*ప్రెస్ రిలీజ్*
*గ్రాట్యుటీ కార్మికుల చట్టబద్ధమైన హక్కు – ఉద్యోగుల బకాయిలను వెంటనే పరిష్కరించాలి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 01:
MSP Lab Instruments సంస్థలో సుమారు 6 సంవత్సరాల 10 నెలల పాటు పనిచేసిన మాజీ ఉద్యోగి కందబోలె శంకర్ రావు తనకు రావాల్సిన గ్రాట్యుటీ, బోనస్, ఇన్సెంటివ్‌లు, జీతం పెంపు, అరియర్స్ తదితర ఉద్యోగ ప్రయోజనాల కోసం న్యాయపోరాటం చేస్తున్నారని Know Your Rights Society అధ్యక్షుడు మరియు అడ్వకేట్ S. Umesh Kumar తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రాట్యుటీ అనేది యాజమాన్యం ఇచ్చే దానం కాదు, ఉద్యోగి సుదీర్ఘ సేవలకు చట్టం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. పేమెంట్ అఫ్ గ్రాట్యుటీ యాక్ట్ , 1972 లోని సెక్షన్ 4 ప్రకారం, సాధారణంగా ఐదు సంవత్సరాల నిరంతర సేవ పూర్తి చేసిన ఉద్యోగి రాజీనామా చేసినా లేదా ఉద్యోగ విరమణ చేసినా గ్రాట్యుటీ పొందేందుకు అర్హుడని తెలిపారు.సెక్షన్ 7(3) ప్రకారం గ్రాట్యుటీని చెల్లించాల్సిన తేదీ నుంచి 30 రోజుల్లోపు చెల్లించాలి. ఆలస్యమైతే సెక్షన్ 7(3A) ప్రకారం, చట్టంలో పేర్కొన్న మినహాయింపులకు లోబడి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
శంకర్ రావు విషయంలో సంస్థ సుమారు ₹1.58 లక్షలను అడ్వాన్స్‌గా చూపుతూ తిరిగి చెల్లించాల్సిన బకాయిగా పేర్కొనడం కూడా పరిశీలనార్హమని, ప్రతి లావాదేవీకి సంబంధించిన అసలు పత్రాలు, పేరోల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలు, ఉద్యోగి అనుమతుల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.Labour Department అధికారులు ఉద్యోగుల ఫిర్యాదులను స్వీకరించి, చట్ట పరిధిలోని సంబంధిత అధికారుల ద్వారా తగిన విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని Know Your Rights Society తరఫున విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాల విషయంలో ఉద్యోగులకు న్యాయం జరిగేలా అవసరమైన మార్గదర్శకత్వం కల్పించాలని కోరారు. ఉద్యోగులు తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదని, ప్రతి సంస్థ కార్మిక చట్టాలను గౌరవిస్తూ ఉద్యోగుల పూర్తి మరియు న్యాయమైన సెటిల్‌మెంట్ చేయాలని Know Your Rights Society అధ్యక్షుడు మరియు అడ్వకేట్ S. Umesh Kumar పేర్కొన్నారు.