Stomach: మీ కడుపులో ఉన్న చెత్త మొత్తం ఒక చిన్న టెక్నిక్ తో ఎత్తిపడేయచ్చు.. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా తెలుసుకోవాల్సిన ఆహార సూత్రం..!!
Stomach: ఏవి తీసుకోవడం వలన ఈ సమస్య వస్తుంది..!!
చాలామందికి జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అటువంటి వారు ఎక్కువ ఆహారాన్ని ఒకేసారి తినకూడదు కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ముందుగా జీర్ణ వ్యవస్థను మెరుగు పరుచుకోవాలి. బీన్స్, పప్పుధాన్యాలు, క్యాబేజీ, బ్రోకోలి, క్యాలీఫ్లవర్, మొలకలు, కూరగాయలు తినడం వలన కూడా గ్యాస్ సమస్య వస్తుంది. పాలతో తయారుచేసిన పదార్థాలలో లాక్టోస్ అధికంగా ఉన్న వాటిని తినడం వలన కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.. ఫ్రక్టోస్ అధికంగా ఉన్న పండ్లు తీసుకున్న కూడా ఇలానే ఉంటుంది. తీపి పదార్థాలు, పుల్లటి ఆహారం, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే మీకు ఏవైనా ఆహార పదార్థాలు తింటే కడుపులో నొప్పి , గ్యాస్ వస్తాయి అనుకుంటే వాటిని తినకపోవడమే మంచిది.
Stomach: పొట్టని క్లీన్ చేసుకోండి ఇలా..!!
ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని పావులీటరు నీటిని తాగాలి ఉదయాన్నే గోరు వెచ్చటి నీరు తాగడం వలన శరీరంలోని గ్యాస్ , మలం పూర్తిగా బయటకు వెళతాయి ప్రేగులు శుభ్రపడి గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గిస్తుంది. ప్రతి రోజు కనీసం మూడు లేదా నాలుగు లీటర్ల నీటిని త్రాగాలి. ప్రతి రోజూ ఎక్కువ నీటిని తాగడం వలన గ్యాస్ కడుపు సంబంధిత సమస్యలతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. వీటితో పాటు ఒక ఇంటి చిట్కాలు కూడా పాటిస్తే మంచిది. రావి ఆకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రావి ఆకులలో కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టి మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారుచేసుకొని, ఎండ పెట్టుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. లేదు అంటే ఆ మిశ్రమాన్ని అలాగే నేరుగా తీసుకోవచ్చు. ప్రతిరోజు గోరువెచ్చని నీరు తాగుతూనే, ఈ చిట్కా కూడా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
ఆహారంలో ప్రొటీన్ల శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మలబద్ధకాన్ని తగ్గించుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. మీ శరీరానికి గ్యాస్ కలిగించే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అలాగే వారంలో ఒకటి లేదా రెండు రోజులు ఆహారం తీసుకోకుండా పండ్లు లేదా తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. గోరు వెచ్చని తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు కడుపులో పేరుకున్న మలినాలు అన్నింటిని వేటకి పోగొట్టి పొట్టను శుభ్రపరుస్తుంది. గ్యాస్ సమస్య నుంచి బయటపడేస్తుంది
No comments:
Post a Comment