Thursday, May 16, 2024

జిల్లా లో గుర్తింపు లేని ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

పత్రిక ప్రకటన
తేదీ:-16-05-2024

- జిల్లా లో గుర్తింపు లేని ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.

- ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలలో బుక్స్, యూనిఫామ్స్, టైం, బెల్టు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

- గుర్తింపు లేకుండా ఓపెన్ పర్మిషన్తో  సిబిఎస్సి పేరు చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ.... మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు  గుర్తింపు లేకుండా నడుపుతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. గుర్తింపు లేకుండా ఓపెన్ పర్మిషన్తో సీబీఎస్సీ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్య అధికారులకు కోరుతున్నాము. విద్యాహక్కు చట్టం ప్రకారం ఫీజులు వసులు చేయవలసింది పోయి ప్రవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలే తనకంటూ ఒక చట్టం ఉన్నట్టుగా ఏర్పాటు చేసుకొని వాళ్లకు నచ్చిన విధంగా ఫీజు వసూలు చేస్తూ విద్యార్థినీ,విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర్నుండి దోపిడీ చేస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. మేడ్చల్ జిల్లాలో ఎల్కేజీ విద్యార్థికి రెండు లక్షల నుండి నాలుగు లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్టు అనేక పత్రికలలో వచ్చింది. కానీ విద్యాధికారులు ఏ విద్యాసంస్థల్లో ఎన్ని ఫీజులు ఉండాలని బహిర్గతంగా ప్రకటించకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా విద్యాధికారులే ప్రైవేట్ కార్పొరేటు విద్యాసంస్థల యజమానులకు నోటీస్ బోర్డ్ లో వాళ్ల ఫీజులని పెట్టించే విధంగా ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుందని కోరుతున్నాము. కూరగాయల బేరం ఆడినట్టుగా ప్రైవేట్ కార్పొరేటు పాఠశాల యజమాన్యం ఫీజుల బ్యారాల ఆడుతున్నారు. అకాడమీకేర్ ప్రారంభం కాకముందే అడ్మిషన్ తీసుకుంటే ఒక విధంగా ఫీజు ఉంటుంది. ప్రారంభం అయిన తర్వాత అడ్మిషన్ తీసుకుంటే మరోలాగా ఫీజు వసూలు చేసే దుస్థితి విద్యాసంస్థల్లో రావడం సిగ్గుచేటు అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను అరికట్టే విధంగా విద్యాధికారులు చర్యలు ఉంటే బాగుంటుందని హెచ్చరించారు. ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలలో బుక్స్, యూనిఫామ్స్, టైం, బెల్ట్, అమ్ముతున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని పాఠశాలలో బుక్స్ యూనిఫామ్స్ టైం బెల్టు అమ్మడం నేరమైనప్పటి కూడా పాఠశాల యజమానులు అమ్ముతూ దోపిడీ చేస్తున్న చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న విద్యాధికారులు,బుక్స్ యూనిఫామ్స్ టైం బెల్టు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పేద,బడుగు బలహీన విద్యార్థిని విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా పోరాటం రూప పొందిస్తామని హెచ్చరించారు.


ధన్యవాదములతో.....

రాథోడ్ సంతోష్
ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
9618604620

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్?

తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా TS స్థానంలో TG అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక నుండి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌లు TS స్థానంలో TG పేరుతో ఉండే విధంగా రిజిస్ట్రేషన్లు చేయాలని పేర్కొన్నారు.

నోటిఫికేషన్ ప్రకారం, సీరియల్ నంబర్ 29-A, TS కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం వాహనాలపై రిజిస్ట్రేషన్ గుర్తు TGగా సవరించి గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Courtesy / Source by :
https://twitter.com/DigitalMediaTS/status/1791086012594024921?t=FYBi8seJZRDzZf6fxQTh1Q&s=19

Wednesday, May 15, 2024

Stand against Corruption

https://x.com/TelanganaACB/status/1790584064468189556?t=lDoY1sUF6QU4tQrnA0KGJA&s=08                                                                                _*Corruption: a disease that cripples societies. Stand against it, stand for justice.*_

*Report on #Dial1064*

*#SayNoToCorruption *#AntiCorruptionBureau *#TelanganaACB*                                                                 
   *****----*****----*****                                      _*Prajasankalpam ✊*_                                                                                                          *#IndianConstitution* 
*#SupremeCourtIND* *#TelanganaHighCourt* 
*#telangana #Corruption* 
*#EncroachmentOfLakes* 
*#IllegalConstructions*
*@TS_bPASS?*
*@TSMAUDOnline?*
*@CommissionrGHMC @GHMCOnline @HMDA_Gov @LubnaSarwath @RaviVattem @UNTGAPS @Narhariyarabotu @RamsGTRK*                                                                               
*Bplkm🪶*

Monday, May 13, 2024

Telangana recorded 64.93 percent voter turnout in Loksabha polls.

Telangana recorded 64.93 percent voter turnout in Loksabha polls. 

It is better than 2019 voter turnout of 62.77 per cent.

Urban constituencies Hyderabad, Secunderabad, Malkajgiri and Chevella recorded the lowest voter turnout as usual. The turnout in these constituencies increased slightly when compared to 2019 polls.

Bhongir, Khammam and Medak recorded the highest. 2024 Loksabha Polls concluded yesterday evening.

However efforts of ECI to increase voter turnout didn’t yield results significantly.

See both tables first one is 2024 and the second 2019 data.

#TelanganaElections #TelanganaElections2024 #Hyderabad

Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1790197861227081861?t=Dx4WyJ854iMjMqZTW_CUbg&s=19

Saturday, May 11, 2024

కలవరపెడుతున్న బాలికల అదృశ్యం

కలవరపెడుతున్న బాలికల అదృశ్యం....

2019- 2021 దేశవ్యాప్తంగా 13.13 లక్షల మహిళలు, బాలికలు మిస్సింగ్.
18 సంవత్సరాల లోపు 2,51,430 మంది బాలికలు అదృశ్యమయ్యారని హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా జూలై 26న రాజ్యసభకు తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  ప్రకారం 2022 లో 90113 మంది బాలికలు 18 సంవత్సరాల లోపు వారు అదృశ్యం అయ్యారు అని, ఎక్కువగా 10 నుండి 14 సంవత్సరాల వయస్సు అమ్మాయిలు మిస్సింగ్. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ మిస్సింగ్ కేసులు.
మన తెలంగాణా 8 వ స్థానంలో ఉంది బాలికల మిస్సింగ్ విషయంలో. NCRB ప్రకారం 3443 మంది చిన్నారులు 2022 లో మిస్సింగ్ అయితే 391 మంది బాలికల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
ప్రతి రోజూ పది మంది పిల్లలు తిప్పి పోతున్నారు. 
మొదటి 24 గంటలు చాలా కీలకమైనవి.
పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా అలెర్ట్ గా ఉండాలి ఎక్కడైనా రద్ది ప్రాంతానికి వెళితే, వారి ముందే చెప్పాలి పొరపాటున క్రౌడ్ లో మిస్ అయితే వెంటనే చూసుకోవాలి,ఫోన్ చేయాలి అని. పేరెంట్స్ వెంటనే అలెర్ట్ అయి పోలీసు కంప్లైంట్ ఇవ్వాలి. బంధువుల ఇంట్లో,స్నేహితుల ఇళ్లకు వెళ్లి లేదా ఫోన్ చేసి తెలుసు కోవడం చేయాలి. 100/1098 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి, పిల్లల ఫోటో,వేసుకున్న డ్రెస్ వివరాలు ఇవ్వండి, సోషల్ మీడియాలో  షేర్ చేస్తే కూడా ఉపయోగపడుతుంది ఆచూకీ కోసం. ఆలస్యం చేయకుండా అలర్ట్ కావాలి. ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టం. అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెందడం వల్ల ఇంటి నుంచి వెళ్లిపోతారు,టీనేజ్ అమ్మాయిలు ఎవరైనా ఇబ్బందికి గురి చేస్తే తట్టుకోలేక, పరీక్షలు ఫెయిల్ అయిన,సరిగా రాయక పోయిన, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తిట్టిన  ఇంటి నుంచి వెళ్లిపోతారు. ఇక కిడ్నాప్ కు గురి అయిన పిల్లలు మిస్ అవుతారు. ఎవరైనా అనుమాన స్పదంగా తిరిగుతూ కనిపిస్తే అలర్ట్ కావాలి. కిడ్నాప్ కు ప్రయత్నిస్తే పిల్లలు అరవాలి ,కేకలు వేయాలి. ముఖ్యంగా అమ్మాయిలను మానసికంగా, శారీరకంగా చాలా ధైర్యంగా ఉండేలా చూసుకోవాలి పేరెంట్స్, గార్డియన్స్. ప్రభుత్వం త్వరితగతిన పిల్లలను ట్రేస్ చేయడానికి సరియైన టెక్నాలజీ డెవలప్ చేసి,వీలైనంత వరకు పిల్లలను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించాలి అని బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి.

అనూరాధ రావు 
అధ్యక్షురాలు 
బాలల హక్కుల సంఘం

Manifesto from Hyderabad MP candidate for Hyderabad MP Dr Lubna Sarwath contesting candidate LokSabha 2024 Vidyarthula Rajakiya Party



https://drive.google.com/file/d/1qtfJLCJmYPuzx94mvMUHd7jqzCYdZVrl/view?usp=drivesdk 
Hyderabad  FOR PRESS & PEOPLE  Dear Voters from Hyderabad MP Constituency and All, Assalamu Alaikum/May Peace be upon you  PFA Manifesto from Hyderabad MP candidate for Lok Sabha on the important issues both local and global as a priority. The manifesto will be ongoing one powered by people.  best Dr Lubna Sarwath contesting candidate for Hyderabad MP LokSabha 2024 Vidyarthula Rajakiya Party

Tuesday, May 7, 2024

రేవంత్‌ సర్కార్‌కు ఈసీ షాక్‌.. రైతు భరోసాకు బ్రేక్*

*రేవంత్‌ సర్కార్‌కు ఈసీ షాక్‌.. రైతు భరోసాకు బ్రేక్* 

సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈసీ. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఈనెల 9లోపు రైతు భ‌రోసా విడుదల చేస్తామని రేవంత్ చెప్పడాన్ని ఈసీ తప్పు పట్టింది. 

 రేవంత్‌ సర్కార్‌కు షాకిచ్చింది ఎన్నికల కమిషన్‌. రైతు భరోసా నిధుల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. ఎన్‌. వేణు కుమార్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈసీ స్పందించింది.

 ఇక సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈసీ. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఈనెల 9లోపు రైతు భ‌రోసా విడుదల చేస్తామని రేవంత్ చెప్పడాన్ని ఈసీ తప్పు పట్టింది. రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈనెల 9లోపు రైతు భరోసా పంపిణీ పూర్తి చేస్తే.. కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని ఛాలెంజ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇప్పటివరకూ 5 ఎకరాల లోపు రైతులకు రైతుభరోసా నిధులు పంపిణీ పూర్తి చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది. తాజాగా 5 ఎకరాల పైబడి భూమి ఉన్న రైతుల కోసం సోమవారం రూ.2 వేల కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసినట్లు సమాచారం. అయితే తాజాగా రైతుభరోసా పంపిణీపై ఈసీ ఆంక్షలు విధించింది.

Courtesy / Source by : ప్రజల పక్షం 

surveys of the political parties in Telangana

Constituency-wise contest according to internal surveys of the political parties in Telangana

Congress Vs BJP:

Adilabad

Nizamabad

Zahirabad

Chevella

Mahbubnagar

Malkajgiri

Bhongir

Congress Vs BRS:

Mahabubabad

Triangular Contest: 

Peddapalli

Karimnagar

Warangal

Medak 

Secunderabad

Nagarkurnool

Congress clear edge: 

Khammam

Nalgonda

MIM clear edge:

Hyderabad

Pic credits: TNIE

#Telangana #LokSabhaElections2024   

Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1787817619497660653?t=W56lepYo9pGjcdwRcuHRXA&s=19

Sunday, May 5, 2024

#తెలుగు వారు గర్వించ దగ్గ #Scientist

ఈ..
#photo లో
@rashtrapatibhvn నుంచి
పురస్కారం అందుకున్న వ్యక్తీ
@ram_sand.

అణు భూ భౌతిక శాస్త్రవేత్త.
అర్దం అయ్యేలా చేప్పాలా?!
#భూమి పై ఉన్న
మొక్కల్ని
చెట్లను చూసి
భూమి లోన
ఏ యే
ఖ"నిజం"
ఉందో చెప్తారు.
#తెలుగు వారు గర్వించ దగ్గ #Scientist 

Source :

https://twitter.com/RMaachana/status/1786775422988140897?t=C7fVYL0Af6oITwV7QJGChA&s=19

Saturday, May 4, 2024

గుడిపాటి వెంకట చలం వర్థంతి నేడు.

గుడిపాటి వెంకట చలం వర్థంతి నేడు.

చలం మాటలు కొన్ని:

ప్రేమను అనుభవించగలమే కానీ...
చెప్పగలమా... రాయగలమా... ఎందుకు రాయడం...
ఈ వెర్రి మాటలు రాసి ప్రయోజనమేముంది?

నువ్వు అనుభవిస్తున్న విరహం...
నువ్వు జ్ఞాపకం తెచ్చుకున్న మాధుర్యం...
ఏమాత్రమన్నా తెలియజెయ్యగలవా ఈ అక్షరాలతో...

మనం కలిసి ఉన్నంత మాత్రాన నా హృదయంలో కలిగిన సౌందర్య భావం, ఏమి చేసినా తృప్తి పడని ప్రేమాజ్ఞిని నీకు తెలియజెయ్యగలనా...

నిన్ను తలచుకున్నంత మాత్రాన నా హృదయంలో కలిగే ఆరాధన, బాధని, శాంతిని ఈ మాటలతో, ఈ వంకర మాటలతో ఎలా చెప్పగలనూ...

చలం తన చావు గుంరించి ఇలా అన్నారట "నేను చనిపోయానని నా శవం ముందు నిలబడి ఎవరూ ఏడవద్దు. ఎవరైనా ఏడ్చారో జాగ్రత్త పాడెమీద నుండి లేచి చితక తంతాను" అని.

#team_chaduvu
#team_anvikshiki 

Courtesy / Source by:
https://twitter.com/chaduvuapp/status/1786666419347759217?t=0SG-ZR8omOWBdsdKvVRUPA&s=19

Friday, May 3, 2024

Big Development in Rohit Vemula case:

Big Development in Rohit Vemula case:

Cyberabad police have closed the case pertaining to the death of Rohith Vemula at Hyderabad Central University.

Gachibowli police stated that due to lack of evidence, the case has been closed. A final report has been filed in court. Former HCU Vice-Chancellor Appa Rao has been exonerated in the case.

Rohith Vemula killed himself in his hostel room on January 17, 2016.

The death of Rohit Vemula in 2016 sparked a nationwide protest demanding protection for students from marginal groups in India’s academic space. Calling it an “institutional murder”, Bahujan groups demanded action against the university administration.

Prevention of Scheduled Caste and Scheduled Tribe (SC/ST) atrocities Act case was filed regarding the incident. The incident not only led to unrest in HCU but also in universities across the country.

#hyderabad #RohithVemula 

Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1786348597404991858?t=5c8lukLO6e1WNWeIEAOc1w&s=19

Thursday, May 2, 2024

Advocate caught on camera kissing a woman on the terrace of High Court building booked by SHE Teams

Advocate caught on camera kissing a woman on the terrace of High Court building booked by SHE Teams

The SHE Teams Hyderabad booked the case after receiving a complaint against the advocate and former government pleader, A. Sanjay Kumar. The complaint alleges that Sanjay Kumar has been misbehaving with the complainant within court premises, forcing her to provide sexual favors, stalking her on a daily basis, and blackmailing her using his influence. 

In February he was caught on camera kissing a woman and the vidoe went viral then.

Upon receiving the complaint, the SHE Teams immediately launched an investigation into the allegations.

An FIR has been Registered againt sanjay kumar under 354,354D,506 IPC at  charminar, which is investigating the allegations and working to gather evidence and  recording witness statements. 

#Hyderabad #Sheteams 

Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1786041802820305054?t=HqQAnDgKCFlytdCc-K9twQ&s=19

*తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC)**ప్రెస్ నోట్ : 02-05-2024 ,బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్,హైదరాబాద్*

*తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC)*
*ప్రెస్ నోట్ : 02-05-2024 ,బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్,హైదరాబాద్* 
----------------------------------------------
*TPJAC పది రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభం*

*"గత పదేళ్లుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేసిన నిరంకుశ, ప్రజావ్యతిరేక పాలనను, అవినీతిని ప్రజలు ప్రశ్నించండి"- 

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు TPJAC రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపు*

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) ఆధ్వర్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 2 నుండీ మే 11 వరకూ రాష్ట్ర వ్యాపితంగా నిర్వహించనున్న 10 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం 11  గంటలకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రారంభించడం జరిగినది. రాష్ట్ర కన్వీనర్ ప్రొ. హరగోపాల్ మరియు కొ-కన్వీనర్లతో బాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. 

రాష్ట్ర కన్వీనర్ ప్రొ. హరగోపాల్ సమావేశంలో మాట్లాడుతూ  “ప్రజల నిజమైన ఆకాంక్షలను ఎన్నికలలో ప్రచారం లోకి తీసుకు రాకుండా, బీజేపీ నాయకులు, ముఖ్యంగా దేశ ప్రధాని మోడీ  ముస్లిం లు, మంగళ సూత్రాలు లాంటి అంశాలను ప్రస్తావిస్తూ, చర్చను పక్కదారి పట్టిస్తున్నారని” అని విమర్శించారు. “గత పదేళ్ళలో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దివాళా  తీసిందని, నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు నిత్య జీవిత సమస్యలతో పోరాడుతున్నారని, కానీ వీటిని పట్టించుకోకుండా, మతం, దేవుడు, ముస్లిం ప్రజలపై విద్వేషం పునాదిగా మోడీ ప్రచారం సాగిస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని” ఆయన  పిలుపు ఇచ్చారు. 

సమావేశంలో ప్రొఫెసర్ రమా మేల్కొటె ప్రసంగిస్తూ, “ బీజేపీ నాయకులు నైతిక విలువలు కూడా విస్మరిస్తున్నారని, బెంగళూర్ లోబీజేపీ భాగస్వామ్య పార్టీ నాయకుడు ఎం. పి  స్త్రీలపై జరిపిన  అత్యాచారాలు జుగుప్సాకరంగా ఉన్నాయనీ, అటువాటి వ్యక్తికి మోడీ ప్రచారం చేశాడని “ విమర్శించారు. “ తెలంగాణ ప్రజలు మత సామరస్యంతో శతాబ్ధాల పాటు జీవించారని , ఇప్పడు ఆ సామరస్య వాతావరణాన్ని బీజేపీ నాయకులు విద్వేషంతో నింపుతున్నారనీ , ప్రజలు వాళ్ళ  మాయలో పడకుండా ఉండాలని” ఆమె కోరారు. 

సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ రామ్ ప్రసంగిస్తూ : మోడీ ఆర్ధిక విధానాల వల్ల, కోట్లాది మంది బిలియనీర్లు గా మారారని ,దేశ సంపదను దోచుకున్నారని, మిగిలిన ప్రజలు పెదరికంలో కూరుకుపోయారని, దేశంలో ఆర్ధిక వ్యత్యాసాలు బాగా పెరిగిపోయాయని విమర్శించారు. ఏ సమయంలో లోను బీజేపీ ని కేంద్రంలో మళ్ళీ అధికారంలో రాకుండా, ప్రజలు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపు ఇచ్చారు. 

సమావేశంలో భారత్ జోడొ అభియాన్ జాతీయ నాయకులు కవిత కురుగంటి మాట్లాడుతూ, దేశమంతా ముఖ్యంగా ఉత్తర బారత దేశంలో బీజేపీ వ్యతిరేక గాలులు వీస్తున్నాయని, అందుకే మోడీ మత విధ్వేషాలు రెచ్చగొట్టడానికి పూనుకుంటున్నాడని అన్నారు. దక్షిణాదిలో బీజేపీకి ఏ మాత్రం స్థానం లేకుండా చేయాలని ఆమె కోరారు. 

ఈ  ప్రచార కార్యక్రమం రాబోయే పది రోజులు రాష్ట్ర మంతా జరుగుతుందని, జిల్లాల వారీ స్థానిక యాత్రలు, ర్యాలీలు, సభలు, పత్రికా విలేఖరుల సమావేశాల రూపంలోనూ, కరపత్రాలు, పోస్టర్ల ప్రచారం రూపంలోనూ, వాస్తవ పరిస్థితులను, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించవలసిన అవసరాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్తామని TPJAC కో కన్వీనర్లు    కన్నెగంటి రవి, రవి చందర్, మైసా శ్రీనివాస్ వివరించారు. మే 3, 4 తేదీలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యాత్ర జరుగుతుందని, మిగిలిన అన్ని జిల్లాలలో స్థానిక యాత్రలు జరుగుతాయని, అన్ని మండల కేంద్రాలలో సమావేశాలు ఉంటాయని   ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

ఇంకా ఈ  సమావేశంలో ప్రముఖ విద్యా వేత్తలు డాక్టర్ వనమాల, ప్రొఫెసర్ సుకుమార్ , అనిశెట్టి శంకర్, మహిళా రైతుల హక్కుల వేదిక నాయకులు  డాక్టర్ రుక్మిణీ రావు, విరసం నాయకులు రాము, TPJAC కో కన్వీనర్  బన్నూరు జ్యోతి , విస్సా కిరణ్ కుమార్, కరుణాకర్ దేశాయి,  TPJAC నగర నాయకులు ముత్తయ్య , రామగిరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 

                                                                         అభినందనలతో,                                                   కన్నెగంటి రవి , 
 కో కన్వీనర్ , ఫోన్: 9912928422

Name trouble for Konda

Name trouble for Konda

Duplicate Names Stir Ballot Confusion in several other parliament constituencies in Telangana.

Konda Vishweshwar Reddy, the BJP candidate for the Chevella Loksabha constituency, approached the High Court alleging that the Election Commission of Inda failed to address his concern about another candidate with the same name, causing voter confusion. The other Konda Vishveshwar Reddy, is listed as an independent candidate on the ballot paper. The BJP candidate asked EC to separate their names by at least ten other candidates on the ballot to avoid mix-ups. However, the ECI stated that current rules do not allow for such changes at this stage. The HC has deferred the decision back to the EC.
Similar issues are seen in other constituencies. In Nizamabad, Congress's Thatiparthi Jeevan Reddy and an independent Tutukuru Jeevan Reddy will contest. Nagarkurnool has Congress's Mallu Ravi and the Alliance of Democratic Reforms Party's Amboju Ravi. Despite different party symbols, the presence of candidates with identical names could lead to voter confusion during the elections.

Other Constituencies with similar-sounding names

1) Bhongir
*Kyama Mallesh BRS
Udari Mallesh Independent In fray
*Dr Boora Narasiah Goud BJP
One Burra Narasiah filed a nomination as independent but got rejected by ECI
*Chamala Kiran Kumar Reddy Congress
Amireddy Kiran Reddy independent in fray

2) Karimnagar
*Velchela Rajender Rao Congress
Pothuri Rajender Independent in fray

3) Khammam
*Nama Nageswar Rao BRS
Nageswar Rao Lakavath All India national Raksha sena in fray
Kasimella Nageswar Rao Independent in fray
Katukojwala Nageswar Rao Independent in fray

4) Malkajgiri
Eatala Rajender BJP
Budhi Rajender Kumar independent rejected by ECI

5) Nagarkurnool
Dr Mallu Ravi Congress
Amboju Ravi Alliance of democratic reforms party in fray

6) Nalgonda
Kancharla Krishna Reddy BRS
Lingam Krishna independent in fray

7) Nizamabad
Thatiparthi Jeevan Reddy Congress
Thutukuri Jeevan Reddy independent in fray

8) Peddapalle
*Eshwar Koppula BRS
Durge Eshwar Rejected
*Srinivas Gomase BJP
Srinivas Dagam Independent in fray

9)Zaheerabad
Suresh Kumar Shektar Congress
Suresh Vital Kumar Shetkar indpenent rejected
#Telangana #Election2024

Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1786022734146785403?t=uvuvh2mhXn-tRnQgClzqyw&s=19

Wednesday, May 1, 2024

Advisory for protection against #HeatWave

Advisory for protection against #HeatWave

In view of @Indiametdept's heat wave alert (yellow) for #Telangana, with temperatures soaring to a maximum of 44 Degrees Celsius, here are some Do’s and Don’ts for the citizens of Telangana.

Courtesy / Source by :

https://twitter.com/DigitalMediaTS/status/1785636096753238495?t=emE_Hp_wKyiW7FD_zujL0g&s=19

Important update on Union Home Minister Amit Shah’s Doctored Video case:

Important update on Union Home Minister  Amit Shah’s Doctored Video case:

Telangana Chief Minister Revanth Reddy says he doesn’t own the @INCTelangana handle and requests four weeks to respond, citing election responsibilities.

Revanth Reddy’s Lawyer Sowmya Gupta in reply to Delhi Police on behalf of Revanth Reddy said that The @INCTelangana X handle is not maintained by Revanth Reddy. He only maintains two X handles i.e, @revanth_anumula and @TelanganaCMO.

In another reply filed by Advocate M Ramachandra Reddy, Revanth Reddy asked for 4 weeks time to reply citing his election-related responsibilities.

Earlier Revanth was asked to present for investigation at the Intelligence Fusion and Strategic Operations (IFSO) office in New Delhi on May 1(Today) and to provide gadgets through which Revanth Reddy allegedly created/uploaded/tweeted the fake video of the Union Home Minister Amit Shah.

The other Congress leaders who were served notices (Shiva Kumar Ambala, Asma Tasleem, Satish Manne, and Naveen Pettem) sought 15 days to Reply.

Speaking at a public meeting today, Revanth Reddy said, "I was asked to present myself at the Delhi Police station because I questioned why the constitution is being changed."

The doctored video posted on the Telangana Congress official handle show Union Home Minister
@AmitShah advocating for the abolition of reservation quotas for Scheduled Castes (SCs), Scheduled Tribes (STs), and Other Backward Classes (OBCs).

In the original video, from his speech on April 23, 2023, at Chevella, Amit Shah was seen saying, "If the BJP is voted to power, then the unconstitutional Muslim reservation will be ended in the state. This right belongs to Telangana's SC, ST, and OBC communities, and they will get this right. We will end Muslim reservations."

#AmitShah #RevanthReddy #Telangana 

Courtesy / Source by :

https://twitter.com/sudhakarudumula/status/1785609672705126590?t=8rye1QzJYkBuZcOonuvIyQ&s=19