Monday, August 31, 2026

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్1వ తేదీ నాటికి విజయవంతంగా 1000 రోజుల మైలురాయిని చేరుకుంది_

*వెయ్యి రోజుల ప్రజాపాలన..*

*సంక్షేమం నుంచి ప్రపంచస్థాయి తెలంగాణ*

*ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్1వ తేదీ నాటికి విజయవంతంగా 1000 రోజుల మైలురాయిని చేరుకుంది.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 31:

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల మైలురాయిని చేరుకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్నిర్మించడం, సంక్షేమాన్ని విస్తరించడం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, రైతులు–మహిళలు–యువతకు భరోసా కల్పించడం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడం, భవిష్యత్తు తెలంగాణకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించడంలో ఈ వెయ్యి రోజుల పాలన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చుఏసింది.
**ఆర్థిక ప్రగతి – బలపడుతున్న తెలంగాణ*
2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరింది. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే దాదాపు 91 శాతం అధికం.సంక్షేమాన్ని కొనసాగిస్తూనే పెట్టుబడులు, ఉపాధి, మౌలిక సదుపాయాలు, సాంకేతిక      రంగాల విస్తరణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు.రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో సాధించిన సమష్టి ప్రగతి.
**రైతన్నకు అండ.. వ్యవసాయంలో తెలంగాణ నంబర్‌–1*.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ. 25 లక్షలకుపైగా      రైతు కుటుంబాలకు రుణభారం నుంచి విముక్తి.రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం. ఒకే విడతలో 9 రోజుల్లో      దాదాపు రూ.9 వేల కోట్ల జమ.సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతు      బీమాతో నిరంతర భరోసా.గడిచిన 32 నెలల కాలానికి      సంబంధించిన లెక్కల ప్రకారం వ్యవసాయం, రైతు సంక్షేమానికి      దాదాపు రూ.1.68 లక్షల కోట్ల వ్యయం.వరి సాగు, ఉత్పత్తిలో పంజాబ్‌ను      అధిగమించి దేశంలో నంబర్‌–1గా తెలంగాణ. గత యాసంగిలో 81.12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి కొత్త రికార్డు.కృష్ణా, గోదావరి జలాల్లో      తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం రాజీలేని పోరాటం.యూరియా కొరత వంటి క్లిష్ట పరిస్థితులను అర్థం      చేసుకుని ప్రభుత్వానికి సహకరించిన రైతన్నలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
**మహిళా సాధికారతలో కొత్త అధ్యాయం*
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత      ప్రయాణం. 335 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు; మహిళలకు దాదాపు రూ.11 వేల కోట్ల ప్రయాణ వ్యయం      ఆదా.గృహజ్యోతి కింద 53 లక్షలకుపైగా      కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.రాష్ట్రంలోని 4.54 లక్షల మహిళా      సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60,487 కోట్ల      రుణాలు. రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ.
పాఠశాల యూనిఫాంలు, చీరల తయారీ      నుంచి పెట్రోలు బంకులు, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం వరకు      మహిళా సంఘాలకు కొత్త వ్యాపార అవకాశాలు.కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న      లక్ష్యంతో మహిళలను తెలంగాణ ఆర్థిక ప్రగతిలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దే      దిశగా ప్రభుత్వం.
**ఆహార భద్రత – ప్రతి పేద కుటుంబానికి భరోసా*
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 15 లక్షలకుపైగా కొత్త రేషన్‌ కార్డుల జారీ.దాదాపు 3.38 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రత.
రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం      పంపిణీతో దేశానికి కొత్త నమూనాగా తెలంగాణ.
ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చేందుకు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ.
**సామాజిక భద్రతను మరింత విస్తరిస్తూ కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు.*
మొత్తం 43 లక్షలకుపైగా      వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు,      ఇతర అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు.
**ఇందిరమ్మ ఇండ్లు – పేదవాడి సొంతింటి కలకు భరోసా*
తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ      ఇండ్ల నిర్మాణం. అర్హమైన ప్రతి కుటుంబానికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం.గిరిజనులు, చెంచులు, అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం.
**హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల      టవర్ల నిర్మాణానికి భారీ ప్రణాళిక.*

**సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు*
రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి,      రాజకీయ, కుల సర్వే నిర్వహించి కులాల వారీ      సామాజిక స్థితిగతుల వెల్లడి.సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి, ఎస్సీ      వర్గీకరణ అమలు చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ.బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే      బిల్లులకు శాసనసభ ఆమోదం.
12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల      సవరణతో దాదాపు కోటి 11 లక్షల మంది కార్మికులకు      ప్రయోజనం.
గిగ్‌ కార్మికులకు చట్టబద్ధ గుర్తింపు, సంక్షేమ బోర్డు, సామాజిక భద్రత కల్పించే      ప్రత్యేక చట్టం.
**విద్యలో సంస్కరణలు.. ప్రభుత్వ బడులకు కొత్త రూపం*
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్‌      గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి పురోగతి.ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌      రెసిడెన్షియల్‌ స్కూల్‌. 105 స్కూళ్ల మంజూరు.ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు; తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లతో ప్రభుత్వ విద్యకు కొత్త రూపం.ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 22 లక్షలకుపైగా విద్యార్థులకు అల్పాహారం, పాలు,      పోషకాహారం. రూ.720 కోట్ల కేటాయింపు.సంక్షేమ హాస్టళ్లలో డైట్‌ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్‌ ఛార్జీలు 212 శాతం పెంపు.
**మెగా డీఎస్సీ ద్వారా 10,006 మంది ఉపాధ్యాయుల నియామకం.*
దాదాపు 11 లక్షల మంది      విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌.      ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్ల      కేటాయింపు.
**యువతకు ఉద్యోగాలు – నైపుణ్యాలకు కొత్త వేదిక*
ప్రజా ప్రభుత్వ తొలి వెయ్యి రోజుల్లో 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. గ్రూప్‌–1 నుంచి డీఎస్సీ వరకు కీలక నియామకాల పూర్తి.టీజీపీఎస్సీ ద్వారా మరో 456 పోస్టులు, పోలీసు నియామక బోర్డు ద్వారా 7,437      పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో 1,190 మంది శిక్షణ పూర్తి చేయగా 838 మందికి ప్రముఖ      సంస్థల్లో ఉద్యోగాలు.65 ప్రభుత్వ ఐటీఐలు, 57 పాలిటెక్నిక్‌ కాలేజీలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా      తీర్చిదిద్దడం.యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌      స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌      డిస్ట్రిక్ట్‌తో క్రీడా రంగానికి కొత్త దిశ.
**వైద్య రంగంలో భారీ విస్తరణ – సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు అండ*
రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో 2,000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌లో మూడు టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు.తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు; మరో 17 కాలేజీల నిర్మాణం.
నిమ్స్‌లో 2,000 కిడ్నీ మార్పిడి      శస్త్రచికిత్సల మైలురాయి.
2023 డిసెంబర్‌ 7     నుంచి 2026 ఆగస్టు 12 వరకు      ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5,18,186 మందికి రూ.2,526.12 కోట్ల సాయం.
సీఎంఆర్‌ఎఫ్‌ వైద్య రీయింబర్స్‌మెంట్‌ ద్వారా 4,78,789 మంది పేద రోగులకు రూ.1,635.34 కోట్లు;      39,712 మందికి రూ.798.41 కోట్ల ఎల్‌ఓసీలు.
**ఆహార కల్తీపై ఉక్కుపాదం – కొత్తగా టీజీ సేఫ్‌ ఆహార కల్తీపై తనిఖీలు,శాంపిల్‌ పరీక్షలు, కఠిన చర్యలు.*
ఆహార కల్తీ, డ్రగ్స్‌ ముప్పును      సమగ్రంగా ఎదుర్కొనేందుకు కొత్తగా టీజీ సేఫ్‌ సంస్థ ఏర్పాటు.
ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్‌ నియంత్రణను ఒకే వ్యవస్థ కిందకు తీసుకువచ్చి లీగల్‌, ల్యాబొరేటరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలతో      బలోపేతం.
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై విస్తృత దాడులు, కఠిన చట్టపరమైన చర్యలు.
**డ్రగ్స్‌పై రాజీలేని పోరాటం – విద్యాసంస్థలకూ బాధ్యత*
డ్రగ్స్‌పై ఈగల్‌ వ్యవస్థ ద్వారా ప్రత్యేక పోరాటం.      సైబర్‌ నేరాలు, మహిళలు, పిల్లల      భద్రతకు ప్రత్యేక పోలీసింగ్‌.
పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో యాంటీ డ్రగ్‌ అండ్‌ సేఫ్టీ కమిటీలు తప్పనిసరి      చేసే దిశగా చర్యలు.ప్రతి విద్యాసంస్థలో క్యాంపస్‌ కోఆర్డినేటర్లు, స్పాటర్ల ఏర్పాటు; విద్యార్థుల్లో అనుమానాస్పద      ప్రవర్తనా మార్పులను గుర్తించి విద్యాశాఖ, పోలీసులకు      సమాచారం.
విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేసే      విద్యాసంస్థలపై గుర్తింపు సస్పెన్షన్‌ వరకు చర్యలు.
**ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు ప్రత్యేక వ్యవస్థ*
పట్టణాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ, హైవేలు–ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాలను తగ్గించేందుకు కొత్తగా టీజీ      ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ బ్యూరో.పట్టణ ట్రాఫిక్‌ నిర్వహణ, హైవే పెట్రోలింగ్‌, ప్రమాదాల నివారణకు అవసరమైన      నిధులు, ఆధునిక సదుపాయాలతో ప్రత్యేక వ్యవస్థ.ప్రజలకు సాఫీగా, సురక్షితంగా      ప్రయాణం అందించడం ప్రధాన లక్ష్యం.
**ప్రజల వద్దకే పాలన – మండల స్థాయికి ప్రజావాణి*
రాష్ట్ర, జిల్లా, డివిజన్‌ స్థాయి ప్రజావాణి విజయవంతమైన నేపథ్యంలో ప్రజల సమస్యలను వారి      మండలంలోనే పరిష్కరించేలా అన్ని ఎంపీడీవో కార్యాలయాలకు మండల ప్రజావాణి      విస్తరణ.ప్రతి సోమవారం మండల స్థాయి అధికారులంతా ఒకేచోట      అందుబాటులో ఉండి అర్జీల పరిష్కారం. చిన్న సమస్యల కోసం ప్రజలు జిల్లా, రాష్ట్ర స్థాయికి వెళ్లాల్సిన అవసరం తగ్గింపు.త్వరలో ఆన్‌లైన్‌ ప్రజావాణి పోర్టల్‌.      రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ఆన్‌లైన్‌లో అర్జీల నమోదు. అర్జీల పరిష్కార పురోగతిపై ప్రత్యేక డాష్‌బోర్డు.   ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిరంతర      పర్యవేక్షణ.99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో 12,758      గ్రామసభలు, 3,175 వార్డుసభల నిర్వహణ.
**భూ పరిపాలన – ఉద్యోగులకు భరోసా – డిజిటల్‌ గవర్నెన్స్‌*
భూ భారతి చట్టం, భూధార్‌,      ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు. 3.76 లక్షల      కొత్త పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ జారీ.ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందించేలా ఆర్థిక      క్రమశిక్షణ.కొన్నేళ్లుగా పేరుకుపోయిన రిటైర్డ్‌ ఉద్యోగుల      బకాయిల్లో వంద రోజుల్లో రూ.600 కోట్ల చెల్లింపు.
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య      భద్రతకు ఎంప్లాయీ హెల్త్‌ స్కీమ్‌.
ప్రభుత్వ ఆదాయం పెంచడం నుంచి సంక్షేమ పథకాలను      చివరి లబ్ధిదారుడికి చేర్చడం వరకు కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు, అధికారులకు ప్రత్యేక అభినందనలు.36 సచివాలయ శాఖల్లో 100 శాతం ఈ-ఆఫీస్‌.
దేశంలో తొలి పూర్తిస్థాయి డిజిటల్‌ కేబినెట్‌.      వాట్సాప్‌లో 581కిపైగా ప్రభుత్వ సేవలు.
**ఆదాయ లీకేజీలకు చెక్‌ – ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు*
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టకుండా      విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖల్లో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌      విభాగాల ఏర్పాటు.
పౌరసరఫరాలు, మైన్స్‌ అండ్‌      మినరల్స్‌, జీఎస్టీ తదితర రంగాల్లో ఆదాయ నష్టాలు,      ఎగవేతలను గుర్తించి అరికట్టే ప్రత్యేక చర్యలు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచి అదే వనరులను ప్రజా      సంక్షేమం, అభివృద్ధికి వినియోగించాలన్న ప్రభుత్వ లక్ష్యం.
**ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు*
హైదరాబాద్‌ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రోడ్డు.
రాష్ట్రవ్యాప్తంగా 6,092     కిలోమీటర్ల హ్యామ్‌ రోడ్ల ప్రణాళిక.హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరణ. మామునూరు విమానాశ్రయం, ఆదిలాబాద్‌ ఎయిర్‌ఫీల్డ్‌ అభివృద్ధి.
మూసీ పునరుజ్జీవనంలో 55 కిలోమీటర్ల సమగ్ర అభివృద్ధి; 39 కొత్త      ఎస్టీపీలు.
గోదావరి నుంచి 2.5 టీఎంసీల      స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించే ప్రణాళిక.
**పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ*
బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌లో కీలక      రంగాల్లో తెలంగాణ టాప్‌ అచీవర్‌.
టీజీ-ఐపాస్‌ ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు.తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు.టీజీఐఐసీ భూముల్లో రూ.92,281 కోట్ల పెట్టుబడులు; 78 వేలకుపైగా ఉద్యోగ      అవకాశాలకు మార్గం.నెక్స్ట్‌-జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీతో రూ.73,360 కోట్ల పెట్టుబడులు, 3.5 లక్షల ఉద్యోగ అవకాశాల      లక్ష్యం.తెలంగాణపై విశ్వాసంతో పెట్టుబడులు పెడుతున్న దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కృతజ్ఞతలు.
**ఐటీ – ఏఐ – గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లలో దూసుకెళ్తున్న తెలంగాణ*
2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97      లక్షల కోట్లు. 12.14 లక్షల ప్రత్యక్ష ఐటీ      ఉద్యోగాలు.హైదరాబాద్‌లో 355కిపైగా గ్లోబల్‌      కెపాబిలిటీ సెంటర్లు. 2026లోనే మరో 40 కొత్త కేంద్రాలు హైదరాబాద్‌ను ఎంచుకోవడం.
డేటా సెంటర్లు, క్లౌడ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో దేశంలో అత్యంత వేగంగా      ఎదుగుతున్న గమ్యస్థానాల్లో తెలంగాణ.అమెజాన్‌ నుంచి తెలంగాణకు అదనంగా 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి.దేశంలో తొలి స్టేట్‌ ఏఐ డేటా ఎక్స్చేంజ్‌–టీజీడెక్స్‌      ఏర్పాటు.
**పర్యాటకం – తెలంగాణ సంస్కృతికి కొత్త గుర్తింపు*
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సమగ్ర టూరిజం      పాలసీ–2025.ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల      పెట్టుబడుల లక్ష్యం పెట్టుకోగా తొలి ఏడాదిలోనే రూ.23,174 కోట్ల పెట్టుబడులు.యువ టూరిజం క్లబ్‌ల ఏర్పాటులో తెలంగాణ దేశంలో      నంబర్‌–1.
*‘జయ జయహే తెలంగాణ’ గీతానికి అధికారిక      గౌరవం. తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ.*
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి సముచిత గౌరవం      కల్పించేందుకు ప్రత్యేక కమిటీ.
**తెలంగాణ రైజింగ్‌–2047.. వెయ్యి రోజుల తర్వాత మరింత పెద్ద లక్ష్యం*
వెయ్యి రోజుల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయానికి వేసిన పునాదులపై      భవిష్యత్తు తెలంగాణ నిర్మాణం.2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్‌      డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్‌      డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యం.క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ అభివృద్ధి వలయాలతో హైదరాబాద్‌ నుంచి గ్రామీణ తెలంగాణ వరకు      సమగ్ర అభివృద్ధి.భారత్‌ ఫ్యూచర్‌ సిటీని దేశంలో తొలి నెట్‌-జీరో      స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళిక.ఏఐ సిటీ, డేటా సెంటర్లు,      రీజనల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రెండో దశ,      మూసీ పునరుజ్జీవనం, యంగ్‌ ఇండియా      స్కిల్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీతో      భవిష్యత్తు తెలంగాణకు బలమైన పునాదులు.

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి_

*తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి*

*దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమావేశం*

*₹50,870 కోట్ల అంచనా వ్యయంతో, 2,023 కి.మీ మేర విస్తరించి ఉన్న 17 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు (DPRలు)*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 31:

రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించేందుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం నాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్ మరియు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలు, భూసేకరణ, వివిధ శాఖల నుండి అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులు మరియు ప్రాజెక్టుల సకాలంలో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన సహకారం వంటి అంశాలపై చర్చించారు.తెలంగాణ ఆర్థిక, పారిశ్రామిక మరియు ప్రాంతీయ అభివృద్ధికి రైల్వే అనుసంధానం అత్యంత కీలకమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు. పెండింగ్ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, రైల్వే ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను మరియు జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ₹50,870 కోట్ల అంచనా వ్యయంతో, 2,023 కి.మీ మేర విస్తరించి ఉన్న 17 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ DPRలను రైల్వే బోర్డుకు సమర్పించినట్లు అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు.
**పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి*
రైల్వే అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం, అప్రోచ్ రోడ్లు, రోడ్ల విస్తరణ, రైల్వే లైన్ల డబ్లింగ్, చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రజా రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడం వంటి సుమారు 21 సమస్యలను ఈ సమావేశంలో సమీక్షించారు.పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తగిన పరిష్కారాలను గుర్తించేందుకు, దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కలిసి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సంయుక్త తనిఖీలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఫ్యూచర్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాంతాలలో రైల్వే లైన్ల విస్తరణకు తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే ప్రాజెక్టుల అమలును సులభతరం చేయడానికి పురపాలక పరిపాలన, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్ (HMWSSB), రెవెన్యూ, ఇంధన, రోడ్లు & భవనాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కూడా ఆయన సూచించారు.ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరంతర సమన్వయం పాటించాలని ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అవసరమైన సహకారం, మద్దతు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
**పిఎమ్ PM గతి శక్తి కింద నిధుల సమీకరణ*
భారత ప్రభుత్వ 'పిఎమ్ గతి శక్తి' (PM Gati Shakti) పథకం కింద నిధులను పొందేందుకు సమగ్రమైన 'వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికల'ను (DPRs) సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అలాగే, నగరం యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని MMTS విస్తరణ, హైదరాబాద్ చుట్టూ ఉన్న ORR మరియు RRR ప్రాంతాలలో రైల్వే టెర్మినళ్ల ఏర్పాటు, మరియు బుల్లెట్ ట్రైన్ కారిడార్లతో సహా భవిష్యత్తు రైల్వే అనుసంధానానికి అవసరమైన భూసేకరణ కోసం సమగ్ర DPRలను రూపొందించాలని ఆయన సూచించారు.రాష్ట్ర భవిష్యత్తు వృద్ధి మరియు అభివృద్ధికి అత్యవసరమైన రైల్వే మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.ఈ సమావేశంలో GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, TGIIC MD శశాంక, RTC MD నాగిరెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, మేడ్చల్-మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సిటీ పోలీస్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, నిర్మల్, జనగాం మరియు వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు, అలాగే దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సేవలను గుర్తుచేసుకుంటూ ఘనంగా సన్మానం చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, IPS_

*సైబరాబాద్‌లో ఐదుగురు పోలీస్ అధికారుల పదవీ విరమణ*

*సేవలను గుర్తుచేసుకుంటూ ఘనంగా సన్మానం చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, IPS.*

బాపట్ల కృష్ణమోహన్, ఆగస్టు 31:

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న ఐదుగురు పోలీస్ అధికారులకు వీడ్కోలు కార్యక్రమం సోమవారం సైబరాబాద్ సీపీ కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.పదవీ విరమణ పొందుతున్న SI ఎం. రవీందర్ రెడ్డి (కేపీహెచ్‌బీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్), SI పి. విజయ్ భాస్కర్ రెడ్డి (SB సైబరాబాద్), RSI ఫరీద్ ఖాన్ (సైబరాబాద్ CAR హెడ్‌క్వార్టర్స్), ASI టి. కేశవులు (అత్తాపూర్), HG ఏబీ శర్మ (బాలానగర్ ట్రాఫిక్)లను పోలీస్ శాఖ ఘనంగా సత్కరించింది.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన అధికారులు పదవీ విరమణ పొందడం ఒక కొత్త జీవిత అధ్యాయానికి నాంది అని అన్నారు. విధి నిర్వహణలో అధికారులు అందించిన సేవలు, అనుభవం పోలీస్ శాఖకు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు తమ విధులను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో వారి సహధర్మచారులు, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని సీపీ అన్నారు. కుటుంబ సభ్యుల మద్దతు లేకుండా పోలీసు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు.పదవీ విరమణ అనంతరం అధికారులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందంగా సమయం గడపాలని సీపీ సూచించారు. ఖాళీగా ఉండకుండా సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి తమ వంతు సేవ చేయాలని కోరారు. హైదరాబాద్ నగరం, సైబరాబాద్ ప్రాంతం అభివృద్ధిలో పోలీస్ శాఖ కూడా తన వంతు కీలక పాత్ర పోషించిందని, ఆ అభివృద్ధిలో భాగస్వాములైన పోలీస్ అధికారులు గర్వపడాలని సీపీ అన్నారు.
 పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి అందే రిటైర్మెంట్ ప్రయోజనాలు, డబ్బులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. పోలీస్ శాఖకు అవసరమైన సందర్భాల్లో పదవీ విరమణ పొందిన అధికారులు తమ అనుభవం, సూచనలతో శాఖకు సహకరించాలని సీపీ కోరారు. అనంతరం పదవీ విరమణ పొందిన అధికారులను సీపీ సన్మానించి, వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ శ్రీమతి అన్నపూర్ణ, ఎస్ బీ డీసీపీ సుధీంద్ర,  హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్  , హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ షమీర్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ తో నెరవేరిన సొంత ఇంటి కల 16 నియోజకవర్గాల్లో 7340 ఫ్లాట్ల (flats) కేటాయింపు_

*ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ తో నెరవేరిన సొంత ఇంటి కల 16 నియోజకవర్గాల్లో 7340 ఫ్లాట్ల (flats)  కేటాయింపు*

*నాలుగు రోజుల పాటు కొనసాగిన లాటరీ ప్రక్రియ పారదర్శకంగా,నిష్పాక్షపాతం గా ఎంపిక*

బాపట్ల కృష్ణమోహన్, ఆగస్టు 31:

అవుటర్ రింగ్ రోడు పరిధిలో ఉన్న  అల్పాదాయ వర్గాల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లో 7340 మంది కి ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. నగరంలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  నాలుగు రోజుల పాటు నిర్వహించిన లాటరీ ప్రక్రియ సోమవారం నాడు ముగిసింది. గౌరవనీయ రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగస్టు 28 వ తేదీ నాడు  లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మినహాయించి మిగిలిన 15 నియోజకవర్గాల్లో 480 ఇండ్ల చొప్పున  కేటాయించారు. కంటోన్మెంట్ పరిథిలో తొలివిడతలో 140 ఇండ్లను మాత్రమే నిర్మిస్తున్నందున ఆ సంఖ్యలోనే ఇండ్లను కేటాయించారు.ప్రతి నియోజకవర్గంలోనూ, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారికే ఇండ్లు కేటాయించాలన్న ఉద్దేశ్యంతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పైలట్ ప్రాజెక్టులను చేపట్టి, హౌసింగ్ బోర్డు ద్వారా దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇలా అందుబాటులో ఉన్న స్థలాల్లో ప్రతిపాదించిన మొత్తం 7340 ఇండ్లకు గాను,  60,720 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలనలో అర్హులైన వారి పేర్లతో పూర్తి  పారదర్శకంగా,నిష్పాక్షపాతం గా, బహిరంగంగా లాటరీ నిర్వహించి ఇండ్లను కేటాయించారు.ఆగస్టు 28 వ తేదీ నుంచి 31 వరకు ఆయా నియోజకవర్గాల్లోనే దరఖాస్తుదారులు, అధికారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ జరిగింది. లాటరీ నిర్వహణ ప్రక్రియపై దరఖాస్తుదారుల్లో సంతృప్తి వ్యక్తం కాగా, లాటరీ ద్వారా ఇండ్లు పొందిన కుటుంబాల్లో పండుగ సీజన్ ను మరింత సంతోషాలను నింపింది.
అవుటర్ రింగ్ రోడ్ పరిథిలో మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 16 నియోజకవర్గాల్లో ఇండ్ల కేటాయింపు పూర్తి కాగా,  4 నియోజకవర్గాల్లో(mention the constituency names) ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మిగిలిన  నియోజకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే  వెలువడనున్నది.
**ఆన్ లైన్ లో వివరాలు....అభ్యంతరాల స్వీకరణ*
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో లాటరీ ద్వారా ఇండ్లు పొందిన వారి వివరాలన్నిటినీ tghb.telangana.gov.in లో ప్రజలకు అందుబాటులో  ఉంచుతున్నామని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతం తెలిపారు. ఇలా ఎంపికైన vaaru meedha ప్రజలు తమ అభ్యంతరాలను తెలియచేసే అవకాశం కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ అభ్యంతరాలను కూడా వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లోనే సమర్పించవచ్చన్నారు. 
అలాగే , లాటరీలో ఎంపికైన దరఖాస్తు దారుల వివరాలను పరిశీలించడానికి అధికారుల బృందం క్షేత్ర స్థాయి పరిశీలనను చేపడుతుందని ఆయన వెల్లడించారు. పూర్తి పారదర్శకంగా, అర్హులైన వారికే ఇండ్లు లభించేలా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు. లాటరీలో ఇండ్లు వచ్చిన వారు క్షేత్ర స్థాయిలో తమ ఇండ్లకు వచ్చే అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
*త్వరలో మరిన్ని ప్రాజెక్టులు*
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కోసం దరఖాస్తు చేసుకుని, లాటరీ ప్రక్రియలో ఇండ్లు రాని వారు ఏమాత్రం నిరుత్సాహం చెందవద్దని, త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులను చేపడతామని, అందులో  ఇండ్లు వచ్చే అవకాశం ఉందని బోర్డు వైస్ ఛైర్మన్ విపి గౌతం తెలిపారు.  ఇలా అర్హులైన వారికి ఇండ్లను నిర్మించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన వివరించారు.

"50,565 ఎకరాలు మరియు లక్ష ఇళ్లు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయా? అయితే పూర్తి జాబితాను బహిర్గతం చేయండి"_

*ప్రెస్ నోట్*

*“50,565 ఎకరాలు మరియు లక్ష ఇళ్లు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయా? అయితే పూర్తి జాబితాను బహిర్గతం చేయండి”*

*ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉంది - వి. రవికృష్ణ న్యాయవాది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 30:

మాజీ మంత్రి టి. హరీశ్‌రావు మరియు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇటీవల సుమారు 50,565 ఎకరాల వ్యవసాయ భూములు, దాదాపు లక్ష ఇళ్లు సెక్షన్ 22-A ప్రొహిబిటెడ్ లిస్టులో చిక్కుకున్నాయని ఆరోపిస్తూ, వాటిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. సమస్య పరిష్కారం కాకపోతే సంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని కూడా హెచ్చరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వ రికార్డులు ఏమి చెబుతున్నాయో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.నేను అమీన్‌పూర్ మరియు పటాన్‌చెరు మండలాలకు సంబంధించిన సమీకృత ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ రికార్డులను సర్వే నంబర్ వారీగా పరిశీలించాను.
*ఆ రికార్డుల ప్రకారం:*

**అమీన్‌పూర్ మరియు పటాన్‌చెరు మండలాలు**

*(1)*: వ్యవసాయ భూములు: 1,631.6690 ఎకరాలు.
*(2)*:  వ్యవసాయేతర భూములు / ప్లాట్లు: 673.3775 ఎకరాలు.
*(3)*: మొత్తం: 2,305.0465 ఎకరాలు.
అంటే మొత్తం విస్తీర్ణం సుమారు 1,11,56,425.06 చదరపు గజాలు.
*అయితే ఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని ప్రజలు గమనించాలి.*
ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న ప్రతి ఆస్తిని  *“ప్రైవేట్ వ్యవసాయ భూమి”* గా పేర్కొనడం సరైనది కాదు. రికార్డుల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ , ఇరిగేషన్ –శిఖం (వాటర్ బాడీస్ ), అసైన్డ్ ల్యాండ్స్ తదితర విభిన్న వర్గీకరణలు ఉన్నాయి.
అందువల్ల 50,565 ఎకరాలు వ్యవసాయ భూములే, అలాగే లక్ష ఇళ్లు ప్రొహిబిటెడ్ లిస్టులోనే ఉన్నాయి అని చెప్పిన వారు ఆ సంఖ్యలకు సంబంధించిన పూర్తి అధికారిక ఆధారాలను ప్రజల ముందుంచాలి.
*మా ప్రశ్న చాలా సూటిగా ఉంది:*
50,565 ఎకరాలు మరియు లక్ష ఇళ్లకు సంబంధించిన పూర్తి Survey-wise List ఎక్కడ ఉంది?.
*ఆ జాబితాను ప్రజల ముందుంచండి.*
మండలాల వారీగా...గ్రామాల వారీగా ...సర్వే నంబర్ల వారీగా ...విస్తీర్ణం వారీగా ...
వర్గీకరణ వారీగా...పూర్తి వివరాలను బహిర్గతం చేయండి.
ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు చట్టవిరుద్ధంగా ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చబడి ఉంటే, వాటిని చట్ట ప్రకారం పరిశీలించి తొలగించాల్సిందే. దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ప్రభుత్వ భూములు, చెరువులు/నీటి వనరులకు సంబంధించిన శిఖం భూములు, అసైన్డ్ ల్యాండ్స్ మరియు చట్టపరంగా సెక్షన్ 22-A పరిధిలోకి వచ్చే ఇతర ఆస్తులను కేవలం రాజకీయ ఒత్తిడి కారణంగా తొలగించడం సాధ్యం కాదు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రికార్డుల్లో డి నోటిఫికేషన్ / డిలేషన్ ఫ్రమ్ ప్రోహిబిషన్ కు సంబంధించిన ప్రత్యేక జాబితాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే డీ-నోటిఫై లేదా ప్రొహిబిషన్ నుంచి తొలగించిన ఆస్తులను ప్రస్తుత ప్రొహిబిటెడ్ లిస్టు విస్తీర్ణంలో కలిపి చూపడం కూడా సరికాదు.
**ప్రజలకు ఒకే ఒక్క విజ్ఞప్తి:**
రాజకీయ ఆరోపణలు కాదు  పూర్తి రికార్డులు బయటకు రావాలి.సంఖ్యలు కాదు సర్వే వైస్ ఎవిడెన్స్ కావాలి.
*ఎవరి భూమి?*
*ఏ సర్వే నెంబర్ ?*
*ఎంత విస్తీర్ణం?*
*ఏ క్లాసిఫికేషన్ ?*
*ఏ చట్టం కింద ప్రోహిబిటెడ్ ?*
ఇవన్నీ ప్రజలకు తెలియాలి. పూర్తి జాబితాను బహిర్గతం చేయండి.ప్రజలే రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ణయించనివ్వండి.
*“రాజకీయాల కంటే వాస్తవాలకే ప్రాధాన్యత ఉండాలి.”*
50,565 ఎకరాలు + లక్ష ఇళ్లకు సంబంధించిన పూర్తి సర్వే వైస్ ప్రోహిబిటెడ్ లిస్ట్ ను ప్రజల ముందుంచండి.

ఈ రోజు, నా కళ్లు కృతజ్ఞతా భావంతో తడిసిపోయాయి_

*ఈరోజు మనం మరో మంచి అధికారిణి, ఐఏఎస్ దివ్య మిట్టల్‌ను కోల్పోయాము.*

*ఆమె రాజీనామా చేశారు.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 30:

ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్.ఐఐటీ IIT ఢిల్లీ నుండి బి.టెక్ మరియు ఐఐఎమ్ IIM బెంగళూరు నుండి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు.దివ్య మిట్టల్ ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన పరిపాలనా పదవులను నిర్వహించారు. ఇందులో డియోరియా, మీర్జాపూర్ మరియు సంత్ కబీర్ నగర్ జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలు కూడా ఉన్నాయి.ఆమె మొదట లండన్‌లో ఆర్థిక రంగానికి సంబంధించిన ఉద్యోగం చేశారు. విదేశాలలో వృత్తిపరంగా విజయం సాధించినప్పటికీ, దివ్య మిట్టల్ భారతదేశానికి తిరిగి వచ్చి దేశం కోసం ఏదైనా చేయాలని భావించారు.చివరికి ఆమె లండన్‌లోని ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత, క్షేత్రస్థాయిలో సేవ చేయడానికి ఆమె UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.యూపీలోని ఒక గ్రామంలో ప్రజలు 75 ఏళ్లుగా ట్యాంకర్ల నీటిపై ఆధారపడి జీవించిన ఉదంతం అందరికీ తెలిసిందే.అక్కడి ప్రజలు,గ్రామస్థులు ఎంపీని, ఎమ్మెల్యేను ఎన్నోసార్లు వేడుకున్నా ఏమీ జరగలేదు.ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ ఆ గ్రామానికి కుళాయి నీళ్లు తెచ్చారు. కానీ, నీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించలేదనే కారణంతో ఆమెను బదిలీ చేశారు. ఆ తర్వాత, గ్రామానికి నీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌ను కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు.నిజాయితీ గల అధికారులను శిక్షించడానికే మన వ్యవస్థ రూపొందించబడినట్లు అనిపిస్తుంది.భారత ప్రజలకు సేవ చేయడానికి ఆమె తన లండన్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. కానీ ఈరోజు రాజీనామా చేశారు.ఆమె రాజీనామాకు కారణం ఎవరు? కానీ ఆమె నిజాయితీ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది అని ప్రజలు అనుకుంటున్నారు.
*దివ్య మిట్టల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలకు ఇచ్చిన సందేశం* 
ఈ రోజు, నా కళ్లు కృతజ్ఞతా భావంతో తడిసిపోయాయి. ఒక దృశ్యం నా మనసులో చెరగని ముద్ర వేసింది: లహురియా దాహ్ కొండ ప్రాంతానికి చెందిన ఆ వృద్ధ తల్లి, తన గ్రామానికి నీరు మొదటిసారిగా చేరడాన్ని చూసి ఏమీ మాట్లాడలేదు—కేవలం వణుకుతున్న చేతులతో నా తలను తాకి నన్ను ఆశీర్వదించింది. నేను ఈ రోజు నా అధికారిక పదవి నుండి దిగి ఉండవచ్చు, కానీ ఆ స్పర్శ నన్ను ఎప్పటికీ వీడిపోదు; అలాగే, ఈ దేశపు నేల నాకు ప్రసాదించిన ఆ కల కూడా నా నుండి చెరిగిపోదు.
నేను ఎంతో కృషి చేసే అవకాశాన్ని పొందాను మరియు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సరైన దాని కోసం నిలబడటం అనేది కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదు, అది ఒక బాధ్యత అని డియోరియా నాకు నేర్పింది. 'అసాధ్యం' అనేది ఒక వాస్తవం కాదని, అది కేవలం ఒక అభిప్రాయం మాత్రమేనని మీర్జాపూర్ నాకు బోధించింది. ఇక వింధ్యవాసిని అమ్మవారి సన్నిధిలో కూర్చున్నప్పుడు, నిజమైన శక్తి అనేది అధికార పదవి నుండి కాకుండా, అమ్మవారి అనుగ్రహం మరియు ప్రజల విశ్వాసం నుండే లభిస్తుందని నేను తెలుసుకున్నాను. అన్నిటికంటే గొప్ప పాఠం ఏమిటంటే—నా కోసం నేను కన్న కలలు అప్పటికే సాకారమయ్యాయి; ఇక ఇప్పుడు, నా ప్రజల కోసం నేను కన్న కలలను నిజం చేసుకుంటూ జీవించాల్సిన సమయం ఆసన్నమైంది. తమ భూమిపై హక్కులను మొట్టమొదటిసారిగా పొందిన కుటుంబాల కళ్ళలో ఈ జీవితానికి సంబంధించిన నిజమైన తృప్తిని నేను చూశాను.గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం పొందిన దివ్యాంగుడితోనూ, తన పొలాలకు నీటి సౌకర్యం సమకూరిన రైతుతోనూ కలిసి నడుస్తున్నప్పుడు నేను ఒక విషయాన్ని గ్రహించాను: ప్రతి ప్రభుత్వ ఫైలు వెనుక ఒక మనిషి ఉంటాడు—వారి గౌరవాన్ని కాపాడటమే నిజమైన న్యాయం.
నేను ఏదో ఇవ్వడానికి వచ్చానని అనుకోవడం నా అవివేకం. నిజానికి, అత్యధికంగా పొందింది నేనే; ఆ రుణభారం అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది. నా సంతోషాన్ని చూసి నాకంటే ఎక్కువగా ఇతరులే ఆనందించారు. నేను అలసిపోయినట్లు లేదా కృంగిపోయినట్లు అనిపించినప్పుడు కూడా, వారు నాపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచారు. ఆ నమ్మకమే నాకు ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చింది. నాకు లభించిన అపారమైన ప్రేమ, గౌరవం మరియు 'ఇది నా కుటుంబం' అనే భావన నా హృదయాన్ని పూర్తిగా నింపేశాయి. నాతో అడుగడుగునా అండగా నిలిచి, స్థిరంగా సహకరించిన నా సహచరులు, అధికారులు మరియు సిబ్బందికి దీనికి సంబంధించిన గొప్ప గుర్తింపు దక్కుతుంది.

Sunday, August 30, 2026

తెలంగాణ లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి_

*తెలంగాణ లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 29:

తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కారణంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అలాగే అనర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో చేరకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ఎన్నికల సంఘం ECI ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ గారికి ముఖ్యమంత్రి  లేఖ రాశారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే గడువును పొడిగించడంతో పాటు ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.2026 జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 73.39 లక్షల మందిని 21.7 శాతం,గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా అసడ్ గుర్తించినట్లు ముఖ్యమంత్రి  ECISVEEP గణాంకాలను ఉటంకించారు. ఈ వర్గంలో దాదాపు 62 శాతం మంది అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మరోవైపు డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉండగా, 32.36 లక్షల పత్రాలకు గత ఓటర్ల జాబితాతో అనుసంధానం చేయబడలేదని తెలిపారు. దీంతో సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని ఎన్నికల సంఘానికి వివరించారు.ప్రస్తుత సవరణ విధానంలో కొన్ని కీలకమైన లోపాలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు లేఖలో పేర్కొన్నారు. గణన సిబ్బంది పరిశీలనకు వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకే విధంగా పరిగణిస్తున్నారని తెలిపారు.నిజంగా నివాసం మారిన వారికి కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా ఎలాంటి సహాయం అందించకుండానే పాత నివాసంలోని ఓటు తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా నివాసం మారిన వారి పేర్లను తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను పాటించడం లేదని తెలిపారు.దీనివల్ల ఓటర్లు పోలింగ్ రోజున కేంద్రానికి వెళ్లే వరకు తమ ఓటు హక్కు తొలగిపోయిన విషయం తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రంలోని మొత్తం గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లలో 58.6 శాతం, పరిశీలన నోటీసుల్లో 41.9 శాతం కేంద్రీకృతమై ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.ఉద్యోగాలు, వివాహాలు, తాత్కాలిక నివాస మార్పుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున సవరణ ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.సమీప భవిష్యత్తులో తెలంగాణ లో ఎలాంటి ఎన్నికలు లేవని, అందువల్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించి, నిర్ణయించిన తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ అక్టోబర్ 19 నుంచి సవరించాలని కోరారు.గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించి, కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదా ఓటర్ల జాబితాలను బహిరంగంగా చదివి వినిపించాలని విజ్ఞప్తి చేశారు.నోటీసులు అందుకున్న రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వయోవృద్ధులు తమ పత్రాలను సమర్పించేందుకు వారం రోజుల సమయం సరిపోదని, కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. 
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గ, పోలింగ్ కేంద్ర స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఓటర్లకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని పొందేందుకు సహకరించాలని సూచించారు.ప్రభుత్వ ఉత్తర్వు  జీవో నంబర్ 172 ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని అంగీకరించకపోవడం వల్ల పట్టణ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర పత్రాలను కూడా అంగీకరించేలా ఆధారాల జాబితాను సవరించి విస్తరించాలని సూచించారు.హైదరాబాద్ లోని ప్రతి నియోజకవర్గంలో సగటున 78 వేలకుపైగా కేసులు ఉన్నందున కేవలం కొంతమంది  అధికారుల నియామకం సరిపోదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఓటర్ల నమోదు అధికారి స్థాయికి దిగువన అదనపు అధికారులను నియమించి, ముద్రిత నోటీసుల్లోనే నిర్దిష్ట తేదీలు, సమయాలను పేర్కొంటూ వికేంద్రీకృత విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ కేంద్రాల ఏర్పాటు, గ్రామసభల నిర్వహణతో పాటు పరిపాలనా, ఇతర అవసరమైన సహకారాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సామాజిక బాధ్యతపై అవగాహన అవసరం: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్_

*ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సామాజిక బాధ్యతపై అవగాహన అవసరం: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 29:

రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎమ్డిసి హైదరాబాద్ మారతాన్ (NMDC Hyderabad Marathon – 2026)లో భాగంగా 5కే రన్ విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎచ్ఐసీసీ HICC నుంచి హైటెక్స వరకు నిర్వహించిన ఈ పరుగు కార్యక్రమంలో సుమారు 6,100 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పరుగు కార్యక్రమాన్ని “Run for a Cause” అనే సందేశంతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నప్పటికీ, నిర్వాహకులు మరియు పోలీసు సిబ్బంది సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్‌, సీఎంసీ కమిషనర్ శ్రీమతి సృజన, విద్యార్థులు, రన్నర్లు మరియు సామాన్య ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. క్రమం తప్పకుండా పరుగు, నడక వంటి శారీరక వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అదే విధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా సమాజంలో సేవాభావాన్ని మరింత పెంపొందించవచ్చని పేర్కొన్నారు.పిల్లలు సెల్‌ఫోన్‌లకు ఎక్కువ సమయం కేటాయించకుండా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకునేలా *“సెల్‌ఫోన్ వద్దు – పుస్తకమే ముద్దు”* అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. కథల పుస్తకాలు, ఇతర పుస్తకాలు, రాత సామగ్రిని అవసరమైన వారికి అందించడం ద్వారా పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు వారి జ్ఞానాన్ని విస్తరించేందుకు దోహదపడుతుందని అన్నారు.రోహిణి ఫౌండేషన్ చేపట్టిన “పవర్ అఫ్ 100” కార్యక్రమం ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరి చిన్న సహకారం కూడా ఒక పెద్ద సానుకూల మార్పుకు దోహదపడుతుందనే సందేశాన్ని అందించారు. *“100 People – ₹100 Each – One Powerful Change”* అనే భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యత, సమిష్టి భాగస్వామ్యం మరియు సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు కృషి చేశారు.సుమారు 6,100 మంది పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన రోహిణి ఫౌండేషన్ నిర్వాహకులు, NMDC Hyderabad Marathon నిర్వాహకులు, రన్నర్లు, విద్యార్థులు, ప్రజలు మరియు సైబరాబాద్ పోలీస్ సిబ్బందికి సైబరాబాద్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

Saturday, August 29, 2026

వేతన చెల్లింపులో జాప్యం, ఫారమ్-16 జారీపై చర్యలు తీసుకోవాలని TGHRC సిఫార్సు_

*ప్రెస్ రిలీజ్*

*వేతన చెల్లింపులో జాప్యం, ఫారమ్-16 జారీపై చర్యలు తీసుకోవాలని TGHRC సిఫార్సు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 28:

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC), గౌరవ చైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన, HRC No.4763 of 2021లో 28.07.2026 తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు వేతనం దీర్ఘకాలం చెల్లించకపోవడం, తద్వారా ఆదాయపు పన్ను సంబంధిత ఇబ్బందులు ఎదురైన అంశంపై కమిషన్ విచారణ జరిపింది.
ఫిర్యాదుదారు 23.10.2015 నుండి 24.02.2017 వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC)లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేశారు. సంబంధిత కాలానికి సంబంధించిన రూ.14,24,488/- వేతనం అక్టోబర్, 2018లో ఆయన మునుపటి పోస్టింగ్ స్థలం నుండి లాస్ట్ పే సర్టిఫికేట్ (LPC) అందిన అనంతరం ఒకేసారి చెల్లించబడింది. అలాగే, Form-16, బిల్లు వారీ వివరాలు, TDS చెల్లింపుల వివరాలు సకాలంలో అందకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు అందినట్లు ఫిర్యాదుదారు తెలిపారు.
సంబంధిత అధికారుల నివేదికలను పరిశీలించిన కమిషన్, వేతనం చెల్లించడంలో ఒక సంవత్సరానికి పైగా జాప్యం జరిగినట్లు పేర్కొంది. ఉద్యోగి బదిలీ అయినప్పుడు సర్వీస్ రిజిస్టర్ , ఎల్పిసి LPC తదితర సేవా రికార్డులను సకాలంలో బదిలీ చేసి, వేతన చెల్లింపులో అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత పరిపాలనా అధికారులపై ఉందని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, సంబంధిత ఇంజనీర్-ఇన్-చీఫ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ మరియు కమిషనర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వైపు జాప్యం ఉన్నట్లు కమిషన్ అభిప్రాయపడింది.
మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 18 కింద తన అధికారాలను వినియోగిస్తూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదుదారుడి వేతన చెల్లింపులో జరిగిన జాప్యం మరియు అక్టోబర్, 2015 నుండి ఫిబ్రవరి, 2017 వరకు కాలానికి Form-16 జారీ అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది.
*పై సిఫార్సుతో కేసులో తదుపరి చర్యలను కమిషన్ ముగించింది.*

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ట‌వ‌ర్స్_

*పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ట‌వ‌ర్స్*

*క్యూర్‌ పరిధిలో అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ టవర్స్‌ లక్కీడ్రా*

*రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 28:

హైదరాబాద్ మహానగరంలో  నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే  ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి  పారదర్శకంగా  ల‌బ్దిదారుల ఎంపిక చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.  అర్హతే ప్రామాణికంగా, కులమతాలు , రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు.
క్యూర్  ప్రాంతంలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు అత్యంత పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. మీడియా, అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహిస్తూ, మొత్తం ప్రక్రియను అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు.
**శుక్రవారం నాంపల్లి, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కోసం లక్కీడ్రా నిర్వహించారు.**
 నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్‌ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని డ్రా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈరోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తామని మంత్రి వివరించారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారని, ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన 120 మందిలోని అర్హులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విధానం ద్వారా అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.
గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 13న కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారని మంత్రి గుర్తు చేశారు. అనంతరం రికార్డు సమయంలోనే 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి టెండర్లు పిలవడం, మరోవైపు లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప విజయమని అన్నారు.క్యూర్‌ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్‌ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు.
ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తోందని, చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు.రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. మరో పది రోజుల్లో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వానికి డబ్బు కూడబెట్టుకోవడం కంటే పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా సొంత ఇంటిని అందించడం ముఖ్యమని అన్నారు. ఎకరం రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లోనూ పేద కుటుంబాలు గౌరవంగా జీవించాలి  అని మంత్రి స్పష్టం చేశారు.ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు పొందిన అర్హులైన లబ్ధిదారులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్‌ అనంతరం పదేళ్ల తర్వాత అవసరాన్ని బట్టి ఇంటిని విక్రయించుకునే సదుపాయం ఉంటుందని చెప్పారు. అంతకుముందే ఏదైనా అత్యవసర అవసరం ఏర్పడితే, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ను బ్యాంకులో కుదువ పెట్టుకుని రుణం పొందే అవకాశం కూడా ఉంటుందని వివరించారు.లక్కీడ్రాలో ఇల్లు పొందిన ప్రతి లబ్ధిదారుడికి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించి అందిస్తామని మంత్రి చెప్పారు. ఒక్కో ఇంటికి 17 నుంచి 20 గజాల అన్‌డివైడెడ్‌ షేర్‌ భూమి కూడా ఉంటుందని తెలిపారు.ప్రభుత్వం గుర్తించిన స్థలాల్లో అవసరాన్ని బట్టి 10 అంతస్తుల వరకు ఇందిరమ్మ టవర్స్‌ నిర్మిస్తామని, లిఫ్ట్‌లతో పాటు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు.
లక్కీడ్రా పూర్తయిన తర్వాత లబ్ధిదారుల తుది ఎంపిక జరుగుతుందని, అధికారుల పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తారని మంత్రి తెలిపారు. ఆ తర్వాత కేవలం 3–4 రోజుల్లోనే టవర్స్‌ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించుకునే అవకాశం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు.నాంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన లక్కీడ్రాలో తొలుత ఎస్సీ విభాగానికి కేటాయించిన 14 శాతం రిజర్వేషన్‌ ప్రకారం 67 ఫ్లాట్ల కోసం 288 మంది పేర్లతో కూడిన చీటీలను డ్రమ్ములో వేశారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్‌, హౌసింగ్‌ ఎండీ వి.పి. గౌతమ్‌, కలెక్టర్‌ ప్రియాంక తదితర అధికారుల సమక్షంలో లబ్ధిదారులతోనే డ్రా తీయించారు.ఎస్సీ విభాగంలో తొలి ఫ్లాట్‌కు మరకాల కృష్ణవేణి ఎంపిక కాగా, అనంతరం టి.అనిత, మంగనూరి అనసూయ, ఎం.కుమారి, శైలజాకుమారి వరుసగా ఫ్లాట్లను లక్కీడ్రా ద్వారా పొందారు.
ప్రతి నియోజకవర్గంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 

**ఎస్సీలకు – 14 శాతం, ఎస్టీలకు – 5 శాతం, బీసీలకు – 16 శాతం, దివ్యాంగులకు – 5 శాతం పారిశుధ్య కార్మికులు, నాలుగో తరగతి ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు – 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు వివరించారు*. 
ఈ ఫ్లాట్లలో మొత్తం 50 శాతం రిజర్వేషన్లు ఉండగా, మొత్తంగా మహిళలకు 30 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి  వెల్లడించారు.

జపాన్‌ సంస్థతో ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ భాగస్వామ్యం_

*జపాన్‌ సంస్థతో ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ భాగస్వామ్యం*

*హిరోషిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో సూత్రప్రాయ అంగీకారం*

*హైదరాబాద్‌కు రావాలని హెచ్‌ఐటీ ప్రతినిధులకు మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆహ్వానం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 28:

తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను అందించేందుకు జపాన్‌లోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్నామని శక్తి మరియు గనులు శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. ఇందులో భాగంగా హిరోషిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (హెచ్‌ఐటీ), యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ) మధ్య భాగస్వామ్యానికి సూత్రప్రాయ అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు.జపాన్‌ పర్యటనలో భాగంగా మంత్రి వివేక్‌ వెంకటస్వామి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం శుక్రవారం హిరోషిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని సందర్శించింది. ఈ సందర్భంగా సంస్థ నాయకత్వంతో తెలంగాణలో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల తయారీపై విస్తృతంగా చర్చించింది.తొలిదశలో పరస్పర అవగాహనతో భాగస్వామ్యాన్ని ప్రారంభించి.. తెలంగాణకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతికత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సహకార రంగాలను సంయుక్తంగా గుర్తించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి.
హెచ్‌ఐటీ–వైఐఎస్‌యూ భాగస్వామ్యంలో విద్యార్థుల పరస్పర మార్పిడి కార్యక్రమాన్ని కీలకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా తెలంగాణ విద్యార్థులకు జపాన్‌లోని సాంకేతిక విద్యా విధానం, ప్రయోగశాల ఆధారిత శిక్షణ, పరిశ్రమలతో అనుసంధానమైన విద్యా విధానంపై ప్రత్యక్ష అవగాహన కల్పించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకునే అవకాశాలు కూడా కల్పించనున్నారు.అధ్యాపకులు, శిక్షకుల నైపుణ్యాభివృద్ధి, ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌ (టీఓటీ), స్వల్పకాలిక సాంకేతిక కోర్సులు, పరిశోధన, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుభవం వంటి అంశాల్లోనూ సహకారాన్ని పరిశీలించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. తెలంగాణలో స్థానిక అవసరాలు, భవిష్యత్‌ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్య రంగాలను ఎంపిక చేయనున్నారు. అధునాతన తయారీ, మొబిలిటీ, ఆటోమొబైల్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమేషన్‌, డిజిటల్‌ టెక్నాలజీలు, పర్యావరణ సాంకేతికత వంటి రంగాల్లో ప్రత్యేకంగా సహకారం పెంచుకోవడంపై చర్చించారు. హిరోషిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ రంగంలోని సామర్థ్యాలు.. తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు అనుకూలంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.కేవలం సంప్రదాయ విద్యా మార్పిడికి పరిమితం కాకుండా.. నైపుణ్యాలు, ఉపాధి సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పరిశ్రమల అవసరాలకు నేరుగా ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. జపాన్‌ సాంకేతికత, తయారీ రంగం, పరిశ్రమల ఆధారిత విద్యా విధానంలోని ఉత్తమ పద్ధతులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా అమలు చేయాలని అన్నారు.
తరగతి గది, ప్రయోగశాల విద్యను వాస్తవ పరిశ్రమల సవాళ్లు, పరిశోధనతో అనుసంధానించే హెచ్‌ఐటీ విధానంపై తెలంగాణ ప్రతినిధి బృందం ప్రత్యేక ఆసక్తి చూపింది. ఇలాంటి విధానాలను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో పాటు తెలంగాణ సాంకేతిక విద్యా వ్యవస్థలో ఎలా అమలు చేయవచ్చనే అంశంపై చర్చించారు.
**హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానం**
హెచ్‌ఐటీ ప్రతినిధులను హైదరాబాద్‌కు వచ్చి యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని సందర్శించాలని మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆహ్వానించారు. తదుపరి చర్చల ద్వారా భాగస్వామ్యానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
డిసెంబరులో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’లో పాల్గొని.. తెలంగాణతో మరిన్ని సంస్థాగత, పారిశ్రామిక భాగస్వామ్యాలను పరిశీలించాలని హెచ్‌ఐటీ ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు.జపాన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, పరిశ్రమలతో నేరుగా సంస్థాగత సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఈ భాగస్వామ్యం మరో కీలక ముందడుగని మంత్రి తెలిపారు. ప్రపంచస్థాయి సాంకేతిక విద్య, నైపుణ్యాలు, పరిశ్రమల అనుభవాన్ని తెలంగాణ యువతకు అందించేందుకు ఇటువంటి భాగస్వామ్యాలను మరింత విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.

Friday, August 28, 2026

మీరాలం ట్యాంక్ ను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలి - సీఎం రేవంత్ రెడ్డి_

*మీరాలం ట్యాంక్ ను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలి - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 27:

హైదరాబాద్ మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా సాగుతున్న పనులను ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అనుముల ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ సాగుతున్న పనులను ఒక్కొక్కటిగా పరిశీలించారు.అత్యుత్తమ డిజైన్లతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కొనసాగుతున్న పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ద్వారా అధికారులు వివరించారు. ప్రణాళికలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు.నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ట్యాంక్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను ఓపెన్-టాప్ జీపులో ప్రయాణించి ఆ ప్రాంతాన్ని మొత్తంగా పరిశీలించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను భారీ క్రేన్ సహాయంతో పైకి వెళ్లి చూశారు.చెరువులోకి మురుగు నీరు చేరకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే చెరువు నుంచి మూసీలోకి వరద నీరు వెళ్లేలా నాలాను విస్తరించాలని చెప్పారు.పర్యాటకులు చెరువులో వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ చేయాలని, చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్‌లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున మీరాలం చెరువును, పరిసర ప్రాంతాలను పర్యాటకులకు ఆకట్టుకునేలా ఏర్పాట్లు జరగాలని సూచించారు.ముఖ్యమంత్రి గారి ఆకస్మిక పర్యటన సందర్భంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఉన్నతాధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి అప్రమత్తంగా ఉండండి - హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఐపిఎస్_

*నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి అప్రమత్తంగా ఉండండి - హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఐపిఎస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 27:

వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా సజ్జనార్ మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడిన హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నారు అని అన్నారు. 
తాజాగా నగరంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకున్నాం.ఎలాంటి విద్యార్హతలూ, కనీస వైద్య పరిజ్ఞానం లేని వీరు అసలైన వైద్యుల తరహాలోనే నటిస్తూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారు.
అవగాహనారాహిత్యంతో రోజుల తరబడి మందులు వాడాలని సూచించడంతో ప్రజల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.ఇలాంటి మోసగాళ్లపై మా నిఘా, కఠిన చర్యలు కొనసాగుతుండగా.. ప్రజలు కూడా చికిత్స కోసం వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.తాము వెళ్లే క్లినిక్‌లు, ఆసుపత్రుల రిసెప్షన్ వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ప్రముఖంగా ప్రదర్శించారో లేదో గమనించాలి. 
అలాగే వైద్యుల బోర్డులపై పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. వైద్యుల వివరాలపై ఏమాత్రం సందేహం కలిగినా వెంటనే onlinetsmc.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి Doctor Searchలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వారి వివరాలను సరిచూసుకోవచ్చు. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీలని గుర్తించాలి.చికిత్స విధానం లేదా సిబ్బంది ప్రవర్తనపై ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అర్హత గల ఇతర నిపుణులైన వైద్యుల వద్ద రెండో అభిప్రాయం (Second Opinion) తీసుకోవాలి. ఎక్కడైనా నకిలీ వైద్యులు చలామణి అవుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేసి అమాయకుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాను అని అన్నారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు_

*సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు*  

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 27:

అంజయ్య నగర్ లో అక్రమ నిర్మాణం కూలి మనుషులు చనిపోయాక కళ్ళు తెరిచిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు సిబ్బంది. అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో ఉండడం లేదు అని అర్థం అవుతుంది. చైన్మాన్ సిబ్బంది నిద్దురపోతున్నారా ?.
ఇప్పుడు నిబంధనలు ఉల్లంగించిన అక్రమ నిర్మాణాలపై కొనసాగుతున్న చర్యలలో భాగంగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ CMC బృందాలు మూడు జోన్లలోనూ తనిఖీలు మరియు చర్యలను కొనసాగిస్తున్నాయి.

*ప్రస్తుతం నిబంధనలు ఉల్లంగించిన 54 అక్రమ నిర్మాణాలు గుర్తించబడ్డాయి అని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.*

*(1)*: 21 భవనాలు కూల్చివేయబడ్డాయి.
*(2)*: 14 నోటీసులు జారీ చేయబడ్డాయి.
*(3)*: 1 అనధికృత నిర్మాణం స్వాధీనం చేసుకోబడింది.
*(4)*: తదుపరి కూల్చివేత చర్యల కోసం 33 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి

*జోన్ల వారీగా కూల్చివేతలు:*
*(1)*: శేరిలింగంపల్లి జోన్ – 9
*(2)*:  కూకట్‌పల్లి జోన్ – 6
*(3)*:  కుత్బుల్లాపూర్ జోన్ – 6

భవన నిర్మాణ నిబంధనల అమలును నిర్ధారించడానికి CMC బృందాలు క్షేత్రస్థాయిలో గుర్తింపు మరియు తనిఖీ చర్యలను కొనసాగిస్తాయి. గుర్తించిన అన్ని అక్రమ నిర్మాణాలపై, నిర్దేశిత విధానం మరియు వర్తించే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాము అని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

Thursday, August 27, 2026

వార్త రాస్తే.. వేటాడతారా?!అవినీతిని ప్రశ్నిస్తే జర్నలిస్టులపై దాడులు చేస్తారా?_

*జర్నలిస్టు నేలపాటి రవిపై పాశవిక దాడి*

తలకు తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవి

గురువారం రాత్రి కాపుకాచి దాడికి పాల్పడిన దుండగులు

*‘వెలుగులో లోన్ దందా’ కథనంతో కక్షగట్టారన్న ఆరోపణ*

*కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులతో దాడి.. హత్య చేస్తామంటూ హెచ్చరికలు*

*దాడి వెనుక  పీసీ పల్లి వెలుగు అధికారుల హస్తం?!*

వార్త రాస్తే.. వేటాడతారా?!

అవినీతిని ప్రశ్నిస్తే జర్నలిస్టులపై దాడులు చేస్తారా?

దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

దాడి వెనుక అధికారుల ప్రేరేపణ ఉందన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలి

*తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం డిమాండ్*

*మార్కాపురం/కనిగిరి* : ప్రజా సమస్యలు, ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం అత్యంత దారుణమని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మార్కాపురం జిల్లా పీసీ పల్లి వెలుగు కార్యాలయంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై ‘వెలుగులో లోన్ దందా’ పేరుతో వార్త ప్రచురించినందుకు జర్నలిస్టు నేలపాటి రవిపై కొందరు వ్యక్తులు గురువారం రాత్రి కాపుకాచి కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు రవి ఆరోపించారు. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయాలైనట్లు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

దాడి సమయంలో తనపై తీవ్రంగా దాడి చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాస్తే చంపేస్తామని బెదిరించినట్లు రవి వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది.

వెలుగు కార్యాలయంలోని అక్రమాలను ప్రశ్నిస్తూ వార్త రాసినందుకే తనపై దాడి జరిగిందన్న రవి ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సంఘం పేర్కొంది. జర్నలిస్టులు ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలని, వార్తలు రాసినందుకు వారిపై భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

అదేవిధంగా, ఈ దాడి వెనుక వెలుగు శాఖకు చెందిన కొందరు అధికారుల ప్రేరేపణ ఉందన్న ఆరోపణలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని సంఘం డిమాండ్ చేసింది. ఆరోపణలు వాస్తవమైతే బాధ్యులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, దాడిని ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల పాత్రపై కూడా విచారణ జరపాలని సంఘం కోరింది. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, బాధిత జర్నలిస్టుకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
జర్నలిస్టులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, జర్నలిస్టుల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం స్పష్టం చేసింది.
SOURCE 

_నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి.. అప్రమత్తంగా ఉండండి - హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ఐపిఎస్_

*_నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి.. అప్రమత్తంగా ఉండండి - హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ఐపిఎస్*

https://youtu.be/8zPo_HhOS-4?si=8-zfI83Ki5Frazmt 

*వైద్యుల వివరాలపై ఏమాత్రం సందేహం కలిగినా వెంటనే onlinetsmc.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి Doctor Searchలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వారి వివరాలను సరిచూసుకోవచ్చు. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీలని గుర్తించాలి.*

https://www.instagram.com/reel/DcicUbhqw6W/?igsi=aTNzMjQ2bzBjaDE0
               *****
https://www.facebook.com/share/p/1DF4SV1DsU/
               *****
https://x.com/Praja_Snklpm/status/2092903294918353358

గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు – అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, IPS_

*గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు – అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, IPS.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 26:

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించారు.సెప్టెంబర్ 14 నుంచి 25వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి గత ఏడాది ఏర్పాట్లు, ఎదురైన సమస్యలు, ఈ ఏడాది చేపట్టాల్సిన భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గత ఏడాది సైబరాబాద్ పరిధిలో సుమారు 25,000 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ఈ ఏడాది కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఈ సమావేశం లో పోలీస్,  సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, హైడ్రా, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, జలమండలి, ఆర్టీసీ, టూరిజం తదితర శాఖల అధికారులు   పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన తేదీ వంటి వివరాలను నిర్వాహకులు ముందుగానే స్థానిక పోలీసులకు తెలియజేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ప్రదేశాల్లో విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేయరాదని తెలిపారు. ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు 24 గంటలు అందుబాటులో ఉండడంతో పాటు, అవసరమైన సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నిమజ్జన కార్యక్రమాలను సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన భద్రతా, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. నిమజ్జన మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, అడ్డంకుల తొలగింపు, బ్యారికేడింగ్, లైటింగ్, పార్కింగ్, తాగునీరు వంటి ఏర్పాట్లతో పాటు అవసరమైన చోట సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు, గణేష్ మండప నిర్వాహకులు పోలీసులకు, ఇతర ప్రభుత్వ శాఖలకు పూర్తి సహకారం అందించి గణేష్ ఉత్సవాలను సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించాలని సీపీ కోరారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మాట్లాడుతూ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడు జోన్లకు చెందిన అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది సమావేశంలో పాల్గొని గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం జరిగే మార్గాలను ముందుగానే పరిశీలించి, ఆయా మార్గాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేసి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.
ప్రధానంగా రోడ్లపై గుంతల మరమ్మతులు, లైటింగ్, డ్రైనేజీ సిల్టింగ్, అవసరమైన చోట జనరేటర్ల ఏర్పాటు, ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు వంటి పనులను ప్రాధాన్యతగా చేపడతామని తెలిపారు. అలాగే, నిర్దేశిత ప్రాంతాల్లో తాత్కాలిక పారిశుద్ధ్య బృందాలను ఏర్పాటు చేసి పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని  తెలిపారు. సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ – ట్రాఫిక్ సన్‌ప్రీత్ సింగ్,  మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడతామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడతామని తెలిపారు. సంబంధిత శాఖలు ముందుగానే తమ ఏర్పాట్లను పూర్తి చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవాలను సజావుగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ఇంద్రేశం, ఇస్నాపూర్‌తో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో గత ఏడాది గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు.భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవ రెడ్డి మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు ఉత్సవాల నిర్వహణ కోసం ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. గతంలో ఎదురైన సమస్యలను పరిష్కరించి, ఈ ఏడాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గతంలో ఎదురైన సమస్యలు, అవసరమైన ఏర్పాట్లను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై శాఖల వారీగా సమన్వయం చేసుకుని, సకాలంలో చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు వారి శాఖ తరపున చేసే ఏర్పాటును వివరించారు, అలాగే ఉత్సవ కమిటీ వారు చెప్పిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో  సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, జాయింట్ సీపీ ట్రాఫిక్ సన్‌ప్రీత్ సింగ్, సీఎంసీ కమిషనర్ సృజన, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి సభ్యులు మహిపాల్ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి అధ్యక్షులు రాఘవ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి సెక్రటరీ శశిధర్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు రామరాజు, రమేష్, భాస్కర్, జీవన్ అదే విధంగా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి - సీపీ సజ్జనార్_

*హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి - సీపీ సజ్జనార్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 26:

సాంప్రదాయ జేబుదొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ అన్నారు.ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారే లక్ష్యంగా ఈ ముఠాలు వ్యవస్థీకృతంగా దోపిడీకి పాల్పడుతున్నట్లు మా దర్యాప్తులో వెల్లడైంది అని తెలిపారు.బస్టాండ్లు, రద్దీ బస్సుల్లో ప్రయాణికులు ఫోన్ అన్‌లాక్ చేసే సమయంలో పిన్/ప్యాటర్న్ నిశితంగా గమనించి ఫోన్లను చోరీ చేస్తున్నారు.ఒకవేళ లాక్ తెలియకపోతే.. బాధితులు కాల్ చేసినప్పుడు ‘మేము బస్సు కండక్టర్లం.. ఫోన్ ఇచ్చేస్తాం’ అంటూ లేదా ‘ఓనర్ వెరిఫికేషన్’ పేరిట మాయమాటలు చెప్పి స్క్రీన్ పాస్‌వర్డ్‌లు రాబడుతున్నారు.అనంతరం ఫోన్ గ్యాలరీ, నోట్స్ యాప్‌లలో దాచుకున్న డెబిట్ కార్డులు, ఆధార్/పాన్ వివరాలను సేకరిస్తున్నారు.దొంగిలించిన సిమ్ కార్డు ద్వారా వచ్చే ఓటీపీలతో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు రీసెట్ చేసి, నిధులను ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్, మ్యూల్ అకౌంట్లకు మళ్లించి డ్రా చేస్తున్నారు.ఈ తరహా నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
*ఈ తరహా నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.* 
ఫోన్ పోయినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఇచ్చేస్తామని చెప్పినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ స్క్రీన్ లాక్ పిన్, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దు.ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్‌బుక్, ఆధార్/పాన్ కార్డుల ఫోటోలను ఫోన్ గ్యాలరీలో, నోట్స్‌లో ఎప్పుడూ భద్రపరచుకోవద్దు. 
ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును, బ్యాంక్/యూపీఐ సేవలను తక్షణమే బ్లాక్ చేయించి, ceir.gov.in పోర్టల్‌లో ఫోన్‌ను బ్లాక్ చేయండి.సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి అని తెలిపారు.ముఖ్యంగా ఇంట్లోని పెద్దలకు ఈ మోసాల గురించి వివరించి అప్రమత్తం చేయండి అని అన్నారు.

పోలీసు స్టేషన్ న్యాయం జరిగే ప్రదేశంగా ఉండాలి..సెటిల్మెంట్లకు, బెదిరింపులకు కేంద్రంగా మారకూడదు_

*ప్రెస్ నోట్*

*తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి పిర్యాదు చేసినా స్పందించని పోలీస్ వ్యవస్థ*

*జూలై 12 దాడిపై చర్యలు తీసుకోకపోవడంతోనే 21న మళ్లీ దాడి?*

*చట్టాన్ని పక్కనపెట్టి నిందితులతో కుమ్మక్కైతే బాధితులకు రక్షణ ఎక్కడ?*

*వేముల శ్రీను - సామాజిక ఉద్యమకారుడు,రిపోర్టర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 26: 

నల్లగొండ జిల్లా శాలి గౌరారం మండలం ఊటుకూరు గ్రామంలో తనపై వరుసగా జరుగుతున్న దాడులు, బెదిరింపుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సామాజిక ఉద్యమకారుడు, రిపోర్టర్ వేముల శ్రీను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వేముల శ్రీను మాట్లాడుతూ..  జూలై 12న బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు తనపై దాడి చేసి తల పగలగొట్టారని, ఆ ఘటనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తన ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేసి, వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిందితులతో కుమ్మక్కయ్యారనే అనుమానం తనకు కలిగిందన్నారు."జూలై 12న జరిగిన దాడిపై పోలీసులు కఠినంగా స్పందించి ఉంటే, అదే వ్యక్తులకు చట్టం అంటే భయం ఉండేది. కానీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని అలుసుగా తీసుకొని, మళ్లీ ఆగస్టు 21న నాపై దాడి చేసి, చంపేందుకు ప్రయత్నించే స్థాయికి పరిస్థితి వెళ్లింది” అని వేముల శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకసారి దాడి జరిగి బాధితుడికి గాయాలైన తర్వాత కూడా రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే దుండగులకు మరింత ధైర్యం వచ్చిందని ఆయన అన్నారు. పోలీసుల నిర్లక్ష్యం నిందితులకు అండగా మారితే సామాన్య ప్రజలు తమ ప్రాణాలను ఎవరిని ఆశ్రయించి కాపాడుకోవాలి? అని ప్రశ్నించారు.అంతేకాకుండా ఆగస్టు 21న జరిగిన దాడిపై ఆగస్టు 22న శాలి గౌరారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, తన ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన పోలీసులు తనపైనే అక్రమంగా కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్టేషన్‌కు రావాలని ఎస్‌.ఐ. బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని తెలిపారు.
*“నాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. బాధితుడినైన నన్నే స్టేషన్‌కు పిలిచి బెదిరించడం ఏమిటి?*.
నిందితులకు చట్టం ఒకలా.. బాధితుడికి మరోలా ఉంటుందా?” అని వేముల శ్రీను ప్రశ్నించారు.భూ వివాదాన్ని అడ్డుపెట్టుకొని తనపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయని, తన కదలికలపై రెక్కీ నిర్వహించడం, వెంబడించడం వంటి చర్యలు కూడా చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని స్పష్టంగా చెబుతున్నప్పటికీ పోలీసులు తనకు రక్షణ కల్పించకుండా, తనపైనే ఒత్తిడి తీసుకురావడం తీవ్ర ఆందోళనకరమన్నారు.
*“పోలీసు స్టేషన్ న్యాయం జరిగే ప్రదేశంగా ఉండాలి..* సెటిల్మెంట్లకు, బెదిరింపులకు కేంద్రంగా మారకూడదు. బాధితుడిని రక్షించాల్సిన పోలీసులే బాధితుడిని భయపెడితే అది చట్టపాలన కాదు” అని వేముల శ్రీను ఘాటుగా వ్యాఖ్యానించారు.
జూలై 12న జరిగిన దాడి, ఆగస్టు 21న జరిగిన దాడి, తనకు వచ్చిన బెదిరింపులు, తనపై జరుగుతున్న ఒత్తిళ్లపై ఉన్నతాధికారులు స్వతంత్రంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసుల పాత్రపై కూడా విచారణ జరిపి, నిర్లక్ష్యం లేదా పక్షపాతం నిర్ధారణ అయితే బాధ్యులైన పోలీసు అధికారులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే తనపై జరిగిన దాడుల విషయంలో వర్తించే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, బాధితుడికి రక్షణ – నిందితులకు చట్టం అనే విధంగా పోలీసు వ్యవస్థ పనిచేయాలని వేముల శ్రీను డిమాండ్ చేశారు.
*“నా మీద ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా.. బెదిరింపులకు గురిచేసినా.. అన్యాయాన్ని ప్రశ్నించడం ఆపను*. 
నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే ఇప్పటివరకు జరిగిన ప్రతి దాడి, ప్రతి బెదిరింపు, పోలీసుల వ్యవహారశైలి అన్నింటినీ విచారణలోకి తీసుకురావాలి” అని ఆయన స్పష్టం చేశారు.

భారత యువతలో పెరుగుతున్న అసంతృప్తి — పాలనా సంక్షోభానికి సంకేతం_

*భారత యువతలో పెరుగుతున్న అసంతృప్తి — పాలనా సంక్షోభానికి సంకేతం*

*సీతారాం ధూళిపాళ - వ్యవస్థాపక చైర్మన్ ది సిటిజన్స్ కౌన్సిల్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 26:

దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు కేవలం విద్యా సమస్యలుగా కాకుండా విస్తృతమైన పాలనా మరియు రాజకీయ సంక్షోభంగా మారుతున్నాయి. పేపర్ లీకులు, పరీక్షల్లో అక్రమాలు, నిరుద్యోగం, నియామకాల్లో జాప్యం, పెరుగుతున్న విద్యా ఫీజులు, స్కాలర్‌షిప్‌లపై ఆందోళనలు, మౌలిక వసతుల లోపాలు—అన్నీ కలిసి ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఢిల్లీ నుంచి బీహార్, జార్ఖండ్, తెలంగాణ వరకు విద్యార్థులు, ఉద్యోగార్థులు ప్రతిభకు, పారదర్శకతకు, అందుబాటులో ఉన్న విద్యకు రక్షణ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. పదేపదే వెలువడుతున్న “పేపర్ లీక్” ఆరోపణలు పరీక్షా వ్యవస్థలోనే కాకుండా పాలనా వ్యవస్థపై కూడా అనుమానాలను పెంచుతున్నాయి.తెలంగాణలో జి .ఓ . నెంబర్ . 97, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ PPP విధానం వంటి అంశాలు మరో కీలక ప్రశ్నను లేవనెత్తుతున్నాయి—విద్యా సంస్కరణలు నిజంగా యువతకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయా? లేక విద్యా భారాన్ని క్రమంగా విద్యార్థులపై, ప్రైవేట్ రంగంపైకి మళ్లిస్తాయా?
*ఇది కేవలం విద్యార్థుల సమస్య కాదు*
నేటి విద్యార్థి రేపటి ఓటరు. విద్య, ఉద్యోగం, ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, నియామకాలు, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి అంశాలపై వారి ప్రత్యక్ష అనుభవమే వారి రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేస్తోంది.
*అసలు ప్రమాదం ఆందోళన కాదు — నమ్మకం కోల్పోవడం*
పరీక్షలు నిష్పక్షపాతంగా లేవని విద్యార్థులు భావిస్తే, విద్య తల్లిదండ్రులకు భారంగా మారితే, ఉద్యోగార్థులకు నియామకాలు అనిశ్చితంగా ఉంటే, శాంతియుత నిరసనలకు సంభాషణకు బదులు అణచివేత ఎదురైతే—ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం క్రమంగా క్షీణిస్తుంది.
*ప్రభుత్వాలు తక్షణమే చేయాల్సింది*

*(1)*: పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలపై జీరో టాలరెన్స్ విధానం.
*(2)*: స్వతంత్ర, పారదర్శక పరీక్షా పర్యవేక్షణ వ్యవస్థ.
*(3)*: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సమయపాలనతో కూడిన నియామక క్యాలెండర్.
*(4)*: పరీక్షల వైఫల్యాల వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయమైన పరిహారం.
*(5)*: అందుబాటు ధరలో ప్రభుత్వ విద్య, స్కాలర్‌షిప్‌లు, ఫీజు సహాయం కొనసాగింపు.
*(6)*: PPPలు, విద్యా విధానాల్లో మార్పులపై ప్రజా చర్చ, పారదర్శకత.
*(7)*: పాఠశాలలు, కళాశాలల మౌలిక వసతుల తక్షణ అభివృద్ధి.
*(8)*: విద్యార్థులు, యువతతో నిరంతర ప్రభుత్వ–యువత సంభాషణ వ్యవస్థ.
*(9)*: శాంతియుత నిరసనలను ప్రజాస్వామ్య పద్ధతిలో, సంయమనంతో నిర్వహించడం.

భారత యువత ప్రభుత్వాలను ఏదో ఉచితంగా ఇవ్వమని అడగడం లేదు.వారు కోరేది న్యాయమైన పరీక్షలు, అందుబాటులో ఉండే విద్య, ఉపాధి అవకాశాలు, పారదర్శకత మరియు జవాబుదారీతనం.ఈ అసంతృప్తిని సాధారణ విద్యార్థి ఆందోళనగా కొట్టిపారేయడం ప్రమాదకరం. ఇది రాబోయే పెద్ద రాజకీయ పరిణామాలకు ముందస్తు హెచ్చరిక.ప్రభుత్వాలు ఇప్పుడే వినాలి — ఇప్పుడే సంస్కరించాలి — యువత భవిష్యత్తును ఇప్పుడే భద్రపరచాలి.
*యువశక్తి — దేశశక్తి!*

Wednesday, August 26, 2026

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో గతంలో బీఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీ లు పట్టించుకోలేదు_

*ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో గతంలో బీఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీ లు పట్టించుకోలేదు*

*విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం..మంత్రి పొన్నం ప్రభాకర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 25:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి ఒక్కరోజు కూడా విద్యార్థుల సమస్యలపై పట్టించుకోలేదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించడంతో పాటు, భవిష్యత్‌లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చెల్లింపులు చేసే విధానాన్ని తీసుకొచ్చాం అని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, విద్యా మౌలిక వసతులు, డైనింగ్ చార్జీలు, ఉపాధ్యాయుల నియామకాలు తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది అని అన్నారు.పేద పిల్లల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తున్నాం.పాత బకాయిలను కూడా దశలవారీగా చెల్లిస్తూ , యాజమాన్యాలు విద్యార్థుల విద్యకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయంగా ఉనికిని చాటుకోవడం కోసమే కొందరు నేతలు ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాన్ని రాజకీయ విమర్శలకు ఉపయోగిస్తున్నారు అని అన్నారు.రాహుల్ గాంధీ పేరు ప్రస్తావిస్తూ విమర్శలు చేసే ముందు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇదే విధంగా ఉచిత విద్య లేదా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నారా మీరు అని మంత్రి ప్రశ్నించారు.తెలంగాణకు నిధులు, హక్కుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యతను విస్మరించి, అంతర్గత రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, పేద ప్రజల విద్యాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకుండా, విద్యా రంగ అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి పని చేయాలి అని అన్నారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం విద్యార్థి యువత కి వ్యతిరేకంగా పని చేయడం వల్లే జెన్జీ లాంటి ఉద్యమాలు వస్తున్నాయి అని అన్నారు.

ఇక మాటలు కాదు — అసలు రికార్డులు బయటపెట్టండి_

ప్రెస్ నోట్

*175 ఎకరాల అసైన్డ్ భూమికి 22-A ఎందుకు లేదు? ఎంపీలకు చట్టం వర్తించదా?*

*“22-A లిస్టులో 175 ఎకరాలు ఎందుకు గల్లంతు? సర్వే నెం.294పై అధికారిక రికార్డులే ప్రశ్నిస్తున్నాయా?”*

*సర్వే నెం.294లో 175 ఎకరాల 12 గుంటల అసైన్డ్ భూమి 22-A / ప్రోహిబిటెడ్ లిస్ట్ లో ఎందుకు లేదు?*

*తహసీల్దార్ కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో అసైన్డ్ భూమి అని స్పష్టంగా ఉన్నప్పటికీ NOCలు, రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి?*

*84 ఎకరాల రిజిస్ట్రేషన్లపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి*

*NOCలు జారీ చేసిన అధికారులపై చర్యలు ఎక్కడ?  సమగ్ర విచారణకు డిమాండ్ - వి. రవికృష్ణ,అడ్వకేట్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 25:

సిద్దిపేట జిల్లా, అక్బర్‌పేట్-భూంపల్లి మండలం, చౌదరపల్లి గ్రామం, సర్వే నెం.294కు సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వ రికార్డులు, కోర్టు రికార్డులు, రెవెన్యూ రికార్డులు మరియు అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని అడ్వకేట్ వి. రవికృష్ణ తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం తాజాగా అప్లోడ్ చేసిన ప్రోహిబిటెడ్ ప్రోహిబిటెడ్ / 22-A లిస్ట్ ను పరిశీలించినప్పుడు, సర్వే నెం.294కు సంబంధించిన మొత్తం భూమి అందులో ఎందుకు ప్రతిబింబించలేదనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అక్బర్‌పేట్-భూంపల్లి తహసీల్దార్ గారు  W.P.No.16161 of 2025లో కోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో సర్వే నెం.294కు సంబంధించి సుమారు Ac.175-12 guntas ప్రభుత్వ అసైన్డ్ భూమి అని, G.O.Ms.No.1406, dated 25.07.1958 ప్రకారం భూమిలేని పేదలకు ఈ భూమి అసైన్ చేయబడినట్లు పేర్కొన్న విషయాన్ని రికార్డులు చూపిస్తున్నాయని ఆయన తెలిపారు.అంతేకాకుండా, 1954-55 సెత్వార్ Sethwarలో ఈ భూమి పోరంబోకు /సర్కారి గా నమోదై ఉన్నట్లు కూడా సంబంధిత రికార్డులు సూచిస్తున్నాయని తెలిపారు.

**అయితే అసలు ప్రశ్న ఏమిటి?**

*(1)*: అంత స్పష్టమైన చారిత్రక మరియు ప్రభుత్వ రికార్డులు ఉన్నప్పుడు సర్వే No.294లోని మొత్తం అసైన్డ్ ల్యాండ్ ను తాజా 22-A / ప్రోహిబిటెడ్ లిస్ట్ లో ఎందుకు చూపించలేదు?

*(2)*: ఇది కేవలం ఒక రెవిన్యూ ఎంట్రీ సమస్య కాదని, ప్రభుత్వ భూమి, పేదలకు జరిగిన అసైన్మెంట్ , అసైన్డ్ ల్యాండ్ పై చట్టపరమైన రక్షణ, తదుపరి NOCలు, మ్యుటేషన్స్ , రిజిస్ట్రేషన్స్ మరియు రెవిన్యూ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతకు సంబంధించిన తీవ్రమైన అంశమని ఆయన పేర్కొన్నారు.

*(3)*: 84 ఎకరాల విషయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమాధానం చెప్పాలి.

*(4)*:ప్రస్తుతం మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి సిట్టింగ్ BJP ఎంపీగా ఉన్న మాధవనేని రఘునందన్ రావుపై ఈ వ్యవహారంలో సుమారు 84 ఎకరాల భూమి ఆయన కుటుంబ సభ్యుల పేర్లకు రిజిస్టర్ అయినట్లు ఉన్న రికార్డులు/ఫిర్యాదుల నేపథ్యంలో ప్రజలలో తలెత్తుతున్న ప్రశ్నలకు ఆయన స్వయంగా సమాధానం ఇవ్వాలని రవికృష్ణ డిమాండ్ చేశారు. అధికారిక పార్లమెంట్ రికార్డుల్లో ఆయన మెదక్ ఎంపీగా కొనసాగుతున్నట్లు నమోదై ఉంది. 

*(5)*: అసైన్డ్ భూమి బదిలీకి చట్టపరమైన నిషేధం ఉన్న పరిస్థితిలో — సుమారు 84 ఎకరాల భూమి మీ కుటుంబ సభ్యుల పేర్లకు ఎలా రిజిస్టర్ అయింది?

*(6)*: ఆ భూములకు NOCలు ఎవరు ఇచ్చారు?

*(7)*: ఏ చట్టం కింద ఇచ్చారు?

*(8)*: ఏ ప్రొసీడింగ్స్ ఆధారంగా ఇచ్చారు?

*(9)*: ఏ రెవిన్యూ రికార్డ్స్ పరిశీలించిన తరువాత ఆ NOCలు జారీ అయ్యాయి?

*(10)*: సర్వే నెంబర్ .294లోని భూమి అసైన్డ్ ల్యాండ్ అని రెవిన్యూ డిపార్ట్మెంట్ కు తెలిసిన పరిస్థితిలో ఆ ట్రాన్సక్షన్స్ ఎలా జరిగాయి?

*(11)*: ఏదైనా డి అసైన్మెంట్ , రీ క్లారిఫికేషన్ , ఎక్సంప్షన్ , రెగ్యులరైసేషన్ లేదా ఇతర చట్టబద్ధమైన ఉత్తర్వు ఉంటే దాన్ని ప్రజల ముందు ఎందుకు ఉంచడం లేదు?

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఎంపీగా ఆయనపై చట్టపరమైన నిందను మోపడం కాదు; ప్రజా జీవితంలో ఉన్న ఎన్నికైన ప్రజాప్రతినిధిగా తన కుటుంబ సభ్యుల పేర్లకు సంబంధించిన ఇంత పెద్ద భూ లావాదేవీలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన ప్రజా బాధ్యతకు సంబంధించిన ప్రశ్న అని రవికృష్ణ పేర్కొన్నారు.
**ఎంపీ పదవికి ప్రజా బాధ్యత కూడా ఉంది**
ఒక ఎంపీగా పార్లమెంటులో ప్రజా సమస్యలను ప్రస్తావించే వ్యక్తి, తన నియోజకవర్గంలోనే పేద రైతులకు కేటాయించిన భూములకు సంబంధించి ఇలాంటి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటిపై పూర్తి పారదర్శకతతో స్పందించడం ప్రజాస్వామ్య బాధ్యత అని రవికృష్ణ అన్నారు.పేద రైతుల అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరే ప్రజాప్రతినిధి — తన కుటుంబ సభ్యుల పేర్లకు సంబంధించిన ఇలాంటి భూ లావాదేవీలపై కూడా అదే చట్టపరమైన ప్రమాణాలను ప్రజల ముందు చూపించాలి.అందువల్ల ఎంపీ రఘునందన్ రావును తాము నేరుగా ప్రశ్నిస్తున్నామని ఆయన తెలిపారు:

*“మీ కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైనట్లు ఉన్న సుమారు 84 ఎకరాల సర్వే నెంబర్ .294 భూమి అసైన్డ్ భూమి కాదని మీరు భావిస్తే, దానికి సంబంధించిన పూర్తి టైటిల్ చైన్ , NOCలు, ప్రొసీడింగ్స్ మరియు రెవిన్యూ రికార్డ్స్ ను ప్రజల ముందు పెట్టండి.”*
“అది అసైన్డ్ ల్యాండ్ కాదని చెప్పడానికి ఏ ప్రభుత్వ ఉత్తర్వు ఆధారం?”. “అసైన్డ్ ల్యాండ్ అయితే, ఆ భూమి మీ కుటుంబ సభ్యుల పేర్లకు ఎలా వచ్చింది?”.“NOCలు చట్టబద్ధంగా జారీ అయ్యాయని మీరు భావిస్తే — ఏ అధికారి, ఏ తేదీన, ఏ చట్టం కింద వాటిని జారీ చేశారో వెల్లడించండి.”
“ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర విచారణకు మీరు సిద్ధమా?”

*రెవిన్యూ అధికారులు కూడా సమాధానం చెప్పాలి*

*(1)*: సర్వే నెం.294కు సంబంధించి:

*(2)*: సెత్వర్ రికార్డ్స్ ఉన్నాయి;

*(3)*: అసైన్మెంట్ రికార్డ్స్ ఉన్నాయి;

*(4)*: 22-A రికార్డ్స్ ఉన్నాయి;

*(5)*: మ్యుటేషన్ రికార్డ్స్ ఉన్నాయి;

*(6)*: NOC ప్రొసీడింగ్స్ ఉన్నాయి;

*(7)*: రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ఉన్నాయి;

*(8)*: కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి;

*(9)*: రెవిన్యూ డిపార్ట్మెంట్ తరఫున దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ఉంది.

మరి ఇన్ని రికార్డులు ఉన్నప్పటికీ 175 ఎకరాల 12 గుంటల అసైన్డ్ ల్యాండ్ విషయంలో పూర్తి స్థాయి చర్య ఎందుకు లేదు?
22-A / ప్రోహిబిటెడ్ లిస్ట్ లో మొత్తం భూమిని ఎందుకు రక్షించలేదు?
తప్పుడు లేదా అసంపూర్ణ నివేదికను ఎవరు తయారు చేశారు?
ఎవరి ఆదేశాల మేరకు తయారు చేశారు?
ఆ నివేదికపై బాధ్యత వహించాల్సిన అధికారులపై ఏ చర్య తీసుకున్నారు?
NOCలు జారీ చేసిన అధికారులపై డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ జరిగిందా?
జరిగితే దాని ఫలితం ఏమిటి?
జరగకపోతే ఎందుకు జరగలేదు?
మిగిలిన అసైన్డ్ ల్యాండ్ సంగతేంటి?
సర్వే నెం.294లో మిగిలిన అసైన్డ్ ల్యాండ్ కూడా రైతుల నుంచి ఇతర వ్యక్తుల పేర్లకు కొనుగోలు/బదిలీ చేయబడినట్లు ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో, ఆ ట్రాన్సక్షన్స్ పైనా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.మొత్తం భూమి అసైన్డ్ ల్యాండ్ అని రెవిన్యూ డిపార్ట్మెంట్ కోర్టులో పేర్కొన్న పరిస్థితిలో, అదే భూమిలో కొంత భాగం మాత్రమే ప్రోహిబిటెడ్ లిస్ట్ లో లేకపోవడానికి కారణం ఏమిటి?
ఎవరు ఈ భూమిని ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్ గా పరిగణించారు?
ఏ అధికారిక ప్రొసీడింగ్స్ ఆధారంగా పరిగణించారు?
ఎవరి ఆదేశాల మేరకు?
*“పేద రైతుకు ఒక చట్టం – ప్రభావశీలులకు మరో చట్టమా?”*
పేద రైతు అసైన్డ్ ల్యాండ్ ను బదిలీ చేస్తే వెంటనే చట్టం గుర్తుకు వస్తుందని, అదే సమయంలో పెద్ద మొత్తంలో భూములు ప్రభావశీలుల కుటుంబ సభ్యుల పేర్లకు వెళ్లినట్లు రికార్డులు మరియు ఫిర్యాదులు ఉన్నప్పుడు చట్టం ఎందుకు కనిపించడం లేదని రవికృష్ణ ప్రశ్నించారు.చట్టం పేద రైతులకు ఒకటి, ఎంపీలు–ఎమ్మెల్యేలకు మరొకటా?
అధికారం, డబ్బు ఉంటే చట్టాలను పక్కన పెట్టవచ్చా?
ముఖం చూసి బొట్టు పెట్టడమేనా పరిపాలన?
చట్టాలు కొందరికి చుట్టాలుగా, కొందరికి శత్రువులుగా మారిపోయాయా?
*ప్రజలకు సమాధానం కావాలి*.

*ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు*

*(1)*:సర్వే నెంబర్ .294లోని మొత్తం Ac.175-12 guntas భూమి యొక్క అసలు లీగల్ స్టేటస్ ను తక్షణమే నిర్ధారించాలి.

*(2)*:అసైన్డ్ ల్యాండ్ గా తేలిన మొత్తం భూమిని చట్టప్రకారం ప్రభుత్వం రక్షణలోకి తీసుకోవాలి.

*(3)*:చట్టవిరుద్ధంగా జారీ చేసిన NOCలు ఉంటే వాటిని చట్టప్రకారం రద్దు చేయాలి.

*(4)*:చట్టవిరుద్ధమైన మ్యుటేషన్స్ , రిజిస్ట్రేషన్స్ మరియు సబ్సిక్వెంట్ ఎంట్రీస్ పై సమగ్ర విచారణ జరపాలి.

*(5)*:చట్టవిరుద్ధ బదిలీలు నిర్ధారణ అయితే చట్టప్రకారం రిసంప్షన్ మరియు రిస్టోరేషన్ చర్యలు చేపట్టాలి.

*(6)*:NOCలు జారీ చేసిన అధికారులు, మ్యుటేషన్స్ చేసిన అధికారులు, రిజిస్ట్రేషన్స్ కు సహకరించిన అధికారులు మరియు సంబంధిత మధ్యవర్తుల పాత్రపై స్వతంత్ర విచారణ జరపాలి.

*(7)*: అవినీతి, కుట్ర లేదా అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలు లభిస్తే ACB/సంబంధిత దర్యాప్తు సంస్థల ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరపాలి.

*(8)*:బాధ్యులపై డిపార్ట్మెంటల్ మరియు క్రిమినల్ ప్రొసీడింగ్స్ చట్టప్రకారం ప్రారంభించాలి.

*(9)*:ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ/విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను ప్రజల ముందుంచాలి.

*(19)*: సర్వే నెంబర్ .294కు సంబంధించిన అన్ని ఒరిజినల్ రెవిన్యూ రికార్డ్స్ , అసైన్మెంట్ రికార్డ్స్ , సెత్వర్ , సప్లీమెంటరీ సెత్వర్ , 1-B, పహాణి , మ్యుటేషన్ ఫైల్స్ , NOC ఫైల్స్ , 22-A రికార్డ్స్ , రిజిస్ట్రేషన్ రికార్డ్స్ మరియు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ను భద్రపరచాలి.

*(11)*:తదుపరి సేల్ , ట్రాన్స్ఫర్ , మ్యుటేషన్ , రిజిస్ట్రేషన్ లేదా కన్స్ట్రక్షన్ ద్వారా థర్డ్ పార్టీ రైట్స్ సృష్టించకుండా తగిన చట్టపరమైన రక్షణ చర్యలు తీసుకోవాలి.

*(12)*: చట్టవిరుద్ధ బదిలీలు నిర్ధారణ అయితే భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, చట్టప్రకారం అర్హులైన పేద రైతులకు పునరుద్ధరించాలి.

*“ఇక మాటలు కాదు — రికార్డులు బయటపెట్టండి”*

*ఈ వ్యవహారం వ్యక్తిగత రాజకీయ కక్ష కాదని రవికృష్ణ స్పష్టం చేశారు.*

ఇది:ప్రభుత్వ భూమి – అసైన్డ్ ల్యాండ్ – పేద రైతుల హక్కులు – రెవిన్యూ అడ్మినిస్ట్రేషన్ లో జవాబుదారీతనం – చట్టపాలన – ప్రజాప్రతినిధుల ప్రజా బాధ్యతకు సంబంధించిన అంశమని తెలిపారు.అందువల్ల మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, సంబంధిత జిల్లా అధికారులు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి రికార్డులతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
*ఎవరు NOC ఇచ్చారు?*

*ఎవరు మ్యుటేషన్ చేశారు?*

*ఎవరు రిజిస్ట్రేషన్ కు మార్గం సుగమం చేశారు?*

*ఎవరి ఆదేశాలతో?*

*ఏ చట్టం కింద?*

*ఏ ప్రొసీడింగ్స్ ఆధారంగా?*

175 ఎకరాల 12 గుంటల అసైన్డ్ ల్యాండ్ విషయంలో ఇప్పటివరకు ఎవరి మీద ఏ చర్య తీసుకున్నారు?
84 ఎకరాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యుల పేర్లకు భూమి ఎలా వచ్చింది?
ఆ భూమికి NOC ఎవరు ఇచ్చారు?
అది అసైన్డ్ ల్యాండ్ కాకపోతే దానికి సంబంధించిన పూర్తి ప్రభుత్వ ఉత్తర్వులు ఎక్కడ ఉన్నాయి?
*చివరి డిమాండ్*
ప్రభుత్వం నిజంగా పేద రైతుల పక్షాన ఉంటే — సర్వే నెంబర్ .294లోని మొత్తం Ac.175-12 guntas భూమిపై తక్షణమే చట్టబద్ధమైన చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూమిని రక్షించి, చట్టవిరుద్ధ బదిలీలు ఉంటే వాటిని రద్దు చేసి, అర్హులైన పేద రైతులకు న్యాయం చేయాలి.
*ప్రజలకు సమాధానం కావాలి.*

*ఇక మాటలు కాదు — అసలు రికార్డులు బయటపెట్టండి.*