Friday, April 29, 2022

ఏసీబీకి పట్టుబడ్డ కల్వకుర్తి విద్యుత్ శాఖ... ఏఈ

*ఏసీబీకి పట్టుబడ్డ కల్వకుర్తి విద్యుత్ శాఖ... ఏఈ*

నాగర్‌కర్నూల్ : కల్వకుర్తి విద్యుత్ శాఖ ఏఈ సురేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, కరెంట్ స్తంభాల కోసం స్థిరాస్తి వ్యాపారి వద్ద ఏఈ సురేశ్ లంచం డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో కర్మాన్‌ఘాట్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి సుంకర ప్రభాకర్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు సురేశ్‌కు ప్రభాకర్ రెడ్డి రూ. 1,00,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం సురేశ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ సమీపంలో చంద్రభాస్కర్‌, శ్రీనివాసులు ప్లాటినం, ప్రైమ్‌ అనే రెండు వెంచర్లలలో విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు, లైన్లు ఇతరత్రా పనుల కోసం హైదరాబాద్‌కు చెందిన ప్రభాకర్‌ అనే కాంట్రాక్టర్‌ను సంప్రదించగా.. అతడు కల్వకుర్తి విద్యుత్‌ కార్యాలయంలో ఏఈ సురేశ్‌ని కలిశాడు. వెంచర్లలో 100 కేడబ్ల్యూ డీటీఆర్‌ కెపాసిటీ ట్రాన్స్‌ ఫార్మర్‌ అవసరం ఉండగా.. ఏఈ సురేశ్ రూ.లక్ష డిమాండ్‌ చేశాడు. మరో మూడు వెంచర్ల నిర్వాహకులను ఇదే తరహాలో డబ్బులు డిమాండ్‌ చేశాడు. దీంతో ప్రభాకర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కారులో ఏఈ సురేశ్‌కు ప్రభాకర్‌ రూ.లక్ష ఇవ్వగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈని విచారించిన అనంతరం హైదరాబాద్‌ స్పెషల్‌ కోర్టు (నాంపల్లి)లో శనివారం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ నర్సింహ, లింగస్వామి, సిబ్బంది ఉన్నారు.

link Media ప్రజల పక్షం🖋️

Thursday, April 28, 2022

సంచలన తీర్పు.... సకాలంలో ప్లాట్లు ఇవ్వలేదని.....రియల్టర్ కు 18 నెలల జైలు శిక్ష.....!

*సంచలన తీర్పు.... సకాలంలో ప్లాట్లు ఇవ్వలేదని.....రియల్టర్ కు 18 నెలల జైలు శిక్ష.....!*

హైదరాబాద్‌ సిటీ : పలు సందర్భాల్లో తాము ఇచ్చిన తీర్పులను బేఖాతరు చేసిన రియల్టర్‌కు రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఏడాదిన్నర జైలు శిక్ష విధించిందిరాష్ట్ర వినియోగదారుల ఫోరం గడచిన 15 ఏళ్లలో జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు ఇవ్వడం ఇదే మొదటిసారి. నగరంలో పలు భవనాలను నిర్మించిన ఘరోండా బిల్డర్స్‌ నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు పలువురు డబ్బులు చెల్లించి అగ్రిమెంట్లు చేసుకున్నారు. అగ్రిమెంట్‌ ప్రకారం ఇళ్లు పూర్తిచేయకపోవడంతో సంస్థ ఎండీ సునీల్‌ జె.సచ్‌దేవ్‌పై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి తీసుకున్న డబ్బును వడ్డీతోపాటు చెల్లించాలని ఎండీని ఆదేశిస్తూ పలు జిల్లాల వినియోగదారుల ఫోరంలతోపాటు రాష్ట్ర ఫోరం కూడా గతంలో తీర్పులు ఇచ్చాయి. అయితే సదరు ఎండీ ఫోరం ఆదేశాలను పాటించకుండా దాటవేత ధోరణిని ప్రదర్శించాడు.

చెల్లని చెక్కులు ఇవ్వడం, డబ్బులు చెల్లిస్తానని మాట ఇచ్చి తప్పడంతోపాటు... తన వద్ద డబ్బుల్లేవంటూ సివిల్‌ కోర్టులో ఐపీ పిటిషన్‌ దాఖలుచేశాడు. దీన్ని సాకుగా చూపిస్తూ ఫోరం తీర్పు అమలును నిలిపివేయాలని అభ్యర్థించాడు. రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు జస్టిస్‌ ఎంఎస్‌కే జైస్వాల్‌ నేతృత్వంలోని జస్టిస్‌ మీనా రంగనాథన్‌, జస్టిస్‌ కె.రంగారావులతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఫోరం ఆదేశాలు పాటించకుండా సునీల్‌ సచ్‌దేవ్‌ చేస్తున్న ప్రయత్నాలను గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014, 2015, 2017 కేసుల్లో ఇచ్చిన తీర్పులను అమలుపరచని కారణంగా జైలు శిక్షను విధించింది. ఒక్కో కేసులో 6 నెలలు చొప్పున వరుసగా మొత్తం 18నెలలపాటు జైలు శిక్ష విధించింది.

link Media ప్రజల పక్షం🖋️

నేడు సర్కార్ ఇస్తార్ విందు హాజరుకానున్న.... సీఎం కేసీఆర్

*నేడు సర్కార్ ఇస్తార్ విందు హాజరుకానున్న.... సీఎం కేసీఆర్*

*హైదరాబాద్....*
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇఫ్తార్‌ విందును ఇవ్వనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర మంత్రులు మహమూద్‌ ఆలీ, తలసాని శ్రీనివా ్‌సయాదవ్‌ తెలిపారు.సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించే ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరవుతారని తెలిపారు. ఇఫ్తార్‌ విందుకు ప్రత్యేక పాసులున్న వారినే అనుమతి ఇస్తారని తెలిపారు. వారి వెంట మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్‌, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అహ్మద్‌ నదీమ్‌, డైరెక్టర్‌ షాహనవాజ్‌ ఖాసీం, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, ఐజీ రంగనాథ్‌, జాయింట్‌ సీపీ డి.ఎస్‌.చౌహన్‌, రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు కిషోర్‌గౌడ్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పాల్గొన్నారు.

హైదరాబాద్‌ సిటీ : ఎల్‌.బీ. స్టేడియంలో ఇఫ్తార్‌ విందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టేడియాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ఇతర వాహనాలకు అనుమతి లేదని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. రంజాన్‌ మాసంలో చివరి శుక్రవారం (జుమాతుల్‌ విదా) ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్‌, మక్కామసీదు వద్ద, సికింద్రాబాద్‌ జామా మసీద్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసులు వెల్లడించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

ఆ తిట్లు, వాయిస్‌ నావి కావు! ఆడియో లీక్‌ పై మహేందర్‌ రెడ్డి స్పందన!

ఆ తిట్లు, వాయిస్‌ నావి కావు! ఆడియో లీక్‌ పై మహేందర్‌ రెడ్డి స్పందన!

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మమేందర్‌ రెడ్డిపై గుర్రుగా ఉన్నాయి పోలీస్‌ వర్గాలు. తాండూరు సీఐని ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఆడియో ఒకటి వైరల్‌ అవడమే దానికి కారణం. ఈ క్రమంలోనే మహేందర్‌ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్‌ లో కేసు కూడా నమోదైంది. 353, 504,506 ఐపీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐకి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో మహేందర్‌ రెడ్డి మీడియా ముందుకొచ్చారు.

తాండూరులోని భద్రేశ్వర స్వామి జాతర కార్యక్రమంలో తన ముందు రౌడీ షీటర్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలోనే తాను సీఐతో మాట్లాడానని చెప్పారు. వైరల్ అవుతున్న ఆడియోలో వాయిస్ తనది కాదని.. అసలు.. తాను సీఐని తిట్టలేదని వివరణ ఇచ్చారు.
తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మహేందర్‌ రెడ్డి. పోలీసులు నోటీసులు ఇస్తే విచారణను ఎదుర్కొంటానని.. పోలీసులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. ఈ నకిలీ ఆడియో వ్యవహారంపై కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.
ఇదంతా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేయిస్తున్నారని ఆరోపించారు మహేందర్‌ రెడ్డి. గత ఎన్నికల్లో రోహిత్‌ చేతిలోనే ఈయన ఓడిపోయారు. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన రోహిత్‌.. తర్వాత టీఆర్‌ఎస్‌ లో చేరారు. దీంతో మహేందర్‌ రెడ్డి తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడుప్పుడు ఇలా అధికారులతో దుర్భాషలాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ చాలామంది అధికారులను ఇలాగే తిట్టారని ఆయన వ్యతిరేకులు చెబుతున్నారు. అయితే.. తాజాగా బయటకొచ్చిన ఆడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అంతా రోహిత్‌ రెడ్డి కుట్రగా ఆయన ఆరోపిస్తున్నారు.

Wednesday, April 27, 2022

MLC పట్నం మహేందర్ రెడ్డి పోలీస్ అధికారిఫై భూతులు

https://twitter.com/Praja_Snklpm/status/1519363708098867200?t=tCTYkdqmHKmrCsz2pt3LAw&s=08    https://t.co/F4y27ReZbx

*తెలంగాణ @TelanganaDGP సర్  @spvikarabad సర్ @TelanganaCOPs   @SHO_TDR_VKB @TandurPolice @PilotRohith*                                             https://youtu.be/49yoVFmR2t8

*వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ CI గారి మీద MLC పట్నం మహేందర్ రెడ్డి అసభ్య పదజాలం(వీడియో చూడండి) వాడినారు కాబట్టి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.... Bplkm🪶*                                *తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు మీరు సమాధానం చెప్పాలి. ఇదేనా మీరు నేర్పే క్రమశిక్షణ...... Bplkm🪶*  https://t.co/LCJPMqdBvX

*@తెలంగాణ @TelanganaDGP సారు గారు స్పందించాలి MLC మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రజలకు తప్పుడు సమాచారం వెళుతుంది....ఇప్పుడు మీరు MLC ని అరెస్టు చేయాల్సిందే... తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ & ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పందించాలి తోటి అధికారి మీద MLC బండ భూతులు తిట్టాడు తెలంగాణ ప్రజలు అందరు విన్నారు..... తాండూర్ పట్టణ CI సర్ గారికి అండగా ప్రజా సంకల్పం & link Media...Bplkm🪶*

@spvikarabad @TelanganaCOPs @cyberabadpolice @hydcitypolice @RachakondaCop @SHO_TDR_VKB @TandurPolice @PilotRohith

#KTR
#Askktr

*తెలంగాణ IPS అధికారులు స్పందించాలి.... Bplkm🪶*

@CPHydCity @SumathiIPS @cpcybd @DCPEASTZONE @SwatiLakra_IPS @DCPWZHyd @DCPNorthZone @rama_rajeswari @AddlCPCrimesHyd @Anjanikumar_IPS @DCPDDHyd @RachakondaCop
@cyberabadpolice
@hydcitypolice

సెప్టెంబర్ నుంచి... బీ 1 బీ 2 వీసాల ఇంటర్వ్యూలు....!

*సెప్టెంబర్ నుంచి... బీ 1 బీ 2 వీసాల ఇంటర్వ్యూలు....!*

హైదరాబాద్‌: అమెరికాలో పర్యటించేందుకు వీసా కోసం ఎదురుచూస్తున్న గుడ్‌న్యూస్‌. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నిలిచిపోయిన బీ1, బీ2 టూరిజం, విజిట్‌, బిజినెస్‌ వీసాలకు ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు అమెరికా కాన్సులేట్‌ అధికారులు సిద్ధమయ్యారు.సెప్టెంబర్‌ నుంచి బీ1, బీ2 వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు బుధవారం ప్రకటించారు. తొలిసారి బీ1, బీ2 వీసాలకు దరఖాస్తు చేసుకొనే వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపింది. అయితే, త్వరలోనే ఈ వీసాల కోసం స్లాట్స్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. కొవిడ్‌ నేపథ్యంలో బీ1, బీ2, ఇతర వీసాల రెన్యువల్‌కు ఇంటర్వ్యూలు మినహాయింపు ఇచ్చి డ్రాప్‌ బాక్స్‌ సౌకర్యం కల్పించారు. కానీ గతంలో కొవిడ్‌కు ముందు స్లాట్స్‌ బుక్‌ చేసుకున్న బీ1, బీ2 వీసాలకు సంబంధించిన రీషెడ్యూల్‌ అంశంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు

link Media ప్రజల పక్షం🖋️ 

బీఆర్‌ఎస్‌ గా టీఆర్‌ఎస్‌! కేసీఆర్‌ కు అంత సీన్‌ ఉందా?

బీఆర్‌ఎస్‌ గా టీఆర్‌ఎస్‌! కేసీఆర్‌ కు అంత సీన్‌ ఉందా?

-- దేశ్ కీ పార్టీపై కేసీఆర్‌ పరోక్ష వ్యాఖ్యలు
– భారత రాష్ట్ర సమితి అంటూ హింట్‌
– ఒకవేళ బీఆర్‌ఎస్‌ వస్తే నెట్టుకొస్తారా?
– ఉన్న ఎంపీ సీట్లెన్ని?
– మద్దతిచ్చే ప్రాంతీయ పార్టీలెన్ని?
– కేసీఆర్‌ కన్ఫ్యూజన్‌ లో ఉన్నారా?

ప్లీనరీ సమావేశం అంటే ఏం చేస్తారు.. తమ పార్టీ బలోపేతం..సాధించిన విజయాలు ప్రజలకు అందిన ఫలాల గురించి చర్చిస్తారు. ఆ విధంగానే తీర్మానాలను కూడా ఆమోదం తెలుపుతుంటారు. కానీ.. మన దేశ్‌ కీ నేత కేసీఆర్‌ మాత్రం అలాకాదు.. 11 తీర్మానాలు చేస్తే అందులో 9 కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్‌ చేసేవే ఉన్నాయి. అయితే.. తమ భవిష్యత్ కార్యాచరణ అంతా కేంద్రంపై యుద్ధమనే సంకేతాలను కేసీఆర్‌ ఇలా ఇచ్చారని అంటున్నారు గులాబీ శ్రేణులు. తీర్మానాల సంగతి పక్కనపెడితే.. ప్లీనరీలో ముఖ్యంగా హైలెట్‌ అయిన అంశం భారత రాష్ట్ర సమితి.

ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అంటూ కొద్ది రోజులు హడావుడి చేశారు కేసీఆర్‌. కానీ.. ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరూ ఆయన్ను పట్టించుకోలేదు.కాంగ్రెస్‌ లేని కూటమి కష్టమని కొందరు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అదే సమయంలో అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడితే తప్పేంటని అన్నారు కేసీఆర్‌. దీంతో ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని.. ప్లీనరీలో కీలక ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. అందరూ ఎంతో ఆసక్తిగా కేసీఆర్‌ ప్రసంగం కోసం ఎదురుచూశారు. కానీ.. ఆయన ప్రసంగం చూసిన తర్వాత చల్లబడ్డట్టే అనిపించిందనే విమర్శలు వస్తున్నాయి. జాతీయ పార్టీ ప్రకటన లేకపోయినా పరోక్షంగా మాత్రమే కేసీఆర్‌ హింట్‌ ఇచ్చారు.

Tuesday, April 26, 2022

This terrible scene is from RUIA Hospital in #Tirupathi, #AndhraPradesh

Can’t even afford to DIE in peace! 
This terrible scene is from RUIA Hospital in #Tirupathi, #AndhraPradesh. A grieving father of was forced to take the body of his son on a bike for about 90kms after the hospital refused to provide ambulance at a cheaper price #AmbulanceMafia. https://t.co/req7uwU5Wc

What makes it worse is-the family sent an ambulance& hospital authorities refused to allow the body being taken in it. He was allegedly told that he has to pay whatever the price the hospital ambulance driver is demanding. The govt doesn’t care & we are turning more inhuman

.గాంధీ ఆస్పత్రిలో నరకయాతనపడుతోన్న అక్షయ..!

గాంధీ ఆస్పత్రిలో నరకయాతనపడుతోన్న అక్షయ..!

కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. 14 ఏళ్ల అమ్మాయి సహా మరో ఇద్దరి గాయాలయ్యాయి. ఆ అమ్మాయికి వెన్నుపూస విరిగిపోవటంతో బంధువులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, అక్కడి వైద్యులు వైద్యం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని.. దాదాపు నెల రోజులుగా అక్షయ నరకయాతన పడుతుందని బంధువులు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం 25 రోజులు క్రితం తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. కర్నూల్ సమీపంలో రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు చికిత్స అనంతరం కోలుకోనగా.. 14 ఏళ్ల అక్షయ వెన్నుపూస విరిగిపోయింది.దీంతో బంధువులు మెరుగైనా చికిత్స కోసం అక్షయను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి తీరా స్టార్ట్ చేసే టైంలో.. స్క్రూ బోల్ట్స్ లేవని వైద్యులు ఆపరేషన్ చేయకుండా వెనక్కి తీసుకోచ్చారని వాపోతున్నారు.

గత 25 రోజులు లేవలేక.. ఎప్పుడు లేస్తుందో తెలియక అక్షయ నరకయాతన పడుతోంది. మరోవైపు తనకి తన కుటుంబంలో ముగ్గురు చనిపోయారనే విషయం తెలియదని.. అందరూ సేఫ్‌గా బయటపడ్డారని సంతోషంగా ఉందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వైద్యులు ఆపరేషన్ చేసి అక్షయను యథా స్థితికి తీసుకురావాలని వారు కోరుతున్నారు.

Monday, April 25, 2022

_మలేషియా అంతర్జాతీయ విశ్వ విద్యాలయం 'బ్రాండ్ అంబాసిడర్ గా అనంచిన్ని శ్రీరాం

*_మలేషియా అంతర్జాతీయ విశ్వ విద్యాలయం 'బ్రాండ్ అంబాసిడర్ గా అనంచిన్ని శ్రీరాం'_*
★  'ఫ్లై గ్రాడ్యుయేట్' సహకారం
★ ఏడాదికి రూ.25 లక్షల స్కాలర్ షిప్
★ నిరాడంబరంగా జీవిస్తున్న నా తల్లిదండ్రుల ఆశయం కొనసాగిస్తా
★ 'అనంచిన్ని ఫౌండేషన్'కి వారసత్వంగా వచ్చిన ఆస్తికి తోడుగా నా తొలి సంపాదన వచ్చిన కోటి ఇస్తున్న


అనంచిన్ని కోదండ శ్రీరామ్ పరమాత్మ మలేషియాలోని ఐ.ఎన్.టి.ఐ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బ్రాండ్ అంబాసిడర్ గా అనంచిన్ని కోదండ శ్రీరాం పరమాత్మ ఎంపికయ్యారు.

శ్రీరాం యూనివర్సిటీ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతూ అమెరికన్ డిగ్రీ ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్‌, బయో టెక్నాలజీ కోర్సును రెండేళ్ల పాటు మలేషియాలో, మరో రెండేళ్లు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించనున్నారు. ఈ నాలుగు సంవత్సరాలపాటు శ్రీరాంకు ఏడాదికి రూ. 25 లక్షల చొప్పున కోటి రూపాయల స్కాలర్ షిప్ ను మలేషియా అంతర్జాతీయ యూనివర్సిటీ  అందించనున్నది. సోమవారం మధ్యాహ్నం శ్రీరాం మలేషియా చేరుకున్నారు. ఈ సందర్భంగా మలేషియా అంతర్జాతీయ విశ్వవిద్యాలయం డీన్ బ్రెండన్, విశ్వవిద్యాలయ డైరెక్టర్లు  ప్రత్యేకంగా శ్రీరాంను మలేషియా విమానాశ్రయానికి వచ్చి అభినందించారు.

*ఆదర్శంగా మారితే...:!*
ఐ.ఎన్.టి.ఐ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ గత 32 సంవత్సరాల నుండి సేవలందిస్తున్నాయి. భారతదేశం నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయిన తొలి విద్యార్థి శ్రీరాం కావడం గమనార్హం. అమెరికాలోని  287 విశ్వ విద్యాలయాలలో మొదటి స్థానంలో ఉన్న అమెరికా విశ్వవిద్యాలయం ద్వారా అనంచిన్ని శ్రీరాం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు ఇప్పటికే ఆహ్వానం అందింది.

*కృతజ్ఞతలు ఎందుకంటే..?:*
తనకు పూర్తి సాంకేతిక సహకారం అందించిన హైదరాబాద్, అమీర్ పేటలోని 'ప్లై గ్రాడ్యుయేట్' సంస్థ యాజమాన్యానికి, సికింద్రాబాద్ సెంట్ ప్యాట్రిక్స్ లో 10వ తరగతి వరకు, న్యూ చైతన్యలో ఇంటర్, విదేశీ విద్య కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఖమ్మంకు చెందిన రెజోనెన్స్ విద్యా సంస్థ యాజమాన్యాలకు, బోధన సిబ్బందికి కృతజ్ఞతలు.

*ఇదే నా ఆశయం:*
ముఖ్యంగా నాతో పాటు లక్షలాది మందికి తన ప్రాణాలను తృణపాయంగా భావించి అభాగ్యులకు తన గొంతకను, అవినీతికి వ్యతిరేకంగా, తన అక్షరాలను సరస్వతి దేవికి త్యాగాల మాలగా అందిస్తూ.. ఆత్మగౌరవ తెలంగాణ కోసం ఆరాటపడుతున్న నా తండ్రి, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావుకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వందల కోట్ల ఆస్తి ఉన్నా.. ఓ సామాన్యుడిలా బతికే నా తండ్రి, అలాంటి త్యాగాలతో బతికిన నాతాత‌, ముత్తాతలు, అమ్మలు, నాన్నమ్మలు నాకు ఆదర్శం. నా తండ్రి చెప్పినట్లు ఈ ప్రపంచాన్ని జయించడానికి వెళుతున్న. విజయంతో రావాలని నన్ను దీవించండి. నా విజయం నిశ్శబ్దం. నామాట ఎంత భయకంరంగా ఉంటుందంటే.. నాన్నను కష్ట పెట్టిన వాళ్ళ గుండెల్లో జస్ట్ ఇది డైనమైట్. మిస్సైల్ లా వస్తా. ఇది నేను నా భారతమాతకు మాటిస్తునన్నా. నా భారతీయులకు మాట ఇస్తున్న. నా తండ్రి నాకు ఇచ్చిన ఎంతో విలువైన భూ బహుమతితో పాటు, నా నాలుగేళ్ళ స్కాలర్ షిప్ నగదు కోటి మొత్తాన్ని నా తండ్రి సూచనల మేరకు పేదోళ్ళ కోసం మాత్రమే 'అనంచిన్ని ఫౌండేషన్' కార్యక్రమాలకు ఇస్తున్న' అని అనంచిన్ని కోదండ శ్రీరాం పరమాత్మ ప్రశాంతంగా పేర్కొన్నారు.

Sunday, April 24, 2022

గడీల రాజ్యం పోవాలి గరీబోళ్ల ప్రభుత్వం రావాలి....బండి సంజయ్....!

*గడీల రాజ్యం పోవాలి గరీబోళ్ల ప్రభుత్వం  రావాలి....*
*బండి సంజయ్....!*

నారాయణపేట: తెలంగాణలో గడీల రాజ్యం పోయి గరీబోళ్ల రాజ్యం రావాలని రాష్ట్ర బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా నర్వమండల కేంద్రంలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడారు.నర్వ మండలంలో మూడు రిజర్వాయర్లున్నయ్.కానీ నీళ్లు మాత్రం రావడం లేదని అన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ ఫాంహౌజ్ కు నీళ్లు తెచ్చుకోవడానికి లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి నుండి నీళ్లు తెచ్చుకుండు. ఇక్కడ 3, 4 వందల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావొచ్చు. కానీ కేసీఆర్ కు ఇక్కడి ప్రజలకు నీళ్లించేందుకు మనసు రాదని అన్నారు.కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో మాట్లాడి ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం చూపినం. రాష్ట్రం సహకరిస్తే 6 నెలలో నీళ్లు తీసుకురావొచ్చని అన్నారు. కేంద్రం నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించిండు.

ఈరోజు వ్యాక్సిన్ ను ఉచితంగా మోదీ అందించడంవల్లే ఈరోజు అందరం కలిసి మాట్లాడుకోగలుతున్నామని అన్నారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇవ్వడు. కానీ ఆయన కుటుంబంలో మాత్రం ఐదుగురికి పదవులిచ్చుకుని జీతమే నెలకు రూ.25 లక్షలు తీసుకుంటున్నరని చెప్పారు. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు. దళిత బంధు ఇవ్వలేదు. ఈ రెండూ అమలు చేస్తే దళితులు కోటీశ్వరులు అయ్యేవారు. కేసీఆర్ వి కేవలం మాటలే తప్ప చేతల్లేవని ఎద్దేవా చేశారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. గడీల రాజ్యం పోవాలి. గరీబోళ్ల ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. బాంచన్ బతుకులు కావాలా? పేదల ప్రభుత్వం రావాలా? అంటూ ఆయన ప్రజల్ని ప్రశ్నించారు. నర్వ మండలంలో బస్టాండ్ లేదు.

రోడ్లు లేవు. స్కూళ్లు లేవు.ఆసుపత్రుల్లేవ్. ఈసారి కేసీఆర్ వస్తే నిలదీయాలని ప్రజలను పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కేసీఆర్ ను గెలిపిస్తే ఏం చేసిండు? ఆత్మహత్యలు ఆగినయా? నీళ్లు వచ్చినయా? బస్టాండ్ వచ్చిందా? స్కూళ్లు లేవు...ఏం సాధించినమని అన్నారు.కేసీఆర్ మాత్రం రాజ్యమేలుతున్నడు... వేల కోట్లు దోచుకుతింటున్నడని విమర్శించారు. అమెరికా పోయి బార్లలో, పబ్బుల్లో తిరిగేటోడికి ఈ రోజు రాష్ట్ర మంత్రి అయ్యారంటే... బీజేపీ వేసిన భిక్ష మాత్రమేనని బండి సంజయ పేర్కొన్నారు.పార్లమెంట్ లో తెలంగాణకు బిల్లుకున మద్దతిచ్చి రాష్ట్రాన్ని తెచ్చింది సుష్మా స్వరాజ్ అని గుర్తు చేశారు.

link Media ప్రజల పక్షం🖋️ 

రెండోరోజు కూడా సీఎం కేసీఆర్ తో.... ప్రశాంత్ కిషోర్ చర్చలు....!

*రెండోరోజు కూడా సీఎం కేసీఆర్ తో.... ప్రశాంత్ కిషోర్ చర్చలు....!*

హైదరాబాద్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండో రోజు ఆదివారం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపారు. రెండు రోజులుగా ఆయన ప్రగతిభవన్ లో కేసీఆర్ తో గంటల తరబడి చర్చలు జరుపుతున్నారు.అందులో భాగంగానే ఆదివారం కూడా ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో పీకే సమావేశమయ్యారు.జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తీరుపై ప్రశాంత్ కిషోర్ టీమ్ తెలంగాణలో సర్వేలు చేస్తున్నాయి.శనివారం నుంచి ప్రగతిభవన్‌లోనే పీకే మకాం వేశారు. వరుస సమావేశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంి.ఇప్పటికే రాజకీయ, పాలన పరిస్థితులపై పీకే టీమ్‌ సర్వే నిర్వహించినట్టు సమాచారం.కాంగ్రెస్‌ హైకమాండ్‌తో కూడా ప్రశాంత్ కిషోర్ టచ్‌లో ఉన్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Saturday, April 23, 2022

ప్రధాని సభా వేదిక కు 12 కిలోమీటర్ల దూరంలో.... పేలుడు!

*ప్రధాని సభా వేదిక కు 12 కిలోమీటర్ల దూరంలో.... పేలుడు!*

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్ముకశ్మీర్‌లో ఆదివారం ప్రధాని పర్యటనకు కొన్నిగంటల ముందు సభావేదికకు 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది.
జమ్ము జిల్లాలోని లాలియాన గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఒక పొలంలో పేలుడు చోటు చేసుకొంది. ప్రధాని బహిరంగ సభ జరగనున్న సాంబా జిల్లాలోని పల్లీ గ్రామానికి ఇది సమీపంలోనే ఉంటుంది. సమాచారం అందుకొన్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. ఇది ఉగ్రదాడి కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడికాలేదు.

జమ్మూ-కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే 370 అధికరణం ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు జమ్మూ-కశ్మీర్‌లో పూర్తిస్థాయి పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 'జాతీయ పంచాయతీ రాజ్‌' దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు. శుక్రవారం సుంజ్వాన్‌ ప్రాంతంలో ఇద్దరు జైషే-మహమ్మద్‌ తీవ్రవాదుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ప్రధాని భద్రతను అధికారులు మరింత పటిష్ఠం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధిపతి కుల్‌దీప్‌ సింగ్‌ శనివారం సుంజ్వాన్‌ ప్రాంతానికి చేరుకున్నారు. మోదీ పర్యటించనున్న పల్లీ గ్రామానికి కూడా చేరుకొని అక్కడి భద్రతా పరిస్థితినీ సమీక్షించారు. సాయంత్రం మోదీ కశ్మీర్‌ నుంచి నేరుగా ముంబయికు చేరుకుంటారు.

link Media ప్రజల పక్షం🖋️ 

బీజేపీ కార్పొరేటర్ లకు కిషన్ రెడ్డి క్లాస్....!

*బీజేపీ కార్పొరేటర్ లకు కిషన్ రెడ్డి క్లాస్....!*

హైదరాబాద్‌: బీజేపీ కార్పొరేటర్లకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్లాస్ పీకారు. బీజేపీ ఆఫీస్‌లో బీజేపీ కార్పొరేటర్లతో కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు.
కొత్త భవన నిర్మాణాల జోలికి వెళ్లోద్దని, ఈ విషయంపై తనకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. సోషల్‌ మీడియాలో కార్పొరేటర్లు యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. స్థానిక సమస్యలపై కార్పొరేటర్లు పోరాటం చేయాలని ఆదేశించారు. కార్పొరేటర్లు కష్టపడి పనిచేయాలన్నారు. హైదరాబాద్‌కు కేంద్రం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి సూచించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

రియల్టర్ల మర్డర్ కేసులో ఏసీపీపై వేటు.. సీపీ సీరియస్..!

రియల్టర్ల మర్డర్ కేసులో ఏసీపీపై వేటు.. సీపీ సీరియస్..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి సస్పెండ్ అయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల హత్య కేసులో.. నిందితుల నుంచి లంచం తీసుకున్నట్లు బాలకృష్ణారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన డీజీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

గత నెల 1న తేదీన కర్నెంగూడ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు రియల్టర్లు మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మట్టారెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో హత్య చేయించినట్లు దర్యాప్తులో తేల్చారు. మట్టారెడ్డితో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ క్రమంలో ఏసీపీ బాలకృష్ణారెడ్డి నిందితుల నుంచి డబ్బులు తీసుకున్నాడని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో కేసులో బాధ్యులను చేస్తూ.. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఎస్సై విజయ్, కానిస్టేబుల్ బాలకృష్ణలను సీపీ మహేశ్ భగవత్ బదిలీ చేశారు. అనంతరం అతనిపై అంతర్గత విచారణకు ఆదేశించారు.

ఈ  విచారణ నివేదిక ఆధారంగా.. ఏసీపీ బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నేరాలకు పాల్పడే వారితో సంబంధాలు కొనసాగించడంపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్‌ హద్దు మీరారు..!

కేటీఆర్‌ హద్దు మీరారు..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు

మోడీపై కేటీఆర్ హద్దు మీరి మాట్లాడారు. బీజేపీ అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు భయం పట్టుకుంది. కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా.. ఇలాంటి విమర్శలు చేయడం సరికాదు.

మోడీ, బీజేపీ, కేంద్రాన్ని దూషిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కేటీఆర్ కు, పలు పేపర్‌ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చాం. ప్రధానమంత్రిపై తప్పుడు వార్తలు ప్రచురించారని ప్రివిలేజ్ నోటీస్‌ ఇచ్చాం.

తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని కొందరు ప్రాంతీయ పార్టీల నేతలు కంగారు పడుతున్నారు. బీజేపీ అంటే భయంతోనే కేటీఆర్ మాట్లాడినట్లు అనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి కుటుంబ పార్టీల నుంచి ముప్పు ఉంది.కుటుంబ పార్టీల పాలన దూరం చేసేలా.. 2024 ఎన్నికల ఎజెండాను ప్రధాని మోడీ ఖరారు చేశారు. టీఆర్ఎస్, వైసీపీలను పీకే కాంగ్రెస్ లో కలుపుతారా? కాంగ్రెస్ లో పీకే చేరికతో బీజేపీకి వచ్చే నష్టమేమీ ఉండదు.

Friday, April 22, 2022

తెలంగాణ వాసులకు కూల్ న్యూస్.... మరో 4 రోజులు వర్షాలు....!

*తెలంగాణ వాసులకు కూల్ న్యూస్.... మరో 4 రోజులు వర్షాలు....!*

వేసవికాలం తాపంతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. భానుడి ప్రతాపానికి వేసవికాలం ప్రారంభం నుంచి ఎండతీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు చెమటలు కక్కుతున్నారు.
ఉదయం 9 నుంచే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలపై వరుణుడు నిన్న కరుణించి వర్షం కురిపించడంతో ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించింది. అయితే ఈ రోజుల కూడా మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఆకాశమంతా మేఘావృతమై ఉంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలంగాణ మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కర్నాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, ఈ నెల 25 వరకు దాని ప్రభావం తెలంగాణపై ఉంటుందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడించింది.

link Media ప్రజల పక్షం🖋️ 

Fourth wave unlikely, but mask must: DPH

Fourth wave unlikely, but mask must: DPH

Due to Telangana’s hybrid immunity, confirmed by the NIN survey, there will be no fourth wave, says Srinivasa Rao

Courtesy & Published by : THE NEW INDIAN EXPRESS 

Director of Public Health Dr G Srinivasa Rao speaks to the media about Covid-19 and vaccination, in Hyderabad on Thursday. (Photo | Vinay Madapu, EPS)

By Express News Service

HYDERABAD: As Telangana currently has a seropositivity rate of 92.9%, it is very highly unlikely that the fourth wave of Covid-19 will hit the State, according to Dr G Srinivasa Rao, Director of Public Health. Speaking to the media on Thursday, he referred to the serosurveillance study conducted by ICMR-NIN in all 33 districts of the State between January 4h and February 2, the results of which were sent to the State government three days ago. In view of the survey findings, the DPH said that there won’t be a fourth wave in Telangana. He, however, stressed that use of face masks remains mandatory, especially at large gatherings. The highest seropositivity rate of 97% was found in Hyderabad and the 89.2% was in Kothagudem district, he said. 

The survey also specifically analysed immunity levels among healthcare workers and found it to be at 93.1% in the State with the highest rate of 100% found in Hyderabad and lowest of 83.2% in Wanaparthy. According to Dr Srinivasa Rao, the study also found some interesting insights. “The antibodies were found in 99% of samples collected from people who were previously infected by Covid-19. In individuals who took one dose of the vaccine, it was at 91% and among those who took two doses, it was at 96%. In unvaccinated people, seroprevalence was just 77%, indicating the importance of vaccines,” he said.

He also urged the people to take necessary precautions during the wedding season. “There are no restrictions whatsoever. All can conduct these functions as they like. However, all must compulsorily take vaccines or boosters as applicable. When in large gatherings, all must wear masks,” he said. The DPH also ruled out a fourth wave in the State but said the situation could see a slight change with a slightly higher case rate in six to eight weeks from now. 

“Due to Telangana’s hybrid immunity, confirmed by the NIN survey, we can confidently say there will be no fourth wave. But some vulnerable populations who are not immunised are likely to get infected, so they must take vaccines at the earliest,” he said. “Mask rule is not done away with yet in Telangana. Police can still penalise citizens who do not wear masks. We urge cit-izens going to mass gatherings to wear a mask,” he added.



    Thursday, April 21, 2022

    ఆ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వండి... రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశం.....!

    *ఆ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వండి... రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశం.....!*

    హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో సామినేని సాయిగణేశ్‌, కామారెడ్డి జిల్లాలో తల్లీకొడుకుల ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.భాజపా నేతలు సమర్పించిన పలు మీడియా, సోషల్‌ మీడియా కథనాలు, వినతి పత్రాలపై స్పందించిన గవర్నర్‌ గురువారం ఈ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరువు హత్యలు, సామూహిక అత్యాచారం వంటి ఇతర నేరాలపైనా వివరణ ఇవ్వాలని సూచించారు.
    *పీజీ మెడికల్‌ సీట్ల బ్లాక్‌ దందాపై చర్యలకు ఆదేశం*
    రాష్ట్రంలోని పలు ప్రైవేటు వైద్యకళాశాలలు పీజీ సీట్లను.. అర్హులైన నీట్‌ ర్యాంకర్లకు కేటాయించకుండా బ్లాక్‌ చేసి అడ్డదారిలో విక్రయిస్తున్న వ్యవహారంపై గవర్నర్‌ తమిళిసై తీవ్రంగా స్పందించారు. తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టి, నివేదిక ఇవ్వాలని గురువారం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిని ఆదేశించారు. సీట్ల బ్లాక్‌ దందాపై ఆరోగ్య వర్సిటీ వీసీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

    link Media ప్రజల పక్షం🖋️ 

    ఉద్యోగమా.... న్యాయ వృత్తా.....ఆరు నెలల్లో తేల్చుకోవాలి: సుప్రీం

    *ఉద్యోగమా.... న్యాయ వృత్తా.....*

    *ఆరు నెలల్లో తేల్చుకోవాలి: సుప్రీం*

    దిల్లీ: ఇతర ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులూ బార్‌ కౌన్సిల్‌లో తమ పేరు నమోదు చేసుకోవచ్చు.అయితే వారు ఆల్‌ ఇండియా బార్‌ ఎగ్జామినేషన్‌(ఏఐబీఈ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత ఆరు నెలల్లో న్యాయవాద వృత్తిలో కొనసాగుతారా లేదా ఇతర ఉద్యోగంలోనే ఉంటారో నిర్ణయించుకోవాలి. ఇతర వృత్తులు చేస్తున్న వారు కూడా న్యాయవాదులుగా ప్రాక్టీస్‌ చేయొచ్చంటూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వేసిన పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీం కోర్టు గురువారం పేర్కొంది.

    link Media ప్రజల పక్షం🖋️ 

    కేటీఆర్‌ కు శ్రవణ్‌ కౌంటర్‌..!

    కేటీఆర్‌ కు శ్రవణ్‌ కౌంటర్‌..!

    వరంగల్‌ టూర్‌ లో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ప్రతిపక్షాలు ఆయనపై విమర్శల దాడికి దిగాయి. ఫ్రస్ట్రేషన్ తో ప్రజా సమస్యలపై చర్చ రాకుండా తిట్ల మీదే చర్చ జరిగేలా కేటీఆర్‌ మాట్లాడారన్నారు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి.. ఈ తిట్ల రాజకీయం ఏంటని ప్రశ్నించారు.

    వరంగల్  టూర్లో  కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ప్రతిపక్షాలు ఆయనపై విమర్శల దాడికి దిగాయి. ఫ్రస్ట్రేషన్ తో ప్రజా సమస్యలపై చర్చ రాకుండా తిట్ల మీదే చర్చ జరిగేలా కేటీఆర్‌ మాట్లాడారన్నారు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి.. ఈ తిట్ల రాజకీయం ఏంటని ప్రశ్నించారు.

    111 జీవోపై 2016లో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారని.. 2022 మార్చి 31న రిపోర్ట్ ఇచ్చినట్టు జీవోలో పేర్కొన్నారని చెప్పారు. అందులో పొందుపరిచిన అంశాలు బహిర్గతం చేయాలన్నారు శ్రవణ్.ఇదేమన్నా సొంత పని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రెండు జలాశయాలు మరో హుస్సేన్ సాగర్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఆగమేఘాల మీద 111 జీవో ఎత్తేసి.. అక్కడున్న జలాశయాలు పర్యావరణాన్ని కాపాడేలా కమిటీ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి అసలు సోయి ఉందా? అని నిలదీశారు.
    111 జీవో పరిధిలో ఉన్న భూమిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వారికి లబ్ధి చేకూర్చేందుకే జీవో ఎత్తేశారని మండిపడ్డారు.రెండు జలాశయాలను ఎండగట్టే కుట్ర చేస్తున్నారని ఫైరయ్యారు శ్రవణ్‌. 69 జీవో హైకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జలశయాలను ఎలా కాపాడతారో గైడ్ లైన్స్‌ ను బహిర్గం చేయాలన్నారు.

    Wednesday, April 20, 2022

    మీ వాహనంపై 3 చాలన్ల కంటే ఎక్కువ ఉంటే..... అంతే సంగతులు....!

    *మీ వాహనంపై 3 చాలన్ల కంటే ఎక్కువ ఉంటే..... అంతే సంగతులు....!*

    హైదరాబాద్‌: 46 రోజుల పాటు అందుబాటులో ఉన్న పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపై రిబేట్‌ అవకాశాన్ని మీరు వినియోగించుకోలేదా?మీ వాహనంపై మూడు కంటే ఎక్కువ చలాన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయా? అయితే ట్రాఫిక్‌ పోలీసులు ఎప్పుడైనా సరే నడి రోడ్డు మీదే మీ వాహనాన్ని ఆపేస్తారు. అక్కడికక్కడే పెండింగ్‌ చలాన్‌ సొమ్ము చెల్లిస్తేనే వాహనాన్ని వదిలిపెడతారు. ఈమేరకు ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.గత నెల 1 నుంచి ఈనెల 15 తేదీ వరకూ అందించిన ట్రాఫిక్‌ చలాన్ల ఈ-లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోని వాహనదారుల ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా పెండింగ్‌ చలాన్ల డిస్కౌంట్లను రాచకొండ పరిధిలో వాహనదారులు బాగానే వినియోగించుకున్నారు. 46 రోజుల ఆఫర్‌ సమయంలో 30,63,496 వాహనదారులు చలాన్లను క్లియర్‌ చేయగా.. వీటి ద్వారా రూ.31,67,79,643 పెండింగ్‌ సొమ్ము వసూలు అయింది. ప్రస్తుతం మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, భువనగిరి మూడు జోన్లలో కలిపి 10 లక్షల వాహనాల చలాన్లు, రూ.100 కోట్లు సొమ్ము పెండింగ్‌లో ఉన్నాయి.
    *3 చలాన్ల ఉన్న వాహనాలు లక్ష.*
    పెండింగ్‌ చలాన్లపై రిబేట్‌ తర్వాత రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మూడు, అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌ ఉన్న వాహనాలు లక్ష వరకున్నాయి. వీటికి సంబంధించి రూ.50 కోట్ల చలాన్‌ సొమ్ము పెండింగ్‌లో ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు..

    link Media ప్రజల పక్షం🖋️ 

    protect Ameenpur lake : Telangana HC

    THIS STORY IS FROM AUGUST 22, 2020
     ..

    HYDERABAD: The Te ..