గుంటూరులో ఒక దళిత విద్యార్థినిని ఒక యువకుడు పట్టపగలే హత్య చేశాడని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే బీటెక్ విద్యార్థిని రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు.
గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరువద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఎవరూ నిందితుడికి అడ్డుపడలేదని, ఓ వృద్ధురాలు వారించబోతుండగా.. అప్పటికే పొడిచి పరారైనట్లు ఈనాడు తెలిపింది.
నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి అతడి స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రమ్య హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, 'దిశ' కింద చర్యలు తీసుకొని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారని పత్రిక రాసింది.
ఫొటో సోర్స్,UGC
గుంటూరుకు చెందిన రమ్యకు వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన శశికృష్ణతో ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహమేర్పడింది.
హత్య సంఘటనకు ముందు వారిద్దరు పరమయ్యగుంట వద్ద హోటల్ సమీపంలో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదమేర్పడిందని ఈనాడు రాసింది.
యువతి ఇంటికి వెళ్లటానికి ప్రయత్నించగా శశికృష్ణ ఆమె చేయి పట్టుకుని లాగి కత్తితో విచక్షణారహితంగా పొడిచి పారిపోయాడు.
దీని సీసీ ఫుటేజీ పోలీసులకు లభ్యమైంది. నిందితుడిని అతడి సొంతూరు ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సమయంలో నిందితుడు చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా అడ్డుకుని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారని కథనంలో రాశారు.
యువతీయువకుల మధ్య వాగ్వాదానికి కారణాలేమిటి? ఎన్నాళ్లనుంచి పరిచయముందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
శశికృష్ణ తండ్రి గురవయ్య ముట్లూరులో, తల్లి నరసరావుపేటలో నివసిస్తున్నారు. శశికృష్ణ ఇద్దరి వద్దకు వెళుతూ ఉంటాడని పోలీసులు నిర్ధారించుకున్నారు.
నిందితుడు ఈ గ్రామాల్లో ఎవరితో సరిగా మాట్లాడడని, ముభావంగా ఉంటాడని.. ఎవరైనా ఏదైనా అంటే గొడవపడతాడని చెబుతున్నారని పత్రిక రాసింది.
గురవయ్యతో పాటు యువకుడి స్నేహితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఈనాడు వివరించింది.
No comments:
Post a Comment