Friday, August 27, 2021

రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు ఐదు ఆప్షన్లు

హైదరాబాద్ : 28/08/2021

రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు ఐదు ఆప్షన్లు

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు ఐదు ఆప్షన్లు
  • నూతన జోనల్‌ విధానం ప్రకారం ట్రాన్స్‌ఫర్స్‌
  • సెప్టెంబర్‌లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి
  • వీఆర్‌ఏల పే స్కేల్‌ను త్వరలో నిర్ణయిస్తాం
  • ట్రెసా ప్రతినిధులకు సీఎస్‌ సోమేశ్‌ హామీ

హైదరాబాద్‌, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్‌లో పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసి నూతన జోనల్‌ విధానం ప్రకారం బదిలీలు చేపడుతామని ట్రెసా ప్రతినిధులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ హామీఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఐదు ఆప్షన్లు ఇస్తామని చెప్పారు. అన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తయినా రెవెన్యూశాఖలో వివిధ క్యాడర్ల పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇతర సమస్యలను సైతం పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ప్రతినిధి బృందం శుక్రవారం బీఆర్కే భవన్‌లో సీఎస్‌ సోమశ్‌కుమార్‌ను కలిసింది. గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం సీఎస్‌తో సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నూతన జోనల్‌ విధానాన్ని అనుసరించి రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు ఐదు ఆప్షన్లు ఇస్తామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు. వీఆర్వోలను సర్దుబాటుచేస్తామని సీఎస్‌ చెప్పారని పేర్కొన్నారు. వీఆర్‌ఏల పేస్కేల్‌ త్వరలో పరిష్కారం అవుతుందని తెలిపారని వెల్లడించారు. సీఎస్‌ను కలిసినవారిలో ట్రెసా అసోసియేట్‌ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్‌, నేతలు కే రామకృష్ణ, బాణాల రాంరెడ్డి, మాధవి, రమన్‌రెడ్డి ఉన్నారు.

No comments:

Post a Comment