Sunday, July 31, 2022

ప్రొఫైల్ పిక్ గా త్రివర్ణ పతాకాన్ని ఉంచండి..... ప్రధాని మోదీ పిలుపు

*ప్రొఫైల్ పిక్ గా త్రివర్ణ పతాకాన్ని ఉంచండి..... ప్రధాని మోదీ పిలుపు*

దిల్లీ: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న వేళ నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' వేడుక ప్రజా ఉద్యమంగా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2-15వ తేదీల మధ్య ప్రతిఒక్కరూ తమ సోషల్‌ మీడియా ఖాతాల ప్రొఫైల్‌ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని పిలుపునిచ్చారు. ప్రతినెలా నిర్వహించే రేడియో ప్రసంగం మన్‌ కీ బాత్‌లో ఈ మేరకు ఆయన ప్రజలను కోరారు.

అలాగే, ఆగస్టు 13-15 మధ్య ఇంటింటా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ప్రధాని కోరారు. ఫలితంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో ఏదో రూపంలో పాల్గొంటున్నారని ఆయన అన్నారు.

* ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కర్ణాటకలో 'అమృత భారతి కన్నడర్తి' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మోదీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రదేశాల్లో.. ఆయా ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల్ని స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించినట్లు వెల్లడించారు.

* స్వాతంత్ర్య పోరాటంలో రైల్వేల ప్రాముఖ్యతను వివరిస్తూ 'ఆజాదీ కా రైల్‌గాడీ' పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 75 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.

* మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఆగస్టు 2నే అని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు. అలాగే త్రివర్ణ పతాక రూపకల్పనలో మేడం కామా కూడా కీలక పాత్ర పోషించినట్లు స్మరించుకున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Saturday, July 30, 2022

A love letter to my PEN

I am but a pen, and one day my ink will run out. But that is not the case with Sabih Akhtar Siddiqui. The pens introduced by him to Hyderabad are still a rage and so is his Deccan Pen Store (DPS). Ninety-four years later, he opened an exclusive pen shop at Abids. It remains the favorite haunt of both connoisseurs and neophytes.

When the young Sabih set out from Allahabad, his hometown, to Calcutta in 1928 little did he know that he was scripting history? A businessman, he wanted to do something different this time. He met a representative of Conway Stewart and learnt about the wide range of iconic fountain pens manufactured by the company. He struck a deal and was told to open an exclusive pen store in Hyderabad. It was the time when Osmania University had been just established and everyone was looking to Hyderabad for higher education.

"So Hyderabad was the right choice for setting up an exclusive pen store", says Salman Siddiqui, the grandson of Sabih. The latter passed away in 1968.

Sabih was not wrong. His dream venture proved an instant hit. Given the wide range of branded pens sold here, it attracted pen lovers in droves. The royal family of Nizam, nobles, and nawabs too showed keen interest in pens like Cross, Sheaffer (US), Waterman (France), Parker (UK), and Omas (Italy). There were many Britishers those days in Hyderabad and they too started making a beeline to DPS since there was no other store in the city that showcased such international brands. Sabih engaged a person well versed in English to attend to his foreign clients. Once a person gets used to a quality pen he wouldn't go for a poor substitute.

A shrewd businessman, Sabih quickly realized that selling pens was not enough. There ought to be a servicing center as well. So he started concentrating on repair and service and it remains the USP of DPS even now. Not just from India, pens come here for repair from all over the world. Be it a faulty cartridge, a clogged nib, ink bleeds, smudging, or skipping - there is a cure at DPS. Expensive pen owners do not discard their writing instruments when they develop a problem. They just head to DPS to get the problem fixed. At the hands of Nayeem Akhtar Siddiqui, the founder's son, faulty pens get a new lease of life. An expert repairer, under his watchful eyes two repairing units function at Abids and Humayun Nagar.

The DPS was a famous landmark at Abids in those days. Oldies recall how two persons dressed in traditional sherwanis used to sit at the two windows on either side of the main entrance. Their job was to fill ink, change nibs and attend to minor issues of pens. Office goers and students used to drop here for a quick refill. Over the years the DPS has shifted to new premises at Abids and added two more branches at Ameerpet and Secunderabad. The latter was shut down during the pandemic and is expected to start functioning soon.

The DPS is a writer's delight. There are pens and pens all over the place – of all shapes and sizes. From as low as Rs.5 to a few lakh, DPS offers pens to suit every pocket. Some premium pens like Cross, Waterman, Sheaffer, and Infinium come for jaw-dropping prices. The starting price itself is upwards of Rs.3000 to Rs. 5000. And there is no limit on the high-end pens. They come for Rs. 10 lakh and even more. There are quite a few high-end ink pens manufactured by DPS like Deccan Advocate, Deccan Author, Deccan Onyx, Deccan Acrylic, and Deccan Cigar. An important aspect of the Infinium pen is that it lasts for life and it has no removable refill. Enough ink is packed into it to last for at least 75 years, says Uzair Siddiqui.

These are all-weather, all-condition pens that stand up to almost anything explains Salman Siddiqui. Demand for ink pens, he says, has soared again. Of late students and office, goers are switching over to ink pens.

Who buys such expensive pens? Besides celebrities, film stars, and politicians, many people are crazy about pens. For them, no price is high enough to pander to their taste. Like stamp collection, pen collection has also evolved into a hobby

For some flaunting, branded pens are a status symbol. Prince Mufakkham Jah Bahadur, the grandson of the 7th Nizam, Mir Osman Ali Khan, is said to be a regular customer at DPS. He drops in here once in six months and picks up a pen costing not less than Rs. 50,000. Hyderabad MP, Asaduddin Owaisi, is believed to have purchased a pen costing a few lakhs for his daughter's marriage. Staff at the DPS are reluctant to share details and preferences of their customers.

Six years from now DPS will be entering its centenary year. The family plans to open more stores outside Hyderabad, probably in Delhi and Mumbai. Some new DPS brands and features are also in the pipeline, according to Uzair Siddiqui. Why did the family not think of expansion till now? Well, the DPS founder, Saibh Siddiqui, was not keen on it for various reasons. He felt employees if engaged, will not show the same courtesy to customers as a family man does. He wanted all his seven sons to be in the same trade. And as per his wishes, all his children are in the family business. Some are now into manufacture, some repair and servicing and some look after the stores.

When you write the story of your life don't let anyone else hold the pen. That's the family motto

సొంత సర్వేలో షాకింగ్.... రిపోర్టులు

*సొంత సర్వేలో షాకింగ్.... రిపోర్టులు*

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో సర్వేలకు సంబంధించిన చర్చలే వినిపిస్తున్నాయి. వాళ్ల సంగతేంటి..? వీళ్ల సంగతేంటి? అంటూ తెగ హడావిడి కొనసాగుతోంది.సరిగ్గా 8 నెలల కిందట హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణలోకి పీకే టీమ్‌ సర్వేల విషయంలో స్పీడ్ పెంచింది. అంతకంటే ముందే గ్రౌండ్ లెవెల్లో సర్కార్ పని తీరుపై నివేదికలు సిద్ధం చేసినా.. హుజురాబాద్ బై ఎలక్షన్‌తో ప్రజల్లోకి వెళ్ళింది. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ (Trs) ఇచ్చిన హామీలు, పాలసీలు, నిర్ణయాలపై ఫీడ్ బ్యాక్ తెప్పించారు. అయితే.. టీఆర్‌ఎస్‌.. ఐ పాక్‌ (I Pac)తో ఒప్పందం చేసుకోవడంతో ఇప్పుడు తెలంగాణలో సరికొత్త రాజకీయాలు తెరపైకి వచ్చాయి. కొన్ని సర్వే రిపోర్టులు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో చాలామంది.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని సర్వేల్లో తేలడంతో గులాబీ పార్టీలో ఆందోళన నెలకొంది.

ఇక పీకే టీం ఇచ్చే సర్వే రిపోర్ట్స్‌తో సంబంధం లేకుండా మంత్రులే స్వయంగా సర్వేలు చేయించుకుంటున్నారు. వాళ్ల జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ఇబ్బందులు, ఎమ్మెల్యేల పని తీరుపై సొంత ఏజెన్సీల ద్వారా ఆరా తీస్తున్నారట. అదే సమయంలో బీజేపీ (Bjp), కాంగ్రెస్‌ (Congress)లోకి వెళ్తున్న కింది స్థాయి క్యాడర్‌పైనా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారట. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోని 12 నియోజకవర్గాలపై మంత్రి ఎర్రవెల్లి దయాకర్ (Minister Errabelli Dayakar) స్వయం సర్వేలు చేయించారట. ఆయన సొంత నియోజకవర్గం పాలకుర్తిలో మండలాలు, గ్రామాల వారీగా సర్వే చేయించారట. అయితే.. స్టేషన్‌ఘనపూర్, పరకాల, మహబూబాబాద్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలిందట.

మరోవైపు... ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోనూ మంత్రి జగదీష్‌రెడ్డి (Minister Jagadishreddy) సర్వే చేయించారట. ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు రిపోర్టులు తేల్చాయట. ఇక ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కూడా రీసెంట్‌గా సర్వే చేయించారట. ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు, ఇల్లందు, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో వెల్లడి అయిందట. ఖమ్మంలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఆరు చోట్ల వ్యతిరేకత ఉన్నట్లు తేలడంతో గులాబీ నేతల గుండెల్లో గుబులు రేగుతుంట. ఇటు.. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం సర్వే చేయించారట. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కుత్భూల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో సానుకూలత లేదని తేలిందట.

ఇదిలావుంటే.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంటుందట. వనపర్తి, నారాయణపేట్‌, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రెండోసారి గెలిచిన పరిస్థితి లేదట. కాబట్టి.. ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయట. అదేవిధంగా.. కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ కరువు అయిందట. అటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనూ పలు చోట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నాయట. మంత్రి ప్రశాంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం బాల్కొండలో అయితే.. పరిస్థితి మరింత దారుణంగా ఉందట. బాల్కొండతో పాటు కామారెడ్డి, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయట.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

@SabithaindraTRS సబితా రెడ్డి అసమర్థత మంత్రి రాజీనామా చేయాలి



చట్ట వ్యతిరేక పుస్తకాలు అమ్ముతూ, పిల్లల బ్రతుకులతో ఆడుకుంటున్నపాఠశాలల మీద ఇకనైనా, మీరందరు  @TSEduDept @SomeshKumarIAS @TelanganaCS ఇకనైనా నిద్ర లేవాలి. 

మంత్రి @SabithaindraTRS సబితా రెడ్డి అసమర్థత రాజీనామా చేయాలి, 
పాఠశాలలను పుస్తకాలు అమ్మాండం నుంచి నిషేధించాలి.అమ్మితే 50 వేల జరిమానా విధించాలి. 

పిల్లల్లా భవిషత్తును వాణిజ్యీకరించండి, మీ అసమర్థతను ప్రతి ఏటా చాటిస్తూ, వ్యవస్థను నాశనం చేసిన మీరు ఇక నిద్ర లేవాలి.. 

ఇంకా ఎన్నిరోజులు  మీరంతా కలిసి తప్పుడు స్కూళ్లకు కొమ్ము కాస్తారు? ఎన్ని రోజులు ? 
ఇంకెప్పుడు ? ఇంకెప్పుడు నిద్రలేస్తారు? https://t.co/uPAv1406uD

https://t.co/uijapbCjQL

**************************************

...#తెలంగాణ #డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు ఇలాంటి #ట్వీట్స్ కు మీరు స్పందించాలి మీ బాధ్యత. ఎందుకంటే మీ మంత్రివర్గం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు...... #ప్రయివేట్ #విద్యాసంస్థలు ముఖ్యంగా #నారాయణ #చైతన్య #కార్పొరేట్.... Etc వీటి యాజమాన్యాలు #తెలంగాణ #ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయి అంటే అర్థం అయితుంది మన #విద్యావిధానం ఎలా వుందో అని..... Bplkm🪶
Bplkm🪶

#askktr @AnooradhaR #Balalahakkulasangham 
@sdf4thepeople @rayadasm @RaviVattem @TspaDist @santoshajmeera @TSEduDept https://t.co/tMe4ojXVPE

తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్‌ ఇచ్చారు సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్.

*కేటీఆర్ కోసం సీనియర్లను కేసీఆర్.....తొక్కేస్తుండు.....టీఆరెఎస్ కు రాజయ్య గుడ్ బై*

: తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్‌ ఇచ్చారు సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్. కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న రాజయ్య యాదవ్‌..పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన టీఆర్‌ఎస్‌ పరిస్థితులపై, సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ మలి దశ ఉద్యమ టైంలో కేసీఆర్ వెంట నడిచిన రాజయ్య యాదవ్.. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కీలకంగా వ్యహరించారు. కేసీఆర్‌తో పాటు ఆమరణ దీక్షకు దిగిన ఆరుగురు సీనియర్ నేతలతో రాజయ్య యాదవ్ ఒకరు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్టై ఖమ్మం జైలులో కేసీఆర్‌తో పాటు జైల్లోనూ గడిపారు రాజయ్య యాదవ్. గతంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్‌గా రాజయ్య యాదవ్ పని చేశారు కూడా. ఇవాళ పార్టీకి రాజీనామా ప్రకటించిన సందర్భంలో ఇవాళ ఆయన హాట్‌ కామెంట్లు చేశారు.

► 22 సంవత్సరాలపాటు పార్టీలో కొనసాగానని, కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగానని, ఇప్పుడు చాలా కష్టంగా పార్టీని వీడుతున్నానని రాజయ్య యాదవ్‌ తెలిపారు.

► ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌లో చాలా మార్పు వచ్చిందని, మునుపటిలా పార్టీ సీనియర్లను గౌరవించడం లేదని, కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తనయుడు కేటీఆర్‌ కోసం పార్టీ సీనియర్లను కేసీఆర్‌ తొక్కిపడేశారని, పార్టీతో సంబంధలేని వాళ్లు, బయటివాళ్లదే టీఆర్‌ఎస్‌ రాజ్యమయ్యిందని రాజయ్య యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

► రాష్ట్రం కోసం పోరాడామని, సాధించిన రాష్ట్రంలో ఉద్యమకారులకే స్థానం లేకుండా పోయిందని, కొంతమంది బాధలో ఉన్నారని, తాను మాత్రం ఆ బాధ నుంచి విముక్తి చెందుతున్నానని పేర్కొన్నారు.

► తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, పదవుల కోసం తాను ఏనాడూ పాకులాడలేదని.. తన, తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తాను పార్టీని వీడాల్సి వస్తోందని కామెంట్లు చేశారు.

► టీఆర్‌ఎస్‌లో ఉన్నంతకాలం ఉదమ్యకారులకు బాధే మిగులుతుంది. టీఆర్‌ఎస్‌ కోసం పని చేసినవాళ్లను అవమానకరంగా చూస్తున్నారు. నాకు కాళ్లు మొక్కడం అలవాటు లేదు. ఏదైనా తప్పు చేశానని పార్టీ నుంచి తొలగించినా బాగుండేది. ఏదీ జరగడం లేదు.

► పార్టీలో కొందరు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని రాజయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం వాళ్ల టైం నడుస్తోందని, కానీ, ఇలా ప్రవర్తించిన పార్టీలు రాజకీయ చరిత్రలో కనుమరుగైన సందర్భాలున్నాయని గుర్తించాలని హితవు పలికారాయన.

► ఆత్మ గౌరవం లేనిచోట ఎవరూ ఉండరు. రేపో మాపో మరికొందరు పార్టీని వీడతారు. టీఆర్‌ఎస్‌ ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌. కానీ, ఆ పార్టీ బలహీనంగా ఉండడంతో బీజేపీ వైపే ఎక్కువ మంది చూస్తున్నారు. బీజేపీ నేతలు నాతో కూడా టచ్ లో ఉన్నారు అని రాజయ్య యాదవ్‌ తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Thursday, July 28, 2022

#తెలంగాణ రైతు గుండెల్లో నుంచి వచ్చిన ఆవేదన 😔

To,
The CM 

CC: All Ministers,
Sub: Save Agriculture

Respected Sir

రైతులకు ఎరువులు ఉచితం
వ్యవసాయానికి కరెంటు ఉచితం
రుణ మాఫీ
విత్తనాలు సబ్సిడీ
ఈ ప్రభుత్వంలో రైతులకు అన్నీ ఫ్రీ 
వీరికి ఇంకేం కావాలి , అని ప్రజల ఆలోచన
70%  వ్యవసాయం పై ఆధార పడ్డవారే , కాని వీరికి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి, 

అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని ప్రభుత్వ ఆలోచన

కానీ నేను ఒక రైతు బిడ్డగా చెబుతున్నా , 
మా రైతులకు ఏది ఫ్రీ ఫ్రీ ఫ్రీ గా ఇవ్వాల్సిన అవసరం లేదు అని విన్నవిస్తున్నా,

ఎందుకంటే ,

అంగన్ వాడి కార్యకర్తలను టీచర్లుగా ఎలా గుర్తించి 4,000 జీతం నుండి 10,000 జీతంగా పెంచావో,
1,500 జీతం ఉన్న సర్పంచ్ జీతం 5,000 చేసావో ,
75,000 జీతం ఉన్న MLA జీతం 1,50,000 చేసావో ,
విపరీతంగా పెంచిన గవర్నమెంటు ఉద్యోగుల జీతాలను ఏ విధంగా పెంచావో , 
అదే విధంగా , అదే శాతంతో సమానంగా రైతు పండించిన పంటకు ధరను నిర్ణయించి , ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలి.
ఎందుకు కొనుగోలు చెయ్యరు ప్రశ్నిద్దాం, పోరాడుదాం

లక్ష రూపాయల జీతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రోగం వస్తే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఫ్రీ , అతని పిల్లలకి ఫ్రీ , అతని భార్యకు ఫ్రీ మరియు అతని తల్లిదండ్రులకు కూడా ఫ్రీp
వారికి ఆఫీస్ టైం 9AM to 4:30PM , కచ్చితంగా టైం to టైం వెళతాడు , వస్తాడు.
మరి రైతు లేనిదే రాజ్యం లేదు , రైతే రాజు , రైతు లేకుండా జీవించలేము ,జై జవాన్ జై కిసాన్ , రైతు ఏడ్చిన రాజ్యం లేదు , ఎద్దు ఏడ్చిన ఎవుసం లేదు అని చెపుతున్న రాజకీయ నాయకుల్లారా ,

రాత్రనక , పగలనక , ఏ టైం లేకుండా , ఎప్పుడు పడితే అప్పుడు పొలానికి వెళ్లిన రైతు , తిరిగి వస్తాడో , లేదో తెలియక , ఇంటి దగ్గర ఎదురు చూసే భార్య , పిల్లలు , పంటకు రోగం , మనిషికి రోగం వస్తే ఎక్కడ చూపియ్య లో తెలియక , అప్పు చేసి , దిగుబడి తగ్గి కుంగిపోయే రైతులకు ఇస్తే ఫ్రీ అంటారు, ఉద్యోగులకు ఇస్తే ఇంక్రిమెంట్ అంటారు....నేను షేర్ చేయ్యమని చేప్పను మంచి విషయం అయితే తప్పక షేర్ చేస్తావు🙏

ఎవరిని కించరచడానికి కాదు ఒక రైతు ఆవేదన   
                                                                       ఇట్లు 
*ఒక రైతు బిడ్డ*

1946లో ఆవిష్కరించిన త్రివర్ణ పతాకం ప్రదర్శన!

1946లో ఆవిష్కరించిన త్రివర్ణ పతాకం ప్రదర్శన!*

పుణె: పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 1946 నవంబరులో ఆవిష్కరించిన ఖద్దరు త్రివర్ణ పతాకను అమృతోత్సవంలో భాగంగా మహారాష్ట్రలో ప్రదర్శించారు.పుణె సమీపం పిప్రి చించ్వాడ్‌లోని ఒక కళాశాలలో ఈ నెల 24 నుంచి 26 వరకు ఈ జెండాను ప్రదర్శనకు ఉంచగా.. దాదాపు 5 వేల మంది వీక్షించారు. వీరిలో విద్యార్థులే అధిక సంఖ్యలో ఉండటం విశేషం. సుభాష్‌ చంద్ర బోస్‌ నాయకత్వంలో బ్రిటిష్‌ వారిపై పోరాడిన భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ) మూడో డివిజన్‌కు నాయకత్వం వహించిన మేజర్‌ జనరల్‌ గణపత్‌ రామ్‌ నాగర్‌ కుటుంబం వద్ద ఈ జెండా ఇంతకాలం పదిలంగా ఉంది.

స్వాతంత్య్రానికి పూర్వం 1946 నవంబరు 24న మేరఠ్‌లోని విక్టోరియా పార్కులో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో ఈ జెండాను ఆవిష్కరించారు. ఆ సభా నిర్వహణ బాధ్యతను తన తాతగారైన మేజర్‌ జనరల్‌ నాగర్‌కు అప్పగించారని మేరఠ్‌లోని ఓ కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న దేవ్‌ నాగర్‌ వివరించారు. మహాసభ చివరి రోజున పతాకాన్ని అవనతం చేసిన నెహ్రూ, ఐఎన్‌ఏ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌లు ఆ జెండాపై సంతకాలు చేసి తాతగారికి అప్పగించారని చెప్పారు. మధ్యలో రాట్నం గుర్తుతో ఉన్న ఈ మువ్వన్నెల జెండా కిందనే స్వాతంత్య్రం కోసం పోరాడామని తెలిపారు.

స్వతంత్ర భారతానికి ఇదే జాతీయ పతాక అవుతుందని నెహ్రూ పేర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రం అనంతరం త్రివర్ణ పతాకలోని రాట్నం బదులు అశోక చక్రాన్ని ముద్రించారు. మధ్యలో రాట్నం గుర్తు ఉన్న పాత త్రివర్ణ పతాకను ఇంతకుముందు సుభాష్‌ చంద్ర బోస్‌ 125వ జయంతి నాడు, బంగ్లాదేశ్‌ యుద్ధం ముగిసి 50 ఏళ్లయిన సందర్భంలోనూ ప్రదర్శించారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ సందర్భంగా మళ్లీ ప్రజల ముందుకు తెచ్చారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Hyderabad: సీటీలో దంచికొడుతున్న వర్షం..

Hyderabad: సీటీలో దంచికొడుతున్న వర్షం.. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్స్ ఇవే

భాగ్యనగరాన్ని మరోసారి మబ్బులు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో ప్రజలు సాయం కోసం కాంటాక్ట్ చేయాల్సిందిగా టోల్ ప్రీ నంబర్స్ ఇచ్చింది GHMC.

Hyderabad: సీటీలో దంచికొడుతున్న వర్షం.. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్స్ ఇవే
Hyderabad Rains
Courtesy by : Tv9

Jul 28, 2022 | 5:45 PM

Hyderabad Weather: హైదరాబాద్‌లో మళ్లీ నల్లటి మబ్బులు కమ్మేశాయి. వర్షం దంచికొడుతోంది. నగరమంతటా జోరు వాన కురుస్తోంది. ఆ ఏరియా, ఈ ఏరియా అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. జోరువానకు హైదరాబాద్‌ మళ్లీ అతలాకుతలమవుతోంది. అనేకచోట్ల ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి.  ట్రాఫిక్‌ జామ్స్‌తో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఆఫీసులు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కావడంతో.. వరదనీటిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది.  హైదరాబాద్‌లో వర్షాలపై GHMC మేయర్‌ సమీక్ష నిర్వహించారు. జోనల్‌ కమిషనర్లతో ఫోన్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మేయర్ విజయలక్ష్మి, ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు, సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా ఆపరేషన్స్‌ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల నుంచి కంప్లైంట్స్‌ వస్తే వెంటనే స్పందించాలని, క్షణాల్లో స్పాట్‌కెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించారు. యంత్రాంగమంతా 24గంటలూ అందుబాటులో ఉండాలని GHMC మేయర్‌ విజయలక్ష్మి ఆదేశించారు. ప్రజలు అత్యవసర సమస్యలుంటే GHMC కంట్రోల్ రూమ్ నంబర్స్‌‌కు( 040-21111111, 040-29555500) సంప్రదించాలని సూచించారు. కాగా ఈ మధ్య షియర్ జోన్‌తో పాటు, రుతుపవనాల ఎఫెక్ట్‌లో తెలంగాణలోని జిల్లాలతో పాటు రాజధాని కూడా భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. అప్పటికప్పడే మబ్బులు ఏర్పడి.. భారీ వర్షం కురుస్తుంది

Wednesday, July 27, 2022

Condolences to Late Sanjay Kumar


Condolences to Late Sanjay Kumar

Dear Sanjay, every RGUKTian will be standing by your family in this tough time.
We will be missing you. 

May your soul rest in peace. ☮️


 https://t.co/ro6MtG0PtP

DID YOU KNOW?


DID YOU KNOW? #Chadarghat bridge which was under construction in 1820s was washed away twice by #MusiFloods. Lt Col Oliphant, who was supervising, took a cue from #Puranapul technology & adopted it. #Hyderabad #ArchedTechnology #HyderabadRains #flood #Musi #QutubShahis #bridge https://t.co/fXNVYQyhVN

Tuesday, July 26, 2022

అపోలో, బసవ తారకం కేన్సర్ ఆసుపత్రుల్లో.... ఫ్రీ వైద్యం..... అందించాల్సిందే.....టీ సర్కార్

*అపోలో,  బసవ తారకం కేన్సర్ ఆసుపత్రుల్లో.... ఫ్రీ వైద్యం..... అందించాల్సిందే.....టీ సర్కార్*

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అపోలో, బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రులు.. ఉచిత ఇన్‌ పేషంట్, ఔట్‌ పేషంట్‌ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది.దీనిపై డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణ ఉంటుందని వివరించింది. ఈ మేరకు తాజా జీవో ప్రతిని మంగళవారం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది.

రాష్ట్ర సర్కార్‌ నుంచి తక్కువ ధరలకు భూమి తీసుకున్న టైంలో.. జరిగిన ఎంవోయూల మేరకు ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందజేయాలని, కనీసం కరోనా కష్టకాలంలోనైనా దీన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓమిమ్‌ మానెక్షా డెబారా, తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. 'ఎంఓయూల ప్రకారం రెండు ఆస్పత్రులు పేదలకు ఉచితంగా పడకలను కేటాయించి వైద్యం చేయకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారు. జరిమానా విధింపు అవకాశం కూడా ఉంది. అపోలోకు భూమి ఇచ్చినప్పుడు 15% బెడ్స్‌ పేదలకు ఉచిత కేటాయించేలా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు 1981లో జీవో 517 జారీ అయ్యింది.

ఇక బసవతారకం ఆస్పత్రికి 7.35 ఎకరాలను 1989లో ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేలకు లీజుకు ఇచ్చినందుకు గాను 25% పడకలు, రోజూ 40% ఔట్‌పేషంట్లకు ఉచిత వైద్యం చేసేలా 1989లో జీవో 437 జారీ అయ్యింది. ఇవి అమలు చేసే విధానాన్ని వివరిస్తూ ఈ నెల 16న రాష్ట్ర సర్కార్‌ మరో జీవో 80 జారీ చేసింది'అని ఏజీ వివరించారు. అనంతరం విచారణను ఆగస్టు 8న వాయిదా వేసింది.

*జీవో 80లోని ముఖ్యాంశాలు....*
♦ అపోలో, నందమూరి బసవతారకం మెమోరియల్‌ కేన్సర్‌ ఆస్పత్రులు వరుసగా 15%, 25% పడకలను పేదల కోసం కేటాయించాలి.
♦ ఇది దాతృత్వం కాదు.. ఇది వారి కర్తవ్యం.
♦ ఎందుకంటే హైదరాబాద్‌ నగరంలో అత్యంత విలువైన భూములను ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఈ ఆస్పత్రుల ఏర్పాటు కోసం తక్కువ ధరకు ఇచ్చింది.
♦ ప్రధాన మంత్రి జీవన్‌ ఆరోగ్య యోజన, ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించాలి.
♦ బసవతారకం ఆస్పత్రి 40% పేదలకు తప్పకుండా ఓపీ సేవలు ఉచితంగా అందించాలి.
♦ ఇవన్నీ సరిగా అమలవుతున్నాయా.. లేదా.. అన్నది డీఎంహెచ్‌ఓ అప్పుడప్పుడు పరిశీలించి ధ్రువీకరించాలి.
♦ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆహార భద్రత కార్డుదారులు ఉచిత ఓపీకి అర్హులు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Monday, July 25, 2022

OSMAN SAGAR AND HIMAYATH SAGAR -

PUBLIC STATEMENT


OSMAN SAGAR AND HIMAYATH SAGAR - the Drinking Water-cum-Flood Controlling twin Dam-Reservoirs,


UNAUTHORIZED, ILLEGAL AND IMMORAL TO RELEASE RESERVOIR WATERS WITH FALSE CLAIMS OF FULL TANK LEVELS AND STORAGE CAPACITIES, OF RESERVOIRS WHEN THERE ARE NUMEROUS ENCROACHMENTS AND LAND TRACKS INSIDE RESERVOIRS



1- It is understood from Hyderabad Water Board HMWSSB notifications of *Twin Reservoirs Water Levels:* viz., Osman Sagar are as follows on 10 july 2022 and 25 july 2022 5pm respectively:


Date time


Reservoir

FTL in feet(Storage capacity in tmc)

Present level(Storage capacity)

Inflows in cusecs

Outflows in cusecs

Gates lifted with height

*Date: 25-07-2022 @ 05.00 PM*

1.Osman Sagar:

1790.00 Feet(3.900 TMC)

1787.00Feet (3.222 TMC)

1200 Cusecs

1278 Cusecs

6 Opened for 2 feet height


2.Himayat Sagar:

1763.50 Feet(2.970 TMC)

1760.70 (2.393 TMC)

250 Cusecs

330 Cusecs

1 Opened for 1feet height.

Date: 10-07-2022 @ 05.30 PM*

1.Osman Sagar:

1790.00 Feet(3.900 TMC)

1785.80Feet (2.971 TMC)

100 Cusecs

208 Cusecs

Gates:2 Opened for 1 feet


2. Himayat Sagar:

FTL:* 1763.50 Feet(2.97 TMC)

1760.30 (2.332 TMC)

100 Cusecs

686 Cusecs*

Gates:2 Opened for 1 feet*



2- It is observed from above official information, that in spite of reservoirs not to Full Storage Capacity , flood gates of both the dams viz., Osman Sagar and Himayath sagar have been lifted and waters are being released.


3- It is also observed that, the FTL levels and Storage Capacities being cited are false.

The claim of reaching near Full Tank Levels and Storage capacities is a result of huge shrink in the area and storage capacity , as there are official proofs of encroachments inside the twin Dam-Reservoirs, in full knowledge of Ministry of MAUD, CMO, District Collector cum Magistrate of RR District and other officials including HMWSSB. No action has been taken to evict the encroachments in spite of representations submitted multiple times and latest being on 23 june 2022 to office of the District Magistrate cum Collector, RR.


4- Further our on-field fact-finding has revealed the encroachments of constructions, compound walls, fencing and vast land stretches inside the FTL boundary. HMWSSB FTL pillars have been uprooted. Pictures from inside the FTL boundary of Osman Sagar were furnished again highlighting the same on 1 july 2022 to the Authorities.



5It is shocking and appalling that the HMWSSB and Ministry of MAUD, Goverment of Telangana, publically gives wrong statements day after day , year after year, on the Full tank levels and storage capacities, thus , cheating the people on Osman Sagar and Himayath Sagar, the Drinking Water-cum-Flood Controlling twin Dam-Reservoirs, on water levels and water storage capacties.


How can reservoirs be considered to be full or to the officially claimed capacities and heights, when there are numerous encroachments officially identified/unidentified and vast stretches of land inside the FTL boundaries?


Why FTL boundaries maps of Osman Sagar and Himayath Sagar are not placed in public domain on the website of https://www.hyderabadwater.gov.in


Why there is no Dashboard on the date wise daily inflows and outflows with number of gates opened and height of lifting on the HMWSSB website ? How will public know the status of our dams-reservoirs? No records of previous years found on website?



6- Below picture of one of the officially identified encroachment is being furnished from the officially demarcated FTL boundary of the Osman Sagar.

Geo coordinates of location of ORO Sports are around 17°24'09.6"N 78°17'20.2"E (17.402665, 78.288953 ). This was already represented to the authorities in 2019 itself.



Picture 1: ‘ORO Sports Village’ one of the officially demarcated encroachments inside the FTL of the dam-reservoir Osman Sagar;


Legend to read the multi layered Google earth map below is as follows:


-Official geo coordinates of FTL boundary are indicated with red line.

-The boundary line is overlaid on the google earth app that highlights the ORO Sports that is a 100% encroachment identified by the official map.

Picture 2: Official geo coordinates demarcating boundary of Osman Sagar overlaid on the Google earth that highlights the ORO Sports encroachment


7- Below pictures dated 25 july 2022 of uprooted HMWSSB FTL Pillars and vast land tracks inside the FTL boundary of Osman Sagar that have not been dredged and reservoirs not allowed to be full to storage capacity.

Geo coordinates of the location of land and uprooted FTL pillars:

17°23'52.65"N 78°16'12.29"E



Picture 3 dated 25 july 2022: Vast tracks of land not dredged and reservoirs not allowed to be filled to storage capacity



Picture 4 dated 25 july 2022: HMWSSB FTL pillars uprooted at multiple places and reservoirs not allowed to be filled to storage capacity



Picture 5: HMWSSB FTL pillars uprooted at multiple places and reservoirs not allowed to be filled to storage capacity



Picture 6: HMWSSB FTL pillars uprooted at multiple places and reservoirs not allowed to be filled to storage capacity. Compound walls protected by release of waters.


Picture 7: HMWSSB FTL pillars uprooted at multiple places and reservoirs not allowed to be filled to storage capacity. Compound walls protected by release of waters.



Picture 8: HMWSSB FTL pillars uprooted at multiple places and reservoirs not allowed to be filled to storage capacity.

Legend to read the multi layered Google earth map below is as follows:


-Official geo coordinates of FTL boundary are indicated with red line.

-The boundary line is overlaid on the google earth app that highlights the ORO Sports that is a 100% encroachment identified by the official map.


Picture 9: Blue dot indicates geo-tagged field visit area where the fact finding team walked on vast track of lands inside the reservoir amidst uprooted HMWSSB FTL pillars, compound walls, fencing and plantations.


8- It is also observed that water inflows and outflows are disproportionate, with no reasons for the same , as much as ouflow is 6 times the inflow , drained out of Himayath sagar on 10 july 2022. Outflow is disproportionate continuously and the vast land tracks of the reservoirs are kept dry, must against the given mandate of the HMWSSB to keep the reservoirs free from encroachments and scrupulously maintain the FTL boundaries and storage capacities.



9- We urge the following emergency action on war footing:


I) -Stop releasing of waters from the reservoirs;

-Place the FTL boundary maps of Osman Sagar and Himayath Sagar dam- reservoirs on the website; ( Implement RTI Act Sec 4 of proactive information;)

-Place the outflow and inflow and dam height lifting information on dash board of HMWSSB; (Implement RTI Act Sec 4 of proactive information;)


ii) Immediate eviction of all the officially demarcated encroachments inside the FTL boundaries of the Osman Sagar and Himayath Sagar, the Drinking Water-cum-Flood Controlling twin Dam-Reservoirs;


iii) Immediate dredging of all the land stretches and land fills inside the FTL boundaries of Osman Sagar and Himayath Sagar, the Drinking Water-cum-Flood Controlling twin Dam-Reservoirs;



We assure the authorities of our further coordination on the subject matter in public interest.


We remind the state and the people of the following as enshrined in our Constitution of India:


Part IV.—Directive Principles of State Policy 48A. The State shall endeavour to protect and improve the environment and to safeguard the forests and wild life of the country.

Art 51A (g) in Part IVA: Fundamental Duties of the Indian Constitution: (51A) It shall be the duty of every citizen of India—(g) to protect and improve the natural environment including forests, lakes, rivers and wildlife, and to have compassion for living creatures.


Best

WICCI Water Resources Council, and many other concerned conscious citizens,

Hyderabad, Telangana

9963002403

sarwath.lubna@gmail.com


Sunday, July 24, 2022

నేడు రాష్ట్రపతి బాధ్యతల స్వీకారం!

*నేడు రాష్ట్రపతి బాధ్యతల స్వీకారం!*
*ద్రౌపదీ ముర్ముతో ప్రమాణం చేయించనున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ*

*వేడుకకు ముస్తాబైన పార్లమెంటు సెంట్రల్‌ హాలు....!*
*హాజరుకానున్న వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు*

దిల్లీ: నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఉదయం 10.15 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లన్నీ దాదాపుగా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ వేడుకలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్య కార్యాలయాల అధిపతులు/ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో ముర్ము సెంట్రల్‌ హాలుకు చేరుకుంటారు. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ రాజ్యాంగంలోని ఆర్టికల్‌-60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయిస్తారు. ఆ వెంటనే సైన్యం 21 సార్లు గాలిలోకి కాల్పులు జరిపి నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తుంది. అనంతరం ముర్ము రాష్ట్రపతి హోదాలో ప్రసంగిస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక ఆమె రాష్ట్రపతి భవన్‌కు పయనమవుతారు. అక్కడ త్రివిధ దళాలకు చెందిన సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం చేస్తారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో దిల్లీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. తీన్‌మూర్తి మార్గ్‌, కౌటిల్య, అక్బర్‌ రోడ్డు, రఫీ మార్గ్‌ తదితర మార్గాల్లో సాధారణ వ్యక్తుల వాహనాలను అనుమతించబోమని పేర్కొన్నారు
*సంప్రదాయ సంతాలీ చీరలో..?*
ద్రౌపదీ ముర్ము సంప్రదాయ సంతాలీ చీర కట్టుకొని ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ముర్ము కోసం ఆమె సోదరుడు తరిణిసేన్‌ టుడు భార్య సుక్రీ టుడు ఒడిశా నుంచి దిల్లీకి ఆదివారం సంప్రదాయ చీరను తీసుకొని వెళ్లారు.

*వరుసగా 10 మంది జులై 25నే....!*
రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణ స్వీకారం చేయనున్న 10వ వ్యక్తి ద్రౌపదీ ముర్ము. 1977లో నీలం సంజీవ రెడ్డి జులై 25న రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించినవారంతా అదే తేదీన బాధ్యతలు చేపడుతున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

అంబర్ పేట టిఆర్ఎస్ లో ఫ్లెక్సీల పంచాయతీ...!

*అంబర్ పేట టిఆర్ఎస్ లో ఫ్లెక్సీల  పంచాయతీ...!*

*కృష్ణగౌడ్‌ అరెస్ట్‌, మంత్రి ఫోన్‌తో విడుదల*

హైదరాబాద్/రాంనగర్‌ /అంబర్‌పేట: ఫ్లెక్సీల గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. అంబర్‌పేట టీఆర్‌ఎ్‌సలో హైడ్రామా కొనసాగుతోంది.ఆదివారం అంబర్‌పేటలో మహంకాళి అమ్మవారి బోనాలు జరుగనున్నాయి. రెండు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన విషయం తెలిసిందే. అయితే శనివారం మధ్యాహ్నం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అనుచరుడు తొలుపునూరి కృష్ణగౌడ్‌ తిరిగి అదే స్థానంలో మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా అంబర్‌పేట సీఐ సుధాకర్‌ తన సిబ్బందితో వచ్చి అడ్డుకున్నాడు. స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే గొడవలు జరిగే అవకాశముందని, కృష్ణగౌడ్‌ను అరెస్ట్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.

విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ఈస్ట్‌జోన్‌ అడిషనల్‌ డీసీపీ శ్రీనివా్‌సరెడ్డికి ఫోన్‌ చేసి కృష్ణగౌడ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఫొటో లేకుండా ప్లెక్సీలు పెడితే గొడవ జరిగే అవకాశం ఉందని, ముందుస్తుగానే అరెస్ట్‌ చేశామని వారు మంత్రికి తెలిపారు. దీంతో కష్ణగౌడ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని డీసీపీ శ్రీనివా్‌సరెడ్డి, ఏసీపీ వెంకటరమణ, అంబర్‌పేట సీఐ సుధాకర్‌ తెలిపారు. కృష్ణగౌడ్‌ను అరెస్ట్‌ చేశారని తెలుసుకున్న అంబర్‌పేట నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కె.పద్మావతిరెడ్డి, పులిజగన్‌, సీనియర్‌ నేతలు గరిగంటి రమేష్‌, ఎక్కాల కన్నా, కె.మురళీకృష్ణ అంబర్‌పేట పీఎ్‌సకు వచ్చి అతనికి సంఘీభావం తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ముందుగా కేసులు నమోదు చేయాలని వారు కోరారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు పిర్యాదుచేస్తామని వారు స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు

ప్లెక్సీల వివాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు కృష్ణగౌడ్‌ ఏర్పాటు చేసిన ప్లెక్సీని చించివేశారనే ఫిర్యాదుపై స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ అనుచరులు మధుసూదన్‌రెడ్డి, అనిల్‌, దిలీప్‌, చందు, మిర్యాల రవీందర్‌లపై కేసు నమోదు చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Saturday, July 23, 2022

TRS పార్టీకి రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి న్యూఢిల్లీ గౌరవ రామచంద్రు తేజావత్ IAS (Retd) గారు

*బిగ్ బ్రేకింగ్ న్యూస్*
Date:23/07/2022

*TRS పార్టీకి రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి న్యూఢిల్లీ గౌరవ రామచంద్రు తేజావత్ IAS (Retd) గారు*

*తెలంగాణ రాష్ట్ర సమితి ఒక మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ శ్రీమతి శ్రీ ద్రౌపది మూర్ము సపోర్ట్ చేయకుండా గిరిజనుల పట్ల ఎంత చులకనగా ఎవరిస్తుందో ఈ విషయంలో తాను బాధపడ్డానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి రాజీనామా పత్రాన్ని పంపించారు*

*ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రం అవతరించక ముందు రాష్ట్రం కోసం తన వంతుగా ఎంత కృషి చేశాడో వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్రానికి రావలసిన నిధులను మరియు ప్రాజెక్టులను నా వంతు నేను కృషి చేశానని వివరించారు* 

Friday, July 22, 2022

పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని..... మంత్రి కేటీఆర్ నిర్ణయం!

*పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని..... మంత్రి కేటీఆర్ నిర్ణయం!*

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకల)కు దూరంగా ఉంటున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు.వర్షాల వలన, పలు జిల్లాల్లో వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్(TRS) పార్టీ శ్రేణులు తమకు తోచిన మేర "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమం కింద ప్రజలకు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

*సుజీవన్ వావిలాల*.🖋️
ప్రజల పక్షం 

చిక్కడపల్లి లో తుపాకితో కాల్చుకుని.... న్యాయవాది ఆత్మహత్య

*చిక్కడపల్లి లో  తుపాకితో కాల్చుకుని.... న్యాయవాది ఆత్మహత్య*

హైదరాబాద్‌: నగరంలోని చిక్కడపల్లిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. న్యాయవాది శివారెడ్డి తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన శివారెడ్డి తన భార్య నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఈరోజు ఉదయం 6గంటలకు కడప నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకుని తిరిగి బయటకు రాలేదు.

బంధువులు ఫోన్‌ చేసినా ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చిన బంధువులు శివారెడ్డి ఇంటికి చేరుకుని తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నారు. తన లైసెన్స్‌ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*సుజీవన్ వావిలాల🖋️*
ప్రజల పక్షం 

భారీ వర్షాలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష

*భారీ వర్షాలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష*

హైదరాబాద్: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరైనారుభారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల నీటిమట్టాలపై అధికారులతో కేసీఆర్‌ సమీక్ష చేశారు. తెలంగాణ (Telangana)లో పలు జిల్లాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 18 జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy rain) పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్‌ (Hyderabad)లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దవుతోంది.

మరో వైపు వరద నష్టాలపై కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర బృందం ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లాలోని ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించి పంట నష్టంపై ఆరా తీసింది. ఉట్నూర్‌ మండల కేంద్రంలో పవర్‌ ప్రజంటేషన్‌ ద్వారా వరదల ఉధృతి, పంట నష్టాన్ని పరిశీలించింది. ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద తెగిపోయిన బ్రిడ్జిని పరిశీలించింది. నిర్మల్‌ జిల్లా (Nirmal District)లోనూ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీతో కలిసి కడెం ప్రాజెక్టు (Kadem project)ను సందర్శించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Thursday, July 21, 2022

వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనం పై....హైకోర్టు కీలక ఆదేశాలు

*వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనం పై....హైకోర్టు కీలక ఆదేశాలు*

హైదరాబాద్‌: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై స్పష్టతనిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీవోపీ) వినాయక విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసిందిఅయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన నీటి కుంటల్లోనే పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని తెలిపింది. విగ్రహాల ఎత్తు తక్కువగా ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై పశ్చిమ బెంగాల్‌ మార్గదర్శకాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

గతేడాది పీవోపీ విగ్రహాలపై నిషేధం విధిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలను జారీ చేసింది. సీపీసీబీ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ గణేష్ మూర్తి కళాకార్ సంఘ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నంద ధర్మాసనం విచారణ చేపట్టింది. శాస్త్రీయ అధ్యయనం లేకుండా సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ వాదించారు. పీవోపీపై నిషేధం లేదని.. అలాంటప్పుడు కేవలం విగ్రహాల తయారీలో వినియోగించొద్దనడం సమంజసం కాదన్నారు. జీహెచ్ఎంసీ బేబీ పాండ్లను (నీటి కుంటలు) సరిగా నిర్వహించలేక.. పీవోపీ విగ్రహాల తయారీ, విక్రయాలు నిలిపివేయాలని కళాకారులపై దాడి చేస్తోందన్నారు. కొవిడ్‌కు ముందు తయారు చేసిన విగ్రహాలనైనా విక్రయించేందుకు అనుమతివ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ.. పీవోపీ విగ్రహాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి వరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదని తెలిపింది. ప్రస్తుతం నిషేధం లేనందున.. కొందరి ఉపాధి దెబ్బతినేలా ఉత్తర్వులు ఇవ్వమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో మాత్రం నిమజ్జనం చేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే బేబీ పాండ్లలో నిమజ్జనం చేసి వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో నదులు, సముద్రాలు లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని పేర్కొంది. కనీసం విగ్రహాల ఎత్తును నియంత్రించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వం న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. కొత్త అంశాలను తెరపైకి తేవద్దని వ్యాఖ్యానించింది. సీపీసీబీ మార్గదర్శకాల చట్టబద్ధతను తుది విచారణలో తేలుస్తామంటూ విచారణను వాయిదా వేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

ఆరోగ్యంగా ఉన్న 11 ఏళ్ల పాప బిల్లింగ్ పైనుండి దూకి సుసైడ్

ఆరోగ్యంగా ఉన్న 11 ఏళ్ల పాప బిల్లింగ్ పైనుండి దూకి సుసైడ్ చెసుకున్న సంఘటన చాలా బాధాకరం.ఈ ఘటన ఎల్ బి నగర్ మధురానగరిలో జరిగింది.
తల్లి తండ్రులకు బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి మీ పిల్లల విషయంలో కాస్త సమయం వారికి కేటాయించండి, ఏరోజుకారోజు స్కూలు విషయాలు తెలుసుకోని వారికి తగు జాగ్రత్తలు చెప్పండి.వారితో స్నేహ వాతావరణంలో మాట్లాడండి
11సంవత్సరాల పాప ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తే స్కూలులో మానసిక ఒత్తిడికి లోను అయ్యె అవకాశం ఉంది
ఆ చిన్న మనసు తట్టుకోలేని సంఘటన చూసి ఉండొచ్చు
ప్రస్తుతం మాత్రం కంటికి రెప్పలా కాపాడుతూ ఉండాలి పిల్లలను
@Praja_Snklpm 
#Balalahakkulasangham https://t.co/tcpAKwOLJu

**************************************

*11 సంవత్సరాల చిన్ని పాప సూసైడ్ చాలా బాధాకరం 😔*
@Murali_IASretd @rayadasm @sdf4thepeople @SrinivasRTIA @RaviVattem @santoshajmeera
@TSEduDept

*#askktr*

*#తెలంగాణ లో ప్రయివేట్ విద్యాసంస్థలు #ధనార్జనే ముఖ్యంగా దోపిడీ చేస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు అమ్ముడుపోయారు. పిల్లలు మానసికంగా ఇబ్బందులకు గురిఅవుతున్నారు 😔*
*Bplkm🪶* https://t.co/Q3Qi9YYVdm

Monday, July 18, 2022

మహిళల కోసం ప్రత్యేక..... లీగల్ సెల్

*మహిళల కోసం  ప్రత్యేక..... లీగల్ సెల్*

హైదరాబాద్‌: మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ప్రత్యేకంగా లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేసింది.
రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లీగల్‌ సెల్‌ను సోమవారం జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు.

మహిళలకు చట్టబద్ధమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని రేఖా శర్మ అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ కమిషన్‌ కార్యక్రమాలను, సేవలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు చట్టపరమైన సహాయం కోసం ఈ సెల్‌ వన్‌-స్టాప్‌ సెంటర్‌గా పనిచేస్తుందని సునీతాలక్ష్మారెడ్డి వివరించారు. అలాగే మహిళలకు సహాయంగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ 9490555533, ఫేస్‌ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులు గురించి తెలియజేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

పిల్లలు ఏడింటికే స్కూల్ కు వెళ్తుంటే మనం 9 గంటలకు రాలేమా.....?

*పిల్లలు ఏడింటికే స్కూల్ కు వెళ్తుంటే మనం 9 గంటలకు రాలేమా.....?*

*సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ యు.యు.లలిత్‌ వ్యాఖ్య.....!*

దిల్లీ: చిన్నారులు ఉదయం 7 గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు న్యాయమూర్తులు, న్యాయవాదులు 9 గంటలకు ఎందుకు విధులు ప్రారంభించకూడదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ వ్యాఖ్యానించారు.సాధారణంగా కోర్టు పనిగంటలు 10.30కి ప్రారంభం అవుతాయి. అయితే శుక్రవారం జస్టిస్‌ లలిత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఓ కేసు విచారణను ఉదయం 9.30 గంటలకే ప్రారంభించింది. విచారణకు హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ దీనిపై సంతోషం వ్యక్తం చేయగా జస్టిస్‌ లలిత్‌ స్పందిస్తూ.. ''చిన్నారులు ఉదయం ఏడు గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు..

న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎందుకు ఉదయం తొమ్మిది గంటలకు తమ పని ప్రారంభించకూడదని నేను ఎప్పుడూ చెబుతుంటాను. కోర్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. తొమ్మిది గంటలకు పని ప్రారంభించి, పదకొండున్నర తర్వాత అరగంట విరామం తీసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పని ముగించుకోవచ్చు.

దీనివల్ల సాయంత్రం కేసు ఫైళ్లు చదువుకోవడానికి మరింత సమయం దొరుకుతుంది'' అని చెప్పారు. సాధారణంగా వారంలో ఐదురోజుల పాటు కోర్టులు పనిచేస్తాయి. రోజు పని గంటలు ఉదయం పదిన్నరకు ప్రారంభమై సాయంత్రం నాలుగుకు ముగుస్తాయి. అందులో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి గంటపాటు లంచ్‌ బ్రేక్‌ ఉంటుంది.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు....భవిష్యవాణి లో స్వర్ణలత......!

*దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు....భవిష్యవాణి లో స్వర్ణలత......!*

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల్లో భాగంగా 'రంగం' కార్యక్రమం నిర్వహించారు.జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

''పూజలు మొక్కుబడిగా చేస్తున్నారు. మీరు చేస్తున్న పూజలు.. మీ సంతోషానికే తప్ప నాకోసం కాదు. ఎంత సంతోషంగా చేస్తున్నారో మీ గుండెపై చేయి పెట్టి చెప్పండి. మీరు సంతోషంగా చేస్తున్నారనే నేను స్వీకరిస్తున్నా. నా గుడిలో పూజలు సరిగా జరిపించడం లేదు.

గర్భాలయంలో మొక్కుబడిగా వద్దు.. శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. మొక్కుబడిగా పూజలు చేస్తున్నా.. నా బిడ్డలే కదా అని భరిస్తున్నా.. కడుపులో పెట్టుకుంటున్నా. ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు? మీకు నచ్చినట్టు మారుస్తారా? స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా. నా రూపాన్ని స్థిరంగా నిలపండి. మీరేంటి నాకు చేసేది.. నేను తెచ్చుకున్నదే కదా! దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు'' అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Saturday, July 16, 2022

#తెలంగాణ లో విద్యావ్యవస్థను నాశనం చేసిన #తెలంగాణ ప్రభుత్వం

           https://youtu.be/0gKy-vGaakY                         👆ఈ వీడియో అందరు చూడాలి 
           
                  *ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది*

*ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం #తెలంగాణ కానీ గత 8 సంవత్సరాలుగా పేదల & మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు భారత రాజ్యాంగం కల్పించిన న్యాయమైన హక్కులకు అనుగుణంగా అందవలసిన విద్యావ్యవస్థను నాశనం చేసిన #తెలంగాణ ప్రభుత్వం.*

*విద్యావ్యవస్థకు అండగా ఉండాల్సిన,తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావులు ఇప్పుడు ప్రభుత్వము ఇచ్చిన నామినేటెడ్ పదవులను అనుభవిస్తూ, #తెలంగాణ జాతికి ద్రోహం చేసిన ఈ మేధావులు అనబడే మూర్కులను తెలంగాణ నుంచి తరిమికొట్టాలి.*

*తెలంగాణ లో  విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలి అంటే,ప్రభుత్వ విద్యావ్యవస్థ బాగుపడేలా చేయాలంటే ప్రజలు అందరు రాజకీయాలకు అతీతంగా మళ్ళీ ప్రజా ఉద్యమం చేయాలి.*

*ఆలోచించే సమయం దాటిపోయింది.*

*మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచించండి*

*భారత గౌరవ #రాజ్యాంగంను అపహాస్యం చేసిన#తెలంగాణ ప్రభుత్వం 😔*

*ఈరోజే సంకల్పం తీసుకోండి 🙏.... Bplkm🪶*

*Copy to Group link Media*
17/07/2022

*Bapatla Krishnamohan* 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/

బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..

బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..

బాసర ట్రిపుల్ ఐటీలో శుక్రవారం  కలుషిత ఆహారం కారణంగా ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. దీంతో వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నేడు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదుట ఆందోళనకు దిగారు.

Basara iiit Students protest over food poison

Courtesy by : telugu.asianetnews.com(Twitter)
First Published Jul 16, 2022, 2:45 PM IST

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. బాసర ట్రిపుల్ ఐటీలో శుక్రవారం  కలుషిత ఆహారం కారణంగా ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. దీంతో వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నేడు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు అస్వస్థతకు గురైన విద్యార్థులు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

ఇక, శుక్రవారం ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పీయూసీ-1, పీయూసీ-2 హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం తర్వాత వాంతులు, విరేచనాలు అయ్యాయి. మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ వడ్డించారని.. అది తిన్న చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. కొందరు స్పృహ తప్పిపడిపోయారు. దీంతో అప్రమత్తమైన ట్రిపుల్ ఐటీ అధికారులు క్యాంపస్‌లోని ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌లో అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందించారు. స్పృహతప్పి పడిపోయిన వారిని నిజామాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించారు.


ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకారం.. ఇన్స్టిట్యూట్‌లోని మూడు మెస్‌లలో రెండింటిలో భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒక మెస్‌లో 3,000 మంది విద్యార్థులకు, మరో మెస్‌లో 2,500 మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. ఈ రెండింటినీ ఒకే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. రెండు హాస్టళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ వడ్డించారు. మరో పక్క ఫుడ్‌ పాయిజన్‌ గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని వారి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. 

విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్‌గా స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ వి వెంకటరమణ ఆసుపత్రిని సందర్శించి, చేరిన విద్యార్థులకు అందుతున్న వైద్య సహాయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Friday, July 15, 2022

గోదావరి ఉగ్రరూపం..... భద్రాచలానికి ఇండియన్ ఆర్మీ

*గోదావరి ఉగ్రరూపం..... భద్రాచలానికి ఇండియన్ ఆర్మీ*

హైదరాబాద్‌: గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో భద్రాచలంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తుండటంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో సహాయ చర్యలు అందించేందుకు ఇండియన్‌ ఆర్మీ రంగంలోకి దిగింది. 78 మందితో కూడిన ఇన్‌ఫాంట్రీ దళం, 10 మంది వైద్యులు, 23 మంది ఇంజినీర్లు సహా మొత్తం 101 మందితో కూడిన బృందం భద్రాచలం బయలుదేరింది.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

గవర్నర్ తమిళిసై తో మాకు ఎలాంటి పంచాయతీ లేదు.... మంత్రి KTR

*గవర్నర్ తమిళిసై తో మాకు ఎలాంటి పంచాయతీ లేదు.... మంత్రి KTR*

.. తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌..బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.

మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ''బీజేపీ పెద్దల అవినీతి వల్లే రూపాయి విలువ పడిపోతోంది. మొదటి సర్వే బీజేపీది, రెండో సర్వే కా​ంగ్రెస్‌ది.. కానీ, వారి షాకిస్తూ రెండు సర్వేల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందనే తేల్చాయి. మా ప్రత్యర్థుల సర్వేలు కూడా మూడోసారి టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఒప్పుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో 90కి పైగా స్థానాల్లో గెలుస్తాము. నల్లగొండ, ఖమ్మంలో బీజేపీకి మండల స్థాయి నాయకులు లేరు. కాంగ్రెస్‌కు కూడా కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. కట్టప్పల గురించి కేసీఆర్‌ వివరంగా చెప్పారు.

మోదీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. పార్లమెంట్‌లో అన్‌పార్లమెంట్‌ పదాలు వాడేది బీజేపీ నేతలే. తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. ప్రధాని మోదీ ప్రైవేటు విజిట్‌కు సీఎం కేసీఆర్‌ స్వాగతం పలకాల్సిన అవసరం లేదు. మోదీ ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ గుజరాత్‌. గతంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గుజరాత్‌కు వస్తే ఎందుకు రిసీవ్‌ చేసుకోలేదు.

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో మాకు ఎటువంటి పంచాయితీ లేదు. సొంత నియోజకవర్గంలో గెలవలేని రాహుల్‌, రేవంత్‌ సిరిసిల్లకు వచ్చి ఏం చేస్తారు?. అందరు ప్రధానులు రూ. 56లక్షల కోట్ల అప్పులు చేస్తే.. మోదీ ఒక్కరే 100 లక్షల కోట్ల అప్పులు చేశారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైంది?. కాంగ్రెస్‌ హయంలో శ్రీశైలం, కల్వకుర్తి పంపుహౌస్‌లు మునిగిపోయాయి. ప్రకృతి విపత్తుల వల్ల పంప్‌హౌస్‌లోకి నీళ్లు వస్తే ఎవరేం చేస్తారు''ని ప్రశ్నించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం..... మంత్రి కేటీఆర్!

*సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం..... మంత్రి కేటీఆర్!*

హైదరాబాద్: తెరాస ఒక్కటే రాష్ట్రమంతా ఉందని.. ఈ విషయాన్ని భాజపా, కాంగ్రెస్‌ సర్వేలే స్పష్టం చేస్తున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు.సీఎం కేసీఆర్‌ దొర అయితే ఎంతమందిని జైల్లో వేశారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా కేటీఆర్‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఎవరికీ లొంగరు, బెదరరని.. షెడ్యూల్ ప్రకారం 2023లోనే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. సీఎంగా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Thursday, July 14, 2022

మంథని లో వరద బీభత్సం....అంతె త్తు నీటిలో.....3నెలల చిన్నారిని బుట్టలో పెట్టుకోని....!

*మంథని లో వరద బీభత్సం....అంతె త్తు నీటిలో.....3నెలల చిన్నారిని బుట్టలో పెట్టుకోని....!*

పెద్దపల్లి: వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కాలనీలు, ఇళ్లల్లోకి భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతాకాదు. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు చేరింది. బొక్కల వాగు బ్యాక్ వాటర్‌తో పట్టణంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, వాసవీనగర్‌, దొంతలవాడ, బోయిన్ పేట, లైన్ గడ్డలోని బర్రెకుంటలో ఉన్న ఇళ్లు నీటమునిగాయి. దీంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఓ కుటుంబం తమ నెలల పసిపాపను వరద నీటి నుంచి రక్షించేందుకు పడ్డ కష్టం బాహుబలి సినిమాలోని దృశ్యాన్ని తలపించింది. సినిమాలో గ్రాఫిక్స్‌తో క్రియేటివిటీ చేస్తే ఇక్కడ మాత్రం ప్రత్యక్ష్యంగా సాక్షాత్కరించిందీ దృశ్యం. మర్రివాడకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో మూడు నెలల పసికందును కుటుంబ సభ్యులు బుట్టలో పెట్టుకొని తరలించారు. భుజాల వరకు వచ్చిన నీటిలో చిన్నారిని ఉంచిన బుట్టను తల్లిదండ్రులు తమ తలపై ఉంచుకుని అడుగులో అడుడేస్తూ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. మంథని పట్టణంలో వరద పరిస్థితి తీవ్రతను ఈ దృశ్యాలు కల్లకు కడుతున్నాయి.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

ప్రధాని హత్యకు ఇద్దరు ఉగ్రవాదుల కుట్ర

*ప్రధాని హత్యకు ఇద్దరు ఉగ్రవాదుల కుట్ర...*

*నిందితుల అరెస్ట్*

*నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చే లక్ష్యం*

పాట్నా(బీహార్): సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని బీహార్ పోలీసులు గురువారం ఛేదించారు.2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని, జులై 12వతేదీన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను బీహార్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పాట్నా నగరంలో ఉగ్రవాదులైన అథర్ పర్వేజ్, ఎండీ జలాలుద్దీన్ లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్‌లో శిక్షణ పొందారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదుల సమావేశం...జులై 6, 7 తేదీల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా సమావేశాలు జరిపారు. దీంతో అనుమానిత ఉగ్రవాదులున్న ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడిలో, పోలీసులు నేరారోపణ పత్రాలను కనుగొన్నారు. వాటిలో ఒకటి 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ దేశం చేయాలనేది.వారి నుంచి 25 పీఎఫ్‌ఐ కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంటెలిజెన్స్ బ్యూరోకు పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద మాడ్యూల్ పనిచేస్తున్నట్లు సమాచారం అందింది. ఆ తర్వాత పోలీసులు, కేంద్ర సంస్థల అధికారులు జులై 11 వతేదీన నయా తోలా ప్రాంతంలో దాడి చేసి అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
ఇతర రాష్ట్రాల యువకులకు ఉగ్రవాద శిక్షణకేరళ, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి యువకులు ఉగ్రవాద శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వచ్చేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది.అరెస్టయిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి భారత దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని పోలీసులు వెల్లడించారు

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Wednesday, July 13, 2022

మన ఊరు- మన బడి మరో టెండర్ రద్దు... హైకోర్టు కు తెలిపిన ప్రభుత్వం!

*మన ఊరు- మన బడి మరో టెండర్ రద్దు... హైకోర్టు కు తెలిపిన  ప్రభుత్వం!*

హైదరాబాద్‌: 'మన ఊరు- మన బడి' కార్యక్రమం కింద పిలిచిన మరో టెండరును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రీన్‌ చాక్‌ బోర్డుల కొనుగోళ్ల కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.ఇటీవల డ్యూయల్‌ డెస్క్‌లు, టేబుళ్లు, ఫర్నిచర్‌ సరఫరా నిమిత్తం గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాలని నిర్ణయించినట్లు హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.. తాజాగా గ్రీన్‌ చాక్‌ బోర్డుల కొనుగోళ్ల టెండర్ల రద్దు అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు పాఠశాలల్లో పెయింటింగ్‌ టెండర్లపై కొనసాగనుంది.

నిబంధనల్లో పేర్కొన్న ప్రకారం టెండర్‌ సమర్పించినా తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రీయ భాండార్‌ జెనిత్‌ మెటప్లాస్ట్‌, వీ3 ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆ పిటిషన్లపై విచారణ జరిపింది.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

CM KCR పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో..... ఫిర్యాదు

*CM KCR పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో..... ఫిర్యాదు*

సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో సీఎం కేసీఆర్‌(CM KCR)పై భజరంగ్ దళ్ నేతలు ఫిర్యాదు చేశారు. దేవి దేవతలను కించపరుస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారని..ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తెలంగాణ(Telangana)లో ఉన్న ప్రముఖ దేవతలను కీర్తించారని, దీనిని రాజకీయంగా తప్పు పడుతూ జులై 10వ తేదీన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యానించారని వీహెచ్‌పీ(VHP) పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ నాయకుడు అభిషేక్ డిమాండ్ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Tuesday, July 12, 2022

పాని పూరి తినకండి...తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు

*పాని పూరి తినకండి*

*తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు..*

అసలే విషజ్వరాల సీజన్, ఆపై వర్షాలు.. ఇలాంటి టైమ్ లో బయట తిండి కాస్త తగ్గించుకుంటే మంచిదని చెబుతున్నారు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు. పనిలో పనిగా పానీపూరీ లవర్స్ కి కూడా వార్నింగ్ ఇచ్చారాయన. పానీపూరీతో రోగాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. పానీపూరీ, ఔట్ సైడ్ ఫుడ్ తినే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వాటి జోలికే వెళ్లొద్దన్నారు.

కొవిడ్ నామమాత్రం.. కానీ..!
దాదాపుగా కొవిడ్ నుంచి బయటపడ్డామని, కొత్త వేరియంట్‌ వస్తే తప్ప కొవిడ్‌ కథ ముగిసినట్లేనని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని, అది చివరి దశకు చేరుకుందన్నారు. కొవిడ్‌ కూడా ఓ సీజనల్‌ వ్యాధిగా మారిపోయిందని, లక్షణాలుంటే కేవలం 5 రోజులే క్వారంటైన్‌ లో ఉండాలన్నారు. కరోనా లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదన్నారు. డబ్ల్యూహెచ్‌ వో కొత్త నిబంధనల ప్రకారం లక్షణాలు లేనివారికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని చెప్పారు. ఇప్పుడిక సీజనల్‌ వ్యాధులతో పోరాడాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించారు. వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బ్యాక్టీరియా, వైరస్‌ తో సీజనల్‌ వ్యాధులు వస్తాయని, వర్షాలు పడేసమయంలో అత్యంత అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని కోరారు.

డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా..
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1184 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్పారు ఆరోగ్య శాఖ డైరెక్టర్. హైదరాబాద్‌ లో అత్యథికంగా 516, కరీంనగర్‌ లో 84, మహబూబ్‌ నగర్‌, ఇతర ప్రాంతాల్లో మిగతా కేసులు నమోదయ్యాయని చెప్పారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అన్నారు. దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. భద్రాద్రి, ములుగు జిల్లాల నుంచి మలేరియా కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు.

ఈ ఏడాది టైఫాయిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, మేలో 2700, జూన్‌లో 2,752 కేసులు వచ్చాయని వెల్లడించారు. ప్రతి ఫ్రైడే డ్రైడే పాటించాలని, సరైన ఆహారం, మంచినీరు తీసుకోవడం ద్వారా ప్రజలు ఈ వ్యాధుల నుంచి సురక్షితంగా బయటపడొచ్చని చెప్పారు. నీరు రంగుమారితే తప్పకుండా కాచి చల్లార్చి తాగాలన్నారు. గర్భిణులు డెలివరీ డేట్ కంటే ముందే.. ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకోవాలని సూచించారు. బాలింతలు, చంటి పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఉండి మాస్క్‌ ధరిస్తూ ఐసోలేషన్‌ పాటించాలని సూచించారు.

అవసరం లేకుండా ప్లేట్‌ లెట్‌ మార్పిడి చేయొద్దని ప్రైవేట్‌ ఆస్పత్రులకు సూచించారు. ప్రజల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవద్దని కోరారు. అత్యవసరం అయితేనే ప్లేట్‌ లెట్‌ చికిత్స అందించాలని సూచించారు

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

నేడు అత్యంత భారీ.... రానున్న రెండు రోజులు అతి భారీ... వర్షాలు : వాతావరణశాఖ

నేడు అత్యంత భారీ.... రానున్న రెండు రోజులు అతి భారీ... వర్షాలు  : వాతావరణశాఖ*

హైదరాబాద్: దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈరోజు తీవ్ర అల్పపీడనంగా బలపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఈ తీవ్ర అల్పపీడనం ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అత్యంత భారీ, రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Monday, July 11, 2022

తడసి ముద్దవుతున్న హైదరాబాద్....నిండు కుండల్లా జంట జలాశయాలు

*తడసి ముద్దవుతున్న హైదరాబాద్....నిండు కుండల్లా జంట జలాశయాలు*

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. భాగ్యనగరాన్ని ముసురు వదలడం లేదు. వరుసగా ఐదోరోజూ తేలికపాటి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.దీంతో హైదరాబాద్‌ తడిసి ముద్దవుతోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు పోటెత్తడంతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నిండుకుండలా మారాయి.

ఉస్మాన్‌సాగర్‌కు 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. రెండు గేట్లు ఎత్తి 312 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడిచిపెడుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1786 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. హిమాయత్‌సాగర్‌కు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. రెండు గేట్ల ద్వారా 515 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడిచిపెడుతున్నారు. హిమాయత్‌సాగర్‌లో ప్రస్తుతం 1763.50 అడుగుల నీటిమట్టం ఉంది.

మరోవైపు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సారగ్‌ కూడా నిండుకుండలా మారింది. కూకట్‌పల్లి నాలా నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం 513.41 మీటర్ల పూర్తిస్థాయి చేరింది. వస్తున్న ఇన్‌ఫ్లోకు సమానంగా తూముల ద్వారా నీరు బయటకు వెళ్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్....అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా

*కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్....అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా*

తెలంగాణలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. రాజకీయ నేతలు సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.రేవంత్‌ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు దమ్ముంటే నాలుగు రోజుల్లో అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి. కాంగ్రెస్‌కు 90 లక్షల ఓట్లకు తక్కువ పడ్డా నా పేరు మార్చుకుంటాను. కేసీఆర్‌ను వదిలించుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారు.

కేసీఆర్‌కు మానవ సంబంధాలు లేవు. కేవలం ఆర్థిక లావాదేవీలే ఉంటాయి. రాజపక్సే కుటుంబానికి వచ్చిన పరిస్థితే.. కేసీఆర్ కుటుంబానికి వస్తుంది. సహారా కుంభకోణంలో కేసీఆర్‌ను కాపాడుతున్నదే బీజేపీ. కేసీఆర్ అవినీతిపై ప్రధాని మోదీ విచారణకు ఆదేశిస్తారని మేము ఆశించాము. కానీ, అలా జరగలేదు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో ఒక్క పైసా కూడా వద్దని మోడీతో కేసీఆర్ చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ వ్యూహాకర్త కేసీఆర్‌కు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్టులో టీఆర్‌ఎస్‌ 25 సీట్లు మాత్రమే గెలుస్తుందని ఉంది. మరో 17 సీట్లలో పోటాపోటీ ఉందని నివేదిక ఇచ్చింది. టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగింది. అందుకు నా పేరు పలికేందుకు కేసీఆర్‌ భయపడుతున్నాడు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి..... ఈటల సవాల్....!

*దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి..... ఈటల సవాల్....!*

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.గతంలో తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నట్టు ఈటల స్పష్టం చేశారు.ఎన్నికల్లో గజ్వేల్(gajwel) నుండి సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానని అన్నారు. బిజెపి(bjp) నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని ఆయన అన్నారు.మా అమ్మనాకు సంస్కారం నేర్పించిందని చెప్పారు.రాజపక్సే లాగా నిన్ను తెలంగాణ ప్రజలు పారద్రోలడం ఖాయమని అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం