Monday, October 5, 2026

మాదాపూర్‌లోని 'లక్కీ రెస్టారెంట్'కు సంబంధించిన వ్యవహారంకు సంబందించి ఎస్‌హెచ్‌ఓ SHO - మాదాపూర్ వివరణ_

*మాదాపూర్‌లోని 'లక్కీ రెస్టారెంట్'కు సంబంధించిన వ్యవహారంకు సంబందించి ఎస్‌హెచ్‌ఓ SHO - మాదాపూర్ వివరణ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 04:

మాదాపూర్‌లోని పిల్లర్ నంబర్ 1723 సమీపంలో 'లక్కీ మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్'ను నిర్వహిస్తున్న మహమ్మద్ మన్సూర్ ఆ స్థలాన్ని రవి, హరి మరియు ఇతరుల నుండి లీజుకు తీసుకున్నారు.గత కొన్ని నెలలుగా మన్సూర్ అద్దె చెల్లించడం లేదని తెలిసింది. అద్దె చెల్లింపు మరియు ఆ ప్రాంగణ వినియోగానికి సంబంధించి యజమాని-అద్దెదారు మధ్య ఉన్న వివాదమే దీనికి ప్రధాన కారణం.అద్దె వివాదం కారణంగా, రవి, హరి మరియు ఇతరులు రెస్టారెంట్‌కు వెళ్లే దారిని (అప్రోచ్ రోడ్) ధ్వంసం చేశారని మరియు అక్కడికి వెళ్లే మార్గానికి అడ్డుపడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది మరియు విచారణ జరుగుతోంది.03.10.2026న అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 00:10 గంటలకు), మాదాపూర్ పెట్రోలింగ్ వాహనం ఇండియన్ పెట్రోల్ పంప్ సమీపంలో రాత్రిపూట గస్తీ నిర్వహిస్తుండగా, మహమ్మద్ మన్సూర్ తన భార్య మరియు మరికొందరితో కలిసి రోడ్డుపైకి వచ్చి పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. వారు రోడ్డుపైనే కూర్చోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడమే కాకుండా ప్రజలకు అసౌకర్యం కలిగింది. అంతేకాకుండా, విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి కూడా వారు అడ్డుతగిలారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మహమ్మద్ మన్సూర్ మరియు ఇతరులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది మరియు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయి.తనిఖీ సమయంలో ఆహార భద్రత మరియు పరిశుభ్రతకు సంబంధించిన లోపాలు గుర్తించబడినందున, 26.09.2026న 'లక్కీ రెస్టారెంట్' యొక్క FSSAI లైసెన్స్‌ను నిలిపివేసినట్లు కూడా తెలిసింది.

హైదరాబాద్‌లో 36 గంటల వాటర్ కట్ అంతరాయం_

*హైదరాబాద్‌లో 36 గంటల వాటర్ కట్ అంతరాయం*

*పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 04:

హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (KDWSP) ఫేజ్–2లో భాగంగా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వుల మార్పిడి, అలాగే స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ నివారణ పనులు చేపట్టనున్నారు.ఈ పనులు తేది: 05.10.2026, సోమవారం ఉదయం 6 గంటల నుంచి తేదీ 06.10.2026 మంగళ వారం సాయంత్రం 6 గంటలకు చేపడతారు. కావున ఈ 36 గంటలు కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగానూ.. మరికొన్ని ప్రాంతాల్లో లో - ప్రెషర్ తో నీటిసరఫరా జరిగే అవకాశం ఉంది.

*అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:*

ఆదిబట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్‌ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్ (పాక్షికం), హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్ (పాక్షికం), పద్మారావునగర్, బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, వైశాలీనగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్‌పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్‌నగర్ (పాక్షికం).
కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.

స్వఛ్ఛ ఆటో, టిప్పర్ కార్మికుల స్వతంత్రతను కాపాడాలి_

*స్వఛ్ఛ ఆటో, టిప్పర్ కార్మికుల స్వతంత్రతను కాపాడాలి*

*ఎస్. జీవన్ కుమార్ - మానవ హక్కుల వేదిక*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 04:

మన నగరాలలో నగరం యొక్క విస్తృతిని బట్టి కొన్ని లక్షల సంఖ్యలో కార్మికులు మన గృహాలలోంచి
వచ్చే చెత్త,రోడ్లపై ఉండే చెత్త, ఆఫీసుల్లో , కార్మాగారాలలో, హోటల్లలో , రకరకాల దినసరి కార్యక్రమాల్లోంచి వచ్చే చెత్తను శుభ్ర పరుస్తుంటారు.రోడ్లపై పేరుకుపోయే దుమ్ము, దూళినే కాకుండా అక్కడక్కడ పడి ఉన్న పిల్లి, ఎలుక, కుక్కలలాంటి జంతువుల కళేబరాలను తీసి వేస్తుంటారు. ఎప్పుడైనా మన ఇంట్లో నుండి చెత్త  తీసుకోకపోయినా, రోడ్లపై చెత్త చెదారం కనిపించినా, క్షేత్రస్థాయిలో చెత్తను తీసుకెళ్ళే కార్మికులపై ఆగ్రాహం ప్రదర్శిస్తుంటాం. అప్పుడప్పుడు దాడులకు కూడా పాల్పడడం జరుగుతుంది.ఈ కార్మికులు చేసే ఈ మన పనిని అసహ్యించు కుంటాం. చెత్త అబ్బాయి, చెత్త ఆయన, చెత్త ఆమె అని చాలా అగౌరవంగా సంభోదిస్తుంటాం. కాని ఆ చెత్త శుభ్ర పరిచే వ్యవస్థ పనిచేసే తీరు ఏంటి, అందులో ప్రభుత్వం, మున్సిపాలిటీల పాత్ర ఎంత, కార్మికుల పాత్ర ఎంత అన్న విషయాలు మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది.జంటనగరాలతో పాటు ఈ నగరాలచుట్టూ కొత్తగా విస్తరించిన ప్రాoతాలు, ఆధునిక కాలనీలలో చెత్త శుభ్రం చేసే వ్యవస్థ అమలులో ఉంది. ఇండ్లలోని చెత్తను, బస్తీలు, కాలనీలు, రోడ్లపై ఉండే చెత్తను ప్రతిరోజు పొగుచేసి దాన్ని మున్సిపాలిటి నిర్ధేశించిన స్థలాలో వేస్తారు. అక్కడ నుండి జి.హెచ్.ఎమ్.సి లేక ప్రయివేటు కాంట్రాక్టర్ వాహనాల ద్వారా
ఆ చెత్తను  ప్రధాన డంపింగ్ ప్రదేశమైన జవహర్ నగర్ కు తరలిస్తారు.నగరంలో రోజూ రోడ్లు,శుభ్రం చేసే పనిలో దాదాపు 20 వేలమంది కార్మికులు  పని చేస్తూ ఉంటారు. ఇందులో కేవలం,రెండు వేల మంది మాత్రమే మున్సిపాలిటీ చే నియమింపబడి ,ప్రభుత్వ నియమాల ప్రకారం జీత భత్యాలు పొందుతారు. 
తక్కిన వారంతా ఔట్ సో ర్సింగ్ , కాంట్రాక్ట్ కార్మికులు. వీళ్ళంతా ఒక డజను మంది కాంట్రాక్టర్ల అజమాయిషీలో పని చేస్తుంటారు. వీళ్ళే కాక,
గృహాలలో నుండి ప్రతి రోజు,ఇంటి ఇంటికీ తిరిగి చెత్త తీసుకెళ్ళి డంపింగ్ ప్రదేశాలకు తరలించే కార్మికులవ్యవస్థ కూడా ఒకటి ఉంది.వీళ్ళు ఎవరి అజమాయిషీలో పని చేయరు. 
30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మూడు చక్రాల డబ్బా రిక్షాలు సరఫరా చేస్తే వాటి లో ఈ కార్మికులు గృహాలలోంచి  చెత్తను తీసుకెళ్ళే వారు. ఇందులో కూడా కొందరు మున్సిపల్ ఉద్యోగులు, కొందరు ప్రయివేటు, ఔట్ సోర్ సింగ్ కార్మికులు పని చేసేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మూడు చక్రాల బండిలో చెత్త తరలించే కార్మికులకు సబ్సిడీ ఇచ్చి స్వచ్ఛ ఆటోలు, టిప్పర్లు ప్రభుత్వం అందచేసింది. దాదాపు 5000  డీజిల్ తో నడిచే వాహనాలను దళిత, వెనుక బడ్డ కులాలకు ప్రభుత్వం సబ్సిడీ కింద,బ్యాంకుల నుండి రుణ సౌకర్యం కల్పించింది.సబ్సిడీ పోను మిగతా డబ్బు ఈ కార్మికులు,వాళ్ళు సేవలు అందిస్తున్న గృహయజమానుల దగ్గరి నుండి తీసుకొనే డబ్బులోoచి, చెల్లించి 
ఆ వాహనాలకు స్వంత దార్లు అయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో.....

**రాంకీ ఎన్విరాన్ ఇంజనీరింగ్ లిమిటెడ్**

అనే ప్రయివేటు సంస్థ వివిధ డంపింగ్ యార్డుల్లో ప డేస్తున్న చెత్తను, డంపింగ్ కేంద్రం అయిన జవహార్ నగర్ కు తరలించేది. 
ఆ డంపింగ్ యార్డు నిర్వహణ విషయంలో 2009 వ సంవత్సరంలో ప్రభుత్వం రాంఖీ సంస్థ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.తరవాత 2018లో, 2022 లో రెండు పర్యాయాలు,ప్రభుత్వం రాంఖీ సంస్థతో ఒప్పందం పునరుద్దరణ (రెన్యూవల్) చేసుకున్న  సంధర్భాలలో ఈ సంస్థ ప్రభుత్వం నుండి  చాలా రాయితీ లు రాబట్టుకుంది.
రాంఖీ సంస్థ చెత్తనుండి తయారు చేసే విద్యుత్ చక్తిని, కంపోస్టు ఎరువును ఆ సంస్థ నే అమ్ముకోవడానికి ప్రభుత్వం ఒప్పుకుoది. డంపింగ్ యార్డు స్థలం ప్రభుత్వమే తన ఆధీనంలో ఉన్న భూమిని సంస్థకు కేటాయిస్థానని ఒప్పుకుంది.ప్రస్తుతం జవహర్ నగర్ ప్రధాన డంపింగ్ యార్డ్ కాకుండా, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో ఫతుల్ల గూడ, కూకట్ పల్లి మండలంలో, శంషగూడ మరియు రంగారెడ్డి, గండిపేట మండలంలోని గంధం గూడలో ప్రభుత్వం కెటాయించిన భూముల్లో,రాంఖీ సంస్థ 
చెత్త నిర్వహణ కార్యక్రమం లో ఉంది .రెండు దశాబ్దాల లక్రితం 
ప్రారంభించిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల దాని చుట్టూ మూడుకిలో మీటర్ల పరిధిలో భూగర్భ జలాలు కలుషిత మయ్యామని,వాయు కాలుష్యo తో  భయంకర మైన 
దుర్గంధం వ్యాప్తి చెందడంతో ప్రజలు రోగాల భారిన పడుతున్నారని గత సంవత్సర కాలంగా ఆ డoపింగ్ యార్డును మూసివేయాలని పెద్ద ఆందోళన జరుగుతుంది. దాని నిర్వహణ బాధ్యత ప్రయివేట ఏజెన్సీ రాంఖీ ఇంజనీర్స్ తీసుకున్న తర్వాత నే పరిస్థితులు ఇట్లా దిగజారాయని ప్రజలు అంటున్నారు.ప్రతి రోజు దాదా దాపు 6,000 టన్నుల చెత్త,
నగరం, దాని చుట్టు పక్కల నివాసాల నుండి వెలువడుతుందని నివేదికలు తెలుపుతున్నాయి.4,000 వేల టన్నుల ఆహారం, తినుబండారాలకు సంబంధించిన మిగులు చెత్త, హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్లపై స్నాక్స్ మ్మే టిఫిన్ సెంటర్లు,  టిఫన్ బండ్ల నుండి వెలువడుతుంది. గతంలో ఈ ఆహారానికి సంబంధించిన చెత్తను స్వచ్ఛ ఆటో, టిప్పర్ కార్మికు లే సేకరించేవారు.
కానీ సంవత్సర కాలంగా రాంఖీ లారీలు ఈ ఆహారపు మిగులును తరలిస్తున్నాయి.
ఈ ఆహరపు మిగులు 
పందులకు ఆహారంగాను, కంపోస్ట్ ఎరువుల తయారీలో నూ వాడుతారు.దీన్ని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం రాoఖీ సంస్థ ఖాతాలో కే పోతుంది. గతం లో ఈ డబ్బులు కార్మికులు తీసుకునేవారు.ఇళ్ళలోంచి సేకరించే చెత్తలో లభించే ప్లాస్టిక్, ఇనుము, రాగి, ఇతర లోహాలు,పనికి రాని వస్తు సామాగ్రిని, స్వచ్ఛ ఆటో కార్మికులు స్క్రాప్ వ్యాపారస్తులకు అమ్ము కొని కొంత ఆదాయం సంపాదించుకుంటారు. 
ఒక స్వఛ్ఛ ఆటో, టిప్పర్ పై డ్రైవర్ తో సహా ఇద్దరు కార్మికులు పని చేస్తారు.ఈ సంవత్సరం జనవరి 
మాసంలో కేంద్ర ప్రభుత్వం సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలు, మార్గ దర్శకాలు తయారు చేసి చాలా వివరాలతో కూడిన డ్యాకు మెంట్ ను అన్ని రాష్ట్రాలకు పంపి , 36 నెలల్లో ఆ డ్యాకుమెంట్ లోని అంశాలను అమలుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది.ఆ 80 పేజీల పత్రంలో రకరకాలవ్యర్థ పదార్థాలను  శాస్త్రీయం గా ఎట్లా వేరు చేయాలి, రసాయన పదార్థాలు, హాస్పిటల్ 
ల లో నుండి వచ్చే మానవ  శరీర భాగాలను , ఫ్యాక్టరీలనుండి వచ్చే రసాయన  పధార్థాలు వగైరా ఎట్లా సేకరించాలి, ఏ పద్దతి లో యార్డులో విసర్జించాలి అన్న విషయాలు వివరంగా ఉన్నాయి.
కానీ,వివిధ వ్యవస్థ ల్లో సేకరించిన చెత్తను ఎట్ల రవాణా చేయాలి అన్న అంశానికి సంబంధించిన నియమాలు కానీ వివరణ లు కానీ లేవు.తెలంగాణ పభుత్వం  కేంద్రం నిర్దేశించిన మార్గ దర్శకాల నెపంతో చెత్త తరలింపు వ్యవస్థను తా రాంఖీ ఎన్విరో ఇంజనీర్ ప్రయివేటు సంస్థకు అప్ప చెప్పాలనే ఆలోదన చేస్తుంది.అంటే స్వయం కృషితో, స్వయం ఉపాధి కార్మికులుగా సేవలందిస్తున్న దాదాపు 15000 మంది కార్మికులను వాళ్ళ స్వచ్ఛ ఆటో, టిప్పర్ వాహనాలలో సహా రాంఖీ ప్ర యివేటు సంస్థ కు అప్పచెప్పాలని, ఆసంస్థతో చేసుకునే ఒప్పదంలో 
ఈ కార్మికులకు నెల వారి జీతాలు,ఇంకా కొన్ని అంశాల ప్రస్తావన ఉండే లా చూస్తామ ని ప్రభుత్వం అంటుంది.అంటే ఎంతో కాలంగా కార్మికులు కష్టపడి నిర్మించుకున్న
ఒక స్వయం జీవనోపాధి వ్యవస్థను ప్రయివేటు సంస్థకు దారాదత్తం చేయడం 
అన్న మాట. ఆహారం 
వoడుకొ ని, కూరలతో వడ్డించుకున్న ఒక విస్తరిని తమ నుండి లాక్కొని,ఒక సంస్థకు అందించ డమే ఈ ప్రభుత్వ ఆలోచన అని కార్మికులు అంటున్నారు.ఈ మధ్య జరిగిన తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్  సమావేశంలో, టి.జి.ఎస్ నేత, ఎం.ఎల్.సి,ఫ్రొ.కోదండరాం, స్వచ్ఛ కార్మికుల సామాజిక భద్రత, రక్షణ గురించి ప్రభుత్వం ఆలోచన తెలియ చేయాలని కోరాడు.దానికి జవాబుగా మంత్రి దుద్దిళ్ళ 
శ్రీధర్ బాబు స్వఛ్ఛ, ఆటో , టిప్పర్ కార్మికుల కు ప్రభుత్వంతో ఏమి సంబంధం లేదని, వాళ్ళ బాగోగులు చూసుకునే అంశం రాoఖీ సంస్థ కే ప్రభుత్వం అప్ప చెప్పిందని  సమా ధానమిచ్చారు.గతమూడు నెలలుగా,ప్రజలకు తమ సేవలు అందించుకుంటూనే, తమ స్వచ్ఛ ఆటో, టిప్పర్ వ్యవస్థమ ప్రయివేటు కంపెనీ రాంఖీ ఇంజనీరింగ్ సంస్థకు ఇవ్వకూడదని. తమకు సామజిక భద్రత, ప్రమాద భీమా, ఆరోగ్యరక్షణ వ్యవస్థ,
మానవీయ మైన పని పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమకు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు అందించాలని, పాత వాహనాల మరమ్మతులకు, డిజిల్,కోసం నెలకు కొంత డబ్బు ఇవ్వాలని కోరుతున్నారు. తామే,ఎంతో కష్టపడి , తమనిధుల తో నే  వాహనాలు ఖరీదు చేసి, ప్రజలకు సేవ అందిస్తున్న తమ స్వయం ఉపాధి ప్రక్రియ సంస్థను ఎట్టి పరిస్థితుల్లో ను ప్రయివేటు కంపెనీకి అప్పచెప్ప వద్దని కార్మికులు గొంతెత్తి నినదిస్తున్నారు. మరి, వారి సేవలను రోజు పొందుతున్న వారిగా, పౌరులుగా మనం  వారికి సంఘీ్ భావం తెలుపుదామా!
**ఎస్. జీవన్ కుమార్ మానవ హక్కుల వేదిక.**

Saturday, October 3, 2026

రెడ్డి మంత్రులారా... రెడ్డి ఎమ్మెల్యేలారా... రెడ్డి అధికారులారా..._

నకిలీ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం తయారీ, ఆస్తి వివాదం, బెదిరింపులు మరియు నాకు, నా భర్తకు ప్రాణహాని ఉంది_

*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి,తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి,నల్లగొండ జిల్లా ఉన్నతాధికారులకు వినతిపత్రం*

*నకిలీ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం తయారీ, ఆస్తి వివాదం, బెదిరింపులు మరియు నాకు, నా భర్తకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ రక్షణ కల్పించాలని గంధం జ్యోతి వినతి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 02:

నా పేరు గంధం జ్యోతి నా భర్త పేరు గంధం అశోక్ యాదవ్. మాది నల్లగొండ జిల్లా, శాలిగౌరారం మండలం, ఊటుకూరు గ్రామం.మా గ్రామం ప్రస్తుత నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం స్వగ్రామం.మా గ్రామానికి సంబంధించిన ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ ప్రత్యేకంగా దృష్టి సారించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.నేను ఊటుకూరు గ్రామానికి చెందిన దివంగత బొడ్డు వీరమల్లు గారి కుమార్తెను. నాకు 2014 సంవత్సరంలో ఇటుకులపాడు గ్రామానికి చెందిన గంధం అశోక్ తో వివాహం జరిగింది.మా నాన్నగారికి ముగ్గురు సంతానం. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలం. నా తండ్రి తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తిలో నాకు కూడా వాటా ఉంటుందని, నా వివాహ సమయంలోనే నాకు చెప్పారు. నా అన్న బొడ్డు విజయ్ కూడా నాకు రావాల్సిన భూమిని రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పారు.నా అన్న జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో, మా తల్లిదండ్రుల మంచి చెడులను మేమే చూసుకున్నాము. నా భర్త గంధం అశోక్ కూడా నా తండ్రికి ఆర్థికంగా, ఇతర విషయాల్లో సహకరించారు.ఆ సమయంలో నా తండ్రి తన ఆస్తిలో నాకు ఒక ఎకరం భూమిని పసుపు కుంకుమ కింద ఇస్తానని నాకు, నా భర్తకు చెప్పిన విషయం ఉంది. అయితే నా భర్త అశోక్, “మీ ఇష్టం, నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయవద్దు” అని చెప్పారు.కానీ ప్రస్తుతం భూముల ధరలు పెరగడంతో ఆస్తి విషయంలో కుటుంబంలో వివాదాలు ఏర్పడ్డాయి. నా అన్న బొడ్డు విజయ్, నా అక్కలు దొంగల రేణుక, మర్రి సైదమ్మ, వారి భర్తలు తదితరులు కలిసి నాకు రావాల్సిన ఆస్తి విషయంలో నా భర్తను నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, మాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని నా ఆరోపణ.

**నకిలీ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రంపై ఫిర్యాదు**

నేను జీవించి ఉండగానే, నేను చనిపోయినట్లు చూపిస్తూ నకిలీ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్  తయారు చేయించారని నేను ఆరోపిస్తున్నాను.ఈ పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, శాలిగౌరారం ఎంపీడీవో కార్యాలయానికి చెందిన కొంతమంది అధికారులతో కుమ్మక్కై తయారు చేయించారని నా ఆరోపణ.నేను జీవించి ఉన్నప్పటికీ, నన్ను మరణించిన వ్యక్తిగా చూపిస్తూ ఇలాంటి పత్రం ఎలా తయారైంది? దానికి సంబంధించిన దరఖాస్తు ఎవరు చేశారు? ఏ ఆధారాలు సమర్పించారు? ఎవరు పరిశీలించారు? ఏ అధికారి సంతకం చేశారు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నాను.

**నాకు, నా భర్తకు బెదిరింపులు**

నా భర్త గంధం అశోక్ కు రాజకీయ నాయకుల నుంచి ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు ఆయన నాకు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్ నా భర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నాము.
అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం అన్న వేముల రామచంద్ర కూడా నా భర్తకు ఫోన్ చేసి బెదిరించినట్లు మా ఆరోపణ.ఈ బెదిరింపుల కారణంగా నేను, నా భర్త మరియు మా కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాము.

**ఆర్డీవో అశోక్ రెడ్డి కౌన్సెలింగ్‌పై అభ్యంతరం**

నల్లగొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి నా భర్తకు పాఠశాల స్థాయి గురువుగా పరిచయం ఉన్న వ్యక్తి.కుటుంబ సమస్యకు సంబంధించి మమ్మల్ని కౌన్సెలింగ్ కోసం పిలిచిన సమయంలో, నా భర్త సమక్షంలో నా రూపురేఖలు, శరీర రంగు గురించి అవమానకరంగా మాట్లాడారని నేను ఆరోపిస్తున్నాను.

*“ఈ కర్రె పిల్ల ఎక్కడ దొరికింది?” అనే విధంగా నా భర్త ఎదుట నన్ను అవమానించేలా మాట్లాడారని నా ఆరోపణ.**

ఈ సంఘటనతో నేను తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన కారణంగా నేను మరియు నా కుటుంబం మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.నా భర్త అశోక్ ఆర్డీవో ను గురువుగా గౌరవిస్తారని, అందువల్ల ఆ సమయంలో ఆయన ఎదుట ఏమీ మాట్లాడలేకపోయారని నాకు తెలిపారు.నేను గతంలో ఆర్డీవో కార్యాలయానికి పలు తేదీల్లో వెళ్లి మా సమస్యను వివరించినప్పటికీ, నాకు న్యాయం జరగలేదని భావిస్తున్నాను.కుటుంబ సభ్యుల మాటలను మాత్రమే ఆధారంగా చేసుకుని నన్ను కించపరిచే విధంగా వ్యవహరించారని నా ఆరోపణ. ఈ వ్యవహారంపై కూడా ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని కోరుతున్నాను.

**మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి**

ప్రస్తుతం నా భర్తకు, నాకు రాజకీయంగా మరియు స్థానికంగా ప్రభావం ఉన్న వ్యక్తుల నుంచి బెదిరింపులు ఉన్నాయని మేము భావిస్తున్నాము.వేముల రామచంద్ర, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్ మరియు ఇతర వ్యక్తుల నుంచి వచ్చినట్లు చెబుతున్న బెదిరింపులపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపించాలని కోరుతున్నాము. మాకు లేదా మా కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే, ప్రస్తుతం మేము చేసిన ఫిర్యాదులు మరియు మాకు వచ్చిన బెదిరింపులను పరిగణనలోకి తీసుకుని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
అదేవిధంగా, శాలిగౌరారం మండలం మాజీ డీటీ వరప్రసాద్ వ్యవహారంలో కూడా తమకు అన్యాయం జరిగిందని మేము భావిస్తున్నాము. ఈ అంశంపై కూడా సంబంధిత రికార్డులను పరిశీలించి విచారణ చేయాలని కోరుతున్నాము.

**మా వినతులు**

*(1)*: నేను జీవించి ఉండగానే నన్ను మరణించిన వ్యక్తిగా చూపిస్తూ తయారు చేసినట్లు ఆరోపిస్తున్న నకిలీ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రంపై సమగ్ర విచారణ జరిపించాలి.

*(2)*: ఆ పత్రం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తులు, సమర్పించిన పత్రాలు, సాక్షులు, సంబంధిత అధికారులు మరియు పత్రంపై సంతకం చేసిన అధికారుల వివరాలను వెలికితీయాలి.

*(3)*: శాలిగౌరారం ఎంపీడీవో కార్యాలయంలో ఈ పత్రం తయారైన విధానంపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలి.

*(4)*: నాకు, నా భర్తకు వచ్చినట్లు చెబుతున్న ఫోన్ బెదిరింపులపై కాల్ వివరాలు, ఫిర్యాదులు మరియు ఇతర ఆధారాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

*(5)*: నాకు, నా భర్తకు మరియు మా ముగ్గురు పిల్లలకు అవసరమైన పోలీసు రక్షణ కల్పించాలి.

*(6)*: కుటుంబ ఆస్తికి సంబంధించిన అసలు రికార్డులు, పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు మరియు కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలి.

*(7)*: ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్ సమయంలో నేను ఎదుర్కొన్న అవమానకరమైన వ్యవహారంపై కూడా ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి.

*(8)*: స్థానిక రాజకీయ ప్రభావాలకు అతీతంగా, ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలి.

*(9)*: నల్లగొండ బీసీ జేఏసీ తరఫున కూడా మా కుటుంబానికి న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

ముఖ్యంగా, నాకు లేదా నా భర్తకు, మా పిల్లలకు ఏదైనా హాని జరిగితే, మేము ఇప్పటికే అధికారులకు తెలియజేసిన బెదిరింపులు మరియు వివాదాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.కావున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు ఈ విషయాన్ని అత్యంత సున్నితమైన అంశంగా పరిగణించి, ఉన్నతస్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించి, మాకు తగిన రక్షణ కల్పించి, న్యాయం చేయాలని మనవి.

**విన్నపదారులు:**

గంధం జ్యోతి
భర్త: గంధం అశోక్ యాదవ్
గ్రామం: ఊటుకూరు
మండలం: శాలిగౌరారం
జిల్లా: నల్లగొండ, తెలంగాణఈ రూపంలో ఆరోపణలను “నా ఆరోపణ”, “మా ఆరోపణ”, “విచారణ జరిపించాలని” అనే విధంగా ఉంచాను. దీనివల్ల ఫిర్యాదులో వాస్తవ నిర్ధారణకు అవకాశం ఉండి, సంబంధిత అధికారులను విచారణ కోరే విధానం స్పష్టంగా ఉంటుంది.

ఆన్‌లైన్ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం_

*“డిజిటల్ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం*

*ఆన్‌లైన్ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 03:

పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాలకు గురికాకుండా వారికి అవసరమైన భద్రత, సంరక్షణ కోసం న్యాయ సేవల ప్రాధికార సంస్థ TGLSA సూచనలు, కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తెలిపారు. డిజిటల్ వేదికలపై పిల్లల రక్షణ కోసం వ్యవస్థలను బలోపేతం చేయడానికి న్యాయసేవల సంస్థలు చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం సంపూర్ణంగా  సహకరిస్తుందని చెప్పారు. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ NALSA ఆధ్వర్యంలో “డిజిటల్ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం : ఆన్‌లైన్ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం” అన్న ఇతివృత్తంపై దక్షిణాది ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ఈ సదస్సులో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ National Legal Services Authority ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ జస్టిస్ విక్రమ్ నాథ్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ గారు, జస్టిస్ ఆర్ మహదేవన్ గారు, జస్టిస్ అలోక్ అరాధే గారు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్-ఇన్-చీఫ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు పాల్గొన్నారు.అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, త్రిపుర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ జస్టిస్ శ్యామ్ కోషి గారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు హైకోర్టుల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, పలువురు మాజీ న్యాయమూర్తులు పాల్గొన్నారు.ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళలు, పిల్లల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. పోలీసులు, భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు వంటి అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయని వివరించారు.
“భరోసా కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు ఒకేచోట పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నాం. దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. పిల్లల రక్షణ కోసం పోలీసు శాఖలోని విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో SHE-భరోసా సైబర్ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. CybHER యాప్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం అని అన్నారు.
విద్యార్థులనే సైబర్ అంబాసిడర్లుగా తయారు చేసి, తమ తోటి విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. అన్ని శాఖలు కలిసి పనిచేస్తేనే పిల్లలకు రక్షణ, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించగలం” అని అన్నారు.“ఆర్థిక సహాయం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించడం వరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. TGSLSA పాఠశాల విద్యాశాఖతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఉపాధ్యాయులు పిల్లలకు వారి చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 3,000 మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చాం” అని తెలిపారు.సైబర్ నేరాల వలలో పిల్లలు పడకుండా ఇలాంటి కార్యక్రమాల్లో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణ విషయంలో ప్రతి పిల్లవాడు, తల్లిదండ్రులు నియంత్రణ కోసం ప్రత్యేకంగా కేటాయించిన నంబర్ - 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం - 1098 నంబర్లు తప్పక గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి  చెప్పారు.“సైబర్ నేరాల బారిన పడకుండా పిల్లలకు తల్లిదండ్రుల మద్దతు అవసరం. పిల్లలను తప్పుబట్టే విధంగా కాకుండా ఆసక్తితో అవగాహనతో పిల్లకు మద్దతుగా మార్గదర్శకత్వం చేయాలి. పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు మనమంతా కలిసి పనిచేద్దాం. అందుకు ఈ సదస్సులో జరిగే చర్చలు, సూచనలు, సిఫారసులు యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తాయని విశ్వసిస్తున్నా” అని పేర్కొన్నారు.NALSA ఆధ్వర్యంలో దక్షిణాది ప్రాంతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషకరమని పేర్కొంటూ సదస్సునకు హాజరైన ప్రతినిధులందరికీ ముఖ్యమంత్రి గారు స్వాగతం పలికారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు అత్యంత ముఖ్యమైన సైబర్ సెక్యూరిటీ అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకుని నివారణ చర్యల కోసం ఈ సదస్సు నిర్వహించడంపై ముఖ్యమంత్రి గారు జస్టిస్ విక్రమ్ నాథ్ గారికి, NALSA కు ధన్యవాదాలు తెలిపారు.“ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న తెలంగాణ హైకోర్టుకు, TGSLSAకు ధన్యవాదాలు. న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష పడటం కాదు. న్యాయం అంటే బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడం. గౌరవాన్ని తిరిగి ఇవ్వడం. ముఖ్యంగా పిల్లలు కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయం. న్యాయ సేవల ప్రాధికార సంస్థల కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవల కోసం సిద్ధం చేసిన సంచార లోక్ అదాలత్ Mobile Lok Adalat వాహనాలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, న్యాయమూర్తుల సమక్షంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు.

పర్యావరణ స్పృహ లేని పాలనలో నీళ్ళ ఆధారిత అభివృద్ధి నమూనా_

*పర్యావరణ స్పృహ లేని పాలనలో నీళ్ళ ఆధారిత అభివృద్ధి నమూనా*

*కన్నెగంటి రవి,తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ,టీపీజేఏసీ* 

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 03:

రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు సేవ చేసే పేరుతో ఎన్నికైన ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు పర్యావరణ  స్పృహ సాధారణ ప్రజల కంటే మరింత ఎక్కువ ఉండాల్సి ఉంటుంది.  బడ్జెట్ రూపొందించి ఖర్చు పెట్టే  అధికారం, చట్టాలు చేసి, అమలు చేసే అధికారం ఉన్నంత  మాత్రాన, అన్ని విషయాలలోనూ జ్ఞానం, అవగాహన ప్రభుత్వాలకు ఆటోమాటిక్ గా ఉంటుందన్న గ్యారంటీ ఏమీ లేదు.ఇలాంటి సమయంలో  యూనివర్సిటీలు, శాస్త్రవేత్తల బృందాలు, ఉన్నతాధి కారులు ఆ బాధ్యతను సమర్ధంగా, సకాలంలో , ప్రజల, పర్యావరణ కోణంలో ఆలోచించి నిర్వహించకపోతే, ప్రభుత్వాల ముందు  చర్చకు పెట్టకపోతే,  అవినీతి చక్రంలో తాము కూడా ఒక భాగంగా మారిపోతే,  అంతిమంగా  ప్రభుత్వ పెద్దల స్వార్ధ ప్రయోజనాలే రాష్ట్ర అభివృద్ధి నమూనా రచిస్తాయి. 
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎదుర్కుంటున్నది ఈ సంకట పరిస్థితినే. సుదీర్ఘ కాలం పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ప్రజలు, గత 12 ఏళ్లుగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పర్యావరణ స్పృహ ఏ మాత్రం లేని తప్పుడు అభివృద్ధి నమూనా దుష్ఫలితాలకు  బలవుతున్నారు. తమ చేతుల్లో ఉన్న సహజ వనరులను కోల్పోతున్నారు. హక్కులను కోల్పోతున్నారు. మొత్తంగా తమ భవిష్యత్తును కోల్పోతున్నారు. 
ముఖ్యంగా నీళ్ళ కోణం లో చూస్తే ఇది స్పష్టంగా కనపడుతుంది. సహజ వనరయిన నీటికి ఎప్పుడూ ఒక పరిమితి ఉంటుంది. ఒక రాష్ట్రానికి,  ఆ రాష్ట్రం గుండా ప్రవహించే అంతర్ రాష్ట్ర నదీ జలాలపై అధికారానికి  కూడా ఒక పరిమితి ఉంటుంది. 
ప్రకృతి సహజ వనరైన నీళ్ళకు  ఉండే పరిమితులను దృష్టిలో ఉంచుకోవడం అన్నిటి కన్నా ముఖ్యం. వాతావరణంలో వస్తున్న మార్పులు,పెరుగుతున్న ఉష్ణోగ్రతలు,భారీ వర్షాలు , అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు, నీటి నిల్వకు ఉండే రిజర్వాయర్ల పరిమితులు, ఆయా రిజర్వాయర్లలో వచ్చే నిర్వహణా సమస్యలు, నదీ జలాలను రిజర్వాయర్ లకు చేర్చడానికి  "లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ"  అయ్యే అదనపు ఖర్చులు సరిగా లెక్క వేసుకోవలసి ఉంటుంది. 
ముఖ్యంగా నదుల నుండీ నీళ్ళను లిఫ్ట్ చేయడానికి, బోరు బావుల నుండీ పైకి తోడడానికి భారీ విద్యుత్ అవసరం.  రాష్ట బడ్జెట్ లో అందుకయ్యే ఖర్చు, ఆ నిధులకు ఉండే పరిమితులు, భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోవడం, రాష్ట్ర సగటు  వర్షపాతానికి అనుగుణంగా, భూగర్భంలోకి నీరు ఇంకక పోవడం, భూగర్భంలో రాతి పలకలు, భారీ రసాయన ఎరువుల వినియోగం వల్ల, నీటిని నిలవ చేసుకునే సామర్ధ్యాన్ని మన భూములు కోల్పోవడం, ఫలితంగా మన బావులు, బోరు బావులు వేగంగా ఎండిపోవడం - ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఉండే పరిమితులుగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. 
కానీ తెలంగాణ ప్రభుత్వాలు ఈ విషయాలపై కనీస అవగాహన లేకుండా, దృష్టి లేకుండా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలకు పర్యావరణ స్పృహ ఎలాగూ లేదు. వాతావరణంలో  వస్తున్న మార్పుల గురించి, రాబోయే రోజుల్లో నీటికి ఏర్పడే కొరత గురించీ, ప్రపంచమంతా రోజూ చర్చించుకుంటున్న అంశాలు, మన ప్రభుత్వ పెద్దల చెవికి ఎక్కడం లేదని, వాళ్ళు ప్రోత్సాహిస్తున్న అభివృద్ధి నమూనా స్పష్టంగా మన ముందు కనపడుతుంది.2019 నుండీ ఇప్పటి వరకూ రాష్ట్రంలో అవసరానికి మించి, వరి సేద్యానికి ఇచ్చిన ప్రోత్సాహం ఇందుకు ఒక బలమైన ఉదాహరణ. కెసిఆర్ ప్రభుత్వం కోటి ఎకరాల మాగాణం పేరుతో వరిని ప్రోత్సాహిస్తే, రేవంత్ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ పేరుతో వరి సేద్యం మరింత పెరగడానికి కారణమయ్యింది. 50 రూపాయల విలువైన ఒక కిలో బియ్యం పండించడానికి 5000 లీటర్ల నీళ్ళు ( కిన్లే వాటర్ బాటిల్ ధర ప్రకారం  చూస్తే లక్ష రూపాయలు) కావాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే, వరి సేద్యానికి ఎంత భారీ  నీటి వినియోగం జరుగుతుందో తెలుస్తుంది. రాష్ట్ర అభివృద్ధి నమూనాలో భాగంగా ముందుకు వచ్చిన ఇథనాల్ కంపనీలు మన ప్రభుత్వాలకు పర్యవరణ  స్పృహ లేదనడానికి మరో పెద్ద ఉదాహరణ. ఒక లీటర్ ఇథనాల్ తయారీకి కనీసం 8 నుండీ 10 లీటర్ల నీళ్ళు అవసరం. అంటే ఒక ఇథనాల్ కంపెనీకి రోజూ లక్షల లీటర్ల నీరు అవసరం. నీటి కొరత ఉండే తెలంగాణ రాష్ట్రంలో 30 ఇథనాల్ కంపెనీలకు అనుమతులు ఇవ్వడం ఎవరి ప్రయోజనాల కోసం? ప్రభుత్వాలకు ఉన్న మరో మోజు ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం. ఒక ఆయిల్ పామ్ మొక్కకు రోజూ 300 లీటర్ల నీరు అవసరం. సంవత్సరం పొడవునా అంత నీరు అందితేనే ఆ మొక్క బలంగా ఉంటుంది. ఎల్ నినో లాంటి పరిస్థితులు, భారీ ఉష్ణో గ్రతలు,  తీవ్ర నీటి కొరత ఉన్న తెలంగాణ లో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడం నేరమే అవుతుంది. నిజానికి 1500 మిలీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, ఎప్పుడైనా 25 నుండీ 30 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు, 85 శాతం గాలిలో తేమ ఉండే వాతావరణ పరిస్థితులు అవసరమైన ఆయిల్  పామ్ సాగును , రాష్ట్రంలో ఏ మాత్రం అనువు గాని జిల్లాలు,  ప్రాంతాలలో కూడా ప్రోత్సహించడం ఈ ప్రభుత్వానికి  పర్యావరణ స్పృహ అసలు లేదనడానికి మరో ఉదాహరణ. తాజాగా  రాష్ట్ర ప్రభుత్వానికి నగరీకరణ, డాటా సెంటర్ ల మోజు పుట్టింది. గ్రామాలను నాశనం చేసి ఫ్యూచర్ సిటీ నిర్మించడం, కొత్త కొత్త డాటా సెంటర్ ల నిర్మాణానికి కంపనీలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవడం ఇందులో భాగమే.
ఈ రెండూ కూడా నీటిని అత్యధికంగా కోరుకునేవే. నగరాల పజలకు తాగు నీటి సరఫరాలో కూడా ఇప్పటికే కొరతను ఎదుర్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విచక్షణ లేకుండా , రాష్ట్రంలో 5000 మెగావాట్ల సామర్ధ్యంతో డాటా సెంటర్ లను ప్రోత్సహిస్తామని ప్రకటించడం చూస్తే, ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎంత నేరపూరితంగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కొన్ని జిల్లాల ప్రజలు వినియోగించే తాగు నీటికి సరి సమానంగా ఒక కాంపౌండ్ లో ఉండే డాటాసెంటర్ నీటిని ఉపయోగిస్తుందనే సమాచారాన్ని ప్రజలకు చెప్పకుండా , బడా డాటా సెంటర్ ల నిర్మాణం కోసం  ఒప్పందాలు చేసుకోవడం చూస్తే ఏమనాలి?  2016 లోనే డాటా సెంటర్ పాలసీ తెచ్చిన కెసిఆర్ ప్రభుత్వం, దానిని అమలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఒకే  అభివృద్ధి నమూనాకు  బొమ్మా, బొరుసూ గా ప్రజలు అర్థం చేసుకోవాలి. నీళ్ళ లాంటి సహజ వనరును ప్రజల నిజమైన అవసరాలకు ఉపయోగించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వికారాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ లాంటి కరువు పీడిత ప్రాంతాల ప్రజలు ఒక వైపు ఆందోళనలు చేస్తున్నారు. 
మరో వైపు, దానికి భిన్నంగా నీటిని కార్పొరేట్ కంపనీలకు పభూత్వాలు ధారాదత్తం చేస్తున్నాయి. గజ్వేల్ ప్రాంతంలో కోకోకోలా బాట్లింగ్ కంపెనీకి మిషన్ భగీరథ నీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం సరఫరా చేస్తే, అమెజాన్ డాటా సెంటర్ కు, ఇథనాల్ కంపనీలకు ఇప్పటి ప్రభుత్వం మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నది. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ అభివృద్ధి నమూనా అత్యంత అప్రజాస్వామికమైనది. సామాజిక న్యాయానికి భిన్నమైనది. పర్యావరణ వ్యతిరేకమైనది. దీనిని ప్రజలు ప్రతిఘటించాలి.

ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ పోరాట ఫలితమే 63 మ్యాన్ హోల్స్ సమస్యను పరిష్కరించారు_

*ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ పోరాట ఫలితమే 63 మ్యాన్ హోల్స్ సమస్యను పరిష్కరించారు - ఎర్రం శ్రీనివాసులు అధ్యక్షులు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 03:

మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ సర్కిల్ రామంతపూర్ నందు ఏడిఆర్ఎమ్  ADRM హాస్పిటల్ నుండి ఓల్డ్ రామంతపూర్ వరకు రోడ్డు నిర్మాణం కొరకు ఒక కోటి రూపాయలతో రోడ్డు నిర్మాణం జరిగింది కానీ 63 మ్యాన్ హోల్స్ రోడ్డు సమం చేయకపోవడంతో అంతర్గత ప్రధాన రహదారి పై మ్యాన్ హోల్స గుంతల మయంకావడంతో బాటసారులు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రోడ్డు ప్రమాదంగా మారినది ప్రజావాణి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో రోడ్డును బాగు చేయాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ అధికారులు సమస్యను పరిష్కరించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టాం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులతో సమస్యను పరిష్కరించాలని ప్రశ్నించడం జరిగింది. ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ గారు మా విజ్ఞప్తి సంబంధించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినారు స్పందించిన డిసి గారు రోడ్డుపై గుంతలు గుంతలు గా ఉన్న మ్యాన్ హోల్స్ ను నిర్మాణం చేపట్టి రోడ్డు సమం చేశారు ఈ సమస్య పరిష్కరించిన అధికారులకు, పాలకులకు,కార్మికులకు, నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులకు ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎర్రం శ్రీనివాసులు, గోస్ల విజయ్ కుమార్,,తెడ్డు రవీందర్రావు ,సిద్ధ గొని రాజు పాల్గొన్నారు.

తెలంగాణ రైజింగ్‌నా ?అనుముల ఫ్యామిలీ రైజింగ్‌నా?_

*తెలంగాణ రైజింగ్‌నా ?అనుముల ఫ్యామిలీ రైజింగ్‌నా?*

*దాసోజు శ్రవణ్ కుమార్ - బిఆర్ఎస్ ఎమ్మెల్సీ*

బాపట్ల కృష్ణమోహన్, అక్టోబర్ 03:

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రశ్నిస్తుండు.

*(1)*: జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నట్లు చెబుతున్నావ్ కదా.. మరి KLSR కంపెనీకి రూ.6,000 కోట్లు ఎందుకు?

*(2)*: అసలు ఉద్యోగులేలేని Tesseract కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమి ఎందుకు?

*(3)*: Swachh Biogreen పేరుతో రూ.1,000 కోట్ల పెట్టుబడి వెనుక అసలు నిధులు ఎవరివి?

*(4)*: ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాల్సిన సమయంలో Medicover పై ఇంత ప్రత్యేక శ్రద్ధ ఎందుకు?

*(5)*: ఒక్కసారిగా 23,000 బడుల మూసివేత గురించి పత్రికల్లో వార్తలు రావడం వెనుక కారణమేంటి?

*(6)*: Shodha Developers కు AMRUT టెండర్లు దక్కడం వెనుక అసలు కథేంటి?

 *(7)*:విదేశీ పర్యటనల తర్వాత Hyundai షోరూమ్‌ల వ్యవహారం ఎందుకు తెరపైకి వచ్చింది?

ఇవన్నీ యాదృచ్ఛికాలేనా? ప్రజలకు సమాధానాలు చెప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి??

Friday, October 2, 2026

గ్రాట్యుటీ కార్మికుల చట్టబద్ధమైన హక్కు – ఉద్యోగుల బకాయిలను వెంటనే పరిష్కరించాలి_

*ప్రెస్ రిలీజ్*

*గ్రాట్యుటీ కార్మికుల చట్టబద్ధమైన హక్కు – ఉద్యోగుల బకాయిలను వెంటనే పరిష్కరించాలి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 01:

MSP Lab Instruments సంస్థలో సుమారు 6 సంవత్సరాల 10 నెలల పాటు పనిచేసిన మాజీ ఉద్యోగి కందబోలె శంకర్ రావు తనకు రావాల్సిన గ్రాట్యుటీ, బోనస్, ఇన్సెంటివ్‌లు, జీతం పెంపు, అరియర్స్ తదితర ఉద్యోగ ప్రయోజనాల కోసం న్యాయపోరాటం చేస్తున్నారని Know Your Rights Society అధ్యక్షుడు మరియు అడ్వకేట్ S. Umesh Kumar తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రాట్యుటీ అనేది యాజమాన్యం ఇచ్చే దానం కాదు, ఉద్యోగి సుదీర్ఘ సేవలకు చట్టం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. పేమెంట్ అఫ్ గ్రాట్యుటీ యాక్ట్ , 1972 లోని సెక్షన్ 4 ప్రకారం, సాధారణంగా ఐదు సంవత్సరాల నిరంతర సేవ పూర్తి చేసిన ఉద్యోగి రాజీనామా చేసినా లేదా ఉద్యోగ విరమణ చేసినా గ్రాట్యుటీ పొందేందుకు అర్హుడని తెలిపారు.సెక్షన్ 7(3) ప్రకారం గ్రాట్యుటీని చెల్లించాల్సిన తేదీ నుంచి 30 రోజుల్లోపు చెల్లించాలి. ఆలస్యమైతే సెక్షన్ 7(3A) ప్రకారం, చట్టంలో పేర్కొన్న మినహాయింపులకు లోబడి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
శంకర్ రావు విషయంలో సంస్థ సుమారు ₹1.58 లక్షలను అడ్వాన్స్‌గా చూపుతూ తిరిగి చెల్లించాల్సిన బకాయిగా పేర్కొనడం కూడా పరిశీలనార్హమని, ప్రతి లావాదేవీకి సంబంధించిన అసలు పత్రాలు, పేరోల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలు, ఉద్యోగి అనుమతుల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.Labour Department అధికారులు ఉద్యోగుల ఫిర్యాదులను స్వీకరించి, చట్ట పరిధిలోని సంబంధిత అధికారుల ద్వారా తగిన విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని Know Your Rights Society తరఫున విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాల విషయంలో ఉద్యోగులకు న్యాయం జరిగేలా అవసరమైన మార్గదర్శకత్వం కల్పించాలని కోరారు. ఉద్యోగులు తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదని, ప్రతి సంస్థ కార్మిక చట్టాలను గౌరవిస్తూ ఉద్యోగుల పూర్తి మరియు న్యాయమైన సెటిల్‌మెంట్ చేయాలని Know Your Rights Society అధ్యక్షుడు మరియు అడ్వకేట్ S. Umesh Kumar పేర్కొన్నారు.

180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి, 9/11 తరహా భారీ విపత్తును నివారించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్_

*180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి, 9/11 తరహా భారీ విపత్తును నివారించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 01:

కెప్టెన్ స్మిత్ మచ్చర్ Smit Machchhar, భారత సంతతికి చెందిన ఒక సాహసోపేతమైన కమర్షియల్ విమాన పైలట్. సెప్టెంబర్ 30, 2026న గాల్లో ప్రయాణిస్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఒక భయానక కుట్రను తన ప్రాణాలకు తెగించి తిప్పికొట్టడం ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా రియల్ హీరోగా నిలిచారు. సుమారు 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి, 9/11 తరహా భారీ విపత్తును ఆయన నివారించారు.ముంబైకి చెందిన కెప్టెన్ మచ్ఛర్ 9,500 గంటలకు పైగా విమాన నడిపిన అనుభవం కలిగి ఉన్నారు. జూన్ 2022లో ఫ్లైదుబాయ్‌లో కెప్టెన్‌గా చేరడానికి ముందు ఆయన 11 సంవత్సరాలు స్పైస్‌జెట్‌లో పనిచేశారు.కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఫ్లైదుబాయ్ Flydubai విమానంలో చూపిన అసాధారణ ధైర్యసాహసాలకు గానూ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు మరియు ప్రజల నుండి విపరీతమైన ప్రశంసలు అందుకుంటున్నారు

ఆత్మహత్య కాదు — న్యాయపోరాటమే మార్గం!_

*ప్రెస్ నోట్*

*ఆత్మహత్యలకు కాదు...న్యాయపోరాటానికి ముందుకు రండి!*

*సమస్య ఎంత పెద్దదైనా చట్టపరమైన పరిష్కారం ఉంది ప్రజలు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దు*

*బాధితులకు అండగా తెలంగాణ జేఏసీ — న్యాయ సహాయం అందిస్తాం*

*నల్లగొండ జిల్లా జేఏసీ చైర్మన్ పురుషోత్తం రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే,సెప్టెంబర్ 30:

నల్లగొండ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్ మహేందర్ రాసినట్లు ప్రచారంలో ఉన్న సూసైడ్ లేఖలో తనకు రూ.167 కోట్ల మేర ఆర్థిక నష్టం జరిగిందని, కొంతమంది వ్యక్తుల వల్ల తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్న అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ జేఏసీ నల్లగొండ జిల్లా చైర్మన్ పురుషోత్తం రెడ్డి అన్నారు.
సెటిల్‌మెంట్ పేరుతో డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని, తనకు రావాల్సిన భారీ మొత్తాన్ని అడ్డుకున్నారని, తన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని మహేందర్ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం ఉందన్నారు. లేఖలో కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోందన్నారు.అయితే లేఖలోని ఆరోపణలు నిజమా కాదా అనేది సమగ్ర దర్యాప్తు ద్వారా తేలాల్సిన అంశమని పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. ఎవరిపైనా ముందస్తుగా తీర్పు చెప్పకుండా, అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన కోరారు.

**ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు**

రైతులు, కౌలు రైతులు, కార్మికులు, వ్యాపారులు, విద్యార్థులు, విద్యార్థినులు, మహిళలు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా ఏ వర్గానికి చెందిన వారైనా జీవితంలో ఎదురయ్యే సమస్యల కారణంగా క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడవద్దని పురుషోత్తం రెడ్డి విజ్ఞప్తి చేశారు.
“ప్రాణం పోతే సమస్యకు పరిష్కారం ఉండదు. సమస్య ఎంత పెద్దదైనా దానికి ఒక చట్టపరమైన మార్గం ఉంటుంది. అన్యాయం జరిగిందని భావిస్తే న్యాయపోరాటం చేయాలి. ఒంటరిగా బాధపడకుండా సహాయం కోరాలి” అని ఆయన అన్నారు.తెలంగాణ జేఏసీ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్ జి. కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పురుషోత్తం రెడ్డి ఈ ప్రకటన చేశారు.

**తెలంగాణ జేఏసీ 5 ప్రధాన డిమాండ్లు**

*(1)*: మహేందర్ సూసైడ్ లేఖలో పేర్కొన్న ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి.

*(2)*: రూ.167 కోట్ల ఆర్థిక వివాదానికి సంబంధించిన భాగస్వామ్య ఒప్పందాలు, లావాదేవీలు, పత్రాలు, బ్యాంకు లావాదేవీలను చట్టపరంగా పరిశీలించాలి.

*(3)*: సూసైడ్ లేఖలో ప్రస్తావించిన వ్యక్తుల పాత్రపై ఆరోపణల ఆధారంగా కాకుండా, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి నిష్పక్షపాత దర్యాప్తు చేయాలి.

*(4)*: ఆర్థిక, భూ, వ్యాపార, కుటుంబ లేదా ఇతర వివాదాల్లో చిక్కుకున్న ప్రజలకు న్యాయపరమైన సహాయం అందించేందుకు ప్రత్యేకంగా స్పందించే వ్యవస్థను అధికారులు ఏర్పాటు చేయాలి.

*(5)*: ఆత్మహత్యల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, తీవ్రమైన సమస్యల్లో ఉన్న వ్యక్తులకు తక్షణ సహాయం, కౌన్సెలింగ్ మరియు న్యాయ సహాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

**ప్రజలకు తెలంగాణ జేఏసీ కార్యాచరణ పిలుపు**

ప్రజలు ఎవరైనా ఆర్థిక మోసానికి గురైనా, భూ వివాదంలో చిక్కుకున్నా, వ్యాపార భాగస్వామి మోసం చేసినా, అధికారుల వద్ద సమస్య పరిష్కారం కాకపోయినా, రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లు ఎదురైనా ఆత్మహత్యను ఆలోచించకుండా ముందుగా న్యాయ సహాయం పొందాలని తెలంగాణ జేఏసీ విజ్ఞప్తి చేస్తోంది.
“మీ సమస్యను దాచుకోవద్దు... మీ బాధను ఒంటరిగా మోసుకోవద్దు... చట్టం ద్వారా పోరాడండి. న్యాయం కోసం మీతో పాటు తెలంగాణ జేఏసీ ఉంటుంది” అని పురుషోత్తం రెడ్డి తెలిపారు.న్యాయ సహాయం లేదా సమస్యపై చట్టపరమైన మార్గదర్శకత్వం అవసరమైన వారు నల్లగొండ జిల్లా జేఏసీ చైర్మన్ పురుషోత్తం రెడ్డిని సంప్రదించవచ్చని తెలిపారు.

*“ప్రాణం విలువైనది... సమస్య తాత్కాలికం**

*ఆత్మహత్య కాదు — న్యాయపోరాటమే మార్గం!”**

తెలంగాణ ముద్దుబిడ్డ చికిత తానిపర్తికి మరియు సాహిల్ జాదవ్‌ కు ముఖ్యమంత్రి అభినందనలు_

*తెలంగాణ ముద్దుబిడ్డ చికిత తానిపర్తికి మరియు సాహిల్ జాదవ్‌ కు ముఖ్యమంత్రి అభినందనలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 30:

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీలో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడమే కాకుండా 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హత సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ చికిత తానిపర్తితో పాటు సాహిల్ జాదవ్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు.ఆసియా క్రీడల్లో ఒకేరోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చేసిన ఆర్చరీ క్రీడాకారిణి చికిత రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. పెద్దపల్లికి చెందిన తానిపర్తి చికిత ప్రతిభను గుర్తించి ఆమెను వెన్నంటి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, కోచ్‌లను ముఖ్యమంత్రి గారు అభినందించారు.కాంపౌండ్ ఉమెన్స్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సాహిల్ జాదవ్‌తో కలిసి దక్షిణ కొరియాపై విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న చికిత పేరు తెలంగాణ క్రీడారంగ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. చికిత నిరంతర సాధన, పట్టుదల, దృఢసంకల్పంతో సాధించిన ఈ విజయం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సామాజిక సేవకులు, సంఘాల పాత్ర కీలకం_

*'సీఎం ప్రవాసీ ప్రజావాణి' వేదికపై గల్ఫ్ సోషల్ వర్కర్స్‌కు ప్రశంస*

*గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సామాజిక సేవకులు, సంఘాల పాత్ర కీలకం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 30:

హైదరాబాద్ ప్రజాభవన్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ వేదికపై గల్ఫ్ సామాజిక సేవకులు పొన్నం సత్యనారాయణ (దుబాయి), సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) రియాద్ ప్రతినిధి ఖాజా ముజాములుద్దీన్‌కు మంగళవారం ప్రత్యేకంగా అభినందనలు, సత్కారం లభించింది.రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్, 'సీఎం ప్రజావాణి' ఇన్‌చార్జి గద్వాల్ విజయలక్ష్మి, స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ ఇద్దరు సామాజిక సేవకులను అభినందించి శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సామాజిక సేవకులు, ప్రవాస సంఘాల పాత్ర కీలకమని వారు పేర్కొన్నారు. ఎంబసీలు, కాన్సులేట్లతో సమన్వయం చేసుకుంటూ గల్ఫ్ కార్మికులకు అత్యవసర సమయాల్లో అందిస్తున్న సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్లు గంగుల మురళీధర్ రెడ్డి, మహమ్మద్ బషీర్ అహ్మద్, కెపి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు కుట్ర: రేవంత్ రెడ్డిది మరుగుజ్జు మనస్తత్వమంటూ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు తీవ్ర ధ్వజం!_

*పత్రిక ప్రకటన*

*కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు కుట్ర: రేవంత్ రెడ్డిది మరుగుజ్జు మనస్తత్వమంటూ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు తీవ్ర ధ్వజం!*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 30:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను తీవ్రతరం చేసిందని, అందులో భాగంగానే ఆయన పాస్‌పోర్ట్‌ను జప్తు చేయాలనే కుట్రకు తెరలేపిందని *ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు* తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ బద్ధమైన సంస్థ యాంటీ కరెప్షన్ బ్యూరో ACB కోర్టు ద్వారా ఈ కుట్ర పన్నడం అత్యంత దుర్మార్గమైన అధికార దుర్వినియోగం,  సీఎం రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వానికి, ఈర్ష్యాసూయలకు అద్దం పడుతోందని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు ఒక  పత్రికా ప్రకటన విడుదల చేశారు.

**ప్రజలచే ఎంపికైన  నేతపై నీచ రాజకీయాలు**

కేటీఆర్ ఒక రాజ్యాంగబద్ధమైన శాసనసభ్యుడిగా, రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తుచేశారు. దేశంలోనే గుర్తింపు పొందిన ఒక ప్రధాన రాజకీయ పార్టీకి ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నతమైన స్థానంలో కొనసాగుతున్నారని తెలిపారు. ఇటువంటి ఔన్నత్యన్ని , రాజ్యాంగ నిబద్ధత కలిగిన ఒక ప్రజానేత పాస్‌పోర్ట్‌ను జప్తు చేయాలని కోర్టుల ద్వారా ఆర్డర్లు తెప్పించడం వెనుక రేవంత్ రెడ్డి ఈర్ష్య, అసూయ, ద్వేషపూరిత మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తోందని శ్రవణ్ దాసోజు విమర్శించారు.

**ఏసీబీని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం**

రాష్ట్రంలో యాంటీ కరెప్షన్ బ్యూరో పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో, ఆయన చేతిలో తోలుబొమ్మలా పనిచేస్తోందని ఆరోపించారు. కోర్టులను తప్పుదోవ పట్టించడానికి, ప్రతిపక్షాన్ని అణచివేయడానికి, రేవంత్ కాంగ్రెస్  ప్రభుత్వం ఏసీబీని నీచంగా  వాడుకుంటోందనేదానికి గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయని, ఇప్పుడు కేటీఆర్ విషయంలోనూ అదే జరుగుతుందని దుయ్యబట్టారు.

**అంతర్జాతీయ వేదికలపై కేటీఆర్ గళాన్ని ఆపలేరు**

కేటీఆర్ విదేశాలకు వెళ్లకుండా, విదేశీ విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు చేయకుండా అడ్డుకోవాలని, కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సాధించిన విజయాలను ప్రపంచానికి చాటిచెప్పకుండా కుట్ర పన్నుతున్నారని శ్రవణ్ దాసోజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లుండింర్వస్తోనే వ్యవహారం. ఇది 'గ్లోబల్ విలేజ్' అని, హైదరాబాద్‌లో కూర్చొని జూమ్, టీమ్స్, గూగుల్ మరియు ఇతర కాన్ఫరెన్స్ టెక్నాలజీల ద్వారా ప్రపంచం మొత్తంతో మాట్లాడే సాంకేతికత అందుబాటులో ఉందని ఆయన హితవు పలికారు.కనీస విజ్ఞత, విద్యాసంస్కారాలు లేకుండా ఒక మూర్ఖుడిలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శించారు.

**అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరు**

కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, తెలంగాణ ఉద్యమ చరిత్రను, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి తెలపడాన్ని ఆపడం ఎవరి తరం కాదని  హెచ్చరించారు. 
కేటీఆర్ ప్రాబల్యాన్ని చూసి ఓర్వలేక కులు రాజకీయాలు చేస్తున్న రేవంత్ మోసాలు ఎండగడుతాం.సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని ప్రపంచానికి తెలియజేయడాన్ని అడ్డుకోవడం రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ వల్ల కాదని స్పష్టం చేశారు. కనీస విజ్ఞత లేకుండా, అధికార దురహంకారంతో ఏసీబీ పోలీసులతో తోలుబొమ్మలాట ఆడిస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేయడం, దానిపై ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం కేవలం ఒక జోక్‌లాంటిదని ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా ఈ నీచ రాజకీయాలను, కక్షసాధింపు చర్యలను మానుకోవాలని, లేదంటే ప్రజల నుంచి తీవ్ర తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

Tuesday, September 29, 2026

పేదల కన్నీటికి విలువ కట్టలేం.. ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు అందిస్తాం_

*పేదల కన్నీటికి విలువ కట్టలేం.. ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు అందిస్తాం*

*పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం*

*రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 29:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదవాడి కష్టం తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వమని, పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.పేదవాడు తన జీవితకాలంలో ఒక్కసారైనా సొంత ఇంటిని చూసుకోవాలన్న ఆకాంక్షను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. క్యూఆర్/కోర్ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల భూములను గుర్తించి, వాటిని హౌసింగ్ శాఖకు బదలాయించి పేదల కోసం గ్రౌండ్ ప్లస్ టెన్ అంతస్తుల అపార్ట్‌మెంట్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నాంప‌ల్లి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలోని రెడ్ హిల్స్ లో మంగ‌ళ‌వారం ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి స‌హ‌చ‌ర మంత్రి అజారుద్దీన్‌, ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్‌, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో క‌లిసి శంకుస్ధాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన స‌భ‌లో ఆయ‌న ముఖ్యఅతిధిగా పాల్గొని ప్ర‌సంగించారు.మ‌హాన‌గ‌రంలో ఒక్కో ఎకరం భూమి విలువ రూ.200 కోట్లు, రూ.250 కోట్లు ఉన్నా.. ఆ భూమి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం కంటే పేద కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈరోజు పారదర్శకంగా నిర్వహించిన డ్రాలో 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, మిగిలిన వారికి రెండో, మూడో, నాలుగో విడతల్లోనూ ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలోని మొత్తం 20 నియోజకవర్గాల్లో భూములను గుర్తించామని, సుమారు 16–17 ప్రాంతాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

**ఏడాదిలోపే ఇంటి తాళాలు**

ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్కో అపార్ట్‌మెంట్ విలువ సుమారు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని మంత్రి తెలిపారు. రెండు, మూడు సంవత్సరాల సమయం తీసుకోకుండా ఒక ఏడాదిలోపే నిర్మాణాలు పూర్తి చేసి, ఇదే వేదిక నుంచి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందిస్తానని హామీ ఇచ్చారు.గతంలో మాదిరిగా కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి వదిలేయకుండా.. అవసరమైతే పిల్లల చదువులు, వివాహాలు వంటి కుటుంబ అవసరాల కోసం రుణం పొందే అవకాశం ఉండేలా ఇళ్లను రూపాయి కమిషన్ లేకుండా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా నేరుగా లబ్ధిదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

**డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం**

టవర్స్‌లో నివసించే కుటుంబాలకు డ్రైనేజీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలోని డ్రైనేజీని మెయిన్ ట్రంక్ లైన్‌కు అనుసంధానం చేసే బాధ్యతను హౌసింగ్ శాఖ తీసుకుంటుందని తెలిపారు.ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారుల భాగస్వామ్యాన్ని కూడా నిర్ధారిస్తామని చెప్పారు. వారానికి ఒక రోజు లబ్ధిదారులకు నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించే అవకాశం కల్పించి, తమ ఇల్లు నాణ్యతతో నిర్మిస్తున్నారా లేదా అన్నది స్వయంగా పరిశీలించుకునే అవకాశం ఇస్తామని మంత్రి  తెలిపారు.

**నగరానికి దూరంగా ఇళ్లు కట్టి పేదలను ఇబ్బంది పెట్టం**

గత ప్రభుత్వాలు నగరంలో పేదలు నివసించే ప్రాంతాలకు 30–40 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు నిర్మించడం వల్ల జీవనోపాధి కోసం వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి విమర్శించారు. పేదల జీవనోపాధి, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇళ్ల నిర్మాణ ప్రాంతాలను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. ప్రతి తండాలో, ప్రతి గూడెంలో, ప్రతి డివిజన్‌లో, ప్రతి వార్డులో పేదలకు ఇళ్లు నిర్మించి చూపిస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు.గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన ఇళ్ల నిర్మాణం కంటే ప్రజా ప్రభుత్వం తొలి విడతలోనే రెట్టింపు ఇళ్లు నిర్మించి చూపిస్తుందని మంత్రి అన్నారు. పేదల సొంతింటి కలను ఎన్నికల హామీగా కాకుండా, ప్రభుత్వ బాధ్యతగా భావించి అమలు చేస్తున్నామని తెలిపారు.ఇప్పటికే ఎంపికైన 480 మంది లబ్ధిదారులకు మంత్రి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో రెండో, మూడో, నాలుగో విడతలను ప్రారంభించి, ఎన్నికలలోపు నాలుగు విడతల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
కార్య‌క్ర‌మంలో భాగంగా మంత్రి పొంగులేటి ల‌క్కీడ్రాలో విజేత‌లైన ల‌బ్దిదారుల‌కు ఇళ్ల నెంబ‌ర్ల కేటాయిస్తూ వారి పేర్ల‌ను ప్ర‌క‌టించారు. మంత్రి చేతుల మీదుగా  మాదేసు ల‌త అనే మ‌హిళ‌కు  డ్రాలో ఇందిర‌మ్మ ఎ ట‌వ‌ర్ లోని 801 ఇంటిని కేటాయిస్తూ ప్ర‌క‌ట‌న చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో గృహ‌నిర్మాణ శాఖ ఎండీ విపి గౌత‌మ్‌,   క‌లెక్ట‌ర్ ప్రియాంక అలా త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఉద్యోగులు.. క్రీడ‌లు, క‌ళ‌ల‌పై ఆస‌క్తి పెంచుకోవాలి - మంత్రి జూప‌ల్లి కృష్ణారావు_

*ఉద్యోగులు.. క్రీడ‌లు, క‌ళ‌ల‌పై ఆస‌క్తి పెంచుకోవాలి - మంత్రి జూప‌ల్లి కృష్ణారావు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 29:

ఉద్యోగులు విధులను సమర్థంగా నిర్వర్తించడంతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డా. బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సచివాలయ సాంస్కృతిక ఉత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పెషల్‌ సీఎస్‌ మహేష్‌ దత్‌ హెక్కా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగులు నిత్యం ఎంతో బిజీగా, పని ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తుంటారని తెలిపారు. ఉద్యోగి పని సామర్థ్యంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమన్నారు.  క్రీడ‌లు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం మనసుకు శారీర‌క‌, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని మంత్రి అన్నారు. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఉద్యోగులు కేవలం ఫైళ్లు, విధులు, బాధ్యతలకే పరిమితం కాకుండా తమలోని సృజనాత్మకతను కూడా వెలికితీయాలని సూచించారు. గెలుపు, ఓటమి కంటే కార్యక్రమాల్లో పాల్గొనడం, తమ ప్రతిభను ప్రదర్శించడం, సహోద్యోగులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం ముఖ్యమని చెప్పారు. ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు త‌ర‌చుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని జూపల్లి సూచించారు. ఉద్యోగులు బాగా పనిచేస్తే దాని ప్రభావం ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందే సేవలపై ఉంటుందని అన్నారు. విధులతో పాటు ఆటలు, క్రీడలు, పాటలపై ఆసక్తి పెంచుకోవడం వల్ల ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని పేర్కొన్నారు.

**ప్రాచీన సంస్కృతిని కాపాడుకోవాలి**

భారతదేశానికి ఎంతో ప్రాచీనమైన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ఉన్నాయని మంత్రి తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు సైతం తమ పిల్లలకు భారతీయ కళలు, సంస్కృతిని నేర్పిస్తున్నారని గుర్తుచేశారు. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మన పూర్వీకులు అందించిన కళలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.

**పాటలే ఉద్యమానికి స్ఫూర్తి**

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు. 2011లో ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పాదయాత్ర చేపట్టిన సమయంలో ఆట‌పాటలే తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు.ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులు చేపట్టే సాంస్కృతిక కార్యక్రమాలకు సాంస్కృతిక శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సంగీత దర్శకుడు రాధాకృష్ణ, తెలంగాణ సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గిరి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జే. ప్రేమ్, ఉపాధ్యక్షుడు నవీన్‌కుమార్, కల్చరల్‌ సెక్రటరీ యామిని కనకతార తదితరులు పాల్గొన్నారు.

త‌మ్మిడికుంట‌తో పాటు సున్నం చెరువును ప‌రిశీలించిన‌ హైడ్రా క‌మిష‌న‌ర్‌_

*చెరువుల ప‌రిస‌రాల‌నూ అభివృద్ధి చేయండి*

*త‌మ్మిడికుంట‌తో పాటు సున్నం చెరువును ప‌రిశీలించిన‌ హైడ్రా క‌మిష‌న‌ర్‌*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 29:

సున్నం చెరువుతో పాటు.. త‌మ్మిడికుంట ప‌రిస‌రాల‌ను అభివృద్ధి చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ అధికారుల‌ను ఆదేశించారు. చెరువుల్లో పూడిక పూర్తి స్థాయిలో తొల‌గించ‌డంతో పాటు.. లోతు పెంచ‌డం ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్‌.. చెరువుల చెంత చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై దృష్టి సారించాల‌ని సూచించారు. చెరువుల‌ చుట్టూ బ‌ల‌మైన ఫెన్సింగ్‌, చుట్టూ పాత్‌వే, గ్రీన‌రీ పెంచే ప‌నుల‌ను మంగ‌ళ‌వారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. ద‌స‌రా పండ‌గ రోజుల్లో ఈ రెండు చెరువులను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో చెరువుల అభివృద్ధిని స‌మీక్షించారు. సున్నం చెరువు ఇన్‌లెట్ కాలువ‌తో పాటు.. అక్క‌డ క‌ల్వ‌ర్టు నిర్మించి ర‌హ‌దారి నిర్మాణ ప‌నులు వెంట‌నే పూర్తి చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ అధికారుల‌ను ఆదేశించారు. గాయ‌త్రిన‌గ‌ర్‌, బోర‌బండ ప్రాంతాల నుంచి చెరువుకు వ‌చ్చే దారుల‌ను కూడా అభివృద్ధి చేయాల‌ని సూచించారు. చెరువు అభివృద్ధితో పాటు.. ప‌రిస‌రాల‌ను కూడా సుంద‌రంగా తీర్చి దిద్దాల్సిన‌వ‌స‌రం ఉంద‌న్నారు. సున్నం చెరువుకు ఆనుకుని ఉన్న ఆంజ‌నేయ గుడి అభివృద్ధిని కూడా ప‌రిశీలించారు. ఒక‌ప్ప‌టి సున్నం చెరువుకు - నేటికీ ఎంతో మార్పు క‌నిపించింద‌ని.. స్థానికులు ఈ సంద‌ర్భంగా హైడ్రా క‌మిష‌న‌ర్‌ను క‌ల‌సి అభినందించారు. పూర్తి స్థాయిలో నీరుంటే మ‌రింత న‌య‌న‌మ‌నోహ‌రంగా ఉండేద‌ని పేర్కొన్నారు. ఎన్నో ఆటంకాల‌ను, అవ‌రోధాల‌ను అధిగ‌మించి చెరువును ఇంత సుంద‌రంగా తీర్చిదిద్దిన హైడ్రాకు అభినంద‌న‌లు తెలిపారు. ఎన్ క‌న్వెన్ష‌న్‌ను తొల‌గించి త‌మ్మిడి కుంటను అభివృద్ధి చేసిన తీరును కూడా ప‌లువురు ఈ సంద‌ర్భంగా మెచ్చుకున్నారు. త్వ‌ర‌లో ప్రారంభానికి సిద్ధం చేస్తున్న ఈ రెండు చెరువుల చెంత చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌న‌ల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారు.. సీఎంసీ క‌మిష‌న‌ర్ శ్రీ‌మ‌తి సృజ‌న స‌మీక్షించారు. సీఎంసీ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మీక్ష‌లో సీఎంసీ, హైడ్రా అధికారులు కూడా  పాల్గొన్నారు.

అసోం దినపత్రిక ‘PratidinMediaNetwork’ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘TheConclave2026’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు_

*ఓటర్ల జాబితా సవరణ SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల హక్కులు పరిరక్షించబడేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.*

*అసోం దినపత్రిక ‘PratidinMediaNetwork’ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘TheConclave2026’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 28:

ప్రజాస్వామ్యంలో ఎవరు పరిపాలించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.దేశంలో జనాభా పెరుగుతున్న సమయంలో ఓటర్ల సంఖ్యలో తగ్గుదల ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, అర్హతల నిర్ధారణ వంటి ప్రక్రియలు స్పష్టంగా, ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలన్నారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చర్యలు ఉండాలని పేర్కొన్నారు.అసోం దినపత్రిక ‘PratidinMediaNetwork’ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘TheConclave2026’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. ‘India’s Next Chapter’ అంశంపై జరిగిన చర్చలో దేశ భవిష్యత్ దిశ, విద్య, నైపుణ్యాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన సర్ SIR తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడారు.దేశ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక రాష్ట్రంలో ఉన్న సామర్థ్యాన్ని అక్కడి స్థానిక వనరులు, మానవ వనరులతోనే అభివృద్ధి చేసే విధంగా కేంద్రం ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
తెలంగాణ కు సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి తగిన మద్దతు లభిస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు వంటి కేంద్రం వద్ద సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావించారు.
నియోజకవర్గాల డెలిమిటేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో రాజకీయంగా నష్టం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 1976లో నియోజకవర్గాల సంఖ్యను స్థిరీకరించిన నిర్ణయం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే పరిస్థితి రాకూడదని అన్నారు.
దేశ రాజకీయాల్లో సంఖ్యాబలం కీలకమని, లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే జాతీయ విధానాల రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాల వాదన బలహీనపడుతుందని విశ్లేషించారు.తెలంగాణను.. విద్య, నైపుణ్యాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల ఆధారంగా అభివృద్ధి చేసి, దేశ ప్రగతిలో రాష్ట్రాన్ని కీలక భాగస్వామిగా నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి గారు తెలిపారు. యువతకు విద్యతో పాటు అవసరమైన నైపుణ్యాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, నర్సరీ విద్య వంటి అంశాలపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించేలా విద్యా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు భాష, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఉద్యోగావకాశాల పరంగా ఇంగ్లీష్ కీలకమైన భాషగా మారిందని పేర్కొన్నారు.

కార్మికుల స్వయం ఉపాధి, సామాజిక భద్రతను ప్రభుత్వం కాపాడాలి - మానవ హక్కుల వేదిక డిమాండ్,Human Rights Forum_

*ప్రెస్ నోట్*

*స్వచ్ఛ ఆటో, టిప్పర్ కార్మిక వ్యవస్థను ప్రైవేటు సంస్థ రాంకీకి అప్పగించవద్దు*

*కార్మికుల స్వయం ఉపాధి, సామాజిక భద్రతను ప్రభుత్వం కాపాడాలి - మానవ హక్కుల వేదిక డిమాండ్,Human Rights Forum*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 28:

హైదరాబాద్ నగరంలో ప్రజల ఇళ్ల నుంచి, దుకాణాలు, హోటళ్లు, ఇతర వాణిజ్య, సంస్థల నుంచి ప్రతిరోజూ చెత్తను సేకరించి, జీహెచ్‌ఎంసీ నిర్దేశించిన ప్రాంతాలకు తరలించే స్వచ్ఛ ఆటోలు, టిప్పర్లు, ట్రాలీల కార్మిక వ్యవస్థను ప్రైవేటు సంస్థకు అప్పగించే చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది.గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో చెత్త సేకరణ, తరలింపు కోసం ఈ విధానం అమలులో ఉంది. గత ప్రభుత్వం సబ్సిడీపై దళిత, వెనుకబడిన వర్గాలకు చెందిన కార్మికులకు సుమారు 4,750 స్వచ్ఛ చెత్త తరలింపు వాహనాలను అందించింది. 
ఈరంగం లో ఉపాధికి అవకాశం ఉందని,
నిరుద్యోగులు 
గత 20 సంవత్సరాల్లో సుమారు 15,000 మంది కార్మికులు స్వంతంగా ఆటోలు, ట్రాలీలు తదితర వాహనాలను సమకూర్చుకుని చెత్త సేకరణ, తరలింపు ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు.ఈ కార్మికులు ప్రజల ఇళ్ల నుంచి, దుకాణాలు, హోటళ్లు, ఇతర సంస్థల నుంచి చెత్తను సేకరించి, అందుకోసం కొంత తీసుకుంటూ తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. 
ఈ విధంగా వారు తమ స్వంత శ్రమ,ఆర్థిక వనరులు సమకూర్చుకొని,
దాదాపు 10 వేల వాహనాలను ఖరీదు చేసి,
ఒక వికేంద్రీకృత చెత్త సేకరణ, తరలింపు వ్యవస్థను ఏర్పరచుకున్నారు.ప్రస్తుతం సేకరించిన చెత్తను జీహెచ్‌ఎంసీ నిర్దేశించిన ప్రాంతాలకు తరలించిన అనంతరం, అక్కడి నుంచి *రాంకీ ఎన్విరో ఇంజనీర్స్* సంస్థకు చెందిన వాహనాల ద్వారా జవహర్‌నగర్‌లోని ప్రధాన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఉన్న ఈ స్వచ్ఛ ఆటో, టిప్పర్ కార్మిక స్వయం ఉపాధి వ్యవస్థను, అందులో ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులతో సహా, ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రయత్నం చేస్తు oదని తెలుస్తోంది. ఈ చర్య అమలైతే, తమ స్వంత శ్రమతో ఏర్పరచుకున్న స్వయం ఉపాధి అవకాశాలను కోల్పోయే ప్రమాదం కార్మికులకు ఏర్పడుతుంది. అంతేకాకుండా వారి జీవనోపాధి, సామాజిక భద్రతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.తమను మున్సిపల్ శాఖ ఆధీనంలోనే కొనసాగించాలని, తమ ఉపాధికి భద్రత కల్పించడంతో పాటు పెన్షన్, ఆరోగ్య భద్రత, బీమా తదితర సామాజిక భద్రతా సౌకర్యాలతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్వచ్ఛ ఆటో, టిప్పర్ కార్మికులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు.ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం వంటి కీలకమైన ప్రజా సేవలను నిర్వహిస్తున్న కార్మికుల జీవనోపాధిని ప్రైవేటీకరణ పేరుతో దెబ్బతీయడం చాలా అన్యాయం. ఇప్పటికే తమ స్వంత శ్రమ,స్వంత పెట్టుబడితో ఏర్పరచుకున్న ఈ కార్మికుల స్వయం ఉపాధి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. స్వచ్ఛ ఆటో, టిప్పర్, ట్రాలీ కార్మిక వ్యవస్థను రాంకీ వంటి ప్రైవేటు సంస్థకు అప్పగించవద్దని;
ఈ కార్మికులు నిర్మించుకున్న వ్యవస్థ ను, మరింత పటిష్టం చేయాలని,
వారికి ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ తదితర సామాజిక భద్రతా సౌకర్యాలతో కూడిన సమగ్ర సంక్షేమ వ్యవస్థను ఏర్పాటు చేయాలని,
చెత్త సేకరణ, తరలింపు రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల జీవనోపాధికి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించాలని
మానవ హక్కుల వేదిక తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.

*ఎస్. జీవన్ కుమార్,ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు*

*డా. తిరుపతయ్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*

*సంజీవ్,నగర ప్రధాన కార్యదర్శి*

ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_

*ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 27:

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, దేశ విదేశాల నుంచి మన రాష్ట్రాన్ని సందర్శిస్తున్న పర్యాటకులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.“తెలంగాణకు ఉన్న అపారమైన సహజ, సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను ప్రపంచ పర్యాటక పటంలో మరింత ఉన్నత స్థానంలో నిలపాలన్నది ప్రజాప్రభుత్వ సంకల్పం. చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, కోటలు, జలపాతాలు, అటవీ ప్రాంతాలు, వన్యప్రాణి అభయారణ్యాలు, చెరువులు, జానపద కళలు, పండుగలు తెలంగాణ ప్రత్యేకతను చాటుతున్నాయి.
రామప్ప, వరంగల్, యాదాద్రి, భద్రాద్రి, అలంపూర్, మేడారం, హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు వంటి అనేక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
తెలంగాణ టూరిజం పాలసీ 2025-30 ద్వారా పర్యాటక రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తూ, కొత్త పర్యాటక ప్రాజెక్టులు, అడ్వెంచర్ టూరిజం, క్యారవాన్ పార్కులు, వే-సైడ్ అమినిటీస్, ఎకో టూరిజం తదితర రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాం. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజంతో పాటు వారసత్వ పర్యాటకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం.
పర్యాటకులకు మెరుగైన వసతులు, సౌకర్యవంతమైన ప్రయాణం, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధిలో స్థానిక ప్రజలు, పర్యాటక రంగ సంస్థలు, హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, కళాకారులు, హస్తకళాకారులు, యువత భాగస్వామ్యం ఎంతో కీలకం. మన వారసత్వాన్ని కాపాడుకుంటూ, ప్రకృతిని పరిరక్షిస్తూ, స్థానిక సంస్కృతికి గౌరవం ఇస్తూ స్థిరమైన పర్యాటక అభివృద్ధిని సాధిద్దాం.
తెలంగాణకు వచ్చే ప్రతి పర్యాటకుడికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ, మన రాష్ట్ర ప్రత్యేకతలను ప్రపంచానికి చాటుదాం. తెలంగాణను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను” అని ముఖ్యమంత్రి గారు ఒక సందేశంలో పేర్కొన్నారు.

రేబీస్ వ్యాధి ఎంత ప్రమాదకరమైనదో, ఎలా నివారించ వచ్చో ,టీకాల ప్రాధాన్యత గురించి ప్రజల్లో అనగాహన పెంపొందిచడం మన లక్ష్యం_

*ప్రపంచ రేబీస్ దినోత్సవం*

*కుక్క కాటును నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే యాంటీ రేబీస్ టీకా వేయించుకోవాలి - అనురాధ రావు బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 27:

2007 వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రపంచం అంతట ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుపుకుంటారు.రేబీస్ వ్యాధి నివారణ టీకాను కనుగొన్న శాస్త్ర వేత్త లూయిస్ పాశ్చర్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సoll Sep 28న ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుకుంటున్నాం రేబీస్ వ్యాధి ఎంత ప్రమాదకరమైనదో, ఎలా నివారించ వచ్చో ,టీకాల ప్రాధాన్యత గురించి  ప్రజల్లో అనగాహన పెంపొందిచడం లక్ష్యం.2026 సం॥ థీం "స్ట్రాంగర్ టుగెదర్" 2030 నాటికి  కుక్కల కాటు వల్ల వచ్చె రేబోస్ వల్ల మనుషులు చనిపోకుండా పూర్తిగా నివారించడం లక్ష్యం - Zero by 2030
భారత దేశంలో ఏటా సుమారు 37 లక్షల నుండి 47 లక్షల వరకు కుక్క కాటు కేసులు నమోదు అవుతున్నాయి. 
పశుధన్ ప్రహరి నివేదికల ప్రకారం
2025-2026 సంవత్సరాల్లో 40.44 లక్షల కేసులు 2025 లో నమోదు. 2026 మొదటి ఆరు నెలల్లో 30.4 కేసులు నమోదు.తెలంగాణలో చూస్తే ప్రతిరోజు 300 కేసులు నమోదు, సంవత్సరానికి సుమారు 1.22 లక్షల కేసులు నమోదు. The lancet ప్రతికలో ప్రచురితం అయిన 5700 పైగా మానవ రేబీస్ మరణాలు అని నిర్ధారణ.తెలంగాణలో13 నుండి 20 వరకు అధికారిక మరణాలు నమోదు
మరణాలకు ప్రధాన కారణాలు -
కుక్క కరిచిన వెంటనే చాలా వరకు చిన్న గాయం అని నిరక్ష్యం చేయడం, నాటు వైద్యం చేయించుకోవడం. వ్యాక్సిన్ వేయించుకోక పోవడం,యాంటి రేబీస్ వ్యాక్సిన్ పూర్తి డోసులను తీసుకోకపోవడం. 0, 3, 7, 14 & 28వ రోజు తీసుకొవాలి. టికాకు చిన్న పిల్లలకు తొడ భాగంలో ఇవ్వాలి. నడుము మీద, సీటు భాగంలో ఇవ్వకూడదు.గాయం తీవ్రంగా ఉండి, రక్తం వస్తే టీకాతో పాటు, రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజక్షన్ గాయం చుట్టు ఇస్తారు.కుక్క కరిచిన వెంటనే మంచినీటితో శుభ్ర పరిచి, హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించాలి, ఆలస్యం చేయకూడదు. రేబీస్ గురించి భయం కాదు, అవగాహన అవసరం.చిన్న నిరక్ష్యం ప్రమాదం కావచ్చు.ఈ విషయం తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి,అవగాహనతో మెలగాలి.కుక్కల దగ్గరకు వెళ్లి ఆటలు ఆడకూడదు అని చెప్పాలి. పెంపుడు కుక్క కరిచినా,గీరిన,నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. పిల్లలను కాపాడడం మనందరి బాధ్యత.

Sunday, September 27, 2026

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి - తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ TPF_

*ప్రెస్ నోట్* 

*ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి - తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ TPF*

*ప్రైవేట్ పాఠశాలల ఫీజులకు నియంత్రణ అవసరం*

*విద్యకు బడ్జెట్‌లో 18 శాతం కేటాయించాలి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 26: 

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలని, విద్యారంగానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో 18 శాతం నిధులు కేటాయించాలని వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ TPF ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం తదితర అంశాలపై నల్లగొండ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సభాధ్యక్షత వహించారు. సమావేశంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజుల భారం, విద్యకు ప్రభుత్వ బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరంపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ నల్లగొండ జిల్లా చైర్మన్ యంపల్ల పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, మార్పు గురించి మాట్లాడే ముందు మార్పును మన నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. తమ ఊరు ఊటుకూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం కేవలం 15 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, అందులో తన ఇద్దరు కుమారులు కూడా ఉన్నారని తెలిపారు.తాను తన పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్థోమత ఉన్నప్పటికీ, తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మూతపడే పరిస్థితిని గుర్తించి, ప్రభుత్వ విద్యను కాపాడాలనే ఉద్దేశంతో తన ఇద్దరు కుమారులను ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు చెప్పారు.“ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని ఒకవైపు మాట్లాడి.. మన పిల్లలను మాత్రం ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తే మన మాటలకు, చేతలకు విలువ ఉండదు. మార్పు మన నుంచే ప్రారంభం కావాలి. మనం ఆచరించినప్పుడే సమాజం మన మాటలను విశ్వసిస్తుంది” అని పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 2245 పాఠశాలలు మూతపడిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి, వాటి పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి సమస్యలను గుర్తించేలా తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టాలని సూచించారు.ప్రతి పల్లెలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని అధ్యయనం చేసి, అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకం, నాణ్యమైన విద్య తదితర అంశాలపై ప్రజలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.

*“ప్రభుత్వ బడి బతకాలి – ప్రతి పేద బిడ్డ భవిష్యత్తు వెలగాలి. ప్రైవేట్ ఫీజుల భారం తగ్గాలి – ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి. మూసివేసిన బడులు తెరవాలి – ప్రతి పల్లెలో విద్య వెలగాలి” అని ఆయన అన్నారు.*

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ పద్మజా షా, టీపీఎఫ్ ఫౌండర్ ఆకునూరి మురళి, మాజీ ఐఏఎస్, ఎం.వి. రెడ్డి, మాజీ ఐఏఎస్, ఎం. చంపాలాల్, మాజీ ఐఏఎస్, సృజనా యాదవ్, ముప్పూరి కుమారన్న, నిఖిల్ విజయకృష్ణ, పాలకూరి అశోక్ కుమార్, తెలంగాణ జేఏసీ నల్లగొండ జిల్లా చైర్మన్ యంపల్ల పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్_

*గ‌ణేష్ నిమ‌జ్జ‌నం సేవ‌ల్లో హైడ్రా*

*గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్*

*ప‌హారాలో 234 మంది హైడ్రా స్విమ్మ‌ర్లు*

*వీరికి తోడు 51 డీఆర్ఎఫ్ బృందాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 26:

నిమజ్జన ఘాట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. నిమజ్జనానికి ముందు జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న హైడ్రా కమిషనర్.హైడ్రా కమిషనర్ తో పాటు అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య,RFO జయప్రకాష్, SFO చంద్రశేఖర్ బాబు కూడా ప్రత్యేక నిమజ్జన పూజల్లో పాల్గొన్నారు.NTR మార్గంలోని HYDRAA  కంట్రోల్ రూమ్ వేదిక నుంచి నిమజ్జనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్.హైడ్రా బోట్స్ పహారాను పరిశీలించిన హైడ్రా కమిషనర్.భక్తిశ్రద్ధలతో పూజలనంత‌రం గణనాథుడి నిమజ్జన కార్యక్రమంలో న‌గ‌ర ప్ర‌జ‌లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని తెలిపారు. ఇప్ప‌టికే కొన్ని విగ్ర‌హాలు నిమ‌జ్జ‌నం పూర్తి చేయ‌గా.. శుక్ర‌వారం ప్ర‌ధాన నిమ‌జ్జ‌న ఘ‌ట్టం ప్రారంభం అయింది అని అన్నారు.ఇంకా ఈరోజు అంటే శనివారం కూడా నిమజ్జనం కొనసాగుతుంది అని తెలిపారు. భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా ఏర్పాట్లు చేసింది. కూక‌ట్ ప‌ల్లి ఐడీఎల్ చెరువు అభివృద్ధి ప‌నులు పూర్త‌వ్వ‌న‌ప్ప‌టికీ.. గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఏకంగా 25 అడుగుల మేర చెరువును త‌వ్వి నిమ‌జ్జ‌నాలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేసింది హైడ్రా అని తెలిపారు. ఈ ఏర్పాట్లు ఇలా ఉండ‌గా.. హుస్సేన్‌సాగ‌ర్‌తో పాటు నిమ‌జ్జ‌నం పెద్ద సంఖ్య‌లో జ‌రిగే చెరువుల‌లో హైడ్రా స్విమ్మ‌ర్ల‌ను రంగంలోకి దించింది. హుస్సేన్‌సాగ‌ర్లో మూడు షిఫ్టుల‌లో చెరి 50 మంది చొప్పున మొత్తం 150 మంది స్విమ్మ‌ర్ల‌ను అందుబాటులోకి తెచ్చింది అని అన్నారు. సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో మ‌రో 84 మంది స్విమ్మ‌ర్ల‌ను విధుల్లో ఉంచింది. వీరికి అద‌నంగా 51 డీఆర్ ఎఫ్ బృందాలు నిమ‌గ్న‌మ‌య్యాయి.కూకట్పల్లి IDL చెరువులో గణేష్ నిమజ్జనాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. మూసపేట గణపతి ఉత్సవ కమిటీ అభ్యర్థన మేరకు నిమజ్జనానికి ముందు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ‌ణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా మిగ‌తా శాఖ‌ల‌తో  క‌లిసి హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్  తెలిపారు.నిమజ్జనం పూర్తయ్యేవరకు అన్ని శాఖలతో హైడ్రా అధికారులు, సిబ్బంది సమన్వయంగా పని చేయాలని సూచించిన హైడ్రా కమిషనర్.

తెలంగాణ ఈగల్ EAGLE బృందానికి ఉత్తమ ANTF అవార్డు_

*ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల సదస్సులో ఉత్తమ ANTF అవార్డు అందుకున్న ఈగల్ EAGLE బృందాన్ని తెలంగాణ డీజీపీ శ్రీ సి.వీ. ఆనంద్, ఐపీఎస్, సన్మానించారు.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 26:

అరెస్టులు, ఆస్తుల స్వాధీనం, అంతర్జాతీయ దర్యాప్తులు, డార్క్ వెబ్ విశ్లేషణ, భారీ మొత్తంలో మాదకద్రవ్యాల స్వాధీనం వంటి ఆరు కీలక ప్రమాణాల్లో ఈగల్ బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని తెలంగాణ డీజీపీ  సి.వీ. ఆనంద్, ఐపీఎస్ పేర్కొన్నారు.మాదకద్రవ్యాల కేసుల్లో ఈగల్ బృందం ఒక్కో కేసుకు సగటున 3.7 అరెస్టులు సాధించిందని, ఇది జాతీయ సగటు 1.3తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువని ఆయన వెల్లడించారు. అలాగే 500 కిలోలకు పైగా మాదకద్రవ్యాలకు సంబంధించిన 15కు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.ఇదే స్ఫూర్తితో పనితీరును కొనసాగిస్తూ, మిగిలిన విభాగాల్లోనూ మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని డీజీపీ బృందాన్ని ప్రోత్సహించారు. అక్రమంగా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల తయారీ కేంద్రాలు, డార్క్ వెబ్ ఆధారిత డ్రగ్ డీల్స్‌పై నిఘాను మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు.మాదకద్రవ్యాలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం పరంగా ఈగల్ బృందానికి పూర్తి సహకారం అందిస్తామని సి.వీ. ఆనంద్, ఐపీఎస్, హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం GO MS 135ను జారీ చేసి, తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (TG-TMARS) ను ఏర్పాటు చేసింది_

*తెలంగాణ ప్రభుత్వం GO MS 135ను జారీ చేసి, తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్,  రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (TG-TMARS) ను ఏర్పాటు చేసింది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 25:

రాష్ట్రంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.ట్రాఫిక్ నిర్వహణ అంటే కేవలం చలానాలు విధించడం, వసూలు చేయడమే కాకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, అత్యవసర వైద్య సాయం అందించడమే లక్ష్యంగా 'తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో' (TG-TMARS)ను ఏర్పాటు చేశారు.'రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి' పరిధిలో ఈ కొత్త వ్యవస్థ ముఖ్యమంత్రి పరిధిలో పనిచేస్తుంది. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 135) జారీచేసింది. ఈ ప్రత్యేక విభాగం అదనపు డీజీపీ ADGP లేదా ఐజీపీ IGP స్థాయి అధికారి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. 

*ఈ బ్యూరోకి  ఏడీజీ /IG స్థాయి అధికారి డైరెక్టర్‌గా ఉంటారు, కింది విభాగాలను కలిగి ఉంటుంది:*

*(a)*: ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్ విభాగం.

*(b)*: రోడ్డు మరియు రైలు భద్రత విభాగం.

*(c)*: పరిపాలనా విభాగం.

*(d)*: విజిలెన్స్ మరియు ప్రమాణాల విభాగం.

రాష్ట్రంలోని 32 వేల కిలోమీటర్లకు పైగా ఉన్న రహదారులు, 1.8 కోట్లకు పైగా ఉన్న వాహనాల రాకపోకలను ఈ బ్యూరో పర్యవేక్షిస్తుంది. రోడ్డు రవాణాతో పాటు మెట్రో, రైల్వే భద్రతను కూడా ఈ విభాగానికే అప్పగించారు.బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతీ పోలీస్ స్టేషన్‌లో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఒక 'రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్'ను నియమిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను 'గోల్డెన్ అవర్'లో ఆసుపత్రికి తరలించడం వీరి బాధ్యత.అలాగే ఔటర్ రింగ్ రోడ్డు (#ORR), 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్న హైవేలపై స్పీడ్ డిటెక్టర్లు, అత్యాధునిక కెమెరాలతో కూడిన 'హైవే పెట్రోలింగ్ యూనిట్లు' ఏర్పాటు చేసి నిరంతరం పహారా ఇస్తారు. ఈ వ్యవస్థ నిర్వహణ కోసం ప్రత్యేకంగా 'ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్'ను ఏర్పాటు చేశారు. పోలీసులకు వచ్చే ట్రాఫిక్ జరిమానాల్లో 40% మొత్తాన్ని నేరుగా ఈ నిధికే మళ్లిస్తారు. ఈ నిధులను సిబ్బంది శిక్షణ, అధునాతన సాంకేతికత, పెట్రోలింగ్ వాహనాలు మరియు రహదారుల అత్యవసర మరమ్మతుల కోసం ఉపయోగిస్తారు.రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంజినీరింగ్, అవగాహన కార్యక్రమాలు, అత్యవసర స్పందన వ్యవస్థలను ఒకే ప్రమాణాలతో అమలు చేయడం ఈ బ్యూరో ప్రధాన ఉద్దేశ్యం.అలాగే ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారులు, ORRపై పెట్రోలింగ్ మరియు భద్రతను మరింత పెంచడం కూడా దీని లక్ష్యం.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్ ఏర్పాటు చేయబడింది. పోలీసుల ద్వారా వసూలు చేసే కాంపౌండింగ్ జరిమానాల్లో 40 శాతం ఈ నిధికి జమ చేయబడుతుంది. సంబంధిత జిల్లాలు మరియు కమిషనరేట్ల ట్రాఫిక్ విభాగాలు తమ సంబంధిత యూనిట్ అధికారుల ఆపరేషనల్ నియంత్రణలోనే కొనసాగుతాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతి విధానాలు అమలయ్యేలా TG-TMARS బ్యూరో ఇచ్చే ఆదేశాలను అవి అమలు చేస్తాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో ముందడుగు. ఈ అత్యంత అవసరమైన సంస్కరణను ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మా కృతజ్ఞతలు అని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్ అన్నారు. నాలుగు కమిషనరేట్ల పరిధిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు, రోడ్డు ప్రమాదాలు మరియు మరణాలను తగ్గించేందుకు మేము కృషి చేస్తాము అని డీజీపీ తెలిపారు..