Wednesday, September 30, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 01/10/2020

*తెలంగాణ లో కొత్తగా 2,214 కరోనా  కేసులు*
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి 8గంటల వరకు 54,443 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,214 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,93,600కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1135కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,474 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,63,407కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,058 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,702 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 30,50,444కి చేరింది.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

GHMC ఎన్నికలు - బ్యాలెట్ లేదు EVM ???

హైదరాబాద్ : 01/10/2020

*బ్యాలెట్ తోనే  జిహెచ్ఎంసి పోరు!*

*ఈవీఎంలతో ఎన్నికలు సాధ్యం కాదని భావిస్తున్న ఎస్‌ఈసీ*

*రెండు, మూడ్రోజుల్లో అధికారిక ప్రకటన!*

*బ్యాలెట్‌వైపే టీఆర్‌ఎస్‌ మొగ్గు.. ఈవీఎంలే మేలంటున్న బీజేపీ*

*ముందే నిర్ణయించాక అభిప్రాయాలడిగి ఏం లాభమన్న కాంగ్రెస్‌*
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతోనే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణకు తగిన సంఖ్యలో వీవీప్యాట్‌ మెషీన్లు అందుబాటులో లేనందున వాటితో సాధ్యం కాకపోవచ్చుననే నిర్ధారణకు ఎస్‌ఈసీ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతీ ఈవీఎం మెషీన్‌కు వీవీప్యాట్‌ను జతచేయాలన్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు అనుగుణంగా బ్యాలెట్‌ పేపర్ల వైపే మొగ్గు చూపుతున్నట్టు ' ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి.
వీవీప్యాట్‌లను సరఫరా చేయాలంటూ ఇదివరకే ఈసీఐఎల్, బెల్‌ కంపెనీలను ఎస్‌ఈసీ కోర గా, అవి అనుమతి కోసం ఈసీకి రాశాయి. ఈసీ నుంచి అనుమతి లభించి, ఆ కంపెనీలు ఈ ఎన్నికలకు అవసరమైన సంఖ్యలో వీవీప్యాట్‌ యంత్రాలు తయారు చేసేప్పటికి కాలాతీతమౌతుందనే అభిప్రాయంతో ఎస్‌ఈసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే బ్యా లెట్‌ బాక్స్‌లతోనే ఎన్నికలకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే దీనిపై రెండు, మూడ్రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
ముగిసిన గడువు..
త్వరలోనే ఈసీ, జీహెచ్‌ఎంసీ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల అభిప్రాయాలు కూడా ఎస్‌ఈసీ తీసుకోనుంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు ఏ విధానమైతే సులభంగా ఉంటుందన్న దానిపై స్పష్టతనివ్వాలని కోరినట్టు తెలిసింది. ఈ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లు లేదా ఈవీఎంలతో నిర్వహించాలన్న దానిపై అభిప్రాయాలు తెలపాలంటూ రాజకీయ పార్టీలను ఎస్‌ఈసీ కోరిన గడువు కూడా బుధవారంతో ముగిసింది. టీఆర్‌ఎస్‌తో పలు పార్టీలు బ్యాలెట్‌ పేపర్ల వైపే మొగ్గుచూపగా, బీజేపీ మాత్రం ఈవీఎంలతోనే నిర్వహించాలని సూచించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మాత్రం ఏ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనమో ఎస్‌ఈసీ చెప్పకుండా, ముందుగానే బ్యాలెట్లతో నిర్వహించాలని నిర్ణయించి రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరడంలో ఔచిత్యమేంటని ప్రశ్నించింది. ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహిస్తే ఓటర్లకు రిస్క్‌ తక్కువగా ఉంటుందన్న దానిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఎస్‌ఈసీ చెబితే దానిపై తమ నిర్ణయం చెబుతామంటూ టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్‌ కమిటీ బుధవారం లేఖను పంపింది.
*రెండింటిలోనూ రిస్కే..*

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈవీఎం లేదా బ్యాలెట్‌ పత్రాలు.. ఏ రకంగా ఎన్నికలు నిర్వహించినా రిస్కేనని, ఈ రెండు పద్ధతుల్లోనూ సానుకూల, వ్యతిరేక అంశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఓటర్‌కు కోవిడ్‌ ఉన్నా లక్షణాలు కనిపించని అసింప్టమేటిక్‌గా ఉంటే ఏ విధానంలో నిర్వహించినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతరులకు సోకే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అదీగాకుండా కెమికల్స్‌తో ప్రింట్‌ చేసిన న్యూస్‌ పేపర్‌ లేదా బ్యాలెట్‌ పేపర్‌పై వైరస్‌ ఎక్కువ సేపుండే అవకాశాలు తక్కువనేది ఇప్పటికే స్పష్టమైనందున ఆ పద్ధతి వైపే ఎస్‌ఈసీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
*ఎన్నికలు ఎప్పుడు..?*

ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడుంటాయన్న దానిపై ఇంకా ఎస్‌ఈసీ స్పష్టతనివ్వడం లేదు. ప్రభుత్వం నుంచి వార్డుల వారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల నివేదిక అందగానే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎన్నికలు జరిపేందుకు అవసరమైన వివిధ ప్రక్రియలను పూర్తి చేయడంలో నిమగ్నమైనట్టు తెలిపాయి. జీహెచ్‌ఎంసీ పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున వచ్చే ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించే వీలుంది. దీన్ని బట్టి నవంబర్‌ 2, 3వ వారం నుంచి డిసెంబర్‌ చివరివరకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలున్నాయి. సంక్రాంతి పండుగ ముగిశాక వచ్చే మంచి రోజుల్లో ఎన్నికలు జరపాలనుకుంటే మాత్రం జనవరి 15 నుంచి 25వ తేదీల మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టుగా అంచనా వేస్తున్నారు.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

GHMC ఎన్నికలు - కేటీఆర్

హైదరాబాద్ : 30/09/2020

*బ్రేకింగ్ న్యూస్*

నవంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని నేను అన్నట్టు *కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి*. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండవ వారం తరువాత *ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక  పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది.*

*ఎన్నికల షెడ్యూల్ మరియు నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమీషన్ పరిధిలోని అంశం. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది.*

*Source*:
@KTRTRS

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com

https://prajasankalpam1.blogspot.com/ 

Monday, September 28, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 29/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2,072 కరోనా కేసులు*

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 54,308 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,072 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,89,283కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,116కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,259 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,58,690కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,477 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,934మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 29,40,642కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 28/09/2020

*తెలంగాణ లో కొత్తగా 1,378 కరోనా  కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1,378 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,87,211కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 7 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1107కి చేరింది. ఆదివారం 1,932 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా..ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,56,431కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,673 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వీరిలో 24,054 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 254 మందికి కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

Saturday, September 26, 2020

GHMC పరిధిలో చెరువులను కాపాడుకుందాం

హైదరాబాద్ : 27/09/2020

*ఆంధ్రజ్యోతి మీడియా ప్రతినిధి సురేష్ అన్న గారికి ధన్యవాదములు 🙏*

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ కరోనా పరీక్షలు

Hyderabad : 27/09/2020

Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 27.09.2020)

TelanganaFightsCorona
StayHome #StaySafe

*Source*:
@Eatala_Rajender

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/

చెరువు విషయం కోర్ట్ లో ఉండగా చెరువుకు గండి కొడుతున్న GHMC సిబ్బంది

హైదరాబాద్ : 26/09/2020

*బ్రేకింగ్ న్యూస్*

మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న చెరువులో GHMC సిబ్బంది చెరువు కు గండి పెడుతున్నారు. అసలు చెరువుకు గండి పెట్టే అవసరం ఎందుకు వచ్చింది GHMC అధికారులు తెలుపాలి. 
*ప్రస్తుతం కోర్ట్ లో చిన్న, పెద్ద చెరువుల మీద విచారణ జరుగుతుంది అది తెలిసి కూడా అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారు ???*

*GHMC అధికారులకు ప్రజా సంకల్పం & link Media ద్వారా అడుగుతున్నాము మీరు రామంతాపూర్ పెద్ద చెరువులోకి వర్షం నీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చే మంచినీటిని అడ్డుకున్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా చెరువును నాశనం చేస్తున్నారు, దీనికి సమాధానం చెప్పాలి*

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

Friday, September 25, 2020

GHMC చెరువులు కబ్జాలు ప్రభుత్వం నిర్లక్ష్యం

హైదరాబాద్ : 26/09/2020

*Dr లుబ్న సర్వత్ మేడం* గారి ఆధ్వర్యంలో *ప్రజా సంకల్పం & గంగపుత్ర సంఘం & పట్నం స్వచ్చందసంస్థ*  *చెరువులను కాపాడుకుందాం* ఉద్యమం లో భాగంగా *ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ చెరువుల* గురించి కూడా ఈరోజు *V6 వెలుగు మీడియా* సిటీ బ్యూరో వారు  శీర్షిక (విశ్లేషణ) ఇచ్చినందుకు ధన్యవాదములు తెలుపుతున్నాము.

*వెలుగు* మీడియా సిటీ బ్యూరో కిరణ్ గారికి & బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

Thursday, September 24, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 25/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2,381 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 57,621 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,381 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,81,627కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1080కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,021 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,50,160కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,382 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,592 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 27,41,836కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Wednesday, September 23, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 24/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2,176 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 2,176 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,79,246కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,004 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,48,139కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,037 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,929 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

తెలంగాణ పాలిటెక్నిక్ సీట్ల కేటాయింపు

హైదరాబాద్ : 23/09/2020

*పాలిటెక్నిక్ మొదటి విడత సీట్లు కేటాయింపు*
తెలంగాణ పాలిటెక్నిక్‌ మొదటి విడత సీట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 71.14 శాతం సీట్లు మొదటి విడతలో భర్తీచేశారు. మరో 8,948 సీట్లు మిగిలినట్లు సాంకేతిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది పాలీసెట్‌లో 45,207 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 27,759 మంది మాత్రమే వెబ్‌ఆప్షన్లు ఇచ్చారు.
విద్యార్థులు సీటు కేటాయింపు ఉత్తర్వులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ సూచించారు. ఈనెల 26 వరకు ఆన్‌లైన్‌లోనే బోధనా రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు. అక్టోబరు 5, 6 తేదీల్లో కళాశాలలకు వెళ్లి చేరాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అక్టోబరు 7న విద్యా సంవత్సరం ప్రారంభించి 14 వరకు ఓరియెంటేషన్ నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 15 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Tuesday, September 22, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 23/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2,296కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 2,278 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,77,070 చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,062కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,062 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,46,135 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,873 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,527 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

సుజీవన్ వావిలాల🖋️ 
ప్రజల పక్షం 

బాపట్ల కృష్ణమోహన్ 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Monday, September 21, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 22/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2,166 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,166 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,74,774కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,052కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,143 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,44,073 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,649 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 22,620 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 309 కరోనా కేసులు నమోదయ్యాయి.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ రెవిన్యూ ధరణి పోర్టల్ రేపు విడుదల

హైదరాబాద్ : 21/09/2020

దేశంలోనే మొదటిసారిగా, విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి *ధరణి* పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం శ్రీ కేసీఆర్ ఆకాంక్షించారు.

*ధరణి పోర్టల్* రూపకల్పన పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు *ఈ సమావేశానికి సమగ్ర సమాచారంతో రావాలని సీఎం ఆదేశించారు*.

*Source*:
@TelanganaCMO

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

తెలంగాణ ఉన్నత విద్యామండలి వారి సమాచారం

హైదరాబాద్ : 21/09/2020

*దోస్త్ మొదటి దశ సీట్ల కేటాయింపు...... !*
దోస్త్‌-2020లో భాగంగా మొదటి దశ సీట్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి కేటాయించింది. రాష్ట్రంలో 1,41,340 మంది విద్యార్థులకు మొదటి దశలో డిగ్రీ సీట్లు కేటాయించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. 1,71,275 మంది విద్యార్థులు దోస్త్‌లో నమోదు చేసుకున్నారన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 26 వరకు దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తర్వాత రెండో విడతలో వెబ్‌ఆప్షన్లు ఇవ్వొచ్చన్నారు. నేటి నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని లింబాద్రి స్పష్టం చేశారు.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

తల్లి తండ్రులకు సూచనలు

Hyderabad : 21/09/2020

Ensure your children are not misusing your debit/credit cards online. Take necessary precautions before it's too late.

SwachhSocialMedia
CyberSafety

*Source*:
@DigitalMediaTS

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/

Sunday, September 20, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 21/09/2020

*తెలంగాణ లో కొత్తగా 1,302కరోనా కేసులు*

*జీహెచ్‌ఎంసీ పరిథిలో 266 మందికి పాజిటివ్‌*
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం 31,095 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,302 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,72,608కి చేరింది.మహమ్మారితో నిన్న ఒక్కరోజే 9 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1042గా ఉంది. తాజాగా 2,330 మంది వైరస్‌ నుంచి కోలుకొను డిశ్చార్జికాగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,41,930గా ఉంది. మరోవైపు రాష్ట్రంలో 29,636 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిథిలో 266 కేసులు నమోదుకాగా, కరీంనగర్‌లో 102, రంగారెడ్డిలో 98, సిద్దిపేటలో 92,నల్గొండలో 70,మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి

హైదరాబాద్ : 21/09/2020

*ప్రజల మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ సర్ వర్ధంతి సందర్బంగా ప్రజా సంకల్పం & link Media  ఘననివాళులు అర్పిస్తోంది*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

Saturday, September 19, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 20/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2,137 కరోనా  కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 53,811 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,137 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,71,306కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1033కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,192 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,39,700కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,573 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,019 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 24,88,220కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

మృత్యు ద్వారాలు

హైదరాబాద్ : 20/09/2020

https://twitter.com/Praja_Snklpm/status/1307507243764441088?s=08

*ప్రజా సంకల్పం & link Media 20/09/2020*

https://prajasankalpam1.blogspot.com/

Friday, September 18, 2020

నల్లగొండ ప్లోరైడ్ బాధితుల బాధలు

https://twitter.com/Praja_Snklpm/status/1307189699614662657?s=08
హైదరాబాద్ : 19/09/2020

*నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులను మోసం చేసిన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు. ఇలా ఇంకెన్నాళ్లు ఫ్లోరైడ్ బాధిత ప్రజలను మోసం చేస్తారు అని ప్రజా సంకల్పం & link Media ప్రభుత్వాలను అడుగుతుంది*

బాపట్ల కృష్ణమోహన్ 
prajasankalpam1@gmail.om

https://prajasankalpam1.blogspot.com/

సోషల్ మీడియా తో జర భద్రం

హైదరాబాద్ : 18/09/2020

*సోషల్ మీడియాతో జర భద్రం.!*

*తల్లితండ్రులకు సూచనలు*.
#SafeSocialMedia #CyberSafety #Parenting

*Source*:
@DigitalMediaTS

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

Thursday, September 17, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 18/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2,043 కరోనా  కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 50,6344 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,043 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,67,046కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1016కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,802 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,35,357కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,673 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,081 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 23,79,950కి చేరింది.
సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

LRS -తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ : 17/09/2020

*తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు*

*ఎల్‌ఆర్‌ఎస్‌ రాజ్యాంగబద్ధతపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది*. అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణను సవాల్‌ చేస్తూ *ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌* దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఎల్‌ఆర్‌ఎస్‌ పలు చట్టాలకు విరుద్ధంగా ఉందని, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్‌ చట్టాల్లో క్రమబద్ధీకరణకు అవకాశం లేదని పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది సత్యం రెడ్డి వాదించారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు రెండు వారాలు గడువు ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ కోరారు. అయితే ఇప్పటి వరకు ప్రక్రియను ఆపాలని లేదా తుది తీర్పునకు లోబడి ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్‌ ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ వైఖరి తెలుసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 8కి వాయిదా వేసింది.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

తెలంగాణ కొత్త LRS - పేద ప్రజలకు పాట్లు

హైదరాబాద్ : 17/09/2020

*అసెంబ్లీ సాక్షిగా KTR,LRS పైన మోసపూరిత ప్రకటన*
----------------------------------------
2015 లో,Go,no.151 LRS చార్జీల కు
ప్రస్తుత Go,no.131 LRS పెంచిన LRS
చార్జీలు,రు,3000 లోపు మార్కెట్ వ్యాల్యువ్ ఉన్న ప్లాట్స్ కు కేవలం 500 నుండి,3000 రూపాయలు మాత్రమే తగ్గించారు,ఇవి కూడా కొత్త Go,131 లొ పెంచిన చార్జీలు మాత్రమే, *ఇంకో పెద్ద మోసం ఏమిటి అంటే ఇంతకు ముందు HMDA లిమిట్స్ లో ఉన్న లేఅవుట్ల కు మాత్రమే LRS వర్తించేది ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని LRS కిందికి తీసుక వచ్చారు* 

*పేద మధ్య తరగతి ప్రజలను దోచుకోవడానికి ఇది ఎత్తుగడ,,* LRS రూపాన వసూలు చేసిన మొత్తాన్ని,ఆయా లేఅవుట్ ల పైన కర్చు పెట్టాలి, *ఈ నిధులు ఇతర అవసరాలకు మళ్ళించ కూడదు*,అట్లా చేస్తే కోర్టుకు వెల్లుతాము,LRS లేని ప్లాట్స్ కూడా రిజిస్టర్ చేయాలి,లేదా రిజిస్ట్రేషన్ సమయంలో నే LRS చార్జీలు తీసుకొని రిజిస్టర్ చేయాలి
*పేద,మద్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టు కొని,1రుపాయకో,5000వేల కో,పది వేల కో LRS ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం*,చేయనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ము.

*ఇట్లు*
నార గొని ప్రవీణ్ కుమార్ (అధ్యక్షులు)
తెలంగాణ స్టేట్ రియాల్టర్స్  అసోసియేషన్

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, September 16, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 17/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2159 కరోనా  కేసులు*

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 53,094 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,159 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1005కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,108 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,33,555కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,674 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 23,29,316కి చేరింది.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

GHMC అధికారులకు ఇన్ని రోజులు ప్రజా సమస్యల మీద ఎందుకు ద్రుష్టి పెట్టలేదు

హైదరాబాద్ : 17/09/2020

GHMC LB నగర్ జోనల్ కమీషనర్ గారికి ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ చెరువులు గురించి గత సంవత్సరం వినతి పత్రం ఇవ్వగా ఇంతవరకు స్పందించలేదు.ఇలాంటి అధికారులు ఇప్పుడు GHMC ఎన్నికలు వస్తున్నాయి అని అభివృద్ధి గురించి మాట్లాడుతారా ???. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబు దారి తనంగా పనిచేయాలి *Public Servants* అది మరిచిపోతున్నారు.

*ఇప్పటి నుంచి ప్రజా సంకల్పం & link Media లీగల్  సభ్యులు అధికారుల పని తీరు మీద ద్రుష్టి పెట్టి న్యాయ పరమైన చర్యలు తీసుకోబోతున్నారు*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

LRS సవరణలు - కేటీఆర్

హైదరాబాద్ : 16/09/2020

*బ్రేకింగ్ న్యూస్ **

*ప్రజల నుండి, నాయకుల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రభుత్వానికి చేరింది.*

*LRS మీద ఇచ్చిన జీవో 131 సవరిస్తాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న నాడు ఉన్న భూమి విలువ ఆధారంగానే LRS రుసుము.*

- *మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్-@KTRTRS.*   @CommissionrGHMC @arvindkumar_ias @GHMCOnline    @TelanganaCMO

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

Tuesday, September 15, 2020

తెలంగాణ ప్రభుత్వం + LRS = పేదోడి కష్టాలు

హైదరాబాద్ : 16/09/2020

*ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ*
---------------------------------------
అయ్యా
ముఖ్యమంత్రి గారు
LRS మేము కట్టలేము,నూటికి 80శాతం ప్రజలమైన మేము
పేద,మధ్యతరగతి ప్రజల ము,వంశ పరం పరంగ వచ్చినవి లేదా కష్టం చేసి కూడ పెట్టుకున్న పైసలతో 60గజాలో,100 గజాలో,200 ఇల్లు కట్టు కోడానికో కొనుకున్నాము,వాటిని దొంగ వని,అక్రమమైనవి అని ప్రజలను అంటూ,పైసలు కడితే సక్రమం చేస్తా అంటున్నారు,ఐదో,పదో తీసుకొని సక్రమం చేయ లేరా సారు,మీ మేధావి తనాన్ని ఉపయోగించి, నెలకు ఐదు వేల నుండి ముప్పై వేలు సంపాదించటం మాకు చాలా కష్టం లక్షలకు లక్షలు LRS కు  యెట్లా కడుతాము సార్,ఈ విషయం మీకు మీ మంత్రులకు,మీ అధికారులకు తట్టనే లేదా? *మీరంటే నెలకు నాలుగు లక్షలకు పైగా జీతం తీసుకొని పని చేసే గొప్ప ప్రజా సేవకులు,నాలుగు వందల యేక రాలు ఉన్న భూస్వామి,బినామీ ల పెర ఎంతుందో మాకు తెలవదు సార్*,మీరు ఇలాంటి LRS లు ఎన్నైనా కట్టగలరు, *ఇక మీ మంత్రులు,ఎమ్మెల్యే లు,మీ పాలనలో వందల ఏకరాలూ కూడ బెట్టు కున్నారు,బువ్వకు లేనొడు కూడా భూస్వామి అయిండు,మీ అధికారులు అమ్యమ్యలు తీసుకొని ఆస్తులు బాగానే కూడ బెట్టుకున్నారు*,వాళ్ళు కట్ట గలర్ సారు,మీకు *ఈ సలహా ఇచ్చిన అధికారి పేరు చెప్పండి సార్ వారికి ప్రజలు సన్మానం చేయాలనుకుంటున్నారు*,అవును సార్ మరి ఈ అక్రమ లేవుట్ల లోని ప్లాట్ల కు,LRS తో వసూలు చేసిన పైసలు అదే లేఅవుట్ లో సదుపాయాలకు,కర్చుపెడుతారా సార్,ఒక్క పైసా,కూడా ఇంకో రంగానికి మల్లించ కూడదు,అదైనా చెప్పండి సార్,మీరు అసలే మాట తప్పని మనిషి, తలైనా నర్కుంటారు కాని మాట తప్పరని మాకు బాగా తెలుసు,అవును సార్ LRS ఉంటేనే రిజిస్టర్ చేస్తామని చెప్పడం బయ పెట్టడం చట్ట విరుద్ధం సార్,మీ అధికారులు మీరు అబాసుపాలవుతారు,నవ్వుల పాలవుతారు సార్,ప్రజలకు న్యాయం చేయడానికి కోర్టులు ఉన్నాయి సార్,తెలంగాణ పోరాటం లో,తెలంగాణ కోసం పాడిన వారు,ఆడిన వారు,పాటలు రాసిన వారు,మీరు పెట్టే పదవుల బిక్సకో, పైసల బీక్సకో,మీ పాదాల చెంత సిగ్గు లేకుండా వాలి పోయారు,మీకు,ప్రజలకు మద్య సైంధవులు గా, శికండి లుగా గళం విప్పకుండా బ్రతుకు చున్నారు,LRS చార్జీల పైన,వివిధ పార్టీల నాయకులు,ప్రజాసంఘాలు,మీకు బయపడి గళం విప్పడం లేదు,ఎందుకంటే వారికథ మీరు బయట పెడతారని బయ్యం, ఆకరిగా సార్ LRS మేము కట్టలేము,కావాలంటే మా ప్లాట్లను మీరు మీ మంత్రులు ఎమ్మెల్యే లు,అధికారులు తీసుకోండి దొరా నీ బాంచెన్ కాలుమొక్కుతాం,ఇట్లు మీకు ఓట్లు వేసిన అమాయక ప్రజల ము🔥😭😭😭😭😭😭😭😭😭😭😭

*Source*
నార గొని మాట నవతరానికి బాట

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

పాదచారుల భద్రత - షార్ట్ film by Arkadas films & Praja Sankalpam

హైదరాబాద్ : 16/09/2020

సైబరాబాద్ పోలీస్ అధికారులకు నమస్కారం 🙏. 
పాదచారుల భద్రత -షార్ట్ ఫిల్మ్ Arkadas filims వారు చేయడం జరిగింది. ఇప్పుడు ట్విట్టర్ లో link పంపిస్తున్నాము 
https://drive.google.com/file/d/1nuDI0zWFT0Yu-SINGx5WDMM1q7lz69Bj/view?usp=sharing

https://prajasankalpam1.blogspot.com/

రాజకీయ పార్టీలు - యువత

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ ఉన్నత న్యాయస్థానం - డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షల క్లారిటీ

హైదరాబాద్ : 15/09/2020

*చివరి సెమిస్టర్ పరీక్షలపై హై కోర్ట్ క్లారిటీ.... !*

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలపై నెలకొన్న అయోమయం తొలగిపోయింది. సెమిస్టర్‌ పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చివరి పరీక్షకు ఎప్పటిలాగే రాతపరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. అటానమస్‌ కళాశాలలు వారికి అనుకూలమైన విధానంలో పరీక్షలు జరుపుకోవచ్చని సూచించింది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్‌గా పాసైనట్టు పరిగణిస్తామని స్పష్టం చేసింది.
అయితే, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయో స్పష్టత ఇస్తే..

విద్యార్థులు దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారని ఎన్‌ఎస్‌యూఐ తరఫు న్యాయవాది దామోదర్‌ రెడ్డి కోరగా.. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది ఆయా శాఖలు నిర్ణయిస్తాయని, దానిపై ఇప్పుడే హామీ ఇవ్వలేమని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. దీనిపై వివరణ ఇచ్చిన జేఎన్‌టీయూహెచ్‌.. రెండు నెలల్లోపు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

పరీక్షలను కరోనా జాగ్రత్తలో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. దీంతో పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయాలు సిద్ధమవుతున్నాయి. రేపటి నుంచి జేఎన్‌టీయూహెచ్‌.. ఎల్లుండి నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Monday, September 14, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 15/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2,058 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 51,247 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,058 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,60,571కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 984కి చేరింది. కరోనాబారి నిన్న ఒక్క రోజే 2,180 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,29,187కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,400 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,534 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 22,20,586కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

తెలంగాణ లో LRS పై హై కోర్ట్ లో పిటిషన్

హైదరాబాద్ : 14/09/2020

*ఎల్ఆర్ఎస్ పై హైకోర్టులో పిటిషన్*

ఎల్‌ఆర్‌ఎస్‌ ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది.. కరోనా సమయంలో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌పై.. కరోనా కంటే ఎక్కువ చర్చ సాగుతోంది.. అయితే, ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి... ఎల్‌ఆర్‌ఎస్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమైన ఎంపీ కోమటిరెడ్డి.. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు నష్టాలపాలు అవుతారు.. ఎప్పుడో తీసుకున్న స్థలానికి మళ్ళీ డబ్బులు కట్టలేరని వివరిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కోమటిరెడ్డి పిటిషన్‌ వేశారు. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన మరియు ఆమోదించబడని లేఅవుట్లను నిరోధించడానికి ప్రభుత్వ నియమాలు నిబంధనలను జారీ చేసింది..
కానీ, పేద, మధ్య తరగతి ప్రజలు వారి తప్పు లేకున్న భారీ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాన్య ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లు వారి కష్టపడి సంపాదించినవి.. ఇప్పుడు వారిపై ఇంత భారీ జరిమానా విధించడం ఏంటి? అని ప్రశ్నించారు.
ఎప్పుడో కొన్న ప్లాట్ యొక్క కొనుగోలు ధరలో దాదాపు సగం మళ్లీ కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ కోమటిరెడ్డి.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక వేల ఎకరాల భూములు వెంచర్లుగా మారాయి.. సుమారు 3-5 లక్షల ప్లాట్లు అమ్ముడయ్యాయి.. అవి అన్ని చట్టవిరుద్ధమని ప్రకటించబడ్డాయన్నారు. కానీ, అనుమతి లేని లే అవుట్లకు పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులదే అన్నారు కోమటిరెడ్డి.. అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందన్న ఆయన.. అధికారులు పాటించని తప్పుకు సామాన్య ప్రజలపై భారీ జరిమానా విధించడం సరికాదన్నారు. సాధారణ ప్రజల భూములను రిజిస్ట్రేషన్ చేయడాన్ని నిషేధించే నిబంధనలు 2020 జారీ చేయడం రిజిస్ట్రేషన్ చట్టానికే విరుద్ధమని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీ.. చట్టాలను పాటించకుండా అటువంటి అనుమతులు మంజూరు చేసిన అప్పటి అధికారులపై చర్య తీసుకోవాలన్న ఆయన.. ఎలాంటి జరిమానా ఛార్జీలు మరియు రిజిస్ట్రేషన్లను ఆపకుండా రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

Sunday, September 13, 2020

రోడ్లు ప్రమాదాలు - సైబరాబాద్ పోలీసుల వినూత్న ప్రయత్నం

హైదరాబాద్ : 14/09/2020

*అగో సైబరాబాద్ పోలీసోళ్ళు రోడ్డు పై నడిచేటోళ్ల భద్రత కోసం అవగాహన కల్పించనికీ చిన్న సైన్మాల పోటీ పెట్టినరు*. అందరు మంచి *సైన్మా తీసి పంపండి* మరి.
రోడ్డు పై ఎట్టా నడవాలో తెలియక చాలా ప్రాణాలు పోతున్నాయి. *వాళ్లందరికీ ప్రాణాలు కాపాడినోళ్లు అవుతారు. గెలిచినోళ్ళకి మస్త్ డబ్బులు వస్తాయి.*

@CYBTRAFFIC

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 14/09/2020

*తెలంగాణ లో కొత్తగా 1,417 కరోనా  కేసులు*

తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం 34,426 మందికి పరీక్షలు నిర్వహించగా 1,417 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 264 మందికి కొత్తగా కరోనా సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 974కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,153కి చేరింది.వ్యాధి బారిన పడినవారిలో మరో 2,479 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 1,27,007 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,532 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్దరణ -CYBTRAFFIC

హైదరాబాద్ : 14/09/2020

*మీ ప్రస్తుత చిరునామా,ఫోన్ నంబర్ మార్చుకోవడం తప్పనిసరి.*
మార్చుకోవడానికి RTA కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఆన్ లైన్లోనే మార్చుకోవచ్చు.

@CYBTRAFFIC

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

నీట్ పరీక్ష నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజలకు ఇబ్బందులు

హైదరాబాద్ : 14/09/2020

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ లో జరిగిన నీట్ ప్రవేశ పరీక్షకు పరీక్ష కేంద్రాల వద్ద ప్రభుత్వ యంత్రాంగం జాగ్రతలు తీసుకోవడంలో విఫలం అయింది అనడానికి నిదర్శనం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

*ప్రజలకు ఇబ్బందులకు గురిచేసిన పరీక్ష కేంద్రాల నిర్వాహకులపైనా కేసులు నమోదు చేయాలి **

*ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ అధికారులకు ధన్యవాదములు 🙏*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ సర్ గారు యాదాద్రి లో

https://twitter.com/TelanganaCMO/status/1305036470684495873?s=08

*ఓం నమో లక్ష్మినరసింహ స్వామి కి జై 🙏*

*తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి దేవాలయం లో పూజలు నిర్వహిస్తున్నారు ఈ రోజు 13/09/2020*

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, September 12, 2020

Telangana Youngsters in JEE MAINS

Hyderabad : 13/09/2020

*My compliments & warm greetings to the Telangana youngsters who’ve made us all proud with their performance in JEE Main exam 👍*

*Among the 24 students who scored 100 percentile in India, 8 are from Telangana including the girls category topper Chukka Tanuja👏*

*Source*:
@KTRTRS

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/

Fabulous effort 👏 

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 13/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2, 216 కరోనా  కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 56,217 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,216 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,57,096కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 961కి చేరింది. కరోనాబారి నిన్న ఒక్క రోజే 2,603 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,24,528కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,607 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,674 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 21,34,912కి చేరింది.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Friday, September 11, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 12/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2,278 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 62,234 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,278 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,54,880కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 950కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

తెలంగాణ రెవిన్యూ సంఘాల నాయకులు మారాలి

హైదరాబాద్ : 12/09/2020

*వీఆర్ఏలకు పే స్కేల్‌తో పాటు వారసత్వ ఉద్యోగాల ప్రకటనపై ధన్యవాదాలు : *ట్రెసా*
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రెవెన్యూ శాఖ సేవలను కొనియాడుతూ రెవెన్యూ ఉద్యోగుల పని తీరును మెచ్చుకోవడం యావత్ రెవెన్యూ ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెరిగిందని *తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) సంతోషం వ్యక్తం చేసింది.* రాబోయే రోజుల్లో రైతులు, ప్రజల సంక్షేమం కోసం రెవెన్యూ శాఖ రెట్టింపు ఉత్సాహం తో పని చేస్తుందని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తమపై పట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని ప్రకటించారు. ట్రెసా విజ్ఞప్తి మేరకు వీఆర్ఏ లకు పూర్తి వేతనంతో పాటు వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

*ప్రజా సంకల్పం & link Media ద్వారా ట్రెసా ప్రతినిధులను అడుగుతున్నాను మీ అధికారులు లంచాలు తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడి దేశం మొత్తంలో చర్చ జరిగినా మీరు ఎందుకు స్పందించలేదు ??.. రైతులు మీ అధికారుల నిర్లక్ష్యంతో ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు స్పందించలేదు ??  ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని పొగడడానికి ముందుకు వచ్చారా ??  ఇదెక్కడి న్యాయం?? మారాలి ట్రెసా ప్రతినిధులారా మారాలి మీరు*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/