Wednesday, August 25, 2021

థర్డ్ వేవ్ ముంగిట స్కూల్స్ భద్రమేనా ?

హైదరాబాద్ : 25/08/2021

థర్డ్ వేవ్ ముంగిట స్కూల్స్ భద్రమేనా ?

MyindMedia ట్విట్టర్ సౌజన్యంతో 
కరోనా థర్డ్‌వేవ్‌ ముందుకు వచ్చేశాం.. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాలు అత్యంత కీలకం.. కేసులు లక్షల్లోనే ఉంటాయని, డెల్టా వేరియంట్‌తో పిల్లలకు ముప్పు ఎక్కువ అని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి..
సరిగ్గా ఇలాంటి సమయంలోనే స్కూళ్లు తెరిచేశాయి తెలుగు రాష్ట్రాలు. ఏపీలో ఇప్పటికే పాఠశాలలు నడుస్తుండగా, సెప్టెంబర్‌ 1 నుంచి తెలంగాణలో పునఃప్రారంభిస్తున్నారు.
వ్యాక్సినేషన్‌ ఇంకా పిల్లల వరకూ రాలేదు.. కానీ సరిగ్గా ముప్పుముందే ఏవో కొంపలంటుకుంటున్నట్లు స్కూల్స్‌ తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త కేసులు కొనసాగుతున్న అండర్‌ కంట్రోల్‌ అని చెబుతున్నారు.
ఇంతకీ మన స్కూల్స్‌ ఎంత వరకూ భద్రమో ఒకసారి ఆలోచించండి.. అసలే ఇరుకు గదులు.. సోషల్‌ డిస్టెన్స్‌ సాధ్యమేనా? పెద్దలే మాస్కులు సరిగ్గా పెట్టుకోవవడం లేదు.. చిన్నారులు జాగ్రత్తగా మాస్కులు ధరిస్తారని గ్యారంటీ ఇవ్వగలమా?
ప్రతి రోజూ స్కూలుకు వచ్చిపోయే విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇళ్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయో? ఎవరి ఇళ్లలో ఎలాంటి జబ్బులు ఉన్నాయో ఎవరికి తెలుసు?
పిల్లలను స్కూలుకు తెచ్చే ఆటో/వ్యాన్‌ డ్రైవర్లకు ఇదొక్కటే ఆదాయం కాదు.. వారిని స్కూళ్లలో వదిలి, సాయంకాలం తిరిగి తీసుకెళ్లేలోపు ఇతర ప్రయాణీకులను గమ్యాలకు చేరవేస్తుంటారు.. ఆ ప్రయాణీకుల్లో ఎవడికి వైరస్‌ ఉందో తెలిసేది ఎలా?
హాస్టల్‌ విద్యార్థులకు కూడా భద్రత అనుమానమే.. నిత్యం వచ్చిపోయే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందితో కూడా ముప్పు పొంచి ఉంటుంది.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా పిల్లల చదువులకు ఆటంకం కలిగి విద్యారంగం సంక్షోభంలో పడిందనేది కాదనలేని సత్యం.. కానీ సరిగ్గా థర్డ్‌వేవ్‌ ముప్పు ముందు స్కూల్స్‌ తెరచి వారిని ప్రమాదం ముందు నిల్పడం మూర్ఖత్వమే అవుతుంది.. పైనా పులిమీద పుట్రలా ఆన్‌లైన్‌ క్లాసులు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది.. కాస్త ప్రాక్టికల్‌గా ఆలోచించలేరా?
రాబోయే రెండు నెలలు కలిసికట్టుగా థర్డ్‌వేవ్‌ ముప్పును ఎదుర్కొని మహమ్మారిని తరిమి కొట్టడం మీదే అందరి శక్తి యుక్తులు, వనరులను ఉపయోగించాలి.. ప్రమాదం మీద ప్రమాదం కొని తెచ్చుకోవడం ఏమాత్రం సమంజసం కాదు.. అందరం భద్రంగా ఉంటేనే ఏదైనా..

No comments:

Post a Comment