Thursday, March 30, 2023

పండగ వేళ విషాదం.

*పండగ వేళ విషాదం...ఆలయంలో మెట్ల బావిలో పడి 8 మంది మృతి....!*

ఇందౌర్‌: మధ్యప్రదేశ్‌ లో శ్రీ రామనవమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో మెట్లబావి  పైకప్పు కూలి..అందులో భక్తులు పడిపోయారు. ఇందౌర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.

పటేల్‌ నగర్‌ ప్రాంతంలోని మహదేవ్‌ జులేలాల్‌ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి (well) పైనున్న ఫ్లోరింగ్‌పై కూర్చున్నారు. అయితే, బరువు ఆపలేక ఆ ప్రాంతం ఒక్కసారిగా కుంగిపోయి ఫ్లోరింగ్‌ కూలిపోయింది. దీంతో దాదాపు 30 మంది భక్తులు అందులో పడిపోయారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నిచ్చెన సాయంతో కొందరు భక్తులను బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇందౌర్‌ పోలీసులు వెల్లడించారు. మరో 17 మందిని రక్షించారు. వారికి గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బావి లోతు 50 అడుగుల పైనే ఉన్నట్లు తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, March 29, 2023

దిశ ఎంకౌంటర్ పై హైకోర్టులో.... విచారణ

*దిశ ఎంకౌంటర్ పై హైకోర్టులో.... విచారణ*

హైదరాబాద్: దిశ ఎన్‌కౌంటర్‌ కు సంబంధించి విచారణను హైకోర్టు  వాయిదా వేసింది. బుధవారం ఈ కేసులో కమిషన్ నివేదికఫై హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ సాగిందిమొత్తం ఐదు ఇంప్లీడ్ పిటిషనర్లు హైకోర్టు తమ వాదనలు వినిపించారు. అప్పటి షాద్‌నగర్ సీఐ శ్రీధర్ (Shadnagar CI Sridhar), పోలీస్ ఆఫీసర్స్ సంఘం, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, దిశా కుటుంబం, తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. షాద్‌నగర్ సీఐ శ్రీధర్ తరుపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ రఘురాం వాదించారు. కమిషన్ నివేదికను పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని రఘురాం తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై రెండో ఎఫ్ఐఆర్ అవసరం లేదని సీఐ శ్రీధర్ తరుపు న్యాయవాది అన్నారు. కమిషన్ రిపోర్ట్‌ను కేవలం ఒక్క ఆధారంగా చూడాలని.. రిపోర్ట్‌లో ఉన్నది ఉన్నట్టు ఆర్డర్ ఇవ్వాలని కాదన్నారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై రెండో ఎఫ్ఐఆర్ అవసరం లేదని చెప్పారు.గతంలో సిట్ ఇచ్చిన రిపోర్ట్‌పై సెషన్స్ కోర్టులో విచారణ జరగాలని దిశా తరుపు న్యాయవాది కోర్టు తెలిపారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సమయం కావాలని ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే అడ్వకేట్ జనరల్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ తరువాతి యిదాకు వస్తారని అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. అయితే పదేపదే వాయిదా కోరడంపై న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్‌గా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయవాదుల మీద ఎందుకు ఆధారపడుతున్నారని ధర్మాసనం ప్రశ్నించారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్ 12కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

*సుజీవన్ వావిలాల*🖋️

Tuesday, March 28, 2023

100కోట్ల దావా ఎదుర్కుంటారా.... మంత్రి KTR...!

*క్షమాపణ చెబుతారా...?*
*100కోట్ల దావా ఎదుర్కుంటారా.... మంత్రి KTR...!*

*రేవంత్‌, సంజయ్‌లకు మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు*

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్‌ మంగళవారం లీగల్‌ నోటీసులు పంపారు.రాజకీయ దురుద్దేశంతోనే ఈ వ్యవహారంలో తన పేరును అనవసరంగా లాగుతున్నారని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే సంజయ్‌, రేవంత్‌రెడ్డిలు పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటివారిపై అసత్యాలు మాట్లాడే హక్కు లేదన్నారు. వారిద్దరికీ తన న్యాయవాది ద్వారా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు.

నిరాధారమైన, సత్యదూరమైన ఆరోపణలను మానుకోవాలని.. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకుంటే.. రూ.100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో స్పష్టం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, March 26, 2023

నేడు సుప్రీంకోర్టులో MLC కవిత కేసు విచారణ....!

*నేడు సుప్రీంకోర్టులో MLC కవిత కేసు విచారణ....!*

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలకు చెందిన బినామీలు అరుణ్‌రామచంద్రపిళ్లై, ప్రేమ్‌రాహుల్‌లు సౌత్‌గ్రూప్‌ ద్వారా ఆప్‌ లీడర్లకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారన్నది ఈడీ అభియోగం. దీనిపై ఈ నెల 11న కవితను తొలిసారి విచారించిన ఈడీ.. 16న మరోసారి హాజరుకావాలని సమన్లు జారీచేసింది.

చట్టప్రకారం మహిళలను వారి ఇంటిదగ్గరే విచారించాల్సి ఉన్నప్పటికీ ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్‌చేస్తూ కవిత ఈ నెల 14న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దానిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. సీజేఐ అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ ఆరోజు ఈకేసు విచారణకు రాలేదు. 27 నాటికి జస్టిస్‌ అజయ్‌రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు లిస్ట్‌చేశారు. దీనిపై ఇప్పటికే ఈడీ కెవియట్‌ దాఖలు చేసింది. ఈ రెండు అంశాలూ సోమవారం ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి

*సుజీవన్ వావిలాల*🖋️

#footpath లు ఆక్రమిస్తున్నారు

https://www.instagram.com/p/CqQqQ5TPw6U/?igshid=MDJmNzVkMjY=                                                                                      **రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో #footpaths ను #అక్రమంగా ఆక్రమిస్తున్నారు అని ఎన్ని సార్లు చెప్పినా #police అధికారులు కానీ, #ghmc అధికారులు కానీ పట్టించుకోవడంలేదు. ఏదో నామమాత్రపు చర్యలు తీసుకొని చేతులు దులిపేసుకుంటున్నారు.మహిళలు & విద్యార్థినులు, మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ రోడ్ల మీద నడవాలంటే భయపడుతున్నారు. అంటే ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయడం లేదు అని అర్ధం అవుతుంది. కావున నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత ప్రభుత్వ అధికారులమీద #చట్టపరమైన చర్యలు పురపాలక శాఖ మంత్రివర్యులు @KTRBRS గారు తీసుకోవాలి అని #ప్రజాసంకల్పం గ్రూప్ మీడియా ద్వారా తెలియచేస్తున్నాము. NOTE : "రంజాన్ పండుగ సందర్బంగా హలీం తయారు చేయడానికి తాత్కాలికంగా బట్టీలు ఏర్పాటు చేసుకుంటారు వాటికి మినహాయింపు ఉంటుంది".... Bplkm🪶*

Saturday, March 25, 2023

మానవహక్కుల వేదిక పత్రికా ప్రకటన

మానవ హక్కుల వేదిక పత్రిక ప్రకటన 25.03.23. 

వనపర్తి సిఐ శ్రీనివాస్ రెడ్డి పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 

ఈరోజు మానవ హక్కుల వేదిక బృందం మణిగిల్ల గ్రామం శివ యాదవ్ ను పోలీసులు హింసించిన కేసులో నిజనిర్ధారణ జరిపింది.

Thursday, March 23, 2023

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు.... మంత్రి KTR లీగల్ నోటీసులు...!

*రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు.... మంత్రి KTR లీగల్ నోటీసులు...!*

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు జారీ చేశారు.టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలోకి రాజకీయ దురుద్దేశంతో తనను లాగుతున్నారని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలుజేసే విధంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

''ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వం. ఒక దురదృష్టకర ఘటనను చూపి ఉద్యోగాలు ఆపాలని చూస్తున్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, ప్రభుత్వం వేర్వేరనే జ్ఞానం కూడా విపక్షాలకు లేదు. కొంతమంది రాజకీయ నేతల ఉచ్చులో యువత చిక్కుకోకుండా ఉద్యోగాల సన్నద్ధతను కొనసాగించాలి'' అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఖమ్మంలో పర్యటించిన సీఎం కేసీఆర్

*ఖమ్మంలో పర్యటించిన సీఎం కేసీఆర్....పంట నష్టపోయిన రైతులకు... ఎకరాకు రూ.10వేలు....!*

ఖమ్మం: సీఎం కేసీఆర్ ఖమ్మంలో పర్యటించారు. బోనకల్‌ మండలంలోని రామపురంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.అనంతంర సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు నిరాశకు గురికావొద్దని భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌తో పాటు సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రైతుల సమావేశంలో ప్రసింగిస్తూ.. దేశంలో ఇప్పుడు డ్రామా జరుగుతోందని కేంద్రంలోని బీజేపీని టార్గెట్‌ చేస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అని ఎద్దేవా చేశారు. దేశంలో వ్యవసాయానికి లాభం చేకూర్చే పాలసీలు లేవని పేర్కొన్నారు. వ్యవసాయం దండగనే మూర్ఖులు ఉన్నట్లు విమర్శలు గుప్పించారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించినా రూపాయి కూడా రాదన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం కానివ్వమని స్పష్టం చేశారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు నిరాశకు గురికావద్దని సూచించారు.

'కేంద్రానికి రాజకీయాలు తప్పితే రైతుల మీద ప్రేమ లేదు. కేంద్రానికి ఏం చెప్పినా దున్నపోతు మీద వర్షం పడినట్టే. పంట నష్టపరిహారంపై కేంద్రానికి నివేదికలు పంపవలసిన అవసరం లేదు. గతంలో పంపిన పరిహారమే ఇంతవరకు రాలేదు. ఇప్పుడు పంపాల్సిన అవసరమే లేదు.' అని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

అనంతరం రామపురం నుంచి మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట బయల్దేరారు సీఎం. అక్కడ పరిస్థితిని పరిశీలిస్తారు. రైతులకు భరోసా కల్పిస్తారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇస్తారు.

ఆ తర్వాత రెడ్డికుంట నుంచి వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి, అక్కడి నుంచి కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం వెళ్లి పంటల నష్టం వివరాలు తెలుకుంటారు. రైతులతో మాట్లాడతారు. ఈ పర్యటనలో మంత్రులు, శాసనసభ్యులు, అధికార యంత్రాంగం పాల్గొంటారు. కాగా.. ఇటీవల కురిసిన వడగంట్ల వానల కారణంగా నాలుగు జిల్లాల్లోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, March 22, 2023

తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్ట్...Press Release

             
పత్రికా ప్రకటన
22-03-2023 

 రాచ కొండ పోలీసు కమిషనరేట్ ఫరిధిలోని మేడిపల్లి పోలీసులు తీన్మార్ మల్లన్న అలియాస్ CH .నవీన్ కుమార్ , ఫ్రీలాన్స్ విలేఖరి తెలంగాణ విఠల్ ల ను 21వ తారీఖు రాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మా వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. 

రెండు రోజుల ముందు మల్లన్న నిర్వహిస్తున్న స్వతంత్ర  Q - న్యూస్ ఛానల్ ఆఫీస్ పై కొందరు వ్యక్తులు దాడిచేసి ఆఫీస్ కంప్యూటర్లనూ, ఫర్నిచర్నూ ద్వంసం చేశారని, సిబ్బందిపై చేయి  చేసుసుకున్నారని క్యూ ఛానెల్ బృందం ఆరోపించింది. ఈ దాడిపై ఆ ఛానల్ భాద్యుడు మల్లన్న , రాచకొండ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసినా ఎంటువంటి విచారణ చేపట్ట లేదని, చర్యలు ఏమీ తీసుకోలేదని తెలిసింది.  
ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు, ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నందుకు ప్రభుత్వం కక్ష గట్టి పోలీసులను ఉపయోగించుకుని ఆయనపట్ల చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 
తీన్మార్ మల్లన్నను గతంలోనూ అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. మల్లన్న రెండేళ్ల క్రితం వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలలో అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా పోలీసులు ఆయనను చట్టవ్యతిరేకంగా అరెస్ట్ చేసి, ప్రచారం చేసుకోనివ్వకుండా చాలా ఇబ్బదులు పెట్టారు. సంవత్సరం క్రితం వరంగల్ లో రైతులు, ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే, వాళ్లకు సంఘీభావం తెలపడానికి వెళ్ళినప్పుడు వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసి, వేలేరు పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టి ఆయనపై ఒక అక్రమ కేసు పెట్టారు. 
 నెల రోజుల క్రితం వనపర్తి లో ఒక మంత్రిని విమర్శించాడనే నెపంతో శివయాదవ్ అనే యువకుడిని  పోలీసులు పట్టుకెళ్ళి దారుణంగా కొట్టారు. 
 ఈ మధ్యలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు కూడా ప్రైవేటు సైన్యంలాగా అధికారంలో ఉన్న నాయకులను విమర్శిస్తే, విమర్శించిన వారిపై  దాడులకు దిగుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి.
      
రాష్ట్రంలో పరిస్థితిని గమనిస్తే ప్రభుత్వీనికీ, పోలీసు శాఖకూ రాజ్యాంగం, చట్టాల నుండి మిహాయింపు (IMPUNITY) ఉందనీ, తాము వాటిని పక్కకు పెట్టి అధికారబలంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించ వచ్చునని వారు భావిస్తున్నట్టున్నారు. దాన్ని నియంతృత్వం అంటారుగానీ, ప్రజాస్వామ్యం అనరు. 
తమకంటే ఎక్కువ అధికారం ఉన్నవాళ్ళు,  తమపట్ల ప్రజస్వామ్యబద్దంగా ఉండటం లేదని వాపోయే అధికారపార్టీ, రాష్ట్రంలో అసలు అధికారమే లేని స్వంత ప్రజల పట్ల వ్యవహరించే తీరు ఆ నీతి సూత్రానికి పూర్తి విరుద్ధంగా ఉంది. 
 ఇటవంటి వ్యవహారాలు రాజ్యాంగంలో పొందుపరిచిన భావ ప్రకటన స్వేచ్ఛకూ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుకూ వ్యతిరేకం అని ప్రభుత్వానికీ, పోలీసు శాఖకూ చెప్పవలసి వస్తున్నది. 


1, ఇప్పటి కైనా ప్రభుత్వం చట్టబద్ద పాలనా సంస్కృతికి కట్టుబడి ఉండాలని మా సంస్థ కోరుతున్నది. 

2, ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలను మానుకోవాలనీ,  ప్రజల మరియు మీడియా భావ ప్రకటనా స్వేచ్చను గౌరవించాలనీ, ఎవరి భావ ప్రకటన అయినా తమ ప్రతిష్టకు భంగకరంగా ఉంటే కోర్టుల ద్వారా మాత్రమే ఎదుర్కోవటం రాజ్యాంగబద్ధమైనదని తెలియ చేస్తున్నాం. 

3, తీన్మార్ మల్లన్న ను, విఠల్ లను తక్షణమే విడుదల చేయాలనీ, వారిపై వ్యక్తిగత వేధింపులు ఆపివేయాలనీ డిమాండు చేస్తున్నాం. 

        మానవ హక్కుల వేదిక, తెలంగాణ. 

1, *S. జీవన్  కుమార్* ,  ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటి సభ్యుడు 
Contact:98489 86286 

2, *ఆత్రం భుజంగ రావు*, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు 
Contact:94405 85605 

3, *డాక్టర్. తిరుపతయ్య*, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
Contact:98492 28212

Tuesday, March 21, 2023

శంషాబాద్ విమానాశ్రయానికి 15 వసంతాలు....!

*శంషాబాద్ విమానాశ్రయానికి 15 వసంతాలు....!*

*ఏటా 2.15 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు*

హైదరాబాద్‌,  శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పదిహేను వసంతాలు పూర్తి చేసుకుంది.మార్చి 23, 2008న ప్రారంభమైన ఈ విమానాశ్రయం అంచెలంచెలుగా ఎదిగింది. దక్షిణ భారతదేశానికి కేంద్రంగా మారింది. తొలుత దీన్ని ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికుల అవసరాల కోసం రూపొందించారు. ఐదున్నరేళ్లకే రద్దీ పెరిగింది. పదిహేనేళ్లకు దాదాపు రెట్టింపు ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుండటంతో ఏటా 3.4 కోట్ల మంది రాకపోకలకు అనుగుణంగా విస్తరిస్తున్నారు.
*80కి పైగా గమ్యస్థానాలు.. :*
ఇక్కడి నుంచి గతేడాది మే నెలలో గరిష్ఠంగా 17.5 లక్షల మంది రాకపోకలు కొనసాగించగా... ఫిబ్రవరి, 2023లో 18.2 లక్షల మంది ప్రయాణించారు. ప్రస్తుతం 80 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌-సింగపూర్‌ హైదరాబాద్‌-ఢాకా, బాగ్దాద్‌, డాన్‌ముయాంగ్‌ విమానాశ్రయం, న్యూ గోవాకు నేరుగా సర్వీసులు ప్రారంభించారు.

*ఈ-బోర్డింగ్‌తో గుర్తింపు:*
:అత్యాధునిక సమాచార సాంకేతికతతో ఈ-బోర్డింగ్‌ సౌకర్యాన్ని దేశంలోనే తొలిసారిగా ఇక్కడ ప్రవేశపెట్టారు. వందశాతం స్టాంపింగ్‌ రహిత ప్రయాణాన్ని అందిస్తోంది. చేతి సంచులతో మాత్రమే ప్రయాణించేవారి కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్‌ సెక్యూరిటీ చెక్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. 2019 నుంచి దేశంలోనే తొలిసారిగా ముఖ గుర్తింపు(ఫేషియల్‌రికగ్నిషన్‌)ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

*తొలి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం..*విమానాల రాకపోకల సమయంలో గ్రౌండ్‌ సర్వీస్‌ ఎక్విప్‌మెంట్‌(జీఎస్‌ఈ) వాహనాలు చుట్టూ తిరిగి వెళ్లకుండా సొరంగాన్ని నిర్మించారు. తద్వారా ఏటా ఏడు వేల టన్నుల కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి వెళ్లకుండా నియంత్రిస్తున్నారు. మూడేళ్ల నుంచి విమానాశ్రయంలో 'సింగిల్‌ యూజ్‌' ప్లాస్టిక్‌ వాడకుండా చర్యలు చేపట్టారు. 10 మెగావాట్ల సౌరవిద్యుత్తును ఉపయోగిస్తున్నారు. 'నేషనల్‌ ఎనర్జీ లీడర్‌', 'ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్‌' వంటి పలు అవార్డులు లభించాయి.

*సుజీవన్ వావిలాల*🖋️ 

పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు

*పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు....!*

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్‌ నేత బల్మూరి వెంకట్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో  విచారణ జరిగింది.దర్యాప్తు సక్రమంగా జరగట్లేదనే వాదనకు పిటిషనర్‌ సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు తెలిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ''రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్‌ ఇది. లీకేజీ కేసులో సిట్‌ సమగ్రంగా దర్యాప్తు జరుపుతోంది. కేవలం ఇద్దరినే అరెస్టు చేశారని పిటిషనర్లు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు'' అని కోర్టుకు వివరించారు.

వాదనలు విన్న ధర్మాసనం.. లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేటస్‌ రిపోర్టు సమర్పణకు ప్రభుత్వానికి 3 వారాల గడువును విధించిన న్యాయస్థానం.. ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 11కు వాయిదా వేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, March 20, 2023

రేపు మరోసారి రండి.. కవితకు ఈడీ నోటీసులు

*_రేపు మరోసారి రండి.. కవితకు ఈడీ నోటీసులు.._*

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేశారు. కవితను మంగళవారం ( మార్చి 21) ఉదయం 11 గంటలకు రమ్మన్నారు._*

ఇవాళ ఆమెను ఈడీ అధికారులుు దాదాపు పదిన్నర గంటలకు పైగా విచారించారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు కూడా తీసుకున్నారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదని తెలిసింది. మొత్తం 20 ప్రశ్నలు కవితకు సంధించినట్లు తెలిసింది. ఉదయం కవిత, అరుణ్‌ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్‌ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. సాయంత్రం సాయంత్రం సమయంలో కవితను ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాతో కలిపి ప్రశ్నించారు.

ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. డాక్టర్లు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు.

కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చే ముందు కారు ఎక్కుతూ విక్టరీ సింబల్ చూపించారు.

ఇష్టానుసారం పరీక్షల నిర్వహించడం సరికాదు.... TSPSC పై హైకోర్ట్ సీరియస్...!

*ఇష్టానుసారం పరీక్షల నిర్వహించడం సరికాదు.... TSPSC  పై హైకోర్ట్ సీరియస్...!*

హైదరాబాద్‌: ఎస్‌పీఎస్సీలో పేపర్‌ లీక్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో జూనియర్‌ లెక్చరర్‌(జేఎల్‌) పరీక్ష ప్రశ్నపత్రంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.జూనియర్‌ లెక్చరర్‌ పేపర్‌-2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పేపర్‌-2 ఇంగ్లీష్‌లోనే ఇవ్వాలన్న టీఎస్‌పీఎస్సీ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా పేపర్‌-2 ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌, తెలుగులో కూడా ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ ఇష్టానుసారం పరీక్షలు నిర్వహించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, March 19, 2023

ఈడీ విచారణకు MLC కవిత

*ఈడీ విచారణకు MLC కవిత..... వెన్నుతట్టి పంపిన భర్త అనీల్*

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ ఎదుట మరోసారి విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు.కవిత భర్త అనిల్ ఆమెను వెన్ను తట్టి ఈడీ కార్యాలయంలో విచారణకు పంపారు.

అయితే కవిత వెళ్లేది ఈడికి భయపడి మాత్రం కాదని, చట్టం పై గౌరవంతోనే వెళ్తున్నారని బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. విపక్షాలను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందరిపై విచారణ చేయకుండా, కేవలం విపక్షాలకు చెందిన నేతలపైనేదాడులు జరుపుతున్నారని మండిపడ్డారు.10 పైసలు..
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లిక్కర్ స్కాంని పది పైసలతో పోల్చారు. లక్షల కోట్లు ఎగ్గొట్టినవారిని వదిలేసి తెలంగాణ ఆడబిడ్డను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి ఢిల్లీ కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇందులో ఏపీ, తెలంగాణ వాళ్ళు ఉంటే ఉండొచ్చన్నారు.

అంతకుముందు ఢిల్లీలో కవిత నివాసానికి వెళ్లారు తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్. విచారణకు ముందు ఆమె మరోసారి న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. ఈడీ విచారణ నిమిత్తం ఆదివారం రాత్రే తన సోదరుడు కేటీఆర్ తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు మూడోసారి నోటీసులిచ్చిన విషయం విధితమే. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, సెక్షన్ 50కింద కవిత స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డు చేయనుంది. ఇప్పటికే బ్యాంకు స్టేట్ మెంట్స్ సహా ఈడి అడిగిన 12 డాక్యుమెంట్లను కవిత అందజేశారు.

వాస్తవానికి కవిత ఈనెల 16నే రెండోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాను హాజరుకాలేనని ఈడీకి ఆమె అదే రోజు న్యాయవాది ద్వారా లేఖ పంపారు. తనను ఇంటివద్దే విచారించాలని కోరారు. అయితే ఈడీ అందుకు నిరాకరించింది. మరోసారి.. మార్చి 20న హాజరుకావాలని నోటీసులు పంపింది. దీంతో ఆమె ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు కవితను రామచంద్ర పిళ్లై, మనీష్ సిసోడియాతో కలిపి విచారించే అవకాశం ఉంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Q న్యూస్ మీద దాడి కాదు ప్రజాస్వామ్యం మీద దాడి

https://youtu.be/ht-d6UkmjHE                                                         
*@QGroupMedia7200 మీద దాడి కాదు #ప్రజాస్వామ్యం మీద దాడి...Bplkm🪶*

*@TelanganaCMO* *@KTRBRS* *@TelanganaDGP* *@RachakondaCop* *@Murali_IASretd* *@RSPraveenSwaero* *@dr_mvreddy* *@zson_bakka* *@IndiraSoban* *@TeenmarMallanna* *@TeamQnews* *@RaviVattem* *@santoshajmeera* *@BplplH*                                                                                                      https://twitter.com/Praja_Snklpm/status/1637387220159168514?t=JkOHW_NFTscQ5iI5S4t7mA&s=19

Friday, March 17, 2023

పేపర్ లీకేజీ పై సీయం కేసీఆర్...... సీరియస్ ఉన్నత స్థాయి సమీక్ష

*పేపర్ లీకేజీ పై సీయం కేసీఆర్...... సీరియస్ ఉన్నత స్థాయి సమీక్ష*

హైదరాబాద్‌: రాష్ట్ర పబ్లిక్‌ సర్వి స్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ ఘటన తెలంగాణలో సంచలనం రేపుతోంది.ఈ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులతోపాటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. పే పర్‌ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని పట్టబడుతున్నా.

తాజాగా టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌​ లీక్‌ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి సీఎస్‌ శాంతి కుమారి, మంత్రి హరీష్‌ రావు, కేటీఆర్‌, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి, మాజీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి హాజరయ్యారు. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్‌సీపై సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల🖋️*

MLC కవిత కు సుప్రీంకోర్టులో.... చుక్కెదురు....!

*MLC కవిత కు సుప్రీంకోర్టులో.... చుక్కెదురు....!*

న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. తన పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలన్న కవిత  అభ్యర్థనను సుప్రీం తిరస్కరించిందిఈనెల 24నే విచారిస్తామని ఉన్నతన్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈడీ (ED) తనను విచారణకు పిలవడాన్ని సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా... 24న విచారిస్తామని కోర్టు తెలిపింది. నిన్నటి (మార్చ్‌ 16న) ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. దీంతో ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించింది. అయితే కవిత పిటిషన్‌ను తాము ముందు చెప్పిన విధంగా 24నే విచారిస్తామని.. దాంట్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

స్వప్నలోక్ ఘటన పై కేసీఆర్ దిగ్భ్రాంతి.... ఎక్స్ గ్రేషియా ప్రకటన

*స్వప్నలోక్ ఘటన పై కేసీఆర్ దిగ్భ్రాంతి.... ఎక్స్ గ్రేషియా ప్రకటన*

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించివారికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా (Exgratia)ను ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కు సీఎం కేసీఆర్  సూచించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఉపాధ్యాయ MLC గా AVN రెడ్డి గెలుపు....!

*ఉపాధ్యాయ MLC గా AVN రెడ్డి గెలుపు....!*

*1150 ఓట్ల ఆధిక్యంతో భాజపా బలపరచిన అభ్యర్థి విజయం*
హైదరాబాద్‌-: ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో భాజపా బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు.సుమారు 1,150 ఓట్ల తేడాతో సమీప పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. గురువారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు లెక్కింపు పూర్తయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ (50 శాతానికి మించి) దక్కలేదు. అనంతరం రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలైంది. మూడో స్థానంలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్‌ రెడ్డి విజయం ఖరారైంది. వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, March 10, 2023

ముందస్తు ఎన్నికలు ఉండవు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు - కేసీఆర్

*ముందస్తు ఎన్నికలు ఉండవు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు - కేసీఆర్*

*ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు కేసీఆర్ సూచన. నియోజకవర్గాల వారిగా సమావేశాలను నిర్వహించుకోవాలి*

*ప్రజల్లోనే ఉండాలి, పాదయాత్రలు చేసుకోవాలన్న కేసీఆర్* 

Thursday, March 9, 2023

మహిళా బిల్లుపై భాజపా ముందుకొస్తే అన్ని పార్టీలు మద్దతిస్తాయి.... కవిత

*మహిళా బిల్లుపై భాజపా ముందుకొస్తే అన్ని పార్టీలు మద్దతిస్తాయి.... కవిత*

దిల్లీ: రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.మహిళా రిజర్వేషన్‌ బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని.. దాన్ని ఆమోదించి చట్టంగా తీసుకురావాలని ఆమె డిమాండ్‌ చేశారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో కవిత మాట్లాడారు. ధరణిలో సగం.. ఆకాశంలో సగం.. అవకాశంలోనూ సగం కావాలంటూ ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

''భారత సంస్కృతిలో మహిళకు పెద్ద పీట వేశారు. అమ్మానాన్న అంటాం.. అందులో అమ్మ శబ్దమే ముందు ఉంటుంది. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ హయాంలో బిల్లు పెట్టినా అది ఇంకా చట్టం కాలేదు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఈ బిల్లు విషయంలో భాజపా ముందుకొస్తే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. మహిళా రిజర్వేషన్‌ సాధించేవరకు విశ్రమించేది లేదు'' అని కవిత అన్నారు.

దీక్షకు వివిధ రాజకీయపక్షాల నేతలు మద్దతు తెలిపారు. దీక్షకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, భారాసకు చెందిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యే పద్మాదేవందర్‌రెడ్డితో పాటు పెద్ద ఎత్తున మహిళా నేతలు హాజరై సంఘీభావం తెలిపారుఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై 30 ఏళ్లుగా చర్చ జరుగుతోందని చెప్పారు. మహిళలకు భాగస్వామ్యం లేకపోతే ఎలాంటి వ్యవస్థా మనుగడ సాగించలేదన్నారు. ''ఒకసారి బిల్లు తీసుకొచ్చాం.. కానీ అది సగంలోనే నిలిచిపోయింది. సోమవారం నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు తీసుకురావాలి. పంచాయతీల్లో రిజర్వేషన్‌ అమలు చేస్తున్నప్పుడు.. చట్ట సభల్లో ఎందుకు అమలులోకి తీసుకు రావడం లేదు? కవిత దీక్ష, ఉద్యమానికి పూర్తి మద్దతుగా నిలుస్తాం'' అని సీతారాం ఏచూరి అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

15 నుంచి ఒంటిపూట బడులు

*15 నుంచి ఒంటిపూట బడులు*

*ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్*

రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు స్కూళ్లలో ఈ నెల 15 నుంచి. ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. | ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకూ క్లాసులు కొనసాగ నున్నాయి. 2022-23 అకడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 24 వరకూ అన్ని స్కూళ్లు ఇదే టైమ్ టేబుల్ ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే, టెన్త్ క్లాసు స్టూడెంట్ల విషయంలో మాత్రం కొంత మినహాయింపు ఇస్తున్నారు. పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో వారికి స్పెషల్ క్లాసులు పెట్టుకు నేందుకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకూ సమ్మర్ హాలిడేస్ కొ నసాగనున్నాయి. అకడమిక్ ఇయర్ గైడ్ లైన్స్ ప్రకారమే ముందుకు పోతున్నామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్తున్నారు. కాగా, ఏప్రిల్ 10 నుంచి 17 వరకూ ఒకటో తరగతి నుంచి 9వ తరగతి స్టూడెంట్లకు సమ్మెటివ్ అసెస్మెంట్-2 (వార్షిక పరీక్షలు ఉంటాయి.

Source : సుజీవన్ వావిలాల 

నామినేషన్ వేసిన MLC అభ్యర్థులు

*నామినేషన్ వేసిన MLC అభ్యర్థులు*

హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఉదయం దేశపతి శ్రీనివాస్‌, వెంకట్రామ్‌రెడ్డి, నవీన్‌ కుమార్‌ నామినేషన్‌ వేశారు.వెంకట్రామ్‌రెడ్డి, నవీన్‌ కుమార్‌ నామినేషన్‌ వేశారు.కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ సందర్భంగా మంత్రులు హరీష్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు.

మరోవైపు.. నేడు జరిగే తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కేబినెట్‌ ఆమోదం తర్వాత అభ్యర్థుల ఫైల్‌.. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వద్దకు వెళ్లనుంది. ఇక, ఎమ్మెల్సీలు డీ. రాజేశ్వరరావు, ఫారూక్‌ హుస్సేన్‌ పదవీకాలం ముగియనుంది. ఈ ఇద్దరిలో ఒకరు క్రిస్టియన్ మైనారిటీ కాగా, మరొకరు ముస్లిం మైనారిటీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మరోసారి మైనార్టీకే అవకాశం ఇవ్వాలనుకుంటే రాజేశ్వర్‌ రావు వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. గతంలో పాడి కౌశిక్‌ రెడ్డి ఉదంతం కారణంగా ఈసారి అధికార పార్టీ అభ్యర్థి ఎంపికలో​ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్ష్మయ్య గౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్, పీఎల్. శ్రీనివాస్ ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ముగ్గురు ఓసీ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినందున గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా బీసీ, ఇతర సామాజిక వర్గాలతో భర్తీ చేసే అవకాశం ఉంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, March 7, 2023

MLC కవిత కు.... ఈడీ నోటీసులు...!

*MLC కవిత కు.... ఈడీ నోటీసులు...!*

: లిక్కర్‌ స్కామ్‌లో దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా.. కేసీఆర్‌ తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ).విచారణకై ఢిల్లీకి రావాలంటూ ఈడీ, ఎమ్మెల్సీ కవితకు పంపిన నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. మంగళవారం హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాను కవితకు బినామీనంటూ పిళ్లై ఒప్పుకున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పిళ్లై రిమాండ్‌ రిపోర్ట్‌లోనూ కవిత పేరును ఈడీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో.. ఆమెను ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న పిళ్లైతో కలిపి ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. లిక్కర్‌ స్కాంకు సంబంధించి సీబీఐ కూడా డిసెంబర్‌లో.. ఆమె ఇంటికి వెళ్లి దాదాపు ఏడు గంటలు ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరోవైపు లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఇప్పటివరకు పదకొండు మంది అరెస్ట్‌ అయ్యారు.

మంగళవారం పిళ్ళైను వారం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. ఈ నెల 13వ తేదీ వరకు పిళ్లై, ఈడీ కస్టడీలోనే ఉండనున్నాడు. అలాగే.. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో కలిపి పిళ్ళై ను విచారిస్తామని కోర్టుకు తెలిపింది ఈడీ. సౌత్ గ్రూప్ - ఆప్ కు మధ్య లింక్ గురించి ఈ ఇద్దరితో పాటు కల్వకుంట్ల కవితను కలిపి ఒకేసారి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఆప్ కు చేరవేయడంలో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలక పాత్ర పోషించాడని, ఆయన కవితకు బినామీ అని ఈడీ చెబుతోంది. ఈ మేరకు నిందితుల స్టేట్‌మెంట్లు బలం చేకూరుస్తున్నాయని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసిన ఈడీ. అంతేకాదు.. ఈ సంబధం ద్వారా వ్యాపారాన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరిద్దామని కవిత ప్రతిపాదించారని కూడా దర్యాప్తు ఏజెన్సీ చెబుతోంది.

మరోవైపు ఈ నెల 10వ తేదీన జంతర్‌ మంతర్‌ వద్ద.. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం జాగృతి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టాలని కవిత ఏర్పాట్లు చేసుకున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

MP కోమటిరెడ్డి పై.... కేసు నమోదు....!

*MP కోమటిరెడ్డి పై.... కేసు నమోదు....!*

నల్గొండ: భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌  సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై కేసు నమోదైంది. ఇటీవల టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కుమారుడు సుహాస్‌ను ఫోన్‌లో కోమటిరెడ్డి బెదిరించినట్లు ఆడియో క్లిప్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే.కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో తనకు ప్రాణహాని ఉందంటూ సుహాస్‌ నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదు మేరకు నల్గొండ వన్‌టౌన్‌ పోలీసులు 506 సెక్షన్‌ కింద ఎంపీపై కేసు నమోదు చేశారు. కోమటిరెడ్డి బెదిరింపులపై సోమవారం జిల్లా ఎస్పీకి కూడా సుహాస్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, March 6, 2023

సాత్విక్ ఆత్మహత్య..... కళాశాల గుర్తింపు రద్దు

*సాత్విక్ ఆత్మహత్య..... కళాశాల గుర్తింపు రద్దు*

హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్య హత్య ఘటనపై ఇంటర్‌ బోర్డు చర్యలకు దిగింది. విద్యార్థి చదివిన నార్సింగి శ్రీచైతన్య కాలేజీ అనుమతిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది.సాత్విక్‌ ఆత్మహత్య నేపథ్యంలో ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ చర్చలు జరిపారు. తప్పుడు ప్రకటనల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది.అదనపు సమయం తరగతులు నిర్వహిస్తే కళాశాలలపై చర్యలు ఉంటాయని వెల్లడించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లో బయోమెట్రిక్‌ అమలు చేస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ స్పష్టం చేశారు. విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరు కాలేదు.

*సుజీవన్ వావిలాల*🖋️

రేవంత్ రెడ్డి కి భద్రత పెంచండి..... హైకోర్ట్

*రేవంత్ రెడ్డి కి భద్రత పెంచండి..... హైకోర్ట్*

హైదరాబాద్‌: హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర చేపట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కి అదనపు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ కోర్టు ఆదేశించింది.అదనపు భద్రత కల్పించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. తగిన భద్రత లేకపోవడం వల్ల పాదయాత్రలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని, ముఖ్యంగా భారాస శ్రేణుల నుంచి ముప్పు ఉందని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు 69 మందితో భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. అయితే ఆ భద్రత అంతా ట్రాఫిక్ నియంత్రణకే సరిపోతోందని రేవంత్‌రెడ్డి న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం రేవంత్‌రెడ్డికి భద్రత పెంచాలని స్పష్టం చేసింది. పాదయాత్రతో పాటు రేవంత్‌రెడ్డి రాత్రి బస చేసే ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

జ్యుడిషల్ కస్టడికీ.... సిసోడియా....!

*జ్యుడిషల్ కస్టడికీ.... సిసోడియా....!*

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం  కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ  విధించింది.మార్చి 20 వరకూ ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే సిసోడియా బెయిల్ అభ్యర్థనపై మార్చి 10న విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది.

దీనికి ముందు, గత శనివారంనాడు సిసోడియా కస్టడీని మార్చి 6వ తేదీ వరకూ కోర్టు పొడిగించింది. ఆ గడువు ముగుస్తుండంటంతో సోమవారంనాడు ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, తదుపరి రిమాండ్‌ను తాము కోరడం లేదని, రాబోయే 15 రోజుల్లో రిమాండ్ కోరవచ్చని తెలిపారు.

*తీహార్ జైలుకు...*
, మార్చి 20వ తేదీ వరకూ సిసోడియాకు జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు. కాగా, తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 28న సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తొలుత హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ మార్చి 10న చేపడతామని కోర్టు తెలిపింది. మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మార్చి 10న సీబీఐ సమాధానం ఇవ్వనుంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఉమెన్స్ డే సందర్బంగా మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం....!

*ఉమెన్స్ డే సందర్బంగా మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం....!*

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సందర్భంగా మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది.ఆ రోజున రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా సెర్ప్‌, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈనెల 8న రూ.750 కోట్ల రుణాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఆ రోజున రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా సెర్ప్‌, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈనెల 8న రూ.750 కోట్ల రుణాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, March 4, 2023

ప్రయివేట్ ఫీజు... సెప రేటు, ఇంటర్ కళాశాలల్లో.... సరికొత్త దందా.....!

*ప్రయివేట్ ఫీజు... సెప రేటు, ఇంటర్ కళాశాలల్లో.... సరికొత్త దందా.....!*

*ల్యాబ్‌, అటెండెన్స్‌ పేరుతో అదనంగా వసూళ్లు...!*

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ముందు మహానగరం పరిధిలోని కొన్ని ప్రైవేటు కళాశాలలు సరికొత్త దందాకు తెరతీశాయి. వివిధ రకాల ఫీజుల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.వేలల్లో అక్రమంగా వసూలు చేస్తున్నాయి. విద్యార్థుల అటెండెన్సు సరిపోవడం లేదంటూ కొన్ని కళాశాలలు భారీ వసూళ్లకు పాల్పడుతుంటే.. మరికొన్ని ల్యాబ్‌ ఫీజు పేరుతో ఇదే దారిలో నడుస్తున్నాయి. ఈ ఫీజులన్నీ చెల్లించకపోతే హాల్‌ టిక్కెట్లు ఇవ్వమంటూ హెచ్చరిస్తున్నాయి. ఈ దోపిడీపై ఫిర్యాదులు అందుతున్నా ఇంటర్మీడియట్‌ బోర్డు కఠిన చర్యలు తీసుకోకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు రేగుతున్నాయి.అంతా అక్రమమే.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో దాదాపు 4.10 లక్షలమంది ఇంటర్‌ విద్యార్థులు మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ఈ నెలలో రాయనున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్నారు. ఇదే అదనుగా కొన్ని కాలేజీల యజమాన్యాలు పరీక్ష ఫీజుకు అదనంగా రూ.500 నుంచి రూ.1200 వరకు వసూలు చేశాయి. అంతేగాక ప్రాక్టికల్‌ పరీక్షలకు అదనంగా తీసుకుంటున్నారు. ఉదాహరణకు మాదాపూర్‌ కావూరి హిల్స్‌లో పేరొందిన ప్రైవేటు కాలేజీలో దాదాపు 150 మంది ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నారు. వారం కిందట సంబంధిత ప్రిన్సిపల్‌ విద్యార్థులందరినీ పిలిచి ల్యాబ్‌ ఫీజు కట్టాలని ఆదేశించారు. కొందరు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో విద్యార్థుల వల్ల ల్యాబ్‌లో కొన్ని పరికరాలు పగిలిపోయాయంటూ ఆరోపించి, ల్యాబ్‌ డ్యామేజీ ఫీజు కింద ఒక్కో విద్యార్థి రూ.800 చొప్పున కట్టాలని హుకుం జారీ చేశారు. ఇలా మొత్తం రూ.1.20 లక్షలు వసూలు చేశారు. కొండాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని కొన్ని కాలేజీలు కూడా సరికొత్త రీతిలో వసూళ్లకు పాల్పడుతున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. సాధారణంగా 75 శాతం, ఆపైన హాజరు ఉంటే పరీక్ష రాయడానికి విద్యార్థులు అర్హులు. కానీ కొన్ని కాలేజీ యజమాన్యాలు విద్యార్థుల హాజరును తక్కువ చూపిస్తూ..ఒక్కొక్కరి నుంచి రూ.2 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

సాత్విక్ మృతిపై కమిటీ రిపోర్ట్ ఇదే....శ్రీచైతన్యకు షాక్*

*సాత్విక్ మృతిపై కమిటీ రిపోర్ట్ ఇదే....శ్రీచైతన్యకు షాక్*

హైదరాబాద్‌: నార్సింగిలోని శ్రీచైత్యన కాలేజీలో ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ క్లాస్‌ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.కాగా, సాత్విక్‌ ఆత్మహత్యపై ఎంక్వైరీ కమిటీ రిపోర్టును ఇచ్చింది. తాజా రిపోర్టులో కూడా పాత విషయాలనే అధికారులు ప్రస్తావించారు. అయితే, ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందజేసింది.

రిపోర్టులో భాగంగా సూసైడ్‌ చేసుకున్న కాలేజీలో సాత్విక్‌ అడ్మిషన్‌ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్‌.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. అన్ని కార్పొరేట్‌ కాలేజీల్లోనూ ఇదే బాగోతం ఉందని విచారణ కమిటీ పేర్కొంది. క్లాసులేమో శ్రీచైతన్యలో.. చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు గుర్తించింది. ఈ క్రమంలోనే అడ్మిషన్లపై అన్ని కాలేజీల్లో చెక్‌ చేయాలని కమిటీ సూచించింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్‌ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది.

*సుజీవన్ వావిలాల🖋️*

రేవంత్ రెడ్డి కాన్వాయ్ కీ ప్రమాదం.....!

*రేవంత్ రెడ్డి కాన్వాయ్ కీ ప్రమాదం.....!*

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాన్యాయ్‌లో అపశృతి చోటుచేసుకుంది.అతివేగంతో అదుపుతప్పి రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రేవంత్‌రెడ్డికి చెందిన 4 కార్లతో పాటు 2 న్యూస్‌ ఛానళ్ల కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాద తీవ్రతకు కార్లలోని బెలూన్లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఒక కారులో ప్రయాణిస్తున్న పలువురు  గాయపడినట్లు తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, March 3, 2023

తెలంగాణలో....అమిత్ షా.... మే తర్వాత ఇక్కడే మకాం.....!

*తెలంగాణలో  బీజేపీ గెలుపే లక్షంగా....అమిత్ షా చేతికి బాధ్యతలు.... మే తర్వాత ఇక్కడే మకాం.....!*

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా జాతీయ నేతలు , కేంద్ర మంత్రులు తెలంగాణకు క్యూకట్టనున్నారు.ఈ క్రమంలో పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 12న తెలంగాణకు రానున్నారు. సంగారెడ్డిలో జరగనున్న బీజేపీ మేధావుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అంతేకాదు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను స్వయంగా తీసుకున్నారు. అలాగే రాష్ట్ర నేతల మధ్య సమన్వయంపై దృష్టి పెట్టారు. ఇకపై రెగ్యులర్‌గా ఎవరో ఒక నేత ఇంట్లో సమావేశం కావాలని పార్టీ నేతలను ఆదేశించారు అమిత్ షా. మరోవైపు చేరికల సమన్వయ బాధ్యతలను రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్‌కు అప్పగించారు. కర్ణాటక ఎన్నికలు ముగియగానే తెలంగాణలోనే మకాం వేయాలని అమిత్ షా నిర్ణయించారు.అలాగే ఈ నెలలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్యనేతలు తెలంగాణకు రానున్నారు. ఏప్రియల్‌లో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి, ఏప్రియల్‌లో బీజేపీ నేతలు విస్త్రతంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అమిత్ షా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి సానుకూల పరిస్ధితులు వున్నా.. ప్రజల్లో కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకత వున్నప్పటికీ, రాష్ట్ర బీజేపీ నేతలు దానిని పూర్తిగా వాడుకోవడం లేదనే అభిప్రాయం జాతీయ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన మినీ కోర్ కమిటీ భేటీలోనూ ఈ విషయంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

కళాశాలలో కుప్ప కూలిన విద్యార్థి... మృతి!

కళాశాలలో కుప్ప కూలిన విద్యార్థి!

*గుండె పోటు కారణమని వైద్యుల వెల్లడి ....!*

మేడ్చల్‌: గుండెపోటుతో టీనేజీ యువకులు కూడా చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిమ్‌ చేస్తూ కానిస్టేబుల్‌, వివాహ వేడుకలో నృత్యం చేస్తూ యువకుడు గుండె పోటుతో కుప్పకూలిన ఘటనలు మరువక ముందే..తాజాగా బీటెక్‌ విద్యార్థి ఒకరు గుండె పోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయ సీఎంఆర్‌ ఈసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్న సచిన్‌ (18) అనే విద్యార్థి రోజు మాదిరిగానే కళాశాలకు వచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తరగతులకు హాజరయ్యాడు. 3గంటల సమయంలో కళాశాల వరండాలో నడుచుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు.

తోటి విద్యార్థులు గమనించి.. వెంటనే సీఎంఆర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సచిన్‌ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి కుటుంబం వృత్తిరీత్యా రాజస్థాన్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌ సుచిత్రలో నివాసం ఉంటున్నారు. విద్యార్థి మృతదేహాన్ని కళాశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు అప్పగించింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Naxalite attack on @BommalaramarmPS in 1999

#CP_Rachakonda Sri DS Chauhan IPS called on Sri Venkat Reddy, who was the main sentry in 7 police personnel who fought bravely &retaliated Naxalite attack on @BommalaramarmPS in 1999 while CP was working as Nalgonda #ASP. CP recollected the incident &praised their heroic efforts

Thursday, March 2, 2023

గవర్నర్ బిల్లులు పెండింగ్ లో పెట్టారు సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన..... తెలంగాణ సర్కార్

*గవర్నర్ బిల్లులు పెండింగ్ లో పెట్టారు సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన..... తెలంగాణ సర్కార్*

దిల్లీ: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది.గవర్నర్‌ బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారని పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటివరకు 10 బిల్లులు పెండింగ్‌లో పెట్టారని పేర్కొంది. సెప్టెంబరు నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖను చేర్చింది.

తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు, ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత, పురపాలక నిబంధనల, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌, ప్రైవేటు విశ్వవిద్యాలయాల, మోటర్‌ వాహనాల పన్ను, పురపాలక, పంచాయతీరాజ్, వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో వెల్లడించింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

నార్సింగి శ్రీ చైతన్య కళాశాల ముందు MP కోమటిరెడ్డి ధర్నా....!

*నార్సింగి శ్రీ చైతన్య కళాశాల ముందు MP కోమటిరెడ్డి ధర్నా....!


హైదరాబాద్‌: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాత్విక్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాలేజీ వద్ద దీక్ష చేపట్టారు.సాత్విక్ సూసైట్‌ నోట్‌లో పేర్కొన్న నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యుల్ని అరెస్ట్ చేసేవరకు తాను దీక్ష చేస్తానని చెప్పారు. కాలేజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళకు దిగారు. దీంతో పోలీసులు కాలేజీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థులకు బోధించేంకు క్వాలిఫైడ్ లెక్చరర్స్ కూడా లేరని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఐఐటీ పేరుతో విద్యార్థులను మోసం చేసి రూ.లక్షల వసూలు చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరిపై హెచ్‌ఆర్‌డీకి కూడా ఫిర్యాదు చేశానని, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తానని చెప్పారు. కాలేజీలో విద్యార్థులను కొట్టడం, దూషించడం వంటి హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సున్నితమైన విషయాల్లో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని సూచించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, March 1, 2023

కంట తడి పెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ లెటర్

*కంట తడి పెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ లెటర్*

అమ్మానాన్నా క్షమించండి అని పేర్కొన్న సాత్విక్; తనని వేధింపులకు గురిచేసిన వారిపై కీలక సమాచారం....

శ్రీచైతన్య విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్యకు కారణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.సాత్విక్ రాసిన సూసైడ్ నోట్ బయటపడటంతో అతడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితులపై పోలీసులు ఓ అంచనాకు వస్తున్నారు. అమ్మా నాన్నా నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్న సాత్విక్, ఎవరినీ బాధపట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. ప్రిన్సిపాల్, కాలేజీ ఇన్ఛార్జ్, లెక్చరర్స్ టార్చర్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించాడు. కాలేజీ సిబ్బంది కృష్ణా రెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ తనను వేధింపులకు గురిచేసినట్లు వెల్లడించాడు.

వీరందరూ ఏకమైన హాస్టల్ విద్యార్ధులను తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. ఈ వేధింపులకు తాళలేక తాను ఇంత విపరీత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. తనని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. స్నేహితులకు తాను వెళ్లిపోతున్నందుకు సారీ చెప్పడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️