Saturday, August 14, 2021

ఆఫ్గన్ ప్రజలపై యుద్ధాన్ని సహించలేను-దేశాన్ని కాపాడుకుంటాం : అష్రఫ్ ఘనీ

హైదరాబాద్ : 14/08/2021

ఆఫ్గన్ ప్రజలపై యుద్ధాన్ని సహించలేను-దేశాన్ని కాపాడుకుంటాం : అష్రఫ్ ఘనీ

MyIndMedia ట్విట్టర్ సౌజన్యంతో 

అటు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు క్రమంగా అదుపుతప్పుతున్నాయి.

దేశం పూర్తిగా తాలిబన్ల చేతిల్లోకి వెళ్లబోతుందని గ్రహించిన ప్రభుత్వం… వారితో రాజీకి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. తాలిబన్లతో కాల్పుల విరమణ కోసం యత్నిస్తోందని కథనాలు వస్తున్నాయి.అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేస్తాడని…కుటుంబంతో దేశం విడిచి వెళ్తాడనే వార్తల నేపథ్యంలో అందుకు భిన్నంగా ఆయన ఇవాళ దేశప్రజలనుద్దేశించి మాట్లాడారు.
దేశంలో పరిస్థితి అస్థిరంగానే ఉన్నదని అంగీకరిస్తూనే..పరిస్థితిని అదుపులోనికి తెస్తామన్నారు. అందుకోసం అంతర్జాతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. భద్రతాబలగాల్ని సమాయత్తం చేయడంపైనే పూర్తి దృష్టి సారించామని ఘనీ అన్నారు. ఆఫ్గన్ ప్రజలపై యుద్ధాన్ని సహించలేనని..శాంతిస్థాపనకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామనీ అన్నారు.

అటు అఫ్గానిస్థాన్‌లో పలు కీలక నగరాల్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు మెల్లమెల్లగా దేశరాజధాని కాబుల్‌ వైపు వస్తున్నారు.దేశంలోని రెండో పెద్ద పట్టణం కాందహార్ తాలిబన్ల వశమైంది. కాబూల్లోని విదేశీ కార్యాలయాలను మూసివేశారు. అక్కడి సిబ్బందిని ఆయా దేశాలకు తరలిస్తున్నారు. ఆఫ్గనిస్తాన్లో ఈ పరిణామాలపై అమెరికా సహా ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


No comments:

Post a Comment