Tuesday, August 10, 2021

కేసీఆర్ కు కేంద్రం ఝలక్.. ఇక.. ప్రాజెక్టులపై నో పవర్స్

హైదరాబాద్ : 10/08/2021

కేసీఆర్ కు కేంద్రం ఝలక్.. ఇక.. ప్రాజెక్టులపై నో పవర్స్

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
కేసీఆర్ కు కేంద్రం ఝలక్.. ఇక.. ప్రాజెక్టులపై నో పవర్స్

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది..? సీఎం కేసీఆర్ విధానాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. హుజూరాబాద్ ఎన్నికల ముందు నీళ్ల పంచాయితీ తెచ్చి ప్రజల్లో సెంటిమెంట్ రగిలించాలని ప్రయత్నిస్తే అది బౌన్స్ అయింది. ఆఖరికి ఆయనకే తలనొప్పిని తెచ్చిపెట్టింది. నీటి విషయంలో చీటికిమాటికి ఈ గొడవలు ఏంటని కేంద్రం.. కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల పరిధుల‌ను ఖరారు చేస్తూ గెజిట్ విడుద‌ల చేసింది. దీంతో షాక్ తిన్నారు కేసీఆర్. ఏం చేయాలో తెలియని అయోమయం ఆవరించింది. అందుకే ఈ సైలెన్స్.

నిజానికి రెండు రాష్ట్రాల మధ్య జలజగడం కేసీఆర్, జగన్ కలిసి చేసిన కుట్రేనని విమర్శలున్నాయి. ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇద్దర్నీ కూర్చోబెట్టి క్లాస్ పీకుతుందని అందరూ అనుకున్నారు. కానీ.. గెజిట్ విడుదల చేసి షాకిచ్చింది. బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ కేటాయింపులు క‌లిగి ఉన్న‌ ప్రాజెక్టుల‌న్నీ కృష్ణాబోర్డు ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని స్పష్టం చేసింది. అక్టోబ‌ర్ 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లులోకి రానుంది.

ప్రాజెక్టులన్నీ రాష్ట్ర నియంత్రణ నుంచి తీసేసింది కేంద్రం. అంటే నీటిపారుదల శాఖకు ఇది రాష్ట్రపతి పాలన లాంటిదే. ప్రస్తుతం తెలంగాణ నీటిపారుదల శాఖ కేసీఆర్ దగ్గరే ఉంది. అయితే ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతిలోకి వెళ్లడంతో ఇప్పుడు ఆ శాఖకు పని లేదు. కేసీఆర్ కు పని లేదు. అంతేకాదు.. ప్రాజెక్టుల పేరుతో ఇష్టం వచ్చినట్లు జరుగుతున్న దోపిడీకి చెక్ పెట్టినట్లేనని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ అత్యధికంగా ఖర్చు చేసింది ప్రాజెక్టులకే. వాటివల్ల ఉపయోగం ఏమోగానీ.. రాష్ట్రం మాత్రం అప్పులపాలు అయితే అయింది. కొందరు బడాబాబుల సంపద వందరెట్లు పెరిగింది. ఇది కాదనలేని వాస్తవం.

మరోవైపు ఏపీ ప్రభుత్వం గెజిట్ ను అహ్వానిస్తూ అధికారికంగా ప్రకటన ఇచ్చింది. కేసీఆర్ మాత్రం తన వైఖరేంటో చెప్పలేదు. పైగా మంత్రులు ఎవరూ గెజిట్ పై మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేశారు. కేవలం అధికారులు మాత్రమే స్పందించారు. వారు కూడా ప్రభుత్వ వైఖరి ఇది అని క్లారిటీ ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం నీటిపారుదల శాఖపై గంటల తరబడి మీటింగ్ అని మీడియాతో కథనాలు వచ్చాయి. కేంద్రంపై యుద్ధమే.. వెనక్కి తగ్గేదే లే.. అన్నట్లు పేపర్లలో తాటికాయంత అక్షరాల్లో హెడ్డింగులు కనిపించాయి. అయితే కేసీఆర్ చేసే యుద్ధం ఎలా ఉంటుందో తెలిసిందే. గ్రేటర్ ఎన్నికలప్పుడు ప్రకటించిన యుద్ధాన్నే ఇంకా మొదలు పెట్టలేదు. ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలోనూ అదే పాట పాడుతున్నారు.


No comments:

Post a Comment