తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో
కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఝలక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల విచారణ ఖర్చులకు రూ.58 కోట్ల కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 208పై తమ వైఖరిని తేల్చి చెప్పింది.
భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమే ఆ జీవో జారీ చేశామని హైకోర్టుకు మరోసారి వివరించిన ఏజీ.. నిధులు విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. నిధుల విడుదలను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే అందుకు హైకోర్టు అంగీకరించలేదు.
జీవో 208 తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రభుత్వానికి స్పష్టం చేసింది హైకోర్టు. భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమే ఆ రూ. 58 కోట్లు విడుదల చేస్తున్నట్టు జీవోలో ప్రస్తావించాల్సిందేనని తేల్చి చెప్పింది. అలాగే సవరించిన జీవోను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 13కువాయిదా వేసింది.
No comments:
Post a Comment