Thursday, June 30, 2022

ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదుల.... నమోదులో జాప్యమొద్దు

*ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదుల.... నమోదులో జాప్యమొద్దు....*

*రాష్ట్రాలకు కేంద్రం లేఖ*

దిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదుల నమోదులో జాప్యం చేయవద్దని కోరుతూ కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.అదేవిధంగా ఈ కేసుల్లో విచారణ రెండు నెలలు దాటినా కొనసాగుతూ ఉంటే అటువంటి కేసులపై నిశిత దృష్టి సారించాలని కోరింది. ప్రాసిక్యూషన్‌ తరఫు సాక్షులు సకాలంలో హాజరయ్యేలా చూసి, వారికి తగిన రక్షణ కల్పించే బాధ్యతను జిల్లా ఎస్పీలు తీసుకుంటే విచారణలు శరవేగంతో ముగుస్తాయని పేర్కొంది. ఈ కేసుల్లో ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదయ్యాక రెండు నెలలు దాటినా విచారణలు కొనసాగుతున్న సందర్భాల్లో ప్రతి మూణ్నెళ్లకు ఒకసారి జిల్లా, రాష్ట్రస్థాయి నివేదికల్లో పేర్కొనాలని సూచించింది.

ఈ నివేదికలను జిల్లా సెషన్స్‌ జడ్జి అధ్యక్షతన జరిగే సమావేశాల్లో జిల్లా ఎస్పీ, పబ్లిక్‌ ప్రాసిక్యూటరు సమీక్షిస్తారు. అవసరమైతే ప్రత్యేకంగా డీఎస్పీలను నియమించి విచారణ వేగవంతంగా సాగేలా చూడాలని హోం మంత్రిత్వశాఖ కోరింది. ఎస్సీ, ఎస్టీల జాతీయ కమిషన్‌తోపాటు పలు మార్గాల నుంచి వచ్చే వేధింపుల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులు సమీక్షించి తగువిధంగా స్పందించాలని కోరింది. ఇటువంటి వేధింపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి.. ఎస్సీ, ఎస్టీల ప్రాణాలతోపాటు ఆస్తుల పరిరక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. ఆయా ప్రాంతాల్లో తగినంతగా పోలీసు సిబ్బంది ఉండేలా నియామకాలు జరపాలని సూచించింది.

link Media ప్రజల పక్షం🖋️ 

కరోనా పరీక్షలు చేశాకే.... లోపలికి

*కరోనా పరీక్షలు చేశాకే.... లోపలికి*

*బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీకి వచ్చే వారికి పార్టీ పాస్‌లు ఉంటేనే ఎంట్రీ*

*భద్రతా ఏర్పాట్లపై సమీక్షలో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడి*

హైదరాబాద్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యే అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, నెగెటివ్‌ వస్తేనే లోపలికి అను మతిస్తామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. భేటీకి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో వీఐపీలు వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై స్టీఫెన్‌ రవీంద్ర గురువారం సమీక్షించారు. కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెచ్‌ఐసీసీ ప్రాంగణం వద్ద ఆర్టీపీసీఆర్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

భేటీ కోసం బీజేపీ జారీ చేసిన పాస్‌లను తీసుకురావాలని, పోలీసులు వాటిని పరిశీలించాకే లోపలికి వెళ్లనిస్తారని స్పష్టం చేశారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌ వస్తే.. పాస్‌ ఉన్నా కూడా లోనికి అనుమతించబోమని తెలిపారు. ఇది బీజేపీ అంతర్గత సమావేశం కావడంతో పరిమిత స్థాయిలో నేతలకు అనుమతి ఉంటుం దని.. ఇతర నేతలు, కార్యకర్తలు, జన సందోహం రావొద్దని సూచించారు. హెచ్‌ఐసీసీలో నాలుగం చెల భద్రత, వీఐపీలు వచ్చే రోడ్ల వెంట మూడం చెల భద్రత ఉంటుందన్నారు. ఎలాంటి అవాంఛనీ య ఘటనలు జరగకుండా శాంతి భద్రతలు, ట్రాఫిక్‌ పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు.
*పోలీసు పహారాలోకి హోటల్, సభా ప్రాంగణం*
భేటీ జరిగే హెచ్‌ఐసీసీ, అతిథులు బసచేసే నోవాటెల్‌ హోటల్‌ను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్, జిల్లాలు, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్పెషల్‌ పార్టీ, బెటాలియన్‌ పోలీసులు కలిపి ఆరు వేల మందికిపైగా పహారా కాయనున్నారు.

ఇక ప్రధాని, వీవీఐపీల భద్రత కోసం సుమారు 300 మంది స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) సిబ్బంది మోహరించనున్నారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా 1,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ తాత్కాలిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Wednesday, June 29, 2022

70మార్కులు వస్తే.... సున్నా వేసారు ఇంటర్ ఫలితాల్లో దారుణాలు

*70మార్కులు  వస్తే.... సున్నా వేసారు ఇంటర్ ఫలితాల్లో దారుణాలు*

*తప్పుగా నమోదు చేసిన ఎగ్జామినర్‌*

*ఇంటర్‌ ఫలితాల్లో వెలుగుచూస్తున్న దారుణాలు*

*విద్యార్థులకు శాపంగా అధికారుల నిర్లక్ష్యం*

హైదరాబాద్‌,  : పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థుల జీవితాలతో ఇంటర్మీడియట్‌ బోర్డులోని కొందరు అధికారులు చెలగాటమాడారు. ఫలితాల వెల్లడిలో తమ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తుపై దెబ్బ కొట్టారు. మంగళవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాలల్లో అనేక తప్పులు జరిగినట్టు తెలుస్తోంది. కొందరు విద్యార్థులకు వారికొచ్చిన మార్కులకు బదులుగా సున్నా మార్కులు నమోదైన ఘటనలు వెలుగు చూస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఓ ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థి ఎకనమిక్స్‌ పేపర్‌లో 70 మార్కులు సాధిస్తే సున్నా వచ్చాయని చూపి ఫెయిల్‌ చేశారు. మరో విద్యార్థి ఓ పేపర్‌లో ఒక్క మార్కు సాధిస్తే ఫలితాల్లో మాత్రం '0' వేశారు. బద్రి గోపి (హాల్‌టికెట్‌ నం.2243218740) అనే విద్యార్థికి ఫస్ట్‌ ఇయర్‌కు సంబంధించి ఇంగ్లీషులో 62, తెలుగులో 93, ఎకనమిక్స్‌లో 38, చరిత్రలో 37, పొలిటికల్‌ సైన్స్‌లో 72 మార్కులు వచ్చాయి. అలాగే సెకండ్‌ ఇయర్‌ ఇంగ్లీషులో 70 మార్కులు, తెలుగులో 90, చరిత్రలో 93, పొలిటికల్‌ సైన్స్‌లో 80 మార్కులు వచ్చాయి. కానీ ఎకనమిక్స్‌లో మాత్రం '0' మార్కులు నమోదయ్యాయి. ఈ విద్యార్థికి సంబంఽధించిన వివరాలను పరిశీలించిన అధికారులు ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఆ విద్యార్థికి 70 మార్కులు రాగా అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ సున్నా అని నమోదు చేశారు. ప్రైవేట్‌కు చెందిన ఆ ఎగ్జామినర్‌ మరికొందరు విద్యార్థులకు కూడా ఇలాగే సున్నా మార్కులేసినట్టు గుర్తించారు. దీంతో ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన అధికారులు సదరు ఎగ్జామినర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

ఇక, జమ్ములోల్ల హరికిరణ్‌ (2256202884) అనే విద్యార్థి విషయంలో మాత్రం జీరోకు బదులుగా ఒక్క మార్కును గుర్తించారు. హరికిరణ్‌కు సంస్కృతం-2 పేపర్‌లో ఒక్క మార్కు వేస్తే ఫలితాల్లో సున్నా నమోదు చేసినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. ఎగ్జామినర్ల నిర్లక్ష్యం వల్లే ఈ తరహా పొరపాట్లు జరిగినట్టు బోర్డు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇతర పేపర్లలో మంచి మార్కులు సాధించి ఏదైనా ఓ సబ్జెక్టులో సున్నా మార్కులొచ్చిన విద్యార్థులపై అధికారులు దృష్టి పెట్టారు. అలాంటి విద్యార్థులకు రీ వాల్యూయేషన్‌ విధానంలో మార్కులను సరిచేయాలని భావిస్తున్నారు. అయితే, సాధించిన మార్కులకు బదులుగా సున్నా మార్కులు నమోదైన ఘటనలు ఎన్ని ఉన్నాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కాగా, మార్కులపై అభ్యంతరాలు ఉన్న విద్యార్థులు రీ-వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ సూచించారు. రీ-కౌంటింగ్‌ కోసం ప్రతీ పేపర్‌కు రూ. 100, రీ-వెరిఫికేషన్‌ కోసం ప్రతీ పేపర్‌కు రూ. 600 చొప్పున ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

విమాన టికెట్లు తీసుకోండి మీ దేశానికి వెళ్లిపోండి....!

*విమాన టికెట్లు తీసుకోండి మీ దేశానికి వెళ్లిపోండి....!*

హైదరాబాద్‌: నైజీరియా, ఐవరీకోస్ట్‌ దేశాల నుంచి వచ్చి పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు నైజీరియన్లు ఉగ్వు ఆంటోనీ, ఒబిరీయా పీటర్‌, చుక్వుడాలు కింగ్స్‌లే, ఇద్దరు ఐవరీకోస్ట్‌ దేశస్థులు కోనె మౌస్సా, విలియమ్‌ డికోస్టైర్‌లను హైదరాబాద్‌ పోలీసులు వారి దేశాలకు పంపించారు.వారివద్ద సొంతదేశాలకు వెళ్లేందుకు డబ్బులేకపోవడంతో పోలీసులే విమాన టిక్కెట్లను కొని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా పంపించామని హైదరాబాద్‌ నుంచి పంపుతున్నామని కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

*అక్రమంగా 750మంది విదేశీయులు:*
ఆఫ్రికా దేశాల నుంచి వేర్వేరు వీసాలతో వచ్చి పాస్‌పోర్టు, వీసా గడువు తీరినా 750మంది హైదరాబాద్‌లో ఉంటున్నారని కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ప్రాంతీయ విదేశీ నమోదు కార్యాలయం సమాచారం ప్రకారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 2,900మంది విదేశీయులు నివసిస్తున్నారని చెప్పారు. వీరిలో చాలామంది ప్రాంతీయ విదేశీ నమోదు కార్యాలయం అధికారులకు ఎప్పటికప్పుడు వారి సమాచారం అందిస్తున్నారని తెలిపారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ అక్రమ రవాణా వంటి నేరాల్లో ఆఫ్రికన్లు ఎక్కువగా ఉంటున్నారన్న సమాచారంతో తాము ఈ వివరాలను సేకరించామన్నారు. మాదకద్రవ్యాల నిఘా విభాగం డీసీపీ గుమ్మి చక్రవర్తి సమావేశంలో పాల్గొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️

GHMC లో అవినీతి అధికారులను అరికట్టలేకపోతున్న తెరాస ప్రభుత్వం

https://twitter.com/SrinivasRTIA/status/1542109372431876103?t=D-sr50mNDDl5qfocQM8cDQ&s=08   Dear @TelanganaCMO @TelanganaCS @DrTamilisaiGuv @kishanreddybjp @trsharish @MinisterKTR @IKReddyAllola @YadavTalasani @SabithaindraTRS @mahmoodalitrs @CommissionrGHMC @TSMAUDOnline @GHMCOnline GHMC *అభివృద్ధిపనుల్లో నిర్లక్ష్యం రుజువైనందున సంబంధిత ఇంజనీర్లను డిస్మిస్ చేయగలరు.... @శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్* https://t.co/7pAy4pYniN 

            ----------------------------------------

*శ్రీనివాసరావు సర్ ప్రజాసంకల్పం GHMC పరిధిలో గల అన్ని సర్కిల్ లలో వున్న అవినీతి అధికారుల లిస్ట్ వాస్తవాలతో తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారికి వివిధ మాధ్యమాల చేరవేస్తే నామమాత్రపు చర్యలు తీసుకోవడాన్ని ఖండిస్తున్నాము.... Bplkm🪶*  *Copy to Group link Media*  29/06/2022 prajasankalpam1.blogspot.com

ప్రముఖుల రాక....సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్

*ప్రముఖుల రాక....సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్*

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ రాక సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు, నిషేదాజ్ఞలు విధించారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ చుట్టు పక్కల 5కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారాగైడర్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వంటివి ఎగరడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు.భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని సహా కేంద్రమంత్రులు, జాతీయ నేతలు రానున్న దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఈనెల 30వ తేదీ ఉదయం 6గంటల నుంచి జులై 4వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని సీపీ వివరించారు. మరో వైపు జులై 1 నుంచి 4వరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని సీపీ ఆదేశాలు జారీ చేశారు.

link Media ప్రజల పక్షం🖋️

Tuesday, June 28, 2022

Oath of Hon'ble Telangana High Court Chief Justice

Administered the oath of office to  Hon'ble Telangana High Court Chief Justice Shri Ujjal Bhuyan at Raj Bhavan #Hyderabad.
Alongside Honb @TelanganaCMO Shri K.Chandrasekhar Rao garu,Honb @kishanreddybjp, Honb High Court Judges,
Sr Advocates,Honb Ministers,MPs MLAs & Officials.
https://t.co/CJvX4T84by

తెలంగాణ ఇంటర్ ఫలితాలలో అమ్మాయిలదే.... హవా

*తెలంగాణ ఇంటర్ ఫలితాలలో అమ్మాయిలదే.... హవా*

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,28,262 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 5,90,327 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం, రెండో సంవత్సరంలో 67.82 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి తెలిపారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు
*ఇంటర్‌ మొదటి సంవత్సరం..*
❃ పరీక్షకు హాజరైన విద్యార్థులు: 4,64,892

❃ ఉత్తీర్ణత సాధించినవారు: 2,94,378

❃ ఉత్తీర్ణత శాతం: 63.32 శాతం

❃ పరీక్షకు హాజరైన అమ్మాయిలు: 2,33,210

❃ ఉత్తీర్ణత సాధించినవారు: 1,68,692

❃ ఉత్తీర్ణత శాతం: 72.33

❃ పరీక్షకు హాజరైన అబ్బాయిలు: 2,31,682

❃ ఉత్తీర్ణత సాధించినవారు: 1,25,686

❃ ఉత్తీర్ణత శాతం: 54.20 శాతం

ఇంటర్‌ రెండో సంవత్సరం..

❉ పరీక్షకు హాజరైన విద్యార్థులు: 4,63,370

❉ ఉత్తీర్ణత సాధించినవారు: 2,95,949

❉ ఉత్తీర్ణత శాతం: 67.82 శాతం

❉ పరీక్షకు హాజరైన అమ్మాయిలు: 2,16,389

❉ ఉత్తీర్ణత సాధించినవారు: 1,64,172

❉ ఉత్తీర్ణత శాతం: 75.86

❉ పరీక్షకు హాజరైన అబ్బాయిలు: 2,19,981

❉ ఉత్తీర్ణత సాధించినవారు: 1,31,777

❉ ఉత్తీర్ణత శాతం: 60 శాతం

ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆగస్టు చివరినాటికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటర్‌ మొదటి ఏడాది ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా (76 శాతం), హనుమకొండ జిల్లా (74 శాతం) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. రెండో ఏడాది ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా (78 శాతం) మొదటి స్థానంలో ఉండగా, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా (77శాతం) రెండో స్థానం దక్కించుకుంది.

link Media ప్రజల పక్షం🖋️

Monday, June 27, 2022

కలెక్టర్ గా.... రాజేంద్రనగర్ HM కుమార్తె.....!

*కలెక్టర్ గా.... రాజేంద్రనగర్  HM కుమార్తె.....!*

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సుగుణ కుమార్తె పి.అన్వేషారెడ్డి ఒరిస్సా రాష్ట్రంలోని కలహండి జిల్లా కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించడంతో రాజేంద్రనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన పి.యుగంధర్‌రెడ్డి, పి.సుగుణ కుమార్తె అన్వేషారెడ్డి యూపీఎ్‌సఈ 2017 బ్యాచ్‌లో ఆల్‌ ఇండియాలో 80వ ర్యాంక్‌ సాధించి ఐఏఎ్‌సకు ఎంపికైంది.

link Media ప్రజల పక్షం🖋️

Honoured present and former military officers

Honoured to have been invited for an interaction and tea with the President of India in Rashtrapati Bhavan for a reunion of present and former military officers who have served in Rashtrapati Bhavan since Independence. 

ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది.... Bplkm🪶

                 ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది

 తెలంగాణ సాధించుకోవడం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. అలా అమరులైన అమరవీరుల ఆశయాలను నీరుగారుస్తున్న తెలంగాణ ప్రభుత్వం.

 నీళ్లు నిధులు నియామకాల ను ఈ తెలంగాణ ప్రభుత్వం పాతాళంలో నెట్టివేసింది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కు లకు అనుగుణంగా ప్రజల పక్షాన ప్రజా ప్రయోజనాల కోసం నిస్వార్ధంగా  ప్రశ్నించే వారి మీద అక్రమ కేసులు పెడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం.

 తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖల  అవినీతి అధికారులు అవినీతికి పాల్పడుతున్న, అవినీతి అధికారుల గురించి వార్తా కథనాలు వచ్చినా సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తెలియచేసిన  ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం అని ప్రజలు తెలుసుకుంటున్నారు.

 అందుకే ప్రజలారా అన్యాయాలను అక్రమాలను మీ గొంతుక ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలంగాణలోని ప్రజలందరికీ చేరే విధంగా నడుం బిగించండి. ప్రజలందరినీ జాగృతం చేయాలి. లేకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది.

 మీ ఈ పోరాటం రాజకీయాలకు అతీతంగా ఉండాలె

Bplkm🪶

Saturday, June 25, 2022

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడుదాం

మాధక ద్రవ్య నిరోధక దినోత్సవం 

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm
https://t.co/WO6gsdsvEQ   (youTube)
https://t.co/8MYTUFrG5U

Bplkm🪶

-------------------------------------------------------------
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడుదాం.. ఆన్లైన్లో ప్రతిజ్ఞ చేసి సర్టిఫికేట్ పొందండి.
https://t.co/qBlvzUk7NQ 
#SayNoToDrugs #FightAgainstDrugs 
@hydcitypolice @cyberabadpolice @RachakondaCop @cpwrl @cp_nizamabad @KhammamCp @cpramagundam @knr_police @siddipetcp @SpKothagudem @spsuryapet https://t.co/4L5pz8axdG

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. జులై 2న మోదీ హైదరాబాద్‌ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారురాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లో మోదీ నగరంలోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారు. జులై 1న మధ్యాహ్నం 3గంటలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ చేరుకుంటారు. ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్‌లో కిలోమీటరు దూరం నిర్వహించే రోడ్‌షోలో నడ్డా పాల్గొంటారు.

link Media ప్రజల పక్షం🖋️ 

టీచర్ల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ.... కీలక ఉత్తర్వులు

టీచర్ల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ.... కీలక ఉత్తర్వులు

హైదరాబాద్‌: ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల నల్గొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్‌ ఆలీపై ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలకు హాజరుకాకుండా రాజకీయాలు, స్థిరాస్తి వ్యాపారం చేశారని జావీద్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

link Media ప్రజల పక్షం🖋️ 

Thursday, June 23, 2022

రూ.891 కోట్లున్న టీఆర్‌ఎస్‌కు గజం రూ.100కే స్థలమా?

రూ.891 కోట్లున్న టీఆర్‌ఎస్‌కు గజం రూ.100కే స్థలమా?

Courtesy by : ABN ఆంధ్రజ్యోతి మీడియా ట్విట్టర్ 
రూ.891 కోట్లున్న టీఆర్‌ఎస్‌కు గజం రూ.100కే స్థలమా?

  • పార్టీకి రూ.361 కోట్ల నగదు ఉందని కేసీఆరే చెప్పారు!
  • సంపన్న పార్టీకి చౌకగా ప్రభుత్వ భూములెందుకు?
  • ఇది ముమ్మాటికీ అధికార దుర్వినియోగమే
  • స్థలాల కేటాయింపును సవాలు చేస్తూ పిటిషన్‌
  • ప్రభుత్వ జీవోలు కొట్టేయాలని కోరిన పిటిషనర్‌
  • పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు నోటీసులిచ్చిన హైకోర్టు
  • సీఎస్‌, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, 
  • సీసీఎల్‌ఏ, హైదరాబాద్‌ కలెక్టర్లకూ..
  • 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం


హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్‌ జిల్లాలోని బంజారాహిల్స్‌లో రూ.వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కారుచౌకగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయస్థానం కేసీఆర్‌కు ఈ నోటీసులిచ్చింది. టీఆర్‌ఎ్‌సకు గజం రూ.100కే ప్రభుత్వ స్థలాలను కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఆల్‌ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్‌ కాన్ఫెడరేషన్‌ తెలంగాణ అధ్యక్షుడు కె.మహేశ్వర్‌రాజ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. టీఆర్‌ఎస్‌ పార్టీకి అన్ని జిల్లా కేంద్రాల్లో చదరపు గజం రూ.100 చొప్పున ఎకరం భూమిని కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  2018లో జీవో జారీ చేశారని తెలిపారు. 


సంపన్న పార్టీకి కారుచౌకగా స్థలాలా?

బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12, ఎన్‌బీటీనగర్‌ సర్వే నంబరు 403/పీ (షేక్‌పేట్‌ రెవెన్యూ గ్రామం, హైదరాబాద్‌ జిల్లా)లో 4,935 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ ఈ ఏడాది మే 11న జీవో 47ను జారీ చేశారని న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల కోసం కేటాయించడం అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో చదరపు గజం విలువ రూ.2 లక్షలకు పైగా ఉందని, అధికారులు ప్రభుత్వ భూములకు ఇంకా ఎక్కువ ధర వచ్చేలా చూడాలి తప్ప.. అధికార పార్టీకి తలొగ్గి పనిచేయరాదని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ.. అధికారులపై ఒత్తిడి తెచ్చి జీవోలు జారీ చేయించుకుందని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలు, ప్రజల ఆస్తులకు ట్రస్టీలుగా ఉన్న వ్యక్తులు మోసపూరితంగా వ్యవహరించరాదని పేర్కొన్నారు. అధికారుల చర్యల వల్ల ప్రజాధనానికి భారీగా గండి పడిందన్నారు. సహజ వనరులు, ప్రభుత్వ ఆస్తులను ఇతరులకు కేటాయించేటప్పుడు పారదర్శక విధానాన్ని పాటించాలని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేలా భూములను వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుందన్నారు. 


అధికారంలో ఉన్న వ్యక్తుల ప్రభావానికి లొంగిపోయి కారుచౌకగా భూములను కేటాయించడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ప్లీనరీలో తమ పార్టీకి రూ.891 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారని.. ఇందులో రూ.361 కోట్ల నగదు వివిధ బ్యాంకుల్లో ఉన్నట్లు వెల్లడించారని తెలిపారు. దేశంలోని సంపన్న రాజకీయ పార్టీల్లో టీఆర్‌ఎస్‌ కూడా ఒకటన్నారు. రూ.వందల కోట్ల డిపాజిట్లు ఉన్న పార్టీకి ప్రభుత్వం అతి తక్కువ ధరకు స్థలాలు కేటాయించడంలో అర్థం లేదని చెప్పారు. 2005లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో ఎకరం భూమి కేటాయించిందని గుర్తుచేశారు. తాజాగా కేటాయించిన స్థలం టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కిలోమీటరు దూరంలోపే ఉందన్నారు. అక్రమంగా జారీ చేసిన ఈ జీవోలను కొట్టేయాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివా్‌సరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ, హైదరాబాద్‌ కలెక్టర్లకు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.

ఇదిగో సిరిసిల్ల వ్యవసాయ కళాశాల

ఇదిగో సిరిసిల్ల
వ్యవసాయ కళాశాల..

త్వరలోనే సీఎం కేసీఆర్
చేతుల మీదుగా ప్రారంభం

సిరిసిల్ల సిగలో మరో మణిహారం చేరుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లెల్ల శివారులో ఆధునిక వ్యవసాయ కళాశాల నిర్మితమైంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అత్యాధునిక హంగులు.. సకల వసతులతో రూపుదిద్దుకున్నది. 69.30 కోట్ల వ్యయంతో 18 ఎకరాల్లో కళాశాల భవనం, బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు, మరో 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా కేంద్రం. ఫాంలాండ్ను సర్కారు నిర్మించింది. అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్లు, ప్రయోగశాల,
సెమినార్ రూములు, అధ్యాపకుల గదులు, అసోసియేట్ డీన్ చాంబర్, ఆధునిక
లైబ్రరీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఇది రెండోది కాగా,
త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల
మీదుగా ప్రారంభోత్సవం కానుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము
• హైదరాబాద్ తర్వాత రెండోది ఇక్కడే
• మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లెల్లలో అగ్రికల్చర్ కాలేజీ
• 16 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో భవన సముదాయం
• మరో 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం
ప్రారంభోత్సవానికి సిద్ధం
• విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షం.

.link Media ప్రజల పక్షం 

Wednesday, June 22, 2022

తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఇంట్లో.... ఎన్ఐఏ సోదాలు

*తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఇంట్లో.... ఎన్ఐఏ సోదాలు*

ఉప్పల్‌: తెలంగాణ హైకోర్టు న్యాయవాది శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఉప్పల్‌ చిలుకానగర్‌లోని ఆమె నివాసంలో ఎన్ఐఏ అధికారులు గురువారం ఉదయం సోదాలు చేశారు.విశాఖలో మూడేళ్లుగా కనిపించకుండా పోయిన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని నక్సల్స్‌లో చేర్చారని శిల్పపై అభియోగాలు దాఖలయ్యాయి. విశాఖలో మిస్సింగ్‌ కేసుగా నమోదైన ఈ కేసు దర్యాప్తును తాజాగా ఎన్‌ఐఏకి అప్పగించారు. విశాఖ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు శిల్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిల్పను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు. రాధ మిస్సింగ్‌ కేసుకు సంబంధించి అధికారులు శిల్పను ప్రశ్నించనున్నారు.

మూడు సంవత్సరాల క్రితం తమ కూతురుని కిడ్నాప్ చేశారని 2017 డిసెంబరులో విశాఖలోని పెదబయలు పీఎస్‌లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని రాధ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని ఫిర్యాదులో తెలిపారు. వైద్యం పేరుతో దేవేంద్ర రాధను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మెదక్‌ జిల్లా చేగుంటలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్‌ కుమారుడి ఇంట్లో తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

ఆశామాషి కాలుష్య ధ్రువపత్రాలు..... చెల్లవ్....!ట్రాఫిక్‌ పోలీసుల కొత్త నిర్ణయం

ఆశామాషి కాలుష్య ధ్రువపత్రాలు..... చెల్లవ్....!*

*ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని షరతు*

*ట్రాఫిక్‌ పోలీసుల కొత్త నిర్ణయం*

*హైదరాబాద్‌...*

*కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం జారీ చేసే సంచార వాహనం*
రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం పరిమితులకు లోబడే ఉందంటూ రోడ్ల పక్కన ఉండే వ్యాన్లు ఇచ్చే ధ్రువపత్రాలు ఇకపై చెల్లవని చెబుతున్నారు. కాలుష్య ధ్రువపత్రం పొందిన వాహనం రిజిస్ట్రేషన్‌ నంబరు ఆన్‌లైన్‌ ద్వారా రవాణా శాఖ సర్వర్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌కు ఏకకాలంలో చేరితేనే ధ్రువపత్రానికి విలువ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వాహన కాలుష్య పరిమితి ధ్రువపత్రాలను ప్రస్తుతం రవాణాశాఖ అనుమతి పొందిన ఏజెన్సీలు, సంచార వాహనాలు ఇస్తున్నాయి. ఈ విధానంలో అక్రమాలకు తావులేకుండా అన్ని సంచారవాహనాలు ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరించాలని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. దిల్లీ, బెంగుళూరులో ఏడేళ్లుగా ఈ విధానం అమలవుతోంది.

ఇదీ నిదర్శనం: ఓ పోలీస్‌ అధికారి గత నెల తన వాహనానికి కాలుష్య ధ్రువీకరణ పరీక్ష చేయించారు. జారీ చేసిన పత్రంపై గడువు నవంబరు 2022 వరకు ఉండాల్సి ఉండగా, నవంబరు 2023 వరకూ చెల్లుబాటయ్యేలా ఇచ్చారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

నామ్‌కే వాస్తే ధ్రువపత్రం: రవాణా శాఖ ద్వారా అనుమతి పొందిన ఏజెన్సీలు వాహనం కాలుష్యం పరిమితిలోపే ఉందంటూ పీయూసీ (పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌) పేరుతో వాహనాలకు ధ్రువపత్రాలు ఇస్తున్నాయి. ఆటోవాలాలు 70 శాతం మంది, ద్విచక్ర వాహనదారుల్లో 40 శాతం మంది వాహనాలను తనిఖీ చేయించుకోకుండానే ధ్రువపత్రాలను తీసుకుంటున్నారు. దీనివల్ల పదేళ్లకు పైబడిన వాహనాల నుంచి కూడళ్లలో వాహనాల నుంచి భారీగా పొగ వెలువడుతోంది.

ఆన్‌లైన్‌ వల్ల ఇదీ ప్రయోజనం

కాలుష్య ధ్రువపత్రం జారీచేసే ప్రతి సంచార వాహనంలో అంతర్జాల ఆధారిత కంప్యూటర్‌ ఉంటుంది. ధ్రువపత్రం పొందిన ప్రతి వాహనం వివరాలు, ఫలితం అందులో నమోదు కాగానే.. రవాణా శాఖ సర్వర్‌కు, అక్కడినుంచి ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంకు చేరుతుంది. దాన్నుంచి రోడ్లపై ట్రాఫిక్‌ విధుల్లో ఉండే పోలీసుల పీడీఏ(వ్యక్తిగత డిజిటల్‌ సహాయకారి) యంత్రాలకు వెళ్తుంది. తనిఖీలప్పుడు వాహన నంబరు నమోదుచేయగానే కాలుష్య పరిమితి ధ్రువపత్రం ఉందా? లేదా? తెలిసిపోతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానం లేకపోవడంతో కొందరు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా కాలుష్య ధ్రువీకరణ పత్రాలిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చేవారి అనుమతుల రద్దుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది.... తెలంగాణ లో ఏమి జరుగుతుంది.

ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది.... తెలంగాణ లో ఏమి జరుగుతుంది. ధరణి సమస్యల మీద రైతులకు అండగా ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా తెలంగాణ వచ్చినప్పటినుంచి రైతుల పక్షాన పోరాడుతూనే ఉంది. అయినా ధరణి పోర్టల్ లో సమస్యలు పరిష్కారం కావడం లేదు. రైతులు కలెక్టర్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అయినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న ప్రభుత్వ అధికారులు కూడా బానిసలుగా బతుకుతూ  ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజలకు జవాబుదారీ తనంగా కాకుండా  అవినీతి మార్గంలో నడుచుకుంటున్నారు. దీనికితోడు తెలంగాణలో భారతీయ జనతాపార్టీ కూడా ఈ అవినీతిని చూసి కళ్ళు మూసుకుని ఉంది. తెలంగాణ బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు టీవీల ముందు కెసిఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని ప్రజలను మభ్య పెట్టడమే తప్ప చేసేది ఏమీ లేదు అని ప్రజలు తెలుసుకున్నారు. అందుకే ప్రజలారా  రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వీరందరికీ తగిన గుణపాఠం చెప్పాలి.....Bplkm🪶   prajasankalpam1.blogspot.com

Tuesday, June 21, 2022

పార్కింగ్ బాధ్యత యజమానులదే .... హై కోర్ట్!

పార్కింగ్ బాధ్యత యజమానులదే  .... హై కోర్ట్!

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ మాల్‌లు, సినిమా థియేటర్లు.. తదితర చోట్ల వినియోగదారులకు పార్కింగ్‌ వసతి కల్పించాల్సిన బాధ్యత వాటి యజమానులదే అని హైకోర్టు స్పష్టం చేసింది.నిబంధనలకు విరుద్ధంగా మెయింటనెన్స్‌ పేరు చెప్పి పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడాన్ని తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అక్రమంగా పార్కింగ్‌ ఫీజుల వసూలు విషయం న్యాయ మూర్తుల దృష్టికి రావడంతో హైకోర్టు ఈ అంశాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)గా విచారణకు స్వీకరించింది.

దీనిపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ మాల్‌లు, సినిమా థియేటర్లు.. లాంటి భవనాలను నిర్మించే సమయంలోనే మున్సిపల్‌ నిబంధనల ప్రకారం పార్కింగ్‌ సదుపాయం ఉందా? లేదా? అని చూసిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అక్రమంగా ఫీజు వసూలు చేయడం గతంలో తాము ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ ప్రణాళిక శాఖ డైరెక్టర్‌తో పాటు రెవెన్యూ, హోం శాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది.

link Media ప్రజల పక్షం🖋️ 

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు..... వాతావరణ కేంద్రం హెచ్చరిక.....!

*తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు..... వాతావరణ కేంద్రం హెచ్చరిక.....!*

హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్న ఉపరితల ద్రోణి ఇవాళ బలహీనపడిందని తెలిపింది. కింది స్థాయి గాలులు నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కుసిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

link Media ప్రజల పక్షం🖋️ 

మూసీ ఒడ్డు పై ఇండ్లు కోల్పోయిన వారికి పట్టాలు

హైదరాబాద్ జిల్లా సైదాబాద్ MRO ఆఫీస్,GHMC అఫ్జల్ నగర్ పరిధిలో గల తీగల గూడ లో పట్టాల పంపిణీ 

మూసీ ఒడ్డు పై 30 సంవత్స రాలు గా ఉనికిలో ఉన్న పేదల గుడిసెలు తీసివేసిన సంగతి గుర్తే ఉంటుంది.
అప్పుడు 132 కుటుంబాలకు ఇండ్లు ఇచ్చారు.
మిగతా 90 కుటుంబాల ఇండ్ల కోసం HRF నుండి BILAL, చత్రి సంస్థ నుండి నివాస హక్కుల కార్య కర్త హైమ విశేషం గా కృషి చేశారు.
ఈ రోజు మిగతా 90 కుటుంబాలకు గృహాలు కేటాయించిన పత్రాలు MIM,నాయకులు,మన కార్య కర్తల సమక్షం లో అంద చేయడం జరిగింది.
ఇది Bilal,Hyma ల కృషి పలితం.
HRF,రెండు రాష్ట్రాల కమిటీ ల తరపున వాళ్ళను అభి నందిద్దాం.
💐🌺🌷
Courtesy by : HRF (మానవ హక్కుల వేదిక)

సమాజం ఎన్నటికీ మరువని ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్

ప్రొఫసర్ సారూ మిమ్మల్ని యాదిమరిచేట్టు చేస్తున్న దొర..... కానీ మీరు తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ వుంటారు 🎉🙏...... Bplkm🪶 prajasankalpam1.blogspot.com 


*సమాజం ఎన్నటికీ మరువని ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్* 

*తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ 11వ వర్ధంతి వేడుకలు*

తెలంగాణ సింద్దాంత కర్త, తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ 11వ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆయన విగ్రహానికి ఉద్యమ కారుల ఆధ్వర్యంలో పూలమాలకు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1952 నుంచి తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని తెలంగాణ సమాజంలో అవగాహన కల్పించడంతోపాటు మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయ పక్షాలన్నింటినీ ఒప్పించడంలో కీలక భూమిక వహించిన ప్రొఫెసర్ జయశంకర్ ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువ లేదని ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇద్రీస్, జెడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్,   సీనియర్ ఉద్యమ నేత రాజా వరప్రసాద్ రావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉద్యమ నాయకులు వంగూరు గంగిరెడ్డి మరియు నక్కల వెంకటేష్ గౌడ్,విద్యార్థి ఉద్యమనేతలు జాంగారి రవి, లక్ష్మణ్ నాయక్, మామిడిపల్లి శరత్, రాఘవేందర్, జూపల్లి శంకర్, మలినేని సాంబశివ రావు, బాలయ్య, మల్లయ్య యాదవ్, దిలీప్ కుమార్, ఇప్పల పల్లి సురేష్,  తదితరులు పాల్గొన్నారు.

link Media ప్రజల పక్షం 

Monday, June 20, 2022

విద్యాశాఖ లోని అవినీతి అధికారులు & ఉపాధ్యాయులు మీద యుద్ధం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ

*పత్రికా ప్రకటన*

*భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ*

విషయం:- ZPHS హెడ్మాస్టర్ సిహెచ్ సాంబయ్య,MPPS హెడ్మాస్టర్ స్వరూపరాణి, రామంతపూర్ ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుండి అక్రమంగా వసూలు చేస్తున్న హెడ్మాస్టర్ ల సస్పెండ్ చెయ్యాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. 

*అదనపు కలెక్టర్ ఏనుగుల నరసింహారెడ్డి గారికి*, విద్యాధికారి DEO గారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

 ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్* మాట్లాడుతూ.....ZPHS హెడ్మాస్టర్ సిహెచ్ సాంబయ్య,  MPPS హెడ్మాస్టర్ స్వరూపరాణి, *రామంతపూర్ ప్రభుత్వ పాఠశాలలో*  విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుండి అక్రమంగా వసూలు చేస్తున్న హెడ్మాస్టర్ ల పైన చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్. నూతనంగా అడ్మిషన్ అవుతున్న విద్యార్థినీ విద్యార్థులు దగ్గర నుండి తెలుగు మీడియం చదివే విద్యార్థుల అడ్మిషన్ ఫీజు 1000 నుండి 2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులకు 5000 రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు. టీసీ, బోనఫైడ్ 500 రూపాయలు ఇస్తేనే ఇస్తామనే కండిషన్ అయినా విధానం కాదు, యూనిఫామ్ టై బెల్టు కూడా డబ్బులు కట్టాలి. ప్రవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో డబ్బులు కట్ట లేకనే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ అవుతున్న స్టూడెంట్ లకు కూడా డబ్బులు వసూలు చేయడంతో అడ్మిషన్ కాకుండా గందరగోళంలో పడ్డారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా డబ్బులు కట్టాలా అనే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే డబ్బులు కడితేనే అడ్మిషన్ అవ్వండి లేకపోతే అవ్వకండి అని చెప్పేసి హెడ్మాస్టరు హెచ్చరికలు విడుదల చేయడం ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలహీన విద్యార్థులకు చదువు చెప్పవలసిన హెడ్మాస్టర్ ని ఈ విధంగా లంచాలకు పాల్పడితే పై అధికారులు ఏం చేస్తున్నట్లుగా అన్ని ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది. హెడ్మాస్టర్ లను వెంటనే సస్పెండ్ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పై అధికారులకు తెలియజేసింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక కష్టనష్టాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అండగా ఉండి నాణ్యమైన చదువు అందించాలి కానీ ఈ రకంగా లంచాలు ఇస్తేనే చదువు చెబుదామనే హెచ్చరికలు ప్రభుత్వ ఉపాధ్యాయులు చేయడం తీవ్రంగా ఖండిస్తోంది. హెడ్మాస్టర్లను సస్పెండ్ చేసే అంత వరకు రాబోయే రోజుల్లో పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఎం ఉప్పల్ జోన్ కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్, *ప్రజాసంకల్పం బాపట్ల కృష్ణమోహన*, ఎస్ఎఫ్ఐ ఉప్పల్ మండల కార్యదర్శి మణికంఠ, ఎస్ఎఫ్ఐ నాయకులు M.శివ, బల్లెం గౌతం, సాయి కిరణ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

------------------------------------------------------------
*Video -1*                 https://youtu.be/zCM76PmuBFs          *Video -2*    https://youtu.be/AUAe5EFSgi4      *తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు మీరేమో మనబడి అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలి అని అధికారులకు ఆదేశాలు ఇస్తే వారేమో మీ ఆదేశాలను పాటిస్తలేరు దానితో కొందరు HM లు & ఉపాధ్యాయులు అవినీతికి అలవాటు పడి విద్యావ్యవస్థను బ్రష్టుపట్టిస్తున్నారు. ఈ అంశం మీద మేడ్చల్ జిల్లా SFI నాయకులు రాథోడ్ సంతోష్ (జిల్లా కార్యదర్శి)ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేసి మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ గారికి & DEO మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.... Bplkm🪶*  NOTE : *పూర్తి వివరాలు* prajasankalpam1.blogspot.com లో   *Copy to Group link Media*  20/06/2022

Sunday, June 19, 2022

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కీలక నిర్ణయం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కీలక నిర్ణయం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. తమ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో విద్యార్థులు తుది సమరానికి సిద్దమయ్యారు. దీంతో 24 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. రాత్రంతా బయటే ఉండి నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు. ఓవైపు వర్షం వర్షం కురుస్తున్నా.. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థులు ప్రతిపాదించిన 12 డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రంతా బయటే ఉండి తమ నిరసనను తెలియజేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత ఐదు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైకరిపై ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు రాత్రంతా నిరసన దీక్ష చేయాలని నిర్ణయించామని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.

2017 లోనూ తాము నిరసన చేసినా అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదని స్టూడెంట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపస్ కు ఒకసారి వచ్చి తమ సమస్యలను పరిశీలించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ముఖ్యంగా తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించని కేసీఆర్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థులు నేరుగా సీఏం కేసీఆర్‌ గానీ మంత్రి కేటీఆర్‌ గానీ వచ్చి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల నిరసన దీక్షకు పిలుపు నిచ్చారు. రాత్రంతా బయటే ఉండి నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు.

తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా..... జస్టిస్ ఉజ్జల్ భూయాన్.....!

*తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా..... జస్టిస్ ఉజ్జల్ భూయాన్.....!*

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌కు పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఆమేరకు ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

link Media ప్రజల పక్షం 🖋️ 

పట్టువీడని విద్యార్ధులు.... బాసరలో 6 వ రోజు కొనసాగుతున్న నిరసన....!

*పట్టువీడని విద్యార్ధులు.... బాసరలో 6 వ రోజు కొనసాగుతున్న నిరసన....!*

బాసర: బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అటు విద్యార్థులు పట్టువీడటం లేదు... విద్యార్థులు ప్రతిపాదించిన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన పూర్తి స్థాయిలో రావడం లేదు.ఫలితంగా ఆరో రోజు కూడా బాసరలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.

ఐఐటీ ప్రధాన ద్వారం వద్ద దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మెయిన్‌ గేటు వద్దకు ఎవర్నీ వెళ్లనీయకుండా పోలీసులు రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. గత ఆరు రోజులుగా బాసరలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 12 డిమాండ్లతో ఈనెల 14 నుంచి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. బాసర ట్రిపుల్‌ ఐటీకీ 2 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మద్దతుగా ఇవాళ సాయత్రం నిజామాబాద్‌ నుంచి ఏబీవీపీ కార్యకర్తలు బాసర చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసుల ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని బాసర పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం స్వచ్ఛందంగా ఇంటికి వెళ్లే విద్యార్థులకు అనధికారికంగా అనుమతిస్తోంది. ఆరు సంవత్సరాల ట్రిపుల్‌ ఐటీ కోర్సులో పీయూసీ-1, పీయూసీ-2 చదువుతున్న విద్యార్థులను కుటుంబ సభ్యలకు సమాచారం ఇవ్వకుండా, వారు వెంటలేకుండా వెళ్లేందుకు అనుమతించకూడదనే నిబంధన ఉంది. కానీ, ఆరు రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో నిబంధనలను యాజమాన్యం అనధికారికంగా సడలించింది.

link Media ప్రజల పక్షం🖋️ 

తెలంగాణ లో విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న ప్రభుత్వం & ప్రతిపక్షాలు

*తెలంగాణా లో విద్యావ్యవస్థ నిర్లక్ష్యం అవుతుంటే ప్రతిపక్షాలు & అన్ని విద్యార్థి సంఘాలు & మేధావులు అనబడే మూర్కులు & మెయిన్ స్ట్రీమ్ మీడియా తమ బాధ్యతను నిర్వర్టిస్తలేవు..... ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు అనుకూలంగా వున్నారు వీరు అందరు.... ఎన్ని చట్టాలు / GO / కమిటీ లు వున్నా ప్రభుత్వాలు పట్టించుకుంటాలేవు...ఇది నిజం..... Bplkm🪶*  *Copy to Group link Media*
NOTE : *తల్లితండ్రులు ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకుంటాలేరు.విద్యాసంస్థల యాజమాన్యాలు బయపెడుతున్నాయి మీ పిల్లల భవిష్యత్ మా చేతిలో వుంది అని*  prajasankalpam1.blogspot.com

Saturday, June 18, 2022

16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై జులై 1 నుంచి నిషేధం!

*16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై జులై 1 నుంచి నిషేధం!*

దిల్లీ: ఒకసారి వాడిపారేసే 16 రకాల ప్లాస్టిక్‌ వస్తువులను జులై 1 నుంచి నిషేధిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇయర్‌బడ్స్‌, బుడగలు, క్యాండీ, ఐస్‌క్రీంల కోసం వాడే ప్లాస్టిక్‌ పుల్లలు, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్‌ స్వీట్‌బాక్సులు, ఆహ్వానపత్రాలు, సిగరెట్‌ ప్యాకెట్లు, 100 మైక్రాన్‌లలోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే పాలిస్ట్రైరిన్‌ (థర్మోకోల్‌) వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది. పెట్రోకెమికల్‌ సంస్థలేవీ ప్లాస్టిక్‌ ముడిసరకును ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు సరఫరా చేయవద్దని ఉత్తర్వులు జారీచేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏ వాణిజ్య సంస్థా తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ ఉపయోగించరాదని షరతు విధిస్తూ స్థానిక సంస్థలు లైసెన్సులు జారీచేయాలని, ఒకవేళ ఎవరైనా ఉపయోగించినా, లేదంటే నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించినా వాటి లైసెన్సులు రద్దుచేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

link Media ప్రజల పక్షం🖋️ 

కేసీఆర్ సారు అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసినప్పుడే మేము మా శాంతియుత ఆందోళనను విరమిస్తాము

Courtesy by : @sgc_rguktb

గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు, ముధోల్ ఎమ్మెల్యే శ్రీ విట్టల్ రెడ్డి గారు, తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, వైస్ చైర్మన్ ప్రో. శ్రీ వి. వెంకటరమణ గారు, ఆర్జీయూకేటీ బాసర నూతన డైరెక్టర్ ప్రో శ్రీ పి. సతీష్ కుమార్ గారు  ఈ రోజు అంటే 18.06.2022 మధ్యాహ్నం విద్యార్థులతో సమావేశం అయ్యారు. కాగా, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు మా డిమాండ్లను అన్నిటినీ నిర్ణీత సమయంలోగా పరిష్కరిస్తారని హామీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసినప్పుడే మేము మా శాంతియుత ఆందోళనను విరమించి రెగ్యులర్ క్లాసెస్ కి వెళ్తామని సమస్త ఆర్జీయూకేటీ బాసర విద్యార్థుల ప్రతినిధి అయిన విద్యార్థి పరిపాలక మండలి (ఎస్జీసీ) స్పష్టం చేస్తుంది.

#ConsiderRGUKT #VisitRGUKT 
@KTRTRS @TelanganaCMO

@TOIIndiaNews @TOIMumbai 
@htTweets @IndianExpress 
@fpjindia @afternoonnew
@mid_day @the_hindu 
@DeccanHerald @DeccanChronicle 
@lokmat @aajtak @ndtv @ndtv @ZeeTeluguLive 
@BBCWorld @TV9Telugu @sakshinews @V6News @NtvTeluguLive @hmtvnewslive @abntelugutv @etvteluguindia

రేషన్ కార్డుదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభ వార్త చెప్పింది.

రేషన్ కార్డుదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభ వార్త చెప్పింది.

రేషన్ కార్డు లో ఏవైనా మార్పులు అంటే.. పేర్లను తొలగించడం లేదా పేర్లను జతపరచడం లాంటి వాటి పై కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.రేషన్ కార్డు కలిగి ఉండి కుటుంబ సభ్యులందరి పేర్లు రేషన్ కార్డులో లేకుంటే, అనగా కొత్తగా వివాహం అయినవారు వారి భార్య పేరు కాని, ఇటీవల పుట్టిన చిన్న పిల్లల పేర్లు కాని రేషన్ కార్డులో నమోదు చేసుకునే (ఎక్కించుకునే)అవకాశం వచ్చింది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

కావలసిన ధ్రువపత్రాలు:-

1. పాత లేదా కొత్త రేషన్ కార్డ్ నంబర్.

2. రేషన్ కార్డులో నమోదు చేసుకునే వారి ఆధార్ కార్డు.

3. గ్యాస్ కనెక్షన్ బుక్

నమోదు చేసుకోవాలనుకున్న వారు మీ సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోగలరని తెలంగాణ సర్కార్ పేర్కొంది. 

పోలీసుల అదుపులో సికింద్రాబాద్ అల్లర్ల.... సూత్రధారి

*పోలీసుల అదుపులో సికింద్రాబాద్ అల్లర్ల.... సూత్రధారి*

కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. నిన్న(శుక్రవారం) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లర్లు చోటు చేసుకున్నాయి.దీని వెనుక కుట్ర కోణం ఉందని బావిస్తున్నారు. ఈ అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసారావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడమీని నడుపుతున్నాడు సుబ్బారావు. తన సొంతూరు ఖమ్మంలో ఉన్న సుబ్బారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు నరసరావుపేటకు తరలిస్తున్నారు.

ఇక సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఇప్పటి వరకు 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 12 మంది ప్రధాన కారణమని భావిస్తున్నారు. విధ్వంసం సృష్టించేలా ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులను కొందరు రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా వాట్సాప్స్ గ్రూప్‌లలో అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు ప్రాథమికంగా తేల్చారు. 10 ప్రైవేటు డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఇందులో పాల్గొన్నట్లు గుర్తించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

సికింద్రాబాద్ అల్లర్లు....తప్పిన భారీ ప్రమాదం....ధ. మ. రైల్వే డీ ఎం గుప్తా

*సికింద్రాబాద్ అల్లర్లు....తప్పిన భారీ ప్రమాదం....ధ. మ. రైల్వే డీ ఎం గుప్తా*

హైదరాబాద్‌: అగ్నిపథ్‌ విధానం అమలును వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లలో ప్రత్యక్ష్యంగా రూ.12 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సికింద్రాబాద్‌ రైల్వే ప్రాంతీయ మేనేజర్‌ గుప్తా వెల్లడించారు.
అంతే కాకుండా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రైలు సర్వీసులు రద్దు చేసిన కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్‌లో గుప్తా మీడియాతో మాట్లాడారు.

అల్లర్లలో రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామగ్రి పూర్తిగా ధ్వంసం అయిందని పేర్కొన్నారు. అల్లర్ల ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని వెల్లడించారు. ఈ విధ్వంసంలో 5 రైలు ఇంజిన్లు (లోకో మోటార్స్), 30 రైలు బోగీలు, పార్శి్ల్‌ కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయినట్లు వెల్లడించారు. పవర్ కార్ (డీజిల్ ట్యాంకర్)కు భారీ ప్రమాదం తప్పిందని.. పవర్ కార్‌కు మంటలు అంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగేదన్నారు. ఆందోళనకారులను అదుపుచేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు. ప్రస్తుతం అన్ని గూడ్స్ రైళ్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని గుప్తా వెల్లడించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

HMDA transfers funds to unregistered NGO

HMDA transfers funds to unregistered NGO

Courtesy by : DECCAN CHRONICLE. | MADDY DEEKSHITH
PublishedMar 6, 2019, 12:32 am IST
UpdatedMar 6, 2019, 12:32 am IST
The HMDA apparently transferred the money because the NGO could not generate funds for its projects under CSR.
Hyderabad Metropolitan Development Authority.

Hyderabad: A major scam has surfaced in the Hyderabad Metropolitan Development Authority. The municipal authority has transferred about Rs 22 lakh directly into the accounts of an unregistered NGO without following the due procedure of inviting tenders.

The HMDA apparently transferred the money because the NGO could not generate funds for its projects under CSR.

Moreover, civic officials have no knowledge about the status of the work assigned to the NGO since the municipal commissioner who had approved sanction for the projects was transferred to another department and the executive engineer retired recently.

According to highly-placed sources in the HMDA, the municipal  authority transferred the following amounts to an NGO called Dhruvansh: Rs 88,495 (cheque number 674640) on October 18, 2016, Rs 1,07,874 on November 19, 2016, (cheque number 897512), Rs 60,960 on February 14, 2017, for plantation works at Ibrahim Cheruvu (cheque number 161820); Rs 2,92,350 on October 12, 2017, for protection and conservation of lakes (bill no 1980), Rs 1,80,000 on November 16, 2017, (bill no 2185), Rs 2,29,117 on October 21, 2017, for raising Mtce of Bund and foreshore plantation (bill no 82), Rs 1,54,810 on May 31, 2015, for protection and conservation of lakes (bill no 383), Rs 10,000 towards advertisement charges on February 10, 2017, (cheque no 216051) and Rs 2,62,000 on December 28, 2017, for wetland conservation and restoration programme and storm water drains (cheque no 585073).

The cheques were given to Dhruvansh Organisation registered at Sri Sai Apartments, Anjali Gardens, Diamond Hills, Manikonda, Hyderabad-500089 with PAN (Permanent Account Number) AACTD1528Q. Apart from this, the municipal authority paid Rs 3,00,000 on August 25, 2018, to the same organisation for plantation activities.

However, on the Union government’s official website NGO Darpan Dhruvansh registered with ID 70414 shows a different address: 18 Green Space Hillpark, Road No. 29 Alkapur Township, Narsingi, Hyderabad.

When this newspaper queried these payments, a senior official of HMRDA said, on condition of anonymity, that lacunae in the procedure allowed these amounts to be transferred to the NGO.
He said that the funds were paid to the NGO after being approved by a former HMDA commissioner. He also said that the executive engineer (lakes and parks division) who sanctioned the funds retired recently. He said that the irregularities in the fund transfer to Dhruvansh will be brought to the notice of higher authorities.

...
Tags: hyderabad metropolitan development authority, union government, dhruvansh organisation
Location: India, Telangana, Hyderabad


Thursday, June 16, 2022

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన పై స్పందించిన రాహుల్ గాంధీ!

*బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన పై స్పందించిన రాహుల్ గాంధీ!*

హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. విద్యార్థుల వాస్తవ డిమాండ్లను సిల్లీగా పేర్కొనడంపై విమర్శించారు.క్యాంపస్‌లో దయనీయమైన పరిస్థితులను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని సీఎం కేసీఆర్‌ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. అహంకారపూరిత కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కుగా అంచనా వేయకూడదన్నారు. తెలంగాణ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్‌ పేర్కొన్నారు.

link Media ప్రజల పక్షం 🖋️ 

పిల్లలను బడికి పంపండయ్యో....ఎండలో నేలపై పడుకోని హెడ్ మాస్టర్ వేడుకోలు

*పిల్లలను బడికి పంపండయ్యో....ఎండలో నేలపై పడుకోని హెడ్ మాస్టర్ వేడుకోలు*

పుల్‌కల్‌, : బడి మానేసిన పిల్లలను బడికి పంపేవరకూ తిరిగి వెళ్లేదేలేదంటూ వాళ్ల ఇళ్ల వద్ద ప్రధానోపాధ్యాయుడు నేలపై పడుకొని వినూత్న నిరసన తెలుపుతూ తల్లిదండ్రులను వేడుకున్నారు.సంగారెడ్డి జిల్లా పుల్‌కల్‌ మండలం ముదిమాణిక్యం గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. బడిబాట కార్యక్రమంలో భాగంగా ముదిమాణిక్యం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నూలి శ్రీధర్‌రావు సహచర ఉపాధ్యాయులను వెంట బెట్టుకుని బడి మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లారు. 2021-22 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి పూర్తి చేసిన అన్నదమ్ములు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలో చేరాల్సి ఉంది. అయితే అందులో ఒకరు బాల కార్మికుడిగా మారగా, మరొకరు అనారోగ్యంతో పాఠశాలలో చేరలేదు. వీరితో పాటుగా ఏడో తరగతి పూర్తి చేసుకుని ఎనిమిదో తరగతిలో చేరాల్సిన మరో విద్యార్థి కూడా బడి మానేశాడు. దీంతో హెచ్‌ఎం శ్రీధర్‌రావు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడికి వచ్చేలా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తల్లిదండ్రులు ఎంతకీ వినకపోవడంతో.. ఎండలో కటిక నేలపై కూర్చుని, పడుకుని వినూత్న రీతిలో వారిని వేడుకొన్నారు. చివరకు పిల్లలను తిరిగి పాఠశాలకు వచ్చేలా చేశారు. దీంతో హెచ్‌ఎం శ్రీధర్‌రావును గ్రామస్థులు ప్రశంసించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Wednesday, June 15, 2022

తల్లి తండ్రులరా ఆలోచించండి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం... Bplkm🪶

కరెక్టే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు వున్నాయి... తల్లి తండ్రులు మారాలి... పిల్లలు బాగా చదవాలి అని ఆలోచిస్తున్నారు బాగానే వుంది... ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో చదువును కోనేపరిస్థితికి తీసుకొచ్చాయి ఈ ప్రభుత్వాలు.... అందుకే ప్రతి కార్పొరేట్ విద్యాసంస్థలలో పేరెంట్స్ కమిటీ ఉండాలి ఆ కమిటీ భారత రాజ్యాంగం కల్పించిన న్యాయమైన హక్కులకు & చట్టాలకు అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని  ఉపాధ్యాయులతో & యాజమాన్యాలతో కలిసి పనిచేసినప్పుడే విద్యావ్యవస్థ బాగుపడుతుంది.... Bplkn🪶*   prajasankalpam1.blogspot.com 

టీఆర్ఎస్ అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు

టీఆర్ఎస్ అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు

– చర్యలు తీసుకోవాలన్న జడ్సన్

ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలన అంతా అవినీతి, అక్రమాలేనంటూ విపక్షాలు తరచూ విమర్శలు గుప్పిస్తుంటాయి. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని.. ప్రాజెక్టుల పేరుతో విపరీతంగా దోపిడీకి పాల్పడ్డారని మండిపడుతుంటాయి. కేసీఆర్ కుటుంబ ఆస్తులు వేల కోట్లకు పెరిగాయని ఆరోపిస్తుంటాయి. తాజాగా కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల అమలులో అక్రమాలు అనేకంగా జరుగుతున్నాయనేది జడ్సన్ ఆరోపణ. కబ్జాలు, సెటిల్​ మెంట్లు, బెదిరింపులతో అక్రమాలతో వేలకోట్లు సంపాదించి.. ప్రజలను ఆగం చేశారని విరుచుకుపడుతున్నారాయన. ఈ నేపథ్యంలోనే జడ్సన్ గవర్నర్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది.

కల్వకుంట్ల పాలనలో అంతా అవినీతిమయం అంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు జడ్సన్. కేసీఆర్ కుటుంబం చేసిన అక్రమాలు, అవినీతిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ మాజీ స్పెషల్ ప్లీడర్ అడ్వకేట్ శరత్ కుమార్ తో కలిసి జడ్సన్ ఫిర్యాదు చేశారు.

బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన పై KTR...... ట్వీట్

*బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన పై KTR...... ట్వీట్*

హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్జీయూకేటీ-బాసరలో 8వేల మంది విద్యార్థులు రోడ్డుపై కూర్చున్నారని.. ఈ విషయంలో స్పందించాలంటూ బత్తిని తేజగౌడ్‌ అనే యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.వెంటనే స్పందించిన మంత్రి.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. విద్యలో నాణ్యత పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని.. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

మరోవైపు ఈ అంశంపై కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు మంత్రి సబిత స్పందించారు. బాసర ఆర్జీయూకేటీ సమస్యలపై ఇవాళ వీసీతో సమావేశమవుతున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Tuesday, June 14, 2022

తెలంగాణ....గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షా తేది ఖరారు....!

*తెలంగాణ....గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షా తేది ఖరారు....!*

హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తేదీని ఖరారు చేసింది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తేదీని ప్రకటించింది.అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలిసారి వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంతో పోలిస్తే గ్రూప్ వన్‌ కోసం ఈసారి భారీగా దరఖాస్తులు అందాయి. రోజుకు సుమారు పది వేల చొప్పున దరఖాస్తులు అందగా.. గడువు పెంచిన తర్వాత చివరి నాలుగు రోజుల్లో సుమారు 30 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 503 పోస్టులకు గానూ.. 3 లక్షల 80 వేల 202 మంది పోటీపడుతున్నారు.

అయితే దరఖాస్తుల తేదీని పొడగించాలన్న విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోని టీఎస్‌పీఎస్సీ.. పరీక్ష తేదీ విషయంలో మాత్రం అభ్యర్థుల విజ్ఞప్తులను మాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జులై-ఆగష్టులో నిర్వహించాలనుకున్న ప్రిలిమినరీ పరీక్షను.. అక్టోబర్‌కు జరిపింది.

link Media ప్రజల పక్షం🖋️ 

Monday, June 13, 2022

రౌడీలు......కేడీలపై ఉక్కుపాదం..పి ఎస్ ల వారీగా లెక్క తేల్చుతున్న సీపీ స్టీఫెన్‌రవీంద్ర

*రౌడీలు......కేడీలపై ఉక్కుపాదం*

*పీఎ్‌సల వారీగా లెక్క తేల్చుతున్న సీపీ స్టీఫెన్‌రవీంద్ర*

హైదరాబాద్‌ రౌడీషీటర్లు, పాత నేరస్థుల కదలికలపై దృష్టి పెంచాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశించారు.కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో అల్లరిమూకల ఆగడాలు, రౌడీషీటర్‌ల అరాచకాలు, భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఎస్‌హెచ్‌ఓలు, ఏసీపీలు, డీసీపీలు, క్రైమ్‌ సిబ్బందితో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు.

501 మంది రౌడీషీటర్స్‌

మూడేళ్లుగా నమోదైన గణాంకాల ప్రకారం.. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ప్రస్తుతం రౌడీషీటర్ల సంఖ్య 501గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరిపై దృష్టి పెట్టాలని సీపీ సూచించినట్లు సమాచారం.

పాత నేరస్థులకు కౌన్సెలింగ్‌

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర స్పష్టం చేశారు. ఇటీవల కమిషనరేట్‌ పరిధిలోని కొంతమంది పాత నేరస్థులతో సమావేశం నిర్వహించి హెచ్చరించారు. ఇకపై ప్రతి నేరస్థుడి జాబితా రికార్డుల్లో ఉంటుందని, పదే పదే అల్లర్లు, గొడవలు సృష్టిస్తున్న వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు పాత నేరస్తులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇప్పటికే పాత నేరస్థుల అడ్ర్‌సలు, లొకేషన్స్‌ను జియోట్యాగింగ్‌ చేయగా.. కొత్తవారిని కూడా జియోట్యాగింగ్‌ చేసి, వారి కదలికలపై నజర్‌ పెడుతున్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో నేరస్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

జూన్ 23 బీజేపీ పతనానికి పునాది రాయి....రేవంత్ రెడ్డి

జూన్ 23 బీజేపీ పతనానికి పునాది రాయి....రేవంత్ రెడ్డి

నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంకి నోటీసులు ఇవ్వడం అంటే.. దేశం నీ అవమానించడమేనని, గాంధీ కుటుంబంకి జరిగిన అవమానం కాదు.. దేశ ప్రజలకు జరిగిన అవమానంగా రేవంత్‌ రెడ్డి అభివర్ణించారు. ఇందిరాగాంధీపై సీబీఐ కేసు పెట్టీ అవమానిస్తే… దేశం ఏకం అయ్యిందని, తిరిగి దేశానికి ఇందిరా గాంధీ ప్రధాని అయ్యిందని ఆయన గుర్తు చేశారు. జూన్ 23 బీజేపీ పతనానికి పునాది రాయి అని ఆయన మండిపడ్డారు. సోనియా గాంధీ ఈడీ ఆఫీస్ లో అడుగు పెట్టిన క్షణం నుండే మోడీ..అమిత్ షా పతనం మొదలైందన్నారు.

బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని, గాంధీ కుటుంబం మీద ఏం జరిగినా.. జనం చూస్తూ ఉండరన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు తల్లి లాంటిదని, అలాంటి తల్లిని అవమనిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ వారసులం కాబట్టి శాంతియుత నిరసన చేశాం.. సోనియా గాంధీని అవమానించాలని చూస్తే ఊరుకోమని ఆయన ధ్వజమెత్తారు. ఈ నెల 23న మళ్లీ ఈడీ ఆఫీస్ కి వస్తమని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… రాష్ట్రంకి ముందు ఈడీ, సీబీఐ వస్తుంని, తర్వాత మోడీ..అమిత్ షా వస్తారన్నారు. గాంధీ కుటుంబం మీద కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తుందని, గాంధీ కుటుంబం ఈక కూడా పీకలేరని ఆయన మండిపడ్డారు.

link Media ప్రజల పక్షం🖋️ 

ఘటన చూసి సిగ్గుపడాలి మనమందరం... Bplkm🪶

https://twitter.com/TPrashanth985/status/1536152603394195456?t=AC43hKI5ZO9lledT9Ue2nQ&s=08  *గౌరవెల్లి ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలలోకి అర్ధరాత్రి వెయ్యి మందికి పైగా పోలీసులు వచ్చి దాడి చేసి 4 వ్యాన్లలో ఎక్కించుకెల్లిన పొలీసులు.హుస్నాబాద్ నియోజకవర్గం, గౌరవెళ్ళి ప్రాజెక్ట్ కిందా భూములు కోల్పోయిన గూడటిపల్లె గ్రామం వారికి నష్ట పరిహారం ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా వాళ్ళ ఊర్ల కాళీ చేయమంటున్నారు.వాళ్లు నష్ట పరిహారం కోసం చాలా రోజుల నుండి ప్రాజెక్ట్ దగ్గర ధర్నా చేస్తున్నారు.అయిన ప్రభుత్వం స్పందిచట్లేదు.నిన్న రాత్రి 2 గంటలకు గ్రామానికీ వెళ్ళీ ఎవరు దొరికిన పోలీసు Van లో ఎక్కించారు.ఒక్క మహిళ పోలీసు కూడా లేరు కానీ వద్దు అని అడ్డం వచ్చిన మహిళలను కూడా విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ చేసారు* https://t.co/3YTDvGMzZJ
#FalthuTSPolice @TelanganaDGP @siddipetcp @siddipet2tn_ps @siddipet1tn_ps @Collector_SDPT @bandisanjay_bjp @TeenmarMallanna @Arvindharmapuri https://t.co/ktBdCLLU8W
---------------------------------------------------------


https://twitter.com/Praja_Snklpm/status/1536328569411891202?t=HfE3ZAPEALXICqv0wQFoTw&s=08  *@India_NHRC plz involve 🙏*   *గౌరవెల్లి ఘటన చూసి సిగ్గుపడాలి మనమందరం. మానవత్వం లేని తెలంగాణ ప్రభుత్వం & ప్రభుత్వ అధికారులు😔.... Bplkm🪶*
#indianconsitution #fundamentalrights
#Telangana https://t.co/ILlosw807z

Saturday, June 11, 2022

అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా మహనీయుడు అచ్యుత్ రావు సర్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము

@AnooradhaR

ఈరోజు బాలకార్మికుల గురించి మాట్లాడే వారు ఒక దేవుడిని మరిచిపోయారు... ఆ దేవుడు ఎవరు అంటే స్వర్గీయ అచ్యుత్ రావు సర్ గారు 🙏.

బాలకార్మికుల వ్యవస్థ మార్పుకోసం తనజీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు.

@TelanganaCMO @AndhraPradeshCM
@KTRTRS https://t.co/5Cz0VIAngD https://t.co/IoPfMQWDjK

_-----------------------------------------------

https://twitter.com/AnooradhaR/status/1535871799925190656?t=oiu5Mp36Ql0dJMOlS0xd7g&s=19
బాలకార్మికుల గురించి మాట్లాడే వారు,వారికి రక్షణకల్పించేవారు,
వారి కోసం పోరాటం చేసేవారు లేరు. నాకున్న పరిధి లో నా తుది శ్వాస వరకు నేను అచ్యుత రావు గారి కోసం పని చేస్తాను.

ToThe Judicial ConsultantNational Green TribunalSouth ZoneChennai.

Hyderabad  11 june 2022

To
The Judicial Consultant
National Green Tribunal
South Zone
Chennai.

Your Honour,

We draw your prompt attention to our earlier email representation dated 7 sep 2020(appended below), addressed to the Khammam District WALTA Authority and to the Government of Telangana, seeking eviction of encroachments, viz.,sequel resorts , roads, and other land dumping and structures inside Lakkaram cheruvu , substantiating with official maps including Dharani maps. 

we sought restoration of the lakkaram cheruvu to its original glory.  But under the active supervision of government of Telangana, we have observed that the cheruvu has been noosed around against irrigation rules and standards and against environmental standards and against Supreme Court orders.

Plz see the google earth satellite imageries below how the extinction of the huge lakkaram cheruvu is being staged as 'beautification' by condoning all the encroachments both state and private.

a) Lakkaram lake as on November 2006:
Lake is not divided and the width of lake is seen to almost full extent. however, sequel resorts already encroached the lake.

lakkaram cheruvu nov 2006 .png


b) Lakkaram cheruvu in April 2014:
Lake has been divided thru roads/bunds and massive encroachments both state and private inside FTL boundary and buffer zone.

lakkaram cheruvu april 2014 .png


c) Lakkaram lake in March 2022:
Huge concretization of the lake is observed in the name of 'beautification' and 'development' thus depriving the gullible citizens of water spaces that are basic essentials of survival. North east a huge land fill inside the FTL of the lake is seen.

lakkaram cheruvu march 2022 .png

We hope the above has shocked the conscience of the National GreenTribunal Southern Bench, Chennai.  We urge the Tribunal to take this up promptly and order eviction of the encroachments , roads, bunds, landfills, resorts, clubs, convention halls, etc. etc. and restore the lake as a basic essential for humanity and bio diversity.
We shall assist the Tribunal as our Fundamental Duty to our country as enshrined in our Constitution of India.

The Government of Telangana is totally disconnected with the climate crisis and the existential threat that the whole world including the National Green Tribunal is trying to combat.

best
Dr Lubna Sarwath,
State President,
Water Resources Council- Womens Indian Chamber of Commerce and Industry
Hyderabad