Saturday, September 30, 2023

👉తస్మాత్ జాగ్రత్త...దంపతులకు కాని ఒంటరి మహిళలు కానీ

👉తస్మాత్ జాగ్రత్త

దంపతులు కాని ఒంటరి మహిళలు కానీ వృత్తి పరంగా లేదా విహార యాత్రకో దూర ప్రాంతాలకు వెళ్లి హోటల్ గదుల్లో బసచేయాల్సి రావటం తప్పనిసరవుతుంది......

ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల సౌకర్యాలతో పాటు ఇబ్బందులు కూడా పెరుగు తున్నాయని గుర్తించాలి.......

బసచేసే గదుల్లో, చీకటిలో సైతం చిత్రీకరించగల అత్యాధునిక రహస్య కెమేరాలు బిగించి, అభ్యంతర సన్నివేశాలను నేరస్తులు చిత్రీకరించి అంతర్జాలంలో సొమ్ము చేసుకుంటున్నారు. గుర్తు పట్టలేనంత సూక్ష్మ కెమేరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నేరస్తుల వల్ల ఇబ్బంది పడకుండా ఉండవచ్చు........

మీరు బసచేసే ప్రాంతం గురించి, హోటల్ గురించి ముందుగానే సమాచారం సేకరించి నమ్మకం కుదిరాకే హోటల్ గది బుక్ చేసుకోవాలి.........

ఎంత మంచి పేరున్న హోటలయినా గుడ్డిగా నమ్మి అజాగ్రత్తగా ఉండకండి. హోటల్ యాజమాన్యం మంచిదయినా, పనిచేసే సిబ్బంది నేరపూరిత మనస్తత్వం ఉన్న వాళ్ళు కావచ్చు. ఇంతకు ముందు బసచేసిన కస్టమర్లు కూడా, హోటల్ సిబ్బందికి తెలియకుండా రహస్యంగా కేమేరాలు ఏర్పాటు చేసుకుని, రిమోట్ లొకేషన్ నుంచి చిత్రాలను రికార్డు చేసుకొనేందుకు అవకాశం ఉంది.........

హోటల్ గదుల్లోనే కాకుండా, ట్రయల్ రూమ్స్, మహిళా షేరింగ్ గదుల్లో, రాబందుల వంటి బందువుల ఇళ్ళల్లో కూడా రహస్య కెమేరాలు అమర్చి అభ్యంతర సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం లేకపోలేదు.........

ఇటు వంటి నేరాలకు పురుషులే కాకుండా, సాటి స్త్రీలు కూడ పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. దగ్గరి బంధువులు, స్నేహితులు కూడా అభ్యంతర సన్నివేశాలను రహస్యంగా చిత్రీకరించి, బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది.........

గదిలో ప్రవేశించిన వెంటనే, గదిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫ్లవర్ వాజులను, అలంకారం కోసం ఉంచిన బొమ్మలను, లైట్లను, గోడ గడియారాలను, అవకాశం ఉన్న ఇతర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయ మేమంటే, రహస్య కెమేరాలు అతి సూక్ష్మంగా ఉండి, అలంకారం కోసం ఉంచిన వస్తువుల రంగులతో కలిసిపోయి, గుర్తించలేనంతగా అమరుతాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప కనిపించవు.........

గదిని పూర్తిగా చీకటి చేసి, అంటే లైట్లు, టి.వి లు, ఇతర వెలుగునిచ్చే డివైజులన్నింటిని ఆపి, మీ మొబైల్ ఫోన్ కేమరాతో గది మొత్తం క్షుణ్ణంగా పరిశీలించండి. రహస్య కెమరాల నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ కిరణాలు మిణుకు మిణుకు మంటూ కనిపిస్తాయి...........

మీ పరిశీలనలో ఏమైనా రహస్య కెమేరాలు దొరికి నట్లయితే, ముందుగా మీ మొబైల్ కెమెరాతో ఫొటోలు తీయండి. సాక్ష్యం కోసం పనికి వస్తాయి. హోటల్ యాజమాన్యంకి కాకుండా, డైరెక్టుగా లోకల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి మరో హోటలుకి మారండి. వీలైతే స్థానిక మీడియా దృష్టికి తీసుకు రండి................
Courtesy / Source by : శ్రీమతి రాధిక గారు IPS, SP - శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ 

Friday, September 29, 2023

తెలంగాణ శ్రీ శ్రీ,అభ్యుదయ కవి, దివంగత శ్రీ అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.

తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన ప్రజా కవి, తెలంగాణ శ్రీ శ్రీ గా అభిమానులు పిలుచుకునే తెలంగాణ అభ్యుదయ కవి, దివంగత శ్రీ అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇల్లును కేటాయించి అలిశెట్టి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.

నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీ అలిశెట్టి ప్రభాకర్ చిత్రకారుడుగా, ఫోటోగ్రాఫర్ గా అభ్యుదయ కవిగా సమాజం కోసం నిరంతరం శ్రమించి తన జీవితాన్ని త్యాగం చేసాడు. మనసున్న ప్రతి మనిషిని తన కవిత్వంతో కదిలించినవాడు అలిశెట్టి. 

నాటి ఉమ్మడి పాలనలో సామాన్యులకు జరిగే అన్యాయాలపై కలం పోరాటం చేసిన సృజనాత్మక కవి అలిశెట్టి. దారితప్పిన సామాజిక పోకడలను పదునైన పదాలతో కూడిన సునిశిత వ్యంగ్యంతో సరిదిద్దే ప్రయత్నం చేసినాడు. పేదరికం మీద, మహిళా సమస్యలమీద, పల్లె పట్నం బాధల మీద సమస్త సామాజిక రంగాలలో అసమానతలు, అన్యాయాల మీద తన కవితల బాణాలను గురిపెట్టి కొడుతూ సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాల తరఫున బాధ్యత కలిగిన సైనికుడుగా అక్షర పోరాటం చేసినవాడు అలిశెట్టి. సామాజిక బాధ్యతలే తప్ప తన ఇంటి బాధ్యత, తన వంటి బాధ్యత కూడా పట్టకుండా తన జీవితాన్ని కళకే అంకితం చేసిన త్యాగశీలి అలిశెట్టి.

సమాజం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి తనువు చాలించిన కవి అలిశెట్టి కుటుంబం నేడు పేదరికంలో మగ్గుతుండడం, భార్య భాగ్యమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నదని తెలుసుకున్న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అలిశెట్టి కుటుంబానికి సరియైన విధంగా సహాయం అందించే చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీ @KTRBRS కు ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు మంత్రి కేటిఆర్ వెంటనే స్పందించి శ్రీ అలిశెట్టి ప్రభాకర్ కు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ను ఇప్పించేందుకు తన కార్యాలయాన్ని ఆదేశించారు.

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు దివంగత అలిశెట్టి ప్రభాకర్ భార్య శ్రీమతి భాగ్యమ్మ పేరుతో అసీఫ్ నగర్ లోని జియాగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూంల సముదాయంలో వొకదానిని కేటాయిస్తూ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

తమకు డబుల్ బెడ్ రూం కేటాయించినందుకు అలిశెట్టి ప్రభాకర్  భార్య భాగ్యమ్మ, కుమారులు సంగ్రామ్, సంకేత్ సహా ఇతర కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కు, మంత్రి శ్రీ కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కవిగా తమ తండ్రి త్యాగాలను గుర్తించి తమను కష్టకాలంలో ఆదుకుని తమకో గూడు నిలిపినందుకు సీఎంకు రుణపడి వుంటామని అలిశెట్టి కుమారులు అన్నారు.

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1707779720501449052?t=9WWWa71Red_b87RoqouZCg&s=19

Thursday, September 28, 2023

45ఏళ్లుగా గ్రామం మొత్తంలో ఓకే వినాయకుడిని ప్రతిష్టిస్తారు.

*ఒకే వినాయకుడు ముద్దు...*

*ఐక్యమత్యనికి ప్రతిరూపం లింగారెడ్డి గూడ...*

*కుల మతాలకు అతీతంగా వేడుకలు..*

*వేలంపాటలో లడ్డు దక్కించుకున్న మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్ రెడ్డి..*

*అంబరాన్ని అంటిన సంబరాలు..*

ఒకే గణపతి ముద్దు అంటూ ఆ గ్రామం తీర్మాణం చేసుకుంది.వినాయక చవితి వచ్చిదంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సవాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. నవరాత్రులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పల్లె నుంచి పట్నం వరకు వాడవాడలా సందడి ఉంటుంది. కానీ షాద్ నగర్ నియోజక వర్గం ఫరూఖ్ నగర్ మండలం లింగారెడ్డి గూడ గ్రామం దానికి బిన్నం.బిన్నత్వంలో ఏకత్వానికి నిర్వచనం లింగారెడ్డి గూడ గ్రామ ప్రజల ఐక్యమత్యం. దాదాపు 45ఏళ్లుగా గ్రామం మొత్తంలో ఓకే వినాయకుడిని ప్రతిష్టిస్తారు. ఓకే వినాయకుడిని ప్రతిష్టించి  గణేష్ వేడుకల్లోను తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఊరికి ఒకే విగ్రహం పెట్టాలని మొదలైన తీర్మాణాలు పలు పల్లెలను కదిలిస్తు్న్నాయి. ఒకే విగ్రహం నెలకొల్పేలా స్పూర్తిని నింపుతున్నాయి. లడ్డు వేలంపాటలో మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి 2,25,000 వేలకు వేలం పాటలో లడ్డును కైవసం చేసుకున్నాడు. వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.కులాల మతాలకు అతీతంగా వేడుకలు నిర్వహణ అని ఏక దంతునితో స్పష్టంగా కనిపిస్తుంది..

*CRM...!* (ప్రజల పక్షం)

వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా....?

*వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా....?*

*భక్తి...*
హిందువులు జరుపుకునే పండగల్లో వినాయకచవితి ఒకటి. భాద్రపదమాసం శుక్ల పక్షంలో వచ్చే చవితి తిధి, హస్త నక్షత్రం రోజున మధ్యాహ్న శుభ సమయంలో చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.అయితే ఎవరి శక్తి తగట్టు వాళ్ళు ఒకరోజు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటారు. మొదటి రోజు వినాయక ప్రతిమని మండపంలో ప్రతిష్టించడంతో ప్రారంభమైన పండుగ వినాయకుని ప్రతిమని నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది. అయితే వినాయకుని ప్రతిమలని ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా..? అయితే ఎందుకు నిమజ్జనం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా వినాయకచవితి భాద్రపదమాసంలో అంటే వర్షాకాలంలో వస్తుంది. ఇలా వర్షాకాలంలో జరుపుకోవడం వెనుక చాల కారణాలు ఉన్నాయి. వర్షాకాలంలో వానలు ఎక్కువగా కురవడం వల్ల నదులు, కాలువలు, పొంగి పొరలుతుంటాయి. ఇలా నీరు ఉద్రికతతో ప్రవహించడం వల్ల భూక్షయం ఏర్పడుతుంది. అంటే సారవంతమైన మట్టి కొట్టుకు పోతుంది. వినాయకుని ప్రతిమలని నిమజ్జనం చేయడం వల్ల సారవంతమైన మట్టి తిరిగి నదుల్లో కాలువల్లో చేరుతుంది. అలానే వినాయకుని ప్రతిమని ఆకులతో మరియు పువ్వులతో పసుపు కుంకాలతో పూజించి వినాయకునితో పాటు నీటిలో కలుపుతారు.
అలా వినాయకుణ్ణి పూజచే ఆకులు ఆయుర్వేద గుణాలను ఆకలిగి ఉంటాయి. ఇవి నీటిలో కలపడం వల్ల నీటిలోని సూక్ష్మ క్రిములు నశించి నీరు స్వచంగా మారుతుంది. ఈ నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండావుంటాయి. అలానే వర్షాకాలంలో మనుషుల్లో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. దీనితో జలుబు, దగ్గు, జ్వరం వంటి అనేక వ్యాధులు వచే అవకాశం ఉంది. అలానే జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది. అందుకే ఈ పండుగ రోజుల్లో ఎక్కువగ ఆవిరిపైన ఉడికించిన పౌష్ఠిక విలువులున్న ఆహార పదార్ధాలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటాము. దీనివల్ల మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలానే ఆవిరిపైన ఉడికిన పదార్ధాలు త్వరగా జీర్ణం అవుతాయి. ఇలా జీర్వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

*సుజీవన్ వావిలాల🖋️*

హరిత విప్లవ పితామహుడు... MS స్వామినాథన్ కన్నుమూత..!

*హరిత విప్లవ పితామహుడు... MS స్వామినాథన్ కన్నుమూత..!*

భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్(98) గురువారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు
ఇది భారతదేశంలోని తక్కువ-ఆదాయ రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి ఎంతో సహాయపడింది. స్వామినాథన్ చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించిన తర్వాత 1987లో మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు. అనేక అవార్డులతో పాటు, స్వామినాథన్ రామన్ మెగసెసే అవార్డు (1971) మరియు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు (1986) గ్రహీత. ఆయనకు భార్య మినా మరియు ముగ్గురు కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్ మరియు నిత్యా స్వామినాథన్ ఉన్నారు

*సుజీవన్ వావిలాల*🖋️

Wednesday, September 27, 2023

స్టెప్పులేసిన...వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాధ్

*వినాయక నిమజ్జన వేళ.... స్టెప్పులేసిన.... సీపీ రంగనాధ్*

వరంగల్‌  : సిటీ పరిధిలో వినాయక నిమజ్జనానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పరిధి కాలనీల్లో నిమజ్జన ప్రాంతాలను ముందస్తుగా గుర్తించడంతో పాటు ఆయా వినాయక మండపాల నిర్వాహకులకు సూచనలు చేశారు.కమిషనరేట్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా పోలీస్‌ అధికారులు, సిబ్బందితో కలిసి సీపీ రంగనాథ్‌ స్టెప్పులేశారు. సిబ్బందితో ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

వైకల్య ధ్రువీకరణ పత్రం జారీలో అవకతవకలు.. NPRD

పత్రిక ప్రకటన   27.09.2023

*కరీంనగర్ జిల్లాలో సదరం క్యాంపులో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి*

*బోగస్ సర్టిఫికెట్స్ జారీ చేస్తున్న డాక్టర్లపై కేసు నమోదు చేయాలి*

            *NPRD డిమాండ్* 

 కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాపితంగా సదరం 
క్యాంపులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, స్లాట్ బుక్ చేయడం కోసం డబ్బులు వసూలు చేస్తున్న మీసేవ కేంద్రాలను సీజ్ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది 
       
వైకల్య ధ్రువీకరణ పత్రం పొందాలంటే మీసేవ కేంద్రాలలో స్లాట్ బుక్ చేసిన తర్వాతనే సదరన్ క్యాంపుకు హాజరు కావాల్సి ఉంటుంది దీన్ని ఆసరా చేసుకొని మీసేవ సెంటర్స్ 500 నుండి 5000 రూపాయల వరకు వసూలు చేస్తూ వికలాంగులను మోసం చేస్తున్నారు. మీసేవ సెంటర్ల ద్వారా స్లాట్ బుక్ చేయాలంటే కనీస చార్జ్ మాత్రమే వసూలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా మీసేవ సెంటర్స్ వ్యవహరిస్తున్న అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. వైకల్య ధృవీకరణ పత్రాలు ఇప్పిస్తామని కొంతమంది బ్రోకర్లు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి డాక్టర్లతో కుమ్మక్కై అనరులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారు సదరం క్యాంప్ నిర్వహణ దగ్గర దళారుల పెత్తనం చేస్తున్న క్యాంపు పర్యవేక్షించవలసిన డిఎంహెచ్ఓ ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఒక్కొక్క సర్టిఫికెట్ ఇప్పించేందుకు ఐదువేల నుండి 20వేల వరకు డబ్బులు వసూలు చేస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు సర్టిఫికెట్ కాలపరిమితిని  బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నరు ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, మహబూబ్నగర్తో పాటు సిద్దిపేట నిజామా బాద్, వికారాబాద్, అదిలాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో వికలాంగుల శ్వయంగా సదరo క్యాంపుకు హాజరు అయితే అర్హత ఉన్నప్పటికీ పర్సంటేజ్ తక్కువ వైకల్య శాతం వేసి తిరస్కరిస్తున్నారు. బ్రోకర్ల ద్వారా వెళ్లిన వారికి మాత్రమే వైకల్యం లేకున్నా డబ్బులు తీసుకొని ఎక్కువ వైకల్యం 
శాతం వేసి సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పటికీ నకిలీ వైకాల్య ధ్రువీకరణ పత్రాలతో ప్రమోషన్స్ పొందుతున్నారు. మూగ చెవిటి, మానసిక వికలాంగులకు జిల్లాల్లో సర్టిఫికెట్ జారీ చేయాలంటే కోటి ENT హాస్పిటల్, బోయిన్పల్లి లోని ఎన్ఐఎంహెచ్ కేంద్రాల్లో సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది.దీనికోసం జిల్లాల నుండి వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది తక్షణమే SERP సీఈవో, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా సదరం క్యాంపులలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలనీ , నకిలీ వైకల్య
ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై కేసులు నమోదు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.

కె వెంకట్
 రాష్ట్ర అధ్యక్షులు

యం అడివయ్య
 రాష్ట్ర కార్యదర్శి

అర్ వెంకటేష్
 రాష్ట్ర కోశాధికారి

Courtesy / Source by : NPRD 

తెలంగాణలో కొత్త రెవిన్యూ డివిజన్లు... నేటి నుంచి అమల్లోకి

*తెలంగాణలో కొత్త రెవిన్యూ డివిజన్లు... నేటి నుంచి అమల్లోకి*

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైంది. నల్గొండ జిల్లా చండూరు డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోఫికేషన్ జారీ చేసింది.కొత్త రెవెన్యూ డివిజన్లు బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నల్గొండ జిల్లాలోని చండూరు, మునుగోడు, గట్టుప్పల్‌, నాంపల్లి, మర్రిగూడ మండలాలతో చండూరు డివిజన్‌ ఏర్పాటైంది. కామారెడ్డి జిల్లాలో మహమ్మద్‌ నగర్‌ కొత్త మండలం కూడా ఏర్పాటైంది. గతంలో నిజాంసాగర్‌ మండలంలో ఉన్న 18 గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. మహమ్మద్‌ నగర్‌ మండలం కూడా ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నల్గొండ జిల్లాలో అమ్మనబోలు పేరిట మరో మండలం ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నల్గొండ జిల్లాలోని అమ్మనబోలు, ఉప్పలంచ, యాదాద్రి భువనగరి జిల్లాలోని సూరారం, బీతుర్కపల్లి, కుంకుడుపాముల గ్రామాలతో కొత్త మండలాన్ని ప్రతిపాదించారు. అభ్యంతరాలు, వినతులకు పక్షం రోజుల గడువు ఇచ్చారు. జగిత్యాల జిల్లాలోని తిర్మలాపురం, ఇబ్రహీంనగర్ గ్రామాల పేర్లను మల్లన్నపేట, శ్రీరాములపల్లిగా మార్పు చేశారు. రెండు గ్రామాల పేర్ల మార్పు కూడా ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది.

*సుజీవన్ వావిలాల*🖋️

30 ఏళ్ళ పూర్వం ఆనాటి జీవన శైలి....

30 ఏళ్ళ  పూర్వం ఆనాటి జీవన శైలి....

ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందొం పుల్లలు అని కూడా అనే వారు.

కొంతమంది కచ్చిక,  (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు.

మగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే,  నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.

ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.

కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.

బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది వత్తుల స్టౌ,  పంపు స్టౌ వాడేవారు కిరసనాయిలు ది.

అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు.

ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ  రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు,  ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.

అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.

అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.

బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.

సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ, రాలేకపోతే,  అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం.

రాత్రిపూట7, 8 గంటలకు మాదాకవళం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకవళం అబ్బాయికిచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు.

టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేవి.

పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.

ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.

డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు. గదులు కూడా చాలా పెద్దవి.

3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.

వైద్యం కి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత బన్ను, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్  భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది.  అదే ప్రభుత్వాసుపత్రికి పోతే రంగు రంగుల ఔషథాలిచ్చేవారు.

ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు.  అంతే.   ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు.

పుస్తకాలు ఎప్పుడు, వేరే వాళ్ళు వాడినవే.    పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. క్రితం ఏడు నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.

రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం.  అర్థం అయినా కాకపోయినా, రాత్రి పెందలాడే, నిద్ర.   వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసనకర్రే."*

ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది.  రెండు రూపాయలు పెట్టి,  ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.

అదీ ఆరోజుల్లో జీవన శైలి.
ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు  నిర్వహించేవారు.

అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి 
వారాలబ్బాయిలు వీథి దీపాల చదువులు… మనుషులంత ఒక్కటిగా ఉండే వాళ్ళు.  ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు.

కక్షలూ కార్పణ్యాలు.  కోప తాపాలు కుళ్ళూ కపటం.   ఈర్ష్యా ద్వేషాలు  వాళ్ళకుంది మాకులేదని ఏనాడూ అనుకునే వారే లేరు.   అహంకారం ప్రతీకారం అనేవే తెలీదు అప్పటి జనాలకి.

వెనక్కి తిరిగి చూచుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఇప్పుడున్నన్ని సౌకర్యాలు, విలాసాలు లేకపోయినా, ప్రకృతికి దగ్గరగా, ఆరోగ్యంగా గడచిన రోజులు.

Source from Internet

Tuesday, September 26, 2023

Report on Repeal of #GO111 to MD, Hyderabad Metropolitan Water Board #HMWSSB

https://twitter.com/Praja_Snklpm/status/1706667209593073849?t=8Y03lpuAiNVi0MUsGKBUSg&s=08                                                                                                  
*26/09/2023: Long Live #Lakes Campaign, #Hyderabad, submits People’s Scientific Committee Report on Repeal of #GO111 to MD, Hyderabad Metropolitan Water Board #HMWSSB*

*@MinisterKTR @KTRBRS*
*@arvindkumar_ias*
*@MDHMWSSB @HMWSSBOnline @LubnaSarwath*

మానవ హక్కుల వేదిక పత్రికా ప్రకటన...వనపర్తి

*బండరావి పాకుల నిర్వాసిత గ్రామంలో తక్షణమే సౌకర్యాలు పూర్తి చేయాలి*
   
    వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట్ మండలంలోని బండరావిపాకుల గ్రామం మరియు కొంకలపల్లి గ్రామాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమయ్యే ఏదుల రిజర్వాయర్లో ముంపుకు గురౌతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ హక్కుల వేదిక బృందం ఆయా గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలపై అధ్యయనం చేసింది.

      బండరావిపాకుల దాదాపు అయిదు వందల ఇండ్లు, మూడు వేల జనాభాతో, కొండలు, గుట్టల నడుమ చెరువుల కింద సాగయ్యే పన్నెండు వందల ముప్పై రెండు ఎకరాల వ్యవసాయ భూమితో, అడుగు దూరంలో అనేక ఉమ్మడి సహజ వనరులను కలిగిన పెద్ద గ్రామం.
కొంకలపల్లి కూడా రెండువందల ఇళ్ళూ, వెయ్యి మంది జనాభా, 900 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన నూతన పంచాయతీ గ్రామం. ఈ రెండు గ్రామాలనూ రిజర్వాయర్ కోసమని ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్నది.

    రెండు గ్రామాలకు చెందిన సొంత భూమి గల రైతులకు ఎకరానికి అసైన్డ్ భూములకు మూడున్నర లక్షలు , పట్టా భూములకు నాలుగున్నర నుండి ఐదున్నర లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం నిర్ణయించి చెల్లించింది. బండరావిపాకులలో ముప్పై శాతం జనాభాగా ఉన్న 120 దళిత కుటుంబాలకు సెంటు పట్టా భూమి లేదు. ఉన్నదంతా, కుటుంబానికి ఒక ఎకరానికి మించని అసైన్డ్ భూమి. ఇప్పుడదీ పోయింది. గ్రామంలో గల 320 బీసీ కుటుంబాలకు సగటున ఒక ఎకరమైనా పట్టా భూమి ఉండేది. భూ పరిహారం తీసుకుని, గడిచిన ఏడేళ్లలో ఈ మూడు వందల ఇరవై కుటుంబాల్లో తిరిగి ఎంతో కొంత భూమి కొనుక్కున్న వాళ్ళు అయిదారు కుటుంబాలకు మించి లేరు. మిగతా కుటుంబాలన్నీ భూమిలేని కుటుంబాలుగా మారిపోయాయి. 
    భూములు అప్పగించిన తర్వాత, పోతున్న ఇండ్లకు ప్రభుత్వం అంచనా వేసిన విలువ తీసుకుని, కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ కింద ఒక్కొక్క ప్లాట్, ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు, కొంత మందికి మరో ఏడున్నర లక్షల రూపాయలు తీసుకొని ప్రజలంతా గ్రామాన్ని ఖాళీ చేయాలి. కానీ, ఇంకా చాలా బకాయిలు పెండింగులో ఉన్నాయి. చాలా అంశాలు పరిష్కారమే కాలేదు.  ఇళ్ల విలువలు చాలా మందికి రాలేదు. ఇంటికీ, పొలాలకూ అనుబంధంగా ఉండే ఏ స్థిరాస్తి విలువనూ ఇంకా చెల్లించలేదు. జీవనాధారాలు కోల్పోయిన భూమి లేని కుటుంబాలకు ఆర్ధిక పరిహారం నిర్ణయమే కాలేదు. కొన్ని భూముల సొమ్ము కోర్టుల్లో ఉంది. ముఖ్యంగా కొత్తగా మేజర్లు అవుతున్న యువతకు కూడా ప్యాకేజీ ఇస్తామని నోటి మాటగా చెప్పినవి అమలవుతాయనే నమ్మకం లేదు. అయినా ముఖ్యమంత్రి గారు సగం కూడా పూర్తికాని, సమీప భవిష్యత్తులో నీళ్లు రాని డ్రై ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసేశారు. ఏదుల రిజర్వాయర్ లోకి ఎప్పటికైనా నీళ్లు వచ్చినా, రాకున్నా బండరావిపల్లి, కొంకలపల్లి గ్రామాల ప్రజలకు వారి పాత గ్రామాల్లో ఇక ఏ హక్కూ లేకుండా అయ్యింది. 

    వర్షపు నీరుతో నిండుతున్న ఏదుల రిజర్వాయర్ వల్ల ఇండ్ల దాకా నీళ్లు వస్తున్నటువంటి కుటుంబాలు ఆగమేఘాల మీద ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఒక సంవత్సర కాలంగా ఇండ్లు కట్టుకుంటున్నారు. బండరావిపాకుల ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామం ఇప్పుడు గోపాల్ పేట మండలంలో కాకుండా రేవెల్లి మండలంలో శానైపల్లి శివారులో ఇచ్చిన ప్లాట్ లలో కొత్త రూపం తీసుకుంటున్నది. కానీ ప్లాట్ ల మధ్య ఇంకా అంతర్గత రోడ్లు లేవు. ఇతర ఏ సౌకర్యాలూ లేవు. ప్లాట్లలో స్వంతంగా ఇళ్ళు మొదలు పెడితే నిర్మాణ ఖర్చు పది నుండి ముప్పై లక్షలకు తక్కువ కావటం లేదు. వచ్చిన సొమ్ము ఇంటి ప్రారంభం వరకే అయిపోవస్తున్నది. అప్పులు చేసుకుంటూ క్రమంగా ఇండ్లు పూర్తి చేసుకుని దాదాపు 30 శాతం కుటుంబాలు ఇప్పుడు ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీలోనే నివసిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఈ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. మంచినీటి సౌకర్యం కల్పించలేదు. తమ ప్రాంతం మీదుగా పోతున్నటువంటి కరెంటు స్తంభాలకు లింకులు వేసి కరెంటు లాక్కొని వాడుకుంటున్నారని ఆరు నెలల కింద ఇరవై కుటుంబాల వారికి ఒక్కొక్కరికి మూడు నుండి ఇరవై వేల రూపాయల జరిమానా విధించారు. కానీ వీరికి విద్యుత్ సౌకర్యం కల్పించాలనే ఆలోచనే అధికారులకు కలుగలేదు. 'అభివృద్ధి' పేరిట ప్రజల దగ్గర నుండి భూములు గుంజుకోవటంలో అత్యుత్సాహం చూపే జిల్లా అధికారులు ఈ విషయంలో సిగ్గు పడాలి.

      బండరావిపాకుల అప్పర్ ప్రైమరీ స్కూల్, ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీలో స్కూలు భవనం లేని కారణంగా, ఒక కమ్యూనిటీ హాల్లో ఒకే రూములో ఏడు తరగతులు నిర్వహించబడుతూ నడుస్తున్నది. 
     ఇవి చాలక, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఎక్కడ సంఘటితమౌతారేమోనని నిరంతర నిఘా కోసం ఒక ఇన్నోవా కారు, చేతిలో కెమెరాలతో పొలీసులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఇదీ తెలంగాణా ప్రభుత్వం ప్రాజెక్టులకు తమ సర్వస్వాన్నిస్తున్న నిర్వాసితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు.

*మా డిమాండ్లు*:

1. బండరావిపాకుల, కొంకలపల్లి గ్రామాల్లో చాలా మందికి ఇంకా ఆర్థిక పరిహారాలూ, పునారావాస ప్యాకేజీలు రాలేదు. తక్షణమే వాటిని అందించాలి.

2. ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్రభుత్వం చట్ట బద్దంగా కల్పించాల్సిన సౌకర్యాలన్నీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి. 

3. భూములు కోల్పోయిన వారికీ, వ్యవసాయం చేయటానికి సిద్దంగా ఉన్న ప్రతీ నిర్వాసిత కుటుంబానికీ ప్రాజెక్టు ఆయకట్టులో వారి నివాసానికి  దగ్గరున్న చోట రెండెకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వమే కొని, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి.

4. దళితులకు మూడు ఎకరాల భూమి పథకాన్ని నిర్వాసితుల విషయంలో ఖచ్చితంగా అమలు చేయాలి.

5. ఆర్ అండ్ ఆర్ కాలనీలకు అనుబంధంగా ఉమ్మడి సహజ వనరులు ( చెరువు, గుట్టలు, పచ్చిక బయళ్లు) కూడా విధిగా ఉండాలి. ఇది వారి హక్కుగా గుర్తించాలి.

6. నిర్వాసిత గ్రామాల్లోని గొర్రెల పెంపకంపై ఆధారపడాలనుకునే గొల్ల కురుమలకూ , పాల ఉత్పత్తి దారులకూ వారి ఉపాధిని పునరుద్ధరించే ఏర్పాట్లు చేయాలి.

7. మహిళలకు ఇంటిదగ్గర చేయగల ఉత్పత్తి పనుల విషయంలో నైపుణ్యాలను అందించి ప్రోత్సహించాలి.
స్వయం సహాయక గ్రూపులను తక్షణమే పునరుద్ధరించాలి.

8. నిర్వాసిత కుటుంబాలకు విద్యా మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేయాలి.

9. రాష్ట్రవ్యాప్తంగా భూనిర్వాసితుల స్థితిగతుల అధ్యయనం కోసం వెంటనే ఒక కమీషన్ ను వేయాలి. 

   మా నిజ నిర్ధారణ బృందంలో మానవ హక్కుల వేదిక బాధ్యులు డాక్టర్ ఎస్ తిరుపతయ్య , బొల్లి ఆధమ్ రాజు, పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు చింతపల్లి అశోక్, స్థానికులు పూర్ణకంటి ఉత్త స్వామి, మిద్దె స్వామి( రాముడు) ఉన్నారు.
 
మానవ హక్కుల వేదిక పత్రికా ప్రకటన
వనపర్తి
26.09.2023.

Courtesy / Source by :
--- డా ఎస్. తిరుపతయ్య
ప్రధాన కార్యదర్శి,
మానవ హక్కుల వేదిక, తెలంగాణ .

Monday, September 25, 2023

The Chief Secretary Govt of #Telangana and to Special Chief Secretary #MAUD Govt of Telangana

https://twitter.com/Praja_Snklpm/status/1706281994139922903?t=yt1cn0tmjHkYYZsep1lbAA&s=08                                                    
*_On 25/9/2023 Long Live Lakes Campaign submits People’s Scientific Committee Report on #Repeal of #GO111 to The Chief Secretary Govt of #Telangana and to Special Chief Secretary #MAUD Govt of Telangana #Hyderabad_*

*@TelanganaCMO  @KTRBRS @TelanganaCS @arvindkumar_ias @LubnaSarwath*

Committee Report on #Repeal of #GO111 submit to Telangana CS

https://twitter.com/Praja_Snklpm/status/1706281994139922903?t=yt1cn0tmjHkYYZsep1lbAA&s=08                                                   
 *_On 25/9/2023 Long Live Lakes Campaign submits People’s Scientific Committee Report on #Repeal of #GO111 to The Chief Secretary Govt of #Telangana and to Special Chief Secretary #MAUD Govt of Telangana #Hyderabad_*

*@TelanganaCMO  @KTRBRS @TelanganaCS @arvindkumar_ias @LubnaSarwath*

Repeal of #GO111 submit to The Chief Secretary Govt of #Telangana and to Special Chief Secretary #MAUD

https://twitter.com/Praja_Snklpm/status/1706281994139922903?t=yt1cn0tmjHkYYZsep1lbAA&s=08                                                   
 *_On 25/9/2023 Long Live Lakes Campaign submits People’s Scientific Committee Report on #Repeal of #GO111 to The Chief Secretary Govt of #Telangana and to Special Chief Secretary #MAUD Govt of Telangana #Hyderabad_*

*@TelanganaCMO  @KTRBRS @TelanganaCS @arvindkumar_ias @LubnaSarwath*

అమెరికాలో చదువు.... రికార్డ్ స్థాయిలో 90 వేల వీసాలు జారీ

*అమెరికాలో చదువు.... రికార్డ్ స్థాయిలో 90 వేల వీసాలు జారీ*

దిల్లీ..అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునేవారి సంఖ్య ఏటా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం సైతం డిమాండుకు తగినట్లుగా వీసాలను జారీ చేసేందుకు ప్రయత్నిస్తోంది.తాజాగా ఈ వేసవిలో (జూన్‌, జులై, ఆగస్టు) రికార్డు స్థాయిలో 90వేలకు పైగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) వెల్లడించింది. అమెరికాలో చదువుకోసం ప్రపంచవ్యాప్తంగా జారీ చేస్తున్న ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత్‌లోనే ఉంటుందని తెలిపింది.

'ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి అమెరికాను లక్ష్యంగా పెట్టుకొన్న భారతీయ విద్యార్థులకు శుభాకాంక్షలు. మా టీమ్‌వర్క్‌, సాంకేతికత సహాయంతో.. అర్హత పొందిన దరఖాస్తుదారులు సరైన సమయంలో ప్రవేశాలు పొందారని ఆశిస్తున్నాం' అని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వెల్లడించింది.

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, September 24, 2023

_Release of Report on Repeal of #GO111_

https://twitter.com/Praja_Snklpm/status/1706165839035240798?t=5ye59G1aD8OEf2b3xaY3WQ&s=08                                                                               *_Release of Report on Repeal of #GO111_*

dropbox.com/scl/fo/5mfjrqk…

*#SupremeCourtofIndia #TelanganaHighCourt*
*#NationalGreenTribunal*
*@MoJSDoWRRDGR*
*@CWCOfficial_GoI* *@CGWB_CHQ*
*@nwmgoi @WHO* *@LubnaSarwath*

*@TelanganaCMO @MinisterKTR @KTRBRS @arvindkumar_ias @KVishReddy*                                                               x.com/nizamjourno/st…

*@Murali_IASretd*
*@RSPraveenSwaero*
*@dr_mvreddy*
*@BJP4Telangana @INCTelangana @BSP4Telangana* *@AAPTELANGANA @napmindia @DonthiNreddy @Narhariyarabotu* *@RaviVattem @BplplH @NAPMTelangana @HRF_Humanrights @RamMohanINC*

********************************
The People’s Scientific Committee on Sunday released a report against the decision of the state government to repeal GO 111, which used to protected the Himayatsagar and the Osmansagar. They said GO 69, which replaced GO111, opened around 1.32 lakh acres in 84 villages for construction activity in the buffer zone.

The report gave 15 suggestions including repealing GO 69 to conserve the reservoirs as well as recognising Osmansagar and Himayatsagar as ‘living beings’ with rights and responsibilities through a legislative act or a government resolution.
https://www.deccanchronicle.com/lifestyle/environment/250923/environmental-experts-call-on-ts-govt-to-implement-go-111.html                                                                                  
 *Thanks to Deccan Chronicle 👍..... Bplkm🪶*
*********************†*************

https://www.thehansindia.com/news/cities/hyderabad/city-will-be-spending-rs-500-cr-annually-if-twin-reservoirs-turn-devoid-of-purpose-825077                                                        
*Thanks to 👆TheHansIndia 👍.... Bplkm🪶*

Scientists joint report to protect Twin reservoirs in Hyderabad

Scientists joint report to protect Twin reservoirs in Hyderabad

Scientists joint report to protect Twin reservoirs in Hyderabad.

GOMs 111 not just prohibited industries, pollution and constructions in the catchment buffer area of 10kms, but also explicitly permitted agriculture, horticulture and floriculture. Government of Telangana instead of encouraging chemical-free farming and strengthening. GO111 implementation actually tore the protective gear and opened up the area for all sorts of activities that were prohibited. Thus GO Ms 69 was issued by government on 12.4.2022 that did away with all protection afforded to the catchment area buffer zone of Osman Sagar and Himayat Sagar reservoirs through GO Ms 111. This opened around 1,32,000 acres covering 84 villages listed in GO111 in the 10 kms buffer zone for all the prohibited activities such as industries, buildings, hotels, malls, etc.

It shocked Hyderabadis as the act of removing prohibitions was not substantiated at all and the reports that government kept assuring since 2016 never came. The current planetary crisis, flood mechanisms on Musi river, were never talked of by the government. Whereas the GO Ms 111 had five scientific reports to be based upon along with the Supreme Court judgement of 2000, GO Ms 69 beggared for single one. Can a cabinet decision undo a GO that too backed by Supreme Court order and five scientific expert reports? Thus, Hyderabadis mooted for People’s Scientific Committee that can give expert report on ‘Repeal of GO 111’. Three scientists namely Dr K Baburao, Sagar Dhara, Dr B Rama lingeswwara Rao, agreed to give a joint report which is released today 24.09.2023.

Below excerpts from Chapter 7 under section titled ‘Suggested Measures’:

Following the Principle of Public Trust, Precautionary Principle, Equity and Inter generational responsibility in relation to common property resources, the following measures are suggested by the People’s Scientific Committee, to be implemented for the GO 111 area:

Recognizing Osman Sagar and Himayat Sagar reservoirs as “living beings’’ with rights and responsibilities: This could be done through a legislative act or a government resolution. The act or resolution would need to define the rights and responsibilities of the reservoirs, catchment areas, and establish a mechanism for enforcing these rights and responsibilities.

Compensating farmers and farm workers in the GO 111 area for sequestering CO2 and for crop yield losses due to Hyderabad city’s pollution: The Telangana Government could establish a carbon sequestration compensation program for farmers and farm workers in the GO 111 area. The program could pay farmers and farm workers a per-acre fee for sequestering CO2 in their soil. The government could also provide financial assistance to farmers and farm workers who experience crop yield losses due to Hyderabad city’s pollution.

Ensuring that the per capita state investment on social services for all residents, including farmers, farm workers, and other residents in the GO 111 area is the same as that for Hyderabad residents: The Telangana Government could allocate a specific budget for social services in the GO 111 area. The government could also establish a committee to oversee the distribution of these funds, and to ensure that all residents of the GO 111 area have equal access to these social services.

Implementing the December 2000 Supreme Court order against the AP High Court order and in favour of APPCB that upheld GO 111: The Telangana Government could take steps to ensure that all existing and future activities in the GO 111 area comply with the Supreme Court order. This could include establishing a monitoring committee to oversee activities
in the area, and to take action against any violations of the Supreme Court order.

Issuing a GO promulgating a freeze of the current land use in the GO 111 area:

The Telangana Government could issue a GO freezing the current land use in the GO 111 area. This would prevent any further activities that could harm the Osman Sagar and Himayat Sagar reservoirs or their catchment areas. Removing all air, water polluting, and solid waste sources, in the GO 111 area, except those residences that comply with GO111, and ensuring that no sewage and solid waste should enter the Osman Sagar and Himayat Sagar reservoirs: The Telangana Government could take steps to identify and remove all air, water polluting, and solid waste sources, in the GO 111 area, except those residences that comply with GO 111. Government should ensure compliance of Solid Waste Management Rules – MoEF, as well as explore all the available alternative sewage methodologies that do not necessitate pipe-laying and STPs.

Inspecting the dams of the Osman Sagar and Himayat Sagar reservoirs and, if necessary, strengthening them so that the risk of dam burst and dam leakage are within acceptable norms:

The Telangana Government could commission a safety inspection of the dams of the Osman Sagar and Himayat Sagar reservoirs. The inspection should be carried out by a team of qualified engineers. If the inspection reveals any weaknesses in the dams, the government should take steps to strengthen them.

Desilting the Osman Sagar and Himayat Sagar reservoirs and removing encroachments:
The Telangana Government could desilt the Osman Sagar and Himayat Sagar reservoirs and remove any encroachments inside the reservoirs and remove GO111 non-compliant structures in the catchment areas. This will help to increase the storage capacity of the reservoirs and reduce the risk of flooding.

Encouraging non chemical farming in the GO 111 area: The Telangana Government could provide subsidies to farmers and farm workers in the GO 111 area who switch to nonchemical farming practices. The government could also help to market non-chemical produce from the GO 111 area.

The countries with domestic ecocide laws are:

France (2021), Georgia (1999), Armenia (2003), Ukraine (2001), Belarus (1999), Ecuador (2008; 2014), Kazakhstan (1997), Kyrgyzstan (1997), Moldova (2002), Russia (1996), Tajikistan (1998), Uzbekistan (1994), Vietnam (1990). It is high time India enacted an act against ecocide and joined the global effort to prevent ecocide.

Lakes should not be treated as a piece of land holding water. Separate survey numbers that give lakes and reservoirs an identity of their own should be created. Himayat Sagar and Osman Sagar reservoirs should be given a new legal identity.

The impact of urbanization of the GO111 area on the massive reduction in the yield of water in Musi River should be recognized and to revive the river to meet the water needs of the state of Telangana either reinstate GO111 or enact stronger protections.

Sustainable, chemical-free agriculture to be introduced and encouraged in the GO111 area. Its proximity to the city gives immense scope for producing vegetables, fruits, and flowers.

Further growth of Hyderabad city causes a decline in the quality of life environmentally, economically, and socially. We have to shift from big is better to small is beautiful and avoid the problems of large megapolis.

Use MNREGA to create green jobs to do water shed management, land shaping where necessary, restitute degraded lands, do reforestation, prevent air pollution, set up solar energy parks, etc., in the GO 111 area. This will help in a just energy transition that India requires.

Telangana government must take due cognisance of this report and promptly repeal GOMs 69 dt 12.4.2022 and strengthen implementation of GO Ms 111 in its true spirit. As assured the People’s Scientific Committee Report on Repeal of GO 111 shall be submitted to the Government of Telangana, to the High Court at Hyderabad and to the Supreme Court of India. The soft copy shall be made available in public domain.

Friday, September 22, 2023

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు...హైకోర్ట్ ఆదేశం

*తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు...హైకోర్ట్ ఆదేశం....*

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) నిర్వహించిన గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దైంది. గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.జూన్‌ 11న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. మొత్తం 503 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం పరీక్ష జరిగింది. 

అయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌లు వేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదన్నారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల పిటిషన్లను పరిగణనలోకి విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పేపర్‌ లీకేజీ కారణంగా గ్రూప్‌ - 1 పరీక్ష ఇంతకుముందే ఓసారి రద్దైన సంగతి తెలిసిందే.

*సుజీవన్ వావిలాల*🖋️

ఉన్నతస్థాయి కమిటీ నివేదిక వచ్చేదాక... జీవో 111 షరతులు కోనసాగుతాయి...!

*ఉన్నతస్థాయి కమిటీ నివేదిక వచ్చేదాక... జీవో 111 షరతులు కోనసాగుతాయి...!*

*హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం*

హైదరాబాద్‌: జీవో 111లోని షరతుల సడలింపుపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక సమర్పించేదాకా ఆ జీవోలోని షరతులు కొనసాగుతాయని హైకోర్టుకు ప్రభుత్వం శుక్రవారం నివేదించింది. 111లోని షరతులను తొలగిస్తూ.. వాటిపై అధ్యయనం చేయడానికి వీలుగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో 69 జారీ చేశామని, కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది. జీవో 111ను సవరించడాన్ని, ఈ ప్రాంతంలో నిర్మాణాలను అడ్డుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ 2007లో ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ కౌంటర్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నీటి పరీవాహక ప్రాంతాల్లో కాలుష్యకారక పరిశ్రమలు, హోటళ్లు, నివాస కాలనీల నిర్మాణాలను నిషేధిస్తూ1996లో ప్రభుత్వం జీవో 111 జారీ చేసిందన్నారు. ఈ జీవో పరిధిలో 84 గ్రామాలున్నాయని తెలిపారు. కొన్ని నిబంధనలను సడలించామని, దీనిపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

కమిటీ నివేదిక అందాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతంలో ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల నుంచి హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా అయ్యేదన్నారు. ప్రస్తుతం నగరానికి సరఫరా అయ్యే మొత్తం నీటిలో జంట జలాశయాల నుంచి సరఫరా అయ్యేది 1.5 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుత తాగునీటి అవసరాలకు 12 టీఎంసీలు అవసరమని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా, గోదావరిల నుంచి 30 టీఎంసీలు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ హామీని రికార్డు చేయాలని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఎల్‌.రవిచందర్‌, కె.ఎస్‌.మూర్తికోరారు. జీవో 111 లక్ష్యం దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం నివేదిక నిమిత్తం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️

పరిగి హరిశ్వర్ రెడ్డి.... కన్నుమూత....!

*పరిగి హరిశ్వర్ రెడ్డి.... కన్నుమూత....!*

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(76) కన్నుమూశారు. శ్వాస సరిగ్గా ఆడక కార్డియాక్‌ అరెస్ట్‌ అయి హరీశ్వర్‌ రెడ్డి మృతి చెందారు.వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పరిగిలో నివాసముంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెపోటు వచ్చిందని, వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. హరీశ్వర్‌ రెడ్డి.. సీఎం కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు. 

ఇక, హరీశ్వర్‌రెడ్డి 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికలలో పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి పరిగి ఉపసర్పంచ్‌గా, 1978లో సర్పంచ్‌గా, సమితి వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారుహరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో నిర్వహించనున్నారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేశ్‌రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

_#GO111 రద్దు ఎవరి ప్రయోజనాలకోసం?_

https://twitter.com/Praja_Snklpm/status/1705158952919687186?t=u99X8A2M7K8swaT1JKCyRg&s=08                                                                       *_#GO111 రద్దు ఎవరి ప్రయోజనాలకోసం?_*
*రద్దు చేస్తే భవిష్యత్ లో భాగ్యనగరానికి పొంచి వున్న ప్రమాదం.*
*#సుప్రీంకోర్ట్ ఆదేశాలను గౌరవించని #తెలంగాణ ప్రభుత్వం.*
*#గండిపేట, #హిమాయత్ సాగర్ ఈ జంట జలశయాలను కాపాడుకుందాం.... #పర్యావరణ ప్రేమికులు అందరు ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలి✊... Bplkm🪶*
*@MoJSDoWRRDGR*
*@TelanganaCMO @MinisterKTR @KTRBRS*  *@sandeep4justice*  *@LubnaSarwath @DonthiNreddy @Murali_IASretd @RSPraveenSwaero @KVishReddy @dr_mvreddy @VenkatReddy_MVF @sdf4thepeople* *@hyderabadzinda2 @rsv4farmers @arvindkumar_ias @Narhariyarabotu @RaviVattem @NAPM_Telangana @HRF_Humanrights @BplplH @veeruveeru1 @FACIndia_ @VijayGopal_*

కడియంకే నా మద్దతు...రాజయ్యతో KTR చర్చలు సఫలం

*కడియంకే నా మద్దతు.... రాజయ్యతో KTR చర్చలు సఫలం*

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పలు చోట్ల సిట్టింగ్‌లకు ప్లేస్‌ లేకపోవడంతో ఆయా స్థానాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. సొంత పార్టీ నేతలే పార్టీ హైకమాండ్‌పై సీరియస్‌ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

*చక్రం తిప్పిన కేటీఆర్‌..*
ఇక, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి సీటు ఖరారు చేయడంతో ఆయన హైకమాండ్‌పై పోరుకు రెడీ అయ్యారు. సమయం దొరికిన ప్రతీసారి శ్రీహరిని టార్గెట్‌ చేస్తూ రాజయ్య సెటైర్లు వేశారు. పరోక్షంగా శ్రీహరిని ఓడిస్తా అనే రేంజ్‌ వరకు వెళ్లారు. ఈనేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్‌లో రాజయ్య, శ్రీహరితో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జరిగిన భేటీలో రాజయ్య శాంతించారు. వచ్చే ఎన్నికల్లో కడియం గెలుపునకు పార్టీ కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. 

*శాంతించిన రాజయ్య..*
అయితే, రాజయ్యకు కేటీఆర్‌ కీలక హామీ ఇచ్చారు. రాజయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాజయ్య భవిష్యత్త్‌కు సీఎం కేసీఆర్‌, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక, కేటీఆర్‌ ఇచ్చాన భరోసాతో రాజయ్య మెత్తబడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాని తెలిపారు. బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Thursday, September 21, 2023

ముస్తాబవుతున్న ఉప్పల్ స్టేడియం

*ముస్తాబవుతున్న ఉప్పల్ స్టేడియం*

*క్రికెట్‌ ప్రపంచకప్‌ మరో 13 రోజుల్లో*
హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ముస్తాబవుతోంది.
ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ స్టేడియంలో రెండు వార్మప్‌, మూడు అసలైన మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) స్టేడియంలో పైకప్పు, కొత్త కుర్చీలు తదితర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దక్షిణం వైపు గతంలో భారీ వర్షాలకు ఎగిరిపోయిన పైకప్పు స్థానంలో ఇప్పుడు కొత్తదాన్ని బిగించారు. తూర్పు దిశగా పైకప్పు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొత్త ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 29న ఉప్పల్‌లో జరగాల్సిన న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ వార్మప్‌ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించే సూచనలు కనిపించడం లేదు. గణేశ్‌ నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకల నేపథ్యలో ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించడం సాధ్యం కాదని హెచ్‌సీఏకు రాచకొండ పోలీసులు సమాచారమిచ్చారు. ''39 వేల సామర్థ్యం ఉన్న ఉప్పల్‌ స్టేడియంలో ప్రపంచకప్‌ వరకు 10 నుంచి 12 వేల వరకు కొత్త కుర్చీలు ఏర్పాటు చేస్తాం. ఈ టోర్నీ తర్వాత మొత్తం మార్చేస్తాం. దక్షిణం వైపు పైకప్పు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. తూర్పు వైపు పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పశ్చిమ వైపు పైకప్పు ఇప్పుడు పెట్టలేకపోతున్నాం. ప్రపంచకప్‌పూర్తయ్యాక దీన్ని కూడా ఏర్పాటు చేస్తాం. మొదటి వార్మప్‌ మ్యాచ్‌కు భద్రత గురించి ఇంకా చర్చ జరుగుతోంది. బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది'' అని హెచ్‌సీఏ సీఈవో సునీల్‌ పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వెళ్తూ.... ఇద్దరు యువకుల... మృతి...!

*ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వెళ్తూ.... ఇద్దరు యువకుల... మృతి...!*

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనం కోసం బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన యశ్వంత్ (22) డిగ్రీ చదువుతున్నాడు.ఇదే ప్రాంతానికి చెందిన సాయిరామ్‌ (31) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో.. యశ్వంత్, సాయిరామ్‌ స్పోర్ట్స్ బైక్‌పై బోడుప్పల్ నుంచి బయలుదేరారు. అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై అతివేగంగా బైక్ నడిపి డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌ నడిపిన యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సాయిరామ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉస్మానియా వర్సిటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Wednesday, September 20, 2023

పంటల ప్రణాళికా, సుస్థిర వ్యవసాయమూ జంటగా సాగాలి

పంటల ప్రణాళికా, సుస్థిర వ్యవసాయమూ జంటగా సాగాలి

Courtesy / Source by :
కన్నెగంటి రవి, 
రైతు స్వరాజ్య వేదిక , 
ఫోన్: 99129 28422
----------------------------------------------
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల, పశువుల ఆహార బధ్రత కోసం భూమి లాంటి సహజ వనరుల సద్వినియోగం ఎంత ముఖ్యమో, వ్యవసాయం లో పంటల ప్రణాళిక కూడా అంతే కీలకమైనది. ఈ పంటల ప్రణాళిక చేయడానికి మన సాగు భూముల పొందిక, స్వభావం, వాతావరణ పరిస్థితులతో పాటు,  సాగు నీరు అందుబాటు, దానికి ఉన్న పరిమితులు,  లాంటి ఇతర అంశాలు కూడా పరిగణనలో పెట్టుకోవాలి. 
దూరపు కొండలు నునుపుగా భావిస్తూ,  విదేశాలకు ఎగుమతుల లాంటి ఎండమావుల వెంట పరుగు లెత్తకుండా, మన రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలు, పశువుల మేత అవసరాలు, స్థానిక వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు  ముడి ఉత్పత్తుల అవసరాలు ప్రధాన ప్రాతిపదికగా ఉంచుకుని  రాష్ట్ర పంటల ప్రణాళిక చేసుకోవాలి. అప్పటికీ రాష్ట్రంలో ఇంకా సాగు భూములు అందుబాటులో ఉంటే, దేశ ఆహార బధ్రత అవసరాల గురించీ, ఎగుమతికి అవకాశం ఉన్న పంటల సాగు గురింఛీ చర్చించుకోవచ్చు . గత మూడేళ్లుగా మన అవసరాలకు మించి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నామో చూస్తున్నాం కదా? 
లాభదాయక పంటల సాగు పేరుతో రైతులు పరుగు లెత్తేలా ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రోత్సాహిస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో బహుళ పంటల వ్యవస్థ పూర్తిగా అంతరించిపోయింది. 90 శాతం భూముల్లో కేవలం మూడు, నాలుగు పంటలు మాత్రమే  పండే మోనో క్రాపింగ్ వ్యవస్థ రాష్ట్రంలో అవతరించింది. పైగా పత్తి, సోయా లాంటి  పంటలను మనం వినియోగించేది తక్కువ. వీటిని సాగు చేయడానికి  అత్యధిక స్థాయిలో సాగు నీరు, రసాయనాలు వినియోగిస్తున్నాము. .  
రాష్ట్రంలో మనుషుల ఆహార అవసరాలను కేవలం వరి బియ్యమే తీర్చవు. పప్పు ధాన్యాలూ , చిరు ధాన్యాలూ , నూనె  గింజలూ , సుగంధ ద్రవ్యాలూ  , కూరగాయలూ , పండ్లూ  కూడా అవసరమే. అలాగే పశువుల మేత తగినంత అందుబాటులో లేకుండా, కేవలం పారిశ్రామిక దాణా పై ఆధారపడి పశుపోషణ చేయడం కూడా కష్టమే.  
మన రాష్ట్రంలో అన్ని రకాల పంటలూ పండే వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఈ పంటల సాగుకు అవసరమైన నేలలూ ఉన్నాయి. పండించడానికి శ్రమజీవులైన రైతులూ ఉన్నారు. కాకపోతే  ఇప్పటి వరకూ ప్రభుత్వానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానమూ, దానికో స్పష్టమైన లక్ష్యమూ లేదు. ఇతరుల సలహాలు పాటించే విజ్ఞతా, నష్టాల నుండీ నేర్చుకుని, మార్చుకునే రాజకీయ  చిత్తశుద్దీ  కూడా ఈ ప్రభుత్వానికి ఉండడం  లేదు. 
మన రాష్ట్ర నేలల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం సూచనలతో తయారైన సమగ్రమైన పంటల ప్రణాళిక ఉంది.  రాష్ట్రంలో ఏయే ఆహార ఉత్పత్తుల అవసరం ఏ మేరకు ఉందో, జిల్లాల వారీగా ఉద్యాన శాఖ చేసిన అధ్యయన నివేదిక కూడా అందుబాటులో ఉంది.  ప్రణాళికను రైతులతో చర్చించి  అమలు చేయడానికి , వ్యవసాయ, ఉద్యాన  శాఖల  విస్తరణ విభాగమూ  ఉన్నాయి.  ప్రభుత్వం చేయవలసిందల్లా ఈ పంటల ప్రణాళికను అమలు చేయడానికి అవసరమైన  విధాన నిర్ణయాలూ, బడ్జెట్ కేటాయింపులూ,  ఆ కేటాయింపులను సకాలంలో విడుదల చేయడమూ.  గత పదేళ్లుగా చేసినట్లు ఏ సీజన్ కు ఆ సీజన్ పంటల ప్రణాళికను  మార్చేయకుండా, కొంత దీర్ఘ కాలం పాటు అమలు చేసే ఓపిక, దృష్టీ కూడా ప్రభుత్వానికి  అవసరం. 
ప్రస్తుతం ఇవన్నీ లోపించడం వల్ల, రాష్ట్ర పంటల సాగు వ్యవస్థ అత్యంత అస్తవ్యస్తంగా తయారైంది. పండించిన రైతులూ సంతోషంగా లేరు. కుటుంబానికి అవసరమైన అన్ని రకాల ఆహార ఉత్పత్తులనూ బయట మార్కెట్ లో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి రావడం వల్ల, ఆర్ధిక భారం పెరిగి , వినియోగదారులూ సంతోషంగా లేరు. దళారీ వ్యాపారులూ,  బడా రిటైల్ వాణిజ్య సంస్థలూ మాత్రమే లాభాల పంటతో ఆనందంగా ఉన్నారు. 
ప్రస్తుతం వినియోగిస్తున్న పద్ధతి లోనే, సాగు నీరు  వ్యవసాయానికి అందుబాటులో ఉండాలంటే, వర్షాలు సంవత్సరం పొడవునా ఎంతో కొంత  నిరంతరంగా పడుతూ ఉండాలి. కానీ గత దశాబ్ధ కాలంతో  పోల్చినప్పుడు ప్రస్తుతం వర్షపు రోజులు తగ్గిపోతున్నాయి. తక్కువ వర్షపు రోజుల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ, ఈ భారీ, అతి భారీ  వర్షాల  వల్ల, పంటలకు తీవ్రమైన నష్టం కూడా వాటిల్లుతున్నది.  
వానా కాలంలో కురిసిన ఎక్కువ శాతం వర్షపు నీరు ఎక్కడికక్కడ భూమిలో ఇంకడం కాకుండా, వేగంగా ప్రవహించి , వాగులలో, నదులలో, సముద్రంలో  కలసిపోతున్నది.  ఇందుకు ప్రధానంగా మూడు  కారణాలు పని చేస్తున్నాయి.
 ఒకటి – లోతు దుక్కి, దమ్ము లాంటి ( పొలంలో నీరు పూర్తిగా ఇంకిపోకుండా నిలబెట్టేందుకే రైతులు ఈ పని చేస్తారు, వరి పొలంలో కలుపు నివారించడానికి ఈ నీళ్ళను నిలగడతారు. నిజంగా వరి సాగుకు ఇన్ని నీళ్ళు అవసరమే  లేదు. ) మన వ్యవసాయ పద్ధతులు ఒక కారణమైతే, పంటల సాగులో విపరీతంగా వినియోగిస్తున్న రసాయన  ఎరువులు మరో కారణం.  వీటి వల్ల భూములు నీటిని ఇంకించుకునే  స్వభావాన్ని కోల్పోయి, గట్టి పడి పోతున్నాయి. మరీ ముఖ్యంగా వరి, పత్తి మాత్రమే ఎక్కువగా పండించే  మన రాష్ట్రంలో ఇది సర్వ సాధారణంగా మారి పోయింది. భూమిలో తేమను పట్టి ఉంచడానికి మన నేలల్లో అసలు సేంద్రీయ కర్బనమే లేదు. ఇంకిన కొద్దిపాటి భూగర్భ జలాలు కూడా త్వరగా అడుగంటి పోవడానికి మరో ముఖ్య కారణం  రాజకీయ నాయకులతో కుమ్మక్కైన ఇసుక మాఫియా, వాగుల నుండీ,  నదుల నుండీ విచ్చలవిడిగా ఇసుకను తోడేయడం.   
మరో వైపు మన రాష్ట్ర భౌగోళిక స్వభావం రీత్యా , ప్రవహించి వెళ్ళిపోయిన వర్షపు నీటిని, మళ్ళీ భారీ ఎత్తి పోతల ద్వారా వెనక్కు తీసుకు రావాలంటే , తప్పకుండా విద్యుత్ అవసరం ఉంటుంది. తప్పుడు విద్యుత్ ఒప్పందాల వల్ల వినియోగిస్తున్న  విద్యుత్ కూడా అత్యంత ఖరీదైనదిగా మారిపోయింది.  రైతులు స్వయంగా విద్యుత్ బిల్లులు కట్టకపోయినా, ఈ విద్యుత్  బిల్లులను  ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ నుండీ చెల్లిస్తే మాత్రమే, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుతుంది. ప్రభుత్వం బడ్జెట్ నుండీ సకాలంలో విద్యుత్  బకాయిలను చెల్లించక పోవడం వల్ల, ఇప్పటికే విద్యుత్ సరఫరా సంస్థలు 50 వేల కోట్ల రూపాయల అప్పులలో కూరుకు పోయాయి.
ఈ అప్పుల నుండీ బయట పడడానికి,  విద్యుత్ సంస్థలు, ఈ విద్యుత్ బిల్లుల భారాన్ని రైతుల నుండీ , ఇతర వినియోగదారుల నుండీ  ఏదో ఒక రూపంలో తప్పకుండా  వసూలు చేస్తాయని, రాష్ట్ర ప్రజలకు గత రెండేళ్ల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. 
24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా ,ఆచరణలో కేవలం రోజుకు 10 గంటలు వ్యవసాయానికి 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నారు.  నీరు అందుబాటులో ఉందనే పేరున, సాగు నీరు ఎక్కువ అవసరమయ్యే పంటల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా వర్షాధార పంటలు, దాదాపు కనుమరుగై పోతున్నాయి. వరి, పత్తి, ఆయిల్ పామ్, బత్తాయి, లాంటి పంటలకు చాలా ఎక్కువ నీరు అవసరం. 
రాష్ట్ర వ్యవసాయంలో  రసాయన ఎరువుల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఇవి రాష్ట్ర వాతావరణంలో  గ్రీన్ హౌజ్ వాయువుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భూముల భౌతిక, రసాయన స్వభావాన్ని పూర్తిగా దెబ్బ తీస్తున్నాయి. భూ గర్భ జలాలను , నదులు, చెరువుల నీటిని విషపూరితం చేస్తున్నాయి. 
భూమికి అందించే పోషకాలలో సేంద్రీయ ఎరువులు వాడని కారణంగా,  రాష్ట్ర నేలలలో జింక్, మెగ్నీషియం, ఐరన్ లాంటి సూక్ష్మ పోషకాలు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా వాటి కొరత ఆహారంలో కూడా కనిపిస్తున్నది. పురుగుల, తెగుళ్ళ నివారణకు,కలుపు  నివారణకు విష రసాయనాల  వినియోగం రాష్ట్ర ఆవిర్భావం నాటితో పోలిస్తే, ఐదు రేట్లు పెరిగింది.  ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకపోయినా, గ్లయిఫోసేట్ లాంటి కలుపు విషాల వినియోగం , కలుపు  విషాలను తట్టుకునే హెచ్.టీ కాటన్ విస్తీర్ణం రాష్ట్రంలో పెరుగుతున్నాయి. ఇవన్నీ రాష్ట్ర వ్యవసాయంలో పర్యావరణ వ్యతిరేకమైన విషయాలే.  మనషుల,ఇతర జీవ జాతుల  ఆరోగ్యానికి హానికరమైనవే. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖా మంత్రి తమను  తాము రైతులుగా చెప్పుకునే రాష్ట్రంలో ఈ విష రసాయనాల  విధ్వంసం కొనసాగడం అన్యాయమైన విషయం. 
ఇప్పటికైనా, రాష్ట్రానికి ఒక సమగ్ర పంటల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ ప్రణాళికా రూప కల్పనలో, అమలులో  క్షేత్ర స్థాయిలో  రైతులను , రైతు సహకార సంఘాలను,  రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను  భాగస్వాములను చేయాలి. మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు ఆనువు గాని ఆయిల్ పామ్  లాంటి పంటలను ప్రోత్సహించడం మానుకోవాలి. అత్యధిక సాగు నీరు అవసరమైన  వరి, పత్తి లాంటి పంటల విస్తీర్ణాన్ని రాష్ట్ర అవసరాల మేరకు మాత్రమే ఉంచుకుని,  మిగిలింది తగ్గించుకోవాలి. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు , కూరగాయలు, పండ్ల సాగు విషయంలో రాష్ట్రం స్వయం పోషకం అయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. శాస్త్రీయ జల విధానం రూపొందించి, తక్కువ నీటి వినియోగంతో పంట సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి. 
రాష్ట్ర వ్యవసాయంలో, ముఖ్యంగా ఆహార పంటలలో  రసాయనాల వినియోగాన్ని రాబోయే అయిదేళ్లలో పూర్తిగా మానేసేలా, ప్రతి సంవత్సరం కనీసం 20 లక్షల ఎకరాలలో సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సాహానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలి. ఇందుకు స్పష్టమైన రోడ్ మాప్ తో  సేంద్రీయ వ్యవసాయ విధానం రూపొందించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనుభవాలను కూడా ఇందుకోసం అధ్యయనం చేయాలి. 
వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయాలు, తాము రూపొందించే వ్యవసాయ, ఉద్యాన పంచాంగాలలో, వ్యవసాయ శాఖ నిర్వహించే పత్రికలో, ప్రచురించే సాహిత్యంలో, ఇతర మీడియా కార్యక్రమాలలో  శాస్త్రవేత్తలు విష రసాయనాలను సిఫారసు చేయడం పూర్తిగా తగ్గించుకోవాలి. రైతులకు, వ్యవసాయ శాఖ  సిబ్బందికి ఈ విషయంలో నిరంతర శిక్షణలు  అందించాలి. ఛత్తీస్ ఘడ్ తరహాలో గ్రామీణ యువతకు,మహిళలకు  కంపోస్ట్ ,ఇతర జీవ రసాయనాల తయారీపై శిక్షణ ఇచ్చి , పెట్టుబడి సమకూర్చి జీవనోపాధులను కల్పించాలి. వీటిని రైతుల పొలాలకు సబ్సిడీపై అందించాలి.  
ఈ అంశాలన్నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రైతులు, రాజకీయ పార్టీల ముందు చర్చకు పెట్టి, స్పష్టమైన హామీలు రాబట్టాలి.

మానసిక వికలాంగుడి హత్య ను ఖండించిన...ఎన్పి ఆర్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి

*మానసిక వికలాంగుడి హత్య ను ఖండించిన...
ఎన్పి ఆర్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి*

*చేయూతనందించాల్సిన వారే ఇలాంటి దుర్ఘటనకు పాల్పడడం దారుణం.*

నేటి సమాజంలో మానసిక వికలాంగులకు సామాజిక న్యాయం, సామాజిక భద్రత  కరువైందని  వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి ఆరోపించారు.
కొత్తూరు పరిధిలోని పెంజర్ల  గ్రామంలో మానసిక మూగవాడైన నరసింహ ను భార్య  మద్యం మత్తులో రోకలి బండతో మోదీ హత్యకు పాల్పడిన సంఘటనకు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజంలో మానసిక వికలాంగులు అవమానాలను ఎదుర్కొంటూ  దుర్భర దీన స్థితిలో జీవితాలను గడుపుతున్నారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు చేయూతనందించి వెన్నుదన్నుగా నిలువాల్సిన వారు ఇలాంటి హత్యలకు పాల్పడడం దారుణమని భుజంగ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాల పోరాటాల ఫలితాలతో 2016 ఆక్ట్ 92 ఏ బి చట్టలను సాధించుకున్నాం. కానీ  అమలు పరచడంలో ప్రభుత్వాలు నిరుగార్చుతున్నయని మండిపడ్డారు. మానసిక దివ్యాంగులపై అఘాయిత్యాలు, దాడులకు పాల్పడిన సకాలంలో సమగ్రంగా విచారణతో చట్టాలను అమలైనప్పుడు ఆత్మగౌరవంతో  జీవనం కొనసాగిస్తారు. అలాంటివి కొనసాగించకపోవడంతోనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని రంగారెడ్డి జిల్లా కమిటి ఆరోపించారు. చట్ట సభలలో వికలాంగుల కమిషన్ ఏర్పాటు చేస్తేనే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఇప్పటికైన ప్రభుత్వం దృష్టి సారించి పునర్వతం కాకుండా అత్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్కొని రాజు, కోశాధికారి దేవరం పల్లి రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.

CRM....!
(ప్రజల పక్షం)

Tuesday, September 19, 2023

చంద్రబాబును కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిది.... బండ్ల గణేష్

*చంద్రబాబును కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిది.... బండ్ల గణేష్....*

హైదరాబాద్: తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు  తెలుగు జాతి సంపదని.. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం ఆయన   మాట్లాడుతూ చంద్రబాబు పేరు వాడుకొని ఎంతోమంది లబ్ధి పొందారని, ఎంతోమంది జీవితాలు నిలబెట్టారని అన్నారు. బాబు అరెస్ట్ తనను ఎంతగానో బాధించిందని, ఈసారి తన ఇంట్లో వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకోలేదని చెప్పారు.

పార్కుల ముందు, రోడ్లపై కాకుండా.. సొంతూళ్లకు వెళ్లి బొడ్రాయి ముందు కూర్చుని అందరూ ధర్నాలు చేయాలని బండ్ల గణేష్ పిలుపిచ్చారు. ఐటీ ఉద్యోగులకు చీము నెత్తురు ఉంటే నెలరోజుల పాటు ఉద్యోగాలు మానేసి సొంతుళ్ళకు వెళ్ళి ధర్నాలు చేయాలన్నారు. చంపుతారా.. చంపేయమని చెప్పండని.. చంద్రబాబు రాజమండ్రి జైల్లో మగ్గుతుంటే అన్నం కూడా తినబుద్ధి కావట్లేదని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారని.. ముఖ్యమంత్రి అవుతారని బండ్ల గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

మహిళా బిల్లుపై స్పందించిన సోనియా గాంధీ....ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదే*

*మహిళా బిల్లుపై స్పందించిన సోనియా గాంధీ.... ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదే*

న్యూదిల్లి : తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కేంద్ర కేబినెట్ సమావేశమై చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లు ఏ క్షణాన్నైనా ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిపై కాంగ్రెస్ పార్లమెంటరీ నేత సోనియా గాంధీని ప్రశ్నించగా 'ఈ బిల్లు మాదే'నని సమాధానమిచ్చారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రెండోరోజు కొత్త పార్లమెంట్ భవనంలో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయాన్నే పాత పార్లమెంట్ భవనం వద్ద ఫోటో సెషన్ కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు ఇవాళ ఉదయమే పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు.

ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పార్లమెంటు భవనం వద్దకు వస్తూనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేఖరులు ఆమె స్పందన కోరగా ఈ బిల్లు మాదేనని అన్నారు. 2010లో కాంగ్రెస్ అదిఆకారంలో ఉన్నపుడు ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టగా రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని బిల్లులోని అంశాలను పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఒకవేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందితే ఆ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పార్టీలకే దక్కుతుందని అన్నారు

*సుజీవన్ వావిలాల*🖋️

Monday, September 18, 2023

ముంబై నగరంలో 69 కిలోల బంగారం 336 కిలోల ఆభరణాలతో.... విఘ్నేశ్వరుడు

*ముంబై నగరంలో 69 కిలోల బంగారం 336 కిలోల ఆభరణాలతో.... విఘ్నేశ్వరుడు...*

ముంబై : దేశంలో ప్రముఖంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి. భక్తులు తమ శక్తికొద్దీ గణేషుడి ప్రతిమలు కొలుదీర్చి పూజలు చేస్తారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో గణేష్‌ చతుర్థి అత్యంత వైభవంగా జరుగుంది.గణేషుడి భారీ విగ్రహాలతోపాటు కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన మంటపాలను ఇక్కడ చూడవచ్చు.

ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణపతి మండపాలలో ఒకటిగా పేరుగాంచిన గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ తమ 69వ వార్షిక గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా 69 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలతో గణేష్‌ విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు.కాగా ఈ సంవత్సరం ఉత్సవాలకు రూ. 360.45 కోట్ల బీమా కవరేజీని తీసుకున్నట్లు జీఎస్‌బీ సేవా మండల్ వైస్ ఛైర్మన్ రాఘవేంద్ర జి భట్‌ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో వెల్లడించారు. గతేడాది రూ. 316.40 కోట్లకు బీమా తీసుకోగా ఈసారి మరింత మొత్తానికి కవరేజీ కవరేజీ తీసుకున్నారు. బీమా ప్యాకేజీలో బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు రూ. 31.97 కోట్ల కవరేజీ ఉంటుంది. మిగిలినది మంటపం, నిర్వాహకులు, భక్తుల భద్రతకు కవరేజీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

ఖైరతాబాద్ వినాయకుడికి.... తొలిపూజ.... హాజరైన గవర్నర్లు...!

*ఖైరతాబాద్ వినాయకుడికి.... తొలిపూజ.... హాజరైన గవర్నర్లు...!*

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణపతికి తొలిపూజ జరిగింది. గణేశుడు ఈసారి 'శ్రీ దశమహా విద్యా గణపతి'గా భక్తులకు దర్శనమిస్తున్నాడు.స్వామి వారికి కుడివైపున లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపు వీరభద్రస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మహా గణపతికి ఉదయం 11 గంటలకు తొలిపూజ జరిగింది. ఈ పూజలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. బడా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరోవైపు అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

*సుజీవన్ వావిలాల🖋️*

విషయం లేనోళ్లను విశ్వసిస్తే.... వినాశనం గ్యారెంటీ.... KTR

*విషయం లేనోళ్లను విశ్వసిస్తే.... వినాశనం గ్యారెంటీ.... KTR*

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ చేసిన పలు కీలక వాగ్దానాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కాంగ్రెస్‌ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహంతో కూడుకున్నవని విమర్శించారు.కాంగ్రెస్‌ కపట కథలు బాగా తెలిసిన తెలంగాణ గడ్డ ఇదని చెప్పారు. 

''రాబందుల రాజ్యమొస్తే.. రైతుబంధు రద్దవడం గ్యారెంటీ. కాలకేయుల కాలం వస్తే.. కరెంట్‌ కోతలు.. కటిక చీకట్లే. దగాకోరుల పాలనొస్తే.. ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ. బకాసురులు గద్దెనెక్కితే.. రైతుబీమా గల్లంతవ్వడం గ్యారెంటీ. స్కాముల పార్టీని స్వాగతిస్తే.. స్కీముల ఎత్తివేత గ్యారెంటీ. దొంగల చేతికి తాళాలు ఇస్తే.. సంపద స్వాహా గ్యారెటీ. విషయం లేనోళ్లను విశ్వసిస్తే.. వినాశనం గ్యారెంటీ. '' అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, September 17, 2023

మాస్టరూ.... పిల్లలతో ఇవేం పనులు...!

*మాస్టరూ.... పిల్లలతో ఇవేం పనులు...!*

చిన్నారి విద్యార్థుల చేతులతోనే మరుగుదొడ్డిని శుభ్రం చేయించిన సంఘటన తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం అంజూరు ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది.ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో ఒకటి, రెండు తరగతులకు సంబంధించి 15 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు వినియోగించుకునే మరుగుదొడ్డిని ఉపాధ్యాయులు చిన్నారులతోనే శుభ్రం చేయించడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఈవో లక్ష్మీపతిని వివరణ కోరగా.. విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

తృతీయ ఫ్రంట్ కు అవకాశం వుంది...ఒవైసీ

*తృతీయ ఫ్రంట్ కు అవకాశం వుంది.... కేసీఆర్ నాయకత్వం వహించాలి.... ఒవైసీ*

న్యూదిల్లి ...దేశంలో తృతీయ ఫ్రంట్‌కు బలమైన అవకాశాలున్నాయని ఏఐఎంఐఎం  అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ  అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దానికి నాయకత్వం వహించాలని ఆయన ఆకాంక్షించారు.హైదరాబాద్‌లో జరుగుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ మీటింగ్‌పై ఆయన్ను ఓ ఆంగ్ల ఛానల్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ''తృతీయ కూటమికి అవకాశం ఉందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. మాయావతి, కేసీఆర్‌ కూటముల్లో లేరు. ప్రాంతీయంగా మంచి పట్టున్న చాలా పార్టీలు ఎన్‌డీఏ, ఇండియా కూటమిలో భాగస్వాములు కాదు. అందుకే.. కేసీఆర్‌ చొరవ తీసుకొంటారని ఆశిస్తున్నాను. తేడాను మీరే చూడండి'' అని ఒవైసీ పేర్కొన్నారు. 

''దళితులు, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చెబుతోంది. మరి ముస్లింల మాటేంటీ..? మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడరెందుకు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తా. మైనార్టీలకు కాంగ్రెస్‌ ఏమి చేసింది..?రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌లో ఏమి చేశారో చూపించమనండి'' అని ఒవైసీ కాంగ్రెస్‌ను నిలదీశారు. తెలంగాణలో ముస్లింలు అంత్యంత సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉందని పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ అధినేత్రి....సోనియా గాంధీ...!

*మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ అధినేత్రి..... సోనియా గాంధీ...!*

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో ఆ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ హామీలను ప్రకటించారు.తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా దూసుకెళ్తున్న కాంగ్రెస్ మహిళా ఓటర్లే మెయిన్ టార్గెట్ గా మెజారిటీ హామీలు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీ హామీలతో పాటు సోనియాగాంధీ ప్రకటించిన మొత్తం హామీల లిస్టు ఇదే..

*మహాలక్ష్మీ పథకం* *ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2 వేల 500 ఆర్థిక సాయం*

*రూ.500 లకే గ్యాస్ సిలిండర్*

*ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం*

*ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం*

*ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం*

*రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం*

*వ్యవసాయం కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్*

*గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు*

*చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్*

*రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు*

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, September 16, 2023

బీజేపీ నేతలకు సిగ్గూశరం ఉంటే.....సీఎం కేసీఆర్‌

బీజేపీ నేతలకు సిగ్గూశరం ఉంటే కృష్ణాలో వాటా తేల్చమని మోదీని అడగాలి : సీఎం కేసీఆర్‌

కాషాయ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్‌.. అనంతరం సింగోటం క్రాస్‌ రోడ్డు వద్ద నిర్మించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బస్సులో వస్తున్న సమయంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు బీజేపీ జెండా పట్టుకొని బస్సుకు అడ్డం వస్తున్నరు. ఏం తప్పు చేశాను నేను. ఏం మోసం చేశాం.

నేను ఒక్క మాట అడుతుతున్న బీజేపీ బిడ్డలను. మీకు సిగ్గూ శరం, చీమునెత్తురు, పౌరుషం ఉంటే.. పెద్ద సిపాయి పార్టీ అని మాట్లాడుతరు. పాలమూరుకు, తెలంగాణకు నీళ్ల గురించి కేంద్రాన్ని అడిగాం. కృష్ణా నదిలో వాటాతేల్చమని ప్రధాని మోదీని కోరాం. ఇంత పెద్ద విశ్వగురువు అని చెప్పుకునే ప్రధాని, మా అంత సిపాయిలు అనే బీజేపీ, ఇక్కడ పెద్ద పెద్ద పోజులు కొట్టే నాయకులు మహబూబ్‌నగర్‌లో ఉన్నరు. వాటా తేల్చేందుకు పదేళ్లు అవుతుందా? కృష్ణా ట్రిబ్యునల్‌కు రెండు రాష్ట్రాలకు నీళ్లు పంచమని లేఖ రాయించాలి. దానికి మోదీ కుయ్‌మనడు కైమనడు.

ఇక్కడ సిగ్గులేని వీల్లు బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నరు. మీకు బుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి కృష్ణా ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయించాలి. మా వాటా కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాం. కేంద్రం పిలిపించి సుప్రీకోర్టు కేసును వెనక్కి తీసుకోవాలన్నారు. ఏడాది అయినా అతీగతి లేదు. సిగ్గులేని బీజేపీ నాయకులు మేం జాతీయ ఉపాధ్యక్షులమంటూ అడ్డంపొడువు మాట్లాడుతున్నరు. ప్రజలు వారిని నిలదీయాలి. పాలమూరులో జరిగిన నష్టం చాలు. ఎవరైనా బీజేపీ నాయకులు జెండాలు పట్టుకొని వస్తే నిలదీయాలి. పదేళ్లు అవుతుందా? కృష్ణా ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయడం లేదు’ అంటూ సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

the Global Climate Strike

*Press Release 16th September 2023*

Climate Front Hyderabad Organised Mass Gathering of Over 100 people as part of the Global Climate Strike at Arts College, Osmania, on Friday, September 15th, at 3:30 PM.

Our objective is to urge all political parties in Telangana to include the following crucial points in their election manifesto:

🤜 *Reinstate GO111 and  Safeguard Telangana's Drinking Water*

Ensure the restoration of GO111 to protect the drinking water sources of Telangana.

🤜 *Establish a Comprehensive Flood Mitigation Plan for the Entire State*

Provide a concrete and comprehensive strategy to mitigate the impact of floods across the entire state.

🤜 *Create a Plan to Address Crop Loss Due to Heat Waves, Untimely Rains, and Extreme Weather Events Caused by Climate Change*

Develop a comprehensive strategy to mitigate crop losses resulting from heatwaves, untimely rains, and extreme weather events attributed to climate change.

🤜 *Enforce Tree Protection Measures under the Haritha Haram Scheme*

Implement stringent measures to safeguard our trees and natural green cover under the Haritha Haram Scheme.

🤜 *Implement Measures to Prevent Groundwater Contamination*

"When the voices of the youth and the wise see eye to eye and come together, you know it's for a worthwhile cause and that's exactly what happened today in Hyderabad. We need to keep justice at the heart of everything we do and know that climate, gender, employment, economy and all themes intersect. We need to raise our voices and demand what is our right and bring to the forefront the rights of all other voices of farmers, marginalised communities, and so many others. We demand that the people in power act for climate justice." Thilaka on behalf of Climate Front Hyderabad, the organisers of the global climate strike event

"All corporate encouragement that the govt is doing is leading to destruction and depletion of resources of the state. We are heading towards a crisis which will not just harm us but will also leave nothing for the generations to come." Ashok Nayak, President Lambadi students organisation

When Science Is Saying We all Are under threat why are People ignoring the alert Message , why are policy Makers Taking Real Action , Babu Rao Scientist

We are all entering mass destruction phase and politicians are acting unaware sustainable development should be Everyones slogan because climate change is everyones problem , Sara Mathews Activist

"Majorly in India and Telangana, neo liberal policies are being followed which supports only the elite, neglecting the poor. Telangana development, even after 10 years of statehood is situated in Hyderabad, and isn't being evenly distributed across. Every year we encounter floods, none of the districts are protected from this, and the push from the government for paddy farming neglects the need to diversify the crops in order to sustain farmers livelihoods." - Akarsh, Organizer, Justice movement of India

Courtesy / Source by : NAPM Telangana