Friday, December 31, 2021

తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులు

https://youtu.be/tbRQixwUtDE...ఈ వీడియో అందరు చూడాలి.

తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు & మేడ్చల్ జిల్లా కలెక్టర్ సర్ గారు తక్షణమే చెరువుల ఆక్రమణల మీద విచారణ చేయించి నిర్లక్ష్యం వహించిన అధికారులు(GHMC & ఇరిగేషన్ & HMDA & రెవిన్యూ) మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులు..... Bplkm 
Copy to Group link Media  30/12/2021   prajasankalpam1.blogspot.com

https://twitter.com/Praja_Snklpm/status/1476533775282556930?t=CC4rVh9WZlr0ENljAasNWQ&s=08

అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు పేర్లు పెట్టుకున్న చైనా – ఖండించిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు పేర్లు పెట్టుకున్న చైనా – ఖండించిన భారత్

చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల పేర్లు మార్చేసింది. 15 ప్రదేశాలకు చైనా అక్షరాలు, టిబెటన్ , రోమన్ వర్ణమాలతో కూడిన పేర్లు ప్రకటించింది. ఈ విషయాన్ని క్లెయిమ్ చేస్తూ… చైనా అధికారిక వార్తా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ కథనాన్ని ప్రచురించింది. చైనా కేబినెట్ స్టేట్ కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలనూ పత్రిక ప్రస్తావించింది. అయితే చైనా చర్యల్ని భారత్ ఖండించింది. దుష్ట చైనా చర్యలు దేశంలో అంతర్భాగంగా ఉన్న ప్రాంత స్థితిని మార్చలేవని ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త సరిహద్దు భద్రతా చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో చైనా ఈ ఘనకార్యం చేసింది. అయితే అరుణాచల్లో చైనా పేర్లు మార్చడం ఇదేం మొదటిసారి కాదు. ఏప్రిల్ 2017లోను కూడా ఇలాగే చేసింది.

అరుణాచల్ ప్రాంతాన్ని చైనాలోని జిజాంగ్ ప్రాంతంలోని దక్షిణభాగం అయిన జాంగ్నాన్ గా పేర్కొంటూ వాటికి చైనా పేర్లు ప్రకటించింది. చైనా పేరు మార్చిన 15 ప్రదేశాలలో ఎనిమిది నివాస ప్రాంతాలున్నాయి. వాటికి సెంగ్కెజాంగ్, దాగ్లుంగ్ జాంగ్, మనిగాంగ్, డుడింగ్, మిగ్ పెయిన్, గోలింగ్, డంబా, మెజాక్ అని పేర్లు పెట్టింది. నాలుగు పర్వతాలకేమో వామో రి, డు రి, లన్ జుబ్ రి, కున్ మింగ్ జింగ్ ఫెంగ్ అనీ, రెండు నదులకు జెన్ యాగ్మో, దులైన్ అని …పర్వత మార్గానికి సె లా అని పేర్లు పెట్టింది దుష్ట చైనా.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏరియాలకు తన భాషలో పేరు మార్చిన చైనా చర్యను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఖండించారు. అబద్ధాలను నిజాలుగా ఎప్పటికీ నమ్మించలేరు… అరుణాచల్ ఎప్పుడూ భారత్ అంతర్భాగం…పేర్లు మార్చడం వల్ల అది చైనా అతర్భాగం కాబోదని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో 90,000 చ.కి.మీ తమవేనంటూ చైనా క్లెయిమ్ చేస్తూ వస్తోంది.

2017లోనూ అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రదేశాలకు చైనా తన సొంత పేర్లను జారీ చేసింది. జనవరి 1 నుండి కొత్త సరిహద్దు భద్రతా చట్టం అమలులోకి రాబోతున్నందున తాజా పేర్ల జాబితాను విడుదల చేసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) , రాష్ట్ర ఏజెన్సీలకు మరిన్ని అధికారాలను ఇస్తుంది తాజాచట్టం. సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులకు రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, సరిహద్దు పట్టణాల నిర్మాణం మొదలగు అధికారాలుంటాయి.


Tuesday, December 28, 2021

వ్యాక్సినేషన్ లో తెలంగాణ రికార్డ్

వ్యాక్సినేషన్ లో తెలంగాణ రికార్డ్

వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ మైలురాయిని చేరుకుంది. మొదటి డోసు వ్యాక్సినేషన్ 100శాతం పూర్తైంది. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ కేక్‌ కట్‌ చేశారు. కరోనా మొదటి డోసు వ్యాక్సిన్ 100శాతం పూర్తి చేసిన పెద్ద రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు.

త్వరలో రెండో డోసు వ్యాక్సినేషన్ లో కూడా 100 శాతం మార్కును చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండో డోసు ఇప్పటికే 66 శాతం పూర్తయిందని హరీష్ తెలిపారు. ఆరోగ్యశాఖ కార్యకర్తల పనితీరు కారణంగానే ఈ ఘనత తెలంగాణ సొంతం అయిందని చెప్పారు. జనవరి 3 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని.. జనవరి 10 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

Monday, December 27, 2021

గ్రేటర్‌లో ఫ్రీగా Drinking Water కావాలంటే.. త్వరపడండి.. నాలుగు రోజులే గడువు..

గ్రేటర్‌లో ఫ్రీగా Drinking Water కావాలంటే.. త్వరపడండి.. నాలుగు రోజులే గడువు..

Courtesy by ABN మీడియా ట్విట్టర్
Dec 28 2021 @ 08:24AM
హైదరాబాద్ సిటీ/సైదాబాద్‌ : గ్రేటర్‌లో అర్హులైన కుటుంబాలు ఉచితంగా 20 వేల లీటర్ల తాగునీటిని పొందాలనుకుంటే ఈ నెల 31లోగా నీటి కనెక్షన్‌ క్యాన్‌ నెంబర్‌కు ఆధార్‌ అనుసంధానం  చేసుకోవాలి. ఈ పథకం కోసం తొలుత ఈ ఏడాది మార్చి 31, ఏప్రిల్‌ 30, ఆగస్టు 15 ఇలా.. పలుమార్లు గడువు పెంచింది. అనంతరం ఈ నెలాఖరు వరకు మరో అవకాశం ఇచ్చింది. ఈ పథకంలో చేరనివారికి 2020 డిసెంబర్‌ నుంచి 13 నెలల బిల్లులు ఒకేసారి జారీ చేయనున్నారు.

అనుసంధానం ఇలా..

నీటి కనెక్షన్‌ ఉన్నవారు జలమండలి వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌ అనుసంధానం చేసుకోవచ్చు. దీంతో పాటు మీటర్ల బిగింపు తప్పనిసరి. మీటర్‌ ఫొటోతో పాటు క్యాన్‌ నంబర్‌, ఆధార్‌ కార్డును జలమండలి కార్యాలయంలో సంబంధిత అధికారికి అందజేసినా సరిపోతుంది. ఎలాంటి సందేహాలున్నా 155313కు ఫోన్‌ చేయవచ్చు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి... KTR....!

*అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి... KTR....!*

*పురపాలికల్లో ప్రత్యేక సర్వేకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం*
హైదరాబాద్‌: గ్రామ పంచాయతీల అనుమతులతో పుర, నగరపాలక సంస్థల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.అనుమతులు గ్రామాల్లో-అంతస్తులు నగరాల్లో' శీర్షికతో సోమవారం 'ఈనాడు'లో ప్రచురితమైన కథనంపై స్పందించింది. పురపాలక మంత్రి కేటీఆర్‌ ఈ అంశంపై సోమవారం సమీక్షించారు. కరీంనగర్‌ నగరపాలిక, లక్సెట్టిపేట, బోడుప్పల్‌, తుర్కయంజాల్‌, నిజాంపేట, మణికొండ పురపాలికల పరిధిలో నిర్మాణాలపై ప్రత్యేక సర్వే చేసి నిబంధనలు ఉల్లంఘించిన, అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు.
అనంతరం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణలు ఉత్తర్వులిచ్చారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టవేయాలని పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్ల(స్థానిక సంస్థల)కు స్పష్టం చేశారు.
2020 నవంబరు నుంచి అమల్లోకి వచ్చిన టీఎస్‌బీపాస్‌ నిబంధనల మేరకు భవన నిర్మాణాలు జరగాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల అనుమతులతో గ్రౌండ్‌ ఫ్లోర్‌ కాకుండా రెండు అంతస్తుల వరకే నిర్మించాలన్నారు. అదనంగా నిర్మించుకోవాలంటే విధిగా అనుమతి పొందాలన్నారు. అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థల) ఆధ్వర్యంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు.. నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను తనిఖీ చేసి ఉల్లంఘనలపై పురపాలక చట్టం-2019 మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ వివరాలతో పురపాలకశాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు.

*link Media ప్రజల పక్షం🖋️*

*తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు GHMC పరిధిలో అన్ని సర్కిల్ లలో అక్రమనిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ న్యాయస్థానం ఆదేశాలను మీ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. మీరు తక్షణమే ఈ అక్రమ నిర్మాణాలను అరికట్టాలి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.... Bplkm*
prajasankalpam1.blogspot.com

Sunday, December 26, 2021

తెలంగాణ లో సోషల్ మీడియా & యూట్యూబ్ చానెల్స్ గురించి మాట్లాడిన మహానుభావుల కోసం

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*తెలంగాణ లో సోషల్ మీడియా & యూట్యూబ్ చానెల్స్ గురించి మాట్లాడిన మహానుభావులు గారు మిమ్మల్ని ప్రజా సంకల్పం & link Media ప్రశ్నిస్తుంది!!*

*తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారి అబ్బాయి అంశంలో మీరు స్పందించిన తీరు మీద మీరే ఆత్మవిమర్శన చేసుకోవాలి. గత కొన్నినెలల క్రితం హైదరాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి మీద అఘాత్యం జరిగినప్పుడు మెయిన్ స్త్రీమ్ మీడియా ఎలా స్పందించింది?? అదే మీడియా సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ గురించి ఎలా స్పందించారు ప్రజలు చూశారు... మీరు ఏ మీడియా గురించి అయితే నిన్న మాట్లాడారో అదే సోషల్ మీడియా & యూట్యూబ్ చానెల్స్ చిన్నారికి జరిగిన ఘటన గురించి వాస్తవాలు వెలికితీసి సమాజంలో మళ్ళీ ఇలాంటి దుర్ఘటనలు జరుగకుండా ప్రజలను అప్రమత్తం చేయడంలో కీలక పాత్ర పోషించాయి అది మరిచిపోవద్దు.ఏవో కొన్ని పనికిమాలిన వ్యాపారం కోసం పనిచేస్తున్న యూట్యూబ్ చానెల్స్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి వాటిమీద మీరు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు చెప్పండి.*

*తెలంగాణ లో విలువలతో కూడిన జర్నలిజం ను ఎవరు ముందుకు తీసుకెళ్లుతున్నారో ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే అలాంటి మీడియాకు వీక్షకులు లక్షల్లో వున్నారు... అదే మెయిన్ స్త్రీమ్ మీడియా కు 5 నుంచి 10 వేలలోపే వీక్షకులు వున్నారు అది మరిచిపోవద్దు మహానుభావులారా... Bplkm*

*సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజల ద్రుష్టికి తీసుకెళ్లి వారిని అప్రమత్తం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత... ఒక్క మీడియా మాత్రమే అనుకుంటే కరెక్ట్ కాదు మహానుభావులు తెలుసుకోవాలి.... Bplkm*

*గౌరవ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ ప్రమానాలను అగౌరవపరుస్తున్న ప్రజాప్రతినిధుల మీద మీ ప్రతాపం చుపెట్టండి మహానుభావులారా... Bplkm*

*Copy to Group link Media*
27/12/2021

Bapatla Krishnamohan 

prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

Saturday, December 25, 2021

Postures For Back Pain: ఇష్టం వచ్చినట్లు కూర్చుంటా.. ఏముందిలే అంటే కుదరదు..!

Courtesy by సాక్షి మీడియా ట్విట్టర్ 
26 Dec, 2021 10:03 IST|Sakshi
సిట్‌ రైట్‌

Best Sitting Postures: ‘సిట్‌ రైట్‌... సిట్‌ ప్రాపర్లీ’ ఈ మాటలు వినని బాల్యం ఉండదు. ఈ మాటలు అనిపించుకోకుండా స్కూలు జీవితం గడిచిన వాళ్లెవరూ ఉండకపోవచ్చు. తెలుగు మీడియం ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వాళ్లకు వచ్చే తొలి ఇంగ్లిష్‌ పదం కూడా బహుశా ఇదే కావచ్చు. స్కూల్లో టీచరు చేత, ఇంట్లో అమ్మానాన్నల చేత ఎన్నిసార్లు చెప్పించుకున్నప్పటికీ తీరుగా ఒంటపట్టని లక్షణం కూడా ఇదే.

తీరుగా కూర్చోవడం చేతకాక చేతులారా తెచ్చుకునే అనారోగ్యాలెన్నో. తీరుగా కూర్చోవడం చేతకాక అనడం కంటే ‘తీరుగా కూర్చోవడం పట్ల శ్రద్ధ లేక’ అనడమే కరెక్ట్‌. ఇప్పుడు ఎక్కువ భాగం వృత్తిఉద్యోగాలు గంటలసేపు ఒకే పట్టున కూర్చుని పని చేసేవే అయి ఉంటున్నాయి. అందుకే చేసే పనిలో కచ్చితత్వం కోసం పాటుపడినట్లే కూర్చునే భంగిమ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. 

కుర్చీలో కూర్చున్నప్పుడు భుజాలు, బట్‌ భాగం కుర్చీ వెనుక భాగాన్ని తాకాలి. బట్‌ భాగం కుర్చీని తాకని పక్షంలో కుర్చీ మార్చుకోవడం లేదా కుషన్‌ అమర్చుకోవడం మంచిది. అదీ కాక పోతే మెయిన్‌ ఫొటోలో ఉన్నట్లు చిన్న టవల్‌ను రోల్‌ చేసి వెన్నుకు ఆసరాగా అమర్చుకోవాలి. అరగంటకొకసారి కదిలి కూర్చున్న భంగిమకు విశ్రాంతినిచ్చి తిరిగి సరైన తీరులో కూర్చోవాలి. కథల్లో వర్ణించినట్లు విశ్రాంతిగా కుర్చీలో జారగిలపడి కూర్చోవడం అనే భంగిమలో గంటలసేపు ఉండకూడదు, దేహం సాంత్వన పొందే రెండు–మూడు నిమిషాల సేపు మాత్రమే ఉండాలి.

అరగంట, ఒక గంట పనికి ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేస్తే ఫర్వాలేదు. కానీ ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తే ల్యాప్‌టాప్‌ను కూడా డెస్క్‌ మీద ఉంచి పని చేయడమే కరెక్ట్‌. ∙ఎక్కువ గంటలు కూర్చుని పని చేసే వాళ్లు అబ్డామినల్‌ స్ట్రెంగ్త్‌ కోసం రోజూ అరగంట పాటు ఎక్సర్‌సైజ్‌ చేయాలి. ఇందుకోసం ఒక ఫొటోలో చూపించిన పెద్ద బాల్‌ మీద కానీ కుర్చీలో కానీ కూర్చోవాలి.

ఈ భంగిమలో పాదాల మధ్య అడుగు దూరం ఉంచాలి. గాలి వదులుతూ కుడి మోకాలిని పైకెత్తాలి, అదే సమయంలో ఎడమ చేతిని కూడా పైకెత్తాలి. మెల్లగా మామూలు స్థితికి రావాలి. రెండవ సారి అదేవిధంగా ఎడమ మోకాలు, కుడి చేత్తో చేయాలి. ఇలా కనీసం పదిసార్లు చేస్తుంటే... కూర్చున్న భంగిమలు సరిలేని కారణంగా ఎదురయ్యే అవాంఛిత ఒత్తిడుల నుంచి దేహం సాంత్వన పొందుతుంది. కడుపు కండరాలు, అంతర్గత అవయవాలు శక్తిమంతమవుతాయి.

కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, ఆన్‌లైన్‌ క్లాసుల రూపంలో ఆఫీసు, స్కూలు ఇంటికే వచ్చేశాయి. కిచెన్‌ ప్లాట్‌ఫామ్, డైనింగ్‌ టేబుల్, డ్రాయింగ్‌ రూమ్‌లోని సెంటర్‌ టేబుల్, బెడ్‌రూమ్‌లోని ఫోమ్‌ బెడ్‌ కూడా వర్క్‌ప్లేస్‌లుగా మారిపోయాయి. ఫలితంగా కూర్చునే భంగిమలు మారిపోయాయి.

బ్యాడ్‌ సిట్టింగ్‌ పోశ్చర్స్‌ కారణంగా ఎదురయ్యే అనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. లైఫ్‌ స్టయిల్‌ లో వచ్చే మార్పులకు అనుగుణంగా దేహం కూడా ప్రతిస్పందిస్తుంటుంది మరి. అందుకే నిపుణులు అధ్యయనం చేసి చెప్పిన సూచనలను తెలుసుకుందాం. అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌ క్లినిక్‌ తాను అధ్యయనం చేసిన గుడ్‌ పోశ్చర్స్‌ గురించి కొన్ని వివరాలను వెలువరించింది.

చదవండి: Health Tips: పిల్లలకు గుడ్డు, పెరుగు, బాదం, వాల్‌నట్స్‌ ఎక్కువగా తినిపిస్తున్నారా... అయితే

‘ఆ.. ఏముందిలే’ అనుకుంటే కుదరదు!
ఇటీవల డాక్టర్‌ల దగ్గరకు వస్తున్న కేసుల్లో ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు, వెన్ను నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి ప్రధానంగా కనిపిస్తున్నాయి. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను కింది భాగం (లోవర్‌ బ్యాక్‌) నొప్పి కేసులను నిశితంగా పరిశీలించినస్పైన్‌ స్పెషలిస్ట్‌లు నూటికి ఇరవై శాతం వరకు ఈ రకమైన వెన్ను నొప్పులకు కారణం బ్యాడ్‌ సిట్టింగ్‌ పోశ్చర్‌లేనని చెబుతున్నారు. బ్యాడ్‌ సిట్టింగ్‌ పోశ్చర్‌ పై సమస్యలతో సరిపెట్టదు.

ఈ నొప్పుల కారణంగా అసంకల్పితంగా దేహ భంగిమలో మరికొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. భుజాలను వంచడం, నొప్పి లేని భంగిమ కోసం మెడను ముందుకు చాచినట్లు సాగదీయడం, తలను కిందికి వంచడం కూడా జరుగుతాయి. ఇవన్నీ కలిసి ఒత్తిడితో కూడిన తలనొప్పికి దారి తీస్తాయి. విశ్రాంతి కోసం పడుకున్న తర్వాత కూడా చాలా సమయం వరకు దేహం పూర్తిగా సాంత్వన పొందలేదు. పడుకున్న తర్వాత నిద్రపట్టడానికి మధ్య కనీసం రెండు గంటల సమయం జరిగిపోతుంది. దీంతో బ్యాక్‌పెయిన్‌కి నిద్రలేమి కూడా తోడవుతుంది.

నిద్రలేమి ప్రభావం జీర్ణక్రియ మీద కూడా చూపిస్తుంది. తినాలనే ఆసక్తి లోపిస్తుంది. పని చేయాలనే ధ్యాస కలగదు. పని చేయడానికి కూర్చున్నప్పటికీ ఏకాగ్రత సాధ్యం కాదు. పైగా తరచుగా మర్చిపోవడం కూడా మొదలవుతుంది. పెద్దవాళ్లయితే తమకు తాముగా ‘మర్చిపోయాం’ అనుకుని సరిపెట్టుకుందారు. కానీ అదే పిల్లల విషయానికి వచ్చేటప్పటికీ ‘విన్న పాఠం ఎలా మర్చిపోయావ్‌? శ్రద్ధగా వినాలనే ధ్యాస ఉంటేగా’ అని మందలిస్తారు.

నిజానికి ‘ఈ మర్చిపోవడం’ వెనుక పిల్లలను కూర్చోబెట్టిన భంగిమ కూడా కారణమే. అలాగే పెద్దవాళ్ల విషయానికి వస్తే... నాణ్యత లోపించకుండా క్వాలిటీ వర్క్‌ ఇవ్వడంలోనూ కూర్చునే భంగిమ పాత్ర కీలకమే. అందుకే సరిగ్గా కూర్చుందాం. ‘సిట్‌ రైట్‌’ అని చెప్పడానికి టీచర్‌ ఉండరు, స్కూలు వదిలిన తర్వాత కాలేజ్‌ రోజుల్లో అమ్మానాన్నలు చెబుతారు. ఉద్యోగంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరికి వాళ్లే టీచర్‌

జర్నలిస్ట్- ఓ జర్నలిస్ట్ మిత్రమా ఇది నీకే!!

*జర్నలిస్ట్- ఓ జర్నలిస్ట్ మిత్రమా ఇది నీకె*

సోనియా సిగ్గు పడింది, మోడీ తుమ్మాడు, కెసిఆర్ తిట్టాడు, చంద్రబాబు నవ్వాడు, గాలి ఇంట పెళ్లి సందడి, డేరా బాబా సరాగాలాడాడు, సెలబ్రిటీ కూతురు కాలు జారింది, విరాట్ సిక్స్ కొట్టాడు, దానికి అనుష్క కెవ్వు మంది, మొగుడు కాదన్నాడు, ప్రియుడు అవును అన్నాడు,

ఛి ఛి ఇదేనా జర్నలిజం... విలువలతో కూడిన, ఒక ఆంకిత భావం, తెగింపు, సమాజాన్ని మార్చే వారధులు మనమే అన్న, ఒక స్పృహ ఏమి లేదా. ఎవడు డబ్బులిస్తే వాడికి ఊడిగం చేసే సిగ్గులేని బ్రతుకులకు పవిత్రమైన జర్నలిజం పేరు పెట్టుకుంటారా? పనికి రాని సుత్తి మహేష్, రాంగోపాల్ వర్మ కాదు సోదరా... మన నిస్సహాయ ప్రపంచాన్ని కుర్చోపెట్టు ని స్టూడియోలో, సమస్య తెలిసి, ప్రభుత్వం దిగి వచ్చి, అలాంటి సమస్యలకు భరోసా దొరికేంతవరకు, నాయకులను, పాలకులను, పార్టీలను ఏకి పారెయ్, ఎవరొద్దన్నారు మిత్రమా? మేలుకో మిత్రమా. *జర్నలిజం విలువలను బ్రతికుంచు*. పతనమవుతున్న ఈ సమాజాన్ని నిలబెట్ట వలసిన బాధ్యత నిపై ఉందని గుర్తుంచుకో... ని కలం రాయడం మొదలు పెడితే ప్రపంచం ఉలిక్కి పడాలి, ని గళం వినిపిస్తే చతికిల పడ్డ ప్రపంచం పరుగులు పెట్టాలి అని అంటున్న Voice of Telugu కి మీరు ఎం సమాధానం ఇస్తారు.

*ప్రజలను గొర్రెలను చేసి ఈ రాజకీయ నాయకులు రాజ్యం ఏలుతుంటే*

బుర్ర కథలు చెప్పగానే అందరూ నమ్మి మోసపోతుంటే. ప్రజలను చైతన్య పరచాల్సిన బాద్యత ని పై లేదా?

పచ్చని అడవిలో ఒక మొక్క పెట్టి, అడవంతా నేనే పెట్టిన అని చెప్తుంటే, సిగ్గు లేకుండ ప్రజలకు చెప్తున్నారు

ఎం లేదన్న మాయమాటలు చెప్పి గాలిలో మేడలు కడ్తాడు అంతే ఇంకా చేసేదీ ఏంలేదన్న, అప్పుల తెలంగాణ ఐంది ఎప్పుడో..... దానిని మనం ఏం చెయ్య లేము అని అంటున్న ఒక తెలంగాణ బిడ్డకు ఎం సమాధానం ఇస్తారు.

ప్రజల త్యాగాలకు అర్థం లేకుండా పోయింది. నమ్మి నానవోస్తె పుచ్చిబుర్రలైనట్లయింది. ప్రశ్నించేవారిపై కేసుల, జైళ్ళపాలుచేసే నియంతృత్వం సాగుతుంది. ఇకనైనాప్రజలు నిజాలు గ్రహించకపోతే తెలంగాణ బొందలగడ్డగా మారక తప్పదు అని హెచ్చరిస్తున్న నిరుద్యోగికి ఎం చెప్తావ్.

ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడు ఎలుతున్నాడు రో తెలంగాణ అని గర్జిస్తున్న తెలంగాణ ఉద్యమ కళాకారుడికి ఎం చెప్తావ్.

అన్న మళ్ళి తెలంగాణ కోసం పోరాటం చేయవలసిందేనా???

*రైతులు, RTC కార్మికులు, విద్యార్థులు, ఆత్మహత్యలు చేసుకున్నా*, లంచం ఇవ్వనిదే ఏ ప్రభుత్వ సంస్థలల్ల పనులు జరగక పోయినా, ఆరు సంవత్సరాలయినా VC ని నియమించకుండా ఉస్మానియా భూములను కొల్లగొడుతూ, ఉస్మానియ ఉనికిని లేకుండా, భవిష్యత్తులో ప్రజలు ప్రభుత్వం పైన తిరగబడకుండా ఉద్యమాలకు ఊపిరి ఐన ఉస్మానియాని బ్రష్టుపట్టించే పనిలో అధికార పార్టీ నేతలు ఉన్నా, ఉస్మానియా భూములను అక్రమంగా కొల్లగొడుతున్నా, *ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికెషన్స్ ఇవ్వకపోయినా, పూటకొక్క మాట మారుస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నా, కేవలం తన ఫార్మ్ హౌస్ లో పంట పండించడం కోసం కొండపోచమ్మ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ల పేరు చెప్పి లక్షల కోట్లు మింగుతున్నా*, ఇవన్నీ చూసి ప్రశ్నించే వారిపైన *అక్రమ కేసులు పెడుతున్నా*, తెలంగాణ పేరు చెప్పి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలని ప్రజలు కోరుకున్నా, జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా అని మోసం చేసినా, దళితున్ని  ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చెయ్యకపోయినా, మూడెకరాల భూమి, ఇంటికొక్క ఉద్యోగం ఇస్తా అని ఇవ్వకపోయినా, నియంత పాలన చేయడానికి, ప్రజలను, ప్రతిపక్షాలను నోరు ఎత్తకుండా చేయడానికి *40,000 పోలీసు ఉద్యోగాలిచ్చీ అణచివేత చేస్తుంటే*, ఇల్లు కూడా దాటకుండా చేస్తున్నా చూస్తూ కూర్చుందామా?

కేవలం అధికార పార్టీ చేసే తప్పులను ప్రశ్నించినందుకు ఒక న్యూస్ ఛానల్ని డబ్బులతో కొని, ఆ ఛానల్ ని నేలమట్టం చేస్తే, *అందులో పనిచేసే 170 మంది రోడ్డున పడ్డారు.*

*డబ్బు, అధికారం ఉంది కదా అని అన్ని న్యూస్ చానల్స్ని కొని తన ఆధీనంలోకి తీసుకోని, తాను చెప్పిన వార్తలు మాత్రమే వచ్చేలా చేస్తుంటే*. ఈ రంగానికి రాకముందు సమాజ శ్రేయస్సు కోసం మార్పుకోసం ఎంతో పాటుపడుదాం అనుకొని ప్రస్తుతం తమ మనుసుని చంపుకొని తన కుటుంబ పోషణ కోసం, నెలకు వచ్చే జీతం కోసం, ఆత్మ గౌరవాన్ని చంపుకొని కాలం గడిపేస్తున్నారు.

ఇలాంటి జర్నలిస్ట్ ల కోసం, ఆలాగే సమాజంలో జరుగుతున్న మోసాలను, రాజకీయ చదరంగాలను ప్రజలముందు నేరుగా ఉంచడం కోసం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అక్రమాలు ఆధారాలతో సహా అందరూ చూడాలనే, మంచిపనిలు చూడాలనే, ముక్యంగా ప్రజా సమస్యలు వెలుగులోకి రావాలనే ఉద్దేశంతో... అలాగే

*ఇదేనా బంగారు తెలంగాణ? పోరాడి సాధించుకున్న తెలంగాణ?*

అని అడిగిన ఒక అభాగ్యుడి కి జవాబుగా మా ఈ జర్నలిజం అనే అప్లికేషన్ తయారు చేసాము.

*ఓ జర్నలిస్ట్ మిత్రమా మేలుకో.*

సమాజం నికొరకై ఎదురుచూస్తుంది. ని కలానికి పని చెప్పు..

*నిజమైన జర్నలిస్ట్ అనిపించుకో... నీవు చదివిన చదువుకు న్యాయం చెయ్యు*

ప్రజలను చైతన్య వంతులని చేయు

ని సత్తా చూపించు

నిజాల్ని ప్రజల ముందు ఉంచు. దౌర్జన్యాన్ని ఎదిరించు

ఈ దొంగలను చీల్చి చెండాడు ని కలం తో

ఎవ్వరికీ భయపడకుండా వార్తలను సాక్షాలతో పెట్టు.. అందరికి తెలిసేలా చెయ్

*Q Group Media*

నేను అలా అనలేదు .. సాగు చట్టాలకు సంబంధించిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి Narendra Singh Tomar

నేను అలా అనలేదు .. సాగు చట్టాలకు సంబంధించిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి Narendra Singh Tomar

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Narendra Singh Tomar) తాజాగా చేసిన వ్యాఖ్యలు.. కేంద్రం మళ్లీ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురానుందా అనే చర్చకు దారితీసింది. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై మంత్రి వివరణ ఇచ్చారు. 

Centre Will Not Bring Back Farm Laws Agriculture Minister Narendra Singh Tomar clarifies remarks

Courtesy by asianet news తెలుగు ట్విట్టర్ Sumanth Kanukula
New Delhi, First Published Dec 26, 2021, 10:41 AM IST

సాగు చట్టాలకు (farm laws) వ్యతిరేకంగా రైతులు ఏడాది పాటు పోరాటం కొనసాగించడంతో.. కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది. అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Narendra Singh Tomar) తాజాగా చేసిన వ్యాఖ్యలు.. కేంద్రం మళ్లీ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురానుందా అనే చర్చకు దారితీసింది. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై మంత్రి వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ‘మేము వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చాం. కానీ కొంతమందికి అవి నచ్చలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ (Narendra Modi) నాయకత్వంలో పెద్ద సంస్కరణ తీసుకొచ్చాం. అయితే ప్రభుత్వం నిరాశ చెందలేదు. మేము ఒక అడుగు వెనక్కి వేశాం. మేము మళ్ళీ ముందుకు సాగుతాము.. ఎందుకంటే రైతులు భారతదేశానికి వెన్నెముక. ఆ వెన్నెముక బలోపేతం అయితే.. దేశం మరింత బలపడుతుంది’ అని అన్నారు. 

కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసిందని.. తర్వాత మళ్లీ తీసుకొస్తుందని అనడానికి మంత్రి వ్యాఖ్యలే నిదర్శమని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ..  కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యలు ప్రధాని మోదీ క్షమాపణలను అవమానించడమేనని అన్నారు. ఇది ఖండించిందగినదని Rahul Gandhi ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మళ్లీ రైతు వ్యతిరేక చర్యలు తీసుకున్నట్టయితే అన్నదాలు మళ్లీ సత్యాగ్రహం ప్రారంభిస్తారని అన్నారు. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భయంతో పార్లమెంట్‌లో ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారని, మూడు ‘నల్ల’ చట్టాలను రద్దు చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలనే కేంద్రం కుట్రను తోమర్ ప్రకటన మరోసారి బట్టబయలు చేసిందని  అన్నారు. మూడు నల్ల చట్టాలను తిరిగి కొత్త రూపంలో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు స్పష్టమైందని విమర్శించారు. 

Also Read: ఎన్నికల కోసమే సాగు చట్టాలు రద్దు చేశారా ?- ట్విటర్ మంత్రి కేటీఆర్

నేను అలా అనలేదు.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివరణ ఇచ్చారు. farm lawsను సవరించిన రూపంలో కేంద్రం తిరిగి ప్రవేశపెట్టదని తెలిపారు. నాగ్‌పూర్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినప్పుడు.. తాను అలా అనలేదని మంత్రి చెప్పారు. ‘ప్రభుత్వం మంచి(వ్యవసాయ చట్టాలు చేసిందని నేను చెప్పాను. కొన్ని కారణాల వల్ల మేము వాటిని వెనక్కి తీసుకున్నాము. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది’ అని మంత్రి తోమర్ చెప్పారు. ఇక, పార్లమెంట్ ఉభయ సభలు పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో సాగు చట్టాల రద్దు బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.

ఆ చిన్నారులకు విద్యా దానం చేస్తోంది!

ఆ చిన్నారులకు విద్యా దానం చేస్తోంది!

ఆ చిన్నారులకు విద్యా దానం చేస్తోంది!

Courtesy by ఈనాడు మీడియా ట్విట్టర్ 

చదువే మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. కానీ అందుకు స్థోమత, తగిన సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో అబ్బాయిలు బాల కార్మికులుగా, అమ్మాయిలు చిన్నారి పెళ్లికూతుళ్లుగా అవతారమెత్తుతున్నారు. ఈ రెండూ వారి బంగారు భవిష్యత్తును అణచివేస్తున్నాయని గ్రహించింది బిహార్‌కు చెందిన సదియా రియాజ్‌ షేక్‌. వివిధ కారణాల రీత్యా మధ్యలోనే చదువు ఆపేస్తోన్న పేద పిల్లల కోసం ఓ కమ్యూనిటీ గ్రంథాలయాన్ని నెలకొల్పిందామె. పాఠ్యాంశాల దగ్గర్నుంచి పోటీ పరీక్షల దాకా.. విద్యార్థులకు అవసరమైన ప్రతి పుస్తకాన్నీ ఇందులో అందుబాటులో ఉంచింది. ఇలా విద్యార్థి దశలోనే విశాల హృదయంతో ఆలోచించి.. ఎంతోమంది చిన్నారులకు విద్యా దానం చేస్తోన్న సదియా.. తన సమాజ సేవకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు-రివార్డులు అందుకుంది.

ఆ చిన్నారులకు విద్యా దానం చేస్తోంది!

జనాభాతో పాటు నిరక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్‌ ఒకటి. అక్కడి చాలా గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికీ పేదరికంలోనే మగ్గుతున్నారు. ఎంతలా అంటే.. తమ పిల్లలకు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా కొనలేని పరిస్థితి వాళ్లది! దీంతో చిన్న వయసులోనే వాళ్లతో స్కూల్‌ మాన్పించి.. మగ పిల్లల్ని పనిలోకి, ఆడపిల్లల్ని పెళ్లి చేసి అత్తారింటికీ పంపిస్తున్నారు. అక్కడి దర్భంగా జిల్లాలోని Deora Bandhauli అనే గ్రామం కూడా ఇందుకు మినహాయింపు కాదు. సదియా రియాజ్‌ షేక్‌ కూడా అదే గ్రామంలో పుట్టి పెరిగింది.

అవి చూసి చలించిపోయి..!

అయితే సదియా తల్లిదండ్రులు కాస్త స్థితిమంతులే! పైగా వాళ్లకు చదువు విలువ తెలుసు కాబట్టే తమ కూతురికి మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతో ఆమె పుట్టిన మూడేళ్లకే ముంబయికి మకాం మార్చారు. ఆమె తండ్రి అక్కడే చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దీంతో సదియా కూడా అక్కడే చదువుకుంటోంది. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తన తండ్రి వ్యాపారం మూత పడడంతో కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వచ్చేసింది సదియా. ఆ సమయంలోనే తన గ్రామం గురించి, పేదరికం కారణంగా అక్కడి పిల్లల్ని బలవంతంగా స్కూల్‌ మాన్పించి వారి బంగారు భవిష్యత్తును కాలరాస్తున్నారన్న విషయాలు తెలుసుకొని చలించిపోయిందామె. అంతటితో ఊరుకోకుండా.. వాళ్లు చదువు ఆపకుండా ఏదో ఒకటి చేయాలనుకుంది. ఇలా ఆలోచిస్తోన్న క్రమంలోనే ‘కమ్యూనిటీ లైబ్రరీ’ ఐడియా ఆమె మదిలో మెదిలింది. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పి.. వారిని ఒప్పించి తన ఊర్లోనే ‘మౌలానా ఆజాద్‌ లైబ్రరీ’ పేరుతో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది సదియా.


Updated : 25/12/2021 19:32 IST
   
ఆ చిన్నారులకు విద్యా దానం చేస్తోంది!

ఆ చిన్నారులకు విద్యా దానం చేస్తోంది!

చదువే మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. కానీ అందుకు స్థోమత, తగిన సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో అబ్బాయిలు బాల కార్మికులుగా, అమ్మాయిలు చిన్నారి పెళ్లికూతుళ్లుగా అవతారమెత్తుతున్నారు. ఈ రెండూ వారి బంగారు భవిష్యత్తును అణచివేస్తున్నాయని గ్రహించింది బిహార్‌కు చెందిన సదియా రియాజ్‌ షేక్‌. వివిధ కారణాల రీత్యా మధ్యలోనే చదువు ఆపేస్తోన్న పేద పిల్లల కోసం ఓ కమ్యూనిటీ గ్రంథాలయాన్ని నెలకొల్పిందామె. పాఠ్యాంశాల దగ్గర్నుంచి పోటీ పరీక్షల దాకా.. విద్యార్థులకు అవసరమైన ప్రతి పుస్తకాన్నీ ఇందులో అందుబాటులో ఉంచింది. ఇలా విద్యార్థి దశలోనే విశాల హృదయంతో ఆలోచించి.. ఎంతోమంది చిన్నారులకు విద్యా దానం చేస్తోన్న సదియా.. తన సమాజ సేవకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు-రివార్డులు అందుకుంది.

ఆ చిన్నారులకు విద్యా దానం చేస్తోంది!

జనాభాతో పాటు నిరక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్‌ ఒకటి. అక్కడి చాలా గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికీ పేదరికంలోనే మగ్గుతున్నారు. ఎంతలా అంటే.. తమ పిల్లలకు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా కొనలేని పరిస్థితి వాళ్లది! దీంతో చిన్న వయసులోనే వాళ్లతో స్కూల్‌ మాన్పించి.. మగ పిల్లల్ని పనిలోకి, ఆడపిల్లల్ని పెళ్లి చేసి అత్తారింటికీ పంపిస్తున్నారు. అక్కడి దర్భంగా జిల్లాలోని Deora Bandhauli అనే గ్రామం కూడా ఇందుకు మినహాయింపు కాదు. సదియా రియాజ్‌ షేక్‌ కూడా అదే గ్రామంలో పుట్టి పెరిగింది.

అవి చూసి చలించిపోయి..!

అయితే సదియా తల్లిదండ్రులు కాస్త స్థితిమంతులే! పైగా వాళ్లకు చదువు విలువ తెలుసు కాబట్టే తమ కూతురికి మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతో ఆమె పుట్టిన మూడేళ్లకే ముంబయికి మకాం మార్చారు. ఆమె తండ్రి అక్కడే చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దీంతో సదియా కూడా అక్కడే చదువుకుంటోంది. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తన తండ్రి వ్యాపారం మూత పడడంతో కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వచ్చేసింది సదియా. ఆ సమయంలోనే తన గ్రామం గురించి, పేదరికం కారణంగా అక్కడి పిల్లల్ని బలవంతంగా స్కూల్‌ మాన్పించి వారి బంగారు భవిష్యత్తును కాలరాస్తున్నారన్న విషయాలు తెలుసుకొని చలించిపోయిందామె. అంతటితో ఊరుకోకుండా.. వాళ్లు చదువు ఆపకుండా ఏదో ఒకటి చేయాలనుకుంది. ఇలా ఆలోచిస్తోన్న క్రమంలోనే ‘కమ్యూనిటీ లైబ్రరీ’ ఐడియా ఆమె మదిలో మెదిలింది. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పి.. వారిని ఒప్పించి తన ఊర్లోనే ‘మౌలానా ఆజాద్‌ లైబ్రరీ’ పేరుతో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది సదియా.

మా లైబ్రరీలో ఏమేముంటాయంటే..!

‘మా ఊర్లో చాలా కుటుంబాల్లో పిల్లల్ని స్కూలుకు కూడా పంపించలేని పరిస్థితి! ఎక్కడ పాఠ్య పుస్తకాలు, యూనిఫాంకు ఖర్చవుతుందోనన్న ఉద్దేశంతో వారితో బలవంతంగా స్కూలు మాన్పిస్తున్నారు. తద్వారా డ్రాపౌట్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అందుకే వీళ్ల చదువుకు ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశాను. మా వద్ద 1-12వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, NCERT పాఠ్య పుస్తకాలు, కథల పుస్తకాలు, కామిక్స్‌, స్టేషనరీ కిట్స్‌, వార్తా పత్రికలు, వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) సిలబస్‌ బుక్స్‌.. వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. పిల్లలు ఇక్కడికొచ్చి చదువుకోవచ్చు.. లేదంటే ఉచితంగా వాటిని ఇంటికి కూడా తీసుకెళ్లచ్చు..’ అంటూ తన గ్రంథాలయం గురించి చెప్పుకొచ్చింది సదియా.


అదే నా లక్ష్యం!

ఇలా కేవలం పుస్తకాలిచ్చి చదువుకోమనడమే కాదు.. పిల్లలకు కొన్ని సబ్జెక్టులను సైతం బోధిస్తోంది సదియా. పిల్లలకు, మహిళలకు ఉండే హక్కులపై అవగాహన కల్పించే క్రమంలో అప్పుడప్పుడూ వర్క్‌షాప్స్‌, క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తుంటుంది. ‘ఈ గ్రంథాలయాన్ని ఇక్కడితో పరిమితం చేయకుండా.. భవిష్యత్తులో మరింత విస్తరించాలన్న ఆలోచన ఉంది. ఈ క్రమంలో పిల్లలకు కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ సదుపాయాలు కల్పించాలనుకుంటున్నా.. అలాగే ఇలాంటి గ్రంథాలయాల్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలనుకుంటున్నా..’ అంటోందీ యంగ్‌ యాక్టివిస్ట్‌. ప్రస్తుతం తన గ్రంథాలయ నిర్వహణ, ఇతర సేవా కార్యక్రమాల కోసం Rehnuma Welfare Foundation అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. దీని ద్వారా నిధులు సమీకరిస్తోంది సదియా.

సేవకు దక్కిన గుర్తింపు!

ఇప్పుడనే కాదు.. చిన్నతనం నుంచే సేవ చేయడాన్ని ఇష్టపడే సదియా.. గతేడాది బిహార్‌ వరదల సమయంలో MEEM.org అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసింది. విద్య-ప్రాముఖ్యం, హక్కుల గురించి వివిధ వేదికల పైనా తన గళాన్ని వినిపిస్తూ ఎంతోమందిలో చైతన్యం కలిగిస్తోందీ బిహార్‌ అమ్మాయి. ప్రస్తుతం ‘Global Kids Rights.org’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోన్న సదియా.. తన సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు అందుకుంది. ‘Global Women Inspiration Awards and Conclave 2021’ కు ఎంపికైన వంద మంది స్ఫూర్తిదాయక మహిళల్లో సదియా కూడా ఒకరు కావడం విశేషం.

ఇలా సమాజ శ్రేయస్సు కోసం తన శాయశక్తులా కృషి చేస్తూ ఎంతోమందిలో స్ఫూర్తి, చైతన్యం కలిగిస్తోన్న సదియా జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం!

Friday, December 24, 2021

వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే దర్శనానికి అనుమతి

వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే దర్శనానికి అనుమతి


Visitation is permitted only if there is a vaccination or negative certificate: TTD

కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టి.. సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ టీటీడీ అధికారులు శ్రీవారి భక్తులకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. ఇప్పటికే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్పనిస‌రిగా తీసుకుని రావాలని సూచించిన సంగతి తెలిసిందే.. అయితే కొంత మంది భక్తులు టీటీడీ సూచనలను పట్టించుకోకుండా తిరుమల చేరుకుంటున్నారు.

దీంతో టీటీడీ అధికారులు శ్రీవారి భక్తులకు కరోనా నిబంధనలను తప్పని సరిగా పాటించాలని కోరుతున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేదా 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. మలయప్ప దర్శనానికి కొంత మంది భ‌క్తులు నెగెటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శనం కోసం వస్తున్నారు. అయితే అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద నిఘా మరియు భద్రతా సిబ్బంది త‌నిఖీ చేసి అటువంటి భక్తులను వెన‌క్కి పంపిస్తున్నారు.

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? ఈ విధంగా తీసుకోవచ్చు..!

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? ఈ విధంగా తీసుకోవచ్చు..!

Kids PAN Card: ప్రస్తుతం ప్రతి ఒక్కరికి పాన్‌ కార్డు అనేది ముఖ్యమైనది మారిపోయింది. బ్యాంకు ఖాతా, లావాదేవీలు, ఇతర ఆస్తులకు సంబంధించిన వాటికి పాన్‌ కార్డు తప్పనిసరి...

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? ఈ విధంగా తీసుకోవచ్చు..!

Kids PAN Card: ప్రస్తుతం ప్రతి ఒక్కరికి పాన్‌ కార్డు అనేది ముఖ్యమైనది మారిపోయింది. బ్యాంకు ఖాతా, లావాదేవీలు, ఇతర ఆస్తులకు సంబంధించిన వాటికి పాన్‌ కార్డు తప్పనిసరి. ఒకప్పుడు పాన్‌ కార్డు కావాలంటే కనీసం నెలకుపైగా సమయం పట్టేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి లేదు. త్వరగా కార్డు వచ్చేస్తోంది. కేవలం పది నిమిషాల్లోనే కార్డు పొందవచ్చు. కానీ దీనిని అత్యవసరంగా మాత్రమే వాడుకోవచ్చు. ఒరిజినల్‌ కార్డు కావాలంటే వారం రోజుల్లో అడ్రస్‌కు వచ్చేస్తోంది. ఈ పాన్‌ కార్డు పెద్దలకు మాత్రమే ఉండగా, 18 సంవత్సరాల్లోపు ఉన్న వారు కూడా పొందే వేసులుబాటు ఉంటుంది.

పిల్లల పేరుపై కావాలంటే..
పాన్‌ కార్డు తీసుకోవాలంటే సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన వారికి జారీ చేస్తారు. మీ పిల్లలకు పాన్‌ కార్డు కావాలంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కార్డును పొందాలంటే పలు విషయాలు గుర్తించుకోవాలి. పిల్లల పేరుపై పాన్‌ కావాలంటే తల్లిదండ్రులు వారి తరపున దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. సంబంధిత అభ్యర్థి క్యాటగిరి ఎంచుకునే సమయంలో వ్యక్తిగత సమాచారం పూర్తిగా తెలుపాల్సి ఉంటుంది. కార్డు దారుడు మైనర్‌ అయి ఉంటే వయసు ధృవీకరణ పత్రంతో పాటు తల్లిదండ్రుల ఫోటోతో, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల సహాయంతో పిల్లల పేరుపై పాన్‌కార్డు తీసుకోవచ్చు. అందుకు రూ.107 ఛార్జిని చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు నమోదు చేసి, డాక్యుమెంట్లపై అప్‌లోడ్‌ చేసి, అందుకు రుసుమును చెల్లించి సబ్మిట్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీకు రషీదు నంబర్‌ వస్తుంది. ఈ నంబర్‌ ద్వారా మీ దరఖాస్తు స్టేటస్‌ తనిఖీ చేసుకోవచ్చు. మీరు దరఖాస్తును సమర్పించిన తర్వాత మీకు ఇమెయిల్‌ వస్తుంది. వెరిఫికేషన్‌ సక్సెస్‌ అయిన తర్వాత మీకు 15 రోజుల్లో పాన్‌కార్డు అందుకుంటారు.

కావాల్సిన పత్రాలు:
పాన్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేయడానికి కొన్ని పత్రాలు అవసరం ఉంటుంటుంది. మైనర్ తల్లిదండ్రుల చిరునామా, దరఖాస్తుదారుని చిరునామా పత్రం అవసరం. అలాగే మైనర్ సంరక్షకుడు గుర్తింపు రుజువుగా ఈ డాక్యుమెంట్స్ అయిన ఆధార్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐ‌డిని సమర్పించాల్సి ఉంటుంది. ఇక అడ్రస్‌ వెరిఫికేషన్‌ కోసం మీ ఆధార్‌ కాపీ, పోస్టాఫీసు పాస్‌బుక్‌, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, ఒరిజినల్‌ రెసిడెన్సి సర్టిఫికేట్‌ అవసరమై ఉంటాయి. ఈ విధానం ద్వారా పిల్లల పేరుపై పాన్‌ కార్డు పొందవచ్చు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ పాస్.... సబితా ఇంద్రారెడ్డి.

*ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ పాస్.... సబితా ఇంద్రారెడ్డి.....!*

హైదరాబాద్‌: ఇంటర్‌ ఫస్టియర్‌ పలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఫెయిలైన ఫస్టియర్ విద్యార్థులను కనీస మార్కులతో పాస్‌ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్‌ విద్యార్థుల ఆందోళనలపై మంత్రి స్పందించారు. ''కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనా వేళ తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాం.

దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు అందించాం. వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి సమన్వయం సాధించాం. 9, 10 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ చేశాం. విద్యార్థి జీవితంలో ఇంటర్‌ విద్య చాలా కీలకం.

620 గురుకులలాను, 172 కస్తూర్బా కళాశాలలకు ఇంటర్‌కు అప్‌గ్రేడ్‌ చేశాం. ఇంటర్‌ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. టీ-శాట్‌, దూరదర్శన్‌ వెబ్‌సైట్‌ల ద్వారా పాఠాలు అందుబాటులో ఉంచాం. నెలరోజుల సమయమిచ్చి పరీక్షలు నిర్వహించాం.

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.4.50లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 49శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌ ఫలితాలపై వచ్చిన విమర్శలు సరికాదు. 10వేల మంది విద్యార్థులు 95శాతం మార్కులు సాధించారు.

ఇంటర్‌ బోర్డు తప్పు లేకున్నా నిందిస్తున్నారు. ఇంటర్‌ బోర్డు వద్ద ఆందోళనలు బాధాకరం. పార్టీలను పక్కనపెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడొద్దు.

విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు .. ఇంటర్‌ విద్యార్థులందరికీ మినిమం 35 మార్కులు ఇచ్చి అందిరినీ పాస్‌ చేస్తున్నాం. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో మంచి మార్కులు సాధించాలి. ఇలాగే ఆందోళనలు చేస్తే ఇంటర్‌ సెకండియర్‌లో కూడా పాస్‌ చేస్తారని ఆశించవద్దు'' అని మంత్రి సబితా ఇద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Telangana: 39,000 intermediate students apply for revalution

Telangana: 39,000 intermediate students apply for revalution

Hyderabad: In the aftermath of the intermediate exam result debacle in which 51 percent of students failed, the Telangana State Board of Intermediate Education (TSBIE) has received a record 39,039 applications for revaluation and 4,200 applications for recounting so far.

In order to deal with an excessive number of copies, the TSBIE has procured additional scanners. It has also set up 13 re-evaluation centers to divide the load.

The TSBIE had declared the first-year results after a long delay, causing an uproar as only 49% of students passed the exams. It also led to a massive protest across Telangana. According to a report by the Times of India, controller of examination, Sushil Kumar said, “Earlier, we would usually get applications from students who had cleared their exam but were unsatisfied with their marks. This time, majority applications are from failed students.”

Following the protest over the re-evaluation issue, education minister Sabitha Indira Reddy directed the board to reduce the re-evaluation fee. The board has reduced the charges to Rs 300 as opposed to the regular Rs 600.

Wednesday, December 22, 2021

క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించండి : హైకోర్టు

క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించండి : హైకోర్టు


Telangana High Court orders ban on New Year and Christmas celebrations due to severity of Omicron virus

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్ర‌మంలో.. క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించాల‌ని కోర్టు తెలిపింది. పండుగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా చూడాలని ప్రభుత్వం, అధికారులను ఆదేశించింది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర సర్కార్​ను ఆదేశించింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. రాష్ట్రాల సరిహద్దుల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. దిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాలని చెప్పింది

ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం స్వల్పమే.. మీరు తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు

ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం స్వల్పమే.. మీరు తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు

  • Courtesy by BBC తెలుగు మీడియా ట్విట్టర్    
  • జేమ్స్ గళ్లఘర్
  • బీబీసీ ప్రతినిధి

కరోనా

ఫొటో సోర్స్,GETTY IMAGES

దక్షిణాఫ్రికా, యూకేల్లో ప్రచురితమైన ప్రాథమిక అధ్యయనాల ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం స్వల్పంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌తో ఆసుపత్రి చికిత్స అవసరమయ్యే అవకాశం తక్కువ మందికే ఉంటుందని గత ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ వేరియంట్‌తో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య దాదాపు 30 నుంచి 70 శాతం తక్కువగా ఉంటుందని అంచనా వేశారు.

ఒమిక్రాన్ ప్రభావం స్వల్పంగానే ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే ఆందోళన మాత్రం అలాగే కొనసాగుతోంది.

యూకేలో తొలిసారిగా ఒకే రోజులో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ తీవ్రతపై లోతైన అవగాహన, వైరస్ పట్ల ఎలా స్పందించాలో నిర్ణయించడంలో దేశాలకు సహాయపడుతుంది.

కరోనా వైరస్‌తో పాటు ఆసుపత్రుల్లో చనిపోతున్నవారి సంఖ్యపై స్కాట్లాండ్ అధ్యయనం చేస్తోంది.


ఒమిక్రాన్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు

ఒకటి: ఆసుపత్రి చికిత్స అవసరమయ్యే అవకాశం 70 నుంచి 80 శాతం తక్కువ

ఒకవేళ ఒమిక్రాన్ కూడా డెల్టా వేరియంట్ తరహాలోనే ప్రవర్తిస్తే ఇప్పటికే 47 మంది ఆసుపత్రిలో చేరి ఉండాల్సిందని వారు అంచనా వేస్తున్నారు. కానీ అక్కడ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 15 మాత్రమే.

ఆసుపత్రిలో కచ్చితంగా చికిత్స అవసరమయ్యే వారి సంఖ్యలో దాదాపు మూడింట రెండొంతుల తగ్గింపు ఉందని పరిశోధకులు తెలిపారు. కేసులు కూడా తక్కువే నమోదు అవుతున్నాయని, కానీ కొంతమంది వృద్ధులకు దీనివల్ల ముప్పు పొంచి ఉందని అధ్యయనంలో తేలింది.

‘'ఇది అర్హత కలిగిన మంచి వార్త'' అని స్కాట్లాండ్ పబ్లిక్ హెల్త్‌లోని నేషనల్ కోవిడ్-19 ఇన్సిడెంట్ డైరెక్టర్ డాక్టర్ జిమ్ మెక్‌మెనామిన్ వర్ణించారు.

ఈ డేటా అంతా కూడా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గురించే తెలుపుతోంది. కానీ దీన్ని అదునుగా తీసుకొని మనం అజాగ్రత్తగా ఉండకూడదు'' అని ఆయన హెచ్చరించారు.

ఒమిక్రాన్ అసాధారణ వేగంతో వ్యాప్తి చెందుతోంది. ఇది స్వల్ప లక్షణాలు చూపించడం ఇప్పటివరకు మనకు ఊరట కలిగించే అంశం. ఒకవేళ అధిక సంఖ్యలో కేసులు నమోదైతే మాత్రం, స్వల్ప లక్షణాలు కూడా తీవ్ర పరిస్థితులకు దారితీయవచ్చు.

''ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకితే, మిగతా అందరిపై అది చూపించే ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కానీ వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ ఇది మరింత శక్తిమంతంగా తయారవుతుంది. అప్పుడు ఎన్‌హెచ్‌ఎస్‌లపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది'' అని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్క్ వూల్‌హౌస్ అన్నారు.

దక్షిణాఫ్రికాలో జరిగిన మరో అధ్యయనం కూడా ఒమిక్రాన్ ప్రభావం స్వల్పంగానే ఉన్నట్లు సూచిస్తోంది.

ప్రస్తుతం ఉనికిలో ఉన్న, గతంలో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల ఆసుపత్రి చికిత్స అవసరమయ్యే అవకాశం 70 నుంచి 80 శాతం తక్కువగానే ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది.

కానీ, కొంతమంది రోగులు మాత్రం, మిగతా వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ వల్ల కూడా ఆసుపత్రుల్లోనే తమ జీవితాలు చాలించాల్సి వచ్చిందని సూచించింది.

''అన్ని అధ్యయనాలను కలిపి చూస్తే ఒమిక్రాన్ తీవ్రత ఇతర వేరియంట్లతో పోలిస్తే తక్కువే అని తెలుస్తోంది. ఇది నిజంగా సానుకూలాంశం'' అని దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రొఫెసర్ చెరిల్ కోహెన్ అన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్

ఫొటో సోర్స్,GETTY IMAGES

రెండు: ఒమిక్రాన్‌ తీవ్రత ఎందుకు తక్కువ?

ఒమిక్రాన్‌గా వైరస్ రూపాంతరంలో మార్పులు, టీకాల వల్ల కలిగిన అధిక స్థాయి రోగ నిరోధక శక్తి కారణంగా ఈ వేరియంట్ మనపై చూపించే తీవ్రత తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

ఒమిక్రాన్ వైరస్‌లో జరిగిన ఉత్పరివర్తనల కారణంగానే ఇది డెల్టా వేరియంట్ కంటే తక్కువ తీవ్రత కలిగిన ఇన్‌ఫెక్షన్‌గా మారిందని లండన్ ఇంపీరియల్ కాలేజ్ విశ్లేషణలో తెలిసింది.

ఒకవేళ సరైన రోగ నిరోధక శక్తి లేకపోయినప్పటికీ, డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల ఎమర్జెన్సీ వార్డుల్లో చేరే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్పారు.

యూకేలో ఇప్పటికే అధిక స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరగడం వల్ల చాలా కొద్ది మందికి మాత్రమే ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తుతున్నాయి.

రోగనిరోధక శక్తి వల్ల ఒమిక్రాన్‌తో అత్యవసర చికిత్స పొందే అవసరం 25 నుంచి 30 శాతానికి తగ్గినట్లు, ఒకటి కంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన వారి శాతం 40 శాతం తగ్గినట్లు ఇంపీరియల్ కాలేజ్ అధ్యయనం తెలుపుతోంది.

'' కొంతవరకు వరకు ఇది శుభవార్తే'' అని ప్రొఫెసర్లలో ఒకరైన నీల్ ఫెర్గూసన్ అన్నారు.

''ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తే అవకాశం తక్కువగా ఉన్నంత మాత్రాన దీన్ని తక్కువగా తీసుకోకూడదు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోన్న తీరు చూస్తుంటే ఆసుపత్రుల్లో చేరికలు పెరగడం ఖాయంగా అనిపిస్తోంది. ఈ సంఖ్య పెరిగితే ఎన్‌హెచ్‌ఎస్‌లు కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని ఆయన హెచ్చరించారు.

ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవాలంటే బూస్టర్ డోస్ కావాల్సిందేనా?

మూడు: ‘సాధారణ జలుబుగా మారిపోయిందని చెప్పడం మాత్రం చాలా తప్పు’

ఇంపీరియల్ కాలేజ్ ఇమ్యునాలజిస్ట్ ప్రొఫెసర్ పీటర్ ఓపెన్ షా మరో హెచ్చరిక చేశారు. ''ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రంగా ఉండబోదని ప్రాథమిక లక్షణాలతో తెలిసింది. కానీ ఇప్పటివరకు జరిగిన మూడు అధ్యయనాలు ఈ వేరియంట్, సాధారణ జలుబుగా మారిపోయిందని చెప్పడం మాత్రం చాలా తప్పు'' అని ఆయన అన్నారు.

ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలతో ఉంటుందని చెప్పడానికి సరైన కారణాలను ప్రయోగశాల అధ్యయనాలు సూచించాయి.

శ్వాసమార్గాలపై ప్రభావం చూపడంలో చురుగ్గా పనిచేసే ఒమిక్రాన్ వేరియంట్, ఊపిరితిత్తుల్లోని లోతైన కణజాలాలలోకి ప్రవేశించలేదని హాంకాంగ్ యూనివర్సిటీ పేర్కొంది.

సాధారణంగా ఊపిరితిత్తుల్లో వైరస్ చూపించే ప్రభావం కారణంగా ప్రాణహాని కలుగుతుంది.

వైరస్ వల్ల తీవ్రంగా అనారోగ్యానికి గురైన వ్యక్తుల ఊపిరితిత్తుల్లోని కణాలు బిగుసుకుపోతాయి. ఒమిక్రాన్ వేరియంట్ ఈ తరహా ప్రభావం చూపలేదని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కనుగొంది.

ఒమిక్రాన్‌కు సంబంధించిన డేటాను వీలైనంత త్వరగా ప్రచురించాలని యూకే ఆరోగ్య భద్రతా ఏజెన్సీ భావిస్తోంది. ఇది వేరియంట్ తీవ్రతకు సంబంధించిన మరిన్ని సూచనలు ఇవ్వనుంది

చెరువులను కబ్జా చేస్తుంటే మీరేం చేస్తున్నారు??

*తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారికి నమస్కారం 🙏*

*ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న పెద్ద చెరువుల పరిరక్షణకోసం Dr లుబ్నా సర్వత్ మేడం గారి ఆధ్వర్యంలో ప్రజా సంకల్పం & గంగపుత్ర సంఘము పోరాటం చేస్తుంది. రెండు చెరువుల వాస్తవ వైశాల్యం ఎంత ప్రస్తుతం ఎంత వుంది,ఈ రెండు చెరువులను కబ్జాల నుండి, పర్యావరణ కాలుష్యం నుండి కాపాడడానికి, భూగర్భ జలాలను పెంపొందించడానికి చెరువుల పూడికతీత కోసం తెలంగాణ గౌరవ లోకాయుక్త హైదరాబాద్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ కొనసాగుతుంది.*

*కేటీఆర్ సారు గారు అసలు చెరువులను ఎవరు కబ్జా చేశారు?? చెరువు తూములను ఎవరు ముశారు?? మీరు వరదలు వచ్చినప్పుడు రామంతాపూర్ వచ్చి చెరువులు కబ్జా గురించి అధికారులను నీలాదీశారు & చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు ఇచ్చారు కదా మరి ఈరోజు వరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు ఎందుకు?? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు వుంది. మీరు పురపాలక శాఖ మంత్రివర్యులు కదా.*

*సర్ ఇప్పుడు చెరువు నిండి ఇండ్లలోకి నీరు వస్తుంది అని కొత్తగా పది కోట్లతో మూసీ నది వరకు పైపు లైను వేస్తున్నారు కదా ఈ 10కోట్లు ఎవరివి సర్?? చెరువు కబ్జా చేసి అక్రమనిర్మాణాలు చేసి చెరువు తూములను ముసివేసి తూము నాలాను కబ్జా చేసిన వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా న్యాయంగా పన్నులు కడుతున్న ప్రజల డబ్బును ఇలా అక్రమార్కుల కోసం మీరు వినియోగించడం న్యాయమేనా జవాబు చెప్పండి మంత్రి గారు.*

*చెరువు ఎందుకు నిండింది?? ఇండ్లలోకి నీరు ఎందుకు వస్తుంది??దీనికి కారణం ఎవరు?? ఈరోజు వరకు అధికారులు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు??వీటికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది అని ప్రజా సంకల్పం & link Media ద్వారా ప్రశ్నిస్తున్నాము... Bplkm*

*కేటీఆర్ సారు గారు చెరువులను కబ్జాల నుంచి కాపాడాలి అని తెలంగాణ గౌరవ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేయడం చూస్తుంటే న్యాయస్థానాల ఆదేశాలకు ఎలా గౌరవం ఇస్తున్నారో తెలుస్తుంది*

*Copy to Group link Media* &  *All Print & Electronic Media*
22/12/2021

Bapatla Krishnamohan 

prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణలో దంపతుల బదిలీలపై.... మార్గదర్శకాలు జారీ*

*తెలంగాణలో దంపతుల బదిలీలపై.... మార్గదర్శకాలు జారీ*

హైదరాబాద్‌: జోనల్ విధానానికి అనుగుణంగా కొత్త పోస్టింగుల్లో చేరాకే అప్పీళ్లు సహా స్పౌస్‌ కేసుల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా చేసే కేటాయింపులపై అభ్యంతరాలు ఉంటే ఉద్యోగులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ముందు కొత్త పోస్టింగుల్లో చేరాకే అప్పీల్‌కు అవకాశం కల్పించారు. జిల్లా కేడర్ ఉద్యోగులు జిల్లా శాఖాధిపతికి.. జోనల్, మల్టీజోనల్ కేడర్ ఉద్యోగులు వారి శాఖాధిపతులకు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన అప్పీళ్లన్నింటినీ సంబంధిత శాఖ కార్యదర్శికి శాఖాధిపతులు నివేదించాల్సి ఉంటుంది. పూర్తి విచారణ తర్వాత త్వరితగతిన అప్పీళ్లను పరిష్కరించాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు స్పౌస్‌ కేసులకు సంబంధించి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. ఉద్యోగులైన భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా స్పౌస్‌ కేసులను పరిశీలించనుంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా చేసే కేటాయింపుల్లో చేరిన తర్వాతే స్పౌస్‌ కేసుల కింద దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. జిల్లా కేడర్ ఉద్యోగులు జిల్లా శాఖాధిపతికి... జోనల్, మల్టీజోనల్ కేడర్ ఉద్యోగులు వారి శాఖాధిపతులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శాఖాధిపతులు స్పౌస్‌ కేసు దరఖాస్తులన్నింటినీ పరిశీలించి తగిన సిఫార్సులతో సంబంధిత శాఖ కార్యదర్శికి నివేదించాల్సి ఉంటుంది. వాటన్నింటిని పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

*సుజీవన్ వావిలాల🖋️ప్రజల పక్షం*

Tuesday, December 21, 2021

తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య..!

తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య..!

బంగారు తెలంగాణలో మరో రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. పండిన పంట చేతికందక.. అప్పులు తీర్చలేక మానసిక క్షోభ అనుభవించి తనువు చాలించాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన యాదయ్య అనే రైతుకు కొంత సొంత భూమి ఉంది. దాంతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. కానీ.. అకాల వర్షాలు అతడిని నిండా ముంచేశాయి.


వ్యవసాయం చేసేందుకు యాదయ్య రూ.15 లక్షల వరకు అప్పు చేశాడు. వర్షానికి పంటంతా దెబ్బ తినడంతో.. కౌలు డబ్బులు చెల్లించలేక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్థాపంతో పురుగుల మందు తాగాడు యాదయ్య. ఇతనికి భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు.

Telangana | 20 మంది నాన్ క్యాడ‌ర్ ఎస్పీల‌కు ప‌దోన్న‌తి

Telangana | 20 మంది నాన్ క్యాడ‌ర్ ఎస్పీల‌కు ప‌దోన్న‌తి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన‌ 20 మంది నాన్ క్యాడ‌ర్ ఎస్పీల‌కు ఐపీఎస్ హోదా ల‌భించింది. ఈ 20 మంది ఎస్సీల‌కు ఐపీఎస్‌గా ప‌దోన్న‌తులు క‌ల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ప‌దోన్న‌తులు పొందిన వారిలో ఎన్ కోటిరెడ్డి, ఎల్ సుబ్బ‌రాయుడు, కే నారాయ‌ణ‌రెడ్డి, డీవీ శ్రీనివాస్ రావు, టీ శ్రీనివాస్ రావు, టీ అన్న‌పూర్ణ‌, పీవీ ప‌ద్మ‌జా, జాన‌కి ధ‌రావ‌త్, పీ యాద‌గిరి, కేఆర్ నాగ‌రాజు, ఎం నారాయ‌ణ‌, వీ తిరుప‌తి, ఎస్ రాజేంద్ర‌ప్ర‌సాద్, డీ ఉద‌య్ కుమార్ రెడ్డి, కే సురేశ్ కుమార్, బీ అనురాధ‌, సీ అన‌సూయ‌, షేక్ స‌లీమా, ఆర్ గిరిధ‌ర్, సీహెచ్ ప్ర‌వీణ్ కుమార్ ఉన్నారు.

ప్రభుత్వభూములను ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రజలకు తెలియపరచాలి

*ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులకు నమస్కారం 🙏*

*ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప్పల్ MRO పరిధిలో గల ప్రభుత్వభూముల వివరాలు అధికారులు ప్రజలకు అందుబాటులో పెట్టలేదు.ప్రభుత్వభూములలో కొందరు అక్రమంగా ప్లాట్స్ చేసి అమ్ముతుంటే ప్రజలు తెలియక ప్రభుత్వభూములలో ప్లాట్స్ కొని మోసపోవడం మళ్ళీ న్యాయస్తానాల చుట్టూ తిరుగడం కరెక్ట్ కాదు. అందుకే ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులకు ప్రజా సంకల్పం & link Media విజ్ఞప్తి చేయడం ఏమనగా ఉప్పల్ MRO కార్యాలయంలో ప్రభుత్వభూములను ప్రజలకు తెలిసేవిధంగా సమాచారం అందుబాటులో పెట్టాలి మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలిసేలా చేయాలి....Bplkm*

*ఓ జర్నలిస్ట్ మిత్రమా మేలుకో*

*సమాజం నికొరకై ఎదురుచూస్తుంది. ని కలానికి పని చెప్పు..*

*నిజమైన జర్నలిస్ట్ అనిపించుకో.... Bplkm*

*Copy to Group link Media*
21/12/2021

Bapatla Krishnamohan

prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

యూని‘ఫామ్‌’లోకి రానివ్వరా?

యూని‘ఫామ్‌’లోకి రానివ్వరా?

Courtesy by సాక్షి మీడియా ట్విట్టర్ 21 Dec, 2021 03:08 IST|Sakshi

పోలీస్‌ శాఖలో ‘ఆమె’కేదీ ప్రాధాన్యత..

356 ఎస్‌హెచ్‌ఓ పోస్టుల్లో ఇద్దరే మహిళా ఇన్‌స్పెక్టర్లు! 

‘శాంతిభద్రతల’లో మహిళలకు దక్కని అవకాశాలు 

మహిళా పోలీస్‌స్టేషన్లలోనూ పురుష అధికారులే 

16 మహిళా పీఎస్‌ల్లో 13 మంది వారే 

ఏళ్ల తరబడి యూనిఫామ్‌ వేయకుండానే నాన్‌ఫోకల్‌ డ్యూటీలు.. బదిలీల్లో రాజకీయ జోక్యమే కారణమనే ఆరోపణలు  

సాక్షి, హైదరాబాద్‌: ఆకాశంలో సగం, అర్ధాంగి.. మహిళల గురించి తరచూ చెప్పుకునే, వినే పదాలివి. రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం.. ప్రతీ రం గంలోనూ పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నారు. ఉద్యోగాల్లోనూ ఉన్నత స్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. కానీ తెలంగాణ పోలీస్‌ శాఖలో మాత్రం చాలామంది మహిళా అధికారులకు ప్రాధాన్యత లభించడం లేదని, శాంతి భద్రతల విభాగంలో అవకాశంతో పాటు ఫోకల్‌ (ప్రాధాన్యత కలిగిన) పోస్టులు దక్కడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొంతమంది ఎప్పుడో ఉద్యోగంలో చేరిన కొత్తలో శాంతి భద్రతల విభాగంలో డ్యూటీ చేశారంటే.. ఇప్పటివరకు మళ్లీ పోలీస్‌ యూనిఫామ్‌ వేసింది లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. నియామకాల్లో భాగంగా సివిల్‌ కేటగిరీలో 33% రిజర్వేషన్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో 10% రిజర్వేషన్‌ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మహిళా అధికారులు, సిబ్బంది సంఖ్య భారీగా పెంచాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ మహిళా పోలీస్‌ అధికారులకు పోస్టింగుల విషయంలో మాత్రం న్యాయం జరగడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. 

నల్లగొండ, సూర్యాపేటల్లో మహిళా ఎస్‌ఐలే లేరు 
తెలంగాణ ఏర్పాటు తర్వాత చేపట్టిన నియామకాలతో మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే ట్రైనింగ్‌లో పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వర్తించడంతో పాటు ప్రొబేషన్‌ పూర్తయ్యే లోపు ఒక పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా పనిచేయాల్సి ఉం టుంది. ఈ నిబంధనలను సైతం పోలీస్‌ శాఖ పక్కన పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 60లోపు మాత్రమే మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్లు శాంతి భద్రతల విభాగంలో పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబరాబాద్‌ పరిధిలోని మాదాపూర్‌ జోన్‌లో నలుగురు, బాలానగర్‌ జోన్‌లో ఇద్దరు మహిళా ఎస్‌ఐలు ఉండగా.. శంషా బాద్‌ జోన్‌లో ఒకే ఒక్కరు ఉన్నారు. రాచకొండ పరిధిలో ఎల్‌బీనగర్‌ జోన్‌లో ఇద్దరు ఉండగా.. మల్కా జ్‌గిరి జోన్‌లో ఒక్క మహిళా ఎస్‌ఐ కూడా లేకపోవడం గమనార్హం.

భువనగిరి జోన్‌లో ఒకే ఒక్కరు ఈ విభాగంలో ఉన్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో సెంట్రల్‌ జోన్, ఈస్ట్‌జోన్, సౌత్‌జోన్‌లో ఒక్కొక్కరు చొప్పున ఉండగా, వెస్ట్‌జోన్‌లో ఇద్దరు, నార్త్‌జోన్‌లో నలుగురు ఉన్నారు. నల్లగొండ, సూర్యా పేట జిల్లాల్లో ఒక్క మహిళా ఎస్‌ఐ కూడా లేరు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, సంగారెడ్డి, రామగుండం, మహబూబ్‌నగర్‌లో ఒక్కొక్కరు మాత్రమే ఉండగా ఖమ్మంలో ఎనిమిది మంది, మెదక్‌లో ఇద్దరు, వనపర్తిలో ముగ్గురు, జోగులాంబ గద్వాలలో ఆరుగురు, సిద్దిపేటలో ఇద్దరు, నిర్మల్‌లో ముగ్గురు మహిళా ఎస్‌ఐలు పనిచేస్తున్నారు. 

ఈ జిల్లాల్లో ఎక్కువమంది.. 
మహిళా ఎస్‌ఐలు శాంతి భద్రతల విభా గాల్లో పనిచేస్తున్న జిల్లాల్లో జగిత్యాల, ఆదిలాబాద్, వరంగల్‌ కమిషనరేట్లు టాప్‌లో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 9 మంది, ఆదిలాబాద్‌ జిల్లాలో 8 మంది, వరంగల్‌ కమిషనరేట్‌ లో 9 మంది మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్లు లా అండ్‌ ఆర్డర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. 1996 బ్యాచ్‌లో ఎస్‌ఐగా పోలీస్‌ శాఖలో అడుగుపెట్టిన అధికారుల నుంచి 2012 బ్యాచ్‌ వరకు మహిళా అధికారులు మొదట్లో ఒక రెండు పోలీస్‌స్టేషన్లలో లా అండ్‌ ఆర్డర్‌ విభాగంలో పనిచేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కనీ సం మహిళా ఠాణాలో కూడా అవకాశం రాకపోవ డం తీవ్ర నిరాశకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశా రు. సీఐడీ, ఏసీబీ, సీసీఎస్, డీసీఆర్‌బీ, ఐటీ కోర్‌టీం, షీటీమ్స్, సైబర్‌ క్రైమ్, కొన్ని చోట్ల ట్రాఫిక్‌ విభాగాల్లో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నారు.  

డీసీపీలు, అదనపు డీసీపీలదీ అదే పరిస్థితి 
గ్రూప్‌ వన్, ప్రమోషన్ల ద్వారా పోలీస్‌ శాఖలోకి అడుగుపెట్టిన మహిళా అధికారులదీ అదే పరిస్థితి కేవలం వరంగల్‌ మినహా ఎక్కడా కూడా శాంతి భద్రతల విభాగంలో మహిళా అధికారులకు పెద్దగా ప్రాధాన్యత దక్కింది లేదు. ట్రాఫిక్‌తో పాటు క్రైమ్, ఇతర విభాగాల్లో ఎస్పీ స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిలోనూ అవకాశం లేకపోవడం అధికారులను ఆవేదనకు గురిచేస్తోంది. అదే విధంగా అదనపు డీసీపీ శాంతి భద్రతలు, ట్రాఫిక్, క్రైమ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా మహిళలకు అవకాశం కల్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌/ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఏసీపీ/డీఎస్‌పీ స్థాయిలో మహిళా అధికారులకు ఫోకల్‌ పోస్టింగులు ఇవ్వాలని పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నా.. రాజకీయ పలుకుబడితో జరిగే బదిలీల కారణంగా ఇది సాధ్యపడటం లేదనే ఆరోపణలున్నాయి.

356లో ఇద్దరే ఇద్దరు
రాష్ట్రంలో శాంతి భద్రతల విభాగంలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌/ఇన్‌స్పెక్టర్‌(సీఐ) హోదా కల్గిన స్టేషన్‌ హౌస్‌అధికారి (ఎస్‌హెచ్‌ఓ) పోలీస్‌స్టేషన్లు 356 ఉన్నాయి. వీటిల్ల కేవలం ఇద్దరు మాత్రమే మహిళా ఇన్‌స్పెక్టర్లు (రాజన్న సిరిసిల్లా జిల్లా, మహబూబ్‌నగర్‌) మాత్రమే ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఉన్న మహిళా పోలీస్‌స్టేషన్లలోనూ పురుష అధికారులే ఎక్కువ ఠాణాలకు ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్నారు. మహిళల వేధింపుల కేసులు, భార్యాభర్తల కేసులతో పాటు సంబంధిత కేసులను పర్యవేక్షించాల్సిన స్థానాల్లో పురుషులుండటం వివాదాస్పదంగా మారుతోంది.

మొత్తం 17 మహిళా పోలీస్‌స్టేషన్లు ఉండగా.. 13 చోట్ల పురుషులే ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని మూడు ఠాణాల్లో, సరూర్‌నగర్‌ ఠాణాలో మాత్రమే మహిళా ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వస్తున్నారు. కనీసం నూతన జిల్లాల్లో అయినా మహిళా ఠాణాలు ఏర్పాటు చేస్తే కాస్తో కూస్తో యూనిఫాం వేసుకొని డ్యూటీలు చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అందని ద్రాక్షగా కమిషనర్‌ పోస్టు 
ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుతం తెలంగాణలో ఏ ఒక్క మహిళ ఐపీఎస్‌కూ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసే అవకాశం రాలేదు. అదనపు డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ హోదాల్లో ఐపీఎస్‌ అధికారులున్నా కమిషనర్‌గా మాత్రం అవకాశం దక్కడం లేదు. తమకు అవకాశం కల్పిస్తే సత్తా చాటుతామని మహిళా అధికారులంటున్నారు

Monday, December 20, 2021

ఆధార్‌-ఓటర్‌ బిల్లుకు ఓకే

ఆధార్‌-ఓటర్‌ బిల్లుకు ఓకే
  • విపక్షాల ఆందోళన నడుమనే లోక్‌సభ ఆమోదం
  • ఏటా నాలుగు సార్లు ఓటు నమోదు
  • ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు
  • తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు
  • ప్యానల్‌కు పంపాలని డిమాండ్‌
  • అవసరం లేదన్న కేంద్ర మంత్రి రిజిజు
  • బోగస్‌ ఓట్లు నిర్మూలించడానికేనని వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 20: ఓటర్‌ కార్డుకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పరిశీలన కోసం పార్లమెంటరీ ప్యానల్‌కు పంపాలని డిమాండ్‌ చేశాయి. బిల్లుపై సమగ్ర చర్చ జరగలేదని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నాయి. ఇంత ముఖ్యమైన బిల్లును ఇంత హడావుడిగా ఎందుకు తెస్తున్నారని కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించారు.

బిల్లును పార్లమెంటరీ ప్యానల్‌కు పంపాలన్న ప్రతిపాదనను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కొట్టిపారేశారు. బిల్లులోని చాలా అంశాలు.. న్యాయ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ సూచించినవేనన్నారు. అంతకుముందు ఆయన ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల మధ్యనే బిల్లుపై స్వల్ప చర్చ జరిగింది. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించినట్టు స్పీకర్‌ ప్రకటించారు. దీనిపై మజ్లిస్‌ ఎంపీ డివిజన్‌ ఆఫ్‌ ఓట్‌ కోరారు. బిల్లుకు మద్దతిచ్చినవారు ఎంతమంది, వ్యతిరేకించినవారు ఎంత మంది అనేది ప్రకటించాలని కోరారు. ఈ అభ్యర్థనను స్పీకర్‌ తిరస్కరించారు. బిల్‌ పాస్‌ అయిన వెంటనే లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

ఆధార్‌ లేదని తిరస్కరించవద్దు
బోగస్‌ ఓట్లను నిర్మూలించడంతో పాటు ఎన్నికల సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి పలు సవరణలు ప్రతిపాదించింది. దీనిని ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021 పేరుతో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రం ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. ఓటరుగా తన పేరును నమోదు చేసుకొనే వ్యక్తి ఆధార్‌ వివరాలు సమర్పించవలసిందిగా సంబంధిత అధికారులు కోరవచ్చు. ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్నవారి వివరాలు సరైనవా కావా నిర్ధారించుకోవడం కోసం కూడా అధికారులు ఆధార్‌ వివరాలను అడగవచ్చు. అయితే, ఆధార్‌ వివరాలు సమర్పించలేదన్న కారణంతో ఏ వ్యక్తి దరఖాస్తును తిరస్కరించరాదు. అలాగే ఓటరు జాబితాలో ఉన్న ఏ ఒక్కరి పేరును తొలగించరాదు. ఆధార్‌కు బదులుగా దరఖాస్తుదారులు వేరే ధ్రువ పత్రాలను సమర్పించవచ్చు. ఇందుకోసం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 23కు సవరణలు చేశారు.

భార్య స్థానంలో భాగస్వామి
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియను ప్రతీ సంవత్సరం నాలుగు సార్లు చేపట్టే విధంగా చట్టానికి సవరణలు చేశారు. ఇప్పటివరకు.. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండితేనే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుండేది. ఈ బిల్లు చట్టం అయితే ప్రతీ సంవత్సరం జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1 తేదీలను కటాఫ్‌గా నిర్ణయించి ఓటరు నమోదు ప్రక్రియ చేపడతారు. ఇందుకోసం చట్టంలోని సెక్షన్‌ 14కు సవరణలు చేశారు. లింగ సమానత్వంలో భాగంగా తాజా బిల్లులో సర్వీస్‌ ఓటర్లకు సంబంధించిన నిబంధనలు మార్చారు. సాయుధ బలగాల్లో పనిచేస్తున్న మహిళల భర్తలను కూడా సర్వీస్‌ ఓటర్లుగా పరిగణించనున్నారు. ఇందు కోసం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్‌ 20లో ‘భార్య’ స్థానంలో ‘భాగస్వామి’ అని చేర్చారు.

పౌరులు కాని వారికీ ఓటు హక్కు
ఓటు హక్కు దేశ పౌరులకే ఉంటుంది. ఆధార్‌ కార్డును ఈ దేశ పౌరులు కాకపోయినప్పటికీ ఇక్కడ నివాసం ఉండేవారికి కూడా ఇస్తారు. తాజా బిల్లు ప్రకారం ఓటరు నమోదుకు ఆధార్‌ను ధ్రువీకరణ పత్రంగా సమర్పించవచ్చు. అంటే ఈ దేశ పౌరులు కానివారు కూడా ఓటు హక్కు పొందే అవకాశం లభిస్తుంది. ఆధార్‌ కార్డు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.

  • శశి థరూర్‌, కాంగ్రెస్‌ ఎంపీ

హక్కులకు భంగం
వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీం కోర్టు నిర్దేశించిన ప్రమాణాలను ఈ బిల్లు ఉల్లంఘిస్తున్నది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నది.

  • అసదుద్దీన్‌ ఒవైసీ, మజ్లిస్‌ ఎంపి