Sunday, August 15, 2021

Justice NV Ramana: పార్లమెంటులో చర్చలపై జస్టిస్‌ రమణ కీలక వ్యాఖ్యలు!

హైదరాబాద్ : 15/08/2021

Justice NV Ramana: పార్లమెంటులో చర్చలపై జస్టిస్‌ రమణ కీలక వ్యాఖ్యలు!

Justice NV Ramana: పార్లమెంటులో చర్చలపై జస్టిస్‌ రమణ కీలక వ్యాఖ్యలు!

ఈనాడు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
దిల్లీ: చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంటులో వాటిపై విస్తృత స్థాయి చర్చలు జరగకపోవడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్వం పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చలు జరిగేవని గుర్తుచేశారు. తద్వారా కోర్టులకు వాటిని విశ్లేషించేందుకు వీలుగా ఉండేదన్నారు. ఏ లక్ష్యంతో.. ఎవరిని ఉద్దేశించి.. ఆ చట్టాలను రూపొందించారో న్యాయస్థానాలకు సులువుగా అర్థమయ్యేదన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం సందర్భంగా పార్లమెంటులో జరిగిన చర్చను అందుకు ఉదాహరణగా చెప్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్‌ అండ్‌ బెంచ్ నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘పారిశ్రామిక వివాదాల చట్టంపై పార్లమెంటులో జరిగిన చర్చ నాకు ఇంకా గుర్తుంది. తమిళనాడుకు చెందిన సీపీఎం నేత రామ్మూర్తి ఆ చట్టంపై విస్తృతంగా చర్చించారు. దాని వల్ల కలిగే పరిణామాలు.. శ్రామిక వర్గంపై దాని ప్రభావాన్ని చాలా చక్కగా వివరించారు. ఇలాగే ఇతర చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంలో పూర్తిస్థాయి చర్చలు జరిగేవి. దీనివల్ల ఆయా చట్టాల లక్ష్యం.. ఎవరిని ఉద్దేశించి తయారు చేశారో స్పష్టంగా తెలిసేది. తద్వారా వాటిని విశ్లేషించాల్సి వచ్చినప్పుడు కోర్టులకు పని సులువయ్యేది’’ అని జస్టిస్‌ రమణ తెలిపారు.

కానీ, ప్రస్తుతం పార్లమెంటు చర్చల విషయంలో చాలా ‘విచారకరమైన పరిస్థితులు’ నెలకొన్నాయని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. సరైన చర్చ జరగకుండానే చట్టాలు ఆమోదం పొందుతున్నాయని ఆవేదక వ్యక్తం చేశారు. దీంతో చట్టాలపై గందరగోళం తలెత్తుతోందన్నారు. మేధావులు, న్యాయవాదులు సభలో లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో న్యాయనిపుణులు సామాజిక, ప్రజా జీవితంలో కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇటీవలి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నప్పటికీ.. బిల్లుల ఆమోదం విషయంలో మాత్రం ఫలప్రదమైనట్లు ప్రభుత్వం ప్రకటించుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఏరోజూ సభ సజావుగా సాగనప్పటికీ.. దాదాపు 22 బిల్లులు ఆమోదం పొందడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమైంది. వీటిలో కీలకమైన ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యంగ సవరణ బిల్లు కూడా ఉంది. దీంతోపాటు పన్ను చట్టాల సవరణ, సాధారణ బీమా విధాన(జాతీయీకరణ) సవరణ, జాతీయ ఆహార సాంకేతికత సంస్థ వ్యవస్థాపన, నిర్వహణ, బాలల న్యాయ సంరక్షణ సవరణ బిల్లులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జస్టిస్‌ రమణ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

No comments:

Post a Comment