Friday, August 20, 2021

ధర్మపీఠంలో మహిళలకు పెద్దపీట!

హైదరాబాద్ : 20/08/2021

ధర్మపీఠంలో మహిళలకు పెద్దపీట!

My India Media ట్విట్టర్ సౌజన్యంతో 

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు మహిళలు కొలువుదీరనున్నారు. అంతేకాదు… తొలిసారిగా ఒక మహిళ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశముంది. చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కొలీజియం ఈ సిఫారసులు చేసింది. కొత్తగా 9 మందిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని ఎన్వీ రమణతోపాటు జస్టిస్‌ ఉదయ్‌ యూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావులతో కూడిన కొలీజియం సిఫారసులు పంపించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒకే ఒక్క మహిళా న్యాయమూర్తి ఉన్నారు.

కొలీజియం సిఫారసులు అమలులోకి వస్తే… కొత్తగా జస్టిస్‌ బీవీ నాగరత్న (కర్ణాటక హైకోర్టు జడ్జి), జస్టిస్‌ హిమా కోహ్లీ (తెలంగాణ హైకోర్టు సీజే), జస్టిస్‌ బేలా త్రివేదీ (గుజరాత్‌ హైకోర్టు జడ్జి) కూడా సుప్రీం న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతారు. సీనియారిటీ, మిగిలి ఉన్న సర్వీసు దృష్ట్యా జస్టిస్‌ నాగరత్న భవిష్యత్తులో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా అవుతారు. ఇంకా… గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్‌ జేకే మహేశ్వరికీ పదోన్నతి లభించనుంది.

కొలిజీయం సిఫారసులను కేంద్రం ఆమోదిస్తే 2027లో జస్టిస్‌ నాగరత్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశముంది. అదే జరిగితే… భారత తొలి మహిళా చీఫ్‌ జస్టి్‌సగా ఆమె రికార్డు సృష్టిస్తారు.అటు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ హిమాకోహ్లీ ఆత్యున్నత ధర్మాసనంలో న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి.

 

No comments:

Post a Comment