Monday, August 31, 2020

హైదరాబాద్ లో నేడే గణేశ మహా నిమజ్జనం

హైదరాబాద్ : 01/09/2020

*హైదరాబాద్ లో  ట్రాఫిక్ ఆంక్షలు.... !*

*నేడే మహా నిమజ్జనం*
*సాగర్‌కు* *తరలిరానున్న వినాయకుడి విగ్రహాలు*
మహా నిమజ్జనానికి భాగ్య నగరం సిద్ధమైంది. వివిధ రూపాల్లో కొలువుదీరి, పది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు కొద్ది గంటల్లో గంగ ఒడికి చేరనున్నారు. నలుమూలల నుంచి విగ్రహాలు బాలాపూర్‌ గణేష్‌తో కలిసి ప్రధాన మార్గంలో పయనించి హుస్సేన్‌ సాగర్‌లో మంగళవారం నిమజ్జనం కానున్నాయి. ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌పై పోలీసులు 21 క్రేన్లను సిద్ధం చేశారు.
ఉదయం 10.30కు ఖైరతాబాద్‌ గణపతి ఊరేగింపు
ఖైరతాబాద్‌: హైదరాబాద్‌ మహా నిమజ్జనమనగానే ఖైరతాబాద్‌ భారీ గణేషుడే గుర్తుకొస్తాడు.
ఈసారి ఖైరతాబాద్‌ గణపతి ఊరేగింపు మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం పూర్తి చేస్తామని పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్‌ ఆంక్షలు
నగరంలోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ అమల్లో ఉంటాయని అదనపు సీపీ(ట్రాఫిక్‌) ఎస్‌.అనిల్‌ కుమార్‌ తెలిపారు. నిమజ్జన ప్రక్రియ పూర్తికాకపోతే ఆంక్షలను పొడిగించనున్నామని వివరించారు.
* ప్రధాన రహదారులపై బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి.
* నెక్లెస్‌రోడ్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లపై నిమజ్జనానికి వచ్చే వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు.
* విమానాశ్రయానికి వెళ్లేవారు.. వచ్చేవారు.. బాహ్యవలయ రహదారి మీదుగా రాకపోకలు కొనసాగించడం శ్రేయస్కరం. ఇమ్లీబన్‌, జేబీఎస్‌లకు రాకపోకలు సాగించే జిల్లాల బస్సులు ఊరేగింపు లేని మార్గాలను ఎంచుకోవాలి.
ప్రజలు, భక్తులు సమాచారం కోసం 040-2785 2482, 9010203626

*ప్రజలు సహకరించాలి*
గణేష్‌ శోభాయాత్ర శాంతియుత, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు తమకు పూర్తి సహకారం అందించాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కోరారు. అడుగడుగునా గట్టి నిఘా, పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం నగర పోలీసు అధికారులతోపాటు ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్‌బండ్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల్లో సుమారు 30,000 ప్రతిమలు నిమజ్జనం అయ్యాయన్నారు. తొమ్మిది అడుగుల లోపు ఉన్నవి సుమారు 4,000 విగ్రహాలు నేడు ట్యాంక్‌బండ్‌ వస్తాయని భావిస్తున్నామన్నారు. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలు తమ వంతు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
వాహనాల మళ్లింపు
- సీపీ మహేష్‌ భగవత్‌
నేరేడ్‌మెట్‌: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చెరువుల వద్ద మంగళవారం నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి ఏరాట్లు చేసినట్లు సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు వాహనాలు దారి మళ్లిస్తున్నామన్నారు. విగ్రహాలు నిర్దేశిత మార్గాల్లో చెరువుల వద్దకు చేరుకోవాలని కోరారు.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
బాలాపూర్‌ వినాయకుడి ఊరేగింపుతో శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 18 కి.మీ. కొనసాగే యాత్ర మార్గాన్ని నిరంతరం పరిశీలించేందుకు వీలుగా అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదనంగా ప్రతి పోలీస్‌ ఠాణా పరిధిలోని ప్రజలు, కాలనీ సంఘాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు ''నేను సైతం'' పేరుతో ఏర్పాటు చేసుకున్న కెమెరాలను అనుసంధానించారు. భారీ విగ్రహాలు లేకపోవడంతో ఈసారి నిమజ్జన ఘట్టం వేగంగా పూర్తయ్యే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

అత్యాచారం కేసులో కీలక విషయాలు

హైదరాబాద్ : 31/08/2020

*యాంకర్ ప్రదీప్ కు ఈ కేసుతో సంబంధం లేదు........!*

139 మంది అత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. *బాధితురాలికి అండగా నిలిచిన మందకృష్ణ మాదిగ సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.* ప్రముఖ యాంకర్‌ ప్రదీప్ మాచిరాజుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. డాలర్ బాబు ఒత్తిడి వల్లే ప్రదీప్‌పై బాధితురాలు కేసు పెట్టిందని తెలిపారు. మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ.. *ఇటువంటి ఘటన చూస్తే పూలన్ దేవి గుర్తొచ్చింది. ఫూలన్ దేవి ఎన్నోసార్లు అఘాయిత్యానికి గురయ్యారు*.
ఇప్పుడు 139 దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసి షాక్‌కి గురయ్యాను. ఈ కేసుకు సంబంధించి సీసీఎస్ పోలీసులను మా బృందం సంప్రదించింది.
పీడిత కులానికి చెందిన యువతిపై 139 దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసి షాక్‌కి గురయ్యాను. ఈ కేసుకు సంబంధించి *సీసీఎస్ పోలీసులను మా బృందం సంప్రదించింది. ఒక మహిళా ఏసీపీ కేసును విచారిస్తున్నరని తెలిపారు. కేసును సీఐడీకి బదిలీ చేయాలని కోరుతున్నాం*. నిన్న సుమారు రెండు గంటల పాటు బాధితురాలితో మాట్లాడాను. 139 మందిపై రేప్ కేసుతో పాటు ఎస్సీఎస్టీ కేసులు పెట్టారు. మా జోలికి అనవసరంగా వస్తే వదిలి పెట్టం. *ఈ కేసులో నిజాలు తెలుసుకునేందుకు బాధితురాలికి పోలీసుల కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగాను*. పెళ్లైన తరువాత అమ్మాయి జీవితంలో జరిగిన నాలుగు ఘటనలు వివరించింది. *139 మందిలో 30 శాతం మంది అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారు.ఇంకో 30 శాతం అమ్మాయిని మానసికంగా వేధించి బ్లాక్ మెయిల్ చేశారు.దాదాపు 40 శాతం మందికి ఈ కేసుతో సంబంధం లేని వాళ్లు ఉన్నారు*. అమ్మాయి చిన్న వయసులోనే బ్లాక్ మెయిల్ కు గురై అత్యాచారానికి గురైంది. *ఎస్‌ఎఫ్‌ఐ మీసాల సుమన్ ఈ అమ్మాయి జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడే అమ్మాయి బ్లాక్ మెయిల్‌కు గురైంది*. డాలర్ బాయ్‌ అమ్మాయితో కేసులు పెట్టించి వారిని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. డాలర్ బాబు కూడా అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. *మీసాల సుమన్, డాలర్ బాయ్‌ను అదుపులోకి తీసుకుంటే అన్ని నిజాలు బయట పడుతాయి. బాధితురాలికి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలి' అని మందకృష్ణ పేర్కొన్నారు.*

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Sunday, August 30, 2020

Donate Plasma - Save Lives

Hyderabad : 30/08/2020

*Donate plasma - save lives*

*Quote this tweet with same Matter and tag 3 people to continue this chain..*

*COVID19*

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/ 

Saturday, August 29, 2020

తెలంగాణ కోవిద్ కేసులు శనివారం

హైదరాబాద్ : 30/08/2020

*తెలంగాణ లో కొత్తగా 2924 కరోనా  కేసులు*

తెలంగాణ రాష్ట్రంలో శనివారం 2,924 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,23,090కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 818 కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

GHMC ఉప్పల్ సర్కిల్ లో పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం

*ప్రజా సంకల్పం యూట్యూబ్ ఛానల్*
29/08/2020

https://youtu.be/aPCLU-YEqhE

Thursday, August 27, 2020

తెలంగాణ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు

హైదరాబాద్ : 28/08/2020

*డైరెక్టర్ శంకర్‌కు రూ.2.5 కోట్ల భూమిని రూ.5 లక్షలకు ఎలా కేటాయిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది*. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలకపాత్ర పోషించారని ఏజీ తెలపగా.. *రాష్ట్రం కోసం త్యాగం చేసిన వేలమందికి ఇలాగే ఇస్తారా? అని హైకోర్టు అడిగింది*. 
#TelanganaHighCourt #Telangana

*Source*:
@bbcnewstelugu

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

కరోనా కేసుల వివరాలు తెలంగాణ

హైదరాబాద్ : 28/08/2020

*తెలంగాణ లో కొత్తగా 2932 కరోనా కేసులు*

తెలంగాణ రాష్ట్రంలో గురువారం (17వ తేదీన) 61,863 నమూనాలు పరీక్షించగా 2,932 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,17,415 చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 799కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1580 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 87,675కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 28,941కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు తెలంగాణలో 12,04,343 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అదికారులు తెలిపారు.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

అత్యాచారం కేసును వేగవంతం చేసిన CCS పోలీస్లు

హైదరాబాద్ : 27/08/2020

*అత్యాచార కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సీసీఎస్‌ పోలీసులు*

ఇటీవల తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేసును సీసీఎస్‌ పోలీసులు వేగవంతం చేశారు. ఎఫ్ఐఆర్‌, బాధితురాలి స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిందితులను విచారించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 143 మంది నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్‌ రెడీ చేశారు. 143మందిలో ప్రముఖ రాజకీయ నాయకుల పీఏలు, టీవీ నటులు, పోలీసులు, ఎస్‌ఎఫ్‌ఐ లీడర్లు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. ( : 5 వేల సార్లు అఘాయిత్యం )

మరో వైపు యువతిపై అత్యాచారం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ *ఏబీవీపీ* నాయకులు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వద్ద బుధవారం ఆందోళనకు దిగారు.

*Source*:
@సాక్షి మీడియా

https://prajasankalpam1.blogspot.com/ 

రెవిన్యూ అధికారి కోటి లంచం కేసు

హైదరాబాద్ : 27/08/2020

*కోటి లంచం కేసు... రేవంత్ రెడ్డిపై విచారణ...... !*

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర ఎమ్మార్వో కోటి రూపాయ లంచం కేసులో ఏసీబీ విచారణ మరింత వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ 'మీడియా'తో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. కీసర అవినీతి కేసులో *తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డి పాత్రపై* కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. అంజిరెడ్డి ఆ డ్యాక్యుమెంట్లు రేవంత్‌రెడ్డికి చెందినవిగా ఒప్పుకున్నారని, ఈ డాక్యుమెంట్లుపై విచారణ జరిపామని పేర్కొన్నారు.
అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో *రేవంత్ రెడ్డి ప్రమేయంపై ఎలాంటి సాక్ష్యాలు లభించలేదన్నారు*. మరోసారి రేవంత్, అంజిరెడ్డి పత్రాలపై విచారణ జరుపుతామని తెలిపారు. రేవంత్‌ పాత్ర ఉందని తేలితే అతన్ని కూడా పిలిచి విచారిస్తామని ఏసీబీ డీఎస్పీ స్పష్టం చేశారు. ఇక తహసీల్దార్‌ నాగరాజు బ్యాంక్ లాకర్లపై ఎలాంటి స్పష్టత రాలేదని, ఏసీబీ విచారణకు నిందితులు సహకరించలేదని చెప్పారు. తహసీల్దార్ నాగరాజు, ఆయన భార్య ఇద్దరు కలిసి లాకర్ల వ్యవహారంపై తమని తప్పుతోవ పట్టించారని తెలిపారు. శ్రీనాథ్ డబ్బులు వరంగల్ నుంచి తీసుకువచ్చినట్లు , అవి లంచం కోసమే తెచ్చినట్లు అంగీకరించాడని సూర్యనారాయణ వెల్లడించారు.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

రక్తదానం మహా గొప్ప దానం

హైదరాబాద్ : 27/08/2020

అందరికి నమస్కారం 🙏

రాచకొండ పోలీస్ కమీషనర్(CP) మహేష్ భగవత్ IPS సర్ గారి ఆధ్వర్యంలో ఉప్పల్ పోలీస్ అధికారులు *రక్తదాన శిబిరం* ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ లో నిర్వహించబోతున్నారు.కావున మీలో ఎవరైనా, మీకు తెలిసిన వారికి అయినా తెలిపి  *రక్తదానం* చేయాలనుకునేవారు *ప్రజా సంకల్పం* గ్రూప్ లో మీ వివరాలు ఇవ్వగలరు.

*రక్త దానం (Blood donation) అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), చర్మం (skin), గుండె (heart), మూత్రపిండం (kidney), రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు. కనుక ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు.*

*ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్తదానం చేయడం చాలా గొప్పది*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Tuesday, August 25, 2020

లంచగొండి రెవిన్యూ అధికారి - గిన్నిస్ వరల్డ్ రికార్డ్

హైదరాబాద్ : 26/08/2020

*గిన్నిస్ బుక్ రికార్డులోకి కీస‌ర త‌హ‌సీల్దార్*

అవినీతి నిరోధక‌శాఖకు ప‌ట్టుబ‌డ్డ కీస‌ర త‌హ‌సీల్దార్ బాల‌రాజు నాగ‌రాజు పేరు *గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో**కి ఎక్కించాల‌ని అవినీతికి వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్న‌ చెందిన రెండు స్వ‌చ్ఛంద సంస్థ‌లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను కోరాయి. ఒక‌ భూప‌ట్టా విష‌యంలో రూ.2 కోట్ల‌కు డీల్ మాట్లాడుకుని రూ. 1.10 కోట్లు స్వీక‌రిస్తూ ఇటీవ‌లే త‌హ‌సీల్దార్ ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. ఒక ప్ర‌భుత్వ ఉద్యోగి 20 మిలియ‌న్ల‌ను లంచం రూపంలో తీసుకుంటూ ప‌ట్టుబ‌డ‌టం ప్ర‌పంచంలోనే ఇదే తొలిసారి అయి ఉండ‌వ‌చ్చ‌ని *యూత్ ఫ‌ర్ యాంటీ క‌రప్ష‌న్ (వైఏసీ) అధ్య‌క్షుడు ప‌ల్నాటి రాజేంద‌ర్, వ‌రంగ‌ల్ కేంద్రంగా అవినీతి వ్య‌తిరేక అవ‌గాహ‌న‌ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న జ్వాల సంస్థ అధ్య‌క్షుడు సుంక‌రి ప్ర‌శాంత్ గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డ్ కు ఆన్ లైన్లో చేసుకున్న ద‌ర‌ఖాస్తులో తెలిపారు.** దీనికి గిన్నిస్ బుక్ సంస్థ స్పందించింది. ప్ర‌భుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన త‌మ‌వ‌ద్ద ఇంత‌వ‌ర‌కు ఎలాంటి కేట‌గిరీ లేద‌ని, దీనికోసం *ప్ర‌త్యేకంగా కేట‌గిరి ప్రారంభించే విషయాన్ని ప‌రిశీలిస్తామ‌ని తెలిపింది*

*Source*: సాక్షి మీడియా

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/ 

బంగారు తెలంగాణ లో ఆడపిల్లకు అన్యాయం

https://youtu.be/Bhs-aTTp61Q

*ఈ సమాజంలో వున్న మనమందరం సిగ్గుతో తలవంచుకోవాలి **

*ప్రజా సంకల్పం & link Media ఈ తల్లికి అండగా ఉంటుంది*

*Q న్యూస్ తీన్మార్ మల్లన్న గారికి ధన్యవాదములు మీరు లేకుంటే ఈ సంఘటన అందరిని కదిలించేది కాదు*

Bapatla Krishnamohan 
25/08/2020

https://prajasankalpam1.blogspot.com/

Monday, August 24, 2020

తెలంగాణ లో మహిళల పై అఘాత్యాలు

హైదరాబాద్ : 25/08/2020

*మహిళా మణులకు ప్రజా సంకల్పం & link Media విజ్ఞప్తి చేస్తుంది ఇకనైనా మేలుకోండి,ప్రజా ప్రతినిధులను నిలదీయండి గర్జించండి*

*తెలంగాణ హోంమినిస్టర్ సర్ గారు, యువ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారు ఈ విషయంలో ఇంతవరకు స్పందించలేదు ఎందుకో ???*

*బాధితురాలికి అండగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ*

*Source*:
@GeethaMurthybjp

*Copy to Group link Media*

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/ 

Sunday, August 23, 2020

సుగాలి ప్రీతి విషయంలో పోరాటం ఆగదు

హైదరాబాద్ : 23/08/2020

*ఎవరీ సుగాలి ప్రీతి...? అసలు ఏం జరిగింది..?*

*సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు*. ఇదే సమయంలో అసలు సుగాలి  ప్రీతి ఎవరు? ఏం జరిగింది..? ఎప్పుడు జరిగింది..? ఇప్పుడెందుకు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందనే విషయాలను చూస్తే.. *2017 ఆగస్టు 19న 15 ఏళ్ల బాలిక అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. అత్యాచారాలకు, హత్యాచారాలకు బలైపోయిన బాధితుల పేర్లు బైటకు రాకూడదనే కారణంతో ప్రస్తుతం ఆమె పేరును గీతగా మార్చారు*. కర్నూలు శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్‌.రాజు నాయక్, ఎస్‌.పార్వతిదేవి దంపతుల 14 ఏళ్ల కుమార్తే ఈ గీత. ఓ రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివేది. *2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్‌ యాజమాన్యం చెబుతోంది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్‌ యజమాని కొడుకులు బలవంతంగా రేప్‌ చేసి చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ*.

ఇక, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యులు సైతం... *2017 ఆగస్టు 20న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్‌లో బాలికని రేప్‌ చేసినట్లు నిర్ధారించారు. పెథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు*. తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు *తాలూకా పోలీసు స్టేషన్‌లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌ యజమానితో పాటు.. అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు*. నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు ముందుగా త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. బాలిక శరీరంపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాల పట్ల కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. *విద్యార్థినిపై లైంగిక దాడి చేసి.. హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది*.
సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితులను అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డను రేప్‌ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు. ఆధారాలు పక్కాగా ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దళిత సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించాయి. అయితే *ఎలాంటి న్యాయం జరగలేదు*. దీంతో ఇదే విషయమై ఆమె *జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు*. దీంతో ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ కర్నూలు నగరంలో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అటు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. *మరోవైపు సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు*. సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపించామని వివరించారు. ఈ కేసులో అనేక మలుపులు చోటుచేసుకోవడంతో కేసును *సీబీఐకి అప్పగించాలని అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయి*. ఒత్తిడి పెరగడంతో.. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు మరోసారి లోతుగా దర్యాప్తు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

*Source*:
@Ntv Media

*ప్రజా సంకల్పం & link Media సుగాలి ప్రీతి తల్లి తండ్రులు చేస్తున్న పోరాటానికి మద్దత్తు తెలుపుతుంది.*
Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/ 

Supreme Court PIL for Support Police in INDIA

Can you help me out by signing this petition?
http://chng.it/4GtwzpDK

*Praja Sankalpam & link Media* Support Indian Police *PIL* in *Supreme Court*
23/08/2020

Saturday, August 22, 2020

తెలంగాణ ఉత్తమ ఉపాధ్యాయురాలు

హైదరాబాద్ : 22/08/2020

*ఉత్తమ ఉపాధ్యాయురాలిని  సత్కరించిన సిపి*

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైందని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అన్నారు. *మలక్‌పేటలో నెహ్రూ మెమోరియల్‌ ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్కూల్‌ అసిస్టెంట్‌ ఉమ్మాజీ పద్మప్రియ 2020 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో సీపీ ఆమెకు అభినందనలు తెలిపి సత్కరించారు*. ఈ సందర్భంగా అంజనీకుమార్‌ మాట్లాడుతూ దేశ భవిష్యత్‌పై ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు.
*తెలంగాణ నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పద్మప్రియ ఎంపికవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు*. ఈ కార్యక్రమంలో మలక్‌పేట ఏసీపీ వెంకట రమణ, ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు, ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి పాల్గొ్న్నారు.

*ప్రజా సంకల్పం & link Media ఉమ్మాజి పద్మప్రియ మేడం గారు ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎంపికైన సందర్బంగా అభినందనలు తెలియచేస్తుంది 🙏*

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Freedom of Speech

Hyderabad : 22/08/2020

*We Q Group Media appeal you for the Irrespective Copyright Claims of irrespective Youtube channels*. We serving our subscribers in giving the rightful news, but were we facing a lot of problems on youtube.
*Few reputed Youtube Channels like TV9 Telugu, are claiming our own upload videos and raising a copyright strike*. This seems very *ridiculous and urging youtube India to take strict legal action against them*.
We Q Group Media alleges you to take strict action on them,if not we will quit your Youtube platform.State govt. and a few paid youtube channels are intentionally targeting us and creating a mass group of strike reports on Youtube.
*We request you take immediate action on them and relieve copyright strikes on our channels. Hope this goes in the right way and justice is done.*
@YouTube @YouTubeIndia @ytcreators @Google @GoogleIndia

*Source*:
@TeenmarM

*We Praja Sankalpam Support & stand with Q News మల్లన్న (Naveen Kumar)*

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/ 

GHMC ఎన్నికలకు ఇప్పటినుంచే వరాలు కేటీఆర్ సర్

హైదరాబాద్ : 22/08/2020

*తెలంగాణ యువ మంత్రివర్యులు, GHMC దత్తత మంత్రి కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏*

*పురపాలికల్లో వార్డుకో ఆఫీసర్*

*మున్సిపల్‌శాఖలో 2,298 పోస్టుల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం*
పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని మంత్రి *కేటీఆర్‌* ఆదేశం
- *ఇది దేశంలోనే మొదటిసారి: మంత్రి*

*Source* :@KTRTRS

*సారూ మీకు ఇన్నిరోజులుగా GHMC పరిధిలోని సమస్యలు కనిపించలేదా ??  ఇప్పడు GHMC ఎన్నికలు దగ్గరవ్వడంతో అభివృద్ధి గుర్తుకొస్తుందా సారూ 🤔*

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/ 

Friday, August 21, 2020

మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ

హైదరాబాద్ : 21/08/2020

మేడ్చల్ జిల్లా *ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం *రామంతాపూర్**లో పర్యావరణ పరిరక్షలో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మట్టి గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.
*HMDA* వారి సహకారంతో *హైదరాబాద్ జిందాబాద్ & ప్రజా సంకల్పం & శ్రీనిధి మహిళా ఫౌండేషన్* వారు *ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాశి విశ్వనాధ్ సర్* గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో *హైదరాబాద్ జిందాబాద్ సభ్యులు ఎర్రం శ్రీనివాస్ & బాపట్ల కృష్ణమోహన్, రామంతాపూర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ శారదా నగర్ సంక్షేమ సంఘము అధ్యక్షులు పెద్దలు అమ్మన వెంకట్ రెడ్డి అన్న గారు & శ్రీమతి శైలజా వెంకట్ రెడ్డి గారు మరియు శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ పుష్పలత గారు & సభ్యులు, ప్రజా సంకల్పం*  పాల్గొని రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ లో పంపిణీ చేయడం జరిగింది.

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

 

Thursday, August 20, 2020

గణేష్ ఉత్సవాలు -పోలీసులు -ప్రజలు


*వినాయక ఉత్సవాలపై పోలీసుల ఆంక్షలు*
హైదరాబాద్‌లో ప్రతిఏటా గణేష్‌ ఉత్సవాలు హంగు ఆర్బాటాలు, తీన్మార్‌ డ్యాన్స్‌లతో జరుగుతాయి. కరోనా నేపథ్యంలో ఈసారి ఎలాంటి హడావుడి లేకుండానే ఉత్సవాలు జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో *కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో గణపతి వేడుకలపై పోలీసులు ఈసారి ఆంక్షలు విధించారు*. ప్రభుత్వం కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను పెట్టకూడదని నిర్ణయించడంతో ఈసారి గణేష్‌ ఉత్సవాలు నామమాత్రంగా జరగనున్నాయి.

గణేష్‌ ఉత్సవాలపైనా కోవిడ్‌ ప్రభావం.వాస్తవానికి స్థానిక పోలీస్ స్టేషన్ లో నుండి మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఈ ఏడాది అనుమతి నిరాకరించడంతో గణేష్ మండపాలు నిర్వహించడం కష్టతరంగా మారింది. *మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇదే పరిస్థితి నెలకొంది.* మొత్తానికి గణేష్‌ ఉత్సవాలపైనా కోవిడ్‌ ప్రభావం పడింది. ఎప్పుడూ ఎంతో ఆర్భాటంగా జరిగే గణేష్‌ వేడుకలు ఈసారి *పోలీసుల ఆంక్షల మధ్య కొనసాగనున్నాయి.*

*ప్రజా సంకల్పం & link Media ద్వారా ప్రజలను కోరేది ఒక్కటే దయచేసి కరోనా నేపథ్యంలో జాగ్రతలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

మరో లంచగొండి రెవిన్యూ అధికారి

హైదరాబాద్ : 20/08/2020

*మొన్న నాగరాజు నేడు వెంకటేశ్వర్ రెడ్డి... !*

కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అయితే ఈసారి నాగరాజు తరహాలో కోటి రూపాయలు కాకుండా *5వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి దొరికిపోయాడు*. ఈ ఘటనతో *తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరు ఏ మాత్రం మారలేదన్న విషయం బయటపడింది*
వివరాలు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్‌ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్‌ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల రూపాయలు *లంచం డిమాండ్‌ చేశాడు*.
కాగా బుధవారమే 10వేల రూపాయల లంచం అందుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం మరో 5వేల రూపాయలు తీసుకుంటూ *ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు.* వెంకటేశ్వర్‌రెడ్డి పనిచేస్తున్న కార్యాలయంతో పాటు అతని నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

*ఎప్పుడు మారుతారు చీడ పురుగులు ఇలాంటి పురుగులు మీ ద్రుష్టికి వస్తే *ప్రజా సంకల్పం & link Media కు తెలుపగలరు*

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

చెరువుల అభివృద్ధి పేరున ఆక్రమణలను పట్టించుకోని ప్రజా ప్రతినిధులు

హైదరాబాద్ : 20/08/2020

కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు గారు *అభివృద్ధి అంటే చెరువులను కబ్జా చేసి చేయడమా ??. **
చెరువులు ఆక్రమణలకు గురి అవుతున్నాయి అని *ప్రజా సంకల్పం & link Media*  మరియు చాలా స్వచ్చందసంస్థలు *SOUL మాజీ కన్వీనర్ లుబ్న మేడం* గారి సహాయంతో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే *అభివృద్ధిని అడ్డుకుంటున్నారు* అంటారా. MLA గారు ఇదే మీ స్పందన అయితే *న్యాయస్థానానికి వచ్చి చెప్పాలి. అప్పుడు తెలుస్తుంది ఎవరు తప్పు చేస్తున్నారో.*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 


ప్లాస్మా దానం చేయండి 🙏

హైదరాబాద్ : 20/08/2020

*ప్లాస్మా దానం చేయండి ఆపదలో వున్న వారికి కొత్త జీవితాలు ప్రసాదించండి.*

రాచకొండ CP మహేష్ భగవత్  IPS సర్ మరియు సైబరాబాద్ CP సజ్జనార్ IPS సర్ గారు చేస్తున్న ఈ ఉద్యమంలో అందరు పాల్గొనాలని *ప్రజా సంకల్పం & link Media* ద్వారా మనవి చేస్తున్నాము.

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Wednesday, August 19, 2020

రాజీవ్ గాంధీ జయంతి

హైదరాబాద్ : 20/08/2020

*నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి*. అతిపిన్న వయసులో ప్రధాని అయి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన నేత రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని (Rajiv Gandhi Birth Anniversary) *ప్రజా సంకల్పం & link Media*  ద్వారా నివాళులు ఆర్పుస్తున్నాము.

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

నాణ్యమైన హెల్మెట్ ధరించండి -ప్రాణాలు కాపాడుకుందాం

హైదరాబాద్ : 19/08/2020
రోడ్డు సురక్ష పాఠాలు:
శామీర్ పేట్ దగ్గర ఈరోజు పొద్దున్న జరిగిన ప్రమాదం.
నాసిరకం హెల్మెట్లు చిద్రమయ్యి బ్రతుకులను కూడ చిద్రం చేస్తాయి.
మంచి క్వాలిటీ హెల్మెట్లనే వాడండి.
#RoadSafety #RoadSafetyCyberabad https://t.co/ozfDjMzNE0
గతంలో  *ప్రజా సంకల్పం & link Media* కు ప్రజలనుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి *హెల్మెట్ మరియు ట్రాఫిక్ పోలీస్* ల మీద. ఏమిటి అంటే ప్రతిరోజూ ఉదయం తల్లితండ్రులు వారి పిల్లలను వారు నివాసం వుండే ప్రాంతానికి దగ్గరలో స్కూల్స్ కు ద్విచక్ర వాహనాలమీద  వదిలిపెట్టేటప్పుడు *హెల్మెట్* లేకుండా వెళ్లడం అక్కడే *ట్రాఫిక్ పోలీస్ లు ** ఫోటోలు తీయడం పెనాల్టీ online లో పంపియడం  జరుగుతుంది అని. దానికి *ప్రజా సంకల్పం* సభ్యులు *ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులతో* చర్చించడం జరిగింది. 

*ట్రాఫిక్ పోలీస్ అధికారుల వివరణ*

*అనుభవ రాహిత్యం, అజాగ్రత, మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురై ఎంతో మంది విలువైన ప్రాణాలు కోల్పోతున్న దృష్ట్యా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే  పోలీసులు వాహన చోదకులపై కటువుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వెలువడిన ఆదేశాల మేరకు వాహన చోదకుడి వద్ద ఖచ్చితంగా లైసెన్స్ కలిగివుండాలని, వాహనం నడుపుతున్నప్పుడు విధిగా శిరస్రాణం ధరించాలన్న నిబంధనల మేరకు వాహన చోదకుల్లో కదలిక ప్రారంభమైంది*

*ప్రజా సంకల్పం & link Media ద్వారా ప్రజలకు తెలియచేసేది ఏమనగా  చేయడం మీరు ఇప్పుడు మాస్క్ ఎలా పెట్టుకొని ఇంట్లో నుంచి భయలుదేరుతున్నారో అదే విధంగా ద్విచక్ర వాహనం మీద వెళ్ళేటప్పుడు మీ గురించి మీ కుటుంబం గురించి అలోచించి హెల్మెట్ కూడా ధరించి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాము*

*ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సహకరించగలరు.అలాగే  మీకు(ప్రజలు) ఏమైనా చెప్పాలని వుంటే గ్రూప్ లో మీ వివరణ ఇవ్వగలరు*

బాపట్ల కృష్ణమోహన్ 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, August 18, 2020

World Humanitarian Day

Hyderabad : 19/08/2020

*Zoom meeting*

On the occasion of

*World Humanitarian Day*
August 19 th2020

⏰Time: *3:00 PM*

*Inaugural words:*

*Jb.Abdul Majeed shb*
*Asst. Secretary ,JIH TS*

*SPEAKERS*

*Ms.Sumitra Ankuram Garu*
Social Activist

*Shri.Jeevan Kumar Garu*
Human rights Activist

Awards ( E Certificate) to Best Humanitarians and sharing Experiences.

*𝑷𝒓𝒆𝒔𝒊𝒅𝒆𝒏𝒕𝒊𝒂𝒍 𝑺𝒑𝒆𝒆𝒄𝒉:*
*ℍ𝕒𝕞𝕚𝕕 𝕄𝕠𝕙𝕕 𝕂𝕙𝕒𝕟 𝕊𝕓*
*State President JIH TS*

*Zoom  link*

https://us02web.zoom.us/j/83096630109 to start or join jih Telangana scheduled Zoom meeting on 19/8/20 at 3pm*

*Regards,*
*Sadiq Ahmed*
*State Secretary*

*Praja Sankalpam & link Media Associated to HRF(Human Rights Forum) Represented by Shri Jeevan Kumar Sir*

Bapatla Krishnamohan
Praja Sankalpam 

సంకల్పం తో పోరాటం మొదలైన కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 19/08/2020

*సంకల్పంతో విజయం*

ఈనెల 14/08/2020 నాడు  *సాక్షి మీడియా* లో *ఆగిన కరోనా పరీక్షలు రామంతాపూర్ హోమియో ఆసుపత్రి లో ** వచ్చిన కథనానికి *ప్రజా సంకల్పం & link Media* అదే రోజు ట్విట్టర్ ద్వారా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి *కేసీఆర్ సర్* గారికి మరియు GHMC దత్తత మంత్రివర్యులు *కేటీఆర్  సర్* గారి  ద్రుష్టికి తీసుకెళ్లడం జరిగింది.

దానికి స్పందించి మళ్ళీ *రామంతాపూర్ హోమియో ఆసుపత్రి లో కరోనా పరీక్షలు* మొదలు పెట్టడం అభినందనీయం 👍.

*ఈ పోరాటంకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలపాల్సింది సాక్షి మీడియా ప్రతినిధి అశోక్ అన్న గారికి 🙏. అన్న గారు మీరు ఇలాగే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కథనాలు మీ మీడియా ద్వారా ప్రచురణ చేయాలని కోరుకుంటున్నాను **

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

 

నిద్ర పోతున్న తెలంగాణ రెవిన్యూ సిబ్బంది

హైదరాబాద్ : 19/08/2020

*మ్యుటేషన్లు మూలకే... !*

పెండింగ్‌లో 1.16 లక్షల మ్యుటేషన్ల దరఖాస్తులు
నెలలు గడుస్తున్నా పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం

*ముఖ్యమంత్రి కన్నెర్ర జేసినా.. లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినా.. ఆఖరికి భౌతికదాడులు జరిగినా.. చాలామంది రెవెన్యూ అధికారుల పనితీరు మారడంలేదు*. ఆంధ్రప్రదేశ్‌లో పక్షం రోజుల్లోనే మ్యుటేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తుండగా మన రాష్ట్రంలో మాత్రం దరఖాస్తుదారులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో భూ యాజమాన్య హక్కుల కోసం పట్టాదారులు తహసీళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. *మ్యుటేషన్లు, విరాసత్‌ల అమలు ఆలస్యానికి కరోనా వ్యాప్తి కూడా ఒక కారణమే అయినా..రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోంది*.
రిజిస్ట్రేషన్‌ పూర్తి కాగానే 24 గంటల్లోనే ఆన్‌లైన్‌ మ్యుటేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఒకవైపు ఆలోచిస్తుండగా క్షేత్రస్థాయి యంత్రాంగం మాత్రం షరా మామూలుగానే స్పందిస్తున్నట్లు పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. మీ-సేవలో దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం.. మ్యుటేషన్ల జారీలో జాప్యం చేస్తోంది. దీంతో పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల జారీలోనూ ఆలస్యం జరుగుతోంది. *రాష్ట్రవ్యాప్తంగా 16,14,725 దరఖాస్తులు భూ యాజమాన్య హక్కులు, వారసత్వ భూ బదలాయింపులు* కోరుతూ ప్రభుత్వానికి రాగా.. వాటిలో ఇప్పటివరకు 11,89,951 దరఖాస్తులకు మోక్షం కలిగింది. ఇంకా 1,16,476 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 74,610 దరఖాస్తులు *తహసీల్దార్ల* వద్ద పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
*తహసీళ్ల చుట్టూ చక్కర్లు :*

*సుపరిపాలన, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఆన్‌లైన్‌ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినా చాలా మంది అధికారులు ఇంకా వాటికి అలవాటుపడలేదు*. మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే మ్యుటేషన్‌ వ్యవహారం కొలిక్కి రావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు సహా సేల్‌డీడ్, 1బీ, పహాణీ నకలు జతపరిస్తే.. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. భూ యాజమాన్య హక్కుల మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడం రెవెన్యూ అధికారుల విధి. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడంలేదు.
మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసిన కాపీల నకళ్లను *తహసీల్దార్‌ కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేస్తే తప్ప వాటికి మోక్షం కలగడంలేదు*. పట్టాదార్లను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దనే ఉద్ధేశంలో దాదాపుగా అన్ని సేవలను ప్రభుత్వం ఆన్‌లైన్‌ చేసింది. మీ-సేవలో చేసుకున్న అర్జీ జత పరిచిన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసే వాటికి జిరాక్స్‌ల కోసం రెవెన్యూ శాఖ నెలవారీగా నిధులు విడుదల చేస్తోంది. అయితే ఒరిజినల్‌ డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ నెపంతో దరఖాస్తుదారులను కార్యాలయాలకు పిలిపించి.. బేరసారాలు మొదలుపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Monday, August 17, 2020

Hyderabad Police Commissioner

Hyderabad : 18/08/2020

Inspector K Chander kumar working in Special Branch has been placed under suspension. *His conduct has been improper with a lady. Any misconduct by an officer in uniform can't  be tolerated at all*. Send whatsapp msg at 9490616555. Help us identify *black sheeps* in police department

*Source*:
@CPHydCity

*Praja Sankalpam & link Media Appreciate your great steps towards friendly environment between police and public Sir 👍🙏*

*We are proud to have you as our COMMISSIONER OF POLICE 🙏*

Bapatla Krishnamohan
Praja Sankalpam

https://prajasankalpam1.blogspot.com/ 

తెలంగాణ రెవిన్యూ శాఖ లో లంచగొండిలు

హైదరాబాద్ : 18/08/2020

రెవిన్యూ అధికారుల మీద దాడి జరిగితే మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రెవిన్యూ సంఘాలు వాటి నాయకులు *కీసర లంచగొండి భారత దేశ చరిత్రలో తెలంగాణ రెవిన్యూ శాఖ ను అందరికి తెలిసేలా చేసిన తహసీల్దార్ నాగరాజు* చేసిన గొప్ప వ్యవహారంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడకుండా ఎక్కడికి పోయారు  ???.

రైతులు తమ భూ సమస్యల విషయంలో తమకు అన్యాయం జరిగింది అని రెవిన్యూ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ అధికారులను నిలదీసి మాట్లాడితే మాత్రం *రెవిన్యూ సంఘాలు మరియు వాటి నాయకులు* మాత్రం మీడియా లో వచ్చి హంగామా చేస్తారు.

*ప్రజా సంకల్పం & link Media* రెవిన్యూ *అధికారులకు,సంఘాలు వాటి నాయకులకు* చెప్పేది ఒక్కటే మీరు ప్రజలకు జవాబుదారీ తనంగా పని చేయాలి అంతే కాని మీ ప్రయోజనాలకోసం పని చేయకండి.

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

ప్రతిభా అవార్డు అధికారికి అభినందనలు తెలుపుతూ

హైదరాబాద్ : 17/08/2020

స్వాతంత్ర్య వేడుకలో భాగంగా *ప్రజా సంకల్పం & link Media* తరపున బాపట్ల కృష్ణమోహన్,గ్రూప్ గౌరవ సలహాదారు అమ్మన వెంకట్ రెడ్డి గారు సభ్యులు మధు తో కలిసి  *ప్రతిభా పురస్కారం పొందిన ఉప్పల్ పోలీస్ స్టేషన్ సర్కిల్  ఇన్స్పెక్టర్ రంగస్వామి సర్ కు  శుభాకాంక్షలు తెలుపడం జరిగింది*.

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Sunday, August 16, 2020

భారీ వర్షాలు -సూచనలు

హైదరాబాద్ : 16/08/2020

*భారీ వర్ష సూచనలు*

*Hyderabad లోని పౌరులు సంప్రదించవచ్చు*
04029555500 
Or
100

ఒక వేల నీరు నిలవటం / ముంపు / చెట్లు కూలటం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు
ఏర్పడితే *@Director_EVDM డి.ఆర్.ఫ్ బృందం వెంటనే స్పందించవలెను*

*@GHMCOnline ఇప్పటికే క్షేత్ర స్థాయి లో పని చేస్తున్నయి*

@KTRTRS 

*Source*:
@arvindkumar_ias

Bapatla Krishnamohan 

https://prajasankalpam1.blogspot.com/

వర్షాలతో పోలీస్ శాఖ అప్రమత్తం

హైదరాబాద్ : 16/08/2020

*వర్షాలతో పోలీస్ శాఖ అప్రమత్తం*

రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమీషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు డీజీపీ కార్యాలయం నుండి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. *గత రెండు రోజుల నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తాను కలసి జిల్లాల కలెక్టర్లు సీపీలు, ఎస్పీలతో ఉమ్మడిగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ విధమైన అవాంచనీయ సంఘటనలు జరుగకుండా తగు సూచనలు, సలహాలను ఇస్తున్నామని చెప్పారు.*
రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ తో పాటు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో పోలీస్ అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అత్యంత ప్రాధాన్యతనివ్వాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి స్పస్టం చేశారు.

*ప్రజల పక్షం*
సుజీవన్ వావిలాల*🖋️

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/ 

watch Hyderabad ki Shaan

Hyderabad : 16/08/2020

*Dear @KTRTRS @arvindkumar_ias we have spent almost 16 crore to renovate MoazzamJahiMarket 2 days ago we inaugurated.* These are today’s pictures.
*Who will be the responsible?* It’s reminds me a Hyderabadi phrase *Hyderabad Nagina Andar Mitti Uppar Cuhnna”*. @INTACHIndia @GHMCOnline

*Source*:
@infomubashir
Journalist & Writer

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/ 

లంచగొండి MRO వెనకాల ఎవరి హస్తం

హైదరాబాద్ : 16/08/2020

*ఎమ్మార్వో నాగరాజు వెనుక ఉన్న.... ఎంపీ ఎవరు....?.... విహెచ్*
*లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మార్వో నాగరాజు వద్ద ఓ ఎంపీ లేఖ లభించినట్లు వార్తలు వస్తున్నాయని, ఆ లేఖ ఏ ఎంపీదో బయటపెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు(విహెచ్) డిమాండ్ చేశారు*. ఇదే అంశంపై ఆదివారం నాడు ఇక్కడి పార్టీ కార్యాలయంలో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. *నాగరాజు వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు*. సీఎంకి చిత్తశుద్ధి ఉంటే భూ బకాసురుల చిట్టా బయటపెట్టాలన్నారు. *ఈనెల 19వ తేదీన కీసర వెళతానని, వివరాలను బయటపెడతానని అన్నారు.* ఏసీబీ అధికారులు దాడులు చేసి ఊరుకుంటే సరిపోదని, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని వీహెచ్ డిమాండ్ చేశారు.
*కీసర ఎమ్మార్వో ఘటన తరువాత కలెక్టర్ ఉద్యోగం కూడా అవసరం లేదని.. ఐదేళ్లు ఎమ్మార్వోగా ఉంటే చాలని కలెక్టర్లు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు*. ఇదే సమయంలో గ్రేటర్, దుబ్బాక ఎన్నికల అంశంపై వీహెచ్ స్పందించారు. ఎన్నికల అంశంపై చర్చ పెట్టాలన్నారు. కోర్ కమిటీ పెట్టాలని పీసీసీకి పదే పదే చెప్తున్నానని అన్నారు.

*ప్రజల పక్షం*
సుజీవన్ వావిలాల*🖋️

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

మానవ రహిత ప్రాజెక్ట్

హైదరాబాద్ : 16/08/2020

*సరళాసాగర్ కు జలకళ*

*మానవ రహిత నియంత్రణ వ్యవస్థతో నడుస్తున్న ఏకైక ప్రాజెక్టు సరళాసాగర్ 15 ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్ గా గేట్లు తెరుచుకోవడంతో సుందర దృశ్యం ఆవిష్క్రతమైంది. నిండుకుండలా జళకళ సంతరించుకున్న సరళాసాగర్ ప్రాజెక్టు యావత్ దేశానికే గర్వకారణం*

సరళాసాగర్...సమాచారం
తేదీ 10-7-1947 వనపర్తి సంస్థానాదీశులు రాజా రామేశ్వర రావు రూ.30 లక్షల వ్యయంతో సరళాసాగర్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు,
తేది 1-5-1959 ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యింది. అప్పటి నిజాం ప్రభుత్వ గవర్నర్ దీనిని ప్రారంభించారు.
26-7-1959 రైతులకు మొదటి సారి అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్   ఇరిగేషన్ శాఖ మంత్రి నర్సింగరావు కాలువలకు నీళ్లు వదిలారు,
4)1960-1963 సంవత్సరాల లో భారీ వర్షాలు కురవటంతో సై ఫన్ లు దూకాయి.
5)1964 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు శంకర సముద్రం చెరువు కట్ట తెగపోవటంతో పాటు సరళ సాగర్ కట్ట వరద ఉధృతి కి కొట్టుకు పోయింది.కొట్టుకు పోయిన
కట్ట స్థానం లో అలుగు నిర్మాణం చేశారు.  1967-68-69-1970 లో వరుసగా  సై ఫన్ లు దూకాయి
1974-1981 లోనూ సైఫాన్ లు దూకాయి.
1988 , 1990- 91,
1993లో సైఫాన్ లు దూకాయి.
19 98 సంవత్సరంలో
2009 సంవత్సరంలో సైఫాన్ లు దూకాయి. 2019 డిసెంబర్ 31న సరళాసాగర్ కట్ట బలహీన మై తెగపోవటంతో నిండు కుండ లాంటి ప్రాజెక్టులోని అర టీఎంసీ నీరు వృధా గా పోయింది. టన్నుల కొద్ది  చేపలు ఇసుకలో కూరుకు పోయి చనిపోయాయి. ఆరు కోట్ల రూపాయల తో గండి పూడ్చి మరమ్మతులు నిర్వహించారు. 2020 ఆగస్టు 16న సరళాసాగర్ సైఫన్ లు మరో సారి  దూకాయి.

ప్రజల పక్షం
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

Saturday, August 15, 2020

భారత జవాన్ దివంగత కల్నల్ సంతోష్ బాబు సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం

హైదరాబాద్ : 15/08/2020

*డిప్యూటీ కలెక్టర్ గా సంతోష్ బాబు సతీమణి*

కల్నల్‌ సంతోష్‌ బాబు భార్య సంతోషి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా నేడు బాధ్యతలు చేపట్టారు. బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ను కలిసి శనివారం ఆమె జాయినింగ్‌ రిపోర్ట్‌ సమర్పించారు. సంతోషికి రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొన్నిరోజుల క్రితం ఆమెకు నియామక పత్రాన్నిఅందజేశారు. *దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం వారికి హామీ ఇచ్చారు.* అందులో భాగంగానే ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇచ్చారు

*ప్రజల పక్షం*
సుజీవన్ వావిలాల*🖋️

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Friday, August 14, 2020

ప్రజలు -ప్రభుత్వం -అధికారులు

హైదరాబాద్ : 15/08/2020

*1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి దేశాన్ని బానిస సంకెళ్ళ నుంచి విడిపించారు.*

*ప్రజా సంకల్పం మరియు link Media కూడా ప్రజా సమస్యల మీద ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా, ఎవరి మనోభావాలను అడ్డుకోకుండా,ఏవరో ఒకరి ప్రయోజనాల కోసం కాకుండా ఎక్కువ మంది ప్రజల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రభుత్వాన్ని, అధికారులను,ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను ఆశ్రయించి సమస్యల పరిష్కారమార్గం వైపు వెళుతుంది*

అందులో భాగంగానే *ప్రభుత్వభూములను,చెరువులను,బస్తీ దవాఖాన విషయంలో వాస్తవాలు సేకరించి ప్రభుత్వానికి,  అధికారులకు,ప్రజా ప్రతినిధులకు భారత రాజ్యాంగసృష్టికర్త లో ముఖ్యులు గౌరవనీయులైన భీంరావ్ రాంజీ అంబేడ్కర్ సర్ గారు న్యాయంగా మనకు కల్పించిన హక్కుల ఆధారంగా అన్ని వివరాలతో వినతి పత్రాలు ఇచ్చిన కూడా వాటికి సమాధానం ఇవ్వకుండా వారు ఇష్టం వచ్చినట్లు నడుచుకోవడం రాజ్యాంగంకు విరుద్ధం అవుతుంది అని దయచేసి  తెలుసుకోవాలి.ఇలాంటి చర్యలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది.లేదు అంటే న్యాయస్థానాలు వున్నాయి అది మరిచిపొవద్దు.*

*నిన్నటి రోజు 14/08/2020 న మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ శారదా నగర్ లో బస్తీ దవాఖానను ప్రారంభించడం మీద ప్రభుత్వం,అధికారులు,ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు జవాబు చెప్పాలి. మేము బస్తీ దవాఖానలకు వ్యతిరేకం కాదు కానీ అవసరం వున్న చోటు కాకుండా వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని మొదటనుంచి వాస్తవాలతో మీ అందరి ద్రుష్టికి తీసుకొచ్చినా కూడా మా వినతి పత్రాలను న్యాయంగా విచారణ చేయకుండా వినతి పత్రం ఇచ్చిన వారికి ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రక్కన పడేసారు.ఇది న్యాయం కాదు. దానికి న్యాయస్థానంలో న్యాయంగా పోరాటం చేయడానికి వెనుకాడేది లేదు.న్యాయస్థానం మీద నమ్మకం వుంది. ఇప్పుడు ఇలానే మనకెందుకులే అనుకుంటే ప్రజా ప్రయోజనాలు ఈ ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు వారు చెప్పిందే శాసనం లాగా అవుతుంది. ప్రజలారా మేలుకోండి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఇలాంటి వ్యవస్థ ను మార్చాల్సిన అవసరం ఎంతైనా వుంది 👍*

*ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి దయచేసి మీ ద్రుష్టికి వచ్చిన వినతి పత్రాన్ని చదివి అది రాజ్యాంగ పరిధిలో వస్తుందా లేదా  విరుద్ధంగా వుందా అని న్యాయంగా విచారణ చేసి జవాబు ఇవ్వాలి. అదే జవాబు తారీ తనం అంటారు.మనము ప్రజాస్వామ్యదేశంలో వున్నాము నియంత పాలనలో లేము 🙏*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

హైదరాబాద్ : 15/08/2020

*కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న సువిశాల దేశం.విభిన్న మతాలు,భాషలు, సంస్కృతులతో విలసిల్లుతూ, ప్రపంచాన భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్న దేశం.*

*ప్రజలందరికి 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది *ప్రజా సంకల్పం & link Media 🙏*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

తెలంగాణ మహిళా పోలీస్ అధికారులు

GHMC - Bastee Dhavakhana

Hyderabad : 14/08/2020

*Breaking News*

*MA&UD Minister @KTRTRS inaugurated a Basthi Dawakhana in Medchal District Uppal Assembly Constituency  Ramreddy Nagar Basti, Habsiguda*. This basthi dawakhana will approximately *serve 12,000 people (3000 houselholds) in six slums of Habsiguda*. A total number of 25 basthi dawakhanas are being inaugurated in Hyderabad today.

This Basthi Dawakhana provides free services such as OPD Consultation, Basic lab diagnosis, Free medicines, Antenatal and postnatal care, services and screening for non-communicable diseases such as BP, Bloodsugar.

*Source*:
@MinisterKTR

Bapatla Krishnamohan
Praja Sankalpam

https://prajasankalpam1.blogspot.com/

 

Thursday, August 13, 2020

తెలంగాణ ప్రభుత్వం -కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 14/08/2020

*గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్ గారికి నమస్కారం 🙏*

సర్,

గత కొన్ని నెలల క్రితం *మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్* లో ఎంతో హాట్టహాసంగా మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రారంభించిన *రామంతాపూర్ హోమియో కాలేజీ లో కరోనా పరీక్షలు* కొన్ని రోజులే పని చేసింది ఎందుకు ??? జవాబు చెప్పాలి సారు *మంత్రి గారు అధికారులు.*

సారు *అదే ఆసుపత్రి పెద్ద సారు రిటైర్మెంట్ అయితే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఆ సారుకు పదవీ కాలం పొడగించింది. మరి *తెలంగాణ ప్రభుత్వానికి ఈ సారు మీద వున్న శ్రద్ద ప్రజల ఆరోగ్యభద్రత మీద లేదు*

సారు *తెలంగాణ యువ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారు ఇప్పుడు GHMC ఎన్నికలు వస్తున్నాయి అని చాలా హడావిడి చేస్తున్నాడు ట్విట్టర్ లో అలాగే కొన్ని పత్రికల ద్వారా మరి మా లాంటి సంస్థలు వాస్తవాలు చెపితే మాత్రం పట్టించుకోవడం లేదు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ?? **

సారు *ప్రజలలో మార్పులు వస్తున్నాయి, ప్రజలే జవాబు చెపుతారు GHMC ఎన్నికలలో. ప్రభుత్వ అధికారులు ప్రజల ప్రయోజనాల కన్నా మీకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనడానికి ఈ మధ్య కాలంలో తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా అర్థం అవుతున్నాయి **

సారు దయచేసి *చరిత్ర ఒక్కసారి చూసుకుంటే ఎందరో రాజకీయ ఉద్ధండులు ప్రజల మనోభావాలతో ఆడుకుంటే ఏమి సాధించుకున్నారో అందరికి తెలుసు. కావున ప్రజా అభిప్రాయం తెలుసు కొని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి ఏ పార్టీ నాయకులు అయినా 🙏**

*Copy to Group link Media*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Wednesday, August 12, 2020

Rachakonda CP Sir Appeals

Hyderabad : 12/08/2020

*Appeal to community for not to post hate/ inappropriate content in Social media : Rachakonda CP*

- As you are aware, a malicious social media post has led to violence in Bangalore City resulting in loss of life and properties.
Citizens are requested to behave with responsibility and not to post / circulate any hate/ inappropriate content in Social Media which is likely to adversely affect Public order and Peace in the society.

Social Media cell of Rachakonda Police and cyber volunteers are closely watching round the clock for unsocial elements circulating such malicious content in Social Media.
Citizens coming across such post immediately alert whatsapp control 9490617111 of Rachakonda police.
- All the supervisory Officers and SHO’s have been instructed to register specific cases in every such instance and initiate strong and stringent action against such offenders without fail.

Rachakonda Police request public to partner with police to maintain highest standards of safety and security.
Let us maintain peace and tranquility in our Rachakonda police commussionerate area.

      -Yours

*CP Rachakonda Mahesh M Bhagwat IPS.*

Bapatla Krishnamohan
Praja Sankalpam

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు DGP గారి విజ్ఞప్తి

హైదరాబాద్ : 12/08/2020

*రాష్ట్ర ప్రజలకు డీజీపీ మహేందర్ రెడ్డి విజ్ఞప్తి*
సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. *సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పడు పోస్టులు బెంగళూరు లో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయో తెలుసుకోవాలని కోరారు.* శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. *సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటి వారిపై వారిపై వెంటనే కేసులు పెట్టి, తగిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు*
ఈ మేరకు ఇప్పటికే అన్ని స్టేషన్లకూ, సీనియర్ అధికారులకూ ఆదేశాలిచ్చామని తెలిపారు.
*ప్రజలు పోలీసులతో సహకరించి భద్రత, రక్షణలో తెలంగాణ అత్యున్నతంగా నిలిచేలా సహకరించాలని కోరారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు*. కాగా, కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్‌ *సోషల్‌ మీడియాలో ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేయడంతో బెంగుళూరులో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే*. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. *సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి.*

*Source* :
@TelanganaDGP

*ప్రజలు అందరు కూడా తెలంగాణ DGP సర్ చెప్పినట్లు నడుచుకోవాలని పోలీస్ శాఖ కు సహకరించాలని  ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, August 11, 2020

ధనవంతులు నివసించే ప్రాంతంలో బస్తీ దవాఖాన

హైదరాబాద్ : 12/08/2020

కొత్త బస్తీ దవాఖానల వివరాలు..

సంతోష్‌నగర్‌- జవహర్‌నగర్‌, గన్‌ఫౌండ్రీ-గడిఖానా, అడిక్‌మెట్‌-పోచమ్మబస్తీ, కుర్మగూడ-మాదన్నపేట్‌, కుర్మగూడ-వికాస్‌నగర్‌, దూద్‌బౌలి-దూద్‌బౌలి, కిషన్‌బాగ్‌-అల్లామజీద్‌, హబీబ్‌గూడ-రాంరెడ్డినగర్‌, భోలక్‌పూర్‌, రాంగోపాల్‌పేట్‌, రాంనాస్‌పుర-మోచీ కాలనీ, దూద్‌బౌలి-బండ్లగూడ, కవాడిగూడ-భీమామైదాన్‌, లంగర్‌హౌస్‌-ఇబ్రహీం బస్తీ, జియాగూడ- ఎంసీహెచ్‌ కాలనీ, ఖైరతాబాద్‌-కుమ్మరబస్తీ, సనత్‌నగర్‌-అశోక్‌నగర్‌, బన్సీలాల్‌పేట్‌-బాపూజీనగర్‌, మన్సూరాబాద్‌-వీరన్నగుట్ట, హస్తినాపురం-బూపేష్‌గుప్తా నగర్‌, వెంగళరావునగర్‌- జవహర్‌నగర్‌, ఎఎస్‌రావు నగర్‌-హుడాపార్క్‌, ఉప్పల్‌-శారదానగర్‌, గాజులరామారం-గాజుల రామారం విలేజ్‌, సూరారం-శ్రీ కృష్ణానగర్‌,మౌలాలి-ఎంజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌.

*మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ లో పేద బడుగుబలహీన కార్మిక కర్షక వర్గాలు వుండే ప్రాంతంలో కాకుండా ధనవంతులు నివసించే ప్రాంతంలో (శారదా నగర్ కమ్యూనిటీ హల్) ఏర్పాటు చేయడాన్ని ప్రజా సంకల్పం & link Media తీవ్రంగా ఖండిస్తోంది. అధికారులారా మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే పేద బడుగు బలహీన కార్మిక కర్షక వర్గాలు నివసించే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము*

*COPY TO* :
@DrTamilisaiGuv
@TelanganaCMO 
@Collector_MDL
@KTRTRS
@bonthurammohan
@CommissionrGHMC
@GHMCOnline
@BasthiDawakhana 
@revanth_anumula
@bethisubhastrs
@NvssprabhakarM
@ZC_LBnagar
@Dc_Ghmc

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/