తొలివెలుగు దెబ్బకు తోక ముడిచిన సువర్ణభూమి
తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో!!
https://youtu.be/sWTO3ZiTlWI
– క్రెడాయ్ ప్రాపర్టీ షోలో దో నెంబర్ దందా
– అనుమతులు లేకుండానే అడ్వాన్స్ లు
– భూ స్కాంను వెలుగులోకి తెచ్చిన తొలివెలుగు
– బండారం బయట పడటంతో ప్రాజెక్ట్ క్లోజ్
భూమి చాటున కోట్లు గడిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు.. కొత్త ప్రాజెక్టు చేపట్టే సమయంలో వినియోగదారులను నిండా ముంచేస్తున్నాయి. ధర తక్కువ.. సూపర్ ఆఫర్ అంటూ వందల కోట్లు కొల్లకొడుతున్నాయి. అలా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న క్రెడాయి ప్రాపర్టీ షోని అడ్డాగా చేసుకుని సాగించిన దో నెంబర్ దందాను వెలుగులోకి తెచ్చింది తొలివెలుగు. ఈనెల 14న జరిగిన స్టింగ్ ఆపరేషన్ లో అన్ని విషయాలు బయటకొచ్చాయి. పాపులర్ ప్లాట్ ఫామ్ కదా అని క్రెడాయ్ ప్రాపర్టీ షోకి వెళ్తే.. నీట్ గా మోసం చేసే కేటుగాళ్లు తొలివెలుగు కంటపడ్డారు. లేని భూమిని కస్టమర్లతో కొనుగోలు చేయించడమే కాకుండా… రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని చెప్పి డబ్బులు దండుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తున్న ఈ బాగోతాన్ని తొలివెలుగు బయటపెట్టడంతో తోక ముడిచింది సదరు సంస్థ సువర్ణభూమి.
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం రామ్ నాథ్ గూడ్ పల్లెలో సర్వే నెంబర్లు 4 నుండి 44 వరకు భూమి ఉందని… రూ.60 లక్షలు చెల్లించి ఎకరం కొంటే… 20 నెలల్లో కోటి రూపాయలు వెనక్కి ఇచ్చేలా.. అప్పటి వరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కస్టమర్ల దగ్గరే పెట్టుకునేలా… MOU కూడా చేస్తామని కస్టమర్లకు చెప్పింది సంస్థ. MOU లో ఊరిపేరు, సర్వే నెంబర్లతో సహా అన్ని వివరాలు చూపించింది. ఆ MOUను సంపాదించింది తొలివెలుగు. 20 నెలల తర్వాత ఎకరం భూమి వాపస్ ఇస్తే… తాము డెవలప్ చేసిన భూమిలో 14వందల గజాలను రిజిస్ట్రేషన్ చేస్తామని పొంతన లేకుండా సమాధానం చెప్పింది. 300 ఎకరాల్లో వెంచర్ వేస్తున్నామని.. DTCA పర్మిషన్ లేదని అది రావడానికి రెండేళ్లు పడుతుందని నమ్మబలికింది. వారు చెప్పినట్లుగా నిజంగానే అలా భూములు కొనుగోలు చేస్తే.. వారికి రూ.200 కోట్లు వసూలైతే 20 నెలల్లో కస్టమర్లకు ఇచ్చేందుకు తమ జేబులో నుంచి అదనంగా మరో రూ.140 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ.. ఏమాత్రం తడబాటు లేకుండా సువర్ణభూమి సంస్థ ఈ తతంగం నడిపించింది. కొందరి చేత డబ్బులు వసూలు చేసింది.
ఎంతో నమ్మకంతోనే ప్రాపర్టీ షోకి వచ్చిన వారిని మోసం చేస్తూ MOU చూపించి కోట్లు కొట్టేయాలని చూసింది సువర్ణభూమి. ఇక్కడ భూమి రిజిస్ట్రేషన్ చేసినా ఎలాంటి హక్కు లేకుండా పోతుంది. దీంతో డబ్బులు కట్టిన వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పర్మిషన్ లేకుండానే ఇలాంటి దందా కొనసాగడంపై రెరా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కానీ.. సువర్ణభూమి ఇవేవీ పట్టించుకోలేదు. 20 నెలల్లో సెక్యూరిటీ డిపాజిట్ కింద భూమి రాసిస్తానని వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే దిక్కెవరు. రూ.30 లక్షలకు ఉండే ఎకరం భూమి రూ.60 లక్షలకు అమ్ముకున్నారు. అలాంటి భూమికి సువర్ణభూమి కనీసం దారి కూడా చూపించకుండా ఎకరాలకు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసింది. దారిలేని ఆ భూమిని ఏం చేసుకుంటారు. డబ్బులు ఇవ్వాలంటే 20 నెలల్లో వారు ఒప్పుకున్నట్లు… వసూలు చేసిన సొమ్ముకు అదనంగా రూ.120 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సువర్ణ భూమికి సాధ్యమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అదిగో భూమి.. ఇదిగో అంటూ దో నెంబర్ దందా కొనసాగించిన సువర్ణభూమి వలలో చిక్కి మోసపోవద్దని తొలివెలుగు కోరుకుంటోంది.
No comments:
Post a Comment