Friday, August 6, 2021

TS BPass : ఇక టీఎస్‌ బీపాస్‌తోనే అనుమతులు!

హైదరాబాద్ : 07/08/2021

TS BPass : ఇక టీఎస్‌ బీపాస్‌తోనే అనుమతులు!

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
TS BPass : ఇక టీఎస్‌ బీపాస్‌తోనే అనుమతులు!
  • త్వరలో డీపీఎంఎస్‌ విధానానికి స్వస్తి
  • రాష్ట్రమంతా ఏకీకృత పద్ధతి అమలు
  • లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల అధికారం జిల్లా కలెక్టర్లకే అప్పగింత
  • మార్గదర్శకాలపై అధికారుల కసరత్తు

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణాల అనుమతుల కోసం ఇకపై రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ బీపాస్‌ విధానాన్ని మాత్రమే అనుసరించనున్నారు. సామాన్యుడు సైతం అత్యంత సులభంగా భవన నిర్మాణ అనుమతులు పొందేలా రూపొందించిన టీఎస్‌ బీపాస్‌ విధానం విజయవంతం కావడంతో ప్రస్తుతం అమలులో ఉన్న డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (డీపీఎంఎస్‌) విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు పురపాలకశాఖ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నది.

పురపాలక చట్టానికి అనుగుణంగా లేఅవుట్లు, నిర్మాణ అనుమతుల ప్రక్రియను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగించేందుకు వీలుగా త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ప్రస్తుతం లేఅవుట్ల అనుమతితోపాటు 500 చదరపు మీటర్లకు మించిన విస్తీర్ణంలో నిర్మించే వ్యాపార, నివాస సముదాయాలకు అవసరమైన అనుమతులను హెచ్‌ఎండీఏ కమిషనర్‌తోపాటు డీటీసీపీ డైరెక్టర్లు ఇస్తున్నారు. అయితే, ఈ అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించేందుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన జరుగుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే జాయింట్‌ కలెక్టర్లకు టీఎస్‌ బీపాస్‌పై 20 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. తదుపరి మార్గదర్శకాల రూపకల్పన కోసం అధికార యంత్రాంగం అహ్మదాబాద్‌కు వెళ్లి అధ్యయనం చేయనున్నట్టు తెలిసింది.

అన్నిరకాల సమాచార సేకరణ, విస్తృత మథనం తర్వా త జిల్లా కలెక్టర్‌కు ఈ అధికారాలను అప్పగించే ప్రక్రియపై స్పష్టత రానున్నది. ప్రధానంగా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పరిశీలించి, తని ఖీ చేసే కమిటీలో ఏయే శాఖల అధికారులు ఉండాలనే అంశంపై కసర త్తు కొనసాగుతున్నది. డీపీఎంఎస్‌ విధానాన్ని ఎత్తివేసినప్పటికీ, ఇప్పటి కే పెండింగులో ఉన్న దరఖాస్తులను అధికారులు పరిష్కరించనున్నారు.

No comments:

Post a Comment