Thursday, February 29, 2024

సీఎం రేవంత్ రెడ్డికి... KTR సవాల్....!

*సీఎం రేవంత్ రెడ్డికి... KTR సవాల్....!*

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు తాజాగా సావాల్ విసిరారు.మల్కాజ్ గిరి పార్లమెంట్ పోటీ చేద్దాం.. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తా.. నువ్వు కోడంగల్ ఎమ్మెల్యే పదవీకి.. తెలంగాణ ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేసి పోటీ చేయాలి అని సవాల్ విసిరారు. మరోవైపు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసరడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించాడు.

Courtesy / Source by :
*V.S. జీవన్*

Wednesday, February 28, 2024

HMDA లో విజిలెన్స్ సోదాలు....!

*HMDA లో విజిలెన్స్ సోదాలు....!*

హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఆ విభాగం డైరెక్టర్లే లక్ష్యంగా విజిలెన్స్‌ సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నాం దాదాపు 50 మంది స్పెషల్‌ టీమ్‌తో అమీర్‌పేట్‌ మైత్రీవనం నాలుగో అంతస్తులో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.గత ప్రభుత్వంలో.. తొమ్మిదేళ్లపాటు అనుమతులు జారీ చేసిన ఫైల్స్‌పై విజిలెన్స్‌ ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో వాటిని సీజ్‌ సైతం చేసినట్లు తెలుస్తోంది.

హెచ్‌ఎండీఏ ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్‌, విద్యాధర్‌ గతంలో అనుమతించిన ఫైల్స్‌పై విజిలెన్స్‌ విచారణ చేపట్టే అవకాశం ఉంది. అరెస్ట్‌ వారెంట్‌తో అధికారులు అక్కడికి వెళ్లడంతో.. ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఆన్‌లైన్‌ డేటా నుంచి చెరువులు మాయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. నాలుగు రోజుల క్రితమే దాడులు జరుగుతాయని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులను ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3500 చెరువుల డాటా ఆన్‌లైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చెరువుల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. అక్రమ లేఅవుట్, బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, హెచ్‌ఎండీఏలో కొన్ని రోజుల క్రితం ఏసీబీ కూడా దాడులు నిర్వహించింది. అమీర్‌పేట్‌లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లో ఉన్న హెచ్‌ఎండీఏ కార్యాలయంలో వివిధ జోన్‌లకు చెందిన ఫైళ్లను తెప్పించుకొని తనిఖీ చేశారు. ఫైళ్లను పరిశీలించే క్రమంలో హెచ్‌ఎండీఏలోని ఘట్‌కేసర్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి జోన్‌లకు చెందిన ప్లానింగ్‌ అధికారులు,ఏపీఓలను తమ వద్దకు రప్పించుకొని పలు అనుమతులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు పని చేసిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ హయాంలో ఇచ్చిన హైరైజ్‌ భవనాల అనుమతులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు.

*V.S.జీవన్*

Tuesday, February 27, 2024

దళితులను మోసం చేసిన ప్రభుత్వఅధికారులు

https://x.com/Praja_Snklpm/status/1762526114327810504?t=GL5NnZiTubEb1dTtv-o7uA&s=08                                                                                
_*#తెలంగాణ సీఎం @TelanganaCMO సారు 29 రోజులుగా #ముషీరాబాద్ స్వామి వివేకానంద బస్తీ మహిళలు #అంబేద్కర్ సారు ఫోటో ముందు టెంట్ కింద రాత్రనక పగలనక దీక్ష చేస్తున్నారు.వీరికి న్యాయం చేయాలి అని 'ప్రజాసంకల్పం' విజ్ఞప్తి చేస్తుంది.*_

_*అసెంబ్లీ లో #ఆదిలాబాద్ బీజేపీ MLA పాయల్ శంకర్ గారు #ముషీరాబాద్ స్వామి వివేకానంద బస్తీ వాసుల సమస్యను ప్రస్థావించారు కూడా.*_

_*సీఎం సారు ఈ బాధితుల హక్కులకు భంగం కలిగించిన #ghmc, #రెవిన్యూ, #పోలీస్ అధికారులమీద విచారణకు ఆదేశాలు ఇవ్వండి.*_

*#TelanganaHighCourt*
*#HumanRights*
*#PayalShankarBJPMLA*

*@Bhatti_Mallu @DamodarCilarapu*    _*#అంబేద్కర్ సారు #దళితసోదరసోదరీమణుల కన్నీళ్లు చూడండి... Bplkm✍️*_

*@RSPraveenSwaero @bsp_ts* *@rayadasm* *@Murali_IASretd*

*#VsheshadriIAS* *@TelanganaCS* *@TelanganaDGP*
*@Collector_HYD @GHMCOnline @CommissionrGHMC @GadwalvijayaTRS @DC_Musheerabad @shomusheerabad*                                           
 *@BplplH @PushpaFashions*

Monday, February 26, 2024

జర్నలిస్ట్ ల కోసం పని చేయని వారికి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వారికి పెద్ద పీట!

గౌ.శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 
నమస్కారం...

విషయం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పాత వాసనలు, జర్నలిస్ట్ సంఘం అడ్డుపెట్టుకొని, జర్నలిస్ట్ ల కోసం పని చేయని వారికి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వారికి పెద్ద పీట వేస్తూ పదవులు కట్టబెట్టే విషయం.

మాన్యశ్రీ.

తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులకు వత్తాసు పలుకుతూ ఉలుకు పలుకు లేకుండా జర్నలిస్ట్ లకు, వారి కుటుంబాలకు చేయూత నివ్వకుండా ఏనాడూ కెసిఆర్ ను, ఆయన ప్రభుత్వం చర్యలు ఎండగట్టని వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి IJU గారికి పదవి అప్పగించారు. 9 సంవత్సరాలనుండి జర్నలిస్ట్ లు సచివాలయం, ప్రగతి భవన్ మొఖం చూడలేని స్థితి, జర్నలిస్ట్ లపై దాడులు జరిగితే ఏనాడు మాట్లాడటం చేతకాని వారు, ఎందరో జర్నలిస్ట్ లకు వేతనాలు లేవు మీడియా సంస్థలు మూత పడుతున్న పట్టింపు లేని సంఘం వారు ఎప్పుడు కొత్త రంగు వేసుకొని మీ వద్దకు రాగానే పదవులు ఇస్తున్నారు. సిపిఐ పార్టీ అనుబంధ సంఘం అయినంత మాత్రాన వారికి పదవులు ఇస్తారా... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎందరో జర్నలిస్ట్ లు తమ ఉద్యోగాలు, ప్రాణాలు లెక్క చేయకుండా జైలు పాలై ఉన్న వారేందరో ఉన్నప్పటికి ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి గారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేత, జర్నలిస్ట్ సంఘం పేరుతో గత కొంత కాలంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న కేవలం ఓ... ముగ్గురు నేతలు మాత్రమే ఈ రెండు రాష్ట్రాల్లో పదవులు పొందుతూన్నారు. 
జర్నలిస్ట్ జీవితాలు, వారి మనోభావాలు, ఆత్మ గౌరవం దెబ్బ తింటున్న ఆయన వారు ఎప్పుడు, ఏనాడు పట్టించుకోలేదు. కేవలం పెద్ద సంఘం అన్న గొప్ప తప్పా... వీరు చేసింది శూన్యం.. వీరికి అధికారం కోసం అందరు జర్నలిస్ట్ లు కావాలి కానీ వారి పదవులు పొందిన తరువాత జర్నలిస్ట్ లు నాన్ జర్నలిస్ట్ లని విడదీయటం ఆయా సంఘాల పని, కరోనా విపత్తులో ఈయన ఈ సంఘం చేసింది నిల్, జాతీయ జర్నలిస్ట్ నాయకుడని చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడింది శూన్యం... కనీసం రైల్వే పాసులు జర్నలిస్ట్ లకు ఇప్పించేందుకు ప్రయత్నం చేయని శ్రీనివాస్ రెడ్డి ఎలా జాతీయ నాయకులో అర్ధం కావడం లేదు. జాతీయ స్థాయిలో కొన్ని రాష్ట్రాలు కనీస వేతనాలు, విద్య, వైద్యం, పెన్షన్ సౌకర్యం ఇస్తున్నాయి మరి IJU శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ జర్నలిస్ట్ సమాజానికి చేసిన కృషి ఏమిటీ అని నేను ప్రశ్నిస్తున్నాను. హైదరాబాద్ లో ఇంత వరకు జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఈయన సహచర మిత్రులు చాలా కాలంగా పదవులు అనుభవించారే తప్ప హైదరాబాద్ లో జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఎందుకు ఇప్పించలేక పోయారు. శ్రీనివాస్ రెడ్డి గారి సహచర మరో సంఘం నేత 9 సంవత్సరాలనుండి అకాడమి చైర్మన్ గా ఉండి ఆయన జర్నలిస్ట్ సమాజానికి ఏమీ చేయకున్నా ఆయనతో జర్నలిస్ట్ ల కోసం పని చేయించింది లేదు. ఆ సంఘం ప్రభుత్వాన్ని  శ్రీనివాస్ రెడ్డి గారు 9 సంవత్సరాల నుండి మ్యాచ్ పిక్స్ అయ్యారు. బీసీ, ఎస్ సి, ఎస్టీ మైనార్టీ బిడ్డలే జర్నలిస్ట్ సమూహంలో ఎక్కువ ఉన్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గం కోసం శ్రీనివాస్ రెడ్డి గారికి పదవి ఇవ్వడం దారుణం అని నేను బావిస్తున్నాను.

సీనియర్ జర్నలిస్ట్ నాయకులు అనే క్వాలిపికేషన్ తప్ప ఆయనను ఏ క్రింద స్థాయి జర్నలిస్ట్ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శ్రీనివాస్ రెడ్డి గారి అర్హతను ప్రమోట్ చేసింది లేదు. మెజారిటీ ఉన్న బహుజన జర్నలిస్ట్ బిడ్డలు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుచడం లేదు. గడిచిన ఎన్నికల్లో స్వతాహగా అయన కొందరు ఎమ్మెల్యేలను గెలిపించింది లేదు. పార్టీ కోసం కష్టపడ్డది లేదు, విలువైన సలహాలు మీకు, పార్టీకి ఇచ్చింది లేదు. కనీసం గడిచిన ఎన్నికల్లో ఆయన సంఘం జిల్లా అధ్యక్షులు, నాయకులు కెసిఆర్ నాయకత్వంలో బి. ఆర్. ఎస్ తో కలిసి పనిచేశారు. మరి ప్రస్తుతం ప్రెస్ అకాడమి పదవిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఆ పదవిని శ్రీనివాస్ రెడ్డి గారికి కట్ట బెట్టడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ ల ఎన్నో సమస్యలు ఉన్నాయని మీకు తెలుసు వాటిని మీ ముందు గతంలో ఉంచాము. ప్రస్తుతం ఒక నూతన జర్నలిస్ట్ సంఘంగా మీకు నా అభ్యర్థన జర్నలిస్ట్ సమస్యలు అన్ని ప్రభుత్వ పరంగా మీతో చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాము. లేదంటే కొన్ని సమస్యలు చట్టపరమైన హక్కుల ద్వారా సాధిస్తాం అనే నమ్మకం ఉంది. ప్రస్తుత చైర్మన్ కేవలం అకాడమి వరకు వర్తించేలా చూడండి. ఈ సమస్యలు ప్రెస్ అకాడమీతో తీరవు కావున తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ ల సంక్షేమ బోర్డు వేసి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించండి. సంక్షేమ బోర్డులోనే ప్రెస్ అకాడమీని కొనసాగించండి. సత్తా గల జర్నలిస్ట్ సంఘాల నాయకత్వం సలహాల కోసం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికలు నిర్వహించండి. ఇందు కోసం తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ మీ నాయకత్వంలో పని చేస్తుంది.

ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి దృష్టికి జర్నలిస్ట్ సమస్యల గురించి మేము తీసుకెళ్ళాం వారు రెండు నెలలు సమయం ఇచ్చి రమ్మని అన్నారు. మీతో రెండు నెలలు ఆగి అన్ని విషయాలు చర్చ పెట్టాలని అనుకున్నాం. కాని ఈ లోపు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రెస్ అకాడమి చైర్మన్ పదవి ఇచ్చి పాత పాలేగాల్లనే కొత్తగా ఈ ప్రభుత్వం నియమించడం బాధ కలిగిస్తుంది. కావున ఈ విషయంలో పునరాలోచన చేయాలని మిమ్ములను కోరుతున్నాను.

ఇట్లు
మీ విశ్వాసపాత్రుడు 

*(డి. వై. గిరి)*
తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు
సెల్ : 7013667743

Sunday, February 25, 2024

#ధరణి దరఖాస్తులకు మోక్షం

#ధరణి దరఖాస్తులకు మోక్షం

✅ పెండింగ్ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం

✅ మార్చి మొదటి వారంలోనే తగిన ఏర్పాట్లు

✅ మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ

✅ ధరణి పోర్టల్ ఏజెన్సీపై సమగ్ర విచారణకు ఆదేశం

ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

ఈరోజు సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు శ్రీ ఎం. కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ రేమండ్ పీటర్, అడ్వకేట్ శ్రీ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ శ్రీ బి. మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీ శేషాద్రి, ప్రాజెక్టు డైరెక్టర్ సీఎంఆర్వో శ్రీ వి. లచ్చిరెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నారు.

2020లో అమల్లోకి వచ్చిన ఆర్వో ఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. గత ప్రభుత్వం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన రెవిన్యూ రికార్డుల నవీకరణతో నే కొత్త చిక్కులు వచ్చాయని చెప్పారు. ఆ రికార్డులనే ధరణికి ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని వివరించారు. దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవిన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది.

లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవిన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని చర్చ జరిగింది. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్ వో ఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు.

కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూముల రికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైతే చట్ట సవరణ చేయటం లేదా.. కొత్త చట్టం తీసుకు వచ్చే అంశాలను పరిశీలిద్దామని చెప్పారు. ధరణిలో ఇప్పుడున్న లోపాలు, సమస్యలన్నీ మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సూచించారు. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా దోషరహితమైన భూముల రికార్డులను నిర్వహించాలని సీఎం అన్నారు. అందుకు అవసరమైన పరిష్కారాలను కూడా అన్వేషించాలని కమిటీని కోరారు. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పుడున్న పెండింగ్ దరఖాస్తుల్లో సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 

ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్ఏ అధ్వర్యంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల భూముల రికార్డులు మొత్తం విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన భూముల డేటాను, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఏజెన్సీ దగ్గర ఉంచటాన్ని ముఖ్యమంత్రి తప్పు బట్టారు. భూముల రికార్డుల డేటాకు భద్రత ఉందా.. సురక్షితంగా ఉన్నట్టా.. లేనట్టా.. అని అనుమానాలు వ్యక్తం చేశారు.

2018లో టెక్నికల్, ఫెనాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆధారంగా ఐఎల్ ఎఫ్ఎస్ అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ డిజైన్ డెవెలప్​మెంట్​ ను అప్పగించిందని అధికారులు బదులిచ్చారు. ఆ కంపెనీ దివాళా తీసిందని, తర్వాత టెర్రాసిస్ అని పేరు మారటం, డైరెక్టర్లు అందరూ మారిపోవటం, తర్వాత వాటాలు అమ్ముకొని ఫాల్కాన్ ఇన్వెస్టెమెంట్ కంపెనీగా చేతులు మారటంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

బిడ్ దక్కించుకున్న కంపెనీ తమ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని, ఏకంగా కంపెనీలనే మార్చితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. భూముల రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు కూడా అప్పగించే నిబంధనలున్నాయా.. అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

2018లో రూ.116 కోట్లకు ధరణి టెండర్ దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు పన్నెండు వందల కోట్లకు అమ్ముకోవటం విస్మయం కలిగించిందని సీఎం అన్నారు. మన రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున.. విలువైన భూములను పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ, అజమాయిషీ లేదా.. అని సీఎం రెవిన్యూ అధికారులను ప్రశ్నించారు.

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1761397134769750208?t=XHrVWVqLdA5H80rg2SgFJQ&s=19

Saturday, February 24, 2024

FAKE... FAKE.... FAKE

FAKE! FAKE! FAKE!

You might have brought these fake goods home.

From Parachute Coconut oil to Red Label tea, Surf Excel to Everest Masala, this gang in #Hyderabad manufactures and sells duplicate household items.

They sell them to Kirana shops and supermarkets as genuine products in and around Hyderabad City and earn easy money illegally.

The duplicate products they manufacture include:

Parachute coconut oil

Everest cooking masala

Surf Excel big bar

Surf Excel Detergent cake

Active Wheel 2 in-1 Detergent powder

Brook bond Red Label Tea Powder

Harpic Liquid

Wheel cleaning liquid

Lizol cleaning liquid 

Brook bond tea powder

On lead with the assistance of an authorized representative of Marico Limited and Hindustan Unilever Kacheguda, police busted a gang of three people manufacturing duplicate household products in Hyderabad.

Police raided 3 places in the limits of Nagaram, Keesara Mandal (Rachkonda), Katedhan industrial area in the limits of Mailardevpally area.

Police seized products worth ₹2 crore

The material they use is life-threatening and toxic. May cause serious and prolonged health effects on short or long-term exposure to humans.

Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1761384863545053412?t=TPQKvRhoanXy1Pg25m7otQ&s=19

Friday, February 23, 2024

హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయి.

హెచ్ఎండీఏ కార్యాల‌యంలో వాట‌ర్ వ‌ర్క్స్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, జీహెచ్ఎంసీపై ముఖ్య‌మంత్రి శ్రీ @Revanth_Anumula స‌మీక్ష‌ నిర్వహించారు.

➧ @GHMCOnline, @HMDA_Gov ప‌రిధిలో బిల్డింగ్ ప‌ర్మిష‌న్స్ ఫైల్స్ క్లియ‌ర్‌గా ఉండాలి
➧ చాలా బిల్డింగ్స్ అనుమ‌తుల‌కు సంబంధించిన ఫైల్స్ క‌నిపించ‌డం లేదు. ఆన్‌లైన్ లేకుండా ఇష్టారీతిగా ప‌ర్మిష‌న్లు ఇచ్చారు.
➧ 15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయి. ఇష్టానుసారంగా  వ్య‌వ‌హ‌రించిన అధికారులు ఇంటికిపోతారు.
➧ ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమ‌తుల జాబితా త‌యారు చేయాల్సిందే..
➧ హెచ్ ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోంది..
➧ 3,500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందే..
➧ చెరువులు ఆక్ర‌మ‌ణ‌కు గురికాకుండా వాటి వ‌ద్ద త‌క్ష‌ణ‌మే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

పుర‌పాల‌క ప‌రిపాల‌న శాఖ‌పై సీఎం స‌మీక్ష‌:
➧ హైద‌రాబాద్ న‌గ‌రంలో పిల్ల‌ల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి
➧ కొత్త‌గా ఏర్ప‌డిన 85 మున్సిపాలిటీల్లో క‌మిష‌న‌ర్లు లేక‌పోవ‌డంపై సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆశ్చ‌ర్యం..
➧ ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ రామ‌కృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి
➧ గ్రూప్ 1 అధికారులు క‌మిష‌న‌ర్‌లుగా ఉండేలా చూడాల‌ని ఆదేశం...
➧ కొత్త కార్పొరేష‌న్ల‌కు ఐఏఎస్‌ల‌ను క‌మిష‌న‌ర్‌లుగా నియ‌మించాల‌ని సూచ‌న‌
➧ మున్సిపాలిటీల్లో ప‌ని చేసే మున్సిప‌ల్ వ‌ర్క‌ర్ల‌కు ప్ర‌మాద బీమా క‌ల్పించ‌డంపై అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశాలు...
➧ జీహెచ్ ఎంసీలో వ‌య‌స్సుపైబ‌డిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ స‌భ్యుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి సూచ‌న‌
➧ ఆస్తి ప‌న్ను మ‌దింపు కోసం డ్రోన్ కెమెరాల‌ను ఉప‌యోగించేందుకు అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం ఆదేశాలు
➧ హైద‌రాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచ‌న‌
➧ జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి హెచ్చ‌రిక...  ఉద‌య‌మే లేచి కాల‌నీల్లో ప‌ర్య‌టించని జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ఇంటికి వెళ్లిపోవ‌చ్చ‌న్న ముఖ్య‌మంత్రి
➧ కుర్చీల్లో కూర్చొనే పోస్టులు కావాలంటే ఇస్తామ‌ని వ్యాఖ్య‌
➧ హైద‌రాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ త‌ర‌హాలో వీడియో ప్ర‌క‌ట‌న‌ల బోర్డు ఏర్పాటు చేయాల‌ని సూచ‌న‌
➧ మ‌ల్టీ యుటిలిటీ ట‌వ‌ర్స్‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశాలు
➧ వీధి దీపాలు మెరుగుద‌ల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచ‌న‌

వాట‌ర్ వ‌ర్క్స్ స‌మీక్ష‌లో  సీఎం..
➧ హైద‌రాబాద్ న‌గ‌రానికి మంచి నీటి కొర‌త లేకుండా చూడాల‌ని ఆదేశాలు
➧ స్థానిక చెరువుల‌ను స్టోరేజీ ట్యాంకులుగా ఉప‌యోగించుకోవాల‌ని సూచ‌న‌
➧ మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ, రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు తాగు నీటి స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌ణాళిక ర‌చించాల‌ని ఆదేశం...
➧ ఔట‌ర్ రింగు రోడ్డు బ‌య‌ట ఉన్న చెరువుల‌ను క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించాల‌ని సూచ‌న‌
➧ వ‌చ్చే 50 ఏళ్ల తాగు నీటి అవ‌స‌రాల కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని అధికారుల‌కు సూచించిన సీఎం
➧ హైద‌రాబాద్‌లో విలువైన ప్ర‌భుత్వ ఆస్తుల జాబితాను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశం
➧ హైద‌రాబాద్‌లో ఏవైనా ప్రారంభోత్స‌వాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాల‌ని అధికారుల‌కు సీఎం సూచ‌న‌
➧ మెట్రో కొత్త మార్గాల‌కు త్వ‌ర‌లో శంకుస్థాప‌న
➧ నాలుగు గంట‌ల‌కుపైగా సాగిన స‌మీక్ష

ఈ స‌మీక్ష‌లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఉన్న‌తాధికారులు శ్రీ దాన కిషోర్‌, శ్రీమతి ఆమ్ర‌పాలి త‌దిత‌రులు.

Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1761082058711969817?t=y2xIYxcajAFBuIQ0sOVZAw&s=19

Thursday, February 22, 2024

హైకోర్ట్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న #GHMCUppalCircle

https://x.com/Praja_Snklpm/status/1760845865512813006?t=tvhqp0p8Mov-hNKdv36MkQ&s=08                                                                      
 _*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_                                                                                                 
 _*సీఎం సారు దండాలు 🙏*_

_*సారు #GHMCuppalCircle అధికారులు #రామంతాపూర్ పెద్ద చెరువు పరిరక్షణ కేసుకు సంబందించిన హైకోర్ట్ WP NO : 4462/2005 ఆదేశాలను బేఖాతరు చేస్తుండ్రు.నోటీసులు రెండు ఇచ్చినంక కూడా మళ్ళీ నిర్మాణం చేస్తున్నారు అంటే ఏమిటి అర్థం?*_                                                                              
 _*సారు ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటి అంటే #IllegalConstructions గురించి ఫిర్యాదు చేస్తే జనవరి 31,2024 నాడు నోటీసు ఇచ్చాము అని only మెస్సేజ్ ఇచ్చారు. అయినా మళ్ళీ నిర్మాణం చేశారు అంటే అర్థం ఏమిటి? అసలు వీళ్ళు నోటీసులు ఇచ్చారా? ఇస్తే మళ్ళీ నిర్మాణం ఎలా చేస్తారు?మళ్ళీ ఇప్పుడు సెకండ్ నోటీసు ఇచ్చాము అంటున్నారు....#ఉప్పల్ డిప్యూటీ కమీషనర్ గారి మీద విచారణకు ఆదేశాలు ఇవ్వాలి అని 'ప్రజాసంకల్పం' డిమాండ్ చేస్తుంది... Bplkm🪶*_

x.com/Praja_Snklpm/s…

*@GHMCOnline @CommissionrGHMC @ZC_LBNagar @Dc_Ghmc*

Wednesday, February 21, 2024

TelanganaHighCourt ఆదేశాలను బేఖాతరు చేస్తుండ్రు

_*బ్రేకింగ్ న్యూస్...#TelanganaHighCourt ఆదేశాలను బేఖాతరు చేస్తున్న #తెలంగాణాప్రభుత్వం, @CommissionrGHMC, Lb నగర్ జోనల్ కమీషనర్,#ఉప్పల్ డిప్యుటీ కమీషనర్, Lake ప్రొటెక్షన్ అధికారులు.. మరీ ముఖ్యంగా #మేడ్చల్ జిల్లా కలెక్టర్... వీరిమీద చర్యలు ఎవరు తీసుకుంటారు ?... Bplkm🪶*_

https://x.com/Praja_Snklpm/status/1760230193346511253?t=SeUulQX-ib3yPH19lTjreA&s=08                                                     
 _*#RamanthapurPeddaCheruvu పరిరక్షణ కోసం #TelanganaHighCourt ఆదేశాలు WP NO : 4462/2005 బేఖాతరు చేస్తూ ఈరోజు (21, feb)మూడో ఫ్లోర్ వేస్తున్నారు.#GHMC అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు ?*_
*@CommissionrGHMC @DRonaldRose @TSMAUDOnline @TS_bPASS @cdmatelangana @GHMCOnline @Collector_MDL @ZC_LBNagar @Dc_Ghmc @ee_lakesntd @LubnaSarwath @Narhariyarabotu*

*Cc:@TelanganaCMO*

*Bplkm🪶*
*****---*****---*****---*****---*****

https://x.com/Praja_Snklpm/status/1760253335683399702?t=-BpRvudBVHNWodIOFhMjag&s=08                                                                                           _*ఇదే నిర్మాణం యజమానికి @Dc_Ghmc సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి 31/01/2024 రోజు నోటీసు ఇచ్చాము అని ఆన్లైన్ లో మెస్సేజ్ పోస్ట్ చేశారు.*_

*మరి నోటీసు ఇస్తే మళ్ళీ ఎలా నిర్మాణం చేస్తున్నారు?*

*అసలు మీరు నోటీసు ఇచ్చారా?? ఇస్తే ఆ నోటీసు ట్వీట్ చేయండి*

*Bplkm🪶*

*Cc:@GHMCOnline*

Tuesday, February 20, 2024

చిన్న వయసులో పెద్దల సభకు

తెలంగాణ రాష్ట్రం నుండి పార్లమెంటు (రాజ్యసభ)   సభ్యునిగా ఎన్నికయిన ధ్రువపత్రాన్ని అందుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్న శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు. చిన్న వయసులో పెద్దల సభకు  వెళ్ళే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపిన పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ) శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు.

*V.S. జీవన్*

ప్రగతి భవన్ ఆస్తిపన్ను చెల్లించారా?

https://x.com/Praja_Snklpm/status/1759855128218407173?t=hCBcwry0dpszdSufUnGu_A&s=08                                                      
 _*గౌరవనీయులైన #తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సారు గారు గత ప్రభుత్వం లో #ప్రగతిభవన్(25.49 లక్షలు) & కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు (సుమారు 714 కోట్లు) ఆస్తిపన్నులు బకాయి పడ్డారు అని @dishatelugu ఏప్రిల్ 2022 లో వార్త కథనం వచ్చింది. ప్రస్తుతం ఆ బకాయిలు చెల్లించారా తెలుపగలరు.... Bplkm🪶*_

*Cc:@TelanganaCMO @GHMCOnline @krishna_avs*

రామంతాపూర్ లో బస్సు షెల్టర్ కోసం పోరాటం

https://x.com/Praja_Snklpm/status/1759906046603362522?t=RLy7NYBK2NUZ9CNR0eK6aQ&s=08                                                                                 _*#రామంతాపూర్ టీవీ స్టూడియో నుంచి ఉప్పల్ వైపు వెళ్లే మార్గంలో తరువాత వచ్చే బస్ స్టాప్ (రామంతాపూర్ కాలనీ స్టాప్) గత 6 సంవత్సరాలుగా bus షెల్టర్ లేదు అని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా స్పందనలేదు.*_
_*మహిళలకు, విద్యార్థులకు, సీనియర్ సిటిజన్స్ కు చాలా ఇబ్బందిగా ఉంది.అసలే ఎండాకాలం*_

*@TSRTCHQ* *@tsrtcmdoffice* *@PROTSRTC*
*@GHMCOnline*

*Bplkm🪶*
*****---*****---*****
https://x.com/TSRTCHQ/status/1759908573373710440?t=gVywMypnRPRPzg5rp4V4KQ&s=08                                                     
 *sorry for the inconvenience,*
*@DMUPL117848* 
*@rmscrtsrtc* 
*please look into this.*
*****---*****---*****
https://x.com/DMUPL117848/status/1759910120505369020?t=JSyQamRKyo7jShBtH6gbiA&s=08                                            
 *Thank you for suggestion, the feasibility will be examined Please.*


Monday, February 19, 2024

లోక్‌సభ స్థానాలకు ఏ క్షణమైనా ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌

*చేవెళ్ల బరిలో... ముగ్గురు ఉద్దండులు*

*హాట్‌ సీటుగా లోక్‌సభ స్థానం*

*బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీకే అవకాశం* 

*బీజేపీ నుంచి కొండా పేరు దాదాపు ఖరారు*

*కాంగ్రెస్‌ నుంచి కేఎల్‌ఆర్, సునీతారెడ్డి మధ్య పోటీ*

*ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన ఆశావహులు* 

*ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే చాన్స్‌*

రంగారెడ్డి : లోక్‌సభ స్థానాలకు ఏ క్షణమైనా ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉండటంతో ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు అటు రాజకీయ పారీ్టలు కూడా సన్నద్ధమయ్యాయి. జిల్లాలోని కీలకమైన చేవెళ్ల స్థానంపై అధికార కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ దృష్టి సారించాయి. సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డినే మళ్లీ బరిలోకి దించనున్నట్లు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రకటించింది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. 
ఆయన పేరే దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌ నుంచి రోజుకో కొత్త అభ్యర్థి తెరపైకి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డికి ఆయనకు మధ్య కొంత అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఆయనకు ఈ స్థానం దక్కకపోవచ్చనే చర్చ నడుస్తోంది. వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి రెండు రోజుల క్రితం కారు దిగి హస్తం పారీ్టలో చేరడంతో ఆమెకే అవకాశం ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది. మూడు పారీ్టల నుంచి ముగ్గురు ఉద్దండులు బరిలోకి దిగనుండడంతో ఈసారి చేవెళ్ల పోరు రసవత్తరంగా మారనుంది. 
*క్షేత్రస్థాయిలో ఆశావహులు*
చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. షాద్‌నగర్, కొడంగల్‌ నియోజకవర్గాలు మహబూబ్‌నగర్‌ పరిధిలో ఉండగా, కల్వకుర్తి నియోజకవర్గం నాగర్‌కర్నూల్‌ పరిధిలో కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భువనగిరి పరిధిలో, ఎల్బీనగర్‌ నియోజకవర్గం మేడ్చల్‌ మల్కాజిగిరి పరిధిలో కొనసాగుతున్నాయి. 2019లో ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

12,70,687 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డికి 5,16,363 ఓట్లు (40.64 శాతం) రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 5,0,318 ఓట్లు (39. 61శాతం)వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బి.జనార్దన్‌రెడ్డికి 1,95,919 ఓట్లు (15.42 శాతం) వచ్చాయి. బీఎస్పీ సహా ఇతర పారీ్టలకు డిపాజిట్‌ దక్కలేదు. పోటీలో ఉన్న 20 మందికి నోటా (9,045) కంటే తక్కువ ఓట్లుపోలవడం గమనార్హం. 2024 ఫిబ్రవరి 8 నాటికి ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 29,14,124 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. వీరిలో 14,93,369 మంది పురుషులు, 14,20,469 మంది మహిళలు ఉన్నారు. మరో 286 మంది థర్డ్‌ జెండర్లు ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటాపోటీగా తలపడనున్నారు. ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించే నేతలంతా ఆర్థికంగా బలవంతులు కావడంతో ఎన్నికల కోసం భారీగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వీరంతా క్షేత్రస్థాయిలో పర్యటించడంతోపాటు ఇతర పారీ్టల్లో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు వల వేస్తున్నారు. వీరికి భవిష్యత్తులో పలు రాజకీయ పదవులతో పాటు నగదు, ఖరీదైన వాహనాలు ఎరగా చూపుతున్నట్లు తెలిసింది.

*V.S. జీవన్*

Sunday, February 18, 2024

దర్జాగా దందాలెన్నో

https://x.com/Praja_Snklpm/status/1758860674418225280?t=1CY6r1iHPSVVuK6hSW6hTg&s=08                                  
 _*#శివబాలకృష్ణ కేసులో ఎవరెవరు ఉన్నారో తెలియచేయాలి.... వారి అందరిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.*_

*@CVAnandIPS సర్ 🙏*

*#సత్యమేవజయతే*
swetchadaily.com

*Bplkm🪶*

Friday, February 16, 2024

people will loose faith on the judiciary....

https://x.com/RaviVattem/status/1758702998975570365?t=g_eSkgGXHFh9sQmaFmPprw&s=08                                                                               *Shocked.Very serious allegations on a senior and very noted Advocte #VedulaVenkataramana involving Judges.*
*Need proper invention to know the facts. Otherwise, people will loose faith on the judiciary..... V. Ravikrishna (High Court Advocate & Social Activist)* *@TelanganaDGP @CVAnandIPS @barcouncilindia @barandbench @revanth_anumula @SCJudgments @SupremeCourtIND* *#TelanganaHighCourt *@TelanganaCMO*                                     *****---*****---*****                                          *www.newstop.in NEWS : MIM MLA, Sr. Advocate accused of swindling Rs 7 Cr, allegedly for dubious reasons* https://www.newstap.in/top-stories/mim-mla-sr-advocate-accused-of-swindling-rs-7-cr-allegedly-for-dubious-reasons-1520848

*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*

వకీల్ సాబ్ #చెరువుల పరిరక్షణ & ప్రజాప్రయోజనాలకోసం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తే సంవత్సరాలతరబడి విచారణ కొనసాగుతుంది అంటేనే అర్థం అయింది.న్యాయస్థానాలు ఆదేశాలు ఇవ్వడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు అంటే న్యాయస్థానాలలో న్యాయం ఎవరికి అండగా ఉంది?

#publicvoice 👆

Bplkm🪶
https://twitter.com/Praja_Snklpm/status/1758737565912613072?t=UzTUZXCygCAwFQQliWGv7g&s=19

Wednesday, February 14, 2024

బరితెగిస్తున్న ఇసుక మాఫియా

*బరితెగిస్తున్న ఇసుక మాఫియా*
*ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకుంటున్న లారీలు.*
*లారీకి ముఖ్యమంత్రి ఫొటోల పై సిరియస్*.
*భద్రాచలం వద్ద 16 లారీల పట్టివేత*.
*టీఎస్ఎండీసీ అధికారులకు కాంగ్రెస్ నేతలంటూ బెదిరింపులు*. 
*ఖమ్మం జిల్లా మంత్రి అనుచరులమంటూ ఆగడాలు*.
*అర్ధరాత్రి రంగంలోకి దిగిన  కలెక్టర్, ఎస్పీ*
*ఇసుక పాలసీ లేనందున హైదరాబాద్ లో ఫుల్ డిమాండ్*.
*గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణ పై రేవంత్ రెడ్డి సమీక్ష*. 
*అదే మాఫియా కాంగ్రెస్ సర్కార్ లోను  కోనసాగిస్తుంది.*?
*మాఫియా తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్న అఫీసర్స్*. 
*అల్లూరి జిల్లా నుంచి హైదరాబాద్ కి అక్రమ ఇసుక పై*
*ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ డాట్ కామ్. స్పెషల్ స్టోరీ*

Courtesy / Source :By
Devender Reddy. Chinthakuntla
9848070809

Click here 👇 for full details 

https://www.landsandrecords.com/news-details.php?nid=75

*సిగ్గుపడాలి #తెలంగాణాప్రభుత్వం*

https://x.com/Praja_Snklpm/status/1757845455277601188?t=3x0L-y0SlxsLfaLiTWaYfw&s=08                                                                                                         _*ఈ విచారకరమైన పరిస్థితి రావడానికి కారణం #ప్రజలు, #ప్రజాప్రతినిధులు, #ప్రభుత్వఅధికారులు, #కేంద్రరాష్ట్రప్రభుత్వాలు*_

*భూగర్భజలాలను కాపాడుకోవాలని ఎవడైనా ఆలోచిస్తున్నాడా ?*

*#TelanganaHighCourt*
*#EncroachmentOfLakes*

*సిగ్గుపడాలి #తెలంగాణాప్రభుత్వం*
*Cc:@TelanganaCMO*

*Bplkm🪶*

Monday, February 12, 2024

#KaleshwaramProjectScam పర్యటన

https://x.com/Praja_Snklpm/status/1757271166744715677?t=iU3mKnF4QoBvMdQOu9AemQ&s=08                                                                              _*#ప్రజాస్వామికతెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు #KaleshwaramProjectScam పర్యటన గురించి #తెలంగాణాఅసెంబ్లీ లో చాలా హుందాగా ప్రస్థావించారు.*_

_*మాజీ సీఎం #కేసీఆర్ సారు & బృందం కూడా వెళ్ళాలి....Bplkm🪶*_

*@TelanganaCMO @Bhatti_Mallu @KTRBRS @BRSHarish @dr_mvreddy @Murali_IASretd @DeccanChronicle*

Friday, February 9, 2024

పీవీ గారికి #భారతరత్న... మోడీ గారికి ధన్యవాదములు

https://x.com/TelanganaCMO/status/1755887835889156431?t=XmrtySRhZuyBNEjdEtWtRw&s=08                                                              
  _*మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు.*_ 

_*"ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ, పీవీ నరసింహారావు గారికి భారత రత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆలస్యమైనా వారికి ఈ గౌరవం దక్కడం గర్వకారణం. నా తరపున, సభ తరపున, #తెలంగాణ ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. ఇది మనందరికీ గర్వకారణం" ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి*_

*#BharatRatna*                                                 *@Praja_Snklpm*

*****---*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1755894368484155797?t=ZC0su8UBGtvsJ77QYPELAQ&s=08                                               _*@narendramodi @PMOIndia సారుకు ధన్యవాదములు 🙏.*_

_*ఇన్నాళ్లకు మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారికి గౌరవంగా #భారతరత్న ఇవ్వడం అభినందనీయం.... Bplkm🪶*_

*#BharatRatna* *#PVNarasimharao* *#Telangana*

*@RahulGandhi @priyankagandhi @INCIndia @kharge @DeepaDasmunsi* *@Congress4TS*
*@BplplH @PushpaFashions*

Thursday, February 8, 2024

*శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు....రంగంలోకి ఈడీ*

*శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు....రంగంలోకి ఈడీ*

హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ సంచాలకుడు శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. అతనిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో పాటు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలు ఇవ్వాలని ఈడీ అధికారులు ఏసీబీని కోరారు.వివరాలు వచ్చిన అనంతరం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల విలువ సుమారు రూ.13 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.250 కోట్లకు పైనే ఉంటుందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రాథమిక అంచనా. ఏసీబీ 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించగా.. అతడి దందాలు మరిన్ని బహిర్గతమయ్యాయి. తన అక్రమ ఆదాయాన్ని ఎక్కువగా స్థిరాస్తుల కొనుగోళ్లకే వెచ్చించినట్లు తేలింది. శివబాలకృష్ణతోపాటు కుటుంబసభ్యులు, బినామీల పేరిట మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో తేలింది. మరోవైపు మూడు రోజులపాటు హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్న దస్త్రాల్ని ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పలు స్థిరాస్తి సంస్థలకు బాలకృష్ణమంజూరు చేసిన అనుమతులపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది.

*V.S. జీవన్*

ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు సహాయం

*ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషి: ప్రొఫెసర్ కోదండరాం.* 

హైదరాబాద్ ఫిబ్రవరి 08: విద్య వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు తెలంగాణా సాధకుడు, శాసనమండలి సభ్యులుగా ఇటీవలే నామినేట్ అయిన కోదండరాం అన్నారు.

డిజెఎఫ్ జాతీయ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చే సిన ఆయన జర్నలిస్టుల సమస్యలపై స్పందించారు జర్నలిస్టుల పై ప్రభుత్వాలు సానుకూలంగా ఉండాలన్నారు.

వారికి విద్య వైద్యంతో పాటు వారికి నివాస యోగ్య మైన స్థలాల కేటాయింపులు జరగాల్సి ఉందన్నారు కార్పోరేట్ విద్యాల యాలలో జర్నలిస్టులకు 50 శాతం రాయితీ ఇప్పటికే అమలు లో ఉన్నదని కానీ అది కూడా సరిగా అమలు కావటం లేదన్న విషయాలు నా దృష్టికి వచ్చాయని వాటి ప్రామాణికతలలో కూడా మరింత వెసులుబాటు కలిగేలా ప్రయత్నం చేయాల న్నారు.

అలాగే ఎక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందేలా కృషి చేద్దామన్నారు ఈ మేరకు తగిన ప్రతిపాదనను తన వద్దకు తీసుకు వస్తే సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా నని హామీఇచ్చారు.

ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో సానుకూలంగా ఉందని త్వరిత గతిన జర్నలిస్టులకు మంచి జరుగుతున్నదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

*V.S. జీవన్*

Monday, February 5, 2024

'#న్యాయం' ఎక్కడ దొరుకుతుంది ?*

https://x.com/thulasichandu1/status/1754422863250235875?t=QQgINlWOsBQel4mosi78gg&s=08                                                                                            *-ప్రభుత్వ హాస్టళ్లలోకి ఆటో డ్రైవర్లు అర్థరాత్రి వేళ ఎందుకొస్తున్నారు?* 
*ఇంత దారుణమైన నిర్వహణా లోపాలున్నా ఎస్సీ హాస్టళ్లలో లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు అంటే అంతకు మించిన మరో దారి వాళ్లకు లేదని కదా అర్థం..?* 

*విద్యార్థులకు ఏదైనా కష్టమొస్తే ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదన్న భావనలోకి వెళ్తున్నారు అంటే అది ప్రభుత్వ వ్యవస్థల ఘోర వైఫల్యం కాదా..?* 

*ఎలాంటి సమస్యలు హాస్టళ్లలో ఉన్నా వెంటనే పై స్థాయిలో ఉన్న అధికారుల దృష్టికి తెచ్చే హెల్ప్ లైన్ సౌకర్యం ఈ రోజుల్లో కూడా కష్టమైన పనేనా?* 

*కనీసం తల్లిదండ్రులైనా ఫోన్లు చేసి తమ పిల్లల కష్టాలు, హాస్టళ్లలో క్వాలిటీ గురించి చెప్పేలాగా ఉండాలి కదా?*

*కొన్ని ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో ఫుడ్డు బాగాలేదని కంప్లైంట్స్ చేస్తే, "మీ ఇంట్లో ఇంతకంటే మంచి తిండి తింటారా?" అని వార్డెన్లు, ఇన్ ఛార్జీలు ఆ పిల్లల నోరు మూయిస్తున్నారన్న వాస్తవాన్ని  ప్రభుత్వంలోని వాళ్లూ, ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలి.* 

*ఈ ఇష్యూ కేవలం ఇద్దరు ఆడపిల్లలకు సంబంధించినదిగా చూడకూడదు. మొత్తం హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికైనా ప్రభుత్వం రియలైజ్ అవ్వాలి.*
*@revanth_anumula @seethakkaMLA @KTRBRS @RSPraveenSwaero*                                                                                              *****---*****---*****                                                                                     
_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_                                                                           *@thulasichandu1 మేడం '#న్యాయం'  ఎక్కడ దొరుకుతుంది ?*

*#పాలకులు & #ప్రభుత్వఅధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోవాల్సివచ్చిన ఈ చిన్నారి తల్లులకు శ్రద్ధాంజలి ఘటిస్తుంది 'ప్రజాసంకల్పం'😔*

*#IndianConstitution*
*#SupremeCourtofIndia* *#TelanganaHighCourt*

*న్యాయస్థానాలలో లక్షల్లో పెండింగ్ కేసులు... ఇదేనా ప్రజాస్వామ్యం అంటే..... Bplkm🪶*

Sunday, February 4, 2024

➧ కేసీఆర్, హరీష్, డ్రామారావు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు:

➧ కేసీఆర్, హరీష్ డ్రామారావు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.

➧ అబద్ధపు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.

➧ రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా, గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ఒప్పుకున్నారు.

➧ ఈ పుస్తకానికి, ఈ చట్టానికి మీరే రచయిత

➧ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాది పడిందే కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు..

➧ టీఆరెస్ అభ్యంతరం చెప్పకపోగా కేసీఆర్ ఓటు వేసి చట్టాన్ని ఆమోదింపజేశారు..

➧ దీనికి బాధ్యులు కేసీఆర్, కె. కేశవరావు..

➧ ఈ చట్టం కావడానికి మొట్టమొదటి కారణం కేసీఆరే..

➧ 811 టీఎంసీల నీళ్లపై పంపకాలు ఎలా జరగాలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు.

➧ 2015 జూన్ 18న KRMB సమావేశం నిర్వహించింది

➧ 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు కేటాయించేందుకు కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టారు.

➧ తెలంగాణకు 50 శాతం వాటా అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు.

➧ కృష్ణా నది 68శాతం తెలంగాణలో ఉంది.. 32శాతం మాత్రమే ఏపీలో ఉంది..

➧ అంతర్జాతీయ నీటి విధి విధానాల ప్రకారం 5వందల పైచిలుకు తెలంగాణకు, మిగతావి ఏపీకి కేటాయించాలి.

➧ కానీ సంతకాలు పెట్టి మరీ తెలంగాణకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్.

➧ 15 ప్రాజెక్టులను KRMBకి అప్పగిస్తామని 2022లో సమావేశంలో అంగీకరించారు.

➧ 19.05.2023న 17వ KRMB సమావేశంలో కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ అంగీకరించారు.

➧ 2023 బడ్జెట్ లో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు రూ.400 కోట్లు కేటాయించారు. 

➧ ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయడం మామా, అల్లుళ్లు కలిసే చేశారు.

➧ 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామి..

➧ పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినపుడు హరీష్, నాయిని నర్సింహారెడ్డి మంత్రులుగా ఉన్నారు, కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారు...

➧ పదవులకు ఆశపడి పెదవులు మూసుకుంది మీరు కాదా?

➧ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకపోతుంటే కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి...

➧ వాళ్లకు సహకరించకుండా వైఎస్ కు లొంగిపోయింది కేసీఆర్..

➧ 14 జనవరి 2020న జగన్ ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృష్ణా జలాల పై 6గంటలు సమీక్ష చేశారు.

➧ అక్కడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

➧ తండ్రి పోతిరెడ్డిపాడుతో  రోజుకు 4 టీఎంసీలు తరలించుకుపోతే.. కొడుకు రాయలసీమ లిఫ్ట్ తో రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయారు.

➧ నీటి తరలింపుకు టెండర్ ఆపేందుకు సమావేశానికి వెళ్లకుండా సమావేశాన్ని వాయిదా వేయాలని లేఖ రాయించారు.

➧ టెండర్ ఒప్పందాలు పూర్తి కావాలనే కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్లలేదు.

➧ కేసీఆర్ ధనదాహంతో తెలంగాణ నీటిని తరలించుకుపోయేందుకు సహకరించారు.

➧ తెలంగాణ హక్కులను కాలరాస్తూ నీటి దొంగలు కృష్ణా జలాలను దారిదోపిడీ చేస్తున్నారు.

➧ ఈ జల దోపిడీకి కారణం కేసీఆర్..

➧ పదేళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు.

➧ ఉమ్మడి రాష్ట్రంలో జరిగినదానికంటే ఎక్కువ ఈ నిర్లక్ష్యం పదేళ్లలో జరిగింది
➧ పదేళ్లు పాలమూరు-రంగారెడ్డి పడావు పడ్డది..

➧ రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్... పదేళ్లయినా పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదు..

➧ ఇన్ని పాపాలు చేసి ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేస్తామని బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.

➧ పాపాలు చేసి ప్రజా ఉద్యమాలంటే ప్రజలు చెప్పుతో కొడతారు.

➧ తెలంగాణకు రావాల్సిన వాటా, హక్కుల కోసం మేం కొట్లాడుతుంటే...

➧ అధికారం కోల్పోయి దిక్కుతోచక ఏదో ఒక వంకతో మామా అల్లుళ్లు కాంగ్రెస్ ను బదనాం చేయాలని చూస్తున్నారు.

➧ కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా..

➧ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చ పెడదాం...

➧ రెండు రోజులు ప్రాజెక్టుల శ్వేతపత్రంపై చర్చిద్దాం

➧ రెండు రోజులు చాలవంటే సమావేశాలను పొడగిద్దాం..

➧ కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత రావు అందరూ రండి...

➧ నీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా

➧ మీకు పూర్తి అవకాశం ఇస్తాం... ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. రా

➧ నిజానిజాలేంటో నిరూపిద్దాం రా..

➧ ఎవరు ద్రోహి, ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారో తేలిపోతుంది..

Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1754153686400450916?t=ct1PYx47EOi7wAB9lrQR3w&s=19

Saturday, February 3, 2024

నందమూరి తారకరామారావు... సచివాలయం

నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు సచివాలయంలోని అయిదు/ ఆరవ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళడానికి ప్రత్యేకం గా ఒక లిఫ్ట్ ఉండేది. ఆయన లిఫ్ట్ దగ్గరకు రాగానే భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన అన్ని లిఫ్టు లను ఆపేసే వారు. ఎన్టీఆర్ గారు తన ఆఫీస్ లోపలకు వెళ్ళి కుర్చీలో కూర్చున్న తరువాతే లిఫ్టు లు మళ్ళీ పని చేసేవి.
ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఒకే ఉద్యోగి లిఫ్టు ఆపరేటర్ గా ఉండేవాడు. ఆ కారణంగా అతనికి ఎన్టీఆర్ గారితో కొంచెం చనువు ఉండేది. ఎన్టీఆర్. గారు కూడా అతనిని రోజూ చూస్తుంటారు కాబట్టి నవ్వుతూ బాగున్నావా అని అడిగేవారు.
ఒకరోజు ఎన్టీఆర్ గారు  ఆఫీస్ లో ఉండగా సాయంత్రం ఆ ఉద్యోగి ఆఫీస్ లోకి వెళ్ళి నమస్కారం చేశాడు. ఆ సమయం లో అప్పటి సభాపతి, మరి కొందరు ఆయనతో పాటు ఉన్నారు. ఎన్టీఆర్ గారు ఆశ్చర్యంగా అతణ్ణి చూసి "ఏమిటి?" అని అడిగాడు.
"సార్..నేను ఈ సాయంత్రం తో రిటైర్ అవుతున్నాను. మా యూనియన్ వారు చిన్న పార్టీ ఇస్తున్నారు. చివరి సారిగా మీకు చెప్పి వెళదాం అని వచ్చాను సర్" అని  చెప్పాడు లిఫ్ట్ ఆపరేటర్.
ఎన్టీఆర్ గారు ఆశ్చర్యంగా చూసి " అరే..పొద్దున్న చెప్పలేదే? ఉండు" అని తన కార్యదర్శులకు ఫోన్ చేసి అర్జెంట్ గా ఒక శాలువా, బోకే తెమ్మని ఆదేశించారు. ఈ లోపల ఆ ఉద్యోగి కుటుంబ వివరాలను అడిగారు. అతనికి సొంత ఇల్లు లేదని, పెళ్ళి కావలసిన కుమార్తెలు ఉన్నారని తెలుసుకుని సెక్రెటరీ ని పిలిచి ఆ ఉద్యోగి పేరుతో ఒక ప్రభుత్వ స్థలం ఉన్న ప్రాంతం లో రెండు ఎకరాల భూమి కీ పట్టా కాగితాలు అరగంట లోపల సిద్దం చెయ్యమని ఆదేశించారు.
ఇంతలో శాలువా, బోకే, స్వీట్స్ వచ్చాయి, వెంటనే
ఎన్టీఆర్ గారు ఆ లిఫ్ట్ ఆపరేటర్ ను  స్వయంగా సన్మానం చేసి, తన జేబులోంచి కొంత నగదు తీసి ఇంటి పట్టా కాగితాలతో సహా అందించి, అవసరం అయితే కలవమని చెప్పి పంపించారు. తాను ఏమాత్రం ఊహించని ఈ పరిణామానికి ఆనందబాష్పాలురాలుస్తూ వెళ్ళిపోయాడు ఆ ఉద్యోగి.  ప్రచారానికి నోచుకోని ఇలాంటి కోణాలు ఎన్.టి.రామారావు గారి పాలనలో ఎన్నో ఉన్నాయి...

త్తు... త్తు.. ఈళ్ల బతుకులు చెడ!

_*జోహార్లు #తెలంగాణ అమరవీరులకు ✊*_

 _*#తెలంగాణ ఒస్తే నిరుద్యోగులకు / రైతులకు / ప్రభుత్వవిద్యకు / సాగునీటి ప్రాజెక్టులకు.... Etc న్యాయం జరుగుతుంది అనుకుంటే #దొర కుటుంబం,#దొర బంధుమిత్రులు,#దొర గడిలో బానిసలుగా ఉన్న #ప్రజాప్రతినిధులు / ప్రభుత్వఅధికారులు ముఖ్యంగా #IAS / #IPS అధికారులు #తెలంగాణ ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకున్నారు. ఈ దోపిడీ గురించి తెలిసినా మౌనంగా ఉన్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా & జర్నలిస్ట్ లు మరీముఖ్యంగా కండ్ల ముందు ఇంత పెద్ద #అవినీతి జరుగుతున్నా ప్రశ్నించని వెదవలు అనబడే మేధావులు మరియు పౌరసమాజం... త్తు... త్తు.. ఈళ్ల బతుకులు చెడ.... Bplkm🪶

Thursday, February 1, 2024

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్

🚦భవిష్యత్తు అవసరాలకు సమగ్ర ప్రణాళిక 

🚦సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయి పెంపు

🚦సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకాలు

🚦మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లను ప్రోత్సహించే కొత్త విధానం  

🚦హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula

గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.

హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించారు. అందులో నిపుణులైన కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు.  


పెరిగిన వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని సమావేశంలో చర్చకు వచ్చింది. స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. మూడు నెలల్లోగా ఈ నియామకాలు జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. కొత్తగా నియమించిన వారికి తగిన శిక్షణనివ్వాలని సూచించారు. ఈలోపు వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోం గార్డులను ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలని. తక్షణమే వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. 


ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్ అవర్స్లో) లా అండ్ ఆర్డర్ పోలీసులను గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటికి సరిపడే సంఖ్యలో సిబ్బంది నియామకాలు చేపడుతామని సీఎం చెప్పారు. 


సిటీలోని అన్ని ప్రధాన జంక్షన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది తప్పకుండా అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కేవలం ఆటోమేటిక్  సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకూడదని అన్నారు. టూ వీలర్ ట్రాఫిక్ ఇంటర్సెప్టర్స్ పై (ద్విచక్ర వాహనాలపై) ఎస్ఐలు, కానిస్టేబుళ్లను పంపించి ట్రాఫిక్ జామ్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 


పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎల్బీ నగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే లను ఎక్కడెక్కడ నిర్మించాలి... అక్కడున్న సాధ్యాసాధ్యాలను గుర్తించాలని సీఎం అన్నారు.


హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమిషనర్లు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతినెలా తప్పనిసరిగా సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులను సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


పార్కింగ్ సమస్యను అధిగమిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోతాయనే చర్చ జరిగింది. వీలైనన్ని చోట్ల మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని, పార్కింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వ పరంగా రాయితీలు ఇవ్వాలని సీఎం అన్నారు. అన్ని విధివిధానాలతో ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని సీఎం ఆదేశించారు.


లే అవుట్లకు హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చేటప్పుడు అక్కడ రోడ్లు, పార్కులు, మౌలిక వసతులకు ఎంత స్థలం కేటాయించాలనే ప్రమాణాలు పున: పరిశీలించాలని సీఎం ఆదేశించారు. విశాలమైన రోడ్లు ఉండేలా దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లో ఎలాంటి పద్దతులను అనుసరిస్తున్నారో పరిశీలించాలని సీఎం సూచించారు. 


హైదరాబాద్ లో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఆ ఏరియాలో ఉండే ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, డీజీపీ శ్రీ రవి గుప్తా, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ రోనాల్డ్ రాస్, ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీ షానవాజ్ ఖాసీం, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్ శ్రీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ శ్రీ సుధీర్ బాబు, ట్రాఫిక్ డీసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1752721089254539625?t=0YNoueuGiEWqaT4QcMUHAA&s=19