Cyrus Poonawalla: అధికారుల కాళ్లు మొక్కాల్సి వచ్చేది : సైరస్ పూనావాలా
పుణె: సీరం సంస్థ అధినేత సైరస్ పూనావాలా ( Cyrus Poonawalla ) శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. 50 ఏళ్ల క్రితం తన కంపెనీ స్థాపన కోసం అధికారుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. బ్యూరోక్రాట్లు వేధింపులకు గురి చేసేవారన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. మోదీ సర్కార్‌లో లైసెన్సు రాజ్యం పోయిందన్నారు. పుణెలోని సీరం సంస్థ.. కోవీషీల్డ్ కోవిడ్ టీకాను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో పర్మిషన్ల కోసం అధికారులు, డ్రగ్ కంట్రోలర్ల కాళ్లు పట్టుకోవాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారడం వల్లే.. చాలా వేగంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తెచ్చే వీలైందన్నారు. లోకమాణ్య తిలక్ జాతీయ అవార్డు అందుకున్న సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల క్రితం తాను స్థాపించిన కంపెనీకి అనుమతుల కోసం చాలా శ్రమించానని, విద్యుత్తు, నీటి సరఫరా పర్మిషన్ల కోసం ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నట్లు సైరస్ పూనావాలా తెలిపారు.
No comments:
Post a Comment