హైదరాబాద్ : 15/08/2021
లడఖ్‌లోని 20 మంది ITBP వీరులకు మెడల్స్!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సైనిక, పోలీసు పతకాలను ప్రకటించింది కేంద్రం హోంశాఖ. దేశవ్యాప్తంగా మొత్తం 1380 మంది పోలీసులకు విశిష్ట సేవ, ప్రతిష్టాత్మక సేవ పతకాలను అందించింది. ఇందులో తూర్పు లడఖ్‌లో గతేడాది చైనా దురాక్రమణను ప్రతిఘటించిన 20 మంది ITBP వీరులను అవార్డులతో సత్కరించాలని నిర్ణయించింది. ఇక ఉగ్రవాద నిరోధక చర్యల్లో విశేషమైన ప్రతిభ చూపించిన జమ్మూ కాశ్మీర్ పోలీసుల్లో రికార్డు స్థాయిలో 256 మందికి పతకాలు ప్రకటించింది.
1380 పతకాల్లో ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకాలు(PPMG), 628 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు(PMG), 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు(PPM)), 662 మందికి విశిష్ట సేవా పతకాలను(PM) ప్రకటించింది కేంద్రం హోంశాఖ.
గత సంవత్సరం ప్రకటించిన 926 కంటే ఈ సంవత్సరం 49% అధికంగా పోలీసు పతకాలను అందించింది కేంద్రం. గతేడాది 215 శౌర్య పతకాలే అందించగా.. ఈ ఏడాది సుమారు మూడు రెట్లు పెంచి 630 అందించింది. మొత్తం శౌర్య పతకాల్లో 398 జమ్మూ, కాశ్మీర్ ప్రాంతానికే దక్కాయి. ఇక 155 వామపక్ష తీవ్రవాదం ప్రభావిత రాష్ట్రాలలో చురుకుగా పనిచేసిన సిబ్బంది. 27 ఈశాన్య ప్రాంతానికి చెందిన పోలీసు సిబ్బందికి పతకాలు దక్కాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో 11 మందికి, తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు దక్కాయి. ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ వీటిని ప్రదానం చేస్తారు.
No comments:
Post a Comment