ్ బొరేల్ మంగళవారం తెలిపారు.

ప్రధాని మోదీకీ ఫుల్ సపోర్ట్ ఇస్తానంటున్న...... మమతా బెనర్జీ.....!

*ప్రధాని మోదీకీ ఫుల్ సపోర్ట్  ఇస్తానంటున్న...... మమతా బెనర్జీ.....!*

కోల్‌కతా: రాజకీయంగా ఎప్పుడూ నువ్వా-నేనా అంటూ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్రమోదీ తలపడతారనేది అందరికీ తెలిసిన విషయమే.తాజగా ఫైర్‌ బ్రాండ్‌ దీదీ ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీకి పూర్తి మద్దతు తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మమతా ఓ లేఖను ప్రధానికి పంపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్రమైన సంక్షోభం ఏర్పడిందని, వాటి నుంచి బయటపడటం ఎంతైనా అవసరం ఉందన్న మమతా.. అందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని ఆమె కోరారు.

ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను త్వరితగతిన దేశానికి రప్పించాలిని కోరారు. సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్న ఓ సీనియర్ ముఖ్యమంత్రిగా ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మన దేశ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు మమత ఆ లేఖలో తెలిపారు. సంక్షోభ సమయంలో దౌత్య వ్యవహారాలను సరైన రీతిలో అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు దీదీ తన లేఖలో తెలిపారు. తీవ్రమైన అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లో ఒక దేశంగా ఐక్యంగా నిలబడాల్సి అవసరం ఎంతైనా ఉందని అందుకు మన దేశీయ విబేధాలను పక్కనపెట్టి ఉండాలని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ ఉన్నందున, ప్రపంచానికి శాంతియుత పరిష్కారాన్ని అందించడానికి భారత్‌ నాయకత్వం వహించాలని ప్రధానికి సూచించారు

link Media ప్రజల పక్షం🖋️ 

రంగంలోకి దిగిన మోడీ..... ఉక్రెయిన్ కు కేంద్ర మంత్రులు*

*రంగంలోకి దిగిన మోడీ..... ఉక్రెయిన్ కు కేంద్ర మంత్రులు*

న్యూఢిల్లీ: స్వదేశానికి భారతీయులను రప్పించే ఏర్పాట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రులను సరిహద్దులకు పంపాలని నిర్ణయించారు.
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మోదీ ఈ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులు, పౌరుల తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. విద్యార్థులను తరలిస్తున్న సరిహద్దులకు కేంద్ర మంత్రులు కూడా వెళితే బాగుంటుందని, అక్కడుండే పరిస్థితులను సమీక్షించడం మంచిదని అభిప్రాయాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. ఆపరేషన్ గంగా పేరుతో ఢిల్లీ, ముంబై నుంచి వెళుతున్న ప్రత్యేక విమానాల్లో కేంద్ర మంత్రులు వెళ్లాలని మోదీ ఆదేశించినట్లు సమాచారం. విద్యార్థుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు నివేదికను పీఎంవోకి అందజేయాలని ఆదేశించినట్లు తెలియవచ్చింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు హర్దీప్‌సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్ రిజిజు, వీకే సింగ్‌లు వెళ్లనున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Sunday, February 27, 2022

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు గరిష్ట వయసు పెంపు......!

*కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు గరిష్ట వయసు పెంపు......!*

*ఒకటో తరగతికి కనిష్ఠం ఆరేళ్లు, గరిష్ఠం 8 ఏళ్లు*

*నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ*


దిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల కనిష్ఠ, గరిష్ఠ వయసుల్లో మార్పుచేశారు.2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశం కోరే వారికి కనిష్ఠంగా ఆరేళ్లు, గరిష్ఠంగా 8 ఏళ్లు ఉండాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ పేర్కొంది. ఈ రెండు వయసుల మధ్య ఉన్నవారికి మాత్రమే కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామని, అంతకంటే తక్కువ, ఎక్కువ వయసున్నవారి దరఖాస్తులు అనుమతించబోమని స్పష్టం చేసింది. గతంలో అయిదు నుంచి ఏడేళ్ల వరకు వయసు ఉన్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం ఉండేది. ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి కనీస వయసును 6 ఏళ్లకు, గరిష్ఠ వయసును 8 ఏళ్లకు పెంచింది. దివ్యాంగులకు గరిష్ఠ వయసులో 2 ఏళ్ల సడలింపు ఇచ్చింది. దీని ప్రకారం ఒకటో తరగతిలో దరఖాస్తు చేసుకొనే పిల్లలు 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2016 ఏప్రిల్‌ 1 మధ్య పుట్టినవారై ఉండాలి. దివ్యాంగులైతే 2012 ఏప్రిల్‌ 1 నుంచి 2016 ఏప్రిల్‌ 1 మధ్యలో జన్మించి ఉండొచ్చు. ఒకటో తరగతి ప్రవేశాలకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ తెలిపింది. మార్చి 21వ తేదీ సాయంత్రం 7 గంటలవరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించింది. మార్చి 25న తొలి, ఏప్రిల్‌ 1న రెండు, ఏప్రిల్‌ 8న మూడో ఎంపిక జాబితా ప్రచురిస్తామని తెలిపింది. రెండు, ఆ పై తరగతుల ప్రవేశాలకు (11వ తరగతి మినహాయించి) ఆఫ్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 8 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 21న ఎంపిక జాబితా విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 22 నుంచి 28 మధ్యలో ఈ తరగతులకు ప్రవేశాలు పూర్తిచేస్తారు. అన్ని తరగతుల ప్రవేశాలకు చివరి తేదీ (11వ తరగతికి మినహాయించి) జూన్‌ 30గా నిర్ణయించారు.

*llink Media ప్రజల పక్షం🖋️

తెలంగాణ లో ప్రశాంత్ కిషోర్ సర్వే....!

*తెలంగాణ లో ప్రశాంత్ కిషోర్ సర్వే....!*

*సీఎం కేసీఆర్‌తో భేటీ*
*దేశ రాజకీయాలపై చర్చ*

*సీఎం..పీకేల భేటీ దాదాపు ఎనిమిది గంటల పాటు సాగింది.*

*చివర్లో మంత్రి కేటీఆర్‌ సైతం పాల్గొన్నట్లు తెలిసింది* *జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక, భాజపాపై విమర్శలు, వివిధ రాష్ట్రాల్లో స్పందన, పార్టీల* *అభిప్రాయాలను సీఎంకు పీకే నివేదించినట్లు తెలుస్తోంది*

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌(పీకే) ఆదివారం ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో కలిశారు.ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, అయిదు రాష్ట్రాల ఎన్నికల పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తూ అభిప్రాయాలను సేకరిస్తున్న పీకే బృందం తెలంగాణలోనూ సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం. వీరి భేటీని తెరాస వర్గాలు గోప్యంగా ఉంచాయి. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఆయనతో పీకే సమావేశం ఆసక్తి రేపుతోంది. శనివారం ఆయన హైదరాబాద్‌ వచ్చారు. అప్పటికే ప్రకాశ్‌రాజ్‌తో ముఖ్యమంత్రి సమావేశమై ఆయనను గజ్వేల్‌, మల్లన్నసాగర్‌, పోచమ్మసాగర్‌ పర్యటనకు పంపించారు. పీకేను సైతం ప్రాజెక్టులు చూసి రావాలని సూచించారు. ప్రకాశ్‌రాజ్‌ మల్లన్నసాగర్‌ పంపుహౌస్‌ పరిశీలిస్తుండగా...అక్కడికి పీకే వెళ్లారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లను వారు సందర్శించి ప్రాజెక్టుల వివరాలు తెలుసుకున్నారు. నిర్వాసిత కాలనీలకు వెళ్లి స్థానికులతో మాట్లాడారు. కేసీఆర్‌, ప్రశాంత్‌కిశోర్‌ల సమావేశం సుమారు ఎనిమిది గంటల పాటు సాగింది. ఇందులో కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికతో పాటు ఇటీవల ముంబయి పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కేసీఆర్‌ చర్చల సారాంశం, తదితర అంశాలపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు, భవిష్యత్‌ కార్యాచరణపై మాట్లాడారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలపై తమ బృంద సర్వేను సైతం పీకే వెల్లడించినట్లు సమాచారం. ఆ తర్వాత తెలంగాణలో సర్వేపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వే ప్రాతిపదికలు, వాటి నమూనాలను పీకేకు చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తగిన సూచనలివ్వాలని ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల సదస్సు గురించి సైతం మాట్లాడినట్లు సమాచారం.

link Media ప్రజల పక్షం🖋️ 

పాలమూరు కిడ్నాప్ కథలో.. క్రైం.. సస్పెన్స్! తొలివెలుగు ఎంట్రీతో… మారిన సీన్(సోషల్ మీడియా లేకుంటే పరిస్థితి ఏంటి ??)


Saturday, February 26, 2022

మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం.... మంత్రి హరీష్ రావ్....!

*మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం.... మంత్రి హరీష్ రావ్....!*

హైదరాబాద్: కరోనా దృష్ట్యా పల్స్ పోలియో కార్యక్రమం ఆలస్యమైందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడ్రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందని చెప్పారు.23 వేల హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రేపటి నుంచి ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌లో తెలంగాణ ముందుందని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీలో 350కిపైగా బస్తీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని హరీష్‌రావు తెలిపారు

link Media ప్రజల పక్షం🖋️

Friday, February 25, 2022

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు... బుకారెస్ట్ చేరుకున్న ఎయిర్ ఇండియా!

*ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు... బుకారెస్ట్ చేరుకున్న ఎయిర్ ఇండియా!*

ఉక్రెయిన్‌పై రష్యా బాంబు వర్షం కొనసాగుతూనే ఉంది. ఆ దేశ రాజధాని కీవ్‌పై బాంబలు మిస్సైల్స్‌తో రష్యన్‌ దళాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌ లో చిక్కుకపోయిన భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.ప్రమాదక ప్రదేశాల్లో ఉన్నవారంతా బాంబ్‌ షెల్టర్స్‌, అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లు, బంకర్‌లలో తలదాచుకుంటున్నారు. కంటిమీద కునుకు లేకుండా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని స్వదేశానికి చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

అయితే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ సైతం చర్యలను వేగవంతం చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు 4 ఎయిరిండియా విమానాలను నడుపుతోంది. ఉక్రెయిన్‌లోని 470 మంది భారతీయ విద్యార్థులు నేడు భారత్‌ చేరుకోనున్నారు. ముందుగా భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకొని ఎయిరిండియా విమానాల్లో భారత్‌కు బయల్దేరనున్నారు.ఇప్పటికే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ముంబై నుంచి వెళ్లిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం AI-1943 రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకుంది. ఈ విమానం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. ఉక్రెయిన్ నుంచి వచ్చే ఈ విద్యార్థులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలుకనున్నారు. మరో రెండు విమనాలను రొమేనియా సరిహద్దు వద్దకు, ఒకటి హంగేరికి పంపనుంది.ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారత పౌరులకు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. సరిహద్దు పోస్టుల వద్ద ఉన్న భారత అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా ఉక్రెయిన్ సరిహద్దు పోస్టుల వద్దకు వెళ్లవద్దని సూచించింది. 'వివిధ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. భారతీయ పౌరులనును సమన్వయంతో తరలించడానికి పొరుగు దేశాలలోని భారత రాయబార కార్యాలయాలతో ఎంబసీ నిరంతరం పని చేస్తోంది. అధికారులతో సమన్వయం లేకుండా ఎవరూ సరిహద్దూలకు రావొద్దు' అని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం శనివారం ఉదయం ట్వీట్ చేసింది.

link Media ప్రజల పక్షం🖋️ 

ఒత్తిడి చేస్తున్నారు అక్కడి నుంచే పోటీ చేస్తా.....పట్నం మహేందర్ రెడ్డి!

*ఒత్తిడి చేస్తున్నారు అక్కడి నుంచే పోటీ చేస్తా.....పట్నం మహేందర్ రెడ్డి!*

*టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగుతా*

*పార్టీ అధిష్టానం టికెట్‌ ఇస్తుంది*

*ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి*

తాండూరు(వికారబాద్‌): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున తాండూరు నుంచి పోటీ చేస్తానని, ఈమేరకు ఇక్కడి ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు.పట్టణంలోని తన నివాసంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్నపరిమళ్, సీనియర్‌ నాయకుడు కరణం పురుషోత్తంరావుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా తాను తాండూరులో ఉంటున్నానని, నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యానన్నారు. దీంతో ఈ స్థానాన్ని వదులుకొనే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

తాను మంత్రిగా ఉన్న సమయంలో పెద్దఎత్తున నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించానన్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుతున్నారని, ప్రజల అభీష్టం మేరకు పోటీకి దిగుతానని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్‌ తనకే ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ తాను విజయం సాధిస్తానని ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ఇంటెలిజెన్స్‌ రిపోర్టు సైతం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ వద్దకు చేరిందన్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.

పార్టీ కేడర్‌ పటిష్టంగా ఉందన్నారు. కొంతమంది స్వార్థపరులే ఎమ్మెల్యే వెంట వెళ్లారని, అయినా తనకు ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని చెప్పారు. మంత్రి పదవి రానుందనే ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రశ్నించగా.. అది సీఎం చేతిలో ఉందని స్పష్టం చేశారు. తాండూరు ప్రజలకు ఇప్పటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానన్నారు. తాండూరు మున్సిపాలిటికి ఐదేళ్లపాటు చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్నపరిమళ్‌ కొనసాగుతారని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత చైర్‌పర్సన్‌ మార్పు ఉంటుందని గతంలో ప్రకటించిన విషయాన్ని విలేకర్లు గుర్తు చేయగా.. అది అప్పటి పరిస్థితుల మేరకు టెన్షన్‌లో తీసుకున్న నిర్ణయమని కొట్టిపారేశారు. అనంతరం వీరశైవ సమాజం ప్రతినిధులకు స్మశానవాటిక అభివృద్ధికి రూ.5 లక్షల నిధులను కేటాయించి ప్రొసీడింగ్స్‌ అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బొబ్బిలి శోభరాణి, ప్రవీణ్‌గౌడ్, రామకృష్ణ, వెంకన్నగౌడ్, నాయకులు జబేర్‌లాలా, వడ్డె శ్రీనివాస్, బిర్కట్‌ రఘు ఉన్నారు.

*link Media ప్రజల పక్షం🖋️* 

Must protect lakes in Hyderabad, says minister K T Rama Rao

Must protect lakes in Hyderabad, says minister K T Rama Rao

Courtesy by : TNN / Feb 20, 2022, 08:01 IST
HYDERABAD: Municipal minister K T Rama Rao asked the officials to take up further measures for the conservation, development, and beautification of water bodies under the Hyderabad Metropolitan Development Authority (HMDA) limits.
He said lake land should also be protected as land prices are skyrocketing in the city. The minister also asked to take stern action against the land sharks.
The minister interacted with a few conservationists over video conference and discussed measures to be taken to protect water bodies within HMDA on Saturday.
“The state government has been giving top priority to the protection and conservation of water bodies since the formation of the state. HMDA has played a key role in taking up beautification works around the water bodies,” KTR said. He said that along with HMDA, GHMC is also developing infrastructure around water bodies. He asked both the wings to work together in coming up with a plan of action for better protection and maintenance of water bodies in the future.
The minister said development and conservation programmes have already been undertaken at major ponds like Gandipeta in HMDA limits.
He also asked the officials to focus on speeding up beautification works at Gandipet lake which would provide a great experience to the people of Hyderabad.
The minister discussed with officials about strengthening of radial roads, Musi river rejuvenation works, construction of bridges over Musi river, HMDA land pooling plans and construction of logistics parks.
Municipal administration department special chief secretary Arvind Kumar and other officials were present at the review meeting.
Download The Times of India News App for Latest City News.

అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై...... హైకోర్టు కీలక తీర్పు.......!

*అనధికార లేఅవుట్లలో  ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై...... హైకోర్టు కీలక తీర్పు.......!*

హైదరాబాద్‌: అనధికార లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనుమతి లేని లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ 2020లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో 5వేలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వేల సంఖ్యలో పిటిషన్లు వస్తున్నందున వీటన్నింటిపై విచారణచేపట్టిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అనధికార లే అవుట్లలో ప్లాట్లనూ షరతులతో రిజిస్ట్రేషన్‌ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లశాఖ జారీ చేసిన మెమోతో సంబంధం లేకుండా ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. షరతులు వర్తిస్తాయని కొనుగోలు దారులకు ముందే చెప్పాలని స్పష్టం చేసింది.

2020లో రిజిస్ట్రేషన్ల శాఖ మెమో జారీ చేసిన తర్వాత.. గతేడాది ఒక పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం నిజాంపేట మున్సిపాలిటీ కమిషనర్‌, సబ్‌ రిజిస్ట్రార్‌కు అనధికార లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాలని ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ పిటిషన్‌ సుప్రీంకోర్టు విచారణలో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి జరగబోయే రిజిస్ట్రేషన్లు అన్నీ సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని డాక్యుమెంట్‌ రెండో పేజీలో రాయాలని, అదే విషయాన్ని కొనుగోలు దారులకు తెలియజేయాలని సబ్‌రిజిస్ట్రార్లను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్లందరు కూడా .. ప్రభుత్వం జారీ చేసిన మెమోతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని పేర్కొంది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, 30 అడుగుల రోడ్డు ఉందా? లేదా? అనే విషయాన్ని కొనుగోలు దారులు చూసుకోవాలి. ఒక వేళ అవి లేనట్లయితే సంబంధిత చట్టాలను ఉల్లంఘించినట్టవుతుంది కాబట్టి ఆవిషయాలను కూడా ముందే కొనుగోలు దారులకు సబ్‌ రిజిస్ట్రార్లు చెప్పడంతో పాటు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌లోని రెండో పేజీ వెనుకభాగంలో ఇవన్నీ కూడా పొందుపర్చాలని ధర్మాసనం తెలిపింది. చట్టాలకు అనుగుణంగా లేని ప్లాట్ల విషయంలో కొనుగోలుదారులదే పూర్తి బాధ్యత అని హెచ్చరించాలని పేర్కొంది. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లతో పాటు ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌, రిజిస్ట్రేషన్‌ వెబ్‌ సైట్లలో కూడా ఇదే అంశం పొందుపర్చాలని తెలపింది. కొన్ని వేల పిటిషన్లు వస్తున్నందున ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఇవే నిబంధనలు పాటించాలని సబ్‌రిజిస్ట్రార్లలను హైకోర్టు ఆదేశించింది.

*link Media ప్రజల పక్షం🖋️*

ఉక్రెయిన్ ను వీడాలని ఫిబ్రవరి 15నే అత్యవసర ప్రకటన జారీ చేసిన ఇండియన్ ఎంబసీ – హెచ్చరికల్ని పట్టించుకోని భారతీయులు

ఉక్రెయిన్ ను వీడాలని ఫిబ్రవరి 15నే అత్యవసర ప్రకటన జారీ చేసిన ఇండియన్ ఎంబసీ – హెచ్చరికల్ని పట్టించుకోని భారతీయులు

Courtesy by : MyIndMedia Twitter 

భయపడ్డట్టుగానే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. దీంతో ఉక్రెయిన్లో చిక్కుకున్నభారతీయులు ఆందోళన చెందుతున్నారు. విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రత్నామ్నాయ మార్గాల్లో విద్యార్థులు సహా అక్కడున్న 18 వేల మంది భారతీయుల తరలింపునే ప్రాథామ్యాంశంగా తీసుకుంది భారత్.

గురువారం ఉక్రెయిన్లో సైనిక చర్యను ప్రకటించారు పుతిన్. ఆ వెంటనే భారత విదేశీ మంత్రిత్వ శాఖ పౌరుల కోసం రంగంలోకి దిగింది. వైద్య విద్య కోసం వెళ్లిన విద్యార్థులు సహా దాదాపు 18 వేల మంది భారతీయులు అక్కడ ఉన్నారని… విదేశాంగ శాఖ వారిని కాపాడే, తరలించే చర్యల్లో నిమగ్నమై ఉందని… విమాన సర్వీసులు మూతపడడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని , అక్కడున్నవారి కుటుంబసభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్ తెలిపారు. ఇప్పటివరకు రెండు విమానాల్లో భారతీయులు వచ్చారు.
అసలైతే రష్యా ఉక్రెయిన్ పై ఆకస్మిక దాడేం చేయలేదు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన విదేశాంగ శాఖ… దేశం విడిచి రావాలని అక్కడి భారతీయులకు సూచించింది. రష్యా సరిహద్దులో భారీ సైనిక సమీకరణ చేసినప్పుడే అప్రమత్తమైంది. రాబోయే ప్రమాదం గురించి హెచ్చరిస్తూ …ముఖ్యంగా విద్యార్థులు తాత్కాలికంగా భారత్ రావడానికి ఏర్పాట్లు చేసుకోమని, అందరిని తప్పని సరిగా భారత ఎంబసీ తో టచ్ లో ఉండమని చెప్తూ ఈనెల 15నే ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు, ఈ మెయిల్ ఐడీ కూడా ఇచ్చింది. అయితే అప్పుడెవరూ ఎంబసీ ప్రకటనను పట్టించుకోలేదు. ఇప్పుడిక యుద్ధం మొదలయ్యేసరికి వారంతా ఆందోళనచెందుతున్నారు.

రష్యాతో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తత దృష్ట్యా భారతీయ విద్యార్థులందరూ ఉక్రెయిన్‌ను విడిచిపెట్టాలి. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. వీలైనంతవరకు స్వదేశానికి వెళ్లడం మేలు. ఎంబసీ తో టచ్ లో ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో వారిని సంప్రదించండి” అని స్పష్టమైన ప్రకటన జారీ చేశారు అక్కడి ఎంబసీ అధికారులు.

ప్రకటన జారీ చేసిన మరుసటిరోజే …అంటే ఫిబ్రవరి 16న భారత ప్రభుత్వం విమానాల సంఖ్యపై పరిమితులను కూడా తొలగించింది. ఉక్రెయిన్, భారత్ మధ్య తరలించాల్సిన ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని..వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ద్వైపాక్షిక ఒప్పందం కింద పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ విమానాల సంఖ్యపై పరిమితిని ఎత్తివేసింది.

2022 ఫిబ్రవరి 22, 24 , 26 తేదీల్లో భారతదేశం -ఉక్రెయిన్ మధ్య మూడు విమానాలను నడుపుతున్నట్లు ఫిబ్రవరి 18నే ఎయిర్ ఇండియా ప్రకటించింది. అయితే ఎవరూ భారత్ తరలివచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ఎవరూ విమాన టికెట్లు తీసుకోలేదు. దీంతో ఫిబ్రవరి 20న విమానాలను రీషెడ్యూల్ చేస్తూ వాయిదా వేసింది.
అదే రోజు అక్కడి భారతీయులకోసం మరోసారి అత్యవసర ప్రకటన జారీచేసింది. ఉక్రెయిన్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయని.. అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయని విద్యార్థులు సహా భారతీయ పౌరులు తాత్కాలికంగా ఆ దేశాన్ని వీడత తప్పదని ఎంబసీ తెలిపింది. ఇక 22 న మూడోసారి అలాంటి ప్రకటనే జారీ చేసింది. అయినా ఎలాంటి స్పందనా రాలేదు. చూస్తుండగానే యుద్ధమేఘాలు ఉక్రెయిన్ ను కమ్మేశాయి. ఇప్పుడు అక్కడ చిక్కుకుంటున్న వాళ్లు లబోదిబోమంటున్నారు. తమను కాపాడాలంటూ భారత ప్రభుత్వానికి మొర పట్టుకుంటున్నారు.

ఇంకా అక్కడ దాదాపు 18 వేలమందికిపైగా ఉన్నారు. వారిని ఎయిర్ రూట్ ద్వారా తీసుకువచ్చే పరిస్థితులు లేవు. అందువల్ల ఉక్రెయిన్ నుంచి అక్కడి రోడ్డు మార్గంతో సంబంధాలున్న హంగేరీ, పోలాండ్, స్లోవేకియా,రొమేనియా నుంచి విదేశీ మంత్రిత్వ శాఖ బృందాలు ఉక్రెయిన్‌తో ఆనుకుని ఉన్న భూ సరిహద్దులకు వెళ్తున్నాయి. సరిహద్దు పాయింట్లకు సమీపంలో ఉన్న భారతీయులు తమను సంప్రదించవచ్చని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.