Sunday, December 31, 2023

ప్రతిఒక్కరికి ధన్యవాదములు✊

_*ఈరోజు ఇంగ్లీష్ క్యాలెండరు ప్రకారం చివరి రోజు. ఈ సంవత్సరంలో నన్ను ఆప్యాయతగా పలకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదములు చెప్పాలనీ భావించాను. అందులో మీరు ఒకరు అందుకే మీకు నా ధన్యవాదములు 🙏... కిట్టు (కృష్ణమోహన్)*_

_*సమాజాన్ని డ్రైవ్ చేసే సత్తా ఉన్నవాళ్లు మనకెందుకులే అనుకోవడం బాధాకరం. ప్రజాస్వామ్యం మీద రాజకీయాల మీద అసహ్యించుకోవడం కంటే మన తలరాతలు మార్చే వ్యవస్థల మీద కాస్త దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.*_

_*చరిత్ర చూస్తే.. రాముడు గొప్పతనం రావణుండు ఉన్నప్పుడే.. మంచోడి గొప్పతనం చెడ్డోడు ఉన్నప్పుడు తెలుస్తుంది.*_

_*రాజకీయ నాయకుణ్ణి పనితీరును బట్టి ఎన్నుకోవాలి తప్ప వారి ప్రామిసెస్ ను బట్టి కాదు.*_

_*ఆనాడు విద్యార్థులకు సామాజిక స్పృహ ఉండేది.ప్రస్తుతం విద్యాసంస్థల నిర్వాకం వల్ల విద్యార్థులు రాజకీయాలలోకి రావడం లేదు.*_

*Bapatla Krishnamohan*
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/                                                     prj_snklpm9456 (Instagram)

Saturday, December 30, 2023

కొడంగల్ నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి కోసం KADA ఏర్పాటు.

KADA - Kodangal Area Development Authority 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి కోసం KADA ఏర్పాటు.
👉 GO జారీ చేసిన ప్రభుత్వం.

Chief Minister Revanth Reddy formed KADA for special development of Kodangal constituency.
 👉 GO issued by Govt.

https://twitter.com/Congress4TS/status/1741037720368271845?t=DcsOg-Hge7IFLzklQ-F5KA&s=19

ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరికాదు

రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరికాదని      మఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్సుమెంటు, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి వాటి అన్నింటిపైనా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మౌలికవసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా అందిస్తున్నాయో నివేదికను ఇవ్వాలన్నారు. 

ఇండ్ల ప్లాట్లకు రిజిష్ట్రేషను అయిన భూములను, ధరణిలో చూపించిన ప్రైవేటు యూనివర్సిటీకి అనుమతిని ఇచ్చారని, అలాంటివాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయనే నివేదికను ఇవ్వాలని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇండ్ల స్థలాల కింద రిజిష్టరు అయిన, వివాదంలో ఉన్న భూముల్లో యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారం వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులతో మన ఊరు-మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబధించి సమగ్రంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా జరిగిన నిధుల వినియోగంపైనా సమగ్రంగా విచారణ జరిపి, నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.

https://twitter.com/TelanganaCMO/status/1741112075429236850?t=38O6a2Gaw_7GSCtwOo_DeQ&s=19

కాలేజీ స్నేహితులను కలిసి పాత జ్ఞాపకాలతో ఈటెల

హైదరాబాద్ : యునివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, సైఫాబాద్ లో నిర్వహించిన  “Mega Alumni Meet -2023” లో పాల్గొని ప్రసంగించడం జరిగింది.

ఈ కాలేజీలో 1981 నుండి 84 వరకు హాస్టల్ ఉండి డిగ్రీ పూర్తి చేశాను. స్నేహితులను కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాలేజీ ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. అరే అని పిలవగలిగే హక్కు ఒక్క స్కూల్, కాలేజీ ఫ్రెండ్ కే ఉంటుంది.

ఆనాడు విద్యార్థులకు సామాజిక స్పృహ ఉండేది. ఏ వ్యవస్థ కొలాప్స్ అయినా రిపేర్ చేసుకోవచ్చు.. కానీ పొలిటికల్ లీడర్ కొలాప్స్ అయితే వ్యవస్థ కొలాప్స్ అవుతుంది.

సమాజాన్ని డ్రైవ్ చేసే సత్తా ఉన్నవాళ్లు మనకెందుకులే అనుకోవడం బాధాకరం. ప్రజాస్వామ్యం మీద రాజకీయాల మీద అసహ్యించుకోవడం కంటే మన తలరాతలు మార్చే వ్యవస్థల మీద కాస్త దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.

చరిత్ర చూస్తే.. రాముడు గొప్పతనం రావణుండు ఉన్నప్పుడే..
మంచోడి గొప్పతనం చెడ్డోడు ఉన్నప్పుడు తెలుస్తుంది.

రాజకీయ నాయకుణ్ణి పనితీరును బట్టి ఎన్నుకోవాలి తప్ప వారి ప్రామిసెస్ ను బట్టి కాదు.

నేను బయోలాజికల్ స్టూడెంట్ ను, ఎకనామిస్ట్ ను కాదు. కాని తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్ధిక మంత్రిగా నా ప్రసంగంలో మొదటి పేరాలో ఒక లైన్ రాశాను.. ఈడబ్బు, బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజలు తమ రక్త మాంసాలతో కష్టపడ్డ చెమటతో కట్టిన డబ్బులు.. ఈ డబ్బుకు పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపే భాద్యత ఉంది అని చెప్పిన. అది సైఫాబాద్ సైన్స్ కాలేజీ నేర్పిన చైతన్యం.

ఓల్డ్ ఈస్ గోల్డ్ అని నేను బలంగా నమ్ముతా. ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ప్రజలది, న్యాయానిది, ధర్మానిది.

చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే.

సైఫాబాద్ కాలేజీ ఇచ్చిన చైతన్యంతో పెరిగిన.. ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ తేలేదు. ఇక మీద కూడా తేకుండా ఉంటానని మాట ఇస్తున్నాను.

https://twitter.com/Eatala_Rajender/status/1741067158309011794?t=RQ0tiwaDTHbeRk3fMwkdXQ&s=19

ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula ఆగ్రహం!

'ప్రజా పాలన' దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు.

రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు. 'ప్రజా పాలన' దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి 'ప్రజా పాలన' కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, 'ప్రజా పాలన' దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 'ప్రజా పాలన' కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 'ప్రజా పాలన' క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు సీఎం మరోసారి స్పష్టంగా సూచించారు.

#Prajapalana

https://twitter.com/TelanganaCMO/status/1741002695086117239?t=sYa_8ipIk4urGmUFc1ca-Q&s=19

Thursday, December 28, 2023

BRS పాలనలో 8లక్షలకోట్ల ప్రభుత్వ భూములు కబ్జా

https://x.com/Praja_Snklpm/status/1740623940010291654?t=-3YIbsSpqC1sgy15sufBPg&s=08                                                                                               _*#ప్రజాస్వామికతెలంగాణ సీఎం @revanth_anumula సారుకు దండాలు 🙏*_
_*సర్ గత ప్రభుత్వం /ప్రజాప్రతినిధులు / బ్యూరోక్రాట్స్ /దొర బంధుమిత్రులు ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జాలు చేశారు.#మేడ్చల్ జిల్లాలో అయితే చెప్పనక్కరలేదు. ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ల ద్రుష్టికి తీసుకొచ్చినా చర్యలు తీసుకోలేదు.#ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం లో మొత్తం ప్రభుత్వ భూములు &  చెరువులు & (దేవాదాయ & గ్రామకంఠ)భూములను కబ్జా చేశారు. ఇందులో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉంది. వారిమీద చర్యలు తీసుకోవాలి.కబ్జాలు అయిన ప్రభుత్వ భూములను స్వాధీణంచేసుకోవాలి అట్టి భూములను ప్రజాప్రయోజనాలకోసం ఉపయోగించాలి అని 'ప్రజాసంకల్పం' విజ్ఞప్తి చేస్తుంది.*_

*@TelanganaCMO @Bhatti_Mallu @mpponguleti*  *@TelanganaCS @seethakkaMLA @KondaSurekha @DamodarCilarapu @PonnamLoksabha @OffDSB @UttamINC @KomatireddyKVR @zson_bakka @ADayakarINC @RamMohanINC @Congress4TS*

*@dr_mvreddy @RSPraveenSwaero @ProfKodandaram @K_Nageshwar @RamsGTRK @Narhariyarabotu @RaviVattem @BplplH*

Wednesday, December 27, 2023

ENCROACHMENT BY MALLAREDDY INSTITUTE OF MEDICAL SCIENCES

ENCROACHMENT BY MALLAREDDY INSTITUTE OF MEDICAL SCIENCES

Hyderabad  27 Dec 2023

To
Joint Metropolitan Commissioner
HMDA, Hyderabad
       
Dear Joint Commissioner Smt Kata Amrapali garu,
Greetings of Peace

Sub: MallaReddy Institute of Medical Sciences encroaches Channel connecting the two notified/identified water bodies HMDA lake Id 2843 and Lake ID 2819

Ref: ISRO NRSC Bhuvan's Satellite imageries of 2012-2016 with and without Cadastral; and, Google Earth Satellite Imagery of December 2021 and May 2023.  (attached)

We congratulate you on being appointed as Joint Commissioner HMDA by Hon'ble Chief Minister Anumula Revanth Reddy garu. We wish you successful tenure of work without fear or favour.

It is observed that Mallareddy Institute of Medical Sciences, Qutubullapur, has encroached the channel connecting the upstream lake ID 2819 Lingam Cheruvu and the downstream lake ID 2843 Bhajanshai Kunta GHMC.  Even in the year 2023 further part of the channel has been landfilled as per historical google earth imageries.

It is also observed that the weblink of HMDA https://lakes.hmda.gov.in/ does not contain FTL/Cadastral maps of LakeID 2819 and LakeID 2843 but the adjacent lakeID 2844 is available.

ISRO NRSC Bhuvan's Satellite imageries of 2012-2016 with and without Cadastral; and, Google Earth Satellite Imageries of December 2021 and May 2023 are attached herewith for your ready reference.

We trust your prompt action.  Any further assistance from our end in public interest, plz be assured.

Address of the Institute:
Mallareddy Institute of Medical Sciences
Sy No. 138, Suraram Main Road,
GHMC Quthbullapur,
Jeedimetla, Hyderabad – 500 055.
MRIMS Ph: 8688820127,
MRH : 9676027777,
Fax: 040 2319 0238
Email: contact@mrims.edu.in, mrims.2012@gmail.com
https://www.mrims.edu.in/contact-us

best
Dr Lubna Sarwath
Long Live Lakes Campaign,
Hyderabad
9963002403

Sunday, December 24, 2023

తెలంగాణ వాచ్' కథనంతో ఉలికిపాటు

అద్దె కూడా కట్టలేదట.!



* 'తెలంగాణ వాచ్' కథనంతో ఉలికిపాటు
* అధికారుల వివరణలో బయటపడ్డ మరో వైనం
* మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ

కొండా లక్ష్మణ్​ తెలంగాణ స్టేట్ ​హార్టికల్చర్​ వర్సిటీకి చెందిన ప్యాక్​హౌస్​ను 11 నెలల కాలానికి ఆల్​ నాచురల్ ​రూట్స్ ఇంపెక్స్ కంపెనీకి లెట్ అవుట్ (అద్దె) కు ఇచ్చామని రిజిస్ట్రార్​ ఎ.భగవాన్​ తెలిపారు. ఆ కంపెనీ రెంట్​ఇవ్వకపోవడంతో నోటీసులు జారీ చేశామని 'తెలంగాణ వాచ్'లో "మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నీడలో..! రూ.500 కోట్ల స్థలం..నెలకు రూ.58 వేలకే.!" అంటూ వచ్చిన సంచలన పరిశోధన కథనానికి శనివారం ఆయన వివరణ ఇచ్చారు.

11 నెలలకే అద్దెకు అట.!:
వర్సిటీలోని పోస్ట్​ హార్వెస్ట్​ టెక్నాలజీ రీసెర్చ్​స్టేషన్​కు సంబంధించిన ప్యాక్​హౌస్​లో బీఎస్సీ హార్టికల్చర్ ​నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వ్యాల్యూ యాడెడ్​ప్రొడక్ట్స్​పై ప్రయోగాలు చేయడానికి, హ్యాండ్స్​ఆన్​ఎక్స్​పీరియన్స్​లో భాగంగా విద్యార్థులకు సహాయ పడేందుకు ఆల్​ నాచురల్ ​కంపెనీకి రెంట్ కు ఇచ్చినట్టు తెలిపారు. 2022 డిసెంబర్​17న నిర్వహించిన వర్సిటీ బోర్డు మీటింగ్​లో 11 నెలల పాటు అద్దెకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు.

2024 మే 31వ తేదీ వరకు మాత్రమే..:
మొదట 11 నెలలకు ఓకే చెప్పిన తర్వాత 33 నెలలకు అగ్రిమెంట్​పొడిగించాలని సదరు సంస్థ తమను అభ్యర్థించిందని పేర్కొన్నారు. నెలకు రూ.58,734 రెంట్ తో పాటు కరెంట్, వాటర్​బిల్లులు చెల్లించేలా 2023 జూన్​ ఒకటో తేదీన అగ్రిమెంట్​ చేసుకున్నామని వెల్లడించారు. ఈ అగ్రిమెంట్​ 2024 మే 31వ తేదీ వరకు ఉంటుందని వివరించారు. ‘‘అగ్రిమెంట్​చేసుకున్న నాటి నుంచి ఆల్ నాచురల్ సంస్థ వర్సిటీకి రెంట్ తో పాటు కరెంట్, వాటర్​బిల్లులు చెల్లించలేదు. అవి చెల్లించాలని ఈ నెల 15న సదరు సంస్థకు నోటీసులు ఇచ్చాం. ఆయా బిల్లుల రసీదులను ఈ నెల 21లోగా సమర్పించకుంటే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించాం” అని పేర్కొన్నారు. అద్దె ప్రాతిపదికన 33 నెలలకు ఒప్పందం చేసుకుని, భూమిని అప్పగించారనేది అవాస్తవమని తెలిపారు. 11 నెలల కాలానికే లెట్​అవుట్​ అగ్రిమెంట్​చేసుకున్నామని, ఈ ఒప్పంద కాలాన్ని 33 నెలలకు మించి పొడిగించే అధికారం వర్సిటీకి, వైస్​చాన్స్​లర్​కు, బోర్డ్​ఆఫ్​ మేనేజ్​మెంట్​కు లేదన్నారు.

ఆ ఒప్పందంతో సంబంధం లేదు : మాజీ మంత్రి
హార్టికల్చర్​వర్సిటీకి సంబంధించిన ఐదెకరాల భూమిని ఒక సంస్థకు అప్పగిస్తూ వర్సిటీ స్థాయిలో చేసుకున్న ఒప్పందానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ @Revanth_Anumula పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం

రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ @Revanth_Anumula పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఆదివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే 'ప్రజాపాలన' కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఈ కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించనున్నారు. దీనితోపాటు, ఆర్థిక సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకై ప్రకటించిన ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. 

నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకై ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చడం, జవాబుదారీగా ఉండేందుకై ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. డిసెంబర్ 28వ తేదీ నుండి 2024 జనవరి 6వ తేదీ వరకు (సెలవు రోజులు మినహాయించి మొత్తం 8 పనిదినాలు) ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలనుండి సాయంత్రం 6 గంటలవరకు ఈ ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తారు. అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చొప్పున అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తాయి.

ఈ ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్/ కార్పొరేటర్/ కౌన్సిలర్ లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కోదానికి ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడంతోపాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు.  

ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొంటారు.

Friday, December 22, 2023

రూ.500 కోట్ల స్థలం..నెలకు రూ.58 వేలకే.!

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నీడలో..!



# రూ.500 కోట్ల స్థలం..నెలకు రూ.58 వేలకే.!
# హార్టికల్చర్ వర్సిటీలో అద్దె బాగోతం 
# 'అద్దె' కింద రహస్యంగా అగ్రిమెంట్!
# స్థలం బదలాయింపులో వర్సిటీ అధికారుల పాత్ర.. 
# గత ప్రభుత్వ పెద్దల హస్తం.?

(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

ఐదెకరాల భూమి.. విలువ రూ.500 కోట్లకు పైనే. హైదరాబాద్ శివారులో ఉన్న ఇంతటి విలువైన భూమిని అద్దె పేరుతో అప్పనంగా అప్పగించేసింది గత సర్కారు. ఓ ప్రైవేటు సంస్థతో తగ్గువకే రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. లీజుకు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోకపోవడంతో 'రెంట్' అంటూ కొత్త విధానానికి తెరలేపింది. అత్యంత రహస్యంగా నడిపిన ఈ అద్దె బాగోతం 'తెలంగాణవాచ్' తాజా పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. కోట్లు విలువ చేసే వర్సిటీ భూములను ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం ఏకంగా వర్సిటీకి కొత్త జిల్లాలో కొత్త భవనాలు నిర్మించి మరీ ఈ బరితెగింపుకు నిర్లజ్జగా తెరలేపారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నీడలోనే ఇదంతా జరిగింది. సిఐడి దర్యాప్తు చేస్తే మొత్తం బాగోతం బయటకు వస్తుంది.

నెలకు రూ.58 వేలు.!:
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ వర్సిటీకి 55 ఎకరాల భూమి ఉంది. ఇవి శంషాబాద్ హైవేక్ దగ్గర్లోనే ఉన్నాయి. హార్టికల్చర్ వర్సిటీని రాజేంద్రనగర్ నుంచి సిద్దిపేట జిల్లా ములుగులో కొత్తగా కట్టిన భవనంలోకి షిఫ్ట్ చేశారు. దీంతో చాలా కాలంగా రాజేంద్రనగర్ లో వర్సిటీ రీసెర్చ్ కార్యకలాపాలు పెద్దగా జరగడం లేదు.

సర్వే చేస్తున్న క్రమంలో..:
హార్టికల్చర్ వర్సిటీ భూములను హైకోర్టు భవన నిర్మాణం కోసం తీసుకునేందుకు సర్వే చేస్తున్న క్రమంలో... అప్పటి గవర్నమెంట్ పెద్దలకు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్లకు సంబంధించి 5 ఎకరాల్లో ఉన్న ప్యాక్ హౌస్ బిల్డింగ్, భూములపై కన్ను పడింది. ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.వంద కోట్ల వరకు పలుకుతున్నది. ఈ 5 ఎకరాల విలువ రూ.500 కోట్ల దాకా ఉంటుంది. 'ఆల్ నాచురల్ రూట్స్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థతో అద్దె ప్రాతిపదికన పేరుతో 33 నెలలకు అగ్రిమెంట్ చేసుకుని ఈ భూమిని అప్పగించారు.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్యాక్ హౌస్, దాని చుట్టూ ఉన్న స్థలానికి నెలకు రూ.58,374 చొప్పున అద్దె చెల్లించేలా కట్టబెట్టారు.

లీజుకు ఇవ్వడం కుదరక..: లీజు ఇవ్వడం కుదరకపోవడంతోనే 'అద్దె' పేరుతో భూమిని అప్పగించారని తెలుస్తున్నది. 2022 ఆగస్టు 08న ఆల్ నాచురల్ సంస్థ ఎండీ అల్ల రాజు.. సదరు స్థలాన్ని లీజుకు ఇవ్వాలంటూ అప్పటి అగ్రికల్చర్ మంత్రికి ప్రతిపాదన పంపారు. దీన్ని 2022 ఆగస్టు 10న వర్సిటీ అధికారులకు పంపించారు.

నిబంధనలు ఒప్పుకోవని..:
అయితే స్టాఫ్, విద్యార్థులు వినియోగించే రీసెర్చ్ స్టేషన్ ను లీజుకు ఇవ్వడం సాధ్యంకాదని, ఇందుకు నిబంధనలు ఒప్పుకోవని కొత్త విధానానికి తెరలేపారు. 2022 డిసెంబర్ 17న ప్యాక్ హౌసు అద్దె కింద ఇచ్చేందుకు యూనివర్సిటీ బోర్డు మీటింగ్ లో 'అప్రూవల్' ఇచ్చారు. దీన్ని 33 నెలల వరకు అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ వ్యవహారం బయటికి పొక్కితే వివాదాస్పదమవుతుందని అత్యంత గోప్యంగా ఉంచారు. స్థలం బదలాయింపులో కొంతమంది వర్సిటీ అధికారులు కీలకపాత్ర పోషించినట్లు చర్చ సాగుతున్నది.

భారీ వెంచర్ ఉండటంతో..
హార్టికల్చర్ భూములకు పక్కనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ భారీ ఎత్తున వెంచర్ వేస్తున్నది. పెద్ద మాల్ కూడా వస్తున్నది. భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందన్న కారణంతో ఈ స్థలాన్ని 'అద్దె' పేరుతో ముందు హస్తగతం చేసుకుని, భవిష్యత్తులో పెద్దఎత్తున వ్యాపారకార్యకలాపాలు నిర్వహించవచ్చని ప్లాన్ చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో కీలకమైన మంత్రి నిరంజన్ రెడ్డి 
ఆయన అనుచరులతో కలిసి ఈ స్థలాన్ని లీజుకు అప్పగించడానికి పూర్తిగా సహకరించినట్లు తెలుస్తున్నది.

పైకి అంతా లీగల్ గానే..అంటే.!:
వర్సిటీస్థలం వృథాగా ఉండకూడదనే ప్యాక్ హౌస్ బోర్డు నిర్ణయం జరిగింది. అంతా లీగల్ గానే జరిగింది. ఇప్పటి వరకు అక్కడ కార్యకలాపాలు జరగలేదు. హైకోర్టు నిర్మాణానికి యూనివర్శిటీ భూములను సేకరించే అంశంపై ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారంలేదు.
-నీరజ ప్రభాకర్, వీసీ, హార్టికల్చర్ వర్సిటీ


జర్నలిస్ట్

_*ALL INDIA WORKING JOURNALISTS ASSOCIATION & TELANGANA JOURNALISTS SANKSHEMA SANGHAM.... రవీంద్రభారతి .... Bplkm🪶*_

Thursday, December 21, 2023

పోలీస్ ఉద్యోగాల భర్తీలో జీవో నెం. 46 లో మార్పులు

పోలీస్ ఉద్యోగాల భర్తీలో జీవో నెం. 46పై ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula కి మంత్రి శ్రీ @UttamINC తో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. జీవో నుంచి కోడ్ నెం. 24 TSSP (5000) మినహాయించాలని కోరారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, వారి దృష్టికి స్థానిక నిరుద్యోగుల ఇబ్బందులను  తీసుకెళ్లారు.

CD1, CD2 ప్రకారం ఫలితాలు ప్రకటించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలన్నారు. చాలా జిల్లాల్లో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఉమ్మడి జిల్లాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకం చేసిన లేఖను ముఖ్యమంత్రికి అందించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ కుందూరు జై వీర్ రెడ్డి, శ్రీమతి @UttamPadmavathi, శ్రీ బాలు నాయక్, శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, శ్రీ @IlaiahBeerla, శ్రీ మందుల సామ్యూల్, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

https://twitter.com/TelanganaCMO/status/1737832461953118631?t=iOAMYvkDTlj3iAf4T_g86w&s=19

మీడియా మిత్రులకు మనవి

మీడియా మిత్రులకు మనవి.


 రేపు  రవీంద్ర భారతిలో అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టు సంఘం, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అభినందన సభ.

  అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టు సంఘం, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వానికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది.  రేపు అనగా 22న రవీంద్ర భారతితో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు శ్రీ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మహిళా శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్. ధనసరి అనసూయ సీతక్కలు విశిష్ట అతిథులుగా హజరౌతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వున్న అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టు సంఘాల ప్రతినిధిలు, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘ రాష్ట్ర, జిల్లా, మండల ప్రతినిధులందరూ విధిగా హజరుకావాలని కోరడం జరుగుతోంది. జన జాగృతి కోసం, తెలంగాణ సమాజం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, నిరంకుశ పాలన నిర్మూలన కోసం ఇంత కాలం పని చేశాం. ఇప్పుడు జర్నలిస్టు సమాజం కోసం ఆలోచించాల్సిన తరుణమొచ్చింది. జర్నలిస్టుల జీవితాలలో వెలుగులు పంచాల్సిన సమయం ఆసన్నమైంది. మనమంతా కలిసి కొట్లాడి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి, కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాపాలన తెచ్చుకున్నాం. అందులో మనమందరం భాగస్వాములౌదాం..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరింత శ్రమిద్దాం..ఆ ఫలాలు రేపటి తరానికి అందిద్దాం...ఆ మార్గంలో పయనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరం కలిసి అభినందిద్దాం...మనమందరం ప్రభుత్వానికి తోడుగా వున్నామని మరో సారి నిరూపిద్దాం. మన ఐక్యతను చాటుదాం...జర్నలిస్టు సమూహం, సమాజం కోసం కూడా కొంత ప్రయత్నం చేద్దాం. వేలాదిగా జర్నలిస్టులు తరలిరండి.

Wednesday, December 20, 2023

"చలో హైదరాబాద్ ”... జర్నలిస్ట్

శీనన్న, సీతక్కలు వచ్చేస్తున్నారు.



ఓ నియంత దాస్య శృంఖలాలను తెంచుకొని స్వేచ్ఛ తెలంగాణ ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా ఏడబ్ల్యూజెఏ & టిజెఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో  

“చలో హైదరాబాద్ ”
నూతన ప్రజా ప్రభుత్వానికి అభినందన సభకు భారీగా తరలి రండి
చలో హైదరాబాద్.. 

22 డిసెంబర్ నాడు మధ్యాహ్నం 12 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించే ఈ సభకు, అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం & తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల జర్నలిస్టులు అందరూ రావాలని పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంగా జర్నలిస్టుల, ప్రజా సమస్యలు తీర్చే విధంగా జర్నలిస్టులు ముందుండాలని కోరుతున్నాము. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్, గిరిజన, శిశు, మహిళా సంక్షేమ శాఖామంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూర్య (సీతక్క) మనస్ఫూర్తిగా వచ్చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు భారీ సంఖ్యలో హాజరు కాలవాలని కోరుతున్నాం.

ఇట్లు

✍🏻

*_ఏ.ఎం.రాజురెడ్డి_*
*(అధ్యక్షులు, ఏడబ్ల్యూజెఏ, తెలంగాణ రాష్ట్రం)*
*_9490299542_* *_&_*
*గౌటి రామకృష్ణ(RK)*
*(ప్రధాన కార్యదర్శి)*
*తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం)*
*Ph:9394334646*


మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉన్నాడా?

https://x.com/Praja_Snklpm/status/1737347711408722370?t=aiVXptKG3jRJilDndxvOxQ&s=08                                                                         _*@Collector_MDL సారు దండాలు 🙏*_

_*కలెక్టర్ సారు #మేడ్చల్ జిల్లా #ఉప్పల్ మండలం పరిధిలో గల ప్రభుత్వభూములు కబ్జా అయ్యాయి. ఈ కబ్జాలు చేసింది ఎవరు అని #RTIA ద్వారా వివరాలు 20/12/2022 న అడిగితే ఈరోజు వరకు స్పందించడం లేదు అధికారులు ఎందుకు??*_
_*కలెక్టర్ సారు ఈ భూములను ఎవరెవరు మింగారో విచారణకు ఆదేశాలు ఇవ్వండి అది మీ బాధ్యత లేకపోతే 'ప్రజాసంకల్పం' న్యాయస్థానం లో PIL వేయడం ఖాయం ✊*_
*@TelanganaCMO*
*@BhattiCLP*
*@mpponguleti*

*Bplkm🪶*

Tuesday, December 19, 2023

అన్నీ మూసుకొని.…జాతికి క్షమాపణ ఎప్పుడు.?

అన్నీ మూసుకొని.…జాతికి క్షమాపణ ఎప్పుడు.?



■ 'వెధవలకు పదవులు' వస్తే..

■ అసెంబ్లీలో మారని తీరు

■ పార్టీని రక్షించుకునేందుకేనా.!

■ 'పార్లమెంట్' తర్వాత ప్రతిపక్ష హోదా కోల్పోనున్న భారాస.!

(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 94400009)

క్షమాపణ కోరటానికి స్థితప్రజ్ఞతతో కూడిన ఎంతో ధైర్యం అవసరం. అది నేటి రాజకీయ నాయకుల్లో..మరీ ముఖ్యంగా తెలంగాణ గులాబీ నాయకులకు. అసెంబ్లీలో కూడా అదే దొరతనం, అదే అహంకారం. అదే (ఆ)సమర్థన వెరసి వెర్రి వేయి విధాలుగా మారింది. తప్పు చేసినవాడు క్షమాపణ కోరటం అనేది ఓ అద్భుతం. అది చెప్పే ధైర్యం లేని వాడికి బతికే కనీస అర్హత ఉందా.? ఉంటుందా..? 

ఇవిగో మీ తప్పులు:

వందలాది మంది ఆత్మత్యాగాలతో ఆత్మగౌరవంతో ఏర్పడిన తెలంగాణలో వేలాది తప్పులు..ఎస్ 'వేలాది' తప్పులు నిర్లజ్జగా, నిస్సంకోచంగా, నిస్సందేహంగా జరిగాయి. ఓడిన తర్వాత 'దొర' బయటకు వచ్చి ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు, జరిగిన తప్పులకు క్షమాపణ కోరాడా..? పార్టీ పెద్దోళ్ళకే లేనప్పుడు 'అచ్చోసిన ఆంబోతు'లకు ఏం ఉంటుంది బుద్ది. ఎస్ బుద్ది. ఇక్కడ ప్రస్థావిస్తున్న విషయాంశాలను మీరు సమర్థించుకుంటే మీలాంటి వారి గురించి... ఓ అభ్యుదయ కవి చెప్పినట్లు..'వెధవలకు పదవులు' వస్తే.. నైతిక విలువలు ఎక్కడ ఉంటాయ్.? ఉన్నదంతా 'నీచ్ కమీన్ కుత్తే'లే కదా.!

ఇవి నిజం కాదా..? నయా 'నిజాం ప్రభువు'లూ..:

1). గతంలో హోం మంత్రి మహమూద్‌ అలీకి ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదని హోంగార్డు వెనక్కి పంపారు. 

2). ఆనాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తే.. అనుమతి లేదని పోలీసులు వెనక్కి పంపించారు.

3). సీఎంను కలిసేందుకు వెళ్లిన ప్రజాగాయకుడు గద్దర్‌ను కూడా అదే విధంగా అవమానించారు. గంటల కొద్దీ ఆయన్ను ప్రగతిభవన్‌ గేటు వద్ద నిలబెట్టారు. 

4). ఇద్దరు ఎమ్మెల్యేలు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ నిరసన తెలిపినందుకు వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేశారు.

5). అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్‌కు పిలిచి గౌరవించారా?

6). ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన కుటుంబాలతో కలసి ఎప్పుడైనా భోజనం చేశారా.?

7). పదేళ్లు అధికారంలో ఉండి మీమీద  కేసులు ఉపసంహరించుకున్నారు.సరే.! తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎందుకు ఎత్తివేయలేదు.?

8). తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న డీఎస్పీ నళినికి ఎందుకు న్యాయం చేయలేదు.? 

9). ధర్నాచౌక్‌ ఎత్తేసింది నిజం కాదా.?

10). పదేళ్లలో 8వేల మంది రైతుల ఆత్మహత్యలు నిజం కాదా.?

11). 'వరి వేస్తే.. ఉరే' అని చెప్పిన కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్‌ తన వడ్లను క్వింటాకు రూ.4,250కి అమ్ముకున్నారు. దీనిపై విచారణకు సిద్ధమా?

12). తలసరి విద్యుత్‌ వినియోగంలో 'తెలంగాణ నంబర్‌ వన్‌' అనేది పచ్చి అబద్ధం.

13). కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరు ఇస్తే పంపుసెట్ల సంఖ్య ఇంకా ఎందుకు పెరిగింది? 2014లో పంపుసెట్ల సంఖ్య 19 లక్షలు ఉంటే ఇవాళ 29 లక్షలకు చేరింది.

14). తెలంగాణ వచ్చాక కూడా కృష్ణా జలాలు ఎందుకు వినియోగించుకోలేకపోయాం?

15). ప్రత్యేక తెలంగాణలో కూడా పాలమూరు, చేవెళ్ల ప్రాంతంపై వివక్ష కొనసాగింది.

16). ప్రాణహిత - చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు.

17). మిడ్‌ మానేరు నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదు.

18). మేడిగడ్డలో ఫిల్లర్ల కుంగుబాటులో మీ తప్పు ఏం లేదా.?

19). ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కేసులు పెట్టి హింసించారు.

20). దళితులను లాకప్‌లలో పెట్టి.. కరెంట్‌ షాక్‌ ఇచ్చి హింసించారు. ఉదా: అవుటా రాజశేఖర్, చిరంజీవి.

21). ‘‘పదో తరగతి పరీక్షలు సరిగా నిర్వహించ లేక పోయారు.

22). ఇంటర్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేక.. 25 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారు.. 

23). టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టలేక ప్రశ్నపత్రాలు అమ్ముకున్నది నిజం కాదా.?

24). డ్రగ్స్‌ విషయంలో 'లాలూచీ' నిజం కాదా.?

25). నియోజకవర్గానికి కనీసం ఒక 'నియంత'ను తయారు చేశారు. (దమ్ముంటే బహిరంగంగా అడగండి పేర్లతో సహా బయటపెడతాం)

26). ముఖ్యమంత్రి సహాయనిధిలో స్కాం

27). లిక్కర్ స్కామ్‌

28). 111జీఓ

29). ఓఆర్ఆర్ స్కాం 

30). పోలీసు వాహనాల కొనుగోలు స్కాం

31). జర్నలిస్టులకు జైళ్ళను పరిచయం చేసిన  నీచమైన ఘనత మీది కాదా.?

32). కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది చనిపోతే ప్రగతి భవన్ దాటలేదు. పరమార్శించిన నాయకుడు లేడు. ఓదార్చటోడు లేకపాయే.! ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పలేదు.

33). మనోహరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్కూల్ బస్సు ప్రమాదంలో 25 మంది  చిన్నారులు చనిపోతే మీ మనసు కరగకపాయే.! ఎస్.. పలకరించకపోతిరి.! ఇంత 'కఠినమైన గుండెలా' మీవి..?

34). తెలంగాణ కవి గాయకుడు గూడ అంజయ్య చనిపోతే పరామర్శించకపోతిరి

35). ఎంతో మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎన్ని కుటుంబాలను కలిసి ఓదార్చారు.?

36). మీ ఆస్తులు గత 20 ఏళ్ళక్రితం ఎంత.? ఇప్పుడు ఎంత.?

ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కొన్ని సంఘటనలు మాత్రమే. ఇక జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, మండల స్థాయిలో లెక్కేసుకుంటూ పోతే.. పోలీస్టేషన్ లలో జరిగిన సెటిల్మెంట్లుఅదనం. గత పదేళ్ళలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు అన్నీఇన్నీ కావు. అందుకే మీరు చేసిన, మీ ద్వారా 

జరిగిన ఈ తప్పులను మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. సిగ్గుతో తలదించుకొని.. మొకాళ్ళపై కూర్చొని... రెండు చేతులు పైకి చాపి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరుకోల్సిందే.! వేడుకోవల్సిందే.! లేదంటే ఈ ఐదేళ్ళలో మీరు మటాష్.!

బాక్స్:

గులాబీ బుడ్డ నాయకుల్లారా…

నా దృష్టిలో ఆ ఐదుగురు తప్ప అంతా నోరు తెరవలేని వాళ్ళే.! కనీసం ఈ ప్రశ్నలు ఆ ఐదుగురికి పంపి క్షమాపణలు చెప్పించండి. లేకుంటే మీ భారాస 'సర్వ నాశనం' కావాలని తెలంగాణ కోసం ఆత్మ త్యాగాలు చేసినోళ్ళు స్వర్గం నుంచి కోరుకుంటారు. తథాస్తు.! నిజం కాదా..? నయా 'నిజాం ప్రభువు'లూ..:
1). గతంలో హోం మంత్రి మహమూద్‌ అలీకి ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదని హోంగార్డు వెనక్కి పంపారు.

2). ఆనాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తే.. అనుమతి లేదని పోలీసులు వెనక్కి పంపించారు.

3). సీఎంను కలిసేందుకు వెళ్లిన ప్రజాగాయకుడు గద్దర్‌ను కూడా అదే విధంగా అవమానించారు. గంటల కొద్దీ ఆయన్ను ప్రగతిభవన్‌ గేటు వద్ద నిలబెట్టారు.

4). ఇద్దరు ఎమ్మెల్యేలు
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ నిరసన తెలిపినందుకు వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేశారు.

5). అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్‌కు పిలిచి గౌరవించారా?

6). ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన కుటుంబాలతో కలసి ఎప్పుడైనా భోజనం చేశారా.?

7). పదేళ్లు అధికారంలో ఉండి మీమీద  కేసులు ఉపసంహరించుకున్నారు.సరే.! తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎందుకు ఎత్తివేయలేదు.?

8). తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న డీఎస్పీ నళినికి ఎందుకు న్యాయం చేయలేదు.?

9). ధర్నాచౌక్‌ ఎత్తేసింది నిజం కాదా.?

10). పదేళ్లలో 8వేల మంది రైతుల ఆత్మహత్యలు నిజం కాదా.?

11). 'వరి వేస్తే.. ఉరే' అని చెప్పిన కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్‌ తన వడ్లను క్వింటాకు రూ.4,250కి అమ్ముకున్నారు. దీనిపై విచారణకు సిద్ధమా?

12). తలసరి విద్యుత్‌ వినియోగంలో 'తెలంగాణ నంబర్‌ వన్‌' అనేది పచ్చి అబద్ధం.

13). కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరు ఇస్తే పంపుసెట్ల సంఖ్య ఇంకా ఎందుకు పెరిగింది? 2014లో పంపుసెట్ల సంఖ్య 19 లక్షలు ఉంటే ఇవాళ 29 లక్షలకు చేరింది.

14). తెలంగాణ వచ్చాక కూడా కృష్ణా జలాలు ఎందుకు వినియోగించుకోలేకపోయాం?

15). ప్రత్యేక తెలంగాణలో కూడా పాలమూరు, చేవెళ్ల ప్రాంతంపై వివక్ష కొనసాగింది.

16). ప్రాణహిత - చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు.

17). మిడ్‌ మానేరు నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదు.

18). మేడిగడ్డలో ఫిల్లర్ల కుంగుబాటులో మీ తప్పు ఏం లేదా.?

19). ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కేసులు పెట్టి హింసించారు.

20). దళితులను లాకప్‌లలో పెట్టి.. కరెంట్‌ షాక్‌ ఇచ్చి హింసించారు. ఉదా: అవుటా రాజశేఖర్, చిరంజీవి.

21). ‘‘పదో తరగతి పరీక్షలు సరిగా నిర్వహించ లేక పోయారు.

22). ఇంటర్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేక.. 25 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారు..

23). టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టలేక ప్రశ్నపత్రాలు అమ్ముకున్నది నిజం కాదా.?

24). డ్రగ్స్‌ విషయంలో 'లాలూచీ' నిజం కాదా.?

25). నియోజకవర్గానికి కనీసం ఒక 'నియంత'ను తయారు చేశారు. (దమ్ముంటే బహిరంగంగా అడగండి పేర్లతో సహా బయటపెడతాం)

26). ముఖ్యమంత్రి సహాయనిధిలో స్కాం

27). లిక్కర్ స్కామ్‌

28). 111జీఓ

29). ఓఆర్ఆర్ స్కాం

30). పోలీసు వాహనాల కొనుగోలు స్కాం

31). జర్నలిస్టులకు జైళ్ళను పరిచయం చేసిన  నీచమైన ఘనత మీది కాదా.?

32). కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది చనిపోతే ప్రగతి భవన్ దాటలేదు. పరమార్శించిన నాయకుడు లేడు. ఓదార్చటోడు లేకపాయే.! ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పలేదు.

33). మనోహరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్కూల్ బస్సు ప్రమాదంలో 25 మంది  చిన్నారులు చనిపోతే మీ మనసు కరగకపాయే.! ఎస్.. పలకరించకపోతిరి.! ఇంత 'కఠినమైన గుండెలా' మీవి..?

34). తెలంగాణ కవి గాయకుడు గూడ అంజయ్య చనిపోతే పరామర్శించకపోతిరి

35). ఎంతో మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎన్ని కుటుంబాలను కలిసి ఓదార్చారు.?

36). మీ ఆస్తులు గత 20 ఏళ్ళక్రితం ఎంత.? ఇప్పుడు ఎంత.?

ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కొన్ని సంఘటనలు మాత్రమే. ఇక జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, మండల స్థాయిలో లెక్కేసుకుంటూ పోతే.. పోలీస్టేషన్ లలో జరిగిన సెటిల్మెంట్లుఅదనం. గత పదేళ్ళలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు అన్నీఇన్నీ కావు. అందుకే మీరు చేసిన, మీ ద్వారా జరిగిన ఈ తప్పులను మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. సిగ్గుతో తలదించుకొని.. మొకాళ్ళపై కూర్చొని... రెండు చేతులు పైకి చాపి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరుకోల్సిందే.! వేడుకోవల్సిందే.! లేదంటే ఈ ఐదేళ్ళలో మీరు మటాష్.!

బాక్స్:
గులాబీ బుడ్డ నాయకుల్లారా...
నా దృష్టిలో ఆ ఐదుగురు తప్ప అంతా నోరు తెరవలేని వాళ్ళే.! కనీసం ఈ ప్రశ్నలు ఆ ఐదుగురికి పంపి క్షమాపణలు చెప్పించండి. లేకుంటే మీ భారాస 'సర్వ నాశనం' కావాలని తెలంగాణ కోసం ఆత్మ త్యాగాలు చేసినోళ్ళు స్వర్గం నుంచి కోరుకుంటారు. తథాస్తు.!

కవుల భజన సంకనాక ఏల.!

కవుల భజన సంకనాక ఏల.!



* అణగారిన గొంతులు..
లేచి 'పడుతున్నాయ్'.!
* గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్‌ సుద్దులు..
*అందెశ్రీ పాటపై రేవంత్‌ రెడ్డికేదీ జవాబు.?
* దళితుల నోట బాకా మాట.!

(అనంచిన్ని వెంకటేశ్వరావు పరిశోధన పాత్రికేయులు, 9440000009)

పొలిటికల్ బ్రోకర్ ప్రశాంత్ కిషోర్ అతి తెలివి. కడుపులో కత్తి, ఆసుపత్రి డ్రామాలు, కడియం మాటలు, కవుల బాకా కవిత్వం... ఇలా కేసీఆర్ దిగాజారుడు ఎత్తుగడలు. ఏందిరా.? 'కేసిఆర్ సార్..' నీ బతుకు ఇలా తగలిడింది.
తెలంగాణ వాగ్గేయకారులుగా పిలుచుకుంటున్న గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్‌ ల గొంతులు ఈ రోజు వింటే మతిపోయే విధంగానే ఉంది. నిజానికి వాగ్గేయకారులనేది పెద్ద మాట. ఉద్యమకాలంలో కొన్ని ఉంటాయి. తెలంగాణ ఉద్యమ కాలంలోని ఓవర్‌ టోన్‌ వాగ్గేయకారులనేది. అయితే, దానికి సాధారణమైన అర్థం కూడా చెప్పుకోవచ్చు. పాటలు రాసి, వాటిని ఆలపించేవాళ్లను వాగ్గేయకారులుగా చెప్పవచ్చు. ఈ పరిమితి తెలంగాణ ఉద్యమకాలంలోని పాట కవులకు ఉంటుంది. వారిద్దరు కూడా తెలంగాణ సమాజం నుంచి విశేషమైన గౌరవాభిమానాలను పొందినవారు. కానీ ఈ రోజు వారి మాటలు వింటే మనలను మనమే కించపరుచుకుంటున్నట్లు ఉంది. ఉంటుంది కూడా.!

'సన్నాసుల' సన్నాయి నొక్కులు:
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వారిద్దరు మాట్లాడారు. గోరటి వెంకన్న సన్నాయి నొక్కులు నొక్కితే, దేశపతి శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అందెశ్రీ రాసిన పాటను ఉటంకించడాన్ని తప్పు పట్టారు. దేశపతి శ్రీనివాస్‌ భాష గురించి, సంస్కారం గురించి మాట్లాడడం 'కొంచెం వింత'గానే ఉంటుంది. ('ఏం బతుకుల్రా మీవి..' అని అనలేం).!ఇన్నాళ్లు 'కలుగు'లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చిన ఆయన మాట్లాడినట్లుగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన నిర్బంధాల గురించి మాట్లాడారు. కేసీఆర్‌  ప్రభుత్వ పాలనలోని నిరంకుశత్వాన్ని, నిర్బంధాన్ని అణచివేతను చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ఆయన దాని గురించి మాట్లాడారు. శాసనసభలో కూడా ఈ విషయం చర్చకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలైన నిర్బంధాన్ని, అన్యాయాన్ని బీఆర్‌ఎస్‌ సభ్యుడొకరు ఎత్తిచూపారు. అధికార కాంగ్రెస్‌ పక్షం నుంచి దానికి సమాధానం వచ్చింది. అందుకే కదా, మేం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడాం, తెలంగాణ వచ్చిన తర్వాత 'ఏమైందనేది మేం మాట్లాడుతున్నాం' అని మంత్రి ఒకరు అన్నారు. కేసీఆర్‌ పాలనలో అమలైన అణచివేతకు, నిర్బంధానికి, నిరంకుశత్వానికి బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే సమాధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలైనవాటిని ఎత్తిచూపడం సమాధానం కాదనే ఎరుక కూడా కవి అయిన దేశపతి శ్రీనివాస్‌ లేకుండా పోయిందంటే ఆయన గొంతు ఎలా ' అష్ట వంకర్లు' వణుకు'థూ' పోయిందో అర్థం చేసుకోవచ్చు.

ఇదేం దరిద్రం రా బాబూ..:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్‌, ఆయన పక్కన ఉన్న 'తాము మాత్రమే పోరాటం చేశామని, మిగతా తెలంగాణ వాళ్లకు సంబంధం లేదు' అని దేశపతి శ్రీనివాస్‌ మాటల్లోని ఆంతర్యంగా అర్థం చేసుకోవచ్చు. (నీచపు వాదన అనలేక)
ఉద్యమంలో పాల్గొన్న నిజాయితీగల బుద్ధిజీవులను, రచయితలను, కవులను, కళాకారులను విస్మరించడం అనేకన్నా తెలంగాణ రాష్ట్రంలో పాలన ఎలా ఉండాలని ఆశించారో అలా లేకపోవడం వల్లనే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 'మట్టికరిచిందనే ఎరుక' ఇప్పటికీ రాకపోవడం విచిత్రమే. కేసీఆర్‌ మాత్రమే కాదు, కేసీఆర్‌ పక్కన ఉన్న రచయితలు, కవులు, బుద్ధిజీవులు కూడా ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకోవాలనే విషయాన్ని ఆయన పట్టించుకుంటున్నట్లు లేదు.

ఏం దేశపతి.. ఛీ.ఛీ..:
దేశపతి శ్రీనివాస్‌ ఈ రోజు భాష గురించి, సంస్కారం గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అందెశ్రీ రాసిన పాటను ఉటంకించారు. గత తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్‌ పాలన తీరుపై అందెశ్రీ ఆ పాట రాశారు. దానిలోని భాషను, సంస్కారాన్ని దేశపతి తప్పు పట్టారు. ముఖ్యమంత్రికి ఆయన 'సుద్దులు' చెప్పారు.

రంకెలేస్తున్నవేందిరా, పొంకనాలేందిరా'..:
ముఖ్యమంత్రి స్థాయి గంభీరమైందని దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. అలా అంటూ ముఖ్యమంత్రి ఉటంకించే కవిత ఉదాత్తంగా, గంభీరంగా ఉండాలని ఆయన సూచించారు. అందులోని భాష సంస్కారవంతంగా ఉండాలని కూడా అన్నారు. 'రంకెలేస్తున్నవేందిరా, పొంకనాలేందిరా' అనే భాష ఏ మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆ కవికి సంబంధించిన పాటనే ఉటంకించాలనుకుంటే 'ఉదాత్తమైనవి ఉన్నాయని' అంటూ జయ జయహే తెలంగాణ పాటను ప్రస్తావించారు.

ఆ పాటను ఆలపింపజేశారా..?:
దేశపతి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గంభీరంగానూ ఉదాత్తంగానూ సమాధానం ఇస్తూ ఓ ప్రశ్న వేశారు. అందెశ్రీ తెలంగాణ ఆకాంక్షను 'ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన కవి' అని అన్నారు. జయ జయహే తెలంగాణను జాతీయ గీతంగా ప్రకటిస్తామని చెప్పి ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనైనా 'ఆ పాటను ఆలపింపజేశారా..?' అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షను బట్టి దేన్నయినా ఉటంకిస్తామని, సమయమూ సందర్భాన్ని బట్టి అది ఉంటుందని, ఇతరులు రాసినదాన్ని తనదిగా చెప్పుకోవడం సరి కాదని, అందుకే తెలంగాణ పరిస్థితికి అద్దం పడుతున్న ఆ కవితను ఉటంకించానని రేవంత్‌ రెడ్డి వివరించారు.

సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో..:
జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్రీయ గీతంగా చేస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్‌ ఎందుకు అమలు చేయలేకపోయారనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. కేసీఆర్‌కు అన్ని వర్గాల పట్ల, అందరి పట్ల సమదృష్టి లేదని, కేసీఆర్‌ చెప్పిన మాటలకు చేసిన చేతలకు పొంతన లేదని చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే.

చెవిలోనైనా ఊది ఉంటారని..:
ఒక గోరటి వెంకన్న విషయానికి వస్తే ` ఆయన రైతుబంధు గురించి మాట్లాడారు. పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు ఉండాలని ఆయన అన్నారు. తాను ఈ విషయం చెప్పానని కూడా అన్నారు. అంతేకాదు, సినీ నటులకు, వందలాది ఎకరాలున్నవారికి, ఐఎఎస్‌లకు, ఐపీఎస్‌లకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని కూడా చెప్పినట్లు ఆయన తెలిపారు. ఎక్కడ చెప్పారో తెలియదు. చెప్పే ఉండవచ్చు. కాస్తా గొంత పెద్దది చేసి చెప్పి వుంటే అందరికీ అది వినిపించేది. గోరటి వెంకన్నకు ఉన్న పాపులారిటీ చిన్నదేం కాదు ఎల్లలు దాటిన పాపులారిటీ. ఆయన ఆ మాట చెప్పి ఉంటే ప్రధానమైన వార్త అయి ఉండేది. ప్రజలకు వెంటనే చేరి ఉండేది. సరే, ఇప్పటికైతే ఆయన ఎవరి చెవిలోనైనా ఊది ఉంటారని సరిపుచ్చుకుందాం.

అబ్బో పోలీసులూ.. గట్టిగా గడ్డి పెట్టారుగా..:
కేసీఆర్‌ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించిన తీరుపై మాట్లాడుతూ తనదైన భాష్యం చెప్పారు. కోదండరామ్‌ ఇంటి తలుపులు బద్దలు కొట్టడం, హరగోపాల్‌ పై 'ఉపా' ప్రయోగించడం వంటివి అధికారులు కావాలనే చేశారని ఆయన అన్నారు. అధికారులు కావాలని చేసినప్పుడు వాటిని నిలువరించే శక్తి గానీ, వాటిని సరిదిద్దే విచక్షణ గానీ కేసీఆర్‌కు లేకుండా పోయిందా అనేది ప్రశ్న. కేసీఆర్‌ను తాత్వికుడిగానూ దార్శనికుడిగానూ ఆయన అభివర్ణించారు. అది నిజమే కావచ్చు. కానీ పాలనలో ఆయన చేసిన నిర్వాకాలేమిటనేది ప్రశ్నించుకోవాల్సిందే.

ఈ ఇద్దరి ఖర్మ..:
ఒక రకంగా దేశపతి శ్రీనివాస్‌, గోరటి వెంకన్న తమ చరిత్రలను తామే రద్దు చేసుకుంటున్నారు. ఉద్యమ చరిత్రలో వారికి దక్కిన ప్రతిష్టపై వాళ్లే బురద చల్లుకుంటున్నారు. దానికి మనం ఏమీ చేయలేం.

Monday, December 18, 2023

రాష్ట్రపతికి ద్రౌపది ముర్ము కు స్వాగతం పలికిన... సీఎం, గవర్నర్...!

*రాష్ట్రపతికి ద్రౌపది ముర్ము కు  స్వాగతం పలికిన... సీఎం, గవర్నర్...!*

హైదరాబాద్‌: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  హైదరాబాద్‌ వచ్చారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు.ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. తిరిగి ఈ నెల 23న దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.

*సుజీవన్ వావిలాల*

Saturday, December 16, 2023

పోలీస్ 'లు' మారుతారా ??

https://x.com/RachakondaCop/status/1736223102026272881?t=7JY5EsGwr9vpRTdfxp9MFA&s=08                                                                   
*ప్రజలకు #భరోసా ను కల్పిస్తూ #బాధ్యతతో #చట్టప్రకారం నిరంతర #పర్యవేక్షణ తో సత్వర #న్యాయం జరిగేలా పని చేయాలని సిబ్బందికి సూచనలు చేసిన #CP_RCK G. #Sudheerbabu_IPS.*                                                   *****---*****---*****                                     _*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_                                                                                                _*#రాచకొండ కమీషనర్ సర్ గారికి దండాలు 🙏*_                                    
_*సీపీ సర్ మీ సూచనలు మీ కమీషనరేట్ పరిధిలోని అధికారులు & సిబ్బంది పాటిస్తారు అని నమ్మకం మీకు ఉందేమో కానీ ప్రజలకు లేదు.ఎందుకంటే గత ప్రభుత్వములో పోలీస్ అధికారులు ఎవరి ప్రయోజనాలకోసం పనిచేసారో అందరికి తెలిసిందే.ఈరోజు నుంచి మా ద్రుష్టికి వచ్చిన బాధితుల ఫిర్యాదు సమస్యలు మీకు వాస్తవాలతో తెలియచేస్తాము 👍*_

*#IndianConstitution* *#HumanRights*
*Bplkm🪶*
*బాపట్ల కృష్ణమోహన్*
*ప్రజాసంకల్పం ఫౌండర్*                            

https://twitter.com/Praja_Snklpm/status/1736282239280050391?t=F6uuWafCzfK6-HEHbGx6EQ&s=19

Friday, December 15, 2023

పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన DSP నళిని

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం  పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు.

https://twitter.com/TelanganaCMO/status/1735684595792728347?t=IFlRSXsQR8m_LTDGYGa44A&s=19
       **********-----**********
#ప్రజాస్వామికతెలంగాణ సీఎం సారు మీ నిర్ణయం అభినందనీయం 👍🙏

#DSPNalini మేడం 🙏

Bplkm🪶
https://twitter.com/Praja_Snklpm/status/1735876568931799281?t=itb4pKB7IlZKnTesnsD5lQ&s=19

ఢిల్లీలో జాతీయ పార్టీలతో ఓబిసీ చర్చలు

ఢిల్లీలో జాతీయ పార్టీలతో ఓబిసీ చర్చలు




అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఓబిసీ విభాగ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ తో సుధీర్ఘ భేటీ
* భాజపా ముఖ్యనేతలతో రాత్రి సమావేశం
* రేపు, ఎల్లుండి ఇతర పార్టీ అధినేతలతో..

Courtesy / Source by :

(న్యూఢిల్లీ బ్యూరో)
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఓబిసీ విభాగ చైర్మన్, హర్యానా రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ తో భారతీయ ఓబీసీ సమాఖ్య జాతీయ అధ్యక్షులు కే.కోటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి అనంచిన్ని వెంకటేశ్వరావు, దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ పాశం యాదగిరి, ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ శివ నారాయణ, తెలంగాణ కాంగ్రెస్ ఓబిసీ వర్కింగ్ ప్రెసిడెంట్ యు.వి.సురేష్ యాదవ్ లతో హర్యానా ఏఐసిసి కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. భారతీయ ఓబిసీ సమాఖ్య జాతీయ అధ్యక్షులు కె.కోటేశ్వర్ రావు పలు విషయాలను  ఈ సమావేశంలో కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ దృష్టికి తెచ్చారు.

హామీలను నిలబెట్టు కోవాలి:
తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు, విద్యావంతులు. ప్రభుత్వ ఉద్యోగులు, పేద రైతు కూలీలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు హామీలతో సవివరంగా హామీ కూడా కాంగ్రెస్ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రజలు అత్యవసరంగా కోరుకునే కొన్ని విషయాలు ఉన్నాయి.

విద్యా విషయాలపై..:
విద్యార్థులకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలి.  ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రకారం 50 శాతం భర్తీ చేయాలి. అందుకోసం చట్టాన్ని సవరించాలి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ సౌకర్యం:
నాన్ ఏసీ ఎక్స్ ప్రెస్ బస్సుల వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి.

కుల గణన, కుటుంబ సర్వే:
కుల గణన వెంటనే చేపట్టాలి.  వీలైనంత త్వరగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ద్వారా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలి.  అందుకు అన్ని ప్రభుత్వ శాఖలు ఈ కమీషన్ల నియంత్రణలో పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. జనాభా గణన వివరాలను 15 రోజుల్లోగా కంప్యూటరీకరించాలి.

స్థానిక ఎన్నికల్లో సామాజిక రిజర్వేషన్లపై:
జనవరిలో జరిగే సర్పంచ్, జెడ్పీటీసీ, మండల, స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక తరగతుల రిజర్వేషన్లకు ఈ కుల గణనను ప్రాతిపదికగా తీసుకోవాలి.  రిజర్వేషన్లను కనీసం 50 శాతం పెంచాలి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.  బీసీ కులాల జనాభా గణన జాతీయ స్థాయిలో ఓబీసీల హృదయాలను గెలుచుకోగలదు.  ఇది జాతీయ రాజకీయాలపై పెను ప్రభావం చూపుతుంది. వందేళ్ల తర్వాత కూడా కులాల లెక్కలు వేసుకుని సమగ్ర సామాజిక అభివృద్ధికి కృషి చేశారు.

నియోజకవర్గాల వారీగా..:
ఉద్యోగాల భర్తీకి నియోజకవర్గాల వారీగా ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అసమానతలు తగ్గుతాయి. అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు నియోజకవర్గం.

ప్రభుత్వం యూనివర్సిటీలుగా అభివృద్ధి..:
నిర్దిష్టవర్గం వారీగా చేయడం అవసరం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం యూనివర్సిటీలుగా అభివృద్ధి చేయాలి.

సర్దుబాటు కాదు సంఖ్య పెంచాలి:
పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా చేసిన తర్వాత, సిబ్బందిని పెంచకుండా, పది జిల్లాల సిబ్బందిని ముప్పై మూడులో సర్దుబాటు చేశారు. దీంతో పరిపాలన కుంటుపడింది. పాత జిల్లాల్లో ఉన్నంత మంది సిబ్బందిని ప్రతి జిల్లాలో నియమించాల్సి ఉంది.

'అవుట్‌ సోర్సింగ్' గురించి..:
పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు మొదలైన అవుట్‌ సోర్సింగ్ కార్మికులు పేదరికం నుండి వచ్చినవారే. ఇచ్చే ముందు వారికి ఫిక్స్‌డ్‌ స్కేల్‌, పది వేల రూపాయలు పెంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా మార్చాలి. 10 శాతం మార్కులు ఉద్యోగ పోటీ పరీక్షలలో వారి అనుభవాన్ని లెక్కించాలి.

ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు..:
మిషన్ భగీరథ, కాళేశ్వరం, మిషన్ కాకతీయ తదితర లోపాలపై సమగ్ర విచారణ కమిషన్ ను నియమించి వాస్తవాలు వెల్లడించాలని.. ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు ఇచ్చామన్నారు.  కానీ ఇప్పటికీ చాలా గ్రామాలకు కుళాయిలు అందడం లేదు. వీటన్నింటినీ క్షేత్ర పర్యటనలో సేకరించాలి.  ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించాలి.

చేపలు, గొర్రెలను ఉచితం పంపిణీ, డబుల్ బెడ్‌రూం పంపిణీలో అవినీతి..:
చేపలు, గొర్రెలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పథకాలతో పాటు డబుల్ బెడ్‌రూం పంపిణీలో కూడా అనేక అవకతవకలు జరిగాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాలను ఎలా సక్రమంగా వినియోగించుకోవాలో తెలుసుకోవడానికి ప్రత్యేక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

కేసుల ఉపసంహరణపై..:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వారిపై 1996 నుంచి 2023 వరకు అనేక కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి.

నామినేటెడ్ పోస్టులపై..:
కార్యకర్తలకు, నిస్వార్థ ఔత్సాహికులకు గృహనిర్మాణం, ఆర్థిక సహాయం, పింఛను, గౌరవప్రదమైన పదవుల కేటాయింపు, నామినేటెడ్ పోస్టులు, వారి సేవలను సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగించాలి.

చివరిగా..:
13 అంశాలపై భారతీయ ఓబిసీ సమాఖ్య సభ్యులతో కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ సుధీర్ఘంగా చర్చించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయాలకు సంబంధించిన ముఖ్య విషయాలను లిఖితపూర్వకంగా పంపారు

ప్రియురాలి కోసం దిగజారిన ఐపీఎస్‌.!

ప్రియురాలి కోసం దిగజారిన ఐపీఎస్‌.!




ఇద్దరి సహజీవనం వెల రూ.14 కోట్లు
* స్వంత ఖాతాల్లోనే డబ్బులు వేసుకున్న వైనం
* హైదరాబాద్ లో ఖరీదైన విల్లా.! 
* హోంగార్డు ఉద్యోగాల పేరిట ఘరాన మోసం
* హోంగార్డు ఐజీపీగా ఉన్న సమయంలో కొందరికి ఉద్యోగాలు
* ఆ తర్వాత మరికొందరికి నకిలీ అపాయింట్‌మెంట్లు
* పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
* కేసు నమోదు 
* హ ప్రియురాలి అల్లుడు అరెస్ట్‌
* అంతా రహస్యం.. 
* 'నువ్వు రాయ్.. నీ సంగతి చూస్తా..' అంటూ బెదిరింపు
* రాస్తున్నాను.. ఏ గడ్డి పీక్కుంటావో పీక్కో.!
* నా ఫుల్ డిటైల్స్ ఇస్తున్నా..

Courtesy / Source by :

(అనంచిన్ని వెంకటేశ్వరావు, అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం9440000009)

ఆ ఐపిఎస్ అధికారికి ఓ వీక్ నెస్. అందంగా ఉందని సరదాగా సహజీవనం. ఆ ప్రియురాలి కోసం ఆయన ఫోర్జరీలకు సైతం దిగజారాడు. ఇద్దరి స్వంత ఖాతాల్లోనే డబ్బులు వేసుకున్నారు. ఆమె కోసం ఆ ఐపిఎస్ ఏకంగా హైదరాబాద్ లో ఓ విలాసవంతమైన విల్లా కూడా కొనుగోలు చేశాడు. ఓ బాధితుడు కేసు పెట్టాడు. సామాన్యుల విషయంలో నానా 'యాగీ' చేసి, 'గాయగత్తర' చేసే పోలీసులు ఈ విషయం అత్యంత కీలకమైన రహస్యంగా ఉంచారు. ఆ ఐపిఎస్ తాజాగా బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కాడు. వివరణ కోసం ప్రయత్నం చేస్తే... "రాస్తే.. నీ సంగతి చూస్తా" అన్నాడు. రాస్తే ఓ పనైపోతుంది కదా.!  జర్నలిస్ట్ ను బెదిరించినందుకే గట్టిగా రాస్తున్న. ఏలూరు నుండి హైదరాబాద్ నీ విల్లా వరకు ఏ గడ్డి పీక్కుంటావో.. పీక్కో ఫో..! దిగజారినోడు కూడా బెదిరించుడే.! బొత్తిగా జర్నలిస్టులు అంటే భయం లేకుండా పోయింది. అమ్మా..! అందరూ ఒకేలా ఉండరు. నాలోంటోళ్ళు కూడా అక్కడక్కడా ఉంటారు. నా కత్తికి అన్ని వైపులా పదునే.! జర జాగ్రత్త మరి. విజయవాడలో ట్రిపులెక్స్ ఇంటికి ఉచితంగా స్లాబ్ వేయించావు కదా.!

ఏలూరులో తగులుకున్నాడు..:
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఓ ఐపీఎస్‌ అధికారి శఠగోపం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం వేరే శాఖలో విధులు నిర్వహిస్తున్న ఒక ఐపీఎస్‌ అధికారి గతంలో రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేశారు. ఏలూరులో పనిచేసిన సమయంలో ఏలూరుకు చెందిన ఒక మహిళతో సహజీవనం చేశారు.

రూ.14 కోట్లకు పైగా:
అనంతరం ఐజీపీ హోంగార్డు రాష్ట్ర అధికారిగా పనిచేసిన సమయంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఐజీపీ సహకారంతో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 200 మందికిపైగా నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.6 నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. అధికారి ఐజీపీగా ఉన్న సమయంలో కొందరికి హోంగార్డు ఉద్యోగాలు ఇచ్చారు. అధికశాతం మందికి పోస్టింగులు ఇవ్వలేకపోయారు.

ఇలా అనుమానం వచ్చి..:
దీంతో నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో 2022లో ఐజీపీ హోంగార్డ్స్‌ పేరుతో తాను పోస్టులో లేకపోయినా తనే ఐజీపీ హోంగార్డు అయినట్లు సంతకాలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్లు ఇచ్చారు. వాటితో అభ్యర్థులు పోలీస్‌ ఉన్నతాధికారులను కలవగా అనుమానం వచ్చి రహస్యంగా విచారణ చేశారు. అవి నకిలీ అపాయింట్‌మెంట్లు అని తేలడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు.

ఇద్దరి ఖాతాల్లోకి... ఖరీదైన విల్లా.!
అదే సమయంలో బాధిత నిరుద్యోగి తలాజి విజయ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలతో విస్తుపోయినట్లు తెలిసింది. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన కొంతనగదు దళారుల ఖాతాల నుంచి ఐజీపీతోపాటు ఆయన ప్రియురాలి ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించారు. వీరు హైదరాబాద్‌లో విల్లాలు కొన్నట్టు సమాచారం.

బెయిల్ కోసం..:
దీంతో అధికారి ప్రియురాలి పెద్ద అల్లుడితోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన దళారులు ఏడుగురిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అరెస్టులతో అప్రమత్తమైన అధికారి మంగళవారం హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసినట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.



ఛీటింగ్ కి మారు పేరు చీధర్ రావు


Be care Full Congress from Real-estate Cheaters



Be care Full Congress from Real-estate Cheaters

  • ఛీటింగ్ కి మారు పేరు చీధర్ రావు
  • గత మూడేళ్లలోనే 38 చీటింగ్ కేసులు
  • ఎక్కడ కానరాని పీడీ యాక్ట్.
  • ఎవరినైనా ఇట్లే మోసం చేసే ఘనుడు.
  • బిగ్ బీ అమితాబచ్చన్ అల్లుడిని సైతం ఆటపట్టించిన అరాచకుడు.
  • వందల ఎకరాలు ఉన్నాయనే కలరింగ్ తో బొల్తాపడుతున్న అధికారులు.
  • అక్రమాలు పొక్కకుండా ఓ ఛానల్ లీజుతో కవరింగ్.
  • చర్యలు తీసుకునేందుకు పాత సీపీ సిద్దమయినా అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు.
  • నిజాయితీ గల కొత్త సీపీ గారు ఎం చేస్తారో.?
  • సాహితీ సంపద ఈ శ్రీధర్ రావు వద్దనే అంటున్న రియల్టర్స్.
  • చీటర్ చీధర్ రావ్ లాంటి వాళ్లను కట్టడి చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమే.
  • మీరు వచ్చారు.. మార్పు వస్తుందని భావిస్తున్న ప్రజలకు
  • రియల్ ఎస్టేట్ ఛీటర్స్ ని కట్టడి చేయాలి.  

Courtesy / Source by :

ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ క్రైం బ్యూరో.

 హైదరాబాద్ లో భూములను అమ్మి, నమ్మకాలను వొమ్ము చేసే చీటర్స్ ఎంతో మంది ఉన్నారు. వారి పై 40 కి పైగా కేసులు ఉన్నా ఎవ్వరు పట్టించుకోరు. అధికారులకు ఆశలు చూపించి కేసుల నుంచి తప్పించుకుంటారు. అలాంటి స్కాంల్లో సాహితీ తో పాటు మరో పది కంపనీలు ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడ్డాయి. అయితే కొందరూ కమర్షియల్ స్పెస్ అంటూ మోసాలకు పాల్పడ్డారు. భూములు లీజుకంటూ బీఆర్ఎస్ అండదండాలతో రెచ్చి పోయి కబ్జాలు చేస్తున్నారు. వీరందరి పై కేసులు నమోదు అయినా ఇప్పటి వరకు పట్టించుకున్న నాథుడే లేడు. అరెస్ట్ అయినా మళ్లీ అవే బుద్దులతో కేసులు నమోదవుతున్నా.. పీడీ యాక్ట్ లు కనిపించలేదు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహారించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉంది. లేదంటే ఇలాంటి వారిని దగ్గరకు రానిస్తే.. పాత దందాలే , చీటింగ్ లతో ప్రజలు విసిగిపోయే అవకాశాలు ఉన్నాయి.

శ్రీధర్ రావు అంటేనే ఛీటర్.

అవసరం ఉంటే ఎంతకైనా దిగజారేందుకు నిదర్శనం ఈ చీధర్ రావుయే అని అంటారు. అసాంఘీక శృంగారం అడియో కేసులో అందరికి సోషల్ మీడియాలో పరిచయం ఉన్న ఈయన… అరెస్టులను ఆపుకునేందుకు కేసులను క్లోజ్ చేయించుకునేందుకు మీడియాను తాకట్టు పెట్టారని తెలుస్తుంది. చెన్నైకి చెందిన న్యూస్ ఛానల్ ని లీజుకు తీసుకున్నారు. ఆ ఛానల్ పేరుతో చేయని దందా లేదు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చెరువుల కబ్జాల పై ఆ ఛానల్ కథనాలు ఇచ్చింది. ఆ ఎమ్మెల్యే కు హైకోర్టు నుంచి మొట్టికాయలు పడ్డాయి. అయితే అదే ఎమ్మెల్యే అయినా గాంధీ ని పిలిచి ఓపెనింగ్ చేయించారు. అప్పట్లో ఈ ఛానల్ ఇబ్బంది పెట్టినందుకు క్షమాణలు అంటూ ఇప్పుడు పనిచేస్తున్న జర్నలిస్టులతో చెప్పించారంటే ఇతని దిగుజారుడు తనం ఏంటో ఇట్లే అర్ధం అవుతుంది.   జర్నలిస్టులను కనీసం ఉద్యోగుల గుర్తించకుండా చీదురించుకోవడం ఈయనకు అలవాటు. జీతాలు ఇవ్వరు.. నెలకో ఎడిటర్ ని మారుస్తారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నడిపిస్తున్నాని భారీగానే డబ్బులు దండుకున్నారు. వేల కోట్లు ఉన్నాయని చెప్పుకున్నా.. జర్నలిస్టులకు సరైనా తేదిల్లో జీతాలు ఇవ్వకుండా  ఇబ్బందులనకు గురిచేస్తున్నారు. విలువలు లేని మనుషుల వ్యవహారంతో జర్నలిజం విలువ తీసివేయడంతో జర్నలిస్టులు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. టీవీ కార్యాలయంలోనే స్నేహితులతో అందరి ముందు మందు పార్టీలు చేసుకునేంత  విచ్చల విడిగా వ్యవహారిస్తారని జర్నలిస్టులు అరోపిస్తున్నారు.

 

కేసులు ఇవే..

ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 30 కేసులు నమోదయ్యాయి. ఒక్క   గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో నే ఎఫ్‌ఐఆర్ నెంబర్స్, 720/2023, 356,1421,1226,1143, ఆఫ్ 2022, 1220,1222,1265,1215,1206,1188 ఆఫ్ 2021, 248 ఆఫ్ 2018, 385 ఆఫ్ 2017, ఇలా జూబ్లిహిల్స్, రాజేంద్రనగర్, కూకట్ పల్లి, రాయదుర్గం, మియాపూర్, నార్సింగీ, సిసిఎస్ హైదరాబాద్ లో అన్నింట్లో కలిపి 40 కి పైగా చీటింగ్ కేసులు, కబ్జా కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్స్ , 448,427,324,506, రెడ్ విత్ 34 తో పాటు 342, 377,420, 406, 509, 109, 307, 468, 120 బి, 471,181, 386,384 సెక్షన్స్ తో వివిధ పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు చెన్నై, బెంగుళూర్, ముంబాయి లో ఉన్నాయి. బిగ్ బీ అవితాబచ్చన్ అల్లుడు కి చెందిన కంపనీని మోసం చేశారని కేసు నమోదు అయింది. ఇలా బడాబాబులను ఎంతో మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ఛీటర్ శ్రీదర్ గా పేరుతెచ్చుకున్నారు.

పీడీ యాక్ట్ కి ఈ  40 కేసులు సరిపోవా..?  

గత  తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రశ్నిస్తే కేసులు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం .. ఇలాంటి చీధర్ రావులకు అండదండగా నిలిచింది. 3 వేల మంది కస్టమర్స్ ని మోసం చేసి 1000 కోట్లు కొట్టేసిన  సాహితీ లక్ష్మినారాయణ ఆస్థులు ఇతని వద్దే ఉన్నాయని అరోపణలు ఉన్నాయి. కొనుగోలు దారులను ముంచిన వారికి బీఆర్ఎస్ నేతలు అలానే సఫోర్టు చేశారు. ఒక్కసారి మాత్రమే అరెస్ట్ చేసి వదిలేశారు. భూములు ఇస్తానని  పొలిటికల్ లీడర్స్ ని కూడా మోసం చేశారనే అరోపణలు ఉన్నాయి. ఒక్కసారి స్నేహాం చేస్తే.. వామ్మో చీధర్ రావు అంటూ చీధరించుకుంటారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి వారిని అరెస్ట్ చేయకుండా వదిలేస్తే.. మళ్లీ సమాజం పై పడి దోచుకుంటారని అరోపణలు ఉన్నాయి . కాంగ్రెస్ పెద్దలను కూడా ప్రసన్నం చేసుకుని కేసుల నుంచి తప్పించాలని వేడుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతలను వాడుకుని కేసులు ఎత్తివేయాలని వేడుకున్నారు. కానీ పోలీస్ ఉన్నతాధికారులు ఒప్పుకోకపోవడంతో ఆగిపోయింది. ఓ డిసీపీ ఈయనకు హెల్ప్ చేసినందుకు 20 గుంటల భూమిని ఇస్తానని ఆశపెట్టించినట్లు ప్రచారంలో ఉంది. ఎవ్వరికైనా భూములు ఆశచూపించి వారితో వెట్టిశాకిరీ చేయించుకుంటారని మార్కెట్ టాక్ . కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వారి పై కఠినంగా వ్యవహరించి పీడీ యాక్ట్ పెడితేనే మిగితా రియల్ ఎస్టేట్ చీటర్స్ భయపడుతారని వేడుకుంటున్నారు బాధితులు . సాహితీ సొమ్మును కక్కించాలని వేడుకుంటున్నారు. 

Sandhya Sridhar Rao | Saranala Sridhar Rao | be carful CM Revanth Reddy | Real estate Scams hyderabad lease Scams | 



Wednesday, December 13, 2023

సీఎం కొత్త CPRO

_*ముఖ్యమంత్రి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా (సీపీఆర్ఓ) నియమితులైన శ్రీ బి. అయోధ్య రెడ్డి ఈరోజు సీఎం శ్రీ @Revanth_Anumula గారిని ఆయన నివాసంలో కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సీఎం కార్యాలయంలో సీపీఆర్ఓగా నియమించినందుకు శ్రీ అయోధ్య రెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు....సీఎం CPRO గా నియమితులైన శ్రీ బి. అయోధ్య రెడ్డి గారికి అభినందనలు తెలియచేస్తుంది 'ప్రజాసంకల్పం'.... బాపట్ల కృష్ణమోహన్ Bplkm🪶*_

Tuesday, December 12, 2023

అసలు ఆట ఇప్పుడుంది... మాజీ మంత్రి KTR...!

*అసలు ఆట ఇప్పుడుంది... మాజీ మంత్రి KTR...!*

హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌​, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వం ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని విమర్శించారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు.

మీడియా ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్‌ పలు అంశాలపై స్పందించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దుల మీద చర్చ జరగలేదు. మేం చర్చ జరిపాం. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇచ్చాం. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం. ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశాం. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని వల్లె వేయిస్తారు' అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

'ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి. ఇప్పుడు ఉంది అసలు ఆట. రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైంది? మొదటిమంత్రి వర్గంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడ' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

అవినీతి అధికారుల జాబితా ఇస్తుంది 'ప్రజాసంకల్పం'

https://x.com/TelanganaCMO/status/1734609339908870444?s=08                                                                       _*#ప్రజాస్వామికతెలంగాణ సీఎం సారుకు దండాలు 🙏. సారు #మేడ్చల్ జిల్లా #GHMC జ్యూడిషియల్ పరిధిలో చట్టాలను ఉల్లంఘించి #చెరువులు కబ్జాలు, #ప్రభుత్వభూములు కబ్జాలు, #అక్రమనిర్మాణాలు చేశారు... చేస్తున్నారు.విచ్చల విడిగా మధ్యం దుఖానాలు. Footpath లు ఆక్రమణ.ఈ అవినీతి లో జిల్లా కలెక్టర్ కార్యాలయం,#GHMC  ప్రధాన కార్యాలయం, అన్ని MRO కార్యాలయాలు, అన్ని #సర్కిల్ / #మున్సిపల్ / #కార్పొరేషన్ కార్యాలయాలు / శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ స్టేషన్లు, ఏక్సైజ్ శాఖ కార్యాలయాలలో మొత్తం అవినీతి జరుగుతుంది. ఆధారాలతో సహా ప్రభుత్వ అధికారిక మద్యమాలు అయిన #మెయిల్ / #ఇంస్టాగ్రామ్ / పేస్ బుక్ / #ఆన్లైన్ / #ట్విట్టర్ ద్వారా మీకు పంపిస్తాము.మీ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లో చెప్పినట్లుగా అవినీతి అధికారులమీద, ఈ అవినీతి అధికారులను ప్రోత్సహించిన వారిమీద తక్షణమే విచారణ చేయించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని 'ప్రజాసంకల్పం' డిమాండ్ చేస్తుంది*_

*Bplkm🪶*
*బాపట్ల కృష్ణమోహన్,*
*ప్రజాసంకల్పం ఫౌండర్,*
*రామంతాపూర్*,                                                 *ఉప్పల్ మండలం*
*హైదరాబాద్,*                                                    *మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా*
*Pin : 500013*                                                        https://twitter.com/Praja_Snklpm/status/1734611868797551012?t=eW_1MLuoWfO68_DJsXmieg&s=19

Lock up death in #Telangana

#Telangana: In Chintapalli mandal of Devarakonda Town of #Nalgonda- A 60YO man’s family has alleged Lock up death and accused Sub Inspector Satish Reddy of murder. 

What Happened? 

In a money dispute case, both parties were called for counselling to the PS. Whilst, SI Satish Reddy hit Surya Naik at the back of his head, the man collapsed in the PS. After the family took him to the hospital, where Surya Naik took his last breath. The family has accused SI Satish Reddy of killing Naik. 

The DSP and Collector-Nalgonda has now involved. The SI has been suspended. The family has demanded for compensation and Govt Job. 

Cop has blood on his hands.

https://twitter.com/CoreenaSuares2/status/1734457905167134863?t=zOJhON97yNR0Yr253ZnW5g&s=19

another sincere IPS officer posted as Cyberabad Commissioner of Police.

Avinash Mohanty is another sincere IPS  officer posted as Cyberabad Commissioner of Police. He served as DCP CCS in Hyderabad. His father AK Mohanty was ex DGP #AvinashMohanty @cyberabadpolice @TelanganaDGP

https://twitter.com/sudhakarudumula/status/1734476345554735351?t=hWbIyb-y0V1AvSRuMAnwOw&s=19

Honest IPS officer has been posted as Hyderabad commissioner of police.

Honest IPS officer Kothakota Srinivas Reddy has been posted as Hyderabad commissioner of police. He was one of the most transferred IPS officer in the state. He was in loop line postings most of his life as he is a straightforward officer. He was instrumental in exposing the alleged involvement of Andhra Congress chief Botsa Satyanarayana( now YSRC minister ) in the liquor syndicates. The probe didn’t go further after his transfer. There are only a few photographs of him on internet #Hyderabad @CPHydCity @hydcitypolice #IPS

https://twitter.com/sudhakarudumula/status/1734475484241748462?t=XuqMB_m955PF0D7eyIlREA&s=19

    *********************************

Yes ఇప్పుడు #ప్రజాస్వామికతెలంగాణ కు ఇలాంటి అధికారులు కావాలి 👍

జోహార్లు #తెలంగాణ #అమరవీరులకు ✊

#FriendlyPolicing అని చెప్పి చట్టాలను గౌరవించి ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతుల మీద అక్రమంగా కేసులు పెట్టించిన గత ప్రభుత్వం & దొర గడీ లో బానిసలుగా వున్న చాలామంది అధికారులు.

https://twitter.com/Praja_Snklpm/status/1734507141724241981?t=QYMvMRPbYF6cR8-76dvmNw&s=19

Monday, December 11, 2023

_అంటకాగిన వారి...తాట తీయబడును!_

_అంటకాగిన వారి.._
*_తాట తీయబడును.!_*

_■ ఆ పోలీసులపై విచారణ.?_
_■ బీఆర్ఎస్‌ సహజీవనాకారులపై నజర్‌.._
_■ గులాబీ ఎమ్మెల్యేల సిఫారసులతో బదిలీలు_
_■ విచారణకు ఆదేశించిన కాంగ్రెస్‌ సర్కారు..!_
_■ పోలీస్‌ శాఖలో త్వరలో భారీగా బదిలీలు_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_ఓ పిరికోడు 'నియంత'గా మారాడంటే అందుకు కారణం తప్పకుండా.. ఆ అసమర్థుడి వెంట ఓ 'లాఠీ' వ్యవస్థ ఉంటుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ ముఖచిత్రం. ఇప్పుడు 'పెట్టండ్రా అక్రమ కేసులు'.. అంటున్న మిక్కిలినేని నరేంద్ర మాటల్లో ఆవేశం లేదు. ఆవేదనతో కూడిన హెచ్చరిక ఉంది. ఇప్పుడు తెలంగాణ పోలీసులలో 'గత్యంతరం' లేని పరిస్థితుల్లో జర్నలిస్టులను,  సమాచారహక్కు బాధ్యులను, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను, సామాన్య ప్రజలను 'గోస' పెట్టారు. ఇప్పుడు 'ఫలితం' అనుభవించడానికి సిద్దంగా ఉండాల్సిందే.!_*

*https://telanganawatch.in/article.php?data=the-tata-of-those-who-are-stuck-will-be-removed*

*_అసలేం జరిగింది.?_*
తెలంగాణలో కొందరు పోలీసులు బీఆర్ఎస్‌ పార్టీ నేతలతో అంటకాగినట్లు గుర్తించిన కాంగ్రెస్‌ సర్కారు.. అలాంటి వారిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో 'ఓ సామాజికవర్గానికి ఎక్కువ' ప్రాధాన్యమిచ్చారని, అదే విధంగా అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులతో భారీగా బదిలీలు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా.. గులాబీ ఎమ్మెల్యేలు తమకు అనుకూల అధికారులను నియోజకవర్గ పరిధిలో బదిలీలు చేయించుకున్నారు. మరికొందరైతే ఓ మెట్టు పైకెక్కి.. తమవారికి పోస్టింగ్‌ రాకుంటే.. ఆ స్థానంలో వచ్చిన వారిని బెదిరించి మరీ, బాధ్యతలు తీసుకోకుండా చేశారు.

*_రాష్ట్రం మొత్తం అదే.!_*
జీహెచ్ఎంసీ పరిధిలో ఈ తరహా బదిలీలు ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ స్థాయిలో భారీగా ఉన్నట్లు కాంగ్రెస్‌ సర్కారు గుర్తించింది. ఇక జిల్లాల్లో అయితే ఎస్సై స్థాయి నుంచి అదనపు ఎస్పీ దాకా ఇలాంటి బదిలీలున్నట్లు భావిస్తోంది.

*_ఎన్నికల సమయంలోనూ.._*
కొందరు అధికారులు బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని, ఇతర పార్టీల నేతల ప్రచారపర్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని పేర్కొంటూ కాంగ్రెస్‌ నేతలు అప్పట్లో నేరుగా ఈసీకి ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఓ చిట్టాను కూడా ఫిర్యాదుతో జత చేశారు. కొందరు అధికారులపై భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) బదిలీ వేటు వేసింది.

*_దటీజ్ రేవంత్..!_*
ఇప్పుడు మిగతా అధికారుల తీరుపై ఉన్నతస్థాయిలో విచారణకు రేవంత్‌ సర్కారు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ విచారణ పూర్తవ్వగానే.. డీజీపీ కార్యాలయం మొదలు.. కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్సీలు, డీఎస్పీ/ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల బదిలీలు భారీగా జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల రోజున అప్పటి డీజీపీ అంజనీకుమార్‌, మరో ఇద్దరు అధికారులు కోడ్‌ను ఉల్లంఘించి, రేవంత్‌రెడ్డిని కలిసి అభినందించడాన్ని సీరియ్‌సగా తీసుకున్న ఈసీఐ.. డీజీపీని బదిలీ చేసింది. ఏసీబీ చీఫ్‌గా ఉన్న రవిగుప్తాను డీజీపీగా నియమించింది. అదేవిధంగా.. ఎన్నికలకు ముందు హైదరాబాద్‌ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శిక్షణ కేంద్రం(టీఎ్‌సపీఏ) డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్యను నియమించింది. ఏసీబీ, టీఎస్ పీఏ పోస్టులు ఇంకా భర్తీ కావాల్సి ఉంది. ఇవి కాకుండా.. పోలీసు శాఖలో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయని సర్కారు గుర్తించింది.

*_నువ్వు నేర్పిన విద్య నీరజాక్షా...!_*
త్వరలో పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలు జరగనుండడంతో.. అన్ని అంశాలను పరిశీలించి.. పోలీసు శాఖలో బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం.

*_కొసమెరుపు_*
నాటి రాజకీయులు చెప్పినట్లు మీం
చేయడం వల్లే కదా.‌ ఈ ప్రభుత్వం వచ్చిందని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ పోలీసు చెప్పటం గమనార్హం.

*_అంకితం_*
తొలి తెలుగు పరిశోధన పాత్రికేయులు కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ఈ కథనం అంకితం.

బాక్స్:
*_వీళ్ళ పరిస్థితి ఏమిటి.?_*
నల్గొండ, ఖమ్మం, ఇల్లందుకుంట, రామకృష్ణాపూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని పోలీస్టేషన్ లు భూ దందాలకు నెలవుగా మారాయి. జరగాల్సిన వికృతాలన్నీ జరిగాయి. చేయాల్సిన కిడ్నాప్ డ్రామాలు చేశారు. నల్గొండ 2వ టౌన్ పోలీస్టేషన్ లో ఓ పరిశోధన పాత్రికేయుడి ఫోన్లు 4 గల్లంతయ్యాయి. ఈ కేసు హైకోర్టులో ఉంది. ఇక ఇల్లందుకుంట, రామకృష్ణాపూర్.. పోలీసుల తీరు, అంటకాగిన వైనాలున్నాయి. కేసులు ఎదుర్కొంటున్న వారందరూ పోరాటయోధులు కావడంతో.. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారు కీలకమైన పాత్ర కావడంతో నాటి పోలీసుల పరిస్థితి ఏమిటనేది కాలం నిర్ణయిస్తుంది. ప్రభుత్వం ఆరు నెలల్లో ఈ పోలీసులపై తీవ్రమైన చర్యలు తీసుకోలేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధం కావాలని బాధితులు భావిస్తున్నారు. 

బాక్స్:
*_ఛీ..ఛీ..ఓనమాలు తెలియనోళ్ళు కూడా..!_*
ఓ ముగ్గురి జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ (సజ్జనార్ నేతృత్వంలో జరిగిన ఆపరేషన్) సందర్భంగా డిసిపి స్థాయి అధికారి మొదటి పేజీలో రాసిన కథనం గురించి చెపుతూ సాక్ష్యాధారాలు లేవు కాబట్టి 'అరెస్ట్' చేశామని చెప్పారు. అయితే ఆ కథనానికి కొనసాగింపుగా 'రెండో పేజీలో ఆధారాలున్నాయి' అంటే అదేలా అంటూ... జర్నలిజం ఎలా ఉండాలో ఓ మూర్ఖపు ప్రసంగం చేయటం గమనార్హం.

Saturday, December 9, 2023

#కేసీఆర్ బంధువు పాపారావు అక్రమ ఆస్తులు దాదాపు 800 కోట్లు

BRS ప్రభుత్వంలో చెలరేగి పోయిన మరో అత్యంత అవినీతి అధికారి కేసీఆర్‌ బంధువు పాపారావు; రవాణా శాఖ అదనపు కమీషనర్. అర్హతలు లేకున్నా అడ్డదారిలో ఉద్యోగం సంపాదించాడు ఈ పాపారావు.

ఈరోజుకి పాపారావు అక్రమ ఆస్తులు దాదాపు 800 కోట్లు వరకు వున్నాయి. సదాశివపేటలో 100 ఎకరాల భూమి. హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాల భూములు అక్రమ మార్గంలో సంపాదించాడు. అక్రమ సొమ్ముతో ఇతను హైదరాబాద్ నగరంలో Win Vision Eye Hospitals స్థాపించాడు.

కెసిఆర్ సహకారంతో నిబంధనలకు విరుద్దంగా 04 ప్రమోషన్ తీసుకున్న ఈ పాపారావు... ప్రతి నెల రవాణా & మైనింగ్ శాఖల నుండి 60 కోట్లు కలెక్షన్ చేసేవాడు. ఇందులో కొంత సొమ్ము KTR కి .. ఆడపిల్ల కట్నం కింద కొంత సొమ్ము మన తైతక్క కు ఇచ్చేవాడు.

రవాణా శాఖ లో ఎంతో మంది నిజాయితిగల అధికారులను హింసించాడు ఈ దుర్మార్గుడు.

ఇతను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి అమెరికా పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు అని తెలిసింది.

ఇతని ఆస్తుల పై @TelanganaCMO @revanth_anumula @PonnamLoksabha విచారణ చేయించాలి.

ఇది TRAILER మాత్రమే .. పాపారావు అవినీతి పై కొన్ని ఆధారాలతో త్వరలో పార్ట్ -02 లో తెలియచేస్తాను.

Courtesy / Source by :

https://twitter.com/prashantchiguru/status/1733389711400747192?t=DtORUbrZ0Z43EZ4OJg2_uA&s=19

Friday, December 8, 2023

కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ దే అక్రమ సంపద 400 కోట్లు.?

KTR OSD Mahender illegal activities


  • కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ దే అక్రమ సంపద 400 కోట్లు.? 
  • కన్ఫమ్మ్డ్ ఐఏఎస్ లిస్టు ప్రిపరేషన్ లో చేయని తప్పులేదు. 
  • ఫైల్స్ క్లియర్ కావాలంటే సొంత పార్టీ వారే  లక్షల్లో చేయితడిపారు.
  • అవినీతికి పాల్పడినట్లు ఎక్కడ కనిపించకుండా మెయింటెన్ చేయడంలో దిట్ట. 
  • పేద బతుకుల జీవన శైలీ, మియాపూర్ లో కాష్ ముట్టిన 15 రోజులకు పని పూర్తి. 
  • బాధితుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ ఛైర్మన్స్.
  • పోస్టింగులు కావాలంటే ఆయన సిగ్నల్స్ ఇవ్వాల్సిందే. 
  • మహేందర్ చెప్పితే కేటీఆర్ చెప్పినట్లే అన్నట్లుగా ఉన్నతాధికారుల వ్యవహారం.
  • ఎక్కడ తన పై విచారణ మొదలవుతుందని లూప్ లైన్ లోకి వెళ్లేందుకు అప్లికేషన్.
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో  పవర్ మిస్ యూజ్ కావద్దంటే..
  • మహేందర్ మహిమలు మచ్చుగా బహిర్గతం తెలియాల్సిందే..? 
  • కేటీఆర్ కోటరీలోని అధికారుల అక్రమాస్తుల పై 
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ సాక్షాదారాలతో సహా వరస కథనాలు. 

by

Devender Reddy

9848070809


 ఈనెల 20న ఢిల్లీ లో జరగబోయే కన్ఫమ్మ్డ్ ఐఏఎస్ అధికారుల షాట్ లిస్టు ఇప్పుడు దుమారం లేపుతుంది. దీనికి తోడుగా మొదటి దఫా 5 మంది ఐఏఎస్ లు ఎలా ఎంపిక తీరు కూడా అవినీతికి అద్దం పడుతుంది. రాష్ట్రం నుంచి 3 ఐఏఎస్ అధికారులు, యూపిపిఎస్సీ నుంచి 2 ఐఎఎస్ లు ఇంటర్వ్యూ అధికారులు ఉండటంతో ఈ అక్రమాలకు తావిస్తుంది. కేటీఆర్ ఓఎస్డీ  మహేందర్ అక్రమ ఆస్తులు పై దర్యాప్తు చేయాలని డిమాండ్ పెరుగుతుంది. అల్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లను సైతం అమ్ముకునేంత స్థాయికి ఎదిగారంటే మంత్రుల వద్ద ఉన్నా ఓఎస్డీల వ్యవహారం ఎంత బరితెగింపు ఉందో అర్ధమవుతుంది. ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధుల లిస్టులో అవకాశం ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చి.. వారి నుంచే లక్షల్లో ఖర్చు పెట్టించిన తీరు అశ్చర్యానికి గురి చేస్తుంది. తొమ్మిదేళ్లుగా ఆయన చేసిన తెర చాటు దందాలు ఒక్కొక్కటిగా భయటకు పొక్కడంతో ఆయన ఆదాయానికి మించిన ఆస్తి 400 కోట్లు అని సహా ఉద్యోగులు, ఆ పార్టీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్నారు. భయటకు చూస్తే ఆమాయకపు ఫేస్ తో మాచిన బట్టలతో భయటకు కనిపించినా.. ఓ సిక్రెట్ ప్లేస్ వచ్చి.. చెప్పకనే చెప్పుతూ.. మియాపూర్ మెట్రో వద్ద లావాదేవీలు జరిపించడం అలవాటు చేసుకున్నారని నేతలే చెప్పుతున్నారు. ఆయన అక్రమ సంపద పై ల్యాండ్ అండ్ రికార్డ్స్.కామ్ సాక్షాదారాలు సేకరిస్తుంది. ఒక్కొక్కటిగా భయపెటేందుకు సిద్దమవుతుంది. అయితే ఇవ్వన్ని భయటకు పొక్కకుండా లూప్ లైన్ లోకి వెళ్లేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ వద్ద అప్లికేషన్ పెట్టుకున్నారు. నేషనల్ ఇన్స్స్టూయ్ ఆఫ్ అర్బన్ మేనేజర్స్ కి బదిలీ కావాలని కోరుతున్నారు. 

ఆయన అక్రమ సంపద ఆపరేషన్ ఇలా ఉంటుంది. 

కేటీఆర్ వద్దకు ఫైల్ పట్టుకొచ్చిన నేతలకు మహేందర్ కి ఇవ్వాలని సూచిస్తారు. రెవెన్యూ పై పెద్దగా పట్టులేని మహేందర్ 4 గురు రిటైర్డ్ ఎమ్మార్వోలతో ఆ ఫైల్ ని పరిశీలిస్తారు. లోపాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లుతారు. దీంతో ఆ ఫైల్ అక్కడే ఆగుతుంది. ఎందుకని పదేపదే అడిగితే కేటీఆర్ క్యాంప్ కార్యాలయానికి దగ్గరగా ఉండే ఓ ప్రాంతానికి మాత్రమే వస్తారు. అక్కడికెళ్లి కలవాలని ఆ నేతలకు చెప్పుతారు. అక్కడ ఎలాంటి మాటలకు మాట్లడకుండా ఉంటాడు. పనితో సంబందం లేదు మీకు డబ్బులు ఎక్కడికి పంపాలో చెప్పండి అంటే చాలు. మియాపూర్ మెట్రో వద్దకి మనుషులను పంపిస్తారు. 15 రోజుల తర్వాత ఫైల్ మంత్రి దగ్గరకు పంపిస్తారు. మీరు మంత్రిగారితో మరోసారి గుర్తు చేయండి అని చెప్పడంతో ఆ సదురు ఎమ్మెల్యేలు మంత్రిగారిని వేడుకుంటారు. దీంతో మహేందర్ ఫైల్ ఎమైంది అంటే.. టేబుల్ పై ఉంది సర్ అంటూ సెలువిస్తారు. ఆయనతో సంబందం లేకపోతే ఆ ఫైల్ ఏడాది అయినా క్లియర్ కాదు. ఇక పండగలు వస్తే.. మున్సిపల్ అధికారులు స్వీట్ డబ్బాలు, టపాకాయలతో క్యూ కట్టాల్సిందే.. లేదంటే.. కిరణ్ అనే వ్యక్తి ఫోన్ చేసి అందరు వచ్చి మహేందర్ సార్ ని కలుస్తున్నారు మీరెప్పుడు కలుస్తారని అడగటం మాములుగానే ఉంటుంది. దీంతో ఆఫీసర్స్ పండగకు అన్ని సమకూర్చుతారని ఆఫీసర్స్ చెప్పుకుంటున్నారు. 

గత ఇంటర్వ్యూలో తాము అనుకున్న వారికే- ఇప్పుడు ఆయన కోసమే ఫైల్ పెట్టారట. 

జనవరి 24,27 తేదిల్లో ఢిల్లీలో కంఫర్డ్ ఐఎఎస్ ల కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. అక్కడ ఎలాంటి రిజర్వేషన్స్ లేకుండానే మెరిట్ తో పోస్టింగులు ఉంటాయి. కాని మహేందర్ కావాలని ఓపెన్ క్యాటగిరి తో పాటు ఎస్సీ, ఎస్టీలు అంటూ రిజర్వేషన్స్ పెట్టి ఆ అధికారులతో ఆటలాడుకున్నారు. హైదరాబాద్ లోని ఓ జోనల్ కమిషనర్ తో 10 లక్షల ఖర్చు పెట్టించారు. అందరూ తెలంగాణ భవన్ లో ఉంటే ఈయన ఫ్యామిలీతో ప్రత్యేక హోటల్ లో ఉన్నారు. వారి ప్లైట్ పూణే టూ హైదరాబాద్ 3 రోజులు ఢిల్లీలో ఫ్యామిలీతో ఎంజాయి చేశారు. అయితే ఈ ఖర్చు అంతా ఆ జోనల్ కమిషనరే పెట్టుకున్నారట. తీరా అతనికి ఆశ పుట్టించి.. ఆ ఫోస్ట్ రాకపోవడంతో మరో ప్రధాన ఏరియాలో జోనల్ కమిషనర్ గా రాత్రి రాత్రి పైల్ లో పేరు పెట్టి కేటీఆర్ ని మెప్పించారట. ఒక్కొక్క పోస్టు కి కోటి రూపాయలు అని బేరాసారాలు ఆడారట. అయితే మాజీ ఎంపీ వినోద్ కుమార్ తన అక్క కూతురు హరిణి కోసం, హరీష్ రావు తన ఓఎస్డీ అశోక్ రెడ్డి కి, కేటీఆర్ తన అడిషనల్ పీఎస్ కాంతాయని కోసం, సీఎం కోటాలో నర్సింహారెడ్డి, మెదక్ చర్చి ఫాదర్ ఫైరవీతో నవీన్ లు ఇక్కడ సీఎస్ తో పాటు మరో ఇద్దరి ఐఎఎస్ లపై ఒత్తిడి తెచ్చి ఎప్పుడు లేని విధంగా కంపర్డ్ ఐఏఎస్ లుగా పోస్టింగులు తెచ్చుకున్నారు.  విజిలెన్స్ ఎంక్వెయిర్ జరుగుతున్న టీఐసీసీ నర్సింహారెడ్డి, శాఖపరమైన చర్యలు ఉన్న పాపయ్య, 2 చార్జీలు ఉన్న నారాయణ రావు, పేర్లతో పాటు  ఏసీబీ ట్రాప్ లో పట్టుపడ్డ హన్మంత్ నాయక్ పేర్లను రిఫర్ చేశారు. ఇక ఎప్పుడు గ్రూప్ -2 అధికారులకు, హైదరాబాద్ లో పని చేసిన సచివాలయం, మంత్రుల ఓస్డీలకు ఈ అవకాశం ఇవ్వరు. కాని కేటీఆర్ అడిషనల్ పిఎస్ కాంతాయని ఎంపీడీవో  నుంచి సైదా సచివాలయం దాటి ఎప్పుడు పని చేయలేదు. ఇలాంటి వారి పేర్లు పంపించిన పాత్రలో మహేందర్ ఎన్నో మహిమలు చూపించారు. తాజాగా 2 పోస్టుల్లో ఒక్క పోస్టు ఆయన కోసమే అంటూ బహిరంగంగానే చెప్పుకుంటూ ఈసారి లిస్టు విచిత్రంగా తయారు చేయించారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే పంకజ పేరును చేర్చారు. అమె గ్రూప్ - 2 అధికారిణే. ఏపికి చెందిన నలుగురు అధికారులను చేర్చడం వెనక అనేక అనుమానాలు ఉన్నాయి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకులు తలదూర్చలేదు. 

రూల్స్ ప్రకారం ఐఏఎస్ నియామాకాల్లో ఏ నేతలు తలదూర్చలేదు. అక్రమంగా ఐఏఎస్ లు కాలేదు. కాని టీఆర్ఎస్ సర్కార్ లో అంతా ఇష్టానుసారం అయింది. అంతఃపుర ఆస్థానులే అన్ని పంచుకున్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్న అధికారుల బంధువులు ఈ లిస్టులో ఉన్నారు. మెరిట్ ప్రకారం మళ్లీ లిస్టు పంపివ్వడమా..లేదా అందులోనే ప్రతిభవంతులకు మార్కులను బట్టి ఇవ్వడమో.. నిజాయితీగా జరగాల్సిన అవసరం ఉంది. పదవులను, ప్రమోషన్స్ ని ఆశ చూపించి చేయకూడని పనులను చేపించుకుని నాయకులు భారీగా లాభపడ్డారు. కేటీఆర్ కోటరీలో ఉన్న అధికారులు ఎలా సంపాదించారు. వారి బినామిలు ఎవ్వరో రాబోయో కథనంలో సాక్షాధారాలతో సహా మీ ముందు ఉంచబోతుంది లాండ్స్ అండ్ రికార్డ్స్ .కామ్.