Saturday, July 31, 2021

తెలంగాణ ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న

గత రెండు రోజులుగా తెలంగాణ ప్రజల పక్షాన న్యాయంగా ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న Q న్యూస్ మీద అక్రమంగా కేసులు పెట్టాలని చుసిన వారి బాగోతం బట్టబయలు... వాస్తవాలతో తెలియచేసిన మల్లన్న 👍.... Bplkm

https://youtu.be/BfaKDYARDgE

prajasankalpam1.blogspot.com

మరోకోణం: దళితబంధు కాదు.. అందరిబంధు రావాలి!

హైదరాబాద్ : 01/08/2021

మరోకోణం: దళితబంధు కాదు.. అందరిబంధు రావాలి!

దిశ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

రాష్ట్రంలో ఇప్పుడంతా దళితబంధు పైనే చర్చ నడుస్తోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తెచ్చారని, ఈటలను ఓడించడం కోసం ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారని అంటున్నారు. ఈ పథకం మూలంగా ఆ నియోజకవర్గంలోని 45 వేల పైచిలుకు ఎస్సీ ఓట్లలో కనీసం 80శాతం టీఆర్ఎస్ ఖాతాలో పడడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఎత్తుగడ వికటించే అవకాశమూ ఉందనే వాదన లేకపోలేదు. కేవలం దళితులకే లబ్ధి చేకూర్చడం వల్ల దళితేతర ఓటర్లు ఆ పార్టీకి దూరమయ్యే చాన్స్ మెండుగా ఉందని వీరి భావన. ఈ వాదనకు కౌంటర్‌గా కొందరు టీఆర్ఎస్ నేతలు ‘బీసీబంధు’ పథకాన్ని ప్రస్తావిస్తున్నారు. అవసరమైతే ఎస్టీబంధు సైతం తేగలమంటున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్ని లక్షల కోట్లయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడరని వాళ్లంటున్నారు. ఇప్పటికే రూ. 40వేలకు పైగా కోట్లతో రైతుబంధు పథకాన్ని గత మూడేళ్లుగా విజయవంతంగా అమలుచేస్తున్న విషయాన్ని ఉటంకిస్తున్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచీ వృద్ధులకు, వితంతువులకు రూ.2 వేల చొప్పున, వికలాంగులకు రూ.3వేల చొప్పున ఇస్తున్న విషయం మర్చిపోకూడదంటున్నారు. బీడీ కార్మికులకు, నేతన్నలకు, గౌడ వృత్తిదారులకు కూడా నెల నెలా పింఛన్లు అందుతున్నాయని, కల్యాణలక్ష్మి, రైతుబీమా, గొర్రెల పంపిణీ, వడ్డీలేని రుణాలు, ఉచిత విద్యుత్ వంటి పథకాల రూపంలో ప్రజలకు బోలెడంత లబ్ధి కలుగుతోందని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో మొదలుపెట్టిన ఈ దళితబంధు పథకాన్ని వచ్చే రెండు మూడేళ్లలో రాష్ట్రమంతా అమలుచేయడం ఖాయమన్న ధీమాను వాళ్లు వ్యక్తం చేస్తున్నారు.

ఏ రకంగా చూసినా దళితబంధు మంచి పథకమే. రాష్ట్రంలో ఉన్న సుమారు 18 లక్షల ఎస్సీ కుటుంబాలకు గాను 10 లక్షల కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి రూ. లక్ష కోట్లు ఖర్చు చేయడమంటే మామూలు విషయం కాదు. ఒక్కో కుటుంబానికి నేరుగా బ్యాంకు ఖాతాలో రూ. 10 లక్షలు జమ చేయడం వల్ల దారిద్రరేఖకు దిగువన ఉన్న ఎన్నో దళిత కుటుంబాలు జీవనోపాధి పొందుతాయి. ఏదో ఒక వ్యాపారంలో స్థిరపడతాయి. వారి సామాజిక హోదా మెరుగుపడుతుంది. పెట్టుబడి కోసం మరెవరి పైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అందుకే, ప్రతిపక్షాలైనా, ప్రజాసంఘాలైనా ఇప్పటి వరకు ఈ పథకాన్ని విమర్శించలేదు. హుజూరాబాద్‌తోనే ఆగిపోకూడదని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వెంటనే అమలు చేయాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. తన సెగ్మెంట్‌లో దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తానంటే రాజీనామాకు సిద్ధమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు కూడా. బీసీ బంధు తేవాలని, ‘సంచార’బంధు గురించి కూడా ఆలోచించాలని మరికొన్ని వర్గాలు కోరుతున్నాయి. సమీప భవిష్యత్తులో కులాలవారీగా మరిన్ని ‘బంధు’ల డిమాండ్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.

ఆ మాటకొస్తే, కేసీఆర్ ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా ప్రజాసంక్షేమ లక్ష్యాన్నే కలిగివున్నాయి. వ్యవసాయదారులకు పెట్టుబడి సాయం కోసం తెచ్చిన రైతుబంధు సాగుఖర్చుల కోసం ఉపయోగపడుతోంది. ఉచిత విద్యుత్తు వారిపై కరెంటు బిల్లుల భారాన్ని నివారిస్తున్నది. 60 ఏళ్ల లోపు రైతులు మరణిస్తే రూ. 5 లక్షలు బీమా సాయం చేయడం ఆ కుటుంబాలు బజారున పడకుండా చేస్తున్నది. కల్యాణలక్ష్మి-షాదీముబారక్ పథకం పేదింటి ఆడపిల్లలను ఓ ఇంటివాళ్లను చేస్తున్నది. రకరకాల పింఛన్లు ఆయా వర్గాల అభాగ్యులను ఆకలిచావుల నుంచి కాపాడుతున్నాయి. కొడుకులు, కూతుళ్ల ఆదరణకు నోచని వృద్ధులు, భర్త చనిపోయి అనాథలైన మహిళలు, పనిచేయలేని వికలాంగులు, పని దొరక్క ఉపాధి కోల్పోయిన వృత్తిదారులు ఈ పింఛన్ల మూలంగా తలెత్తుకుని జీవించగలుగుతున్నారు. గొర్రెల పంపిణీ, చేపపిల్లల పెంపకం వంటి కార్యక్రమాలు కూడా ఆయా కులాల పేదలను ఆదుకుంటున్నాయి. పాక్షికంగానే అమలైనా, డబుల్ బెడ్రూం ఇళ్ల స్కీం కూడా నీడ లేని పేదలకు ఉపయోగపడే పథకమే.

2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం, తెలంగాణలో మొత్తం ఒక కోటి ఒక లక్షా 93వేల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల్లో అనేకం ప్రభుత్వ పథకాల మూలంగా లబ్ధి పొందుతున్నాయి. రైతుబంధుతో 56 లక్షల కుటుంబాలు, రైతుబీమాతో 32 లక్షలు, ఆసరా పింఛన్లతో 39 లక్షలు, రేషన్ బియ్యం తీసుకుని 88 లక్షలు, కల్యాణలక్ష్మి-షాదీముబారక్‌తో 6 లక్షలు, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌తో 4 లక్షలు, గొర్రెల పంపిణీతో 3.76 లక్షలు, చేపపిల్లల పెంపకంతో 1.50 లక్షలు, ఎస్సీ-ఎస్టీ సబ్‌ప్లాన్‌తో 2 లక్షల కుటుంబాలు ఇప్పటివరకు ప్రయోజనం పొందాయి. అంటే ఒక్కో కుటుంబం ఒకటి కంటే ఎక్కువ పథకాలను పొందుతున్నదనేది చాలా స్పష్టం. మూడెకరాల భూమి ఉన్న ఒక రైతు కుటుంబాన్ని ఉదహరణగా తీసుకుంటే రైతుబంధు, రైతుబీమా తప్పనిసరి వర్తిస్తాయి. తెల్లకార్డు ఉంటుంది కనుక రేషన్ బియ్యం వస్తాయి. వృద్ధులైన తల్లిదండ్రులుంటే ఒక పింఛను, వికలాంగులు ఉంటే మరో పింఛను, చదువుకునే విద్యార్థులుంటే ఫీజు వాపస్, పెళ్లి కావాల్సిన కూతురు ఉంటే కల్యాణలక్ష్మి, వ్యవసాయ మోటారు ఉంటే ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తాయి. ఇక వారి కులాన్ని బట్టి గొర్రెలో, బర్రెలో, మరేదో అదనంగా ఇంకో పథకం అందే అవకాశం ఉండనే ఉంటుంది.

నిధుల పరంగా చూస్తే, ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఎనిమిది బడ్జెట్లలో కలిపి తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మొత్తం 3,94,517 కోట్లను కేటాయించింది. 2014-15లో 31,774 కోట్లు, 2015-16లో 40,231 కోట్లు, 2016-17లో 41,600 కోట్లు, 2017-18లో 49,174 కోట్లు, 2018-19లో 55,365 కోట్లు, 2019-20లో 42,051 కోట్లు, 2020-21 60,905 కోట్లు, 2021-22లో 73,417 కోట్లు కేటాయించింది. కొంచెం అటూ ఇటుగా ఈ నిధులను ఖర్చు చేస్తున్నారనుకున్నా, ఒక్కో కుటుంబానికి సరాసరిగా ఈ ఎనిమిదేళ్లలో రూ. 3,50,000 కోట్ల సాయం అందిందని లేదా అందబోతుందని అంచనా. ఏడాదికి లెక్క వేస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 42వేల పైచిలుకు, నెలకు లెక్కిస్తే రూ. 3500కు పైచిలుకు లబ్ధి కలుగుతుంది.

అయినప్పుడు రాష్ట్రంలో పేదరికం, దారిద్య్రం ఎందుకుంది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అప్పుల బాధతో ఉసురు ఎందుకు తీసుకుంటున్నారు? ఆకలితో కొందరు ఎందుకు అలమటిస్తున్నారు? బిచ్చమెత్తుకుంటున్న వాళ్ల పరిస్థితి ఏంటి? ఉపాధి లేక ఎందుకు వలస పోతున్నారు? ఇవన్నీ జవాబు దొరకని ప్రశ్నలే. ఎందుకంటే పైన చెప్పినవన్నీ కాగితాల్లో లెక్కలు. వాస్తవాలు మరోలా ఉన్నాయి. పథకాలన్నీ అందినవాళ్లకే మళ్లీ మళ్లీ అందుతున్నాయి. కలిగినోళ్లు, ధనికులే లబ్ధి పొందుతున్నారు. పైరవీలు చేసేవాళ్లు, చేయించుకునే కెపాసిటీ ఉన్నవాళ్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, కులసంఘాల నేతలే అన్నింటిలో లబ్ధిదారులుగా ఉంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించిన స్కీంలు కూడా అందులోని క్రీమీ లేయర్‌కే అందుతున్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవాళ్లకు, తిండి లేనివాళ్లకు, భూమిలేని కూలీలకు, అనాథలకు ఒక్క రేషన్ బియ్యం మాత్రమే అందుతున్నాయి.

రైతుబంధు, దళితబంధు, బీసీబంధు, సంచారబంధు, చేనేతబంధు, రజకబంధు.. ఇలా వృత్తులు, కులాలు, వర్గాల వారీగా సంక్షేమ పథకాలను తీసుకువచ్చే బదులుగా అందరి బంధు పథకం రావాలి. పేదల బంధు రావాలి. ఇందుకోసం సమగ్ర కుటుంబ సర్వేలాగా తెలంగాణ వ్యాప్తంగా మరో సర్వే చేపట్టాలి. ప్రతి కుటుంబం ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా లెక్కించాలి. ఆయా కుటుంబాలకున్న స్థిరచరాస్తులు, ఆదాయం, సామాజిక హోదా ప్రాతిపదికన జనాభాను వివిధ కేటగరీలుగా వర్గీకరించాలి. అట్టడుగు మెట్టున ఉన్నవాళ్లకు అత్యధిక లబ్ధి కలిగేలా పాలసీని రూపొందించాలి. అప్పుడే నిజమైన పేదలకు, అభాగ్యులకు సర్కారు అండ లభిస్తుంది. కేసీఆర్ కంటున్న బంగారు తెలంగాణ స్వప్నం నెరవేరుతుంది. లేదంటే ఎన్ని పథకాలు చేపట్టినా, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంటుంది తప్ప పరిస్థితి మారదు.

– డి మార్కండేయ

క‌రోనా కేసుల‌పై తెలంగాణ స‌ర్కార్ హెచ్చ‌రిక‌

హైదరాబాద్ : 30/07/2021

క‌రోనా కేసుల‌పై తెలంగాణ స‌ర్కార్ హెచ్చ‌రిక‌

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న వేళ తెలంగాణ స‌ర్కార్ కీల‌క హెచ్చ‌రిక చేసింది. ఇప్ప‌టికైతే తెలంగాణ రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉందన్న ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాసరావు, డెల్టా వేరియెంట్ మన దేశంతో పాటు 130దేశాల్లో చాలా ఇబ్బందులు పెడుతుంద‌న్నారు.

మనకు ఆనుకొని ఉన్న రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయని ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. కేరళలో దేశంలో నమోదు అయ్యే కేసుల్లో 50శాతం అక్కడే నమోదు అవుతున్నాయన్న ఆయ‌న‌, వాక్సినేషన్ ఎక్కువగా జరిగిన దేశాల్లో కూడా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. అయితే… వైర‌స్ తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంటుంద‌ని తెలిపారు.

డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు రెండు దాదాపుగా ఒక్కటే లాగా ఉన్నాయన్నారు. ప్రమాదకరమైనవి ఏమి కావ‌ని, భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే నిర్లక్ష్యంగా ఉంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయ‌ని, నిబంధనలు పాటించకపోతే ఔట్ బ్రేక్ అవుతున్నాయని చెప్పారు. ఖమ్మం కూసుమంచి ఘ‌ట‌నే ఇందుక నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

స్వీయ నియంత్ర‌ణ లేక‌పోతే కేర‌ళ లాగే ఇక్క‌డ కూడా కేసులు పెరిగే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

Niti Aayog chief praises Uttar Pradesh IAS officer for his effort to develop model villages


Hyderabad : 31/07/2021

Niti Aayog chief praises Uttar Pradesh IAS officer for his effort to develop model villages

Heera Lal is additional director National Health Mission

LUCKNOW: 

Niti Aayog

 vicechairperson Rajiv Kumar has complemented UP 

IAS

 officer Heera Lal, additional director, 

National Health Mission

, for his 

work

 to turn backward rural areas into 

model

 villages through public participation 

In a tweet on Wednesday, Kumar said: “IAS officer Heera Lal’s endeavour to convert rural and downtrodden villages of Uttar Pradesh into ‘Model Villages’ through active public participation is a tremendous step. Ground work like this is important for India's holistic development. Great work!”

Lal, who as district magistrate of Banda earlier, had carried out similar projects on water conservation, said that he was thrilled to have the work of NGO ‘Model Gaon’ recognised.

“The project was conceptualised by Munish Gangwar, retired chief general manager of 

NABARD

. We started the project in January this year and already, 1,500 village manifestos, outlining how the locals would like to develop their village and what facilities they would like to have there, have been made. We are approaching newly elected pradhans, farmer producer organisations, Nehru Yuva Kendra members and asking them to join the effort,” said Lal, who is an advisor to Model Gaon.

Lal said that his work in Banda while he was DM inspired Gangwar to take up the project at a macro level. In Banda, he said, his administration followed a bottom up approach in implementing water conservation schemes, increasing crop productivity etc, through direct involvement of residents in these projects.

“We have an example of a village pradhan from Gorakhpur who won the recent panchayat elections on the basis of a model village manifesto. We are now in the process of collaborating with him to help in the implementation of the manifesto which will see villagers come together for water conservation, creation of farmer producer companies to protect interest of farmers etc,” he said.

Friday, July 30, 2021

ఈ ఇంకుడు గుంతకు నేటితో 23ఏళ్లు...

హైదరాబాద్ : 01/07/2021
ఈ ఇంకుడు గుంతకు నేటితో 23ఏళ్లు...
హైదరాబాద్: భూగర్భ జలాల పెంపునకు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇంకుడు గుంతకు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయని ఇంకుడుగుంతల సృష్టికర్త భోలక్‌పూర్‌ డివిజన్‌ పద్మశాలీకాలనీకి చెందిన బీహెచ్‌ఈఎల్‌ రిటైర్డ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.ఆంజనేయులు తెలిపారు. పద్మశాలీకాలనీలో 1998 జూలై 31న ఇంకుడుగుంతను మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డి ప్రారంభించారని తెలిపారు. నేడు తమ కాలనీలోని 500 కుటుంబాలలోని ప్రతి ఇంటి వద్ద ఇంకుడుగుంతలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. దీంతో తమ ప్రాంతంలో నీటి సమస్య తలెత్తలేదని, కేవలం 80 అడుగులలోపు బోర్లు వేస్తే నీరు వస్తుందని ఆంజనేయులు వివరించారు
Q న్యూస్ మీడియా సౌజన్యంతో 

కేటీఆర్ ఆదేశాలతో రూ.200 కోట్లతో వంతెన....

హైదరాబాద్ : 30/07/2021

*కేటీఆర్ ఆదేశాలతో రూ.200 కోట్లతో వంతెన.....!*

హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై *ఉప్పల్‌ నుంచి నారపల్లి* వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌కు కొనసాగింపుగా వంతెన నిర్మాణంపై అడుగులు పడుతున్నాయి. *రింగ్‌ రోడ్డు సమీపంలోని శ్మశానవాటిక నుంచి రామంతాపూర్‌ వైపున్న మోడ్రన్‌ బేకరీ* వరకు వంతెన నిర్మించనున్నారు. ఈ పనుల కోసం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించగా, తాజాగా మూడు సంస్థలు బిడ్‌ దాఖలు చేశాయని ఇంజనీరింగ్‌ విభాగం అధికారొకరు తెలిపారు. బిడ్‌ల పరిశీలన జరుగుతోందని, నిర్మాణ సంస్థ ఎంపిక త్వరలో పూర్తవుతుందని అన్నారు. నగరం నుంచి వరంగల్‌ వైపు జాతీయ రహదారిపై నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, వైద్య సేవలు, ఇతర పనుల కోసం లక్షలాది మంది హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుంటారు.నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బోడుప్పల్‌ దాటేందుకు 40 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతోంది.
జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, మియాపూర్‌, మెహిదీపట్నం తదితర ప్రాంతాల రెండు నుంచి రెండున్నర గంటలు పడుతోంది. జాతీయ రహదారిపై బైపాస్‌ రోడ్డు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో బోడుప్పల్‌/చెంగిచెర్ల చౌరస్తా నుంచి రెండు నుంచి రెండున్నర గంటల్లో 140 కి.మీల దూరంలోని వరంగల్‌కు వెళ్తున్నారు. కానీ, వాహనాల రద్దీ నేపథ్యంలో నగరంలో 20 నుంచి 30 కి.మీల దూరం ప్రయాణించేందుకు కూడా రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది. ఆ ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు నగరం నలువైపులా ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఒకటి ఉప్పల్‌ నుంచి నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌. ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని శ్మశానవాటిక నుంచి నారపల్లి వరకు 6.4 కి.మీల ఆరు లేన్ల వంతెనను రూ.658 కోట్లతో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మిస్తోంది. ఆస్తుల సేకరణ పూర్తవడంతో పనులూ జరుగుతున్నాయి.
కేటీఆర్‌ ఆదేశాలతో..
ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద నిత్యం భారీగా ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ఉప్పల్‌ బస్టాండ్‌ వైపు శ్మశాన వాటిక ఉండడంతో రహదారి విస్తరణకు అవకాశం లేదు. ఈ మార్గంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ను శ్మశాన వాటిక వద్ద దించితే రింగ్‌ రోడ్డు సమీపంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. స్థానికంగా రాకపోకలు సాగించే వాహనాలతో పాటు వరంగల్‌ వైపు నుంచి వచ్చే వాహనాలతో శ్మశాన వాటిక వద్ద జామ్‌జాటం అధికమవుతుంది. వంతెన అందుబాటులోకి వచ్చినా పూర్తిస్థాయి ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఏఐ వంతెనను ల్యాండ్‌ చేసే చోటు నుంచి రామంతాపూర్‌ వైపు ఫ్లై ఓవర్‌ నిర్మించే బాధ్యతను ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అప్పగించింది.
ఇందుకు రూ.200 కోట్లు అవసరమని అంచనా వేసిన అధికారులు టెండర్‌ ప్రకటించారు. రామంతాపూర్‌ వైపు మోడ్రన్‌ బేకరీ వద్ద వంతెన ల్యాండ్‌ కానుండగా, సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనాల కోసం ఉప్పల్‌ స్టేడియం రోడ్‌లో గ్రేట్‌ సెపరేటర్‌ నిర్మించనున్నారు. నారపల్లిలో వంతెన ఎక్కిన వాహనం సికింద్రాబాద్‌ వైపు వెళ్లాలనుకుంటే గ్రేడ్‌ సెపరేటర్‌ ద్వారా వెళ్లే అవకాశముంటుంది. సికింద్రాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు వంతెన ఎక్కేందుకు వీలుగా మరో గ్రేడ్‌ సెపరేటర్‌ నిర్మించనున్నారు. ఈ వంతెన అందుబాటులోకి వచ్చిన పక్షంలో నగరం నుంచి వరంగల్‌ జాతీయ రహదారి వైపు సిగ్నల్‌ చిక్కులు, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగే అవకాశ ముంటుంది.
ఎన్‌హెచ్‌ఏఐ ప్రస్తుతం చేస్తున్న పనుల వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే వంతెన అందుబాటులోకి రావడానికి రెండున్నర నుంచి మూడేళ్లు పట్టవచ్చు. అప్పటి వరకు వేచి చూడకుండా జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న మేర పనులు ప్రారంభించాలని మంత్రి కే తారక రామారావు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో టెండర్‌ ప్రకటించిన అధికారులు పనులు మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. మోడ్రన్‌ బేకరీ వైపు నుంచి లేదా ఉప్పల్‌ రింగ్‌ ఇవతలి వైపు (రామంతాపూర్‌) నుంచి పనులు చేయాలనుకుంటున్నారు.

*link Media ప్రజల పక్షం🖋️*

https://prajasankalpam1.blogspot.com 

Thursday, July 29, 2021

రాష్ట్రసర్కార్ పై ఫైర్ అయిన ఆరెస్పీ.

హైదరాబాద్ : 30/07/2021
రాష్ట్రసర్కార్ పై ఫైర్ అయిన ఆరెస్పీ.
Q న్యూస్ మీడియా సౌజన్యంతో 
తమ మీటింగ్‌కు వస్తున్న వాళ్లను అక్రమంగా అరెస్టు చేయడంపై రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్​ఎస్. ప్రవీణ్​కుమార్ ఫైర్ అయ్యారు. అక్రమంగా ప్రాజెక్టుల్లో డబ్బులు సంపాదించామా? అట్ల సంపాదించిన సొమ్ముతో ఫామ్ హౌస్ లు కట్టుకున్నమా? ఓట్లు కొనుక్కుంటున్నామా? అని రాష్ట్ర సర్కార్​ను నిలదీశారు. గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత అలుగునూరులో జరిగిన బహుజన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పేద ప్రజల్లో కేవలం ఒక్క శాతం మందికి మాత్రమే లబ్ధి జరిగిందని, ఇంకా 99 శాతం మందికి ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెపల్లెకు వెళ్లి పేదల సమస్యలు తెలుసుకుంటానని, వారి బతుకులను బాగు చేసేందుకు పోరాటం చేస్తానని చెప్పారు. పేదల సమస్యలను చూసి, తాను చలించిపోయాయని.. వాళ్లకు ఏదైనా చేయాలనే తపనతోనే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశానని తెలిపారు. బహుజన రాజ్యాధికారం దిశగా రానున్న రోజుల్లో అందరితో కలిసి పోరాటం చేస్తానని, పల్లెపల్లెకు వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తానన్నారు.

కొందరు చెంచాలు అంబేద్కర్ పేరు చెప్పుకుని మోసం చేస్తున్నారని ప్రవీణ్​కుమార్ విమర్శించారు. ఆ చెంచాల ఉచ్చులో పడితే మరో 200 ఏళ్లు వెనక్కి పోతామన్నారు. ‘‘50 ఏళ్ల మీ మేనిఫెస్టోలు ఎక్కడ పోయాయి. పేదల బతుకుల్లో ఎందుకు మార్పురాలేదు. మా కష్టార్జితంగా కట్టిన పన్నులు ఏమయ్యాయి. అందుకే ఆరేళ్ల సర్వీసును తృణ ప్రాయంగా వదిలేసి మీ కోసం వచ్చా. మీలాగా ఆస్తుల కోసం, పదవుల కోసం కొట్లాడలేదు. మా బిడ్డల కోసం జీవితాంతం పనిచేస్త’’ అని అన్నారు.


రాష్ట్రంలో కులాల అభివృద్ధి కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని సర్కార్ చెబుతోందని.. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం సర్కార్ ఖర్చు చేస్తున్న డబ్బులను పేదల అభివృద్ధికి కేటాయిస్తే చాలు, వారి బతుకులు బాగు పడుతాయని ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న గొర్రెల పథకంపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని యాదవుల పిల్లలకు సూచించారు.
 

100 పడకలుంటే ఆక్సిజన్‌ ప్లాంటు ఉండాల్సిందేప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వ ఆదేశాలు

హైదరాబాద్ : 30/07/2021
   
100 పడకలుంటే ఆక్సిజన్‌ ప్లాంటు ఉండాల్సిందే

ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వ ఆదేశాలు
కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు

100 పడకలుంటే ఆక్సిజన్‌ ప్లాంటు ఉండాల్సిందే

ఈనాడు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

ఈనాడు-హైదరాబాద్‌: కరోనా మూడో దశ ఉద్ధృతి ఎప్పుడొస్తుందో కచ్చితంగా తెలియదు. ఎప్పుడొచ్చినా సమర్థంగా ఎదుర్కోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొవిడ్‌ చికిత్సలో ప్రాణవాయువుకు అధిక ప్రాధాన్యం ఉండడంతో.. 100, ఆపైన పడకలున్న అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పాలని తాజాగా సర్కారు ఆదేశించింది. కొవిడ్‌ రోగులకు ప్రాణవాయువును అందించడంలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్యంలో దాదాపు 27 వేల పడకలకు ప్రాణవాయువు సరఫరాకు కార్యాచరణను అమలు చేస్తోంది. కొత్తగా పైపులైన్లను బిగించడంతో పాటు అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ ‘ప్రెషర్‌ స్వింగ్‌ అడ్సార్‌ప్షన్‌’ (పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పుతోంది. ఇవి గాలిని స్వీకరించి.. అందులోని మలినాలను తొలగించి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. సిలిండర్ల ద్వారా కంటే ఈ విధానంలో ఆక్సిజన్‌ను పైపుల ద్వారా పడకలకు సులువుగా చేర్చవచ్చు. ఆసుపత్రిలో ఎన్ని పడకలు అందుబాటులో ఉంటే అన్నింటికీ ప్రాణవాయువును సరఫరా చేసుకోవచ్చు. 1000 పడకలు, ఆపైన ఉండి పెద్దసంఖ్యలో ప్రాణవాయువు అవసరమైతే మాత్రం స్వీయ ఉత్పత్తి సామర్థ్యం సరిపోదు. అలాంటి చోట్ల కర్మాగారంలో ఉత్పత్తి అయిన ప్రాణవాయువును లారీల ద్వారా తీసుకొచ్చి, ఆసుపత్రిలో నిర్మించిన ప్లాంటులో నింపుతారు. అక్కడి నుంచి పడకలకు సరఫరా చేస్తారు. అన్ని ఆసుపత్రులు భారీస్థాయిలో ప్లాంట్లు నిర్మించుకోవడం సాధ్యమయ్యేది కాదు. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా నిర్వహణ కూడా కష్టమే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే 100 పడకలు దాటిన ఆసుపత్రుల్లో స్వీయ ప్రాణవాయువు ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సర్కారు సూచిస్తోంది.

100 పడకలుంటే ఆక్సిజన్‌ ప్లాంటు ఉండాల్సిందే

ఏ ఆసుపత్రిలో ఏ సామర్థ్యం..

100 నుంచి 200 పడకల వరకూ ఉన్న ఆసుపత్రులు ఒక్కరోజులో నిమిషానికి 500 లీటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యమున్న ప్లాంటు నెలకొల్పాల్సి ఉంటుంది. 200-500 వరకూ పడకలున్న ఆసుపత్రిలో నిమిషానికి 1000 లీటర్లను.. 500 పడకలు దాటితే నిమిషానికి 2000 లీటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో 100 పడకలున్న ఆసుపత్రులు 300కి పైగా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా మరో 200 వరకూ ఉంటాయని అంచనా. 200 పడకలు దాటిన ప్రైవేటు ఆసుపత్రులు సుమారు 100 వరకూ ఉండగా.. 500 పడకలు దాటిన ప్రైవేటు ఆసుపత్రులు 30 వరకూ ఉంటాయని వైద్యవర్గాలు తెలిపాయి. వీటన్నింటిలోనూ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ప్రాణవాయువు ప్లాంట్లను నెలకొల్పాల్సి ఉంటుంది. ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే ఆసుపత్రుల గుర్తింపును, అనుమతులనూ రద్దు చేస్తామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

   

పరిశుభ్రతకు పోలీసుల ‘5ఎస్‌’ డీజేపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు


హైదరాబాద్ : 29/07/2021

పరిశుభ్రతకు పోలీసుల ‘5ఎస్‌’

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
పరిశుభ్రతకు పోలీసుల ‘5ఎస్‌'
  • అన్ని పోలీస్‌ స్టేషన్లలో అమలు
  • డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌, జులై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, పోలీస్‌ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 5ఎస్‌ (సార్ట్‌, సెట్‌ ఇన్‌ ఆర్డర్‌, షైన్‌, స్టాండైర్టెజ్‌, సస్టేన్‌) విధానాన్ని అమలు చేస్టున్నట్టు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. 5ఎస్‌ అమలు, పోలీస్‌ స్టేషన్లలో వ్యర్థాల తొలగింపు, పోలీసులకు కిట్ల పంపిణీకి రూపొందించిన వెబ్‌ అప్లికేషన్‌ నిర్వహణ తదితర అంశాలపై బుధవారం డీజీపీ సమావేశం నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలులో భాగంగా పోలీస్‌ స్టేషన్లు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఉత్తమ సేవలు అందించే వాతావరణాన్ని నెలకొల్పాలని ఆదేశించారు. ఇప్పటికే అమలవుతున్న 5ఎస్‌ విధానాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించాలని స్పష్టం చేశారు. గత 15 ఏండ్లుగా వృథాగా ఉన్న పాత, వ్యర్థ పరికరాలను నిబంధనల మేరకు వేలం(ఆక్షన్‌)వేయాలని సూచించారు. ఇప్పటికే 29 పోలీసు యూనిట్లలో వేలం వేయగా వచ్చిన రూ.50,35,000 ప్రభుత్వ ఖజానాలో జమ చేసినట్టు తెలిపారు. పోలీసు సిబ్బందికి రెయిన్‌ కోట్‌, గ్రౌండ్‌ షీట్లు, ఉలెన్‌ బ్లాంకెట్లు, స్వెటర్స్‌ తదితర వస్తువులు కలిగిన కిట్లను సకాలంలో అందజేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని డీజీపీ వెల్లడించారు. కిట్ల పంపిణీలో సమర్థంగా వ్యవహరిస్తున్న లాజిస్టిక్స్‌ విభాగం ఐజీ సంజయ్‌ జైన్‌, స్టోర్స్‌ డీఎస్పీ వేణుగోపాల్‌ను ఆయన అభినందించారు. పోలీసు కార్యాలయాల నిర్వహణపై ప్రత్యేకశ్రద్ధ చూపించిన పలు జిల్లాల ఆర్‌ఐలకు డీజీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో తొమ్మిది పోలీస్‌ కమిషనరేట్లు, 20 జిల్లాల ఎస్పీ కార్యాలయాల రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

పోలీస్‌ పిల్లల విదేశీ విద్యకు 30 లక్షలు

రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ సిబ్బంది పిల్లల విదేశీ చదువులకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. విద్య కోసం విదేశాలకు వెళ్లే పోలీసుల పిల్లలకు పోలీస్‌ భద్రత నిధి నుంచి చెల్లించే ట్యూషన్‌ ఫీజును రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచాలని ఆయన నిర్ణయించారు. దీనికి అదనంగా ఇతర ఖర్చుల కోసం మరో రూ.30 లక్షలు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు వెల్ఫేర్‌ అడిషనల్‌ డీజీ ఉమేశ్‌ ష్రాఫ్‌ బుధవారం ఆదేశాలు జారీచేశారు. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు ఉమేశ్‌ ష్రాఫ్‌కు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అధికారుల సంఘం చైర్మన్‌ గోపిరెడ్డి ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.

Wednesday, July 28, 2021

కేసీఆర్‌కు బిగ్‌షాక్.. ‘దళిత బంధు’ పై సీఈసీకి ఫిర్యాదు

హైదరాబాద్ : 29/07/2021

కేసీఆర్‌కు బిగ్‌షాక్.. ‘దళిత బంధు’ పై సీఈసీకి ఫిర్యాదు

దిశ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
cm-kcr-shock

దిశ, తెలంగాణ బ్యూరో : దళితబంధు పథకం అమలును హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పూర్తయ్యేంత వరకు నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికిప్పుడు దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించినట్లయితే అక్కడ మినహా మిగిలిన 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలుచేసేలా చర్యలు తీసుకోవచ్చని సూచించింది. ఫోరమ్ కార్యదర్శి పద్మనాభరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బుధవారం రాసిన లేఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉదహరించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో లేనప్పటికీ ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు. హుజూరాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకునే దళిత బంధును అమలు చేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆ లేఖలో ప్రస్తావించారు.

దళిత బంధు స్కీమ్ మంచిదే అయినా ఇప్పుడు హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో తెరపైకి తీసుకురావడం హుజూరాబాద్ ఓటర్లను ప్రలోభపెట్టడమేనని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ పథకం ఎన్నికలలో లాభం కోసమేనని ప్రకటించడం తీవ్రమైన అంశమని, ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించాల్సిన గురుతరమైన బాధ్యత ఉన్నందున ఎన్నికలకు ముందే కోట్లాది రూపాయలతో పథకాలను రూపొందించడం ఓటర్లను ప్రలోభానికి గురిచేయడమేనని నొక్కిచెప్పారు. “నేను హిమాలయాల్లో ఉండే సాధువును కాదు.. ఒక రాజకీయవేత్తను.. దళిత బంధు పథకం ఉప ఎన్నికలలో లబ్ధి పొందడానికే.. దీనిలో తప్పేంటి” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు ఎన్నికల కోడ్ అమలులో లేనందున ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాకపోవచ్చు గానీ సమర్ధనీయం కాదని పేర్కొన్నారు.

ఇప్పటికే హుజూరాబాద్ నుంచి దళితులను హైదరాబాద్ పిలిపించుకుని చర్చించడం, వారికి లాభపడే మరికొన్ని పథకాలను ఆ సమావేశంలో ప్రకటించడం, ఇల్లు లేని వారికి ఇల్లును సమకూర్చడం, పది రోజుల్లోనే పట్టాదారు పాసు బుక్కులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం, గొర్రెల పంపిణీ, రేషను కార్డుల జారీ, పింఛన్ల మంజూరు.. ఇవన్నీ స్వాగతించాల్సినవి అయినప్పటికీ వీటి వెనక ఉద్దేశం మాత్రం ప్రశ్నార్థకమని పేర్కొన్నారు.

Re-notify FTL Boundary Map of Osman Sagar reservoir as area of Osman Sagar is reduced by acres 296.38 guntas

Hyderabad : 28/07/2021

To
The Managing Director
HMWSSB, Khairatabad, Hyderabad

Dear Managing Director,

Sub: Re-notify FTL Boundary Map of Osman Sagar reservoir as area of Osman Sagar is reduced by acres 296.38 guntas.

Ref: 1- TOPOGRAPHICAL MAP OF OSMANSAGAR RESERVOIR R.R(D) A.P. DATED 18-06-2013 ISSUED BY HMWSSB (attached)
2-  MAP OF COORDINATE POINTS OF TOPOGRAPHICAL SHEET OF OSMNSAGAR RESERVOIR R.R(D) FROM HMDA WEBSITE DATED 04-12-2019 (attached)

We find an unpardonable dereliction of duty in issuance of FTL boundary maps of Osman Sagar Drinking water reservoir.
The area of Osman Sagar is reduced by acres 296.38 guntas as indicated in the areas of FTL boundary between the 'TOPOGRAPHICAL MAP OF OSMANSAGAR RESERVOIR R.R(D) A.P.' dated 18 june 2013, ISSUED BY HMWSSB, 'Area FTL+1790 feet Acres 6335-38 Guntas' and, 'MAP OF COORDINATE POINTS OF TOPOGRAPHICAL SHEET OF OSMNSAGAR RESERVOIR R.R(D)' 'Area FTL +1790 feet Acres 6039.00 Guntas' dated 4 dec 2019 FROM HMDA WEBSITE.

We expect you to re-notify the FTL boundary map within 3 days as confirm us thru reply email.

We have on record your contradictory statements, that, while replying to us on 5 nov 2020 Director Technical HMWSSB cites 'sensitive nature' and  'subjudice' as reasons for not giving geo coordinates of Osman sagar FTL boundary and issues a reductionist area of Osman Sagar by acres 296.38 guntas on 4 dec 2019 and notified on HMDA website on 30 dec 2019:

5nov2020 email Protection of Osmansagar and Himayat Sagar Reservoirs -Information .png

Your omissions and commissions and non-application of mind in the case of basic data maintenance such as notification of FTL boundary of our Hyderabad's drinking water reservoir in spite of our repeated follow ups since 17 july 2014 as evidenced from email appended below has been taken note of and shall be followed up as per due procedure.


best
dr lubna sarwath
state gen secy, socialist party(india)
hyderabad
retd-IRS V Sai Prasad Sastry, founder-President VOICE
Dr Jasveen Jairath, founder-convenor, SOUL


రాయప్ప సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది... హైకోర్ట్

హైదరాబాద్ : 28/07/2021

*రాయప్ప సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది... హైకోర్ట్*

హైదరాబాద్‌: రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై హైకోర్టులో విచారణ జరిగింది. పత్రికల కథనాలపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. యునెస్కో విధించిన గడువు విధించిన డిసెంబర్‌ నెలాఖరు వరకు సమగ్ర సంరక్షణ చేపట్టాలని ఆదేశించింది. ఏఎస్ఐ, రాష్ట్ర పురావస్తు శాఖ, కలెక్టర్ లతో కమిటీ ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఆగష్టు 4న ఆ కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో సంయుక్త పరిశీలన జరపాలని ధర్మాసనం వివరించింది.
నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పించాలని వివరించింది.
రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం తెలంగాణకు గర్వ కారణం ధర్మాసనం తెలిపింది. ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్పను తీర్చిదిద్దాలని ఆదేశించింది. రామప్ప అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా మారుతోందని కోర్టు తెలిపింది. ఈ కట్టడం చారిత్రకంగా అత్యంత విలువైనదని చెప్పింది.

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుందని వివరించింది. రామప్ప అభివృద్ధి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. కాల పరిమితులు విధించుకొని రామప్ప అభివృద్ధికి పని చేయండి అని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

*link Media ప్రజల పక్షం🖋️*

Tuesday, July 27, 2021

పెట్టుబడిదారులకు పింక్‌ బుక్‌

హైదరాబాద్ : 28/07/2021

పెట్టుబడిదారులకు పింక్‌ బుక్‌

నమస్తే తెలంగాణ మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)
పెట్టుబడిదారులకు పింక్‌ బుక్‌
  • ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌
  • అందుబాటులో రాష్ట్ర సమగ్ర సమాచారం.

తెలంగాణలో పెట్టుబడుల అనుకూలతలతో కూడిన సమగ్ర సమాచారం గల ‘పింక్‌ బుక్‌'(ఇన్వెస్టర్స్‌ గైడ్‌-2021)ను మంగళవారం పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు, వివిధ శాఖల పథకాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులు సంప్రదించాల్సిన కాంటాక్ట్‌ నెంబర్లు తదితర వివరాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈఓడీబీ)లో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ రాష్ర్టాల్లో ఒకటిగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, పింక్‌ బుక్‌ ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, పెట్టుబడిదారులు సంప్రదించాల్సిన కాంటాక్ట్‌ నంబర్లను అందిస్తున్నదని ఈ సందర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు. పెట్టుబడిదారులు తమ భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకొనేందుకు ఈ బుక్‌ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఈవోడీబీని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందన్నారు.

పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలతోపాటు పరిశ్రమలకు అవసరమైన నిరంతర విద్యుత్‌ సరఫరా, వనరులు, నైపుణ్యంగల సిబ్బంది అవసరమని, ఇవన్నీ తెలంగాణలో సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తులు, అనుమతుల్లో పారదర్శకతను పెంపొందించడంతోపాటు ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈవోడీబీ ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ పింక్‌ బుక్‌ను ప్రతిఏటా తాము అప్‌డేట్‌ చేస్తామని వివరించారు. ఈవోడీబీలో రాష్ట్రం దేశంలోని మూడు టాప్‌ స్టేట్‌లలో స్థానం సంపాదించినట్లు గుర్తుచేస్తూ, మిషన్‌ భగీరథ, రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌, హరితహారం, టీఎస్‌ ఐ-పాస్‌ తదితర ప్రతిష్ఠాత్మక పథకాలను గురించి వివరించారు. ప్రభుత్వ లక్ష్యాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, కల్పిస్తున్న సౌకర్యాలు, ముఖ్యంగా నిరంతర విద్యుత్‌, నీటి సరఫరా, రోడ్లు, రవాణా సౌకర్యాలు తదితర రాష్ట్రంలో పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల వివరాలను పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రధాన పంటలు, ప్రధాన ఎగుమతులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యాసంస్థలు, భద్రత, ఖనిజాలు, టీఎస్‌ఐఐసీ, జీవశాస్త్ర రంగంలో సాధించిన పురోగతి, ఎలక్ట్రానిక్స్‌ రంగం, విద్యుత్‌ వాహనాలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి వంటి వివరాలు పింక్‌బుక్‌లో పొందుపరిచారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆటోమోటివ్‌ పరిశ్రమ, ఏరోస్పేస్‌-డిఫెన్స్‌, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, ప్లాస్టిక్స్‌ అండ్‌ పాలిమర్స్‌, ఇతర ప్రాజెక్టులు, ఆయా శాఖలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు, సందేహాలు నివృత్తి చేసుకొనేందుకు సంప్రదించాల్సిన కాంటాక్ట్‌ వివరాలను అందించారు. అనంతరం ఈ సమావేశానికి హాజరైన పలువురికి పింక్‌ బుక్‌లను అందజేశారు. రాష్ట్ర పర్యాటక, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఈవీ, ఈఎస్‌ఎస్‌ విభాగాల డైరెక్టర్‌ సుజయ్‌ కారంపురితోపాటు ఎలక్ట్రానిక్స్‌ విభాగానికి చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


It’s like killing the golden goose

Hyderabad : 28/07/2021

It’s like killing the golden goose

Courtesy : PSM Rao BusinessLine
THE HNDU (Twitter)

Why divest stake in LIC, which covers people, uses its funds for economic development, and is huge funds support to govt?

If an enterprise with a ₹5-crore investment fetches a ₹2,500-crore annual dividend, generates ₹6-lakh crore earning, yields ₹10,000 crore tax and helps accumulate ₹31-lakh-crore assets, would it be prudent to sell its stake, even though the social benefits out of that enterprise — like efficiently serving 29 crore people and providing direct employment to 13,00,000 — are no consideration? ‘No, not all’, any diligent entrepreneur would assert.

But the government, which has been garnering all these and many more benefits from the Life Insurance Corporation of India (LIC), is in a hurry to sell a part of its stake. The Cabinet Committee on Economic Affairs gave its in-principle approval for an IPO (Initial Public Offer) and the actual sale is most likely to start during the last quarter of the current fiscal (January-March 2022).

The government maintains that it only wants to go for an IPO and not for a privatisation. But making a dent in the government’s monopoly through the IPO would be nothing but the beginning of the behemoth’s privatisation.

Considering its unparalleled achievements, in terms of not only the enormous social benefits it has generated but the support it has provided to the exchequer during difficult times, does not LIC qualify to be on the top of exclusion list for privatisation? But the enormous potential of the milch cow (LIC’s IPO alone is pencilled in to fetch around ₹1-lakh crore of the ₹1.75-lakh crore disinvestment target) and the urgent need for funds makes the government blind to the damage it is going to cause in the long run. It is not at all reasonable to sell the LIC stake, the family silver, for the fiscal deficit needs.

Even a cursory look at the birth and evolution of LIC shows how ludicrous is the idea of easing monopoly control on it. Private insurance did not work in public interest during the pre- and early post-Independence years. The very first life insurer, Oriental Life Insurance Company, set up in Calcutta in 1818, served only the European community. This and many other foreign companies did not cover Indians’ lives at all. It required concerted efforts by persons like Mutty Lall Seal to make the British companies agree to insure Indians’ lives.

Private frauds

Before nationalisation, 25 insurance companies went into liquidation, 80 did not even file their statutory returns, 245 life and 108 general insurance companies failed the policyholders. The Vivian Bose Commission, set up during Nehru’s time, noted many other irregularities like money laundering and false claims of big business houses and their accommodating sister concerns in the insurance business.

Thus, to protect the public interest, LIC was formed, just with ₹5-crore capital, in 1956, amalgamating 245 private entities, which included 154 Indian and 16 foreign insurance firms and 75 provident fund societies.

Although the capital was enhanced to ₹100 crore, it was not an extra burden; the LIC internally generated the sum. The present increase of ₹25,000 crore authorised capital, too, doesn’t serve any useful purpose so long as the sovereign guarantee to policyholders (Section 37) remains intact. Despite minimal government support and private competition since 1999, LIC’s growth has been phenomenal. Its market share, in terms of number of policies issued, in March 2021 was 81.04 per cent and and by premium amount, 64.74 per cent.

The customer service of LIC has been excellent even in 1993 when MARG’s survey was employed by the RN Malhotra Committee; 97 per cent of the respondents rated the service good/excellent.

LIC has eight zonal offices, 113 divisional offices, 2,048 branches 1,526 satellite offices and 1,178 mini-offices in the country (March 3, 2020). It has branches in Fiji (Suva and Lautoka), Mauritius (Port Louis) and the UK (Wembley) and joint ventures in Bahrain, Nepal, Sri Lanka, Kenya, Saudi Arabia and Bangladesh as also a foreign wholly-owned subsidiary in Singapore.

With its ₹31-lakh-crore balance sheet, LIC is the country’s second-largest financial services institution next only to SBI with ₹39.51-lakh-crore assets. LIC’s sum assured stands at ₹56.86-lakh-crore, has 1,14,498 employees besides 10,80,809 active agents out of a total of 12,08,826 (as of March 31, 2020), which means it provides direct employment to 13.23 lakh persons.

Although the government gets only 5 per cent of the surplus, leaving 95 per cent to the policyholders, it got a dividend of ₹2,697.74 crore in 2019-20. The net total income was ₹6,15,882.94 crore. The taxes LIC paid that year amounted to ₹10,225.24 crore.

Besides being the biggest institutional investor in the country (₹30.70-lakh-crore as of March 31, 2020), LIC gives funds support to the government in a big way. During 2019-20 it subscribed to ₹1,78,717.61-crore worth of Government of India securities and ₹1,28,483.62 crore of State governments’ borrowings. During the same year, it invested ₹52,297.79 crore in the social sector: Power, housing, water supply and sewerage, roads, bridges and railways.

The investments, as of March 31, 2020, in Central, State, social sector and other government guaranteed securities aggregated ₹24.01-lakh crore.

LIC is into various other activities as well: it owns LIC Housing Finance Ltd (with ₹2.10-lakh crore outstanding loans as of March 31, 2020), LIC Mutual Fund Asset Management Company Ltd, LIC Pension Fund Ltd, LIC Cards Services Ltd and IDBI Bank.

Disinvestment support

At least one thing that should deter the government from the LIC disinvestment is the support it gets for its the other PSU disinvestments; LIC purchases a substantial portion of the stake in other PSUs. LIC was allotted 4.4 per cent of the 5 per cent divested in ONGC in 2012; 60 per cent (₹6,000 crore) of the NMDC’s stake (of ₹9,928 crore) in 2009-10; and ₹4,263 crore of NTPC’s ₹8,480 crore.

Other purchases include: SAIL (71 per cent in 2013), BHEL (₹2,685 crore in 2014), Coal India Ltd (₹7,000 crore), Indian Oil Corporation (₹8,000 crore) and GIC (₹8,000 crore) in 2015; New India Assurance Company (₹6,500 crore, 2017) and HAL (₹2,900 crore, 2018). Also, LIC bought 51 per cent of the stake in the beleaguered IDBI Bank in 2019.

Thus, LIC is not only providing efficient life insurance service to the people but utilising people’s money for the country’s economic development besides giving huge funds support to the government.

So, the present government has no right to sell the stake without the approval of the people, in general, and the workforce of the organisation, in particular. It is not correct for the government to kill the goose that lays the golden eggs or the kamadhenu that fulfils all its wishes.

The writer is a development economist and commentator on economic and social affairs