ఎంపీలో అమానుషం: కాలికి తాడుకట్టి ట్రక్ తో రోడ్డుపై ఈడిస్తే... వ్యక్తి దుర్మరణం
Courtesy : By Arun Kumarఓ వ్యక్తిని తాడుతో ట్రక్ కు కట్టేసి రోడ్డుపై గిరగిరా ఈఢ్చుకుంటూ తీసుకెళ్లిన దారుణం మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ అమానుష ఘటనతో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేసరికి అతడు తీవ్ర గాయాలతో పడివున్నాడు. దీంతో దగ్గర్లోని హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లగా పరిస్ధితి విషమంగా వుందని డాక్టర్లు చెప్పారు. దీంతో జిల్లా హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు ప్రాణాలు వదిలాడు.
అయితే మనిషిని ట్రక్కుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని ఆధారంగా మృతుడిని బండ గ్రామానికి చెందిన కన్నయ్య భీల్ గా గుర్తించారు. అలాగే అతడి మృతికి కారణమైన పదిమందిని గుర్తించగా ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగతావారిని కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తామని నీమంచ్ ఎస్పీ సూరజ్ వర్మ తెలిపారు. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని... ఏదయినా వుంటే పోలీసులకు, సంబంధిత అధికారులకు తెలపాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు.
No comments:
Post a Comment