Friday, August 6, 2021

పాక్ లో హిందూ ఆలయం ధ్వంసం.. చీఫ్ జస్టిస్ స్పందన..!

హైదరాబాద్ : 06/08/2021

పాక్ లో హిందూ ఆలయం ధ్వంసం.. చీఫ్ జస్టిస్ స్పందన..!

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
పాక్ లో హిందూ ఆలయం ధ్వంసం.. చీఫ్ జస్టిస్ స్పందన..!

పాకిస్తాన్ లో హిందూ ఆలయం ధ్వంసంపై అక్కడి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అహ్మద్ విచారం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ సభ్యుడు రమేష్ కుమార్.. చీఫ్ జస్టిస్ ను కలిసి జరిగిందంతా వివరించారు. దీనిపై విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. ఘటనపై అహ్మద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

పాకిస్తాన్, పంజాబ్​ రాష్ట్రం రహీమ్​ యార్​ ఖాన్​ జిల్లాలోని భోంగ్​ నగరంలో బుధవారం ఆలయంపై అల్లరిమూకలు దాడి చేశాయి. గుడిలోకి చొరబడి నిప్పు పెట్టి, విగ్రహాలను ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా ఫార్వార్డ్ అవుతున్నాయి. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భోంగ్ లో దాదాపు వంద హిందూ కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని ఆ కుటుంబాలు భయంతో బతుకుతున్నాయి.

స్థానికంగా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో రేంజర్స్​ ను సైతం రంగంలోకి దింపారు. ఆలయం చుట్టూ మోహరించారు. అల్లరి మూకలు మళ్లీ దాడులు చేయకుండా పహారా కాస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ అహ్మద్ ఘటనపై విచారణ కొనసాగిస్తామని తెలిపారు.

No comments:

Post a Comment