Tuesday, November 30, 2021

సూర్య ‘జై భీమ్’ కు అరుదైన గౌరవం

సూర్య ‘జై భీమ్’ కు అరుదైన గౌరవం

జ్ఞానవేల్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జై భీమ్. డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. నిజజీవితంలో జరిగిన ఓ లాకప్ డెత్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కు సామాన్యుల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు వరకు అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు.

అయితే తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డు ను సాధించింది. ఆస్కార్ అవార్డు తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ చిత్రం నామినేట్ అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. వచ్చే ఏడాది లాస్ లాస్ ఏంజిల్స్ లో గోల్డెన్ గ్లోబ్ 2022 అవార్డుల వేడుక జరగనుంది. ఇక ఈ సినిమాతో పాటుగా వినూత్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ డ్రామా మూవీ కూషంగళ్ కూడా నామినేట్ అయింది.

Monday, November 29, 2021

ఒమిక్రాన్ కరోనా వేరియంట్ లక్షణాలేంటి? దీన్ని మొదట గుర్తించిన దక్షిణాఫ్రికా డాక్టర్ ఏం చెప్పారు?

ఒమిక్రాన్ కరోనా వేరియంట్ లక్షణాలేంటి? దీన్ని మొదట గుర్తించిన దక్షిణాఫ్రికా డాక్టర్ ఏం చెప్పారు?

Courtesy by BBC తెలుగు మీడియా ట్విట్టర్ 
కొత్త వేరియంట్ ఒమిక్రాన్

కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఈ వైరస్ గురించి నిజంగా మనకు ఇప్పటివరకు ఏం తెలుసు? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

''ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటి పట్ల ఒక నిర్ధిష్ట నిర్ధారణకు రావాలంటే వాటిని శాస్త్రీయ ప్రాతిపదికన పరీక్షించాల్సిన అవసరం ఉంది'' అని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు.

''ఒమిక్రాన్‌లో 30 కంటే ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నాయి. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో ఈ మ్యుటేషన్లు ఏర్పడ్డాయి'' అని పీటీఐ వార్తా సంస్థకు ఆయన చెప్పారు.

''వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్ కారణంగా ఈ వేరియంట్ రోగనిరోధక శక్తిని ఎదురించగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. టీకాల వల్ల శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి లేదా మరే ఇతర ఇమ్యూనిటీ కూడా ఈ వైరస్‌ను ప్రభావితం చేయలేదు''

''అటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని అన్ని కోవిడ్ వ్యాక్సీన్లను సమీక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వ్యాక్సీన్లు, వైరస్ స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి. దీని ఆధారంగానే వైరస్ పనిచేస్తుంది'' అని ఆయన చెప్పారు.

''ఇప్పుడు ఒమిక్రాన్ ఈ స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలోనే మ్యుటేషన్ చెందుతోంది. అంటే దీనిపై వ్యాక్సీన్లు మరీ అంత సమర్థంగా పనిచేయకపోవచ్చు'' అని గులేరియా అభిప్రాయపడ్డారు.

కోవిడ్-19 కొత్త వేరియంట్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి?

''చాలా స్వల్ప లక్షణాలు''

దక్షిణాఫ్రికాలో ఈ నెలలోనే ఒమిక్రాన్ వేరియంట్‌ను కనుగొన్నారు. తర్వాత దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు సమాచారమిచ్చారు. అక్టోబర్ 24న ఈ కొత్త వేరియంట్‌ను ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్‌వో ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.

గత వారం దీన్ని ఆందోళనకర రూపాంతరంగా పేర్కొంటూ ఒమిక్రాన్ అని పేరు పెట్టింది.

ఈ వేరియంట్‌లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, ప్రాథమిక లక్షణంగా రీఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఒక ప్రకటనలో డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

ఒమిక్రాన్‌తో రిస్క్‌ ఎక్కువే, తీవ్ర పరిణామాలు తప్పవని తాజాగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.

తొలుత ఈ కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ గుర్తించారు.

ఇప్పటివరకు ఈ వేరియంట్ బారిన పడిన ప్రజల్లో ''చాలా స్వల్ప స్థాయిలో కోవిడ్ లక్షణాలు'' కనబడ్డాయని ఆమె బీబీసీతో చెప్పారు.

''చాలా మంది రోగులు ఒళ్లు నొప్పులు, విపరీతమైన అలసటతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. అంటే నేను ఇక్కడ యువత గురించే మాట్లాడుతున్నా. ఆసుపత్రిలో చేరిన వారి గురించి చెప్పడం లేదు''

''ప్రమాదంలో ఉన్న వ్యక్తులపై కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రతను అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుంది'' అని ఆమె చెప్పుకొచ్చారు.

శాస్త్రవేత్తలకు షాక్

ఈ కొత్త వేరియంట్‌ దక్షిణాఫ్రికా నుంచి చాలా దేశాలకు వ్యాపించింది. అమెరికా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఈ వైరస్‌ను గుర్తించారు.

ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ వచ్చిన కొందరికి కూడా కరోనా సోకినట్లు తేలింది. అయితే, వారికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా కాదా అన్నది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ కోసం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.

''మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ చాలా భిన్నమైనది. ఇది అసాధారమైన మ్యుటేషన్ల సమూహాన్ని కలిగి ఉంటుంది'' అని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్, ప్రొఫెసర్ టులియో డి ఓలివెరా వివరించారు.

''ఈ వేరియంట్ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వైరస్‌లో వచ్చే మార్పుల ప్రకారం, మేం ఊహిస్తున్న దాని ప్రకారం చూస్తే ఇది చాలా వేగంగా రూపాంతరం చెందుతోంది'' అని ఆయన చెప్పారు.

ఒమిక్రాన్‌లో మొత్తం 50 మ్యుటేషన్లు ఉన్నాయి. ఇందులో 30 మ్యుటేషన్లు స్పైక్ ప్రోటీన్‌లో సంభవించాయి''

''మన శరీరంలోని కణాలతో ఈ వైరస్ సంబంధం ఏర్పరచుకునే అంశం గురించి మాట్లాడాలంటే ఇది 10 మ్యుటేషన్లను ఉపయోగించుకుంటుంది. డెల్టా వైరస్‌లోని 2 మ్యుటేషన్లే ప్రపంచవ్యాప్తంగా వినాశనానికి కారణమయ్యాయి'' అని ఆయన వివరించారు.

''కొత్త వేరియంట్లు కనుగొన్నారంటూ వచ్చిన వార్తలు ప్రమాదాన్ని సూచించాయి. కానీ వ్యాధి తీవ్రతను, కోవిడ్ వ్యాక్సీన్లు నిరోధించగలవు'' అని అమెరికాలోని అంటు రోగాల ఆసుపత్రి చీఫ్, డాక్టర్ ఆంథోని ఫౌచీ అన్నారు.

''ఒక సరైన పరీక్ష ఉంటే తప్ప, అది వైరస్ నుంచి మనల్ని రక్షించే యాంటీబాడీలపై ప్రభావం చూపుతుందో లేదో మనకు తెలియదు'' అని ఆయన సీఎన్‌ఎన్‌తో చెప్పారు.

  • ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? దీనిని భారత ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?
  • మ్యుటేషన్ ఎంత తీవ్రంగా ఉంది?

    బీబీసీ హెల్త్ అండ్ సైన్స్ కరెస్పాండెంట్ జేమ్స్ గళ్లఘర్ విశ్లేషణ

    అన్ని మ్యుటేషన్లు ప్రమాదకరమైనవి కావు. కానీ వైరస్‌లో ఎలాంటి మ్యుటేషన్లు సంభవించాయో తెలుసుకోవడం ముఖ్యం.

    చైనాలోని వూహాన్‌కు చెందిన వైరస్ కన్నా తాజా వైరస్ భిన్నంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే వూహాన్ వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన వ్యాక్సీలన్నీ ఈ వైరస్‌పై సమర్థంగా పనిచేయకపోవచ్చు.

    ఇతర వేరియంట్లలో కూడా కొన్ని మ్యుటేషన్లను కనుగొన్నారు. ఆ వేరియంట్‌లో తమ పాత్రకు సంబంధించిన సమాచారాన్ని ఆ మ్యుటేషన్లు అందించాయి.

    కొత్త వేరియంట్ ఒమిక్రాన్

    ఫొటో సోర్స్,GETTY IMAGES

    ఉదాహరణకు ఎన్501వై అనే మ్యుటేషన్ సులువుగా కరోనావైరస్ వ్యాప్తి చెందేలా చేస్తుంది. మరికొన్ని మ్యుటేషన్లు, శరీరంలో వైరస్‌ను గుర్తించడంలో యాంటీబాడీల పనిని కష్టతరం చేస్తాయి. వ్యాక్సీన్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి. కొన్ని మ్యుటేషన్లు మరింత భిన్నంగా ప్రవర్తిస్తాయి.

    ''ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వైరస్ వ్యాపించే సామర్థ్యాన్ని ఈ వేరియంట్ పెంచుతుందేమో అని మాకు ఆందోళనగా ఉంది. రోగనిరోధక వ్యవస్థ నుంచి కూడా తప్పించుకోవచ్చు'' అని దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నటాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ లెసెల్స్ అన్నారు.

    అత్యంత ప్రమాదకరంగా కనిపించే కొన్ని వేరియంట్లు నిజానికి అంత ప్రభావం చూపలేవు అని చెప్పడానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో బీటా వేరియంట్ గురించి కూడా ఇలాగే ఆందోళన చెందాం. బీటా వేరియంట్‌, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడంలో మరింత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుండటంతో దానిపై ఆందోళన వ్యక్తం చేశారు.

    ఆ తర్వాత డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, చాలా సమస్యలను తెచ్చిపెట్టింది.

    ''బీటా వేరియంట్ రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోగలదు. కానీ డెల్టా వేరియంట్‌ వైరస్‌ను వేగంగా వ్యాప్తి చేయగలదు. కానీ రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే దీనికి సామర్థ్యం తక్కువగా ఉంటుంది'' అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి గుప్తా చెప్పారు.


Saturday, November 27, 2021

మద్యం షాపులు ఎత్తేయాలని విద్యార్థుల పోరాటం

మద్యం షాపులు ఎత్తేయాలని విద్యార్థుల పోరాటం

మద్యం దుకాణాలపై పోరుబాట పట్టారు విద్యార్థులు. గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మద్యం షాపులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చేపట్టారు. వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే అబ్రహం క్యాంప్‌ ఆఫీస్‌ ముందు ధర్నా నిర్వహించారు.


అలంపూర్ చౌరస్తాలో రోజూ మందుబాబులు చేస్తున్న హడావుడితో విసిగిపోయారు విద్యార్థులు. పైగా ఉన్నవి చాలవన్నట్లు ఈమధ్యే కొత్తగా మరో రెండు షాపులకు అనుమతించింది ప్రభుత్వం. దీంతో వందలాదిగా విద్యార్థులు ఏకమై నిరసన చేపట్టారు.

Friday, November 26, 2021

పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. మీ నగరంలో లీటరు ధర పెరిగిందా, తగ్గిందా తెలుసుకోండి..

పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. మీ నగరంలో లీటరు ధర పెరిగిందా, తగ్గిందా తెలుసుకోండి..

Courtesy by asianet News తెలుగు మీడియా ట్విట్టర్ 

ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు(oil companies) నేడు పెట్రోలు, డీజిల్ ధరల్లో ఇరవై మూడో రోజు కూడా ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో పెట్రోల్(petrol), డీజిల్ (diesel)ధరపై వినియోగదారులకు ఊరట లభిస్తోంది.గత మూడు వారాలుగా సామాన్యులకు ఊరటనిస్తూ చమురు ధరలు భారీగా దిగోచ్చాయి. గతంలో పలు రాష్ట్రాల్లో డీజిల్ ధర రూ.100కు పైగా చేరగా.. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల ఆదాయాన్ని ప్రభావితం చేశాయి. 

Petrol diesel prices today: Rates constant on 27 November check here what you need to pay in your city

దీపావళి(diwali) సందర్భంగా కేంద్రం ఇంధనాల ధరలపై ఎక్సైజ్ సుంకం(excise duty) తగ్గింపును ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే, ఫలితంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ప్రభుత్వం పెట్రోల్ ధరపై రూ. 5, డీజిల్ ధరపై రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. 

నేడు ఢిల్లీలో పెట్రోలు ధర రూ.103.97గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.86.67గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర రూ.109.98 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.89.79. చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ రూ.101.40, డీజిల్ రూ.91.43గా ఉంది.  హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20, డీజిల్ ధర  రూ.94.62గా ఉంది.
 

Petrol diesel prices today: Rates constant on 27 November check here what you need to pay in your city

ఎక్సైజ్ పన్ను తగ్గింపు ఎక్సైజ్ డ్యూటీ చరిత్రలో అతిపెద్ద తగ్గింపు. ఎక్సైజ్ ఛార్జీని తగ్గించడంతో పాటు వినియోగదారులకు మరింత సహాయం అందించేందుకు గాసోలిన్ అండ్ డీజిల్‌పై వాల్యు ఆధారిత పన్ను (vat)ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అభ్యర్థించింది. దీనిని అనుసరించి అదనపు ఉపశమనం అందించడానికి 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాట్ ధరలను తగ్గించాయి.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉందో తెలుసుకోవాడానికి  మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు RSP అండ్ మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

ఉద్దేశపూర్వక దాడుల నుంచి.. న్యాయవ్యవస్థను రక్షించండి!


ఉద్దేశపూర్వక దాడుల నుంచి.. న్యాయవ్యవస్థను రక్షించండి!

  • సత్యం వైపునే నిలబడండి.. తప్పులను ఖండించండి
  • రాజ్యాంగ మూల సూత్రాలు ప్రజా సంక్షేమం కోసమే
  • రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థది కీలకపాత్ర
  • ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించండి
  • రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లాయర్లకు సీజేఐ ఉద్బోధ

సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. భారత రాజ్యాంగం ఎంతో ఉన్నతమైనదన్న ఆయన.. రాజ్యాంగ సూత్రాలు దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమేనని గుర్తు చేశారు. ప్రజల బాగు కోసమే కేసులను వాదించాలని, తద్వారా ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంపొందించాలని న్యాయవాదులకు సూచించారు. సమాజ అభ్యున్నతి కోసం పౌరులకు తమ బాధ్యతల పట్ల అవగాహన కల్పించడానికి న్యాయవాదులు కార్యోణ్ముఖులు కావాలన్నారు.

అంకితభావం ఉంటేనే కొనసాగగలం

న్యాయవాద వృత్తి ఎంతో ఉన్నతమైనదని పేర్కొన్న సీజేఐ.. నైపుణ్యం, అనుభవం, అంకితభావం ఉంటేనే ఈ వృత్తిలో కొనసాగగలమని చెప్పారు. మిగతా వృత్తులకు ఇది ఎంతో భిన్నమైనదన్నారు. పౌర ధర్మం, సమగ్రత, సామాజిక సమస్యలపట్ల అవగాహన, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్లే ఈ వృత్తిలో ఉండగలరని తెలిపారు. సమాజానికి నాయకులుగా, దిశా నిర్దేశం చేసే గురువుల్లాగా న్యాయవాదులు ప్రవర్తించాలన్నారు. న్యాయవాదవృత్తిలో 50 ఏండ్లు పూర్తిచేసుకున్న ఐదుగురు న్యాయవాదులకు సీజేఐ అభినందనలు తెలిపారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్‌ భవన్‌లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో జస్టిస్‌ రమణ పాల్గొన్నారు.

జాతి ప్రయోజనాల కోసం కృషిచేయాలి: రాష్ట్రపతి కోవింద్‌

అధికార, ప్రతిపక్షంతో సంబంధం లేకుండా అన్ని పార్టీల ఎంపీలు ప్రజా సంక్షేమం కోస మే కృషిచేయాలని రాష్ట్రపతి కోవింద్‌ పిలుపునిచ్చారు. సమర్థమైన ప్రతిపక్షంలేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదన్నారు. పార్టీలు శతృత్వాన్ని విడిచిపెట్టి జాతి ప్రయోజనాల కోసం పనిచేయాలన్నారు. పార్లమెం ట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి: మోదీ

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారసత్వ పార్టీల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నదని కాంగ్రెస్‌ను పరోక్షంగా విమర్శించారు. ఈమేరకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ సహా 15 విపక్ష పార్టీలు హాజరుకాలేదు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధంలేని ఇలాంటి కార్యక్రమాలను ప్రతిపక్షాలు బాయ్‌కాట్‌ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

Thursday, November 25, 2021

బస్‌స్టాండ్‌ దుకాణాలపై చలాన్ల కొరడా!

బస్‌స్టాండ్‌ దుకాణాలపై చలాన్ల కొరడా!

  • అధిక ధరలకు అమ్మడంపై ఉన్నతాధికారుల దృష్టి
  • ఇప్పటికే వెయ్యి మందికి జరిమానాలు
  • మూడుసార్లకు మించితే లైసెన్స్‌ రద్దు

హైదరాబాద్‌, నవంబర్‌ 25 (నమస్తే తెలంగాణ): బస్‌స్టాండ్లలో అధిక ధరలకు వస్తువులు విక్రయించే దుకాణదారులపై ఆర్టీసీ ఉన్నతాధికారులు చలాన్ల కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ వంటి ప్రధాన బస్‌స్టేషన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్‌స్టేషన్లలోనూ అధికధరలకు అమ్మేవారిపై ఫోకస్‌ పెడుతున్నారు. ప్రధానంగా నకిలీ కంపెనీల వస్తువులు, గడువు తీరిన వస్తువుల అమ్మకం, నాణ్యత, ఎంఆర్పీ కంటే ఎక్కువకు విక్రయించడంపై చర్యలు తీసుకొంటున్నారు. గత రెండునెలల్లో దాదాపు వెయ్యికి పైగా జరిమానాలు విధించినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిబంధలను ఉల్లంఘించే దుకాణదారులకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు జరిమానా విధిస్తున్నారు. వరుసగా మూడుసార్లు అదే తప్పు చేసేవారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అధిక ధరలపై ప్రయాణికుల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఆయా బస్‌స్టేషన్ల ఉన్నతాధికారులకు లేదా ఎండీ సజ్జనార్‌కు ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

Rakesh Tikait addresses Maha Dharna in Hyderabad; calls KCR ‘B team’ of BJP

Rakesh Tikait addresses Maha Dharna in Hyderabad; calls KCR ‘B team’ of BJP

Responding to PM Modi's call to farmers asking them to go back home, Tikait said, "we won't go back until all our demands have been fulfilled."

Hyderabad: Bharatiya Kisan Union leader (BKU) Rakesh Tikait on Thursday called Telangana chief minister K Chandrashekar Rao and his party Telangana Rashtra Samithi (TRS) the “B team” of Bhartiya Janata Party.

Earlier, in September, Tikait had also targeted Hyderabad MP Asaduddin Owaisi by calling him BJP’s ‘chacha jaan’. He alleged that All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) leader and BJP were a team and the farmers needed to understand their moves well.

The ‘Maha Dharna’ in Hyderabad is organised by the All India Kisan Sangharsh Coordination Committee (AIKSCC), Telangana to mark the one-year anniversary of the farmers’ agitation and celebrate the historic victory of the farmers whose movement resulted in the repeal of the three farm laws.

In his address, Rakesh Tikait questioned KCR over his recent announcement of providing Rs 3 lakh ex-gratia to each farmer who died fighting against the farm laws. “What about the farmers of Telangana who are dying due to loans?” the farmer leader asked.

Commenting on paddy procurement, the issue that has been worrying farmers in the state, Tikait said that Telangana farmers will get their paddy returns only when the Centre makes Minimum Support Price (MSP) law in Parliament.

He said that even though the languages spoken across the country are different, the spirit of the farmers is the same and so is their struggle.

Responding to Prime Minister Narendra Modi’s call to farmers asking them to go back home, Tikait said, “we won’t go back until all our demands have been fulfilled.”

Wednesday, November 24, 2021

ఆర్టీసీ చైర్మన్‌గా జీతం వద్దు బాజిరెడ్డి గోవర్ధన్‌ కీలక నిర్ణయం

కీలక నిర్ణయం

ఆర్టీసీ చైర్మన్‌గా జీతం వద్దు బాజిరెడ్డి గోవర్ధన్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్‌, నవంబర్‌ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున సంస్థ నుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని ప్రకటించారు. బుధవారం లిఖిత పూర్వకంగా అధికారులకు రాసి ఇచ్చారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున సంస్థపై అదనపు ఆర్థికభారం మోపడం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. శాసనసభ్యుడిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలు అని బాజిరెడ్డి పేర్కొన్నారు. చైర్మన్‌ నిర్ణయంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ పున్న హరికిషన్‌ బాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్‌ ను స్ఫూర్తిగా తీసుకొని ఆర్టీసీ అధికారులు కూడా అలవెన్స్‌ల విషయంలో కొన్ని త్యాగాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tuesday, November 23, 2021

HYD : భార్యాభర్తల కేసు విషయంలో CI, SI సస్పెన్షన్‌

HYD : భార్యాభర్తల కేసు విషయంలో CI, SI సస్పెన్షన్‌

Courtesy by ABN ఆంధ్రజ్యోతి మీడియా ట్విట్టర్!!

హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : చిక్కడపల్లి సీఐ పాలడుగు శివశంకరరావు, అశోక్‌నగర్‌ సెక్టార్‌ ఎస్‌ఐ పి. నర్సింగరావు సస్పెండ్‌ అయ్యారు. నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. భార్యాభర్తల కేసు విషయంలో వీరిని సీపీ సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. సీసీఎస్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న పి. నాగరాజుగౌడ్‌ను కూడా సస్పెండ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, అవినీతి, నైతిక అస్థిరత, ఫిర్యాదుదారుడిని బెదిరించినందుకు చిక్కడపల్లి సీఐని, ఎస్‌ఐను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వచ్చినవారిని సీసీఎస్‌కు వెళ్లాల్సిందిగా సూచించినట్లు సమాచారం. కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడంతో పాటు, సీసీఎస్‌కు వెళ్లాలని బాధితులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో బాధితులు నేరుగా సీపీని కలిసి తమ బాధను వెళ్ళగక్కడంతో పాటు నిందితులను కాపాడేందుకు ‘మీ డిపార్ట్‌మెంట్‌ వారే సహకరిస్తున్నారు’ అని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సీపీ ఈ కేసుపై అంతర్గత విచారణ జరిపినట్లు సమాచారం. విచారణలో బాధితుల ఫిర్యాదు నిజమేనని తేలడంతో ముగ్గురినీ సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

kotak shiksha nidhi scholarship

*Please spread the message* 

https://t.co/dmlFnifTfY https://t.co/XmDybj7ahP

డాక్టర్ కావాల్సిన అమ్మాయి... చాయ్ అమ్ముతోంది

https://twitter.com/AnooradhaR/status/1462644032434151428?t=AmmKEFvAApKxvGfwl-gqwQ&s=08.... *తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు ఈ చదువుల తల్లిని ఆదుకోవాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము 🙏... Bplkm*

Saturday, November 20, 2021

మగవాళ్లు ఏడవకూడదా? ఏడ్చే మగాళ్లను నమ్మకూడదా? - ఇంటర్నేషనల్ మెన్స్ డే

మగవాళ్లు ఏడవకూడదా? ఏడ్చే మగాళ్లను నమ్మకూడదా? - ఇంటర్నేషనల్ మెన్స్ డే

  • పద్మ మీనాక్షి
  • బీబీసీ ప్రతినిధి ట్విట్టర్సౌ జన్యంతో 
ఫోన్లో అరుస్తున్న పురుషుడు

మెన్స్ డేనా? "పురుషుల దినోత్సవం" అంటూ ఒకటుందని తెలిసి అవునా అని తల విదిలించుకున్న నెమరులో ప్రసూన్ జోషి గుర్తుకు వస్తాడు మన అరుణ్ సాగర్ కూడా గుర్తుకొస్తాడు ఇలా కవితలా" అంటారు కార్టూనిస్ట్, చిత్రకారుడు అన్వర్.

"నాన్న... మంచి భర్తనిపించుకోవాలి. మంచి తండ్రనిపించుకోవాలి. మగాడనిపించుకోవాలి. కష్టమొస్తే కన్నీళ్లు పెట్టకూడదు. గుండె నిండా దుఃఖపు నిల్వలు పోగేసుకుని ఓ తెల్లారుజామున కుప్పకూలిపోవాలి. నాన్ననెంత కరకు మనిషిని చేశారు" అన్న అరుణ్ సాగర్ మాటలను గుర్తు చేశారు.

నవంబరు 19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. దీనిని ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 దేశాల్లో జరుపుకుంటారు.

పురుషులకు దినోత్సవం ఎందుకు?

పురుషులు వివిధ రంగాల్లో సాధించిన సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి ప్రాచుర్యం కల్పించేందుకు ఈ రోజును ప్రముఖంగా నిర్వహిస్తారు. పురుషుల హక్కులు, ఆరోగ్యం, సానుకూల అభిప్రాయాలు, లింగ సమానత్వం సాధించడమే ఈ దినోత్సవ నిర్వహణ ముఖ్యోద్దేశ్యం.

పురుషుల దినోత్సవానికి ప్రతీ ఏడాది ఒక్కొక్క థీమ్‌ను నిర్ణయిస్తారు.

"స్త్రీ పురుషుల మధ్య మెరుగైన సంబంధాల కల్పన" ను ఈ ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవ థీమ్‌గా నిర్ణయించారు.

19 November circled

దీని చరిత్ర ఏమిటి? ఎప్పుడు మొదలయింది?

1991లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవం గురించి ప్రస్తావించి, 1992లో తొలిసారిగా జరుపుకున్నారు. తర్వాత కొంత కాలం పాటు అంతరాయం కలిగింది.

దీనిని తిరిగి ట్రినిడాడ్, టొబాగోలో వెస్ట్ ఇండీస్ యూనివర్సిటీని ఒక చరిత్ర లెక్చరర్ డాక్టర్ జెరోమ్ టీలక్ సింగ్ 1999 నుంచి నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ రోజు ఆయన తండ్రి పుట్టిన రోజు కూడా.

1989లో ట్రినిడాడ్ ఫుట్ బాల్ జట్టు ప్రపంచ ఫుట్ బాల్‌ కప్‌‌లో అర్హత సంపాదించేందుకు దేశాన్ని ఐక్యపరిచిన తీరును గుర్తు చేసుకునేందుకు ఈ రోజును పురుషుల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి బీబీసీ తగినంత ప్రాచుర్యం కల్పించాలని కోరుతూ డేవ్ బార్లో అనే వ్యక్తి చేంజ్. ఓ‌ఆర్‌జీ‌లో పిటిషిన్ కూడా నమోదు చేశారు.

"ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో మహిళలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఉండగా, పురుషులకెందుకు లేదు" అని అంటూ కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడు బెన్ బ్రాడ్లీ ప్రశ్నించారు. గతేడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

కొన్ని వర్గాలకు చేటు కలిగిస్తూ సానుకూల వివక్షను చూపించడం కంటే సమానత్వాన్ని సాధించేందుకు చూడాలని ఆయన కోరారు.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవ నిర్వహణకు ఆరు సూత్రాలు

  • స్త్రీ పురుషుల మధ్య సంబంధాలను మెరుగుపరిచి లింగ సమానత్వాన్ని సాధించడం.
  • సమాజంలో పాజిటివ్ రోల్ మోడల్స్ కు తగినంత ప్రాముఖ్యత కల్పించడం. ఇది కేవలం సినిమా నటులు, క్రీడాకారులకు పరిమితం కాకుండా, సాధారణ వర్కింగ్ క్లాస్ కు చెందిన పురుషులకు కూడా గుర్తింపు ఇవ్వడం.
  • పురుషులు దేశానికి, సమాజానికి, కుటుంబానికి చేసిన సేవలు, వివాహం, పిల్లల పెంపకం, వాతావరణం పట్ల ప్రవర్తించిన తీరుకు ప్రాచుర్యం కల్పించడం. పురుషుల మానసిక, శారీరక ఆధ్యాత్మిక సంక్షేమం పై దృష్టి.
  • కొన్ని సామాజిక సేవా రంగాల్లో పురుషులు ఎదుర్కొంటున్న వివక్షను, సామాజిక వైఖరి, అంచనాలు, చట్టాలకు ప్రాచుర్యం కల్పించడం.
  • జెండర్ సంబంధాలను మెరుగుపరిచి, లింగ సమానత్వాన్ని సాధించడం.
  • ప్రజలు తమ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా వినియోగించుకునేందుకు తగిన సురక్షితమైన, మెరుగైన ప్రపంచాన్ని సృష్టించే పనులు చేయడం.

అయితే, ప్రతీ రోజూ పురుషుల దినోత్సవమే కదా అని కొంత మంది విమర్శకులు అంటారు.

మహిళల కోసం ఒక రోజు కేటాయించినప్పుడు, పురుషులకు కూడా ఒక రోజుంటే తప్పేంటి అని రచయత లావణ్య నూకవరపు అంటారు. ఆమె "సిగరెట్స్, సెక్స్, లవ్ " అనే పుస్తక రచయత

లావణ్య నూకవరపు

"పురుషుల దినోత్సవం నాడు పురుషుల గురించి, మహిళల దినోత్సవం నాడు మహిళల గురించి మాట్లాడటం కాదు. సమానత్వం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలను, బంధాన్ని సెలెబ్రేట్ చేసుకోగలగాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా వారు అసంపూర్ణమే. అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే భావనను గౌరవించడమే ఏ రోజు ఉద్దేశ్యమైనా కావాలి" అని అంటారు లావణ్య.

యూకేలో పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక చర్చలు, సమావేశాలు నిర్వహిస్తారు.

ఆధునిక యుగంలో చాలా సంబరాలను, రోజులను క్షేత్ర స్థాయిలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా జరుపుకున్నట్లు కనిపిస్తుంది. ట్విటర్‌లో సోషల్ మీడియా యూజర్లు మహిళా దినోత్సవానికి దొరికినంత ప్రాధాన్యత పురుషుల దినోత్సవానికెందుకు లేదని ప్రశ్నిస్తూ అభినందనలు చెబుతున్నారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 2

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Twitterఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Twitter ముగిసింది, 2

పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలను నివారించేందుకు, మానసిక ఆరోగ్య సమస్యలు సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు ఈ రోజు ఒక వేదికలా పని చేస్తుందని, ఈ రోజును సమర్ధించేవారంటారు.

45 సంవత్సరాల లోపు పురుషుల మరణాల్లో అత్యధిక శాతం ఆత్మహత్యలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

"మహిళల మనోభావాలను గౌరవించడమే పురుషత్వం. అందుకే, పురుషులు కూడా ఓపికను అలవర్చుకుంటున్నారు. అయితే, పురుషుల సమస్యలను, బాధలను ఎవరూ పట్టించుకోరని, వినరని వారికి కూడా విసుగు పెరుగుతోంది. అబ్బాయిలకు సమస్యలా అని ప్రశ్నిస్తారు. ఈ ధోరణి మారాలి" అని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపి ఎమ్ రమేష్ అన్నారు.

  • ఎవరు మీలో కోటీశ్వరులు: రూ. కోటి గెల్చుకున్న రాజా రవీంద్ర బీబీసీ అడిగిన 5 ప్రశ్నలకు ఏమని బదులిచ్చారు?
  • "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
  • పురుషుల దినోత్సవం అవసరమే"

    ఇలాంటి దినోత్సవాలు జరుపుకోవడం మంచిదేనని కోరాలో కమ్యూనిటీ మేనేజర్‌గా పని చేస్తున్న పవన్ సంతోష్ అంటారు.

    "ఈ ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి నిర్ణయించిన థీమ్ ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉంది. పితృస్వామ్య విలువలు మహిళలకు ఎంత చేటు చేస్తాయో, అంతే మొత్తంలో పురుషులకు కూడా చేస్తాయని అంటారు. సమానత్వ సమస్య ఒక్క మహిళలకే పరిమితం కాదు, పురుషులకు కూడా ముఖ్యమే" అని అంటారు.

    భారతదేశంలో పురుషుల దినోత్సవానికి తగినంత ప్రచారం ఇంకా లేదని అంటూ, ఇటువంటి రోజులన్నీ క్రమేపీ వాణిజ్యపరంగా మారిపోతూ ఉంటాయి. అది జరగకుండా చూడాలని పవన్ అన్నారు.

    అబ్బాయిలు కూడా అనేక రకాల సామాజిక మార్పులను ఎదుర్కొంటున్నారు అని చెబుతూ.... .

    "పురుషులకు తమ సమస్యలను ఇతరులతో చెప్పుకోవడం చాలా కష్టంగా భావిస్తారు. ఉదాహరణకు లైంగికతకు సంబంధించిన సమస్యలు, లేదా ఇతర సమస్యలను తొందరగా ఎవరితోనూ చెప్పుకోవడానికి ఇష్టపడరు. పురుషుల్లో కూడా ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి" అని పవన్ అన్నారు.

    "సమాజం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. మనం కూడా మారాలి. సమాజం వ్యక్తి కేంద్రంగా ప్రయాణిస్తోంది. హక్కులు వ్యక్తులకు ముఖ్యమని అంబేద్కర్ చేసిన వాదనను గుర్తు చేశారు.

    బరాక్ ఒబామా

    ఫొటో సోర్స్,GETTY IMAGES

    ఫొటో క్యాప్షన్,

    అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా పలు సందర్భాల్లో బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకునేవారు

    మగవాళ్ళు ఏడవకూడదా?

    "అబ్బాయిలు కన్నీరు కార్చకూడదు, మానసికంగా దృఢంగా ఉండాలని అంటారు. కానీ, అబ్బాయిలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి కదా. భావోద్వేగాలకు జెండర్ లేదు కదా! భావోద్వేగాల తరహాలోనే పితృస్వామ్యం పురుషులపై అనేక రకాల ఒత్తిళ్లను తీసుకొస్తుంది. ఉదాహరణకు భార్య సంపాదనపై ఆధారపడకూడదు, కట్నం తీసుకోవాల్సిందే, ఏడ్చే మగవాళ్ళను నమ్మకూడదా లాంటివి. ఇది వారిపై తీవ్రమైన మానసిక ప్రభావం చూపిస్తుంది".

    "స్టీరియోటైపు భావనల వల్లే సమాజం ఎగతాళి చేస్తుంది కానీ, దీనికి మరో కారణం లేదు. మహిళలు వంట చేయాలి అనే భావన లాంటిదే ఇది కూడా. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి రచయతలు సమాజం పురుషుల పై పెట్టిన ఒత్తిడిని కూడా 1930-40లలోనే రచించారు" అని పవన్ చెప్పారు.

    గుండమ్మ కథ నుంచి ఆనంద్ వరకూ"

    "గుండమ్మ కథలో ఒక భార్య ఎలా ఉండాలనే స్థితి నుంచి 2006లో ఆనంద్ లాంటి సినిమాలో మహిళకు చూపించిన ఆర్ధిక స్వాతంత్య్రం వరకూ సమాజం ప్రయాణించింది. ఆ సినిమాలో భార్యను భర్త మార్చుకున్న విధానాన్ని, పురుషుడు ఎలాంటి వాడైనా స్త్రీ ఆమోదించే పరిస్థితి నుంచి "నీ చేతిలో నా జీవితాన్ని నాశనం చేసుకునే కంటే నా చేతిలో నా జీవితం నాశనం అయినా పర్వాలేదు" అని ఆనంద్ సినిమాలో స్త్రీ పాత్ర మాట్లాడే మాటల వరకూ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ప్రయాణించారు. ఈ మార్పును అర్ధం చేసుకోవడం స్త్రీ పురుషులకు ఇద్దరికీ అవసరమే".

    "ఈ సామాజిక పరిణామాన్ని అందుకునేందుకు పురుషులు కూడా ప్రయాణిస్తున్నారు. ఇదే వాస్తవం" అని పవన్ అన్నారు.

    భావన నిస్సిమ

    ఫొటో సోర్స్,BHAVANA NISSIMA

    ఫొటో క్యాప్షన్,

    భావన నిస్సిమ

    "పురుషులకు కూడా సమస్యలా?"

    పితృస్వామ్యం పురుషుల సంక్షేమానికి కూడా ఆటంకం కలిగిస్తుందని చాలా మంది పురుషులు గ్రహిస్తున్నారని రచయత, ఎన్‌ఎల్‌పి ఎడ్యుకేటర్, వెల్‌నెస్ కోచ్ భావన నిస్సిమ అంటారు.

    "పురుషులకు కూడా సమస్యలుంటాయి. ఒకసారి నా సోదరుడే నన్ను తన సమస్యలతో సంప్రదించారు. నా దగ్గరకు అనేక మంది పురుషులు రక రకాల సమస్యల పరిష్కారానికి వస్తూ ఉంటారు. వారికి కూడా సమస్యలుంటాయని మహిళలు గ్రహించాలి" అని భావన అంటారు.

    "ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం స్త్రీ పురుషులిద్దరూ కలిసి పని చేయాలని మహిళలు కూడా గుర్తిస్తున్నారు. ఇదే సమానత్వం సాధించేందుకు ముందడుగు" అని భావన అన్నారు.

    సోషల్ మీడియా ఆవిర్భావంతో, ఇలాంటి దినోత్సవాలకు మరింత ప్రాచుర్యం లభిస్తోంది. నేను మాట్లాడిన కొంత మంది వ్యక్తులు అలాంటి రోజొకటి ఉంటుందా అనే ప్రశ్నను కూడా వ్యక్తం చేశారు. దీనిని బట్టీ చూస్తుంటే, పురుషుల దినోత్సవానికి మహిళా దినోత్సవానికి లభించినంత ప్రాచుర్యం దక్కలేదని అర్ధమవుతోంది.

    "పురుషులు కూడా సంరక్షకులుగా ఉంటూ ఇంటిపనుల్లో సహాయం చేయాలి. స్త్రీ పురుషుల మధ్యనున్న మధ్య ఉన్న తేడాలను ఆమోదించగలగాలి" అని థియేటర్ కళాకారుడు, ఆటిజమ్ అండ్ ఆర్ట్స్ ప్రచారకులు రామమూర్తి పరాసుర అన్నారు.

    "మహిళల మనోభావాలను గౌరవించడమే పురుషత్వం. అందుకే, పురుషులు కూడా ఓపికను అలవర్చుకుంటున్నారు. అయితే, పురుషుల సమస్యలను, బాధలను ఎవరూ పట్టించుకోరని, వినరని వారికి విసుగు కూడా పెరుగుతోంది. అబ్బాయిలకు సమస్యలా అని ప్రశ్నిస్తారు. ఈ ధోరణి మారాలి" అని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపి ఎమ్ రమేష్ అన్నారు.

మగాడొక ఒంటరి పర్వతం"

"మెన్స్ డేనా? మగాళ్ళమని చివరి స్పృహ కలిగిన తారీకు ఏదని వెతుక్కుంటాం " నువ్వు మగోడివే అయితే రెండు నిముషాల్లో ఎన్‌జి‌ఓ కాలనీ పోస్ట్ డబ్బాని అంటేసుకుని రావాలి" అని బడి మిత్రుడి డిమాండ్లోనో, నువ్వు మగోడీవే అయితే బద్దిలో ఉన్న గోలీ గుండ్లల్లో పచ్చ రంగు గోలీనే కొట్టాలి" అనే సవాల్‌ను ఛేదించడంలోనే ముగిసిపోయింది" అని మెన్స్ డే గురించి మాట్లాడుతూ అన్వర్ అంటారు.

"తాగుబోతో తిరుగుబోతో క్రూరఘోర కర్కోటకుడో, రంగనాయకమ్మ బుచ్చిబాబో యద్ధనపూడి ఆజానుబాహుడో ప్రేమికుడో కాముకుడో స్వాప్నికుడో కుటుంబరావో ఎవడైతేనేం మగాడొక ఒంటరి పర్వతం. ఒంటరి చెట్టు. ఒంటరి ద్వీపం. ఒంటరి గీతం. కన్నీరు నిషిద్ధం. కేవలం హృదయవిస్ఫోటం. మీరు మమ్మల్ని కొలవలేరు" అని అరుణ్ సాగర్ కవిత్వంతో సంభాషణను ముగించారు.

Friday, November 19, 2021

నాడు పచ్చ..నేడు గులాబీ.. మిగతా కబ్జా అంతా..సేమ్ టూ సేమ్! ఫినిక్స్ భూఫిక్సింగ్ పార్ట్-2

నాడు పచ్చ..నేడు గులాబీ.. మిగతా కబ్జా అంతా..సేమ్ టూ సేమ్! ఫినిక్స్ భూఫిక్సింగ్ పార్ట్-2

– ఫినిక్స్ భూఫిక్సింగ్ కి ఎప్పుడో స్కెచ్
– 90వ దశకంలోనే కన్నేసిన పచ్చబ్యాచ్
– ఆనాడు పదిలక్షలకే పందేరాలు
– నేడు పదివేల కోట్లు..గులాబీలు వదిలేస్తారా!
– ధరణి ప్రకారం 137 ఎకరాలు సర్కార్ దే!
– తొలివెలుగు పరిశోధనాత్మక కథనం

అది 90వ దశకం.చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు.హైటెక్ సిటీకి శంఖుస్థాపన చేశారు.గుట్టలను తవ్వుకుంటూ రోడ్లు వేస్తున్నారు.గుట్టల్లో దండిగా ప్రభుత్వభూమి,అసైన్డ్ ల్యాండ్.ఎవ్వరికి దొచినంత, చూసినంత భూమి తమదే అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు.ఆ కాలంలో చెప్పాలంటే సైబర్ టవర్ కి చాలా దూరంగానే..సర్వే నెంబర్స్35,37,40,42 నుంచి 47 మరియు 53తో పాటు ఇంకా ప్రభుత్వ భూమి ఉంది.

మహాదేవి కో-ఆపరేటివ్ హౌజింగ్ సోసైటీ మాయాజాలం


ఈ ప్రభుత్వ భూమిని దక్కించుకోవాలనే ఉపాయంతో మహాదేవి కో-అపరేటివ్ సొసైటి తెరపైకి వచ్చింది.డాక్యుమెంట్ నెంబర్లు 1564/1996 నుంచి 1585/1996 వరకు ఒకే రోజున రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఖానామెట్ శివయ్యతో పాటు మరో 46మంది దళితుల కుటుంబాల నుంచి వేణుగోపాల్ రెడ్డి,తరుణ్ జోషీల పేర్ల మీద మహాదేవి కో-అపరేటివ్ హౌజింగ్ సొసైటికి 20 రిజిస్ట్రేషన్స్ చేయించారు.అయితే అందులో భూమి విస్తరణ ఎంత, హద్దులు ఎవరెవరివి అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.వారికి ఉన్నభూమిని అమ్మినట్లు రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. 1998లో 5ఎకరాల 13 గుంటల భూమిని విస్తరణతో పాటు రిజిస్ట్రేషన్ హద్దులు పెట్టుకొని రిజిస్ట్రేషన్ మరోసారి చేయించుకున్నారు.ఈ రెండేళ్ల వ్యవధిలో ఆ దళితులు మరికొంత మందికి ఎకరాల చొప్పున అమ్మకం జరిపారు.ఇక సొసైటీ రూల్స్ పాటించకపోవడమా..లేదా ప్రభుత్వ భూమి అని తెలిసో కాని మహాదేవి కో-ఆపరేటీవ్ హౌజింగ్ సొసైటీ కాస్తా ప్రయివేట్ లిమిటెడ్ గా మారిపోయింది.820/1999నుంచి 837/1999 వరకు మళ్లీ రిజిస్ట్రేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపనీకి చేశారు.


కష్టోపా కార్పోరేషన్ కి సర్వె నెంబర్ 35,36

గచ్చిబౌలి ప్రభుత్వ భూముల్లో కష్టోపా కార్పోరేషన్ విచ్చలవిడి అమ్మకాలు జరిపింది.సర్వే నెంబర్ 35లో అనిల్ కుమార్ కామ్ దార్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నసమయంలోఎస్.పటేల్,రూసెన్ పటేల్,పి.ఏ.పటేల్,రూపన్ పటేల్,సోనాల్ పటేల్స్ కి అమ్మకం జరిపారు.సర్వేనెంబర్ 36లో వివిధ బిజినెస్ పీపుల్ కి అమ్మకం జరిపారు.ఆ బిజినెస్ పీపుల్ అటు టీడీపీలోను,ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోను చక్రం తిప్పిన వారే..అర్బన్ సిలింగ్ యాక్ట్ ప్రకారం మిగులుభూమి అంతా ప్రభుత్వ భూమి అని 1971 నుంచి రికార్డుల్లో ఉంది.కాని వివిధ సొసైటీ పేర్ల మీదుగా,ప్రయివేట్ లిమిటెడ్ కంపనీలకు,బిజినెస్ పీపుల్ చేతిలోకి రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఇదంతా అప్పటి నాయకులు 10 లక్షలు పంచుకుని రిజిస్ట్రేషన్స్ చేయించారని ఆరోపణలు.

ప్రభుత్వ భూమిలో మరిన్ని సొసైటీల బాగోతాలు

సాయి అశ్వికా ప్రాపర్టీస్,సాయి నిహారిక ప్రాపర్టీస్,సాయి అనన్య ప్రాపర్టీస్,కృష్ణార్జున ప్రాపర్టీస్ పేర్లతో ప్రభుత్వభూముల్లో ప్లాట్స్ చేసి అమ్ముకున్నారు.విక్రయించిన ప్లాట్స్ ఏమయ్యాయి.కోర్టుల్లో కేసులు ఏంటి.. చివరికి ఎవరికి చేరాయి.రికార్డుల్లో తన పేరుతో సహా ఉండి..చక్రం తిప్పిన ఏ.పి.మంత్రి ఎవరు..?పచ్చపార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎలా భూములు వచ్చాయి.ఆ తర్వాత వై.ఎస్.ఆర్.సి.పి నేతలతో గులాబీ నేతల దోస్తానం ఎవరికి కలిసి వచ్చిందో పార్ట్ -3 లో ఇన్వెస్టిగేషన్ కథనంలో చూద్దాం.

Video Player
00:00

Thursday, November 18, 2021

కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నాం....మోదీ సంచలన ప్రకటన....!రైతులకు క్షమాపణలు తెలిపిన ప్రధాని

*కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నాం....మోదీ సంచలన ప్రకటన....!*

*రైతులకు క్షమాపణలు తెలిపిన ప్రధాని*

దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న వేళ..కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం.. మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. నేడు జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నానని ప్రధాని అన్నారు.
''మా ప్రభుత్వం ఏం చేసినా అది రైతుల కోసమే. ఏం చేస్తున్నా.. అది దేశం కోసమే. మూడు సాగు చట్టాలను కూడా రైతుల ప్రయోజనాల కోసమే తీసుకొచ్చాం. ముఖ్యంగా సన్నకారు రైతులకు ఈ చట్టాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని వర్గాల రైతులకు ఈ చట్టాలపై సర్దిచెప్పలేకపోయాం. అందుకే మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం. ఈ నెలాఖరులో మొదలయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి, రాజ్యాంగ పరమైన ప్రక్రియ ప్రారంభిస్తాం.. సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి.. తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నా. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలి'' అని మోదీ వెల్లడించారు.
''గత ఐదు దశాబ్దాలుగా రైతుల కష్టాలను దగ్గరుండి చూశా. అందుకే 2014లో ఈ దేశం నన్ను ప్రధానిని చేసినప్పుడు.. రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశంలో 80శాతం సన్నకారు రైతులే అనే విషయం చాలా మందికి తెలియదు. 10కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమే ఉంది. అదే వారికి జీవనోపాధి. అందుకే వారి సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచాం. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచాం. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా కృషి చేస్తున్నాం. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఫసల్‌ బీమా యోజన్‌ను మరింత బలోపేతం చేస్తాం. ఇకపై రైతుల సంక్షేమం కోసం మరింత కష్టపడి పనిచేస్తాం'' అని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.

*link Media ప్రజల పక్షం*

యుద్ధం కాదు కేసీఆర్ పతనం ఆరంభమైంది.... ఈటల ......!

*యుద్ధం కాదు   కేసీఆర్ పతనం  ఆరంభమైంది.... ఈటల ......!*

హైదరాబాద్‌: యుద్ధం కాదు.. కేసీఆర్‌ పతనం ఆరంభమైందని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. రైతులు కన్నీళ్లు పెడుతుంటే..నిమ్మకు నీరెత్తినట్టుగా కేసీఆర్‌ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ అనాలోచిత విధానాల వల్లే రాష్ట్రం అస్తవ్యస్తమైందన్న ఆయన.. అన్నీ తనకే తెలుసునని అహంకారపూరితంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోలులో జాప్యం వల్ల ధాన్యం రంగు మారుతోందని, వర్షాలకు తడిసి మొలక వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితికి పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.
''నాకే అన్నీ తెలుసు.. నేనే అన్నీ చేయగలననే అహంకార ధోరణితో సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ నిర్వాకం వల్ల తెలంగాణ రైతాంగమంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలి. గతంలో విపక్షాలతో చర్చించి సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాలు ఉండేవి. రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ దేశంలో ఏరాష్ట్రం కూడా కొనలేని వరి ధన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందని అసెంబ్లీలో సీఎం గొప్పలు చెప్పారు. కానీ, అప్పుడు కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందని, సహకరిస్తుందని అసెంబ్లీలో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రతి గింజా నేనే కొంటున్నానని సీఎం ఫోజు కొట్టారు. కానీ, ఈరోజు ప్రజలకు అర్థమైంది.. ఈ వడ్లు కొంటున్నది కేసీఆర్‌ కాదని, ధాన్యం, గన్నీ బ్యాగ్‌లు, హమాలీ ఛార్జీలు, ఐకేపీ కేంద్రాల కమీషన్‌, రైసు మిల్లుల ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని స్పష్టమైంది. కేసీఆర్‌ తన కీర్తి కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదు. ఒకసారి వరి వేయొద్దన్నారు, ఒకసారి పత్తి వేయొద్దన్నారు, ఒకసారి సన్న వడ్లు వేయొద్దన్నారు. ఇలా.. ఇష్టమొచ్చినట్టు కేసీఆర్‌ చెబుతున్నారు. బాయిల్డ్‌ రైస్‌ కొనటాన్ని కేంద్రం ఎప్పుడైనా నిలిపివేస్తుందని గతంలో మిల్లర్లు సీఎంకు చెప్పారు. రైతు సంఘాలు, మిల్లర్ల సూచనలు కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని కేంద్రంపై రుద్దుతున్నారు. కేసీఆర్‌ రైతు బంధు కాదు.. రైతు ద్వేషి. ఒక్క రైతు బంధు ఇచ్చి.. మిగతా ప్రయోజనాలన్నీ ఆపేశారు. హుజూరాబాద్‌ ఎన్నిక కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టలేదా? రైతుల కోసం ఆ మాత్రం చేయలేరా? హుజూరాబాద్‌ ఫలితం నుంచి ప్రజల దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నారు'' అని ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

*link Media ప్రజల పక్షం🖋️*

Wednesday, November 17, 2021

ధ‌ర్నాచౌక్‌లో ధ‌ర్నాకు కూర్చున్న కేసీఆర్‌

ధ‌ర్నాచౌక్‌లో ధ‌ర్నాకు కూర్చున్న కేసీఆర్‌

ధ‌ర్నాచౌక్ ఎందుక‌న్న పెద్ద‌మ‌నిషి.. అదే చోట ధ‌ర్నాకు కూర్చున్నారు. వ‌డ్ల కొనుగోళ్ల‌ విష‌యంలో కేంద్రానికి వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ చేప‌ట్టిన మ‌హాధ‌ర్నాలో పాల్గొన్నారు కేసీఆర్‌. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స‌హా ప‌లువురు పాల్గొన్నారు.


మధ్యాహ్నం 2 గంటల వరకు కేసీఆర్‌ నిరసన కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంది. అనంత‌రం గులాబీ నేతలు గవర్నర్ తమిళిసైని క‌లిసి వినతిపత్రం అందించ‌నున్నారు.

IAS Officer: ఆ మాజీ ఐఏఎస్ అవినీతి చరిత్ర అంతా ఇంతా కాదన్న రేవంత్!ఎవరాయన? ఏమిటా కథా కమామిషు!?

IAS Officer: ఆ మాజీ ఐఏఎస్ అవినీతి చరిత్ర అంతా ఇంతా కాదన్న రేవంత్!ఎవరాయన? ఏమిటా కథా కమామిషు!?

IAS Officer: టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పక్కరోజే ఎమ్మెల్సీ టిక్కెట్ సంపాదించుకున్న తెలంగాణ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.అదే సమయంలో ఆయన వెంకట్రామిరెడ్డికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా బయటపెట్టారు.
Revanth Reddy says about the corruption history of an IAS Officer
Revanth Reddy says about the corruption history of an IAS Officer

కలెక్టర్ గా ఉంటూనే ముఖ్యమంత్రి కెసిఆర్ కాళ్లపై బహిరంగ సభలో పడిన వెంకట్రామిరెడ్డి గురించి తెలంగాణా లో కథలు కథలుగా చెప్పుకుంటారు.అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ మనోభావాలకు అనుగుణంగా ఆయన వరి రైతులను కూడా కలెక్టర్ హోదాలో బెదిరించిన వైనం చరిత్ర కెక్కింది.కాగా ఇవన్నీ తెలంగాణాకు పరిమితమైన కథనాలు అయితే వెంకట్రామిరెడ్డికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకూడా గొప్ప చరిత్ర ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.ఆయన అత్యంత అవినీతిపరుడైన అధికారి అన్నారు.

రేవంత్ చెప్పిందేమిటంటే?

వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రులను మెప్పించి ఉన్నత పదవులు పొందడంలో అందెవేసిన చేయి అని చెప్పారు.అంతేగాక టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన అధికారి అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్న సమయంలో వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వెంకట్రామిరెడ్డి చిత్తూరు జిల్లాలో ఉన్నతాధికారి గా ఉన్న తరుణంలో తాగునీటి పథకాలకు సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని చెప్పారు.అప్పట్లో వెంకట్రామిరెడ్డి మీద టీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరైన హరీష్ రావు అనేక అవినీతి ఆరోపణలు చేశారని తెలిపారు.

రాష్ట్రపతి ఆదేశించినా చర్యలు లేవు!

ఇక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా వెంకట్రామిరెడ్డిపై నేరుగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని,దీంతో రాష్ట్రపతి కార్యాలయం స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ సెక్రటరీని ఆదేశించినా ఆ ఫైల్ అటకెక్కిందన్నారు.వెంకట్రామిరెడ్డిపై కోర్టు ధిక్కారణ కేసులు కూడా ఉన్నాయని తెలిపారు.వెంకట్రామిరెడ్డికి చెందిన రాజపుష్పా సంస్థ వెయ్యి కోట్ల రూపాయల కోకాపేట భూముల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు అయితే టీఆర్ఎస్ కార్యకర్త మాదిరి, సిఎం కెసిఆర్ కి బంట్రోతు లాగ వ్యవహరించి వెంకట్రామిరెడ్డి అన్నింటి నుండి బయటపడి ఎమ్మెల్సీ అయిపోయారన్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యవహారాన్ని అంత సులువుగా వదిలిపెట్టబోదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Tuesday, November 16, 2021

మానవ హక్కుల వేదిక పత్రికా ప్రకటన *ఆత్మకూర్ పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలి*

     మానవ హక్కుల వేదిక పత్రికా ప్రకటన
             సూర్యాపేట,16.11.2021. 

*ఆత్మకూర్ పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలి* 

      సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం రామోజీ  తాండా  గ్రామానికి చెందిన లంబాడా గిరిజన యువకుడు వీర శేఖర్ ను ఆత్మకూర్ (ఎస్) పోలీసులు అక్రమ నిర్బంధంలోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఈ రోజు మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం భాదితున్ని మరియు కుటుంబ సభ్యులను సూర్యాపేట లోని ఆసుపత్రిలో కలసి వివరాలు సేకరించింది. మా బృందంలో డాక్టర్ ఎస్ తిరుపతయ్య, బదావత్ రాజు, ఎం హరిందర్, అక్కెనపల్లి వీరస్వామి, ఎన్. సులోచన,  సీ హెచ్ గురువయ్య, టి.హరికృష్ణ, వి.దిలీప్ లు పాల్గొన్నారు. 

     ఈ నెల పదవ తారీఖు ఉదయం పది గంటలకు తమ స్వంత పొలంలో పనిచేసుకుంటున్న రామోజిపేటకి చెందిన, డిగ్రీ చదువుతున్న ఇరవై ఏళ్ల వయస్సు గల వీరశేఖర్ ని ఇద్దరు పోలీసులు కారణం చెప్పకుండా కొంత దూరం బండి పైన, ఆతర్వాత పోలీసు వ్యాన్ లో ఎక్కించుకుని ఆత్మకూర్ (ఎస్) పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు. తనను ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా చెప్పుమన్నా చెప్పలేదు. పొరుగూరులో ఒక వ్యవసాయ భావి దగ్గర ఉండే విద్యుత్తు వైర్ల దొంగతనం కేసులో నిందితుడైన మరో యువకుడు పోలీసు దెబ్బలకు తట్టుకోలేక దొంగతనంతో సంబంధం లేకపోయినా తనకు తెలిసిన ఇతర చాలా మంది పేర్లను చెప్తూ పోయాడని, ఈ క్రమంలోనే వీరశేఖర్ పేరు వచ్చిందని తరువాత అర్ధం అయ్యింది. 
   వీర శేఖర్ ని అలా తీసుకెళ్లిన పోలీసులు అదేరోజు రాత్రి ఎనిమిదిన్నరకి మొదలు పెట్టి మూడు గంటల పాటు చిత్రహింసలులకు గురి చేశారు. కర్రలతో, బెల్టులతో అరి చేతులు, పాదాలు, పిరుదులపై వాపులు వచ్చేలాగా కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేక బట్టల్లో మూత్రం పోసుకుంటే మూత్రాన్ని నోటితో నాకించారు.  పైకి దెబ్బలు కనిపించకుండా గోడ కుర్చీ వేయించారు. కాళ్ళను, చేతులను పట్టుకుని నలుగురు నాలుగు వైపులా లాగారు. చివరకి, స్పృహ కోల్పోయిన తర్వాత స్టేషన్లో చనిపోతే బాగుండదని రామోజిపేట ఉప సర్పంచికి ఫోన్ చేసి, ఇంటికి తీసుకెళ్లండని చెప్పారు. వీరశేఖర్ చావు నుండి బయటపడ్డా, ఈరోజుకీ నడవలేని స్థితిలో ఉన్నాడు. హాస్పిటల్ గదిలో పదడుగుల దూరంలో ఉన్న బాత్రూమ్ కి వెళ్ళటానికి ఆయనకు, ఒకరి మీద దాదాపు ఒరిగిపోయి నడిచినా, పది నిమిషాలు పట్టింది. 
    ఇంత సంచలనమై, సమాజం గగ్గోలు పెట్టిన ఈ కేసులోనూ ఈ రోజు వరకూ పోలీసులపై FIR నమోదు కాలేదు. అసలు బాధితుల నుండి పోలీస్ శాఖకు లిఖిత పూర్వక ఫిర్యాదే అందలేదని చెప్పటానికి, బాధితులను ఫిర్యాదు చేయనీయకుండా పొలీసులు, రాజకీయ నాయకులు కలిసి ఆపుతున్నారు. ఒక మంత్రి స్వయంగా కల్పించుకుని బాధితులను నియంత్రిస్తున్నాడు.
     చట్టబద్దంగా మసులుకోవటం అనేది ఇతరులకే గానీ మాకు వర్తించదని పోలీసు వ్యవస్త అనుకుంటున్నది. మాకు ఏజెంట్లుగా పని చేస్తే చాలు మీరేం చేసినా మిమ్మల్ని మేం కాపాడుకుంటామని ముఖ్యమంత్రి, మంత్రులు పోలీసులకు భరోసా కల్పిస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్యం అనరు. మాఫియా వ్యవహారం అంటారు. 
కాబట్టి పోలీసు శాఖ, పరిపాలకులు ఆ దందాలు ఆపి, ప్రజాస్వామ్యం పట్ల భాద్యతతో పనిచేయాలి.
   తక్షణమే కింది చర్యలు తీసుకోవాలని మేం డిమాండు చేస్తున్నాం.
     1, ప్రభుత్వం వెంటనే ఈ కేసును సిట్టింగ్ జడ్జ్ కి అప్పగించి వారి పర్యవేక్షణ లో దర్యాప్తు (investigate) చేయించాలి. 
2, ఇప్పటికే సంభందిత పోలీసులను సస్పెండ్ చేసి ఉన్నారు కాబట్టి , వాళ్ళు నేరం చేసిన విషయం పోలీసు శాఖకు నిర్ధారణ అయిన విషయమే. దాని ఆధారంగా సూర్యాపేట డిఎస్పి గారు వెంటనే ఈ కేసును సుమోటోగా తీసుకొని పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.
3, ఈ నేరాల్లో పాల్గొన్న పోలీసులపై అక్రమ నిర్భంద కేసు, హత్య యత్నం కేసులను నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక నేరాన్నీ నమోదు చేయాలి.
4, దోషులను వెనకేసుకు వస్తూ, వారిని రక్షించడానికి ప్రయత్నం చేసిన పోలీసు శాఖలోని వారి పైనా, రాజకీయ నాయకుల పైనా సాక్ష్యాలను తారుమారు చేయ ప్రయత్నిస్తున్నందుకు మరియు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలి.
5, బాధితుని చికిత్సకు, పునరావాసానికి అయ్యే ఖర్చులన్నీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ప్రభుత్వమే భరించాలి. 

   -- *డా. ఎస్ తిరుపతయ్య* 
                ( రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మానవ హక్కుల వేదిక) 

-- *బదావత్ రాజు* 
     (రాష్ట్ర సహాయ కార్యదర్శి) 

--- *ఎన్. హరిందర్* ( ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు) 

--- *ఎ.వీరస్వామి* 
( ప్రధాన కార్యదర్శి, నల్గొండ జిల్లా