Tuesday, February 28, 2023

సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణకు ఆదేశించిన.... మంత్రి సబిత....!

*సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణకు ఆదేశించిన.... మంత్రి సబిత....!*

హైదరాబాద్: నగరంలోని నార్సింగి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆరా తీశారు.విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవాలని, పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించాలని స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా విచారణ నివేదిక అందించాలని ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌  కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్య.....!

*కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్య.....!*

హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్.సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 10:30 సమయంలో తన క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెప్తున్నారు. దారుణమైన విషయం ఏమిటంటే.. సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలిసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదు. కనీసం ఆసుపత్రికి కూడా తరలించలేదు. తోటి విద్యార్థులే.. ఓ వెహికల్‌ని లిఫ్ట్ అడిగి, సాత్విక్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సాత్విక్ మృతిచెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

పార్టీ సస్పెన్షన్ ఎత్తివేయకపొతే ఎన్నికల్లో పోటీకి దూరం.... MLA రాజా సింగ్.....!

*పార్టీ సస్పెన్షన్ ఎత్తివేయకపొతే ఎన్నికల్లో పోటీకి దూరం.... MLA రాజా సింగ్.....!*

*హైదరాబాద్.....!*
: తనపై విధించిన సస్పెన్షన్‌ను భాజపా అధిష్ఠానం తొలగిస్తుందన్న నమ్మకం ఉందని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు.సస్పెన్షన్‌ ఎత్తివేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశం లేదని తెలిపారు. మంగళవారం ఆయన పలు వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు తాను పెద్ద అభిమానినని, పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా అగ్రనేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ సహా అందరి ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, February 27, 2023

అశ్రునయనాల మధ్య ప్రీతికీ కన్నీటి వీడ్కోలు

*అశ్రునయనాల మధ్య ప్రీతికీ కన్నీటి వీడ్కోలు*

జనగామ: మెడికో ప్రీతి  అంత్యక్రియలు  స్వగ్రామంలో ముగిశాయి. అశృనయనాల మధ్య ప్రీతికి కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీలు, ప్రజాసంఘాల నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు.ప్రీతి మృతితో గిర్నితండా కన్నీటి సంద్రంగా మారింది. కాగా... ప్రీతి అంత్యక్రియల్లో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. విపక్ష నేతలను అంత్యక్రియల్లో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రీతి అంత్యక్రియల్లో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆపై గొడవ సర్దుమణిగింది. మందకృష్ణ మాదిగ బీఆర్‌ఎస్  బీజేపీ నేతలు  పాడె పట్టారు. ప్రీతి అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

D. శ్రీనివాస్ కు తీవ్ర స్వస్థత....!

*D. శ్రీనివాస్ కు  తీవ్ర స్వస్థత....!*

హైదరాబాద్ : పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.డీఎస్‌కు ఫిట్స్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు.

తన తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని.. ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని కాబట్టి రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని ట్విటర్ వేదికగా తన కార్యకర్తలకు తెలిపారు. నేడు రేపు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. ''మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు'' అని అరవింద్ తన ట్వీట్‌లో తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, February 26, 2023

మన్నించు తల్లీ..😔

*మన్నించు తల్లీ..*
*'సమాజంలో భాగమైన' ఈ వేదింపులకు బలయిన ప్రీతి కన్నుమూత*
*దారుణ ఘటన పై స్పందించాలో వద్దో అనే సందిగ్ధంలో సమాజము వుండిపోయింది.* 
*(కులం,మతం,జాతి,వర్గం,రాజకీయాలు,...)*
*బాధితురాలి కోసం సమాజం నామమాత్ర స్పందన, కానీ వేదింపులు గురిచేసిన వాడికి దొరికిన కొద్దిపాటి మద్దతు!!*
*Shame!!*

😔
తల్లీ నిన్ను మానసికంగా చంపేసిన ఈ వ్యవస్థలో వున్నందుకు సిగ్గుపడుతున్నాను.

మేధావులు అనుకునే వెధవల్లారా ఇప్పుడైనా స్పందించండి

ఓం శాంతి సద్గతి 🙏

Bplkm🪶

వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.... ఈటల రాజేందర్.....!

*వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.... ఈటల రాజేందర్.....!*

హైదరాబాద్‌: వరంగల్‌ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్  డిమాండ్‌ చేశారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లిన ఈటల.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో నిగూఢంగా ఇంకా ర్యాగింగ్‌ కొనసాగుతోంది. మెడికల్‌ కాలేజీల్లో పీజీ చదివే అమ్మాయిల మీద సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారని ప్రీతి ఘటనతో స్పష్టమైంది. ఇలాంటి ఘటనలు వెలుగుచూసినప్పుడు హెచ్‌వోడీలే చర్యలు తీసుకోవాలి. ప్రీతి విషయంలో సకాలంలో హెచ్‌వోడీ స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకునేదికాదు. చివరకు ప్రిన్సిపల్‌ దగ్గరికి వెళ్లి ఆమె గోడు వెళ్లబోసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ ఘటనపై ప్రీతి తండ్రి పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ అన్నీ వ్యవస్థలు విఫలమయ్యాయని అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని ఈటల డిమాండ్‌ చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని.. వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందిస్తున్నామని నిమ్స్‌ వైద్యులు తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️

తెలంగాణలో టీడీపీ ని ప్రతిఒక్కరు గుండెల్లో.... పెట్టుకున్నారు.... చంద్రబాబు....!

*తెలంగాణలో టీడీపీ ని ప్రతిఒక్కరు గుండెల్లో.... పెట్టుకున్నారు.... చంద్రబాబు....!*

హైదరాబాద్: ఎన్టీఆర్ భవన్‌ కు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఇవాళ్టి నుంచి తెలంగాణ లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం 'ఇంటింటికీ తెలుగుదేశం' కిట్లను చంద్రబాబు పంపిణీ చేశారు.సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ''41 ఏళ్లుగా తెలుగువారి కోసమే పనిచేస్తోన్న పార్టీ టీడీపీ. తెలంగాణలో ప్రతిఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారు. తెలంగాణ గడ్డపైనే ఎన్టీఆర్‌ టీడీపీని ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారు. యువత, మహిళలకు టీడీపీ మాత్రమే పెద్దపీట వేసింది. సమిష్టిగా కృషిచేసి టి.టీడీపీకి పూర్వవైభవం తేవాలి. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టీడీపీ. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ను ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదే. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో మౌళిక వసతులు సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత టీడీపీదే. కాసాని జ్ఞానేశ్వర్‌(Kasani Gnaneshwar) నేతృత్వంలో పార్టీ బలోపేతం'' అవుతోందని చంద్రబాబు అన్నారు.

''సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం,..అభివృద్ధి చేయడమే టీడీపీ ధ్యేయం. సంపద సృష్టించడమెంత ముఖ్యమో, పేదలకు అందించడం అంతే ముఖ్యం. టీడీపీ ఎక్కడ ఉంది అనేవారికి ఖమ్మం సభే సమాధానం. ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడ ఉందో కనిపిస్తోంది. తెలుగువారు ఎక్కడున్నా వారికోసం టీడీపీ పనిచేస్తుంది. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుంది. కాసాని నేతృత్వంలో టి.టీడీపీ పరుగులు పెడుతోంది. తెలంగాణలో మొదటి సీటు నాయిబ్రాహ్మణులకు..రెండో సీటు రజకులకు ఇస్తాం. టి.టీడీపీకి యువత అండగా ఉండాలి. విభజన తర్వాత లేనిపోని సమస్యలు పెట్టుకోవటం సరికాదు. తెలంగాణలో సంపద సృష్టించడానికి కారణం టీడీపీనే..పేదలను నాయకులుగా ప్రమోట్ చేసిన పార్టీ టీడీపీ మాత్రమే. ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే పార్టీ గౌరవిస్తోంది. ఎన్టీఆర్‌ భవన్ చుట్టూ కాకుండా.. నేతలు గ్రామాల్లో తిరగాలి టీడీపీని కాపాడుకోవడం చారిత్రక'' అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, February 25, 2023

తెలంగాణలో రేపటి నుండి ఇంటింటికి.... తెలుగుదేశం..... కాసాని జ్ఞానేశ్వర్

*తెలంగాణలో రేపటి నుండి ఇంటింటికి.... తెలుగుదేశం..... కాసాని జ్ఞానేశ్వర్*

హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పూర్వవైభవం దిశగా అడుగులు పడుతున్న వేళ యువత, మహిళలు, విద్యావంతులకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు.రాష్ట్రంలో రేపట్నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మొదలవుతుందని ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రకటించారు. హైదరాబాద్ ఎస్ఆర్‌నగర్‌లోని తన నివాసంలో మీడియాతో కాసాని చిట్‌చాట్ నిర్వహించారు.

రాష్ట్రంలో పది రోజులపాటు మండలం యూనిట్‌గా ప్రతి బూత్ స్థాయిలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమం ఉంటుందని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో డివిజన్ల వారీగా కొనసాగుతుందని చెప్పారు. అదే ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకుంటూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపడతామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్లలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో భాగంగా నాడు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కిలో రూ.2 బియ్యం పథకం, పట్వారీ, పటేల్ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తి హక్కు, బీసీ వర్గాలకు పెద్దపీట వంటి అంశాలు వివరించడంతోపాటు తెదేపా పూర్వ వైభవం కోసం సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. పది రోజుల తర్వాత మరో 20 రోజులపాటు ప్రతి మండలంలో అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపడతామని తెలిపారు. తెదేపా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మార్చి 27వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 'సింహగర్జన' పేరిట లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని... ఆ సభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరవుతారని కాసాని వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేగంగా పాలమూరు - రంగారెడ్డి.... MP రంజిత్ రెడ్డి....!

*సీఎం కేసీఆర్ నాయకత్వంలో  వేగంగా పాలమూరు - రంగారెడ్డి.... MP రంజిత్ రెడ్డి....!*

సీఎం కేసీఆర్‌ (CM KCR) నాయకత్వంలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తవుతాయని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి  అన్నారు.ఎత్తిపోతల పథకం పనులు ఎలా జరుగుతున్న తీరును శనివారం నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రాజెక్టు పనుల్లో మొదటి భాగమైన శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ప్రాంతమైన నాగర్‌ కర్నూల్‌లోని అంజనగిరి రిజర్వాయర్ మొదలుకొని ఉద్దండపూర్ రిజర్వాయర్ వరకు జరుగుతున్న కెనాల్, టన్నెల్, సర్జ్‌పూల్, పంపుహౌస్ పనులను అక్కడి పనిచేస్తున్న ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేక వాహనాల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల ప్రాజెక్టు సందర్శనకు తీసుకుకెళ్లే ఏర్పాట్లను చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రకటించారు

*సుజీవన్ వావిలాల🖋️* 

Friday, February 24, 2023

కేసులుంటే స్వీపర్ కాలేరు కానీ మంత్రలు కావొచ్చు.... సుప్రీం కోర్ట్

*కేసులుంటే స్వీపర్ కాలేరు కానీ మంత్రలు కావొచ్చు.... సుప్రీం కోర్ట్*

*నేరాభియోగాలున్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి*
*సుప్రీంకోర్టులో పిటిషన్‌*
*కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు*


దిల్లీ: అవినీతికి సామాన్య మానవుడు బలవుతున్నాడని, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అవినీతిని రూపుమాపాలంటే అన్నిస్థాయుల్లో జవాబుదారీతనాన్ని తేవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. క్రిమినల్‌ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) విచారణ సందర్భంగా జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్న ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

పిల్‌ను దాఖలు చేసిన న్యాయవాది అశ్విన్‌ ఉపాధ్యాయ్‌ తన వాదనలు వినిపిస్తూ.. ''వేధింపులు, హత్య, అపహరణ లాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తి.. ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్‌ లేదా పోలీస్‌ కానిస్టేబుల్‌ కూడా కాలేడు. కానీ అవే నేరాలు చేసిన వ్యక్తి మాత్రం మంత్రి కావొచ్చు'' అని పేర్కొన్నారు. ఈ పిల్‌పై స్పందన తెలపాల్సిందిగా కేంద్రం, ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది

*సుజీవన్ వావిలాల*🖋️

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!

*యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!*

హైదరాబాద్: రోడ్డుపై కుప్పకూలి పడిపోయిన ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్ రాజశేఖర్‌ కు అభినందనలు వెల్లువెత్తున్నాయి.యువకుడిని కానిస్టేబుల్‌ రక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శభాష్.. రాజశేఖర్ అంటూ నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఇటు కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందలు తెలియజేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అభినందించి రివార్డు అందజేశారు. రాజశేఖర్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్  శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసనాయుడు రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి  అభినందించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలపై రాజశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, February 22, 2023

శంషాబాద్ లో భారీగా బంగారం పట్టివేత...!

*శంషాబాద్ లో భారీగా బంగారం పట్టివేత...!*

శంషాబాద్‌: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.సూడాన్‌ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ. 7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి మిగతా వారిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మధ్యకాలంలో సీజ్‌ చేసిన బంగారంలో ఇదే అత్యధికమని హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

జర్నలిస్ట్ - ఓ జర్నలిస్ట్ మిత్రమా ఇది నీకే

*జర్నలిస్ట్ - ఓ జర్నలిస్ట్ మిత్రమా ఇది నీకే*

*వార్త అంటే నిజాలను, దోపిడీ దారులనుండి, దొంగల నుండి ఈ దేశాన్ని, ప్రజలను ఎలా కాపాడుకోవాలో, ఈ కీచక రాజకీయనాకుల చేతుల్లో సమాజం, ప్రజలు ఎలా నలిగిపోతున్నారో, ప్రపంచమంలో జరిగిన సంగతులను చూపిస్తూ, వాటి వల్ల మనపై ప్రభావం ఎలా ఉంటుందో, అలాగే వాస్తవాలను విశ్లేషించి చెప్పడమే వార్త*

*కొందరి మెప్పు కోసమో,అండకోసమో,అవసరాల కోసమో మీ రాతను,మీ జీవితాన్ని, రేపటి తరాల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు*

*నిజానిజాలను నిర్భయంగ ప్రజల ముందు అందించే నివేదికనే వార్త*

*అన్యాయాలను, అక్రమాలను ఎదిరిస్తూ సత్యఅసత్యాలను ఎప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళను జాగరుకులను చేసే వ్యవస్థే వార్త*

*సమాజాన్ని సరియైన పంథాలో, అభివృద్ధిలో నడపడంలో ముఖ్యమయిన దిక్సుచియే ఈ వార్త*

*సమాజ నాల్గవ మూల స్థంభంగా సమాజ మార్పు కోసం,ప్రజల చైతన్యం కోసం,రేపటి తరాల భవిష్యత్తు కోసం,ఉన్నతవిలువలతో ఉన్నతశిఖరాలలో,నిలిచే అత్యున్నత వ్యవస్థయే వార్త*

*ఔను అదే వార్త....అలా చేయడమే వార్త*

*Q గ్రూప్ మీడియా*



ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్.... కేంద్రం.....!

*ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్.... కేంద్రం.....!*

ఢిల్లీ: విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్‌ తీసుకురానుంది. విద్యార్థుల వయసు ఆరు ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్‌ ఉండాలని నిర్ణయించింది.
ఈ మేరకు.. ఈ నిబంధనను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది.

కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది, ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య(నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి.

పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని గత ఏడాది సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది.

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, February 19, 2023

జర్నలిస్టు డైరీ....**ప్రతిపక్షాలారా.. మీకు ప్రశ్నించే దమ్ము ఉందా..?*

*Q న్యూస్ (QGroup Media)*

*జర్నలిస్టు డైరీ....*
*ప్రతిపక్షాలారా.. మీకు ప్రశ్నించే దమ్ము ఉందా..?*
------------------------------------
కేంద్ర, రాష్ట్ర పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులకు ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉందాని ప్రజలు సవాల్ విసురుతున్నారు. మన దేశం 75ఏళ్ల స్వతంత్ర మైలురాయి దాటుతున్న ఇంకా దేశంలో అనేక మంది ప్రజలు వలస జీవులుగా, యాచాకులుగా మరికొందరు రెక్కాడితే డొక్కాడని జీవులు జీవన పోరాటం చేయాల్సిన దుస్థితి ఎందుకు మిగిలిందనీ పాలకులను ఏనాడైనా ఈ ప్రతిపక్షాలు నిలదీశాయా...! లేదే..? ఎకరం భూమి లేనివాళ్లు వేల ఎకరాలు ఎలా వచ్చాయని, రబ్బర్ చెప్పులే గతిలేనివారు కోట్లకు ఎలాపడగాలేత్తారని, అప్పులు చేసి కొప్పులు పెడుతున్నారని, ఇలా నోటికీ తలుపు తాళం లేకుండా విమర్శలు ఆరోపణలు రాజకీయ నాయకులు చేసుకుంటున్న తీరును ప్రజలు గురివిందా గింజ తనకున్న నలుపు ఎరగదనట్టు ఉన్నాయని ప్రజలు హేళన చేస్తున్నారు.
----------------------------------
*సమస్యల సాధనకా మీ పోరాటం.. ఆరాటం..*
----------------------------------=
ప్రజా సమస్యల సాధనపై మీ పోరాటం ఆరాటమైతే ప్రతిపక్ష నాయకులారా మీరు పోరాటం చేయాల్సినది, ప్రధాని క్యాంప్ ఆఫీస్, పార్లమెంట్ ముందు, రాష్ట్రాలలో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్, శాసనసభల ముందు చేయాలి ఎందుకు చేయడం లేదో... ప్రజలకు చెప్పాలి. కేవలం మీరు చేస్తున్న ఆరోపణలు నిందా ఆరోపణలే అని ప్రజలు భావించడమే కాక. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా గొచరిస్తున్నాయని ప్రజలు ఎద్దెవా చేస్తున్నారు.
-------------------------------------
*సుద్దపూసలమే కానీ... దగ్గరకు రానియ్యం..?*
-------------------------------------
ఏ రాజకీయ నాయకులు సుద్దపూసలమే కానీ దగ్గరకు రానియ్యం అనే ధోరణిలో ఉన్నారని ప్రజలు బల్లగుద్ది వాదిస్తున్నారు. అధికారంలో ఉంటే ఓ తీరు, ప్రతిపక్షంలో ఉంటే మరో తీరు ఉన్నట్లుగా ఈ ఇరువర్గ నాయకులు నటనలతో ప్రజలను బురిడీ కొట్టిస్తారని ప్రజలు విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకుల పోకడ నేడు ఇలావుందని ప్రజలు గుర్తు చేయడం గమనార్హం. పగలు కాళ్ళు కొట్లాడుకుంటాయి.. రాత్రుల్లో మూతులు ముద్దాడుకుంటాయన్న సామెతను గుర్తు చేయడాన్ని ప్రతి పక్షాలు సిగ్గుపడాలి.
------------------------------------
*దోచుకొని దాచుకోవడమే..!*
-----------------------------------
దోచుకొని దాచుకోవడంలో ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఒకర్ని మించి ఒకరు పోటీపడినట్టుగానే జాతి సంపదను దోచుకుతింటున్నది వాస్తవమేగా..! జాతీయ స్థాయిలో అధికారపార్టీ అదానీకి దోచిపెడుతుందని ప్రతిపక్షాలు, తెలంగాణాలో మైహోం, మెగా, సత్యం రామలింగరాజు బినామీలుగా దోచి పెడుతున్నారని ఇక్కడా ప్రతిపక్షాల గగ్గోలు... ఏ రాజకీయ నాయకుడు ఎంత సొమ్ము దిగమింగి వెనుకేసుకున్నది ప్రజల వద్దా లెక్కలు ఉన్నాయి. ప్రజలు అమాయకులు అనుకుంటే నాయకులను "అడుసు తొక్కనేలా కాళ్ళు కడగానేలా"ను చవిచూపిస్తారు.
---------------------------------------
*అబద్దాల బరువుకే రోడ్లు కుంగుతున్నాయి..*
----------------------------------------
పాలనలో ఉన్నా నాయకులు రోజు మాట్లాడే అబద్దాల బరువుకే నగర రోడ్డులు కుంగుతున్నాయని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఇది మన మహానగరం హైద్రాబాద్ లో రోడ్లు కుంగిపోతున్న తీరు అద్దం పడుతుంది.
వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు, ప్రగతి పనులు, పరిశీలించడానికి ప్రతిపక్షాలు, ప్రగతి కాముకులు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ముందస్తు అరెస్టులు లేదా గృహ నిర్భందాలు ఎందుకు అని ప్రజలు పాలకులను ప్రశ్నిస్తున్నారు.? పనులలో పారదర్శకత ఉన్నప్పుడు పాలకులకి భయం ఎందుకని ప్రజలు నిలదీస్తున్నారు.! ఇతర ప్రాంతాల వారు వాటిని సందర్శించి కితాబులు ఇచ్చినపుడు మనవాళ్ళు వెళితే "లా అండ్ ఆర్డర్" సమస్య అని పేచీ ఎందుకు పెడుతున్నారు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-----------------------------------
*రానున్నది ఎన్నికల కాలం...*
----------------------------------
రానున్న కాలం ఎన్నికల కాలం పాలకులారా! మీ పాలనా! నిజాయితీని నిలబెట్టుకోవాలి లేకుంటే? మీ డోల్లా తనం ఎండగట్టి ఓట్లతో గుణపాఠం నేర్పుతాం అని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

*సకినాల సుధాకర్ పటేల్*
*సీనియర్ జర్నలిస్టు*

Saturday, February 18, 2023

వైఎస్ షర్మిల అరెస్ట్..... హైదరాబాద్ తరలింపు

*వైఎస్ షర్మిల అరెస్ట్..... హైదరాబాద్ తరలింపు*

మహబూబాబాద్‌: వైతెపా(YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో మహబూబాబాద్‌ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.షర్మిల పాదయాత్రను రద్దు చేసి ఆమెను అరెస్ట్‌ చేసిన అనంతరం హైదరాబాద్‌ తరలిస్తున్నారు.

శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో వైతెపా ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ మహబూబాబాద్‌ శాసనసభ్యుడు బానోతు శంకర్‌నాయక్‌ను పరుష పదజాలంతో షర్మిల దూషించారని భారాస మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లూనావత్‌ అశోక్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆదివారం షర్మిలను అరెస్ట్‌ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

నందమూరి తారకరత్న కన్నుమూత

*నందమూరి తారకరత్న కన్నుమూత,*

గత 23  రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

తారక రత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి మోకిల లోని తన నివాసానికి తరలిస్తారు.

ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.

సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు

GHMC ఉప్పల్ సర్కిల్ లో చెరువులు

Friday, February 17, 2023

గిరిజన రిజర్వేషన్ల పెంపు....తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించండి.....సుప్రీం....!

*గిరిజన రిజర్వేషన్ల పెంపు....తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించండి.....సుప్రీం....!*

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ చేపట్టిన విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం పిటిషనర్లకు పలు సూచనలు చేసింది.ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టులోనే పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. రిజర్వేషన్ల పెంపు జీవో చట్టబద్ధం కాదని, జీవో వల్ల ఆదివాసీలకు నష్టం జరుగుతుందని.. రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు విరుద్ధంగా ఉన్న జీవోని కొట్టి వేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు గిరిజన సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఆధార్‌ సొసైటీ, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంక్షేమ అసోసియేషన్‌, ఆదిమ ఆదీవాసుల సంక్షేమ, హక్కుల పరిరక్షణ గిరిజన సంఘాలు జనవరి 6న సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ఉందని, ఇది రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సుగాలి, లంబాడా, బంజారా గిరిజనులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. రాజ్యాంగబద్ధంగా ఈ జీవో చట్టబద్ధం కాదని, చట్టబద్ధం సాధ్యం కాని జీవో వల్ల గిరిజనులకు నష్టం చేకూరుతుందని పిటిషనర్లు తెలిపారు. ఎటువంటి లబ్ధి చేకూర్చని ఉత్తర్వులను కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవాలు చేస్తూ రాష్ట్ర హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయవచ్చని సూచిస్తూ విచారణను ముగించింది.

*సుజీవన్ వావిలాల*🖋️

జన్మదిన వేడుకల్లో.... అపశృతి....కింద పడిపోయిన MLA

*జన్మదిన వేడుకల్లో.... అపశృతి....కింద పడిపోయిన MLA*

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుక ల్లో అపశృతి చోటు చేసుకుంది. నగరంలోని కాచిగూడలో కేసీఆర్ జన్మదిన వేడుకలను అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు  బాణాసంచా కాల్చగా నిప్పురవ్వలు అక్కడ ఏర్పాటు చేసిన గ్యాస్ బెలూన్లపై పడ్డాయి. దీంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. ఊహించని ఈ ఘటనతో కార్యకర్తలు పరుగులు తీశారు. తోపులాటలో అంబర్‌పేట ఎమ్మెల్యే వెంకటేష్  కిందపడిపోయారు.కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు  అంబర్‌పేటలో పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. అంబర్‌పేట ఎమ్మెల్యే వెంకటేష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ తరుణంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున బాణాసంచా పేల్చారు. అయితే నిప్పురవ్వలు ఎగిసిపడి అక్కడే ఉన్న గ్యాస్ బెలూన్లపై పడటంతో మంటలు చెలరేగాయి. కార్యకర్తలపై నిప్పురవ్వలు పడ్డాయి. వెంటనే కార్యకర్తలు అక్కడి నుంచి పరుగులు తీశారు. కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే పరుగులు పెట్టేందుకు ప్రయత్నించి కిందపడిపోయారు. కాగా.. ఎమ్మెల్యే వెంకటేష్‌కు పెను ప్రమాదం తప్పింది. స్వల్పగాయాలైన వెంకటేష్‌ను వెంటనే అక్కడి నుంచి తరలించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Thursday, February 16, 2023

రామంతాపూర్ చిన్న చెరువునుండి దుర్గంధపు వాసనలు

*పత్రిక ప్రకటన*
----------------

*మేడ్చల్ జిల్లా, GHMC ఉప్పల్ సర్కిల్ రామంతాపూర్ చిన్న చెరువు నుండి దుర్గంధంతో వాసనలు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు & ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం ఆశ్చర్యంవేస్తుంది. వాసన ఎలావుంది అంటే మార్చురీ లో వచ్చే వాసన కన్నా ఎక్కువగా వుంది. ఇదే వాసనను గత పదిరోజులుగా ప్రజలు భరిస్తన్నారు.*

*మల్కాజిగిరి MP, ఉప్పల్ MLA, రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్, GHMC ఉప్పల్ సర్కిల్ DC, ఉప్పల్ మండలం MRO వీరిని 10నిముషాలు రామంతాపూర్ చిన్న చెరువు కట్ట మీద నిలపెడితే అప్పుడు తెలుస్తుంది ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో.*

*Bplkm🪶*
*బాపట్ల కృష్ణమోహన్*
*ప్రజాసంకల్పం ఫౌండర్*                                           17/02/2023

Wednesday, February 15, 2023

జర్నలిస్టులపై అట్రాసిటీ కేసుపై.... కీలక తీర్పు....!

*జర్నలిస్టులపై అట్రాసిటీ కేసుపై.... కీలక తీర్పు....!*

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జర్నలిస్టుల పై అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. విధుల్లో ఉన్న జర్నలిస్టులకు ఎదుటివారు ఏ సామాజిక వర్గమో ఎలా తెలుస్తుంది? అని కోర్టు ప్రశ్నించింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసుల (Police) ను నిలదీసింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటే ఫిర్యాదుదారు ఏ సామాజికవర్గానికి చెందినవారో నిందితులకు తెలిసి ఉండాలని, కానీ ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు కులం గురించి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు తెలియదని అభిప్రాయపడింది. అందువల్ల జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమపై ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ 3(2)(ఎ) కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు జర్నలిస్టులు హైకోర్టును ఆశ్రయించగా మంగళవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎం. మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, February 14, 2023

కొండగట్టు అంజన్న దర్శించుకున్న సీఎం కేసీఆర్

కొండగట్టు అంజన్న దర్శించుకున్న సీఎం కేసీఆర్

సుప్రసిద్ధత కొండగట్టు ఆంజనేయస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దర్శించుకున్నారు. బుధవారం జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ నుండి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ కు ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్, విద్యాసాగర్ రావు, దాసరి మనోహర్ రెడ్డి, కోరు కంటి చందర్ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

అజారుద్దీన్ కు చుక్కెదురు....హెచ్ సీ ఏ కమిటీని రద్దు చేసిన.... సుప్రీం కోర్టు

*అజారుద్దీన్ కు చుక్కెదురు....హెచ్ సీ ఏ కమిటీని రద్దు చేసిన.... సుప్రీం కోర్టు*

హైదరాబాద్‌: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.అజహర్‌ నేతృత్వం వహిస్తున్న హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది.

మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను ఏకసభ్య కమిటీ చూసుకుంటందని తెలిపింది. త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, February 12, 2023

డాక్టర్ కందాల శోభారాణి గారు కొద్దిసేపటి క్రితం తీవ్ర అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.

కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం  అధ్యాపకురాలు డాక్టర్ కందాల శోభారాణి గారు కొద్దిసేపటి క్రితం తీవ్ర అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. వీరిది పాపయ్యపేట గ్రామం, చెన్నారావుపేట మండలం ,వరంగల్ జిల్లాకు చెందిన వారు. కాకతీయ యూనివర్సిటీలో తెలుగు విభాగంలో పి.హెచ్.డి. పూర్తి చేసి, అధ్యాపకురాలిగా కొనసాగుతూనే మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆదివాసి, ప్రజల హక్కుల  రక్షణ కోసం తుదికంఠ పోరాడారు. అనేక రచనలు ,కవిత్వాలు రాసి తెలుగు సాహిత్యాభివృద్ధి వికాసానికి కృషి చేశారు. సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారిన కులం, మతం, దోపిడీ, పీడన, వివక్షత, అణచివేత , పితృ స్వామ్య వ్యవస్థ లేని సమ సమాజ స్థాపన కోసం తుది కంఠ పరితపించారు. ఈమె భర్త   టి.రమేష్ గతంలో PDSU ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం సామాజిక ఉద్యమాల్లో కొనసాగుతున్నారు. వీరికి ఒక బాబు కౌశిక్ ఉన్నారు.
డాక్టర్ శోభారాణి మృతి పట్ల కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు, అధ్యాపకులు ,సిబ్బంది, అరసంతో పాటు పలు సంఘాల నాయకులు, పరిశోధక విద్యార్థులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు. ఆమె మరణానంతరం ఆమె భౌతిక కాయాన్ని ఆమె కోరుకున్నట్లు కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని రేపు ఉదయం 11 గంటల వరకు వారి గృహం యందు వుంచుతారు.
అడ్రస్ : కాకతీయ యూనివర్సిటీ రెండవ గేటు,కనకయ్య హోటల్ వెనక, హనుమకొండ.
🌹🌹🌹 ✊✊✊

నేను చెప్పేవి అబ్బద్ధం అవుతే రాజీనామా చేస్తా..... సీఎం కేసీఆర్

*నేను చెప్పేవి అబ్బద్ధం అవుతే రాజీనామా చేస్తా..... సీఎం కేసీఆర్*

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ జులం.. అహంకారం ఎన్నో రోజులు ఉండదని, ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ శాశ్వతం కాదని, 2024 తర్వాత భాజపా కుప్పకూలడం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) అన్నారు.మన్మోహన్‌సింగ్‌ హయాంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ మోదీ ప్రభుత్వం (PM Modi) వెనుకబడి ఉందని, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. తాను చెప్పే మాటలు అవాస్తవమైతే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. అసెంబ్లీలో ద్రవ్యవినియమ బిల్లుపై చర్చ అనంతరం సభను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు.

''గోద్రా అల్లర్లపై బీబీసీపై డ్యాకుమెంటరీ తీస్తే దాన్ని బ్యాన్‌ చేశారు. అశ్వనీ ఉపాధ్యాయ అనే వకీలు బీబీసీని బ్యాన్‌ చేయాలని కేసు వేశారు. అంత అహంకారమా? అంత ఉన్మాదమా? సుప్రీంకోర్టులో కేసు వేస్తే దేశానికి అలంకారమా? మన గురించి ప్రపంచం ఏమనుకుంటుంది. ఇంత అసహన వైఖరి అవసరమా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతి ఇదేనా? మనుషులన్నాక తప్పులు జరుగుతాయి. ఒప్పుకోవాలి. కొన్నిసార్లు నోరుజారి మాట్లాడతారు. సారీ చెబితే తప్పేముంది. మాట్లాడితే జైలులో వేస్తామని బెదిరిస్తారు. జులుం, అహంకారం ఎన్నిరోజులు ఉంటుంది. 2024 తర్వాత కుప్పకూలడం ఖాయం. బంగ్లాదేశ్‌ వార్‌ గెలిచినప్పుడు పార్లమెంట్‌లో వాజ్‌పేయీగారు స్వయంగా 'దుర్గామాత ఆఫ్‌ హిందుస్థాన్‌' అని ఇందిరాగాంధీని పొగిడారు. ఆ తర్వాత అలహాబాద్‌ జడ్జిమెంట్‌ వల్ల మహానాయకురాలైన ఇందిరాగాంధీలాంటి వారినే ఈ దేశం ఓడించింది. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదు. సంయమనం ఉండాలి. దేశంలో అంతులేని ప్రైవేటేజేషన్‌ తెస్తున్నారు. రైళ్లు, రైల్వేస్టేషన్లు, పోర్టులు అన్నీ పోతున్నాయి. చివరకు ఎల్‌ఐసీని కూడా అమ్మేయాలా? సోషలైజేషన్‌ ఆఫ్‌ లాసెస్‌.. ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ ప్రాఫిట్' అనే నీతిని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోంది. అంటే నష్టం వస్తే సమాజంపైన వెయ్‌. లాభం వస్తే, ప్రవేటువాళ్లకు అప్పగించు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.''

''ప్రభుత్వం వ్యాపారాత్మక ధోరణిలో వ్యాపారం చేయకూడదు. అవసరమైన చోట మాత్రమే వ్యాపారం చేయాలి'. రైతుల ధాన్యం కొనాల్సి వచ్చినప్పుడు నష్టం వచ్చినా కొన్నాం. ఒక చోట అధిక లాభాలు రావచ్చు. మరొకచోట పెద్దగా రాకపోవచ్చు. అన్నింటినీ సమ్మిళితం చేయాలి' ప్రభుత్వం వ్యాపారం చేయదు అంటే బాధ్యతల నుంచి తప్పుకోవడమే. ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ అని పెట్టాం. కాడి మోసిన వాడు సిపాయి గానీ, కాడి గుంజిన వాడు సిపాయి కాదు. కాంగ్రెస్‌ పాలనలో వార్షిక వృద్ధిరేటు 6.8శాతం ఉంది. భాజపా హయాంలో 2014-23 వరకూ 5.5శాతానికి వచ్చింది. కాంగ్రెస్‌ వాళ్లది అంతులేని భావదారిద్ర్యం ఆ బాధ్యత మాపై పడింది. యూపీఏ కాలంలో 24శాతం వృద్ధిరేటు ఎక్కువ. మన్మోహన్‌ హయాంలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.73శాతం ఉంటే, మోదీ హయాంలో 7.01శాతానికి పడిపోయింది. ఇవన్నీ కాగ్‌ చెప్పిన గణాంకాలే. జీడీపీలో అప్పుల శాతం 66.7శాతం ఉండగా, మన్మోహన్‌సింగ్‌ పాలన ముగిసే సమయానికి 52శాతానికి తగ్గింది. అప్పుల శాతాన్ని తగ్గించారు. ఇక మోదీ హయాంలో 2014 నుంచి చూస్తే 52.2శాతం నుంచి 56శాతానికి పెరిగింది. అప్పులు చేయడంలో ప్రధాని మోదీని మించిన వారు లేరు. ఎగుమతుల వృద్ధి రేటు పెరిగితే, దేశం అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నట్లు. మన్మోహన్‌సింగ్ హయాంలో ఎగుమతుల వృద్ధి రేటు 19.5శాతం ఉంటే, మోదీ హయాంలో 4.9శాతానికి పడిపోయింది. మేకిన్‌ ఇండియా జోకిన్‌ ఇండియా అయింది. విశ్వగురు ఎటు పోయే.. ఇదేం ప్రచారం. ఇవన్నీ కఠిన వాస్తవాలు. ఇందులో ఒక్కటి అబద్ధమైనా నేను రాజీనామా చేస్తా. అత్యంత అసమర్థ ప్రభుత్వం ప్రధాని మోదీదే'' అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు.

*సుజీవన్ వావిలాల🖋️*

Saturday, February 11, 2023

తొమ్మిదో నిజాం ఎంపికపై వివాదం

*తొమ్మిదో నిజాం ఎంపికపై వివాదం*

*హైదరాబాద్.....!*
ఇటీవల కన్నుమూసిన నిజాం ముకర్రం జా కుమారుడు అజ్మత్‌జాను తొమ్మిదో నిజాంగా ప్రకటించడం సరికాదని అస్‌ఫజాహీ వంశస్థులు, మజ్లి్‌స-ఎ-సాహెబ్‌ జాదాగన్‌ సొసైటీ సభ్యులు, నిజాం కుటుంబీకులు స్పష్టం చేశారు.హైదరాబాద్‌ సంస్కృతి, సంప్రదాయాలపై కనీస అవగాహన లేని అజ్మత్‌కు వారసత్వ బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిజాం ట్రస్టీల్లో ఒక్కరినీ సంప్రదించకుండా, ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. శనివారం ఓ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లండన్‌లో పుట్టిపెరిగిన అజ్మత్‌కు నిజాం కుటుంబీకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. '16 ట్రస్టుల్లోని 4,500 మంది సభ్యులంతా కలిసి..

నవాబ్‌ రౌనఖ్‌యార్‌ఖాన్‌ను తొమ్మిదో నిజాంగా ఎంపిక చేశాం. రౌనఖ్‌ ప్రమాణస్వీకార తేదీని త్వరలో ప్రకటిస్తాం. మా నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిసి, వారికి పరిస్థితులను వివరించాం' అని తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, February 10, 2023

జబర్దస్త్ జోకులు చేస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

 *మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి అసెంబ్లీలో మాట్లాడకుండా జబర్దస్త్ జోకులు చేస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి*-ఎస్ఎఫ్ఐ 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ... మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాల నుంచి విద్యార్థులు,భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా పోరాటాలు చేస్తున్న పట్టించుకోని పాలకులు.. మేడ్చల్ నియోజకవర్గం లో మండలాన్ని ఒక్క జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని నియోజవర్గం ఎమ్మెల్యే ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీల గురించి అసెంబ్లీలో మాట్లాడుతారేమో అని వేయికళ్లతో,కోటి ఆశలతో ఎదురుచూసిన విద్యార్థిని,విద్యార్థులు, నియోజవర్గ ప్రజలు కానీ మంత్రి మల్లారెడ్డి విద్యార్థినీ విద్యార్థుల నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని మర్చిపోయి. తన వ్యక్తిగత కళాశాల మల్లారెడ్డి విద్యాసంస్థల గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడడం సిగ్గుచేటు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడుతుంటే మంత్రి మల్లారెడ్డి మాత్రం మేడ్చల్ నియోజకవర్గం సమస్య గురించి ఒక మాట కూడా ఎత్తకపోవడం సరైన విధానం కాదు..మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోతే, మేడ్చల్ నియోజవర్గాల్లో  ప్రతి మండలంలో ఒక్క జూనియర్ కళాశాల ఏర్పాటు చేయకపోతే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని అడుగున అడ్డుకుంటామని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాము...

ధన్యవాదములతో

*రాథోడ్ సంతోష్*
*ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు*

తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా

◾ *|| తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా ||* ◾

▪️ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో వాయిదా పడిన సచివాలయ ప్రారంభోత్సవం.

▪️రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవంకు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.

▪️17న సచివాలయం ప్రారంభం వాయిదా.

*సుజీవన్ వావిలాల🖋️* 

50 స్థానాల్లో పోటీ.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం: అసదుద్దీన్‌

*50 స్థానాల్లో పోటీ.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం: అసదుద్దీన్‌*

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంఐఎం పార్టీ 50 స్థానాల్లో పోటీ చేయడంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని తెలిపారు. అసెంబ్లీ  ఆవరణలో జరిగిన ఇష్టాగోష్ఠిలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. సీఎం కేసీఆర్ తాజ్ మహల్ లాగే సచివాలయాన్ని చాలా బాగా నిర్మించారని కొనియాడారు. సచివాలయ ప్రారంభం అధికారిక కార్యక్రమం అని.. దానికి తప్పకుండా హాజరవుతానని చెప్పారు. పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే భారాస సభతో మాత్రం తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని అసదుద్దీన్‌ అన్నారు. తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారని, దేశమంతా వస్తే మంచిదేనని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఎంఐఎంను భాజపా బీ టీం అని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భాజపాను ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో జేపీసీ కోసం అడిగితే ప్రధాని మోదీ అంగీకరించడం లేదన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

చెడి పోయిన బుల్లెట్ ప్రూఫ్ కారుతో ప్రగతి భవన్ కు.....రాజాసింగ్ అరెస్ట్

*చెడి పోయిన బుల్లెట్ ప్రూఫ్ కారుతో ప్రగతి భవన్ కు.....రాజాసింగ్ అరెస్ట్....*

హైదరాబాద్‌: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే, రాజాసింగ్‌ మళ్లీ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.చెడిపోయిన తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని తీసుకొని ఎమ్మెల్యే శుక్రవారం ప్రగతి భవన్‌ వద్దకు వెళ్లారు. తనకు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ మార్చాలని, లేదంటే ఆ వాహనం మీరు తీసుకోవాలంటూ ప్రగతిభవన్ వద్ద వదిలేసి రాజాసింగ్ వెళుతున్నారు.

ఇది గమనించిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మీడియా కంట పడకుండా పూర్తిగా మూసేసిన పోలీస్‌ డీసీఎంలో అసెంబ్లీకి తీసుకొచ్చారు. కాగా గతంలో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆయనను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Thursday, February 9, 2023

ఎన్టీఆర్ చికిత్స కోసం.... అమెరికా వెళ్తే

*ఎన్టీఆర్ చికిత్స కోసం.... అమెరికా వెళ్తే*

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు.కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేశారని మోదీ గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 50 సార్లకు పైగా ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాలను పడగొట్టారని ఆయన విమర్శించారు. *తెలుగు దేశం పార్టీ అధినేత*
*నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ పడగొట్టారని మోదీ గుర్తు చేశారు*

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ వంటి ప్రముఖుల ప్రభుత్వాలను కూడా కాంగ్రెస్ పడగొట్టిందని ప్రధాని గుర్తు చేశారు.

ప్రతిపక్షాలు ఎంత ఎక్కువ బురద జల్లితే, కమలం అంత గొప్పగా వికసిస్తుందని చెప్పారు. కొందరి భాష, ప్రవర్తన భారత దేశానికి నిరాశ కలిగిస్తున్నాయన్నారు. తనపైనా, తన ప్రభుత్వంపైనా ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావిస్తూ, ప్రతిపక్షాల వద్ద బురద ఉందని, తన వద్ద గులాల్ ఉందని, ఎవరి దగ్గర ఏది ఉంటే, దానినే వారు విసురుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయంలో అభివృద్ధికి ఆటంకాలు సృష్టించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పరిపాలించిన ఆరు దశాబ్దాల కాలంలో మన దేశం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, అదే సమయంలో చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఆ సమస్యలకు పరిష్కారాలను అందజేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని, కానీ ఆ పార్టీ నేతల ప్రాధాన్యతలు, ఉద్దేశాలు వేరు అని తెలిపారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం తాము కృషి చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ఖర్గే గారు చెప్పినట్లుగా పునాదుల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రయత్నించి ఉండవచ్చునని, అయితే కాంగ్రెస్ పాలనా కాలంలో కేవలం గోతులను మాత్రమే తవ్వారని దుయ్యబట్టారు. గడచిన మూడు, నాలుగేళ్ళలో దాదాపు 11 కోట్ల ఇళ్లకు కొళాయి నీటి కనెక్షన్లు అందినట్లు తెలిపారు.

సామాన్యులను సాధికారులను చేయడం కోసం జన్ ధన్ ఖాతా ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. గడచిన తొమ్మిదేళ్లలో సుమారు 48 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిచినట్లు తెలిపారు.

ప్రధానమంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ బుధవారం ముగిసింది. ఈ చర్చకు మోదీ గురువారం సమాధానం చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

అసెంబ్లీలో ధరణిపై ..... గరం గరం

*అసెంబ్లీలో ధరణిపై ..... గరం గరం*

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో 'ధరణి' పై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది.ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు  ప్రస్తావించారు. చాలా మంది రైతులు మీసేవలో దరఖాస్తు చేసుకొని అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. మధ్యలో కలగజేసుకున్న మంత్రి కేటీఆర్‌ (KTR), ప్రశాంత్‌ రెడ్డి.. శ్రీధర్‌బాబు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఎక్కడో ఓ చోట జరిగిన ఘటనను మొత్తం ధరణికి ఆపాదించొద్దని సూచించారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు. ఔషధ నగరికి రైతుల నుంచి తక్కువ ధరలో సేకరించిన భూములను కార్పోరేట్లకు కట్టబెడుతున్నారని శ్రీధర్‌బాబు ప్రస్తావించడం మరోసారి గందరగోళానికి దారితీసింది. ఎమ్మెల్యే తన మాటలను ఉపసంహరించుకోవాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.ధరణి అమలులోకి వచ్చిన తర్వాత చాలా మందికి హక్కుపత్రం లేక ఇబ్బందిపడ్డారు. మీసేవ ద్వారా తీసుకున్న అప్లికేషన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ రోజు మ్యూటేషన్‌, పార్టిషన్‌, పౌథీ, పేర్ల తప్పులు, డబుల్‌ ఖాతాలను తొలగించడం, వ్యవసాయేతర, ప్రభుత్వ భూముల గుర్తించి రికార్డులను నవీకరించి కొత్త పాస్‌బుక్‌లను మంజూరు చేశామన్న ప్రభుత్వపు మాటల్లో వాస్తవం లేదు'' అని శ్రీధర్‌బాబు అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. ''శ్రీధర్‌బాబు చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే మొత్తం వ్యవస్థంతా కకావికలం అయిపోయిందన్నట్లుగా ఉంది. అంతా బాగా ఉంటే ఎవరూ మాట్లాడరు. ఎక్కడో ఓ చోట లోపాలుంటే దాన్ని బూతద్దంలో పెట్టి.. రాష్ట్రం అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడిందని.. అసలు ఏమీ జరగడంలేదని చెప్పడం సరైంది కాదు'' అని అన్నారు. శ్రీధర్‌బాబు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఈసందర్భంగా కేటీఆర్‌ మండిపడ్డారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, February 7, 2023

ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది హక్కుల సంఘాలను & మేధావులను

https://youtu.be/uCWjY9vBn4U                                                            
 **ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది హక్కుల సంఘాలను & మేధావులను*

*#తెలంగాణ లో #ప్రజలపక్షాన #రాజ్యాంగం కల్పించిన న్యాయమైన #హక్కులకు అనుగుణంగా #అవినీతి మీద పోరాటం చేస్తున్న, ప్రశ్నిస్తున్న గొంతులను ఈ తెలంగాణ ప్రభుత్వం #అక్రమఅరెస్టులు చేయడం రాజ్యాంగంను / ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే కదా !!*

*ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాను న్యాయంగా ప్రశ్నించేవారు ప్రజలు అయినా, జర్నలిస్ట్ లు అయినా,సోషల్ మీడియా అయినా,రాజకీయ పార్టీ నాయకులు అయినా అందరికి హక్కులు కల్పించింది కదా మన రాజ్యాంగం.మరి తెలంగాణ ప్రభుత్వం న్యాయంగా ప్రశ్నించేవారిని భయబ్రాంతులకు గురి చేస్తుంది ఇదెక్కడి న్యాయం!!*

*#తెలంగాణ లో నిత్యం ఏదో ఒకచోట ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తున్నారు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. మరి శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న వారిమీద #అక్రమంగా కేసులు పెట్టడం ఏమిటి ??*

*ఇలాంటి తెలంగాణ కోసమా ఎందరో అనరులైనారు ??. అసలు అమరవీరుల ఆశయాలకోసం ఈ ప్రభుత్వం ఏనాడైనా ప్రజాస్వామ్యబద్దంగా పరిపాలన చేసిందా  ?? అమరవీరుల కుటుంబాలు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో వున్నాయో తెలుసా ?? అమరవీరుల త్యాగాలమీద వేల కోట్లు ఎవరు దోచుకున్నారు / దోచుకుంటున్నారు అంటే ఒకటే కుటుంబం వారి వద్ద బానిసలుగా వున్న ప్రజాప్రతినిధులు బంధుమిత్రులు కాదా ??*

*👆వీటిని ప్రశ్నించే వారిమీద అక్రమకేసులు. న్యాయస్థానాలు అంటే గౌరవం లేదు ఈ ప్రభుత్వానికి. ఉదాహరణకు సోమేశ్ కుమార్ IAS అధికారి మీద ఎన్ని కోర్ట్ దిక్కారణ కేసులు ఉన్నాయో అందరికి తెలిసిందే.*

*NOTE : #తెలంగాణ లో ప్రజల హక్కులను ఎలా కాలరాస్తుంది ఈ ప్రభుత్వం అనడానికి బల్మూరు వెంకట్  వాస్తవ విశ్లేషణ చాలు.వెంకట్ ఒక VIP మరి ఇతనికే ఇలా జరిగింది అంటే సామాన్యుల పరిస్థితి ఏంది ??*

*Bplkm🪶*
*Bapatla Krishnamohan*
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/

పెట్రోలంటూ ఆరెంజ్ జ్యుస్ పోసుకొని.... కలెక్టరేట్ లో యువకుని హల్ చల్

*పెట్రోలంటూ ఆరెంజ్ జ్యుస్ పోసుకొని.... కలెక్టరేట్ లో యువకుని హల్ చల్*

*యువకుడితో మాట్లాడుతున్న కలెక్టరేట్‌ ఏవో కిరణ్‌ప్రకాశ్‌*

హనుమకొండ కలెక్టరేట్‌, : పెట్రోలంటూ ఆరెంజ్‌ జ్యూస్‌ ఒంటిపై పోసుకొని ఓ యువకుడు అధికారులను బెదిరించాడు.ఈ ఘటన సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే.. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి జరిగింది. హనుమకొండ జిల్లా భీమధేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన అజయ్‌రెడ్డి వచ్చాడు.

తన భూ సమస్యను అధికారులు పరిష్కరించడం లేదని, పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ సీసాలోని ఆరెంజ్‌ రసాన్ని ఒంటిపై పోసుకున్నాడు. సెక్యురిటీ సిబ్బంది సదరు యువకుడిని అడ్డుకున్నారు. పెట్రోల్‌ వాసన రాకపోడంతో సీసాను పరిశీలించగా.. అందులో ఆరెంజు జ్యూస్‌ ఉందని గుర్తించారు. కలెక్టరేట్‌ ఏవో కిరణ్‌ప్రకాశ్‌ వచ్చి యువకుడితో మాట్లాడగా.. కాస్తులో ఉన్న భూమికి పట్టా లేదని, స్థానిక అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదని చెప్పాడు. భూసమస్యకు కలెక్టర్‌ పరిష్కారమార్గం చూపించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, February 5, 2023

హైకోర్టులో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురు

*హైకోర్టులో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురు*

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, భారాస ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని.. తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని సీజే ధర్మాసనాన్ని అడ్వకేట్‌ జనరల్‌ కోరారు. అయితే దానికి హైకోర్టు నిరాకరించింది.

ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయాలని గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. సిట్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కూడా హైకోర్టు రద్దు చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాం ధర్మాసనం అప్పీలుపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తాజాగా తీర్పు వెలువరించింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

*రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌*

*రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు*

*మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు*

*వ్యవసాయానికి కేటాయింపులు: రూ. 26,831 కోట్లు*

*నీటి పారుదల రూ. 26,885 కోట్లు*

*విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు*

*ప్రజా పంపిణీ వ్యవస్థ రూ. 3117 కోట్లు*

*ఆసరా ఫించన్ల కోసం రూ. 12,000 కోట్లు*

*దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు*

*ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు*

*ఎస్టీ ప్రత్యేక నిధి కోసం. రూ.15, 233 కోట్లు*

*బీసీ సంక్షేమం కోసం రూ. 6, 229 కోట్లు*

*మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు*

*మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు*

*అటవీ శాఖ కోసం రూ. 1, 471 కోట్లు*

*విద్య కోసం రూ.19, 093 కోట్లు*

*వైద్యం కోసం రూ.12,161 కోట్లు*

*సుజీవన్ వావిలాల*🖋️ 

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్..... కన్నుమూత....!

*పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్..... కన్నుమూత....!*

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్  కన్నుమూసినట్లు పాకిస్థాన్ మీడియా ఆదివారం తెలిపిందిఆయన చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని, దుబాయ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంది.

ముషారఫ్ (79) దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో అమిలోయిడోసిస్ వ్యాధికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. రెండు వారాల క్రితం ఆయన ఈ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. ఆయన బాల్యంలో కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూలులో చదివారు. ఆ తర్వాత లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత చదువులు చదివారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో చదివారు. 1961లో పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో చేరారు. పాకిస్థాన్ ఆర్మీలో 1964లో చేరారు.

జనరల్ పర్వేజ్ ముషారఫ్ 1998 నుంచి 2007 వరకు పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1998 నుంచి 2001 వరకు చైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా వ్యవహరించారు. 1999లో ఫెడరల్ ప్రభుత్వాన్ని సైన్యం కూల్చేసింది. ఆయన 2001 జూన్ 20 నుంచి 2008 ఆగస్టు 18 వరకు పాకిస్థాన్ దేశాధ్యక్షునిగా పని చేశారు.

1965లో భారత్-పాకిస్థాన్ యుద్ధం సమయంలో ఆయన సెకండ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. 1980వ దశకంలో ఆయన ఓ ఆర్టిలరీ బ్రిగేడ్‌కు చీఫ్‌గా ఎదిగారు. ఆఫ్ఘనిస్థాన్ సివిల్ వార్‌లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతును ప్రోత్సహించారు. 1998లో అప్పటి పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆయనకు ఫోర్ స్టార్ జనరల్ హోదా ఇచ్చారు. దీంతో ఆయన పాకిస్థాన్ రక్షణ దళాలకు అధిపతి అయ్యారు. 1999లో కార్గిల్ యుద్ధం ఆయన హయాంలోనే జరిగింది. ఆయన నేతృత్వంలోనే కార్గిల్‌లోకి పాకిస్థాన్ చొరబడింది. ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. షరీఫ్, ముషారఫ్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ముషారఫ్‌ను ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించేందుకు షరీఫ్ విఫలయత్నం చేశారు. దీంతో ముషారఫ్ నేతృత్వంలో సైన్యం తిరుగుబాటు చేసింది. 1999లో షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. 2001లో పాకిస్థాన్ అధ్యక్ష పదవిని ముషారఫ్ చేపట్టారు. షరీఫ్‌ను గృహ నిర్బంధం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, February 4, 2023

ప్రముఖ గాయని... వాణీ జయరాం కన్నుమూత....!

*ప్రముఖ గాయని... వాణీ జయరాం కన్నుమూత....!*

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్‌ వాణీ జయరాం హఠాన్మరణం చెందారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచారు.తెలుగు, తమిళంతో కలిపి 14 భాషల్లో 5 దశాబ్దాలుగా వాణీ జయరాం వెండితెరకు తన గ్రాత్రాన్ని అందించారు. ఇక సినీ పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గానూ ఇటీవల భారత ప్రభుత్వం ఆమెకు పద్మ భూషన్‌ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డును అందుకోకముందే వాణీ మృతి చెందడం విచారకరం. కాగా 1945 నవంబర్‌ 30న తమిళనాడులోని వేలూరులో జన్మించారు వాణీ జయరాం. ఆమె అసలు పేరు కలైవాణి. 1971లో ఆమె గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. రంగరామానుజా అయ్యంగార్‌ వద్ద ఆమె శాస్త్రీయ సంగీతంతో శిక్షిణ తీసుకున్నారు.

కర్ణాటక సంగీతంలో సాధన చేసిన ఆమె 8 ఏళ్ల వయసులోనే ఆల్‌ ఇండియా రెడియోలో పాట పాడి మురిపించారు. కె విశ్వనాథ్‌ తీసిన స్వాతికిరణం చిత్రంలో ఆమె 8 పాటలు పాడారు. ఇక ఆమె పాడిన తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అంటూ ఆమె కంఠం స్వరమాధుర్యాలను వెదజల్లింది. భక్తి సంగీత ప్రధానమైన పాట అనగానే దర్శకులకు గుర్తొచ్చేది వాణీ జయరాం. అంతగా తన గాత్రంతో ఆమె సంగీత 5 దశాబ్దాలుగా సంగీత ప్రియులను మైమరిపించారు వాణీ జయరాం.

*సుజీవన్ వావిలాల*🖋️ 

KTR వర్సెస్.... అక్బరుద్దీన్

*KTR వర్సెస్.... అక్బరుద్దీన్..... ఘాటు ఘాటూగా విమర్శ ప్రతి విమర్శ....!*

*హైదరాబాద్....!*
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికార పక్షానికి దాని అనుకూల పార్టీకి మధ్య కౌంటర్ల వార్ జరగడమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.నేటి అసెంబ్లీలో అదే జరిగింది. మంత్రి కేటీఆర్‌కు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య ఘాటు ఘాటుగా విమర్శల పర్వం నడిచింది. సభా నాయకుడితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించకపోవడంపై అక్బరుద్దీన్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఇలాంటి సభను తన 25 ఏళ్లలో ఏనాడూ చూడలేదు. బీఆర్ఎస్ నేతలకు టీవీ డిబేట్‌లకు వెళ్లే టైం ఉంటుంది కానీ సభకు వచ్చే టైం లేదా? అని ఎద్దేవా చేశారు. సభా నాయకుడితో సంబంధమేంటని కేటీఆర్ ప్రశ్నించారు.

*అసలు అక్బరుద్దీన్ సభలో ఏమన్నారంటే..*
హామీలు ఇస్తారు.. అమలు చేయరు. సీఎం, మంత్రులు మమ్మల్ని కలవరు. మీరు చెప్రాసిని చూపిస్తే వారినైనా కలుస్తాం. పాతబస్తీలో మెట్రోరైలు సంగతి ఏమిటి? ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితేంటి ? ఉర్దూ రెండో భాష అయినా అన్యాయమే. బీఏసీ (BAC)లో ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. చర్చ సందర్భంగా సభా నాయకుడు కనిపించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో కనిపించడం లేదు. టీవీ చర్చలకు వెళ్లే బీఆర్ఎస్ నేతల కు సభకు వచ్చే తీరిక లేదా?

*కేటీఆర్ కౌంటర్....!*

మంత్రులు అందుబాటులో లేరన్నది అవాస్తవం. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీ ఎక్కువ టైమ్ అడగడం సరికాదు. సభ్యులను బట్టి పార్టీలకు సమయం కేటాయిస్తాం. బీఏసీకి రాకుండా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆవేశంగా మాట్లాడటం కాదు.. అర్థవంతంగా సమాధానం ఇవ్వాలి. సభా నాయకుడితో ఒవైసీకి ఏం సంబంధం?

*అక్బరుద్దీన్ ఓవైసీ..*
నేను కొత్త సభ్యున్ని కాదు.. చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యా. టైంను ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలుసు.. రాజ్యంగబద్దంగా చర్చ జరగాలి. గతంలో చాలా సభల్లో గంటల సేపు చర్చించాం. ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, February 3, 2023

ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం

*హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..* *ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం*

తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారుతోంది.. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నాం.. తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించింది.

తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం మూడింతలు అయ్యింది.. మిషన్‌ కాకతీయతో చెరువులను పునరుద్ధరించాం.. రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశాం. మా ప్రభుత్వం రైతులకు బీమా అందిస్తోంది.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది.. రైతు పండించే ప్రతి బియ్యపు గింజను కొంటున్నాం.. రాష్ట్ర విభజన తర్వాత తలసరి విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశాం.

మిషన్‌ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందించాం.. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు.. పేదలను ఆసరా పెన్షన్లతో ఆదుకుంటున్నాం.. రాష్ట్రం ఏర్పడగానే ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాం.. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం.

నేతన్న బీమా పథకం ద్వారా జీవిత బీమా కల్పిస్తున్నాం.. గీతకార్మికుల సంక్షేమం కోసం వైన్‌షాపుల్లో 15శాతం రిజర్వేషన్.. తాటి, ఈతచెట్లపై పన్ను రద్దు చేశాం.. లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

తెలంగాణలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను 310కి పెంచాం.. హైదరాబాద్‌లో 41 బీసీ కులాల కోసం ఆత్మగౌరవ భవనాల నిర్మాణం.. సివిల్ పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం.

పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం రూ.1,00,116 ఆర్థిక సాయం ఇస్తున్నాం.. 12.46 లక్షల ఆడపిల్లల కుటుంబాలకు షాదీ ముబారక్‌తో లబ్ధి.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80వేలకు పైగా ఉద్యోగాలను ఏకకాలంలో భర్తీ చేస్తున్నాం.

2014 నుంచి 2022 వరకు 1,41,735 ఉద్యోగాలను భర్తీ చేశాం.. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు మన ఊరు-మనబడి.. మూడు దశల్లో 7,289 కోట్ల వ్యయంతో 26వేల పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు.

హైదరాబాద్ నలువైపుల 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. నిమ్స్‌లో అదనంగా మరో 2వేల పడకలు.. తెలంగాణలో గతంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 17కు పెంచుకున్నాం..  మరో 9 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తాం.

టీఎస్ ఐపాస్‌లతో విప్లవాత్మక పురోగతిని సాధించాం.. తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.. ఎనిమిదిన్నరేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో 3.31లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం.

*సుజీవన్ వావిలాల*🖋️ 

విశ్వనాథ్ చివరి క్షణాల్లో జరిగిందిదే

*విశ్వనాథ్ చివరి క్షణాల్లో జరిగిందిదే*

తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాలను అందించిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, కళా తపస్వి *కె.విశ్వనాథ్‌* శంకరాభరణం రిలీజ్‌ రోజే శివైక్యం కావడం అందరినీ కలిచివేస్తోంది.వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన చివరి క్షణాల వరకూ కళామతల్లి సేవలోనే గడిపారు. మరణానికి ముందు ఓ పాట రాయడానికి పూనుకున్నారు. సాంగ్‌ రాస్తూ.. కాసేపటికి దాన్ని రాయలేక కుమారుడి చేతికందించి పాట పూర్తి చేయమన్నారు. ఆయన పాట రాస్తుండగానే విశ్వనాథ్‌ కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

కాగా కె.విశ్వనాథ్‌.. సాగరసంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శుభసంకల్పం, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం వంటి ఎన్నో అద్భుత దృశ్యకావ్యాలను చిత్రపరిశ్రమకు అందించారు. ఎందరో అగ్రహీరోలకు దర్శకత్వం వహించిన ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీరంగంలో ఆయన చేసిన కృషికి గానూ 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందారు.

*సుజీవన్ వావిలాల🖋️* 

Thursday, February 2, 2023

మధ్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు... ఈడీ చార్జీషీట్ లో .... కేజ్రీవాల్ కవిత పేర్లు

*మధ్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు... ఈడీ చార్జీషీట్ లో .... కేజ్రీవాల్ కవిత పేర్లు*

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్టు ఈడీ వివరించింది. వి.శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. కవిత ఆదేశంతో అరుణ్‌పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని ఈడీ వెల్లడించింది.

ఈకేసుకు సంబంధించి జనవరి 6న 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ ఐదుగురిపేర్లు, ఏడు కంపెనీలను చేర్చింది. విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్‌ అరోరాలను నిందితులుగా చేర్చింది. సౌత్‌గ్రూప్‌ లావాదేవీల్లో శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌, విజయ్‌ నాయర్‌ కీలక వ్యక్తులుగా ఉన్నారు. మొత్తం ఛార్జిషీట్‌పై 428 పేజీలతో ఈడీ ఫిర్యాదు నివేదికను కోర్టుకు అందించింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.100 కోట్ల లావాదేవీల ఆధారాలను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్నట్టు సమాచారం. మనీలాండరింగ్‌కు సంబంధించి మొత్తం 12 మంది పేర్లను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. తీహార్‌ జైల్లో ఉన్న సమీర్‌ మహేంద్రు, శరత్‌రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, బినోయ్‌ బాబు, అమిత్‌ అరోరా, ఇటీవల అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరాతో పాటు ముందస్తు బెయిల్‌తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కుల్దీప్‌సింగ్‌, నరేంద్ర సింగ్‌, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, సమీర్‌ మహేంద్ర కంపెనీలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. నవంబర్‌ 26న మద్యం విధానం వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో 3వేల పేజీలతో ఈడీ తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. తొలి ఛార్జిషీట్‌లో సమీర్‌ మహేంద్రు, అతనికి చెందిన నాలుగు కంపెనీలపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సమీర్ మహేంద్రు మనీలాండరింగ్ వ్యవహారంలో దాఖలు చేసిన తొలి చార్జిషీట్ పై ఫిబ్రవరి 23న విచారణ జరగనుంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

గ్రూప్ 4 పరీక్ష తేదీని ప్రకటించిన.... టీఎస్ పీఎస్ సీ.....!

*గ్రూప్ 4 పరీక్ష తేదీని ప్రకటించిన.... టీఎస్ పీఎస్ సీ.....!*

హైదరాబాద్‌:రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్‌-4 పరీక్ష తేదీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) గురువారం ప్రకటించింది.జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష.. పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష ఉటుందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది.

కాగా గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని 9,168 పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిలో ప్రధానంగా జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, వార్డ్‌ ఆఫీసర్‌ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. వీటి కోసం గత డిసెంబర్‌లో 1న నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఇప్పటి వరకు 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రేపటితో(ఫిబ్రవరి 3)గ్రూప్‌-4 దరఖాస్తు గడువు ముగియనుంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, February 1, 2023

అక్రమ పార్కింగ్ - అధికారుల అలసత్వం


ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇనాగరేషన్ కార్యక్రమాల్లో డిజిపి అంజన్ కుమార్ గారు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ చొహన్ గారు సమక్షంలో ఉప్పల్ నియోజకవర్గంలో నెలకొన్న ట్రాఫిక్ జాములు గాని ఇల్లీగల్ పార్కింగ్ అలాగే రామంతపూర్ మెయిన్ రోడ్ లో నూతనంగా వెలిసినటువంటి రెస్టారెంట్లు బార్లు లిక్కర్ మర్ట్లు వారి అక్రమ పార్కింగ్లు స్వేచ్ఛగా రోడ్ల పైన పార్క్ చేసి ప్రజలను ఇబ్బందులు చేస్తున్నారు అలాగే రామంతపూర్ లోని మల్లికార్జున స్వామి కమాన్ దగ్గర వైన్ పార్క్ లిక్కర్ మార్ట్ వల్ల అక్కడ తాగిన వ్యక్తులు కాలనీలోకి వెళ్లే మహిళల పట్ల అసభ్య ప్రవర్తన అలాగే అక్కడ మూత్ర విసర్జన తగు అసాంఘిక కార్యక్రమాలు నెలకొన్నయని ఇట్టి విషయాన్ని అతి త్వరలో పరిష్కరించాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దీనివల్ల ప్రజలకి మరియు ఉద్యోగస్తులకు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు  కలుగుతున్నాయని పీపుల్స్ ఫోరం టు అచీవ్ రైట్స్ అండ్  ఎడ్యుకేషన్ ఇండియా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కొండ్రోన్ పల్లి.గిరిబాబు మహరాజ్ కమీషనర్ గారికి వినతిపత్రం అందజేశారు.