Tuesday, June 30, 2020

డాక్టర్స్ డే

తెలంగాణ ప్రజలకు సహాయం


హైదరాబాద్ : 01/07/2020

వ్యాపారవేత్త మరియు ప్రసిద్ది చెందిన వ్యక్తులు శ్రీ మెగా కృష్ణ రెడ్డి గారికి మరియు మై హోమ్ రామేశ్వర్ రావు గారికి నా విన్నపం. 

కరోనా సమయంలో మీ సహకారం అవసరం. 

ప్రజా సంకల్పం 



Monday, June 29, 2020

తెలంగాణ కోవిద్ మరణాలు

హైదరాబాద్ : 30/06/2020

*ప్రాణం ఎవరికైన ఒక్కటే అది పేదవారైనా ఉన్నవారైనా!
ఒకరు ఇద్దరు చనిపోతే ఇంత బాధ్నాం చేస్తారా అని వైద్యశాఖ మంత్రి గా ఈ మాటలు అనడం బాధ్యతారాహిత్యం కాదా?
ఆ ఒక్కరు మన ఇంటి వారైతే ఆ బాదేంటో తెలుస్తుంది.

*పేషెంట్ తన బాధను వీడియోలు తీయడం తప్పు అంటున్నారు కానీ అక్కడ వాళ్ళకి సరైన వైద్య సదుపాయం అందక చనిపోయారు అన్న విషయం మాత్రం మీకు తప్పుగా అనిపించడం లేదు.*
మినిస్టర్ రాజేంద్ర గారు మీరు ఒక్కసారి వైద్యశాఖ మంత్రి గా తెరాస పార్టీ సభ్యుడిగా కాకుండా మా లాగా ఈ రాష్ట్రంలో ఒక సాధారణ పౌరుడిగా ఆ చనిపోయిన వాళ్ళ  సంబంధీకులుగా ఆలోచించండి ఎంత బాధగా ఉంటుందో !
*ప్రాణాలని కాపాడుకోవాలని తాపత్రయపడ్తున్న  ప్రతి మనిషి కోరుకునేది బంగారు తెలంగాణ కాదు కేవలం  బ్రతుకు తెలంగాణ.*

@blsanthosh @Arvindharmapuri @manthriji @bandisanjay_bjp @BJP4Telangana @MoHFW_INDIA 
@Praja_Snklpm


గ్రూప్ link మీడియా 
@GayathriBandar7  సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

covid medicine

Hyderabad :30/06/2020

GOOD NEWS FROM HYDERABAD after our dismal testing and rogue virus spread

*Vaccine against Covid-19 from India, developed in #Hyderabad, not very far.* 

Vaccine against Covid-19 developed by #Hyderabad-based Bharat Biotech - named Covaxin - has been granted permission by Drug Controller General of India to initiate Phase I & II Human clinical trials.

It is an inactivated vaccine developed and manufactured in Bharat Biotech's BSL-3 high containment facility in Genome Valley, #Hyderabad. 

@DonitaJose Reporter 
@XpressHyderabad

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

టిక్ టాక్ నిషేధం

హైదరాబాద్ : 29/06/2020

భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం

దిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల  భారత్‌-చైనా దేశాల సరిహద్దులో గల్వాన్‌ వద్ద భీకర ఘర్షణలో మన దేశానికి చెందిన 20మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.  చైనాకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని భావిస్తోన్న భారత్‌.. ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిషేధించిన చైనా యాప్‌ల జాబితా ఇదే..

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు

హైదరాబాద్ : 29/06/2020

రిజిస్ట్రేషన్ సేవలు కు అంతరాయం...తెలంగాణ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధిచిన.. సర్వర్ ను పాత సచివాలయం నుండి కొత్త సచివాలయం.. BRK bhavan కు మార్చడానికి..పనులు జరుగుట వలన రిజిస్ట్రేషన్ సేవలు...పునరుద్ధరణకు 1..2  రోజులు..పట్టవచ్చును 
ఈ రోజు మధ్యాహ్నం..2..గంటల నుండి..రాష్ట్ర వ్యాప్తముగా.. సేవలకు..అంతరాయం

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Sunday, June 28, 2020

Sad News corona -Telangana

Hyderabad : 28/06/2020

HEARTBREAKING: “Can’t breathe, they removed the ventilator. It’s been 3hrs, I asked and they said u had enough. I feel that my heart stopped beating, nothing left in me.Bye daddy,bye everyone”-last video of 35yr old man who succumbed to #COVID Family wants video shared #Hyderabad 

I had to check with family before sharing. They want the world to know what is happening in #Telangana 
Details: A 35 yr old man gets admitted at Chest Hospital, Hyderabad on #Covid suspicion on June 24. 
2days later, on Friday, hospital hands over deadbody saying he passed away

Family does cremation with 30 other people. Then they see this video. And then the #Covid test report comes saying he was positive. Not only this young man’s life was lost due to lack of facilities, his family & friends who cremated him without knowing are now at high risk. 

Let me reiterate, doctors and medical staff are doing some commendable job.  It is purely failure of the Govt and the health ministry. Denying that there was #Covid,refusing to do tests, not telling truth, now hospitals are full, staff are overworked, no resources &ppl are dying

@revathitweets Journalist 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, June 27, 2020

రాచకొండ పోలీస్

Hyderabad : 28/06/2020

#We_Are_With_You Don't Strugle in Silence.......#SpeakUP....! 
Reach us @04048214800
#Psycho_Social_Counselling_Service

@TelanganaDGP @TelanganaCOPs @TelanganaPolice @hydcitypolice @cyberabadpolice https://t.co/PysttavoXx

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Online క్లాస్సేస్ తెలంగాణ

హైదరాబాద్ : 27/06/2020

#Telangana లో #Schools ఓపెన్ చేయకుండా ఆన్ లైన్ క్లాసులంటూ, ఫీజులంటూ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం వీరబాదుడు బాదుతున్నారని తల్లితండ్రుల ఆవేదన.
దాంతో #Karimnagar, #Warangal కలెక్టర్లు ప్రైవేట్ స్కూల్స్ వారు ఆన్లైన్ క్లాసులు నిర్వహించకూడదని,ఫీజులు వసూలు చేయకూడదని ఆర్డర్స్ పాస్ చేసింది. 

గ్రూప్ link Media @TeluguBulletin సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

hyderabad CP Sir


Hyderabad city police commissioner Anjani Kumar came across a snake this morning. The snake was sent to the Zoo. https://t.co/29bjCGi8gj
https://prajasankalpam1.blogspot.com/

Thursday, June 25, 2020

What a Story !!!"

Hyderabad : 26/06/2020

*What a Story !!!!**

A teacher has set up several loudspeakers across the Bankathi village in Jharkhand. He takes classes for two hours every day since April 16, beating the odds of online learning.

@Iftikharfariha  Journalist 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Covid Samples Collectors

Hyderabad : 26/06/2020

#Exclusive : COVID sample collectors have tested positive for COVID, which is one of the other reasons why sample collections have stopped. Sarojini eye hospital camp and Dabeerpura UPHC camp medical staff are worst hit. 

*Praja Sankalpam Group & link Media Pray for the front line warriors speedy recovery*

@DonitaJose Reporter 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Covid Patient Dignity

Hyderabad : 26/06/2020

*COVID patients’ dignity*

As an Indian every patient whether he or she rich or poor deserves to be treated with dignity. The Supreme Court has held that the right to live with human dignity, enshrined in Article 21, it includes the protection of health also. 

Further, the Supreme Court has also been held that the right to health is integral to the right to life and the government has a constitutional obligation to provide health facilities. Government of the day has miserably failed to provide treatment. 

Failure of a government & private hospital to provide a patient timely medical treatment results in a violation of the patient’s right to life. Now in government hospitals, patients aren't getting bed. Who is responsible for it ??. 

Many private hospitals charging 10 times more against the cap which fixed by the state government. Maintaining and regulating the private and government health services come under the state’s obligation. 

@NaseerGiyas Journalist 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

పిల్లలు మొబైల్ గేమ్స్

హైదరాబాద్ : 25/06/2020

*Mobile games addiction**

*ఇంతలా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న గేమ్స్‌ నుంచి వారిని ఎలా తప్పించాలి?*

 HIGHLIGHTS :

కరోనా దెబ్బకు కాలేజీలు బంద్‌ స్కూళ్లు బంద్‌. హోం వర్క్ లేదు, పరీక్షలు లేవు. పిల్లలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. ...  బయటకెళ్లలేరు, వెళ్లినా తోటి వారితో ఆడుకోలేరు, అసలు ఆడుకునే వీలే లేదు. మరి టైమ్‌పాస్‌ ఎలా? ఉన్న ఏకైక మార్గం మొబైల్ గేమ్స్‌. *ఈ గేమ్స్‌కు పిల్లలు అలవాటుపడి పోయారు. ఇంకా చెప్పాలంటే పిల్లలకు ఇప్పుడదో అడిక్షన్‌. సో ఏం చేస్తున్నారు ఫోన్లు గీన్లు మానేయండని తల్లిదండ్రులు చెప్పారా ఇక అంతే. పిల్లలను పట్టడం తరం కావడం లేదంటున్న ఫిర్యాదులు ఎన్నో. ఫోన్లు ఇవ్వకున్నా కంప్యూటర్లు వద్దన్న, లాప్‌టాప్‌లు తీసుకోవద్దని వారించినా ఒంటరిగా ఉండిపోతున్నారట*. ఇంతలా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న గేమ్స్‌ నుంచి వారిని ఎలా తప్పించాలి? ఆ అడిక్షన్ నుంచి వారినెలా కాపాడుకోవాలి.!!  

*వీడియోగేమ్స్ మంచి కాలక్షేపం. మనిషికి మనిషి తోడు అవసరం లేకున్నా ఒక్క ఫోన్‌ ఉంటే చాలు ప్రపంచమంతా చేతుల్లో ఉన్నట్టే. అందుకే పిల్లలు తొందరగా అడిక్ట్‌ అయిపోతున్నారు. కానీ ఇదే డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయిప్పుడు. పిల్లల గ్రాస్పింగ్ పవర్‌ను తగ్గించడంతో పాటు లిజెనింగ్ స్కిల్స్‌పైనా ప్రభావం చూపుతున్నాయి. ఎక్సెసివ్ గేమింగ్ పిల్లల్లో ఆందోళనను, సోషల్ ఫోబియాను పెంచుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.*

గ్రూప్ link Media hmtv సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, June 24, 2020

చెరువులు & మూసీ కాలువ కబ్జాలు

హైదరాబాద్ : 25/06/2020

*చెరువుల ఆక్రమణలపై హైకోర్టు ఆగ్రహం*

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపముంది

జల వనరులు కలుషితమవుతున్నాయి

హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ఏముందో చెప్పాలి

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): చెరువులు, కుంటల ఆక్రమణలపై దాఖలైన బ్యాచ్‌ పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ప్రభుత్వ భూములు సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన శాఖల మధ్య సమన్వయలోపం వల్ల సర్కారు భూములు ఆక్రమణకు గురవుతున్నాయని వ్యాఖ్యానించింది. జలవనరులు కలుషితం కావడం, ఆక్రమణలకు గురవుతుంటే భవిష్యత్తు తరాలకు ఏం మిగులుతుందని ప్రశ్నించింది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో చెరువుల్లో చేపట్టిన నిర్మాణాలు, నీటి ప్రవాహానికి అడ్డుపడేలా చేపట్టిన నిర్మాణాలకు ఎన్ని నోటీసులు జారీచేశారు?

ఎన్నింటిని కూల్చివేశారు? తదితర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అధికారుల నిర్వాకం వల్ల కోర్టుల్లో పెండింగ్‌ కేసులు పెరుగుతున్నాయని, ఇదే తరహా కేసులు వందకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఒక్కో కేసులో ఒక్కో విధంగా అధికారులు చెబుతున్నారని ఎత్తి చూపింది. శాస్ర్తీపురం, టాటానగర్‌ కాలుష్యంపై దాఖలైన వ్యాజ్యాల్లో అవి పారిశ్రామిక వాడలని, క్రమంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరిగి కాలనీలు వెలసినట్లు అధికారులు చెప్పారు. పారిశ్రామిక వాడల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఎలా జారీచేస్తారని కోర్టు నిలదీసింది. పుప్పాలగూడ గ్రామ సర్వే నెం.345లో బ్రాహ్మణకుంట చెరువు ఉందని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతుండగా, రెవెన్యూ రికార్డుల ప్రకారం అక్కడ చెరువే లేదని రెవెన్యూ అధికారులు చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. నీటి పారుదలశాఖ, రెవెన్యూశాఖ, హెచ్‌ఎండీఏల మధ్య సమన్వయం కొరవడిందని ఆక్షేపించింది. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, వాటిని రక్షించే బాధ్యతలను ప్రభుత్వానికి సమాంతరంగా కోర్టులు స్వీకరించలేవని స్పష్టం చేసింది. అసలు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో ఏముందో చెప్పాలన్న ధర్మాసనం తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మూసీ ఆక్రమణలు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలం, సూరారంలోని కట్టమైసమ్మ చెరువు, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్‌ మండలం, పుప్పాలగూడలోని బ్రాహ్మణ చెరువు ఆక్రమణలపై దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది.

ఈ వ్యాజ్యాల్లో ప్రభుత్వం తరుపున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ... సూరారం కట్టమైసమ్మ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలు గుర్తించామని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. *ఈ దశలో కల్పించుకున్న సీజే.. 'అక్రమ నిర్మాణాలున్నాయని చెబుతున్న మీరే... చర్యలు తీసుకోడానికి ఎందుకు వెనుకాడుతున్నారు' అని ప్రశ్నించారు*. అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు మొక్కుబడిగా ఉండరాదని స్పష్టం చేశారు. *చెరువులు, కుంటలు ఆక్రమణలపై పత్రికల్లో వస్తున్న కథనాలకు, అధికారులు చెబుతున్న దానికి పొంతన కుదరడం లేదని వ్యాఖ్యానించారు.*

*ఒకప్పుడు మంచినీటి వనరుగా ఉండే మూసీ మురికి కూపంగా మారిపోయిందని చెప్పారు.మూసీనదిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నా అధికారుల్లో సరైన స్పందన లేదని, గూగుల్‌ మ్యాప్‌లు పరిశీలిస్తే మూసీ ఆక్రమణలు సులువుగా గుర్తించే అవకాశం ఉందన్నారు.**

*ప్రజా సంకల్పం మరియు అనుబంధ ప్రజా సంఘాలు ఎప్పటినుంచో చెరువులు & మూసీ కాలువ కబ్జాల మీద పోరాటం చేస్తూనే వున్నాయి అందరికి తెలిసిందే **

ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

జూనియర్ డాక్టర్స్ ఇష్యూ తెలంగాణ

హైదరాబాద్ : 25/06/2030

*గాంధీలో సమ్మెకు సిద్ధమవుతున్న జూనియర్ డాక్టర్లు*

*హైదరాబాద్*తమ డిమాండ్ల పరిష్కారానికి మంత్రి ఈటల ఇచ్చిన హామీ నెరవేరక పోతుండడంతో జూనియర్‌ వైద్యులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి ఘటనతో తమకు రక్షణ కల్పించాలంటూ మూడు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ధర్నా చేసిన జూడాలు.. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామన్న ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హామీతో తిరిగి విధుల్లో చేరారు. అయితే.. పది రోజులవుతున్నా సమస్యల పరిష్కారం దిశగా ఎలాంటి చలనం లేకపోవడంతో జూడాలు ఆలోచనలో పడ్డారు. ఈ సారి సమ్మె ఉధృతంగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఆస్పత్రిలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, ఇతర ఔట్‌సోర్సింగ్‌ విభాగాల సిబ్బందితో చర్చలు జరుపుతున్నారు.

గ్రూప్ link Media 
ప్రజల పక్షం 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Internet Scams


Hyderabad : 24/06/2020
*Be cautious of internet scams! *
#CyberSafety #BeCyberSafe

@TelanganaDGP @cyberabadpolice @TelanganaCOPs @CyberCrimeRck https://t.co/eUXIn4LoGG
Source :@RachakobdaCop

Praja sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, June 23, 2020

డేంజర్ శానిటైజర్లు

హైదరాబాద్ : 24/06/2020

*హెచ్చరిక: ఈ 9 శానిటైజర్లు అస్సలు వాడకండి*

విషపూరిత మిథనాల్ ఉందన్న యూఎస్‌ ఎఫ్‌డీఏ

ఇంటర్నెట్ డెస్క్‌: విషపూరిత రసాయనాలు ఉన్న తొమ్మిది శానిటైజర్లను ఉపయోగించొద్దని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరించింది. ఇప్పటికే మార్కెట్లకు తరలించిన ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ఎస్క్‌బయోకెమ్ సంస్థను ఆదేశించింది. ఈ సంస్థ తయారు చేసిన శానిటైజర్లలో ప్రమాదకర మిథనాల్ ఉందని ఎఫ్‌డీఏ గుర్తించింది.

మిథనాల్ ఉన్న శానిటైజర్లను ఉపయోగించడం ఆరోగ్యానికి ప్రమాదకరం. దానిని చేతులకు రాసుకున్నప్పుడు అది చర్మం దీనిని శోషించుకుంటుంది. ఫలితంగా వికారం, జలుబు, వాంతులు, తలనొప్పి, చూపు కోల్పోవడం, కోమా, వణుకు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.కొన్నిసార్లు నరాల వ్యవస్థ దెబ్బతిని మరణానికీ దారితీసే ప్రమాదం ఉంది.

ఇప్పటికే మిథనాల్ కలిసిన శానిటైజర్లు ఉపయోగించిన వారు వైద్యులను సంప్రదించాలని ఎఫ్‌డీఏ తెలిపింది. *మార్కెట్లలోని ఆల్ క్లీన్ హ్యాండ్ శానిటైజర్‌, ఎస్క్ బయోకెమ్ హ్యాండ్ శానిటైజర్, క్లీన్ కేర్ నోజెర్మ్ హ్యాండ్ శానిటైజర్, లావర్ 70 జెల్ హ్యాండ్ శానిటైజర్, ది గుడ్ జెల్ యాంటీ బ్యాక్టీరియల్ జెల్ హ్యాండ్ శానిటైజర్, క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 70% ఆల్క్‌హాల్‌, క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్‌, శాండిడెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించొద్దని వినియోగదారులకు ఎఫ్‌డీఏ సూచించింది.*

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా శానిటైజర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. చేతులకు అంటిన వైరస్‌ను నిర్మూలించాలంటే సబ్బు నీటితో కడుక్కోవడం లేదా ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో రాసుకోవడం తప్పనిసరి.

గ్రూప్ link Media ఈనాడు సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Covid-19 hakkers China

Hyderabad : 23/06/2020

*Dont Click on Unknown Links.**

#CyberCrimeAlert
@TelanganaDGP @TelanganaCOPs
@TelanganaPolice @hydcitypolice @cyberabadpolice @CyberCrimeRck 

Source : @RachakondaCop

CERT-In issued advisory on COVID 19-related Phishing Attack Campaign by Malicious Actors. More info @IndianCERT , Thanks @iamsapankumar

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు

కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం!

భారత్, చైనా సరిహద్దులో డ్రాగన్ సైనికులపై సింహంలా గర్జించిన అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్) అరుదైన గౌరవం అందజేయనుంది. భారత వీరుడు సంతోష్ బాబుకు వామ్ సంస్థ ‘భారత టైగర్’ బిరుదును ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు వామ్ గ్లోబల్ అధ్యక్షుడు రామకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ అనుమతిస్తే సొంత ఖర్చులతో సంతోష్ బాబుకు తెలంగాణలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా, లాక్‌డౌన్ పూర్తిగా తొలగిపోయిన తర్వాత తెలంగాణలోని ఓ ముఖ్య ప్రాంతంలో భారీ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించి, స్వర్ణపతకం రూపంలో ‘భారత టైగర్’ అనే బిరుదును సంతోష్ బాబు కుటుంబీకులకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. చైనా సైనికులపై వీరోచితంగా పోరాడి అమరుడైన సంతోష్ బాబుకు భారత ప్రజల తరపున ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోనున్నట్లు చెప్పారు.

గ్రూప్ link Media Tv9 సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Monday, June 22, 2020

Doctor Death in Telangana

Hyderabad : 22/06/2020

#Hyderabad based doctor succumbs to #COVID19. First doctor from #Telangana to lose life to virus. On 16th he was admitted to KIMS hospital with high fever. He was tested for #covid& when results came positive, he was shifted to Gandhi, 2days later he passed away. #TelanganaModel 

*The SHOCKING part is, the date of death is 22nd June, TODAY. TIME of death is 4:23pm. How could the staff at #GandhiHospital declare a death about today evening in the afternoon itself? Someone needs to answer the family at least. The way things are being handled is scary. **

Source : Group link Media  @revathitweets

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Covid-19 in Telangana

Hyderabad : 22/06/2020

The States that are in danger zone need to buckle up, take urgent remedial measures.

Source : @Kurmanath 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Sunday, June 21, 2020

అన్యాయం మీద పోరాటం

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణలో కరోనా బీభత్సం.. హైదరాబాద్‌లో ఆదివారం ఒక్కరోజే..

హైదరాబాద్ : 21/06/2020

తెలంగాణలో ఇవాళ 730 కొత్త కేసులు నమోదు. కరోనాతో ఇవాళ 7గురు మృతి. తెలంగాణలో మొత్తం 7,802కి చేరిన కరోనా కేసులు. యాక్టివ్ కేసులు 3,861 ఉండగా, కోలుకున్న వారు 3,731 మంది ఉన్నారు. 210కి చేరిన మొత్తం మరణాల సంఖ్య..GHMC లో ఇవాళ 659 కేసులు నమోదయ్యాయి. 
#Telangana

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, June 20, 2020

Friday, June 19, 2020

కరోనా తెలంగాణ

హైదరాబాద్ : 19/06/2020

*కరోనాపై ప్రభుత్వానికి టీఎస్‌ హైకోర్టు ఆదేశాలు*


హైదరాబాద్‌: కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర పభుత్వానికి తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని సూచించింది. వైద్యులకు పీపీఈ కిట్లు, మాస్కులు, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం మరోసారి ఇవాళ కూడా విచారణ నిర్వహించింది. దీనికి రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు హాజరయ్యారు. 
రాష్ట్రంలో 79 మంది వైద్యులకు కరోనా సోకినట్లు పబ్లిక్‌ హెల్త్ డైరెక్టర్‌ కోర్టుకు వెల్లడించారు. 
గాంధీలో ప్లాస్మా, యాంటీ  వైరల్‌ డ్రగ్స్‌ ప్రయోగాలు చేస్తున్నట్లు రాజారావు కోర్టుకు తెలిపారు.
విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి పలు ఆదేశాలు ఇచ్చింది. ఎక్కువగా కరోనా కేసులు వెలుగు చూస్తున్న జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కేసుల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. కేసుల వివరాలు ఆయా కాలనీ సంఘాలకు ఇవ్వాలని సూచించింది. ర్యాపిడ్‌ యాంటీజెంట్‌ టెస్ట్‌ నిర్వహించాలంటూ ఐసీఎంఆర్‌ చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 54 ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్న విషయాన్ని ప్రచారం చేయాలంది. సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో ప్రభుత్వం వివరించాలని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితో పాటు పోలీసులకు కూడా రక్షణ కిట్లు ఇవ్వాలని సూచించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిబ్బందికి షిఫ్ట్‌ల విధానం అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించింది. ఈ నెల 29లోగా నివేదిక సమర్పించాలని సూచించింది.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Thursday, June 18, 2020

తెలంగాణ ఆశ ఉద్యోగులు

హైదరాబాద్ : 19/06/2020

*ఆదరించండి.. అవమానించకండి.*

కష్టకాలంలో కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నాం
సమావేశంలో కంటతడి పెట్టిన ఆశ కార్యకర్తలు

ఎల్లారెడ్డిపేట: ‘నేను ఆశ కార్యకర్తను.. సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందుగా అప్రమత్తం చేసే సామాజిక కార్యకర్తను.. ఇంటింటికీ తిరిగి మందులిచ్చి, అన్నీ కనిపెట్టుకొని పనిచేసే సంరక్షకురాలిని. కరో నా కష్టకాలంలోనూ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాం. సమాజం కోసం పాటుపడుతున్న మమల్ని ఆదరించండి.. అవమాననించకండి’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన ఆశ కార్యకర్త గోవర్ధన గీత కన్నీటి పర్యంతమైంది. కుటుంబాలకు దూరంగా ఉంటూ పనిచేస్తుంటే అర్థం చేసుకోకపోగా ఊళ్లోని ప్రజలు ద్వేషిస్తున్నారని, అమర్యాదగా మాట్లాడుతున్నారంటూ’ గురువారం ఎల్లారెడ్డిపేటలో జరిగిన ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తల సమావేశంలో ఆమె గోడువెళ్లబోసుకోగా అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ ఇంటర్మీడియట్ లో అగ్రగామి

హైదరాబాద్ : 19/06/2020

*ఇడ్లీల విక్రేత కుమార్తె ఇంటర్‌లో టాపర్‌*

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: *పట్టుదల ఉంటే చదువులో రాణించేందుకు పేదరికం అడ్డంకి కాదని మరోసారి నిరూపించింది ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన విద్యార్థిని కల్యాణి.*  ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి అగ్రగామిగా నిలిచింది. తల్లిదండ్రులు ఇంటి వద్ద ఇడ్లీలు తయారు చేసి ఇంటింటా తిరిగి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్థానిక ద్వారకానగర్‌ నివాసి కాటే శేషగిరి-అనిత దంపతుల చిన్నకూతురు కల్యాణి. ‘మేధా ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ పరీక్షలో టాపర్‌గా నిలిచింది. ఆ ట్రస్ట్‌ ఆధ్వర్యాన హైదరాబాద్‌ శ్రీచైతన్య కళాశాలలో చేరి ఎంపీసీ చదివింది. 992 మార్కులు సాధించింది. ఐఐటీ మెయిన్స్‌లోనూ 97 మార్కులు పొందింది.

*మంచి సంకల్పం తో, పట్టుదలతో కష్టపడి ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో అగ్రగ్రామిగా నిలిచినందుకు ప్రజా సంకల్పం  గ్రూప్ తరపున అభినందనలు తెలుపుతున్నాను 👍*

గ్రూప్ link Media 
ఈనాడు సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

జవాన్లకు నివాళులు

హైదరాబాద్ : 19/06/2020

*కొన్ని వివరించాలంటే అక్షరాలు సరిపోవు... **

Sometimes words can’t amount to describe precious things..

(Tamilnadu—An Indian Paying respects to Col B Santhosh Babu, Havildar Palani and Sepoy Ojha) 
#HumanityFirst 
 @MPsantoshtrs @TelanganaDGP @RachakondaCop @cyberabadpolice 
@Praja_Snklpm 

Source : Group link Media 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Telangana IPS Officer's Promotion

https://prajasankalpam1.blogspot.com/

జవాన్ స్పందన

హైదరాబాద్ : 18/06/2020

కేవలం ఒక్క మనిషే నిల్చునేంత చిన్న స్థలంలో చైనాతో మన సైనికులు పోరాడారా? సంచలన విషయాలు చెప్పిన జవాన్

న్యూఢిల్లీ : కేవలం ఒకే ఒక్క మనిషి నిలబడేటంత సన్నని ఒడ్డుపై చైనా, భారత జవాన్లకు మధ్య ఘర్షణ జరిగిందా? ఎముకలు గడ్డకట్టేంత చిన్న కాలువలో చైనా జవాన్లకు మన భారత జవాన్లు దీటైన సమాధానం చెప్పారా? అసలు గాల్వాన్‌లో ఏం జరిగిందో అందులో పాల్గొన్న సురేంద్ర సింగ్ అనే జవాన్ ఓ ఛానల్‌తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే...

‘‘చైనా సైనికులు మనకు ధోకా ఇచ్చారు. ఉన్నట్లుండి హఠాత్తుగా మనపై దాడికి దిగారు. 4 నుంచి 5 గంటల వరకూ నదిలోనే వారితో ఘర్షణ జరిగింది. మన సైనికులు 200 నుంచి 250 మంది ఉన్నారు. చైనా వాళ్లు 1,000 కంటే ఎక్కువ మందే ఉన్నారు. ఈ ఘర్షణ మొత్తం కూడా ఎముకలు గడ్డ కట్టిపోయే, గొంతు కోసే చల్లని నీటిలోనే సాగింది. నది ఒడ్డున కేవలం ఒక్క మనిషి మాత్రమే నిలబడేంత చోటు మాత్రమే ఉంది. అంత చిన్న స్థలంలో వారితో పోరాడాం. అందుకే పో్రాటంలో చాలా ఇబ్బందులు పడ్డాం. లేకపోతే భారత సైనికులు ఎందులో తక్కువ? మేం చైనా వాళ్లకు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగానే ఉన్నాం. కానీ మాపై కుట్రతో, మోసపూరితంగా దాడికి దిగారు.’’ అని గాల్వాన్‌లో జరిగిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు సురేంద్ర సింగ్ వెల్లడించారు. 

సురేంద్ర సింగ్.... గాల్వాన్‌లో భారత్ - చైనాకు మధ్య జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. తీవ్రంగా గాయపడ్డారు. తలలో డజనుకు పైగా కుట్లు వేశారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన ప్రకటించారు.  లడఖ్‌లోని సైనిక ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈయన స్వస్థలం రాజస్థాన్. 

గ్రూప్ link Media 
ABN ఆంధ్రజ్యోతి సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు

హైదరాబాద్ : 18/06/2020

#intermediate మొదటి రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలను ఈ రోజు #Telangana ఇంటర్మీడియేట్ విద్యా బోర్డు ప్రకటించింది. విద్యా మంత్రి @SabithaindraTRS లాంఛనంగా ఈ ఫలితాలను వెల్లడించారు. అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, June 17, 2020

తెలంగాణ ఎలక్ట్రిసిటీ

https://electricitybillcalculator.online/

అందరికి నమస్కారం 🙏.దయచేసి మీ మీ ఎలక్ట్రిసిటీ బిల్లుల యూనిట్స్ ఆదారంగా Amount వివరాలు తెలుసుకోవచ్చు. 

Praja Sankalpam 
18/06/2020.

పర్యావరణ జైలు

హైదరాబాద్ : 18/06/2020


వరంగల్ :   దేశంలోనే తొలి, అతిపెద్ద ‘కేంద్ర కారాగార నర్సరీ’గా వరంగల్‌ సెంట్రల్‌ జైలు రికార్డు సృష్టించింది.

8 ఎకరాల్లో 14 లక్షల మొక్కలు..
ఖైదీలే తోటమాలులు..

 60 రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కల పెంపకం..
రోజూ పనులకు 50మంది కేటాయింపు
@KTRTRS @MPsantoshtrs @RaoKavitha @DayakarRao2019 
@Praja_Snklpm

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, June 16, 2020

Jai Jawan

Hyderabad : 17/06/2020

Maj Gen (Dr)GD Bakshi SM, VSM (retd)

What the hell is Going  on? we lost 1 col and 20 men not  3. What the hell have we given them weapons and ammunition for? Why are  we spending 71 billion $ a year on defense if we just have to fight with sticks and stones?

Praja Sankalam 

https://prajasankalpam1.blogspot.com/

Monday, June 15, 2020

మంత్రి గారి విజ్ఞప్తి

హైదరాబాద్ : 16/06/2020

*ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు చేసిన విజ్ఞప్తి **

కరోన విజృంభిస్తున్న ఈ సమయంలో మిత్రులు, నాయకులు, కార్యకర్తలు, ప్రత్యక్షంగా రాకుండా ఫోన్ లో కాని వాట్సాప్ లో కాని సంప్రదించవలసిందిగా వినతి...

*మాస్కులు దరిద్దాం... భౌతిక దూరం పాటిద్దాం... మనల్ని మనం కాపాడుకుందాం.*

#StayHome #StaySafe 

దయచేసి అందరు కూడా ఆరోగ్యపరమైన జాగ్రతలు తీసుకోవాలని *ప్రజా సంకల్పం ** గ్రూప్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను 🙏. 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ పోలీస్

#"నీ నేస్తం"అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో  ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది.  ప్రస్తుత సమయంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యపిస్తునందున ప్రజలు ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి ఫిర్యాదులు ఉన్న ఒక కాగితంపై రాసి ఆ ఊర్లో లోని ఫిర్యాదుల బాక్స్ లో వేయాలని నారాయణపేట ఎస్పీ డాక్టర్ చేతన IPS మేడం గారు తెలిపారు. https://t.co/MAtRvJo0RM

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Sunday, June 14, 2020

కరోనా - తెలంగాణ

Hyderabad : 15/06/2020

One more politician tests positive in #Telanagana. Getting treated at a private hospital. NOT #GandhiHospital. NOT the brand new TISS opened for #Covid. People of Telangana, please don’t forget where your leaders are going for treatment. #PrivateForVIPs 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, June 13, 2020

కోవిద్-19 లక్షణాలు

హైదరాబాద్ : 14/06/2020

COVID-19 కొత్త లక్షణాలు బయటపెట్టిన ఆరోగ్య శాఖ. 

కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ శనివారం మేజర్ అప్‌డేట్ ఇచ్చింది. COVID-19కు మరో 2 ప్రధాన లక్షణాలను వెల్లడించింది. ముందుగా సూచించిన 6లక్షణాలే కాకుండా ఇవి ఉన్నా కరోనాగా అనుమానించవచ్చని నిర్ధారించింది. చాలా కేసుల్లో శ్వాస సంబంధిత సమస్యలే వస్తాయని ఈ లక్షణాలు తక్కువ కనిపిస్తాయని పేర్కొంది.

ఇతర లక్షణాలు:
> జ్వరం
> దగ్గు
> నీరసం
> శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
> కఫ్ఫం ఎక్కువగా రావడం
> ముక్కు కారుతుండటం
> విరేచనాలు

*వీటితో పాటుగా అనోస్మియా, అగేసియా వాసన, రుచి తెలియకపోవడం వంటివి కూడా అదే లిస్టులో చేర్చింది ఆరోగ్య శాఖ.*

Source : 10tv న్యూస్ 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

భారీ వర్షాలు

హైదరాబాద్ : 13/06/2020

*తెలంగాణ సహా 3 రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్.. రెడ్ అలెర్ట్ జారీ**

వర్షాలు ప్రారంభం అయ్యాయి... కొన్ని ప్రాంతాల్లో వానలు దంచి కొడుతున్నాయి.. ఇదే సమయంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వార్నింగ్ ఇచ్చింది.. మూడు రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ జారీచేసిన భారత వాతావరణ విభాగం.. మరో నాలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చెపింది.. తెలంగాణ, కర్ణాటక, గోవాలో రానున్న 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ విభాగం... ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్, ఒడిశా, మేఘాలయాల రాష్ట్రాలకు కూడా వర్ష సూచన ఉందని చెప్పింది. బంగాళాఖాతంలోని పశ్చిమ-మధ్య మరియు వాయువ్య ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనము రాబోయే కొద్ది రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ మరియు ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

జూన్ 13 నుండి 16 వరకు రాజస్థాన్‌లో వేడి తరంగాల పరిస్థితులతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది అంటోంది ఐఎండీ.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

మాస్కులు జాగ్రతలు

హైదరాబాద్ : 13/06/2020

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.. రేపటి నుండి మాస్క్ పెట్టుకోక పోతే గ్రామాలలో అయితే రు.500 పట్టణాల్లో అయితే రు.1000 ఫైన్ విధించమని చలానా పుస్తకాలు కూడా పోలీసు వారి వద్దకు వచ్చి ఉన్నవి.  కావున బయటికి వెళ్ళేటప్పుడు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించండి.
#CoronavirusIndia 

*తెలంగాణ లో కూడా  మాస్కుల విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకోకుంటే ప్రజలకు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది **

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణలో కరోనా

హైదరాబాద్ : 13/06/2020

#Telangana లో తొలి వెయ్యి #coronavirus కేసులు నమోదు కావడానికి 55 రోజులు పడితే, గత ఆరు రోజుల్లోనే 1030 కేసులు నమోదయ్యాయి. వైరస్ ఉధృతి చూస్తుంటే మున్ముందు రోజుకు 1,000 చొప్పున కేసులు వచ్చే ఆస్కారం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Friday, June 12, 2020

మహిళా శక్తి

Hyderabad  : 13/06/2020

She is even more powerful than men,.
She has every right as a Citizen of India, as men have.
*A general disrespect towards women is the main cause of crime against women, which justifies to negate & belittle her mere presence as a woman.
#RespectWomen #SheCan #BeTheChange #CantWe 

Source : Telangana Police 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Thursday, June 11, 2020

తెలంగాణ విద్యుత్ బిల్లులు

హైదరాబాద్ : 12/06/2020

*Draft press release*

కరోనా మహమ్మారి విజృంభణ మరియు ప్రభుత్వ లాక్ డౌన్ ఆదేశాలననుసరించి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ తమ విద్యుత్ వినియోగదారుల ఏప్రిల్, మే నెలలలో విద్యుత్ వినియోగ రీడింగ్ నమోదు చేయలేదు. ప్రస్తుతమున్న లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపుల నేపథ్యంలో జూన్ నెలలో రీడింగ్ నమోదు చేసి బిల్లులు జారీ చేయడం  జరిగింది. జూన్ లో జారీ చేసిన బిల్లు మార్చ్, ఏప్రిల్ మరియు మే నెలల విద్యుత్ వాడకం బిల్లు. ఈ బిల్లులో నమోదైన వాడకాన్ని (యూనిట్లను) మూడు సమాన భాగాలుగా విభజించి, తగు కేటగిరి ప్రకారం లెక్కించి బిల్లులు జారీచేయడం జరిగింది. 
గత ఏడాది 2019 మార్చ్, ఏప్రిల్ నెలల్లోని వాడకం బిల్లును ఆధారం చేసుకుని ఏప్రిల్, 2020 , మే 2020 నెలల్లో SMS, ఆన్లైన్ ద్వారా తాత్కాలిక (Provisional) బిల్లులు పంపడం జరిగింది. లాక్ డౌన్ వలన బిల్లులు జారీచేయలేక పోతున్నామని తమకు పంపిన తాత్కాలిక (Provisional) బిల్లులు చెల్లించాల్సిందిగా పత్రికల, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా  వినియోగదారులను కోరడం జరిగింది. ప్రస్తుతం జారీచేసిన బిల్లులో ఏప్రిల్, మే నెలలలో ఏ వినియోగదారులైతే చెల్లించారో, వారు కట్టిన అమౌంట్ ని బిల్లులో తగ్గించి సర్దుబాటు చేయడం జరిగింది.
మూడు నెలలకు సంబంధించి ఒకే సారి రీడింగ్ తీయడం వల్ల బిల్లులు అధికంగా వచ్చాయని కొంత మంది విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందుతున్న విషయం సంస్థ దృష్టికి వచ్చింది. బిల్లులపై వినియోగదారులకు గల సందేహాలను నివృత్తి చేసి, వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు గాను సంస్థ పరిధిలోని అన్ని విద్యుత్ రెవిన్యూ కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తోడు వినియోగదారులు క్రింద పేర్కొన్న సామజిక మాధ్యమాల ద్వారా తమ బిల్లుకు సంబంధించిన సమస్యలను సంస్థకు పంపగలరని చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జి రఘుమా రెడ్డి తెలిపారు.
1.  customerservice@tssouthernpower.com 
2. TsspdclCorporat@twitter; 
3. gmcsc.tsspdcl @facebook.com 
e-మెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా అందుకున్న ఫిర్యాదులను 2 పని దినములలో పరిష్కరించి  బిల్లింగ్ వర్క్ షీట్ ద్వారా వినియోగదారునికి జవాబు పంపాలని క్షేత్ర స్థాయి అధికారులకు  ఆదేశాలు జారీ చేసినట్టు  సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి తెలిపారు.

విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ వాడకం బిల్లులపై ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నయెడల తమ బిల్ పైభాగం లో ముద్రించిన ఎలక్ట్రిసిటీ రెవిన్యూ ఆఫీస్ (ERO) ను సంప్రదించి గాని (లేదా) పైన పేర్కొన్న సంస్థ ఇమెయిల్/ ట్విట్టర్/ పేస్ బుక్ కు పంపి తమ సమస్య ను పరిష్కరించుకోగలరు. సంస్థ మనుగడ వినియోగదారులు చెల్లించే బిల్లులపై ఆధారపడి ఉంటుంది గనుక సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సంస్థ అభివృద్ధికి తోడ్పడగలరని సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి  కోరారు.

గ్రూప్ link Media *సమాచార హక్కు సమితి **

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

School Fee in Telangana

Hyderabad : 11/06/2020

#Kalvakuntla Taraka Rama Rao - KTR
Telangana CMO
Every school decided to Collect full fees for Academic Year 2020-21 and they will provide Online classes..apart from this additional expenses of internet data pack and also buying of new gadgets (PC/Laptop/Tab/Speaker/Headphones etc as giving mobile to our kids is no solution for longer run)...With this system and procedure they will make big amount and there recurring expenditure will be reduced to 60% with saving Electricity Bill, monthly overhead expenses and other expenses. 

We parents have burden of paying fees buying news gadgets and accessories and also paying for internet data pack during this pandemic situation and none of the schools have decided to reduce the fees.

Screen Time is another challenge for all the parents as school are taking full classes which expose every kid for 7/8 hours a day 

Role of School has reduced by 50% because of this online education both CW School work (including corrections )...Home work and Revision has now become a part of Parents Supervision and responsibilities ..Also this year most extracurricular activities like picnic competitions field trip Parents Annual Day function Sports Function won't be done 

As per the current situation of Covid-19 in telangana, none of the school will start functioning till September or May be Further and we parents are in pain to pay the school fees forcely.

I request telangana Education Minister  to look into the issue at earliest and give your Valuable opinion on School Fees

As lots of them are running short of Cash hardly middle class people able to manage their home with hard earned savings.

I request everyone to give your opinion what school Management has to do, how they should take forward the classes, how much fees to be charged for Online classes, what support you seek from Government so that we overcome this situation.

We are not against paying fees but we request the Government,telangana  Education Minister, School Management, School Trustee to reduce the fees to 50% and support everyone at this pandemic situation.

(Sathya Prasad AISF)

Note:
Please circulate this message to all parents whose kids are studying in any school.

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, June 10, 2020

తెలంగాణ లో డాక్టర్స్ బాధలు

Hyderabad : 11/06/2020

*4 crore people, 1 Hospital , Understaffed and lack of security.** This is what our Telangana Govt did and we know the result. Give proper security and equipment to fronline heros. 

Praja Sankalpam

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ డీజీపీ సూచనలు

హైదరాబాద్  : 10/06/2020

*కరోనా వ్యాప్తిచెందకుండా పోలీస్ శాఖలో ముందస్తు జాగ్రతలు **

రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది తెలంగాణలో. 
కేసుల సంఖ్య పెరుగుతుంది. 
దీంతో పోలీస్ శాఖలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రతలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా పోలీస్ శాఖలో అనారోగ్యంగా ఉన్న సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. 
ఈ విషయం పై సీపీ లు, ఎస్పీ లకు ఉత్తర్వులు జారీ చేసారు. 
పోలీస్ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు వుంటే క్వారంటైన్ లో ఉండాలని డీజీపీ సూచించారు. ఇతరులకు వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని ఆదేశించారు. 

గ్రూప్ link Media *ప్రజల పక్షం ** సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, June 9, 2020

తెలంగాణ 10th పరీక్షలు

హైదరాబాద్ : 10/06/2020

*10-12 రోజుల్లో పదవ తరగతి ఫలితాలు*

ఎస్‌ఎస్‌సీ బోర్డు కసరత్తు
పరీక్షల రద్దును కోర్టుకు తెలపడంపై ఏజీతో స్పెషల్‌ సీఎస్‌ భేటీ

ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా టెన్త్‌ విద్యార్థులను పాస్‌ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఫలితాల వెల్లడిపై ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టి పెట్టింది. తమ వద్ద ఉన్న విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కులను ప్రాసె స్‌ చేసే ప్రక్రియను 10-12 రోజుల్లో పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ఫలితాలను వెల్లడించేందుకు అవసరమైన ఉత్తర్వుల జారీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉత్తర్వు ల్లో ఉండాల్సిన మార్గదర్శకాలపై చర్చించింది.
మంగళవారం రాత్రి లేదా బుధవారం ఇవి వెలువడే అవకాశం ఉంది. వాటితోపాటు కోర్టులోనూ కేసు ఉన్నందున కోర్టుకు తెలియజేయాల్సిన అంశాలపైనా అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)తో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్‌ చర్చించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్‌ఎంసీలోని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పగా ప్రభుత్వం పరీక్షలనే రద్దు చేసింది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేయాలని అధికారులు నిర్ణయించారు.
పారదర్శకంగానే ఫలితాలు: 
పదో తరగతి ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి శేఖర్‌రావు, మధుసూదన్‌ తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలోనే ఫలితాలను ప్రకటిస్తామన్నారు. విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కులను స్కూళ్ల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో పంపినందున ఆ మార్కులను ఎవరూ మార్చే ప్రయత్నం చేయడం సాధ్యం కాదన్నారు. ఆన్‌లైన్‌లో అందిన మార్కులకు సైబర్‌ భద్రత ఉందని, తద్వారా ఫలితాల్లో పారదర్శకత ఉంటుందన్నారు. విద్యార్థులకు ఇంటర్నల్స్‌లో వచ్చిన వాస్తవ మార్కుల ఆధారంగా నే ఫలితాలు ఉంటాయని ఆమె వివరించారు.

గ్రూప్ link Media *ప్రజల పక్షం* సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

కరోనా జాగ్రతలు

హైదరాబాద్  : 09/06/2020

మతం మనిషికి అవసరం లేదు.అవసరం లేని వాటికి ప్రాధాన్యత ఇచ్చే మనుషులు ఉంటే ఎంత ? పోతే ఎంత ? గుడి..మసీదు..చర్చిలను తెరవకండి🙏. 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

మాస్కుల విషయంలో ప్రజలు

Hyderabad  : 09/06/2020

#WhereAreWeGoing
Our Ignorance may cost' Unbearable.
*42,999 #NoMask Cases been registered under 51(b) of NDM-Act across #Telangana,10,441 @ #JustHyderabad.
Are Hyderabadis specially immuned against #Covid19?- #JustAsking
#WearMask #PhysicalDistance #WashYourHands 

*తెలంగాణ స్టేట్ పోలీస్ సౌజన్యంతో **

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ లో ప్రభుత్వభూములు గోల్మాల్

హైదరాబాద్ : 09/06/2020

అక్రమార్కులకు లోపాయికారిగా.. అధికారుల సహకారం
   
జిల్లా రెవెన్యూలో సంరక్షణకులే భక్షకులుగా మారారా..? విలువైన  ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన వారే అన్యాక్రాంతం కావడానికి కారణమవుతున్నారా.. అంటే..?  అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భూ వివాదాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, దస్ర్తాలను రెవెన్యూ అధికారులే మాయం చేస్తున్నారు. ఆఫీసుల్లో ఉండాల్సిన ఫైళ్లు, డాక్యుమెంట్లు అధికారుల ఇండ్లల్లో దర్శనమిస్తున్నాయి. రిజిస్టర్లు మెయింటెయిన్‌ చేయకుండా అధికారులు మారినప్పుడల్లా పెద్ద డ్రామానే నడుస్తున్నది. ఏసీబీ దాడులు జరిగిన ప్రతీ సారి కీలక ఫైళ్లుఇండ్లలో దొరికినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇందుకు షేక్‌పేట తహసీల్దార్‌ చింతల సుజాత ఇంట్లో దొరికిన కీలక పత్రాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి వారిని కట్టడి చేస్తారా.. వత్తాసు పలుకుతారా.? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్  : అవినీతి ఆరోపణల నేపథ్యంలో షేక్‌పేట తహసీల్దార్‌ చింతల సుజాత ఇంట్లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో షేక్‌పేట మండలంలోని కీలక భూవివాదాలు, ప్రభుత్వ స్థలాలు, ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెం ట్లు, దస్ర్తాలు దొరకడం గమనార్హం. ఇవన్నీ ఆమె ఇంట్లో ఎందుకున్నాయన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. అధికారిక ఫైళ్లు, దస్ర్తాలేవైనా ఉంటే కార్యాలయాల్లో మాత్రమే ఉండాలి. ఇంట్లో ఉండటానికి వీలులేదు. కాని కీలక దస్ర్తాలను, ఫైళ్లను మాయంచేసి, భూ వివాదాల్లో సెటిల్‌మెంట్లు చేసుకుని పెద్ద మొత్తంలో లంచాలు పుచ్చుకుని ప్రైవేటు వ్యక్తులకు లోపాయికారిగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కీలక ఆధారాలను మాయం చేస్తున్నట్లు తెలుస్తున్నది. విధులు నిర్వహించిన కాలంలో కానీ లేదంటే బదిలీ అయిన తర్వాత ఏమైన విచారణలు ఎదుర్కొంటే దొరికిపోతానేమోనన్న జాగ్రత్తల్లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తున్నది.

అంతులేని అలసత్వం..
జిల్లా రెవెన్యూలో భూ వివాదాల పరిష్కారం అటకెక్కుతున్నది. విలువైన ప్రభుత్వ భూములను కాపాడే అంశం క్రమంగా మరుగునపడుతున్నది. రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగా విలువైన స్థలాలు చేజారుతున్నాయి. ఇందుకు కోర్టుల్లో దాఖలు చేసే కౌంటర్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జిల్లాలో మొత్తంగా 1733 కేసులుంటే, ఇప్పటి వరకు 992 వివాదాల్లో కౌంటర్లు దాఖలు చేయకపోవడం గమనార్హం. రాజధాని నగరం కావడం, ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉండటంతో ఇక్కడే ఎక్కువగా భూ వివాదాలు, భూ సంబంధ కేసులు ఉన్నట్లుగా ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడున్న సమాచారం మేరకు జిల్లాలో 1733 కేసులు పలు కోర్టుల్లో నడుస్తున్నాయి. వీటిలో 646 కేసుల్లో కౌంటర్లు దాఖలు కాగా, 992 కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయలేదు. వాస్తవికంగా బాధ్యత గల రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, త్వరితగతిన కౌంటర్లు దాఖలుచేసి ఆయా స్థలాలను ప్రభుత్వపరం చేసేందుకు ప్రయత్నించాలి. కాని వీటిని కోర్టుల్లో ఎదుర్కొనే దిశగా అధికారులు అడుగులు వేయడం లేదు. ఈ తంతు వెనుక పెద్ద దందాయే నడుస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.  

పర్సనల్‌ రిజిస్టర్‌లు ఏవి?
జిల్లా రెవెన్యూలో ఫైళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా కొనసాగుతున్నది. రికార్డులు, ఫైళ్ల నిర్వహణ అటకెక్కింది. ఏ ఉద్యోగి వద్ద ఎన్ని ఫైళ్లు ఉన్నాయి. కోర్టు కేసులు ఎన్ని, భూవివాదాలకు సంబంధించినవి ఎన్ని అనేది రికార్డు చేసేందుకు ప్రతీ సెక్షన్‌ అసిస్టెంట్‌ పర్సలన్‌ రిజిస్టర్లు నిర్వహించాలి. కాని ఇలా జరుగడం లేదు. సంబంధిత ఉద్యోగి బదిలీ అయితే ఛార్జీలిస్ట్‌ను రూపొందించి ఆయా ఫైళ్లను మరో ఉద్యోగికి అప్పగించి వెళ్లాలి. ఇలాంటి వ్యవహారాలు జిల్లాలో జరుగడం లేదు. అధికారిక ఫైళ్లు, ఆఫీసుకు సంబంధించినవి ఇంటికి పట్టుకెళ్లడానికి వీలులేదు. ఏసీబీ, విజిలెన్స్‌ దాడులు జరిగినప్పుడు కీలక పత్రాలు దొరికినట్లుగా తెలుస్తున్నా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టిసారించడంలేదు. దీంతో ప్రభుత్వ స్థలాలు క్రమంగా తరిగిపోతున్నాయి. 

గ్రూప్ link Media నమస్తే తెలంగాణ సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Sunday, June 7, 2020

#India Fights Corona 07/06/2020

పదవతరగతి పరీక్షలు తెలంగాణా లో

హైదరాబాద్ : 07/06/2020
10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి సీఎం శ్రీ కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి, అధికారులు పాల్గొంటారు.
https://prajasankalpam1.blogspot.com/

Saturday, June 6, 2020

తెలంగాణ 10th పరీక్షలు

Hyderabad : 06/06/2020

*SSC exams postponed across Telangana*

Earlier in the day, the High Court has directed the government to conduct the Class X exams except in the Greater Hyderabad Municipal Corporation limits from June 8.
   
SSC exams postponed across Telangana
Hyderabad: Chief Minister K Chandrashekhar Rao on Saturday has taken a decision to postpone the remaining SSC Public Exams across the State

Earlier in the day, the High Court has directed the government to conduct the Class X exams except in the Greater Hyderabad Municipal Corporation limits from June 8.

Also read
SSC exams as per schedule, except in GHMC areas: Telangana HC
According to the sources, the Chief Minister was of the view that it would lead to a lot of confusion if exams were not simultaneously held across the State.


https://prajasankalpam1.blogspot.com/

ACB Trap in Hyderabad

హైదరాబాద్ : 06/06/2020

*ACB అప్డేడేట్స్........*

షేక్పేట్ మండల ఆఫీస్ లో తన భూమి హద్దులు చూపించాలని దరఖాస్తు పెట్టుకున్నా బాధితుడు..

ఇదే విషయంపై కోర్టులో కేసు నడుస్తుంది..

బాధితుడు ల్యాండ్ పైకి వెళ్లడంతో షేక్ పెట్ తాసిల్దార్ ఏప్రిల్ నెలలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

తాసిల్దార్ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు..

షేక్పేట్ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి.. బాధితుని వద్ద నీకు ఫేవర్ గా చేయడానికి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్..

ఈరోజు 15 లక్షలు రూపాయలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు..

ఇదే కేసు విషయంలో బంజారాహిల్స్ లో పనిచేస్తున్న రవీందర్ నాయక్ బాధితుని మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసి లక్ష 50 వేల రూపాయలను తీసుకున్నాడు..

మళ్లీ కేసు నుండి నిన్ను తప్పించాలి అంటే మరో మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని బాధితుని డిమాండ్ చేసిన ఎస్సై రవీందర్ నాయక్..

దీంతో ఎస్సై రవీందర్ నాయక్ పై కూడా కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Friday, June 5, 2020

తెలంగాణ పదవ తరగతి పరీక్షలు

హైదరాబాద్ : 06/06/2020

*పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర హై కోర్ట్ ఈ రోజు తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది*. 

పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయ మూర్తి  జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
#Telangana

ప్రజా సంకల్పం 
https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ గవర్నర్ మేడం గారు పర్యావరణ దినోత్సవం సందర్బంగా

Corona Tests in Telangana & Andhrapradesh

Hyderabad : 05/05/2020

#AndhraPradesh crosses a remarkable milestone of FOUR LAKH tests. Phenomenal! Comparison between both states
#AP: 4,13,773 tests
Daily about 9k
Contact tracing per positive: 54

#Telanagana: 23,300 tests
Daily about 200
Contact tracing/ positive: 12

Group link Media 
@revathitweets 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Thursday, June 4, 2020

list of Cantonments Zones in Hyderabad

Hyderabad : 05/06/2020

Here is the list of containment zones in GHMC till today. Since Govt seems pretty relaxed, it is better if we start being more careful. Try avoiding these places and if you live there - take utmost care. 

Let your friends and families know if they live or move around in these areas. Don’t be casual about it. According to this news report CCMB found a new #Covid strain in samples taken here. Stay safe!. 

Source : Group link Media @revathitweets 

Praja Sankalpam 
Group @admin  bplkmCS 
Bapatla Krishnamohan 
05/06/2020

https://prajasankalpam1.blogspot.com/

రైతు గొప్పదనం

Life!!!
A cradle on yoke 

*ఏమి మాట్లాడాలో అర్ధం కావట్లేదు!!!**

బంగారు తండ్రి ... నువ్వు ఆనందంగా ఉండాలి.
*ఈ దేశం నీకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా*, 
మీ తాత ఆయనకు కుదిరింది చేస్తున్నాడు.

One of the best photos.
@sakshinews plz convey Praja Sankalpam Group regards to the photographer. 

గ్రూప్ link సాక్షి మీడియా సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
04/06/2020

https://prajasankalpam1.blogspot.com/