Saturday, December 31, 2022

హైదరాబాద్ లో 5810 వాహనదారుల లైసెన్సులు రద్దు చేసిన రవాణా శాఖ...!

*హైదరాబాద్ లో 5810 వాహనదారుల లైసెన్సులు రద్దు చేసిన రవాణా శాఖ...!*

హైదరాబాద్: 2023 నూతన సంవత్సర వేడుకల  సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు  ఉల్లంఘించిన 5,819 వాహనదారుల లైసెన్సులు రవాణా శాఖ  అధికారులు రద్దు చేశారుమద్యం  సేవించి వాహనం నడిపిన కారణంగా వారి లైసెన్స్ రద్దు చేశారు. నార్త్ జోన్‌ లో 1,103, సౌత్ జోన్‌ లో 1,151, ఈస్ట్ జోన్‌ లో 510, వెస్ట్ జోన్‌ లో 1,345 మంది లైసెన్సులు రద్దయ్యాయి. కాగా 2021 ఏడాదితో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరంలో 3,220 మంది వాహనదారుల లైసెన్స్‌లు రద్దయ్యాయి.

కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నగరంలో ప్రాంతాల వారీగా డ్రంకన్ డ్రైవ్ నమోదు సంఖ్య.. సంజీవ రెడ్డి నగర్ -73, పంజాగుట్ట-51, బంజారా హిల్స్-48, జూబ్లీహిల్స్-49 కేసులు నమోదయ్యాయి

*సుజీవన్ వావిలాల*🖋️ 

Why is state eager to regularize illegal constructions? TS HC tears into govt

Why is state eager to regularize illegal constructions? TS HC tears into govt

Chief Justice Ujjal Bhuyan-led division bench was hearing the plea of Advocate General Banda Shivananda. Justice C.V. Bhaskar Reddy was another member of the bench.

Telangana High Court has come down hard on the state government for seeking the reopening of the PIL challenging the Building Regularisation Scheme (BRS).

Chief Justice Ujjal Bhuyan-led division bench was hearing the plea of Advocate General Banda Shivananda. Justice C.V. Bhaskar Reddy was another member of the bench.

The bench declined the request of Banda Shivananda Prasad to reopen the plea challenging the Telangana government's Building Regularisation Scheme.

Under this scheme, such persons were permitted by the state government to approach the concerned authorities and file applications, seeking regularisation of their properties on payment of requisite fees. Such a process has been stopped as the High Court has closed the PIL.

PIL was filed in 2016 and later this issue was taken to the Supreme Court in 2020. The Supreme Court had impleaded Telangana, Tamil Nadu, and Andhra Pradesh as the respondents. The case is pending before the Supreme Court.

Advocate General Banda Prasad apprised the Chief Justice Court about the new enactment brought in by the Telangana government wherein stringent rules have been promulgated, which will restrain all such citizens who resort to illegal constructions and later approach the authorities for regularisation.

The present interim application is moved to facilitate the citizens, who had constructed without obtaining permissions from authorities and all such constructions are old constructions.

AG informed the Court that the SC is looking into illegal and unapproved layouts. He said Building Regularisation Scheme is not before the Supreme Court. This PIL was closed in the High Court on the premise that the Supreme Court has issued orders in this matter.

Due to the closure of this PIL in the High Court, the entire process of the Building Regularisation Scheme in Telangana has been stopped.

Chief Justice Ujjal Bhuyan, after hearing the contentions of Advocate General Banda Shivananda declined to reopen the plea observing that it is a very risky issue.

He advised the AG to get a final clarification on this issue. "Prima facie, this Court is not inclined to reopen the same plea for adjudication," he said.

Chief Justice Bhuyan observed that the SC will come down heavily on them.

Adjourning the matter for four weeks, the court directed the Advocate General to get a copy of the clarification issued by the Supreme Court for re-opening the PIL for adjudication. The next hearing has been fixed on Feb 16, 2023

Thursday, December 29, 2022

సరైన సమయంలో సమాధానం.....బిఎల్ సంతోష్


*ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆరోపణలపై బీఎల్‌ సంతోష్‌*
*ఇక్కడి డబ్బు ఇతర రాష్ట్రాల్లోని పార్టీలకు వెళ్తోంది*
*అవసరం* *వచ్చినప్పుడు బహిర్గతం చేస్తామని వెల్లడి*
*తెలంగాణ తల్లికి రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ధ్వజం*
*భాజపా 'మిషన్‌ 90' సమావేశానికి హాజరు*

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ పార్టీ నేతలతో అన్నారు. రాష్ట్రంలో 90 అసెంబ్లీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో 'మిషన్‌ 90' పేరుతో శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో గురువారం జరిగిన భాజపా అసెంబ్లీ విస్తారక్‌లు, ప్రభారీలు, పాలక్‌లు, కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడే జరిగిన లోక్‌సభ నియోజకవర్గ విస్తారక్‌ల రెండోరోజు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మిషన్‌ 90 సమావేశంలో ఎమ్మెల్యేలకు ఎర కేసుపై, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆరు గంటలకుపైగా సాగిన ఈ సమావేశంలో సంతోష్‌ ముగింపు ప్రసంగం చేశారు. 'సాధారణ ప్రజలకు అంతగా తెలియని నా పేరును ఇక్కడి ప్రభుత్వం ప్రతి ఓటరుకూ తెలిసేలా చేసింది. నాపై చేసిన ఆరోపణలకు సరైన సమయంలో సమాధానం చెబుతా' అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గతంలో తాను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు స్వాగతం పలకడానికి ఒకరిద్దరు పార్టీ కార్యకర్తలు మాత్రమే వచ్చేవారని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని కారణంగా ఈరోజు వందలాది మంది వచ్చారని అన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ''రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తోంది. ఇక్కడి డబ్బును ఇతర రాష్ట్రాల్లోని పార్టీలకు తీసుకెళ్తున్నారు. ఏ రాష్ట్రంలో, ఏ పార్టీకి ఎంతెంత ఇచ్చింది మాకు తెలుసు. ఇక్కణ్నుంచి ఇతర పార్టీలకు డబ్బులు పంపిన వారి విషయాన్ని అవసరం వచ్చినప్పుడు బహిర్గతం చేస్తాం.

*సుజీవన్ వావిలాల*🖋️

ప్రధాని మోదీ మాతృమూర్తి కన్నుమూత.....!

*ప్రధాని మోదీ మాతృమూర్తి కన్నుమూత.....!*

ప్రధాని నరేంద్రమోడీకి మాతృవియోగం కలిగింది. మాతృమూర్తి హీరాబెన్ మోడీ కన్నుమూశారు. ఆమె వయసు 100 ఏళ్ళు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు హీరాబెన్ మోడీ.అయితే గురువారం ఆమె కోలుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థత నుంచి కోలుకుంటున్నట్లు యూఎన్ మెహతా ఆసుపత్రి గురువారం రాత్రే ప్రకటించింది. అయితే కొద్దిగంటల్లోనే ఈవిషాదం వినాల్సి వచ్చింది.

ఆమె అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను బుధవారం ఈ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మోదీ హుటాహుటిన ఈ ఆసుపత్రిని సందర్శించి, తన తల్లితో మాట్లాడారు. దాదాపు గంటన్నర సేపు ఆమె వద్ద ఉన్నారు. అనంతరం న్యూఢిల్లీ వెళ్ళారు. హీరాబెన్‌ను ఒకట్రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తారని బీజేపీ నేతలు భావించారు. అయితే హఠాత్తుగా ఆమె మరణించారన్న వార్త మోడీని తీవ్రవిషాదంలో నింపేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

తెలంగాణ కొత్త ఇంచార్జ్ డీజీపీ గా అంజనీ కుమార్....!

*తెలంగాణ కొత్త ఇంచార్జ్ డీజీపీ గా అంజనీ కుమార్....!*

హైదరాబాద్:తెలంగాణ ఇన్‌చార్జ్‌ డీజీపీగా అంజనీకుమార్‌ ((Anjani Kumar)) నియమితులయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌ భగవత్‌ను సీఐడీ చీఫ్‌గా, రాచకొండ సీపీగా దేవేంద్ర సింగ్ చౌహాన్‌, ఏసీబీ డీజీగా రవిగుప్త, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జితేందర్‌, లా అండ్ ఆర్డర్‌ డీజీగా సంజయ్‌కుమార్‌ జైన్‌ నియమితులయ్యారు.తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి  పదవి కాలం ఈనెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తరవాత డీజీపీ(DGP) ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠ వీడినట్లైంది.

1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్ ఇప్పటిదాకా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరక్టర్ జనరల్‌గా ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. అడిషనల్ డీజీపీగా కూడా వ్యవహరించారు. డీజీపీ మహేందర్ రెడ్డి గతంలో కొన్ని వారాల పాటు మెడికల్ లీవ్ పెట్టినప్పుడు అంజనీ కుమార్‌ ఇంఛార్జ్ డీజీపీగా పనిచేశారు కూడా.

జితేందర్  గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అడిషనల్ సీపీగా పని చేశారు. ఇప్పటివరకూ శాంతి భద్రతల అడిషనల్ డీజీగా పని చేశారు.

1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా గతంలో ఆయన డీఐజీ, ఐజీగా పనిచేశారు.

*సుజీవన్ వావిలాల🖋️* 

ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్ళనక్కర్లేదు.... ఈసీ, రిమోట్ ఓటింగ్

*ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్ళనక్కర్లేదు.... ఈసీ, రిమోట్ ఓటింగ్*
దిల్లీ: ఉపాధి కోసం సొంతూళ్లను వదిలి వేరే ప్రాంతాల్లో పనులు చేసుకునేవారు దేశంలో ఎంతో మంది. అలాంటి వారు ఎన్నికల సమయంలో స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం గగనమే..!ఆసక్తి లేకనో లేదా ప్రయాణ ఖర్చులు భరించలేకనో చాలా మంది ఓటు కోసం ఊరెళ్లరు. అలా దేశంలో మూడోవంతు ఓటర్లు పోలింగ్‌కు దూరంగానే ఉంటుండటం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (EC) సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది. దేశీయంగా వలసలు వెళ్లిన వారు ఉన్న చోటు నుంచే తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసేలా 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ రిమోట్‌ ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ EC) ఓ కాన్సెప్ట్‌ నోట్‌ను సిద్ధం చేసింది. దీంతో పాటు ఓ రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (RVM) నమూనాను రూపొందించింది. ఒకే పోలింగ్‌ బూత్‌ నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈ రిమోట్‌ ఈవీఎం (RVM)ను అభివృద్ధి చేశారు. జనవరి 16న ఈ నమూనా మిషన్‌ ప్రదర్శన కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు ఈసీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రిమోట్‌ ఓటింగ్‌ (Remote Voting)ను అమల్లోకి తెచ్చేముందు.. ఆచరణలో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈసీ వివరించింది. ఇందుకోసం రాజకీయ పార్టీల అభిప్రాయాల కోరనున్నట్లు పేర్కొంది.

''2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్‌ నమోదైంది. దాదాపు 30 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఆందోళనకరం. ఓటరు తన కొత్త నివాస ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీంతో చాలా మంది ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నారు. అంతర్గత వలసల(దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు కారణంగా ఓటువేయలేకపోవడం ప్రధాన కారణంగా కన్పిస్తోంది. విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలా మంది స్వస్థలాలను వదిలివెళ్తున్నారు. దేశంలో దాదాపు 85శాతం మంది ఇలాంటి వారే'' అని ఈసీ (EC) ఆ ప్రకటనలో వివరించింది. వలసలు వెళ్లినవారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఈ రిమోట్ ఓటింగ్‌పై దృష్టిపెట్టామని తెలిపింది. ప్రజాస్వామ్య పండగలో మరింత మంది పాల్గొనేలా ఈ రిమోట్‌ ఓటింగ్‌ గొప్ప నాంది కాబోతోందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, December 28, 2022

న్యూఇయర్ పార్టీలపై MLA రాజాసింగ్ వ్యాఖ్యలు.....!

*న్యూఇయర్ పార్టీలపై MLA రాజాసింగ్ వ్యాఖ్యలు.....!*

హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు.నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం భారతీయ సంస్కృతి కాదని ఎమ్మెల్యే రాజా సింగ్  అన్నారు. ఈ మేర రాజాసింగ్ ఓ వీడియోను హైదరాబాద్‌లో విడుదల చేశారు.దేశంలోని యువకులు జాగ్రత్తగా ఉండాలని, జనవరి 1వతేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవద్దని ఆయన సూచించారు. యువత తమ స్వస్థలం సంస్కృతి గురించి తెలుసుకోవాలని, భారతీయులది కానిది ఏదైనా వేడుకలు జరుపుకోవద్దని ఆయన కోరారు.నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం భారతీయ సంస్కృతి కాదు, పాశ్చాత్య సంస్కృతి ఇది 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన ప్రజల సంస్కృతి. ఇది చెడ్డ పద్దతి, యువకులు తప్పనిసరిగా తెలుసుకోవాలి'' అని ఎమ్మెల్యే వీడియోలో పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు....!

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు....!*

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఏప్రిల్‌ 3 నుంచి పది పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 నుంచి సంస్కరణలు అమలు అవుతాయని పేర్కొంది.

ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. సైన్స్‌ పేపర్‌లో ఫిజిక్స్‌, బయోలజీకి చెరి సగం మార్కులు ఉంటాయని వెల్లడించింది. సైన్స్‌ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించగా.. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు ఉంటుందని పేర్కొంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, December 26, 2022

భారతదేశంలో మీ స్థాయి ఏమిటి.?

*_కేసీయార్‌కు ఆంధ్రాలో ఏం పని..?_*
_● బాబుకు తెలంగాణలో పనేమిటా..!?_
_● పక్కోడు చేస్తే వ్యభిచారం
మనం చేస్తే శృంగారం.._
_● ఏం బుర్రలు రా మీవి.?_
_●  భారతదేశంలో మీ స్థాయి ఏమిటి.?_
_● అసంబద్ధ వాఖ్యలను తిప్పికోట్టిన తాళ్ళూరి జీవన్_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం, 9440000009)_*

*_స్వతంత్ర భారాతావని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా విహరించే హక్కు ఉంది. అయితే ఇటీవల ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ఓ సభ పెట్టింది. అది సక్సెస్ అయింది. దీఃతో గులాబీ దళం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చంద్రబాబు తెలంగాణాలోకి వస్తారని గులాబీ నేతల గగ్గోలు. మరి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కి ఎలా వెళతారంటూ తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా గట్టి కౌంటర్ ఇచ్చారు._*

*_అసలేం జరిగింది.?:_*
ఏబీఎన్‌లో రాధాకృష్ణ ఓ సీరియస్ ప్రశ్న సంధించాడు కేసీయార్‌కు.. నిజంగా గట్టి ప్రశ్నే. టీడీపీ వాళ్లకు అలా అడగడం చేతకావడం లేదు కాబట్టి ఆ బాధ్యతనూ తనే మీద వేసుకున్నట్టుగా.. 'చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని' అని బీఆర్ఎస్ మంత్రులతో అడిగిస్తున్న కేసీయార్‌కు మరి ఆంధ్రాలో ఏం పని..? తనెందుకు ఆంధ్రాలో పోటీచేయాలి..? ఈ ప్రశ్నకు దారితీసింది ఏమిటంటే..? ఖమ్మంలో చంద్రబాబు సభ సక్సెస్ కావడం…!

*_ఈ ప్రశ్నకు బదులేది.?:_*
గతంతో పోలిస్తే టీడీపీకి తెలంగాణలో పెద్దగా బలం లేకపోయినా... ఆంధ్రా మూలాలున్న ఓటర్లు కనీసం 25 సీట్లలో గెలుపోటముల్ని ప్రభావితం చేయగలరనీ, తమను వదిలేసి వెళ్లిపోయిన చంద్రబాబు పట్ల ఆ ఓటర్లకు కోపమున్నా సరే, వాళ్లు గనుక మళ్లీ తెలుగుదేశం వైపు చూస్తే, అది కేసీయార్‌కు నష్టమనీ, ఎందుకంటే, వాళ్లంతా ప్రస్తుతం కేసీయార్ వెంటే ఉన్నారనీ ఓ విశ్లేషణ.

*_భయ సందేహమా..?:_*
'నమ్ముతారేమో' అని బీఆర్ఎస్ భయసందేహం. అందుకే ఒక్కసారిగా బీఆర్ఎస్ ఉలిక్కిపడి అసలు చంద్రబాబుకు తెలంగాణలో 'ఏం పని' అని మాటల దాడికి దిగింది..? రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడినని చెప్పుకుంటున్న కేసీయారే ఏపీలో పోటీచేయాలని అనుకున్నప్పుడు... ఆల్‌రెడీ పార్టీ ఉనికి, గత చరిత్ర ఉన్న చంద్రబాబు తెలంగాణలో పోటీచేయడానికి అనర్హుడు ఎలా అవుతాడు..? ఎవరి ఆశలు వాళ్లవి. ఓట్లేయాలా..? లేదా..? అనేది ప్రజల ఇష్టం. ‘లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే అన్నట్టుగా ఆంధ్రులంతా దోపిడీదారులే' అని సూత్రీకరించిన కేసీయార్‌ను ఆంధ్రులు ఎందుకు ఆదరించాలి.? ఆదరిస్తారా..’’ అనేది ఆర్కే భావన.

*_వెక్కిరింపు ధోరణి:_*
అందుకే మొన్న నమస్తే తెలంగాణలో వచ్చిన ఓ బ్యానర్ స్టోరీని కాస్త వెక్కిరించే ప్రయత్నం కూడా చేశాడు. నిజంగానే ఓ పిచ్చి వార్త అది. ఎవరో ఊరూపేరూ లేని అనామకులు వచ్చి కలిస్తే ఇక ఏకంగా ఆంధ్రాకు కేసీయార్ ఆశాకిరణం అయిపోయాడా.? అనడుగుతున్నాడు ఆర్కే.! ఢిల్లీలో తనను కలిసేది కూడా ఇలాంటి కేరక్టర్లే.. వాళ్లకు రాజమర్యాదలు.. తెలంగాణ ప్రజల సొమ్ము ఏమవుతుందో..? ఎవరికి ఖర్చవుతుందో..? అంతా బభ్రాజమానం భజగోవిందం..!

 *_ఆర్కే మరో ప్రశ్న:_*
‘‘చంద్రబాబు, షర్మిల, పవన్ కల్యాణ్, ప్రవీణ్‌కుమార్ బీజేపీకి తోడుగా గనుక కలిస్తే కేసీయార్‌కే బోలెడు నష్టం కాదా’’.. ఇదీ ప్రశ్న.. ఈ వాదనతో తెలంగాణలో బీజేపీకి టీడీపీ సాయం కావాలంటే, ఏపీలో 'పొత్తు కుదరాలి' అనేది ఆర్కే భావన. పవన్ కల్యాణ్ ఆశ కూడా అదే.. చంద్రబాబు ధ్యాస కూడా అదే.. కానీ తెలంగాణలో వాళ్లెప్పుడూ ఒకతాటిపైకి రారు.. ఎందుకంటే.. షర్మిల ఆల్‌రెడీ జగన్, బీజేపీ కలిపి వదిలిన బాణమే..! ఏ రీతిలో బీజేపీకి ఫాయిదా అనేది వేరే చర్చ… జగన్‌కు ఎలాగూ తెలంగాణ మీద దృష్టి లేదు.! ఉండదు. అసలు షర్మిలకు జనసేన పొడగిట్టదు.

*_ఇదే పొలిటికల్ లాజిక్:_*
బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లకపోవచ్చు గానీ బీఎస్పీ సొంతంగా బరిలో ఉంటుందేమో.! మాయావతి జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం లేదు. అది కేసీయార్‌కు నష్టమే.! పవన్ కల్యాణ్ పార్టీకి తెలంగాణలో ఏ రేంజ్ ఉనికి ఉందో డిస్కస్ చేయడం కూడా దండుగే.! ఇలా రకరకాల ‘‘ఉశికె ముడి, పెండ ముడి’’ బాపతు సమీకరణాలు చాలా పనిచేస్తాయి రాబోయే రోజుల్లో.. అంతేతప్ప వాళ్లంతా కలవరు. కేసీయార్‌కు ఉమ్మడిగా నష్టం చేకూర్చలేరు. పైగా హిందూ, క్రిస్టియన్ ఓట్లు రకరకాలుగా చీలిపోతే... కాంగ్రెస్ కేసీయార్ వ్యతిరేక ఓట్లను కొన్ని చీల్చితే.. ముస్లిం ఓట్లు ప్లస్ తన సొంత ఓటు బ్యాంకుతో మళ్లీ అధికారానికి తగిన సీట్లు సంపాదించే చాన్స్ కేసీయార్‌కు ఇప్పటికీ సజీవంగా ఉంది…!! కానీ స్థానిక నేతలంటే అక్కడి ప్రజలకు ఎందుకో 'షింక్' కావడం లేదు.

*_తెలంగాణ రాజకీయ ప్రయోగశాల:_*
అవునూ... 'బాబ్బాబు, మీకు ఓట్లేస్తాం' అని ఓటర్లు బతిమిలాడుతున్నా సరే.. 'ఎహె ఆగండి, అలా ఓట్లెలా వేస్తారు..? మా తన్నులాటలు ముందు తెగితే అప్పుడు ఆలోచిద్దాం' అన్నట్టుగా ఉంది రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి. పీసీసీ అధ్యక్షుడి మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన నాయకులు 'ఇప్పుడేం చేస్తారు..?' అనేది మరో ప్రశ్న. ఏమీ చేయరు, కొన్నాళ్లు సైలెంటు, మళ్లీ ఇదే కథ మొదలు. మరోవైపు చంద్రబాబు తనదైన శైలిలో రీఎంట్రీకి పావులు కదుపుతున్నాడు. ఈడీని ముందుపెట్టి బీజేపీ ఇంకాస్త హడావుడిని క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉంది. అది తెలంగాణపై ఆశల్ని ఎలాగూ వదులుకోదు. మొత్తానికి తెలంగాణ రాజకీయ ప్రయోగశాల అవుతోంది…!!

బాక్స్:
*_వీళ్ళంతా కంట్రిబ్యూటర్లే..!:_*
కేసీయార్‌ను కలిసినవారిలో… అసలు ఇప్పుడు ఉనికిలోనే లేని ఓ పత్రిక మాజీ కంట్రిబ్యూటర్ కూడా ఉన్నాడని చెప్పుకొచ్చాడు ఆర్కే.! అదేదో అనర్హత అయినట్టు, రాజకీయాలకు కంట్రిబ్యూటర్లు అస్పృశ్యులు అయినట్టు…!! నిజానికి నాయకులను చూసీ చూసీ, రాజకీయాల్ని అర్థం చేసుకుంటూ నిజంగానే నాయకులుగా ఎదిగే చాన్స్ కంట్రిబ్యూటర్లకే ఉంది. అనేక చోట్ల వాళ్లు రాజకీయాల్లో ఎదుగుతున్నారు కూడా…! ఎదగాలి కూడా.! ఇప్పటి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గతంలో జర్నలిస్టే.! దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కంట్రిబ్యూటరే.! అదే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే క్రాంతి మొన్నటిదాకా జర్నలిస్టే కదా.! ఏపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మొదట్లో కంట్రిబ్యూటరే.! చెబుతూ పోతే బోలెడు మంది.. ఉన్నారు సార్.!

బాక్స్:

*_ఏపీలో మీకేం పని..? -తాళ్ళూరి జీవన్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ_*

ఇది ప్రజాస్వామ్య దేశం. చంద్రబాబు గురించి అవాకులు, చెవాకులు పెలుతున్న నాయకులు... కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో పనేమిటి.? రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులను ఎన్ని తిట్లు తిట్టారో వీడియోలను బయటపెట్టమంటే బయటపెడతాం. నాడు తిట్టిన వాళ్ళు మళ్ళీ ఏ మొఖం పెట్టంకొని ఆంధ్రులను ఓట్లు అడగటానికి వెళతారు.? సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఇరిగేషన్ ప్రాధాన్యత గురించి చెప్పాలంపే అప్పటి చెక్ డ్యాంలను చేసుకోవాలి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అసెంబ్లీలో శాసనసభా నేతలుగా వ్యవహరించినప్పుడు వారు అడిగిన ప్రతి పని ఎన్టీయార్ చేసి పెట్టిన సందర్భాలు ఇప్పటి వారి వారసులు మర్చిపోతే ఎలా.? స్థాయిని బట్టి విమర్శలు చేయాలి గానీ.. ప్రతి గల్లీ లీడర్ స్థాయిని మరచి విమర్శలు చేస్తే సహించం. రాష్ట్రంలో హైదరాబాద్ ను సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిపిన చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున ఓట్లు అడిగే హక్కు ఉంది.

ఆయుర్వేద గుళికల పేరుతో గంజాయి చాక్లెట్స్....!

*ఆయుర్వేద గుళికల పేరుతో గంజాయి చాక్లెట్స్....!*

*నిందితుడి అరెస్టు*

*నిందితుడు జాఫర్‌ ఉర్‌ హక్‌, స్వాధీనం చేసుకున్న గంజాయి చాక్లెట్లు*

హైదరాబాద్‌: నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బిహార్‌వాసిని దక్షిణమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. 31 కిలోల 164ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన మహ్మద్‌ జాఫర్‌ ఉర్‌హక్‌(41) 2015లో ఉపాధి కోసం నగరం చేరాడు. ఆసిఫ్‌నగర్‌లో మగ్గం పనిచేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం యూపీ, బిహార్‌ నుంచి తక్కువ ధరకు గంజాయి చాక్టెల్లు తెచ్చి విక్రయించసాగాడు.

బిహార్‌లో ఒక్కో చాక్లెట్‌ రూ.5కు కొనుగోలు చేసి నగరంలో రూ.20-50 వరకూ విక్రయించేవాడు. ఇటీవల పెద్దమొత్తంలో వాటిని తీసుకొచ్చి తన గదిలో ఉంచి అమ్ముతున్నాడు. పోలీసులకు పట్టుబడకుండా, ఎవరూ అనుమానించకుండా గంజాయి చాక్లెట్లు ఉంచే ప్యాకెట్లపై ఆయుర్వేద గుళికలంటూ పెద్ద అక్షరాలుంటాయి. వీటిని ఒంటినొప్పులు, జలుబు, దగ్గు వంటి సమస్యలకు ఉపయోగిస్తారంటూ విక్రయదారులకు చెబుతాడు. వీటి గురించి తెలిసిన వ్యక్తులకు మాత్రమే గంజాయి చాక్లెట్స్‌ పేర అధిక మొత్తంలో అమ్ముతుంటాడు.

సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ(ఓఎస్‌డీ) రాధాకిషన్‌రావు, దక్షిణమండలం ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ ఖలీల్‌పాషా బృందం ఆసిఫ్‌నగర్‌లోని జాఫర్‌ ఉర్‌హక్‌ నివాసంలో తనిఖీలు చేశారు. చార్మినార్‌ గోల్డ్‌ మునక్కా, విజయవాటి, ఆర్‌డీ శివ మునక్కా పేర్లతో ఉన్న 164 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆసిఫ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

వాహన దారులకు భారీ ఊరట....?ఫాస్ట్ ట్యాగ్ పై కోర్టులో పిటిషన్.... అదేజరిగితే

*వాహన దారులకు భారీ ఊరట....?ఫాస్ట్ ట్యాగ్ పై కోర్టులో పిటిషన్.... అదేజరిగితే*

ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ ట్యాక్స్ చెల్లించాలనే నిబంధనను తప‍్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ రవీందర్‌ త్యాగి పిటిషన్‌ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌పై చీఫ్‌ జస్టీస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టీస్‌ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

విచారణలో భాగంగా...ఈ నిబంధన వివక్షపూరితంగా, ఏకపక్షంగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని చీఫ్‌ జస్టీస్‌ సతీష్‌ చంద్ర శర్మ బెంచ్‌ వాదించింది. వాహనదారులు ఫాస్టాగ్‌ వినియోగించకుండా నగదు రూపంలో చెల్లించినట్లయితే..వారి వద్ద నుంచి రెట్టింపు రేటుతో టోల్ వసూలు చేస్తున్నారనే పిటిషన్‌పై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), కేంద్రం ప్రతిస్పందనను కోరింది. అధికారులు తమ ప్రత్యుత్తరాలను దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు..తదుపరి విచారణను ఏప్రిల్ 18న వాయిదా వేసింది.

ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనదారుల నుంచి డబుల్‌ టోల్‌ ఛార్జీలు వసూలు చేసేలా మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ ఆఫ్‌ ఇండియా(ఎంఓఆర్‌టీ అండ్‌ హెచ్‌), నేషనల్‌ హైవే అథారటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)తో కూడిన నేషనల్‌ హైవే ఫీజ్‌ అమాండ్‌మెంట్‌ రూల్స్‌ -2020 యాక్ట్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ రవీందర్ త్యాగి కోరారు.

ఈ నిబంధనలు, సర్క్యులర్ వల్ల టోల్ లేన్‌లను 100 శాతం ఫాస్ట్‌ట్యాగ్ లేన్‌లుగా మారుస్తున్నాయని, దీని ఫలితంగా ఫాస్ట్‌ట్యాగ్ లేని ప్రయాణికులు టోల్ మొత్తాన్ని రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషనర్, న్యాయవాది సైతం..టోల్ కంటే రెట్టింపు నగదు చెల్లించాల్సిన అవసరం ఉన్నందున తన కారులో ఫాస్ట్‌ట్యాగ్ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు.

ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు రెట్టింపు రేటుతో టోల్ ట్యాక్స్ చెల్లించానని చెప్పారు. ఢిల్లీ నుంచి హర్యానాలోని ఫరీదాబాద్ పర్యటనలో తాను చూసిన ప్రయాణికుల వేదనను ఆయన ప్రస్తావించారు. అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం), 19 (వాక్ మరియు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ)లను ఉల్లంఘించడమేనని, డబుల్ టోల్ టాక్స్ వసూలు చేసే పద్ధతిని నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై కేంద్రం సానుకూలంగా స్పందింస్తే డబుల్‌ టోల్‌ ట్యాక్స్‌ రద్దు చేయడం లేదంటే.. ఫాస్టాగ్‌ను వినియోగించేలా మరింత సమయం ఇచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే డబుల్‌ టోల్‌ ఛార్జీల నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, December 24, 2022

బానిసలుగా బతుకుతారా??


*_ప్రశ్నించకుంటే బానిస బతుకే ౼అనంచిన్ని వెంకటేశ్వరరావు_*
_● కళాకారుడి కాళ్ళకు సాక్సులు తొడిగిన కోయిన్ని వెంకన్న_
_● పూర్వ పది జిల్లాల నుంచి హాజరయిన ఆర్టీఐ యోధులు_
_● భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన_
_● ఆకట్టుకున్న కళా బృందాలు_
_● ఘనంగా ముగిసిన ప్రజా చైతన్యయాత్ర_

*_ప్రజలు ప్రశ్నించటం మరచిపోతే బానిసల్లాగా బ్రతకాల్సి ఉంటుందని, బానిసలుగా బతుకుతారో, అంబేద్కర్ ఊహించిన భారతీయ పౌరులుగా స్వేచ్ఛగా బతుకుతారో తేల్చుకోవల్సిన తరుణం వచ్చిందని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టిజేఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ప్రజా చైతన్యయాత్ర ఖమ్మం జిల్లాలో సమాచార హక్కు ప్రచార వేదిక ఆధ్వర్వంలో 45 రోజులపాటు కోయిన్ని వెంకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు._*

ఈ సందర్భంగా అనంచిన్ని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... పరుగు వేగంలో మాత్రమే ఒక చిన్నసెకను విలువ తెలుస్తోందని, ఆర్టీఐ సేవా సంస్థలను మొగ్గలో తుంచేయాలనే ప్రయత్నాలు అనేకం జరిగాయని, గ్రామస్థాయిలో కక్షలు ఎక్కవగా ఉంటాయని, అయినా కూడా గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం విషయంలో ఈ సంస్థ చేసిన, చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు. సభాధ్యక్షుడు కోయిన్ని వెంకన్న మాట్ఖలాడుతూ...45 రోజుల పాటు తమ ఆర్టీఐ కార్యకర్తలు చేసిన త్యాగాలు మరువలేనివని, ఆర్థిక భారం వెంటాడుతున్నా.. తమ.లక్ష్యాన్ని ఎవరూ వదల లేదని, భవిష్యత్తులో మరెన్నో చారిత్రక ఘట్టాలకు ఇది పునాదిగా ఉంటుందని, పూర్వ పది జిల్లాల నుంచి హాజరైన యోధులకు కృతజ్ఞతలను తెలిపారు. ఖమ్మం జిల్లాలో 45 రోజుల పాటి జరిగిన ఈ ప్రజా చైతన్యయాత్రలో పదిజిల్లాలకు చెందిన సూరన్న, శాంతకుమార్, వెంకటేశం, సుజాత సుకుమార్, పెదమ్మ విజయశ్రీను, కుమారి, స్వప్న, నరేంద్ర, సంజీవరావు మరియమ్మ, నిర్మల, శతక కృష్ణరావు, గోపయ్య ఇరవై ఆరుసరు ఆర్.టి.ఏ కార్యకర్తలతో పాటు రాఘవులు, పాల్వంచ రామారావు, జి.రామనాధం తదితరులు అతిథులుగా పాల్గొని అభినందనలు తెలిపారు. ప్రముఖ సేవాతత్పరుడు అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్నం శ్రీనివాసరావు శాలువాలతో సన్మానించారు.

బాక్స్:
*_కాళ్ళకు సాక్సులు తొడిగిన కోయిన్ని_*
45 రోజులపాటు క్రమం తప్పకుండా జరిగిన ఆర్టిఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభలో ఓ ఉద్విగ్నభరితమైన సన్నివేశం చోటు చేసుకుంది. నారాయణ అనే వృద్ద కళాకారుడు తన మనవడు చనిపోయినా.. ప్రజా చైతన్య యాత్రలో క్రమం తప్పకుండా పాల్గొన్నారు. ఈ సభలో ఆయనకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సభాధ్యక్షుడు కోయిన్ని వెంకన్న నారాయణకు సాక్సులు తొడగటంతో సభలో ఓ ఉద్విగ్నభరితమైన వాతావరణం నెలకొంది.

బాక్స్:
*_పేదల ఇళ్ళు క్రీడా ప్రాంగణాలా..?_*
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం శనివారం కేశవాపురం గ్రామంలో రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా స్థానిక అధికారపార్టీ నాయకుల అండదండలు వత్తిళ్లతో ఆరుగాలం నుండీ నివసిస్తున్న నిరుపేద చాకలి మహిళల గుడిసెలు ఇండ్లు,షెడ్లు కూల్చి వేశారని, ఉన్న కొద్దిపాటి స్థలాలు ఆక్రమించుకుని పంచాయతీలో నమోదైన పేర్లు తొలగించి, క్రీడా ప్రాంగణం సాకుతో ఆక్రమించడం పట్ల స్థానిక ఎన్జీఓ 'మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ అధ్యక్షులు ఇశ్నపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు సేకరణ  కార్యక్రమంలో  చార్ మార్ శంకర్ (కోయిన్ని వెంకన్న), రాజకీయ విశ్లేషకులు అనంచిన్ని వెంకటేశ్వరావు, సామాజిక కార్యకర్త పాల్వంచ రామారావు, డాక్టర్ జి యస్ ఆర్ ఆంజనేయులు, బీ.వీ. రాఘవులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ డీజీపీ రేసులో పోటా పోటీ

*తెలంగాణ డీజీపీ రేసులో పోటా పోటీ*

*చర్చలో ఏసీబీ డీజీ అంజనీకుమార్, హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ పేర్లు*

*ప్రభుత్వ పరిశీలనలో హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా పేరు?*

*ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న* *ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి*
హైదరాబాద్‌: తెలంగాణ కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలీస్‌ విభాగాధిపతిగా ఎవరు వస్తారన్న చర్చ పోలీస్‌ వర్గాల్లో జోరందుకుంది. ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కొత్త డీజీపీగా నియమించనుందనే విషయానికి మరో వారంలో తెరపడనుంది. హెచ్‌ఓపీఎఫ్‌ (హెడ్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌) డీజీపీ రేసులో ఏసీబీ డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేసులో మాత్రం వీరి ముగ్గురితోపాటు మరో సీనియర్‌ ఐపీఎస్‌ రాజీవ్‌రతన్‌ సైతం ఉన్నట్టు సమాచారం.

డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితోపాటు ప్రస్తుతం సీనియార్టీ ప్రకారం డీజీపీ ర్యాంకులో 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఉమేశ్‌ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్, రవిగుప్తా ఉన్నారు. సీఐడీ డీజీగా పనిచేసిన మరో సీనియర్‌ ఐపీఎస్‌ గోవింద్‌సింగ్‌ గత నెలలో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్‌కు డీజీ ర్యాంకు దక్కనుంది. అయితే, అందరిలోకి సీనియర్‌ అయిన ఉమేశ్‌ షరాఫ్‌ పదవీ కాలం 2023 జూన్‌తో ముగియనుంది. కేవలం ఆరు నెలల కాలమే ఉన్నందున ఆయనకు అవకాశాలు తక్కువే అన్న అభిప్రాయాలు పోలీస్‌ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలాఉండగా, గతంలో హైదరాబాద్‌ సీపీగా పనిచేసిన వారికి డీజీపీగా పదోన్నతి లభించింది. తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి విషయంలోనూ ఇదే మాదిరి జరిగింది. వారిద్దరు సైతం హైదరాబాద్‌ సీపీగా పనిచేస్తూ డీజీపీగా పదోన్నతి పొందారు. ఆ లెక్కన డీజీపీ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో అంజనీకుమార్‌ గతంలో హైదరాబాద్‌ సీపీగా పనిచేయగా, సీవీ ఆనంద్‌ ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నారు.

*ఎక్స్‌కేడర్‌ కోటాలో సీవీ ఆనంద్‌కు పదోన్నతి?*
సీఐడీ డీజీగా పనిచేసి ఇటీవల రిటైరైన గోవింద్‌ సింగ్‌ స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌ రతన్‌కు డీజీ ర్యాంకులో పదోన్నతి దక్కింది. అయితే ప్రభుత్వం ఎక్స్‌కేడర్‌ కోటా కింద ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించవచ్చు. అలా సీవీ ఆనంద్‌ అడిషనల్‌ డీజీ ర్యాంకు నుంచి డీజీ ర్యాంకుకు పదోన్నతి పొందుతారు. లేదంటే ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న మహేందర్‌రెడ్డి స్థానంలో సీవీ ఆనంద్‌కు డీజీ హోదా దక్కే అవకాశముంది.

ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రవిగుప్తా పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 30 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకుని అదనపు డీజీపీ ర్యాంకులో ఉన్న వారిని సైతం డీజీపీ పోస్టులో నియమించే వెసులుబాటు ఉంది. దీని ప్రకారం 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్‌ (ప్రస్తుతం శాంతి భద్రతల అడిషనల్‌ డీజీ) సైతం డీజీపీ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమేశ్‌ షరాఫ్‌ (1989), అంజనీకుమార్‌ (1990), రవిగుప్తా (1990), రాజీవ్‌ రతన్‌ (1991), సీవీ ఆనంద్‌ (1991) పేర్లు యూపీఎస్సీ సెలెక్షన్‌ కమిటీకి పంపినట్టు సమాచారం. ఇందులోంచి కేంద్రం ముగ్గురిని షార్ట్‌ లిస్ట్‌ చేస్తే వారిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనున్నారు. లేదంటే ముందుగా ఒకరిని ఇంచార్జి డీజీపీగా నియమించి, తర్వాత పూర్తిస్థాయి డీజీపీని నియమించే అవకాశం ఉన్నట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి.

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, December 23, 2022

నీ కులం నీకు అడ్డం..?

*_స్వర్గంలో కలుద్దాం.!_*
*_మన్నించు 'మా' కైకాల..!_*
_★ అవార్డులు నీకు (అ)దాసోహం_
_★ నీ కులం నీకు అడ్డం..?_
_★ నిన్ను తప్పకుండా మరోసారి కలుస్తాం.!_
_★ నికృష్ట అవార్డులు చచ్చిన తర్వాత ఎందుకు.?_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*

*_నిజంగా కైకాల సత్యనారాయణకు రావల్సినంత గుర్తింపు దక్కిందా..? ఎందుకో దక్కలేదనే అనిపిస్తోంది. ఒక ఎస్వీరంగారావులాగే తనూ వివక్షకు గురయ్యాడా..? 62 ఏళ్లపాటు సినిమా సెట్లలో ఉండి, 878 సినిమాలు చేయడం చిన్న విషయం ఏమీ కాదు. ఎప్పుడో 1959లో మొదలైన కెరీర్ మూడేళ్ల క్రితం నాటి మహర్షి వరకు.. ఈ సంఖ్య అనితరసాధ్యం.! కొందరికి మినహా.. మరి ఆయనకు దక్కిన పురస్కారాలు..? ప్చ్, చెప్పదగినవేమీ లేవు._*

*_మొదట్లో 'డూప్'గా.._*
నిజానికి తను మొదట్లో హీరో.. ఎన్టీయార్, ఏఎన్నార్‌లాగు స్ఫురద్రూపం. డైలాగ్ డెలివరీ గానీ, యాక్షన్ గానీ ఎవరికీ తక్కువ కాదు. అవకాశాల్లేక ఎన్టీయార్‌కు డూప్‌‌గా చేశాడు. తప్పులేదు. తరువాత విలన్‌గా బ్రేక్ ఈవెన్. ఇక ఏ సినిమా అయినా సరే సత్యనారాయణ అంటే విలన్.. డిష్యూం డిష్యూం కుర్ర హీరోల నుంచి పెద్ద హీరోల దాకా వాళ్లతో తన్నులు తినేవాడు. మరి తెలుగు విలన్ అంటే అంతేగా..!

*_చిల్లరతనం లేకుండా.._*
తరువాత ఇతర పాత్రలవైపు దృష్టి పెట్టాడు  తన కామెడీలో టైమింగ్ సూపర్. తను వేసిన సాఫ్ట్ రోల్స్ కూడా తనలోని నటుడిని ఆవిష్కరించాయి. ప్రత్యేకించి ఘటోత్కచుడు గానీ, యమలీల గానీ తన పాత్రలు హైలైట్. అసలు యమధర్మరాజు అంటే ఇలాగే ఉంటాడేమో అన్నట్టుగా ఫిట్టయ్యాడు తను.. ఆ సీరియస్ యముడి పాత్రలో కూడా కామెడీని, కోపాన్ని, ప్రేమను పండించాడు. ఏమాత్రం చిల్లరతనం లేకుండా..!

*_ఒక్కటంటే ఒకటి మాత్రమే.._*
రాజకీయాల్లో అలా వచ్చి, ఇలా వెళ్లిపోయాడు తను.. రాజకీయాలు తనకు సూట్ కావు. అందుకని ఆ కెరీర్‌ను పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. విషయానికి వస్తే ఎవరెవరికో నటన బేసిక్స్ కూడా తెలియని వాళ్లకు పద్మ పురస్కారాలు వస్తుంటాయి. ఏవేవో అవార్డులు మెడలో పడుతుంటాయి. కానీ సంపూర్ణ నటుడు సత్యనారాయణకు అలా గుర్తుంచుకోదగిన పురస్కారాలు ఏమీ వచ్చినట్టు గుర్తులేదు. ఒక్కటంటే ఒక్కటి అది కూడా 2017లో ఫిల్మ్‌ఫేర్ జీవితకాల సాఫల్య అవార్డు మినహా..!

*_పైరవీలు చేతకాకనే.._*
పురస్కారాలకు పైరవీలు చేతకాక అవి తన దగ్గరకు రాలేదా..? ఇండస్ట్రీలో అవార్డులు, పురస్కారాలు అంటేనే పైరవీల మయం. లేక ఇండస్ట్రీ మొత్తం ఒకే కులం ఆధిపత్యం కింద ఉంది, అన్యకులానికి చెందినందున కైకాల వివక్షకు గురయ్యాడా..? చాలామంది నమ్మేది ఇదే… చిరంజీవి వచ్చాక సీన్ చేంజ్ అయ్యింది గానీ… అంతకుముందు అంతా ఆ కులం ఆధిపత్యమే కదా..! అక్కడక్కడా కొన్ని మినహాయింపులు తప్ప.. స్టూడియోలు వాళ్లవే.. హీరోలు వాళ్లే… నిర్మాతలు వాళ్లే.. వాళ్లు గీసిందే గీత, చెప్పిందే శాసనం. సరే, ఇది చర్చిస్తే ఒడవదు, తెగదు. చివరకు మొన్న తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో చాన్నాళ్లు ఉంటే ఒక్క చిరంజీవి మాత్రమే వెళ్లి పరామర్శించి వచ్చాడు… (సత్యనారాయణలాగే పౌరాణిక ప్రతినాయక పాత్రలకు గతంలో ఎస్వీ రంగారావు ఫేమస్.. రావణుడు, దుర్యోధనుడు ఎట్సెట్రా పాత్రలు ఎస్వీఆర్ వేస్తేనే వాటికి ఓ విలువ..)

*_దక్కిన గుర్తింపు ఏమిటి..?_*
ఇప్పటిదాాకా కైకాల 878 సినిమాల్లో నటిస్తే, వాటిల్లో 28 పౌరాణికాలు, 51 జానపదాలు, 9 చారిత్రికాలు… తను 200 మంది దర్శకులతో పనిచేశాడు… ఓపికతోపాటు, తన వృత్తికి తను నిబద్దుడిగా, విధేయంగా ఉంటే తప్ప అందరు దర్శకులతో కలిసి పనిచేయడం కష్టం. మరి ఆ సత్యనారాయణకు దక్కిన గుర్తింపు ఏమిటి..? కనీసం తనను సాగనంపేటప్పుడైనా ఈ దిక్కుమాలిన వివక్షకు తెరవేసి… అత్యంత సీనియర్ నటుడికి గౌరవప్రదమైన వీడ్కోలు చెప్పండర్రా…!!

Thursday, December 22, 2022

దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్దమా.?

*_ఎంపీ రంజిత్ రెడ్డిగారూ... భలే ఇరుక్కున్నారు సార్.!_*
_● రూ.150 కోట్ల కోళ్ల దాణా స్కాంలో బిగుస్తున్న ఉచ్చు..!_
_● 'ఫీడ్' ఇచ్చి లాక్కున్న భూములు ఎన్ని?_
_● 'నోవెల్ టెక్' పేరుతో 'వైట్‌' గా మారిన 'బ్లాక్ మనీ' ఎంత.?_
_● కుంభకోణాన్ని తిరగేస్తుంటే.. బయట పడుతున్న ఆగడాలు_
_● లంచాలతోనే అంగన్ వాడీ గుడ్లను మింగేస్తున్న వైనం_
_● పక్కా ఆధారాలతో వెలుగులోకి..!_
_● దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్దమా.?_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*

*_పశుదాణా కుంభకోణం గతంలో దేశాన్ని ఓ ఊపు ఊపింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ కేంద్రంగా 'కోళ్ళ దాణా స్కాం' వెలుగు చూసింది. ఇందులో ఏకంగా ఎంపీ రంజిత్ రెడ్డి పేరు బట్టబయలు కావడం గమనార్హం. ఒకప్పుడు 'కోళ్ల బిజినెస్' చేయాలంటే రైతులు భయపడే వారు. దరిద్రం ఏమిటంటే..కోళ్ళ వ్యాపారం కార్పొరేట్ స్థాయికి ఎదిగిన తర్వాత చిన్న, సన్న కారు రైతులను మింగేసి 'మాఫియా' గుత్తాధిపత్యం వహించింది. ఈ దరిద్రులు 'సర్కార్ నేరుగా దాణాకు ఇచ్చే సబ్సిడీ‌లో ...' రెండేళ్లలో ఏకంగా రూ.150 కోట్లు 'సిగ్ఢు, ఎగ్గు' లేకుండా బుక్కారు. చిన్న, సన్నకారు రైతుల నోట్లో మట్టి కొట్టి మరీ భూములను కొట్టేశారు. బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు వందల కోట్లకు కంపెనీని అమ్మేశారని తెలుస్తోంది. ఇవన్నీ సరిపోవన్నట్లు... పేదోళ్ళకు సేవలందించే.. 'అంగన్‌ వాడీ గుడ్ల'పై కూడా పడ్డారు. 'కొత్త టెండర్ల' రూపంలో ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతున్నా పౌష్టికాహారం తగ్గించేలా 'కుట్ర'లు చేశారు. ఆ టెండర్స్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దమ్ముంటే రండి బహిరంగ చర్చకు సిద్దం..! వచ్చే దమ్ముందా ర్రా.. దరిద్రుల్లారా..?_*

*_'కోళ్ళ దాణా స్కాం'కి ఎలా 'తెర' లేపారంటే..?:_*
గుడ్లు పెట్టే 'కోళ్ల లేయర్ ఫెడరేషన్' అధ్యక్షులుగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాంసం కోసం పెంచే బాయిలర్ కోళ్ల 'బీడర్స్ అసోసియేషన్' అధ్యక్షుడిగా ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఉన్నారు. 10 వేల మంది కోళ్ల పెంపకం రైతుల కోసం మొక్క జొన్నలు కొనుగోలు చేసి సబ్సిడీ రూపంలో తక్కువ ధరకు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం స్కీం ప్రవేశ పెట్టింది. సబ్సిడీ ఎవరెవరకి ఇవ్వాలో...? ఫెడరేషన్, అసోసియేషన్ కే వదిలేసింది. (ఇదే అదనుగా భావించారామో..!)

*_3 కంపెనీలు..వంద కోట్లు:_*
దీంతో 8 లక్షల టన్నుల దాణాను సబ్సిడీ రూపంలో వీరికి ప్రభుత్వం అప్పగించింది. అయితే.. రైతులకు సబ్సిడీ ఇవ్వకుండా వారే తీసుకుని తమకు చెందిన ఫీడింగ్ మిల్లుల నుంచి మార్కెట్ రేటుకు అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సబ్సిడీ మొత్తం రూ.100 కోట్ల వరకు కేవలం మూడు కంపెనీలే కొట్టేశాయని తెలుస్తోంది. 2018 జూలై, అక్టోబర్, 2019 ఫిబ్రవరిలో మూడు ధపాలుగా దాణా తీసుకున్నారు. కిలోకు రూపాయలు 12, 14, 18 చొప్పున అప్పగించారు. మార్కెట్‌ లో రూ.27కు అమ్ముకున్నారు.

*_అవే నాలుగు కంపెనీలకు 60 శాతం దాణా!:_*
స్నేహా చికెన్ రాంరెడ్డికి చెందిన కంపెనీ 1,25,000ల టన్నుల దాణా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన పెంచిన కోళ్ల సంఖ్య 12 లక్షలకు మించి ఉండవని పలువురు చర్చించుకుంటున్నారు.

*_బరి తెగించి మరీ..:_*
రంజిత్ రెడ్డికి చెందిన శ్రీ రాజేశ్వర ఫామ్స్ 55 వేల టన్నులు,నోవల్ టెక్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 44 టన్నుల దాణా తీసుకున్నట్టు సమాచారం. ఆయన పెంచే కోళ్లు, లీజులిచ్చిన ఫామ్స్ అన్నీ కలుపుకున్నా 15 లక్షలు దాటవని తెలుస్తోంది. నేరుగా పెంచే కోళ్లు రెండున్నర లక్షలు మాత్రమే ఉంటాయని అంటున్నారు. మరో కంపెనీ మధుసూదన్ రావుకు చెందిన 'విమల ఫీడ్స్' మరో లక్ష టన్నులు తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటి కంటే దేశంలోనే అత్యంత పెద్ద కంపెనీ అయిన, కోటి కోళ్లను ఉత్పత్తి చేసే వెంకటేశ్వర మాత్రం 60 వేల టన్నులే తీసుకుంది. దీనితో పాటు వెంకటరమణ పౌల్ట్రీ, లక్ష్మీ నరసింహా పౌల్ట్రీలు ఎక్కువ కోళ్లను పెంచుతారని పేరుంది. కానీ, వారికి అతి తక్కువగా దాణా ఇచ్చినట్టు సమాచారం. మరో 6 వేల మంది రైతులకు అసలు దాణానే అందించలేదు. దీన్ని వారికి చెందిన ప్రైవేట్ కమర్షియల్ ఫీడ్ కంపెనీకి తరలించుకుని అమ్మేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

*_2 లక్షల టన్నులకు సబ్సిడీ మాయం:_*
ఈ మొత్తం వ్యవహారంలో సుమారు 2 లక్షల టన్నులకు సబ్సిడీని మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క టన్నుకు 9 వేల రూపాయల సబ్సిడీ చెల్లిస్తోంది ప్రభుత్వం. మార్కెట్‌ లో 12వేల రూపాయలకు ఎక్కువగా వారు అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంటే రూ.240 కోట్ల స్కాంకి తెరలేపారన్నమాట. ఇందులో వివిధ ఖర్చులు తీసివేసినా రూ.160 కోట్ల స్కాం బయటపడింది.

*_'నోవల్ టెక్‌'తో 'బ్లాక్ టు వైట్' నాటకాలు!_*
ఎంపీ రంజిత్ రెడ్డి జీవితంలో అతి పెద్ద డీల్ గా 'రోహిణీ మినరల్స్ కంపెనీ' క్రయ విక్రయాలను పలువురు చెబుతున్నారు. అమెరికాకు చెందిన సంస్థకు తన రోహిణీ కంపెనీని అమ్మేశారు. ఇండియా మార్కెట్‌ లో రూ.150 కోట్ల విలువ దాటని కంపెనీని రూ.600 కోట్లకు అమ్మేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. కిక్ బ్యాక్ ద్వారా ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మళ్లీ అడ్వైజర్ డైరెక్టర్‌ గా ఉండాలని సూచించారు. 10 ఏండ్ల వరకు మరో ఫీడ్ కంపెనీ పెట్టొద్దని షరతులు ఉన్నట్లు సమాచారం.

*_'సత్తా' చూపిన రూటు డిఫరెంట్:_*
వీటన్నింటినీ తుంగలో తొక్కి మళ్లీ ఎస్ఆర్ ఫీడ్ ని నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ అదే కంపెనీ కొనుగోలుకు బేరసారాలు నడిచాయని సమాచారం. ఎంతో ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన కంపెనీని రూ.250 నుంచి 300 కోట్లకు విక్రయించేలా సంప్రదింపులు జరిగినట్లుగా చెబుతున్నారు. అంటే రూ.300 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై ఫిర్యాదులు అందుతున్నట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా క్రయ విక్రయాల వివరాలను 'తెలంగాణ వాచ్' సంపాదించింది.

*_రైతుల భూములను మింగిన ఫీడ్ కంపెనీలు!:_*
వ్యవసాయంలో రైతుల భూములను వడ్డీ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు కోళ్లకు దాణా సప్లై చేసి ఆ భూములను లాక్కున్న కంపెనీలూ ఉన్నాయి. అందుకు ఎంపీ రంజిత్ రెడ్డి కంపెనీలే ఉదాహరణగా పలువురు పేర్కొంటున్నారు. సబ్సిడీలు ఇవ్వండి అంటూ రైతుల పేర్లు చెప్పి చిన్న రైతులను మింగేశారని, ఆ భూముల విలువకు సమానమైన ఫీడ్ అమ్మకం జరిపి ఆ తర్వాత లాక్కున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. షాద్ నగర్‌ లోని చోల్లపల్లిలో, కందుకూర్ లోని గుమ్మడెల్లీ, మాల్, తూప్రాన్ వద్ద ఖరీదైన భూములను ఇట్లే కాజేశారని, తాజా మార్కెట్ విలువ ప్రకారం వారికి భూమి మిగిలి ఉంటే ఎంతో లాభం జరిగేదని రైతులు చర్చించుకుంటున్నారు. కానీ, ఆ భూములపై కన్నేసి రైతులకు నష్టం వాటిల్లేలా చేశారు. సుమారు 500 ఎకరాలు వారి కుటుంబ సభ్యుల పేరిట భూములు ఉన్నాయంటే కోళ్ల వ్యాపారం ఎలా చేశారో అర్ధమవుతోంది.

బాక్స్:
*_'తొలివెలుగు తెలియదట..!' అవునా..?:_*
దాణా స్కాం బయటపడిన తర్వాత గుడ్ల టెండర్స్ స్కాంను మొదట 'తొలివెలుగు' వెలుగులోకి తెచ్చింది. ఈ టెండర్స్ గోల్ మాల్‌ లో ఓ మహిళా మంత్రికి ఫిబ్రవరిలో రూ.70 లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంపీకి చీకటి ఒప్పందాలు ఉన్నట్లు తెలిసింది. దీనిపై 'తొలివెలుగు క్రైంబ్యూరో' వివరణ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. నిర్వహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. 'ఏం రాసుకుంటారో రాసుకోండి.. అసలు తొలివెలుగు ఎక్కడ ఉందో తెలియదని.. తనను ఎమీ అడగవద్దు' అని ఎంపీ సెలవిచ్చారు. వివరణ ఇవ్వటం కూడా 'రాకుంటే ఎలా..?' అని ఈ సారుకు ఎవరు చెప్పాలి.?

సీనియర్‌ నటుడు కైకాల కన్నుమూత

*_సీనియర్‌ నటుడు కైకాల కన్నుమూత_*

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు)*

*_టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, క‌మెడియ‌న్ ఇలా అన్నీ ర‌కాల ప్రాత‌ల‌ను పోషించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు కైకాల. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు స‌త్య‌నారాయ‌ణ‌. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. కైకాల మరణ వార్తతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు._*

 ★   కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో1935 జులై 25న జన్మించిన కైకాల సత్యనారాయణ
 ★   గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడైయ్యాడు
★    1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది
 ★   కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు
★    నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల.. 777 చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ
★    కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు
★    కైకాల సత్యనారాయణ నటించిన చివరి చిత్రం: మహర్షి

గుళ్ళలో అరిటాకులు లేదా విస్తళ్లలోనే అన్నదానం.....!

*గుళ్ళలో అరిటాకులు లేదా విస్తళ్లలోనే అన్నదానం.....!*

*స్టీల్‌ప్లేట్‌లో పెట్టేచోట కూడా ప్లేట్‌లో ఆకువేసి వడ్డింపు*

*ఈవోలకు దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలు*
అమరావతి: ఆలయాల్లో నిర్వహించే అన్నదానంలో భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే వడ్డించాలని దేవదాయశాఖ నిర్ణయించింది.ఈ మేరకు బుధవారం రాష్ట్రంలోని ఆలయాల ఈవోలకు దేవదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని దేవదాయశాఖ పరిధిలోని అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

మంగళవారం కూడా రాష్ట్రంలోని పది ప్రధాన ఆలయాల్లోనే కేవలం మధ్యాహ్నం వేళ 2,24,727 మంది భక్తులకు అన్నదానం జరిగింది. కొన్ని ఆలయాల్లో స్టీల్‌ప్లేట్లలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో.. ఆలయాల్లో అన్నదానం పేరుతో అందజేసే ఆహారానికి మరింత పవిత్రతను కల్పించేందుకు భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే భోజనం వడ్డించాలని నిర్ణయించినట్టు దేవదాయశాఖ కమిషనర్‌ ఈవోలకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఒకవేళ స్టీల్‌ప్లేట్‌లోనే వడ్డించాల్సి వస్తే.. ప్లేట్‌లో ఆకువేసి వడ్డించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇటీవల ప్రధాన ఆలయాల ఈవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోను సూచించిన విషయాన్ని కమిషనర్‌ తన ఆదేశాల్లో ఉదహరించారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, December 21, 2022

అతను ఓ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి..ఈ పైత్యం ఇంకా ఎన్నాళ్ళు.?

*_ఓ శ్రీనివాసా...! ఏందీ పని.!!_*
_● ఈ ప్రదక్షిణలు ఏంటి.?_
_● ఆ కాళ్ళు మొక్కుట ఏంది?_
_● ఈ పైత్యం ఇంకా ఎన్నాళ్ళు.?_
_● ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా.?_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

[ *_"ఏసుక్రీస్తు" గురించి... హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యల👇 EXCLUSIVE వీడియో_*

*https://youtu.be/QXMDLRxo8Sc* ]

*_అతను ఓ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి. ఒకసారి స్వయం ప్రకటిత దేవత చుట్టూ ప్రదక్షిణలు. మరోసారి రెండు నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు సిఎం కాళ్ళు మొక్కటం. ఇప్పుడు ఏకంగా ఒక మత ఉత్సవ వేడుకల్లో వివాదాస్పద వ్యాఖ్యలు. ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా..? ఆయనకు లేని మొహమాటం మనకు ఎందుకు.? ఆయనే... గౌరవనీయులైన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు._*

*_వివాదాలను వాటేసుకొని..:_*
నిత్యం వివాదాల్లో ఉండాలని కోరుకుంటారో ఏమోగానీ.. ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీతో వార్తల్లో నిలుస్తుంటారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. ఈమధ్యే సీఎం కేసీఆర్ కాళ్లపై పడి ఈయన విమర్శల పాలయిన విషయం తెలిసిందే.

*_అసలేం జరిగింది.?:_*
భద్రాద్రిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరినీ నవ్వుతూ పలకరించారు. తర్వాత మైక్ అందుకున్న డీహెచ్.. క్రైస్తవంపై వీర లెవల్ లో స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడా కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి.

*_హేమిటో... ఇది..:_*
దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని చెప్పారు డీహెచ్. ఏసుక్రీస్తు దయవల్లే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని తెలిపారు. అసలు.. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు. ‘‘ఏసు నామాన్ని అనునిత్యం స్మరిస్తూ.. ఆ దేవుణి సందేశాన్ని ప్రతి ఒక్క గుండెకు, గడపకు చేరేలా చెయ్యాలి. ఇంతకుముందు జరుపుకున్న క్రిస్మస్‌ లు వేరు. ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్‌ లు వేరు. గత రెండున్నర సంవత్సరాల నుంచి ప్రపంచ మానవాళికి కరోనా ప్రశ్నార్థకంగా మారింది. దాని నుంచి మనం ఇవాళ పూర్తిగా విముక్తి అయ్యాం. అది మనం చేసిన సేవల వల్ల కాదు. ఏసుక్రీస్తు కృప, ఆయన యెుక్క దయ ప్రభావం’’ అని వ్యాఖ్యానించారు.

*_రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ..రచ్చ:_*
డీహెచ్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. నిజానికి డీహెచ్ కు వివాదాలు కొత్తేం కాదు. గతంలో ఖమ్మంలో వింత పూజలు చేసి వార్తల్లో నిలిచారు. దేవతగా ప్రకటించుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇటీవల ప్రగతి భవన్ లో కేసీఆర్ కాళ్లపై పడ్డారు. నిమిషం వ్యవధిలోనే రెండు సార్లు కాళ్లు మొక్కారు. డీహెచ్ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతూనే ఉన్నాయి.

*_టికెట్ కోసమే ఈ పాట్లా..?:_*
ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని.. ప్రభుత్వ అధికారినని మర్చిపోయి.. బీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కొంతకాలంగా కొత్తగూడెంలో డీహెచ్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసమే ఆయన ఇలా చేస్తున్నారనే విమర్శలున్నాయి.

Tuesday, December 20, 2022

కరినగర్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి

We want traffic signals.

కరినగర్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలనీ 3 సంవత్సరాలుగా పోరాడుతున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. 2019 నుండి అప్పటి సీపీ కమలాసన్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ ఐఏఎస్ గారు ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తాం సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాం అని చెప్తూ వోచారు ఇప్పటి మేయర్ తదితరులు కూడా అదే మాట చెప్తున్నారు కానీ పని మాత్రం జరగడం లేదు. పైగా అనవసరంగా కూడలిలలో అడ్డం పొడవు పెద్ద పెద్ద సర్కిల్స్ ఏర్పాటు చేసి వాటిని మల్లి మల్లి చిన్నగా చేయడం ప్రజా దానం వృధా చేయడం దారుణం. ఇప్పుడు కూడా గీతాభవన్ చౌరస్థా 1 టౌన్ ముందు మల్లి సర్కిల్స్ చిన్నగా చేసే పని పెట్టుకున్నారు. ఆ పనిలో పని సిగ్నల్స్ ఏర్పాటు చేయవలసిందిగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి తోట శివ శంకర సాయినాథ రావు డిమాండ్ చేస్తూ బస్టాండ్ చౌరస్తా లో నిరసన చేపట్టడం జరిగింది అధికారులు పట్టించుకోని యెడల రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమం చేయవలసి ఉంటుంది అని హెచ్చరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో శివ శంకర సాయినాథ రావు తో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన కిరణ్ గారు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ( కరీనగర్ bjym అసెంబ్లీ ఇంచార్జీ) ధీరజ్, నీకేష్, సాయి కిరణ్, మని తేజ, సాయి చరణ్ తేజ్, రాజేష్ , సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

ఉప్పల్ లో మేయర్ విజయలక్ష్మి కీ నిరసన సెగ....!

*ఉప్పల్ లో మేయర్ విజయలక్ష్మి కీ నిరసన సెగ....!*

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఉప్పల్ నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. చిలుకానగర్‌ డివిజన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో రసాభాస చోటుచేసుకుంది.మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్‌ బన్నాల గీత ప్రవీణ్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డిని పిలవకుండా ఎలా శంకుస్థాపనలు చేస్తారంటూ మేయర్‌ విజయలక్ష్మిని స్థానిక బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. మేయర్‌ ప్రోటోకాల్ పాటించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేయర్‌ విజయలక్ష్మి తీరుకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే అనుచరులు, మేయర్‌ వర్గం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ నిధులతో చేస్తున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యేను పిలవాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహించారు. ప్రోటోకాల్‌తో తనకు సంబంధం లేదని, అది అధికారుల పనంటూ శంకుస్థాపన చేయకుండానే మేయర్ వెనుదిరిగారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, December 19, 2022

ఎమ్మెల్యేల సమావేశంపై అధిష్టానం.... ఆరా

*ఎమ్మెల్యేల సమావేశంపై అధిష్టానం.... ఆరా*

హైదరాబాద్‌: ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో మేడ్చల్‌ జిల్లా ఎమ్మెల్యేలు నిర్వహించిన సమావేశంపై అధిష్ఠానం ఆరా తీసింది. సమావేశంలో చర్చించిన అంశాలు, వారు మీడియాతో మాట్లాడుతూ చేసిన విమర్శలను విశ్లేషించింది. వాస్తవంగా మైనంపల్లి ఇంట్లో విందుకే వారంతా హాజరయ్యారని, తర్వాత మల్కాజిగిరి ఎంపీ స్థానానికి భారాస అభ్యర్థిత్వం కోసం మద్దతు సమీకరించే క్రమంలో మైనంపల్లి సమావేశం నిర్వహించారని అధిష్ఠానం తెలుసుకుంది. ఈ భేటీకి మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతి కూడా కారణమనే అంచనాకు వచ్చింది. ఈ పరిణామాలపై చర్చించేందుకు త్వరలోనే మంత్రి, ఎమ్మెల్యేలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఆయన మేడ్చల్ కే మంత్రి కాదు....మల్లారెడ్డి పై 5 గురు ఎమ్మెల్యేల అసంతృప్తిగళం...!

*ఆయన మేడ్చల్ కే మంత్రి కాదు....మల్లారెడ్డి పై 5 గురు ఎమ్మెల్యేల అసంతృప్తిగళం...!*

హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్‌ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తగళం వినిపించారు. పదవులన్నింటినీ సొంత నియోజకవర్గం మేడ్చల్‌కే తీసుకెళ్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దూలపల్లిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప్పల్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వివేకానంద్‌ తదితరులు పాల్గొన్నారు.అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ సమావేశానికి ప్రత్యేక కారణం లేదంటూనే మంత్రి మల్లారెడ్డి వైఖరిని తప్పుబట్టారు. నామినేటెడ్‌ పదవులన్నీ మేడ్చల్‌కే తీసుకెళ్తున్నారని.. తమ నియోజకవర్గాల కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడాలని సీఎం కేసీఆర్‌ పదేపదే చెప్పినా మంత్రి ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. వచ్చిన వాళ్లకే పదవులు వస్తున్నాయని.. ప్రొటోకాల్‌ కూడా పాటించడం లేదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో వ్యక్తి మూడు నాలుగు పదవులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. పదవులు వచ్చిన వాళ్లకే మళ్లీ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. '' పార్టీ కార్యకర్తలకు పదవులు రావాలనే మేం అడుగుతున్నాం. కొన్ని అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే మేం మాట్లాడుతున్నాం. కొందరు మంత్రులు వాళ్ల వ్యక్తులకే నాలుగు పదవులు ఇప్పించుకుంటున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు మమ్మల్ని నిలదీస్తున్నారు. మంత్రుల వ్యక్తులకే పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు.'' అని అసహనం వ్యక్తం చేశారు. తమ సమస్యకు కారణమే మంత్రి మల్లారెడ్డి.. మళ్లీ ఆయన్ను ఎలా పిలుస్తామని అన్నారు. కొత్త వ్యక్తులకు పదవులు ఇస్తే అభినందిస్తామన్నారు. సమావేశం అంతర్గత విషయాలు బయటకు వెళ్లాయని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. మాపై పార్టీ వ్యతిరేక ముద్ర వేసేందుకు ఎవరో కుట్ర చేశారని ఆయన తెలిపారు. జిల్లా నాయకత్వం వైఫల్యాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, December 17, 2022

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
మానవహక్కుల వేదిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తొమ్మిదవ సంయుక్త మహాసభలు శనివారం (17 డిసెంబర్ 2022న) నిజామాబాద్ పట్టణంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే మహాసభలలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కోవడం అనే అంశాల మీద చర్చ జరుగుతుంది. 
మహాసభల ప్రారంభ సదస్సులో ప్రజాస్వామ్యం మీద హిందుత్వ దాడి అనే అంశం మీద రచయిత, రాజకీయ వ్యాఖ్యాత, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత శాఖ మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్ ప్రసంగించారు. సామాజిక ఐక్యత, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే దిశగా దేశం అడుగులు వేయడం 2014 లో మొదలయ్యిందని ఆయన అన్నారు. 
“ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కంటే తలసరి స్థూల ఆర్థిక అభివృద్ధి విషయంలో మన దేశం తొలిసారి వెనుకబడింది. 2018 నుంచీ ఆరు శాతం పైనే నిరుద్యోగం తచ్చట్లాడుతూ ఉంది. శ్రామికులకు పని లభ్యత విషయానికి వచ్చేసరికి దక్షిణాసియాలోనే హీనమైన స్థితిలో ఉన్నాము” అని ఆకార్ పటేల్ అన్నారు.
 దేశంలో గణనీయమైన సంఖ్యలో నివసిస్తున్న ముస్లింలను రాజకీయాలలోకి రానీయకుండా తొక్కిపట్టడాన్ని ఆకార్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్నీ, అలాగే ఆ పార్టీ పార్లమెంటు సభ్యుల్లో,  శాసనసభ్యుల్లో కూడా ఒక్క ముస్లిం కూడా లేకపోవడాన్నీ ఆయన ఎత్తిచూపారు. ట్రిపుల్ తలాక్, గొడ్డు మాంసం వంటి సాంస్కృతిక, ఆచార, జీవన వ్యవహారాలలో వారిని నేరస్తులను చేసే ప్రయత్నాలను ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగ విలువలను పక్కకు నెట్టి  హిందుత్వ రాజకీయాలు ప్రమాదకర మార్గాన్ని పట్టాయని అన్నారు.
ఆర్థిక, సామాజిక వ్యవస్థల గమనంలో వస్తున్నఈ మార్పులను గనుక పౌర సమాజం ప్రతిఘటించకపోతే అవి కొనసాగుతూనే ఉంటాయని ఆకార్ పటేల్  అభిప్రాయపడ్డారు.    
ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అధ్యాపకుడు ఆకాష్ పోయెం ‘విధ్వంసం అవుతున్న ఆదివాసీ సంస్కృతి’  అనే అంశం మీద ప్రసంగించారు. “ ఆదివాసీ ప్రాంతాలలో ఆర్ ఎస్ ఎస్ అడుగుపెట్టక ముందే హిందూ సంస్కరణ ఉద్యమాలు అక్కడ హైందవీకరణను మొదలుపెట్టాయని అన్నారు. కేంద్రంలో బీజీపీ అధికారంలోకి వచ్చాక వనవాసి కళ్యాణ్ ఆశ్రం వంటి సంఘాలు ఈ ప్రాంతాల్లో బలపడ్డాయని అన్నారు. ఆదివాసులను సహజ వనరులకు దూరం చేసే ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు. పారిశ్రామికీకరణ, గనుల తవ్వకం వంటి వినాశక యత్నాలకు వ్యతిరేకంగా ఆదివాసులు ఉద్యమిస్తున్నారని చెప్పారు. ఆదివాసుల సంస్కృతినీ, ఆచారాలనూ అర్థం చేసుకోకుండా ఆ ప్రాతాలలో బ్రాహ్మణీయ భావజాల వ్యాప్తిని, పెట్టుబడిదారుల వనరుల ఆక్రమణనూ  అడ్డుకోలేమని అభిప్రాయపడ్డారు.
సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు ఉషా శ్రీలక్ష్మి  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన తర్వాత తలెత్తుతున్న భూసమస్యలను గురించి మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా భూయాజమాన్యానికి సంబంధించి విభజనకు ముందు ఉన్న అసమానతలు మరింత పెరిగాయని ఉషా  సీతాలక్ష్మి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుబంధు, రైతుబీమా, భూమి రికార్డుల డిజిటీకరణ, హరితహారం వంటి పథకాల/ విధానాల పర్యవసానాలను ఆమె వివరించారు.
మానవహక్కుల వేదిక బాధ్యులు ఎస్. జీవన్ కుమార్,  గొర్రె పాటి. మాధవరావు, ఎ. చంద్రశేఖర్, ఎస్. తిరుపతయ్య,  జిల్లా అధ్యక్షులు గడ్డం గంగులు,  కార్యదర్శి పి .సరిత తదితరులు పాల్గొన్నారు. 
ఫోటో కాప్షన్ : మానవహక్కుల వేదిక తొమ్మిదవ మహాసభల సందర్భంగా ప్రసంగిస్తున్న రచయిత, రాజకీయ విశ్లేషకుడు ఆకార్ పటేల్.

Courtesy by : మానవ హక్కుల వేదిక (HRF)

Friday, December 16, 2022

ఉభయ రాష్ట్రాల మానవ హక్కుల వేదిక 9వ.మహాసభలు,

మిత్రులకు,
నమస్తే.
ఉభయ రాష్ట్రాల  మానవ హక్కుల వేదిక 9వ.మహాసభలు,
*డిసెంబర్ 17,18 వ* తేదీలలో నిజామాబాద్ లో జరుగుతాయి.
కార్యక్రమం:
*రెండు రాష్ట్రాల ఆఫీస్ bearers 16వతేదీన నే (శుక్ర వారం) నిజామాబాద్ చేరుకుంటారు. 
ఆ రోజు ఉభయ రాష్ట్రాల పూర్తి ఎక్జిక్యూటివ్ సమావేశం ఉంటుంది.
అందులో ఉభయ రాష్ట్రాల మూడు సంవత్సరాల నివేదికను ప్రధాన కార్య దర్షులు ప్రవేశ పెడతారు.దానిపైన చర్చ జరిగిన తర్వాత,ఫైనల్ చేసి ఆ రోజు రాత్రి DTP చేయించి 18 న.జరిగే రెండు రాష్ట్రాల ప్రాథమిక సభ్యులకు అంద చేస్తారు.
*రాబోయే టర్మ్ కు రెండు రాష్ట్రాలకు సంస్థ బాధ్యులు అంటే ఆఫీస్ bearers ను సూచించి,ప్రతిపాదన తయారు చేస్తారు.ఈ ప్రతిపాదనలను 18న.జరిగే సర్వ సభ్య సమావేశంలో చర్చకు పెట్టీ approval తీసుకోవడం జరుగుతుంది.

**17,శని వారం నాడు,ముగ్గురు వక్తల ఉపన్యాసాలు ఉంటాయి.సాయంత్రం అయిదు గంటలకు నగరం లో ఊరేగింపు,తరవాత బహిరంగసభ ఉంటుంది.
వివరాలు కరపత్రం లో ఉన్నాయి.

***18 వ తేదీ,ఆదివారం సర్వ సభ్య సమావేశం ఉంటుంది.
అందులో రెండు రాష్ట్రాల కార్యదర్శులు రాష్ట్ర నివేదికలు సమర్పిస్తారు.
రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కార్యదర్శులు నివేదికలు సమర్పిస్తారు.
కార్యక్రమాలపై కొంత చర్చ ఉంటుంది.
తరవాత రెండు రాష్ట్రాల కొత్త బాడీల ప్రతిపాదన,ఎన్నిక ఉంటుంది.

సభ్యులు 17న,మరియు 18న తప్పకుండా ఉండి సభల్లో పాల్గొనాలి.
మన సిటీ నుండి ఇద్దరు సమన్వయ కమిటీ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్య క్షుడి తో పాటు అందరు సభ్యులు హాజరు కావలి.
సభ్యులు తమ పేర్లను తెలిపితే అక్కడ బస ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
సభ్యులు వారి పేర్లను ఈ గ్రూప్ లో ఈ రోజు సాయంత్రం అనగా 10 డిసెంబర్ సాయంత్రం 5 గంటల కల్లా తెలియ చేయాలి.  5 గంటల వరకు వచ్చిన పేర్లను రాష్ట్ర వర్గానికి ఇవ్వడం జరుగుతుంది. 

ఆ రోజు వరకు చలి పెరుగుతుంది.
బెడ్స్ ఉంటాయి కానీ కప్పుకోవడానికి చెద్దర్(దుప్పటి),టూత్ పేస్ట్ వగైరా వెంట తెచ్చుకోవాలి.

మహిళా సభ్యులకు ప్రత్యేక బస ఏర్పాటు ఉంటుంది.
అభినందనలతో,
V.బాలరాజు,
నగర కమిటీ ప్రధాన కార్యా దర్శి.
*సంజీవ్,
*Bilal
నగర కమిటీ సభ్యులు

Thursday, December 15, 2022

యువరాజు పట్టాభిషేకం కోసంరాజ శ్యామల యజ్ఞం

*నాడు పోరాటాలకు నిలయమైన తెలంగాణ...*
*నేడు యాగాలకు, భోగాలకు నిలయమైంది*

భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు తెలంగాణ అంటే.. భూమి కోసం, భుక్తి కోసం, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నడిచిన..
సాయుధ రైతాంగ పోరాటం..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో తెలంగాణా అంటే...
ఇడ్లి సాంబార్ గోబ్యాక్.. నాన్ ముల్కీ ఘర్ వాపస్..

దేశ స్వాతంత్య్రం తర్వాత అరవై తొమ్మిదిలో, తెలంగాణ అంటే... 
ప్రాణాలకు తెగించి యువతరం పోరాడిన ప్రత్యేక తెలంగాణా తొలి దశ ఉద్యమం. మూడువందల ఆరవై మంది బలిదానం.

ఎనభై ల్లో తెలంగాణ అంటే... 
దొరతనాలను గడగడలాడించి, దొరగడిలను కూల్చి.. భూస్వామ్యానికి సవాల్ విసిరిన సాయుధ విప్లవ ప్రభంజనం.

గత దశాబ్దంలో తెలంగాణ అంటే... 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కై పట్టువదలని ప్రజా ఉద్యమం. మలిదశలో పద్నాలుగు వందల మంది ఆత్మార్పణం.. సంఘమే రణరంగమై..రాష్ట్ర సాధనే ద్యేయంగా నడిచిన ఉద్యమం.

ఈ రోజు తెలంగాణా అంటే..
కుట్రల,కుతంత్రాల, కుటుంబ పాలన కోసం..
కూడబెట్టిన ధనం, యువరాజు పట్టాభిషేకం కోసం
రాజ శ్యామల యజ్ఞం.

రేపటి తెలంగాణ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలన్నదే నేడు సబ్బండ వర్గాల, వర్ణాల ముందున్న ప్రశ్న..
తెలంగాణ అంటేనే పోరాటం...పోరాటం... 
కాళోజీ మాటలు మనకు మర్చిపోతున్నారా..
*ప్రాంతేతరు మోసం చేస్తే ప్రాంతం అవతలి వరకు తరిమి కోడతాం.. *ప్రాంతంలోని వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం*

Courtesy by : Voice Of Village (fb)

నాటి కుట్రను బహిరంగపర్చిన 'ఆదాబ్ హైదరాబాద్'

*_'జస్టిస్'కు జస్టిస్.!_*
_★ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్!_
_★ ముందే చెప్పిన వైనం_
_★ నాటి కుట్రను బహిరంగపర్చిన 'ఆదాబ్ హైదరాబాద్'_

*_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు అందించిన దమ్మున్న కథనం, 9440000009)_*

*_సెప్టెంబర్ 7, 2019న తెలుగు జర్నలిజంలో దమ్మున్న కథనాన్ని 'ఆదాబ్ హైదరాబాద్' ఆవిష్కరించింది. జస్టిస్ సంజయ్ కుమార్ పై జరిగిన అన్యాయం గురించి మూడు రోజుల పాటు హైకోర్టు న్యాయవాదులు కోర్టున బహిష్కరించారు. సామాన్యుల నుంచి న్యాయమూర్తి వరకు ఎవరికి ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించాల్సిన మీడియా గొంతు నాడు మూగబోయింది.  ఒక్క 'ఆదాబ్ హైదరాబాద్' మినహా మిగిలిన మొత్తం మీడియా అస్సలు ఆ సంఘటన జరగనట్లే నటించాయి. రాజకీయుల అక్రమాల గురించి రాయటానికి భయపడే పరిస్థితుల్లో... ఏకంగా న్యాయస్థానం గురించి, న్యాయమూర్తుల గురించి  'న్యాయదేవత సాక్షిగా జస్టిస్ సంజయ్ పై కుట్ర' అంటూ ఓ సంచలన కథనం ప్రముఖంగా ప్రచురించింది. సుప్రీంకోర్టుకు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ సహా అయిదుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేయాలని కొలీజియం నిర్ణయించింది. ఇప్పుడు ఆ జస్టిస్ సంజయ్ కుమార్ కు 'న్యాయం' జరిగింది._*

*_అసలేం జరిగింది.?:_*
సుప్రీంకోర్టుకు తెలుగు వ్యక్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ సహా అయిదు గురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేయాలని కొలీజియం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృ త్వంలో మంగళవారం సమావేశమైన కొలీజియం.. మణిపుర్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి(సీజే) జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, రాజస్థాన్ హైకోర్టు సీజే జస్టిస్ పంకజ్ మిత్తల్, పట్నా హైకోర్టు సీజే సంజయ్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ అసను ద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ పేర్లను సిఫారసు చేసింది. వీరిలో జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ తెలంగాణకు చెందినవారు.

*_ఇదీ ప్రస్థానం:_*
1963 ఆగస్టు 14న హైదరాబాద్ లో జన్మించారు. నిజాం కళాశా లలో డిగ్రీ, దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం అభ్యసించారు. సంజయ్ కుమార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ 1988లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2000 నుంచి 2003 వరకు ఏపీ హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేశారు.

*_న్యాయమూర్తిగా..:_*
2008 ఆగస్టు 8న ఉమ్మడి హైకో ర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబరు 14న పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 12న మణి పుర్ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ హైకోర్టుల నుంచి ప్రాతి నిధ్యం లేదు. న్యాయమూర్తిగా తెలుగువ్యక్తి జస్టిస్ పీఎస్ నరసింహ ఉన్నా.. ఆయన నేరుగా సుప్రీంకోర్టు బార్ నుంచి నియమితులయ్యారు. తెలంగాణ మాతృ హైకోర్టు నుంచి చివరిసారిగా జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన పదవీ అనంతరం తాజాగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ పేరును కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో ఉన్న పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా కొద్దికాలంపాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. సుప్రీంకోర్టులో 34మంది న్యాయమూర్తులు పనిచేయడానికి అవకాశం ఉండగా.. ప్రస్తుతం 28 మంది ఉన్నారు. కొలీజియం సిఫారసు చేసిన అయిదుగురి నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే జడ్జీల సంఖ్య 33కి చేరు తుంది. కాగా, పీవీ సంజయ్ కుమార్ తండ్రి రామచంద్రా రెడ్డిది చిత్తూరు జిల్లా. వృత్తిరీత్యా హైదరాబాద్లో స్థిరప డ్డారు. 1969 నుంచి 1983 వరకూ సుదీర్ఘకాలం అడ్వకేటుగా సేవలందించారు.

బాక్స్:
*ఆనాడు ఏం జరిగింది.?*
(నాటి 'ఆదాబ్ హైదరాబాద్' కథనం యధాతథంగా..)
న్యాయదేవత సాక్షిగా...
జస్టిస్ సంజయ్ పై కుట్ర..!
◆ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
◆ బదిలీ వెనుక ఏం జరిగింది..?
◆ మరోవైపు 'సామాజిక' పంచాయతీ
*_(హిస్టరీలో మిస్టరీ కథనాలు-15)_*
(అనంచిన్ని వెంకటేశ్వరరావు ఆదాబ్ హైదరాబాద్)
*_సాక్షాత్తూ న్యాయదేవత చెంతనే ఓ అన్యాయం జరుగుతోంది. న్యాయస్థానాలలో వాదించాల్సిన న్యాయవాదులు రోడ్లు ఎక్కుతున్నారు. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 'అక్కడ ఏం జరుగుతుంది' అంటే అందరికీ తెలుసు. అయితే 'అసలు విషయం' గురించి బహిరంగంగా మాట్లాడాలంటే నిశ్శబ్ద భయం. కానీ.. కానీ.. ఫోర్త్ ఎస్టేట్ లో ఎవరూ మాట్లాడడానికి సాహసించని ఆ అసలు నిశ్శబ్ద విషయాన్ని... 'ఆదాబ్ హైదరాబాద్' సగౌరవంగా.. సగర్వంగా, సవివరంగా నిశ్శబ్దాన్ని పటాపంచలు చేయాలని భావించి ఇస్తున్న 'సంచలన పరిశోధన కథనం' మీకోసం ప్రత్యేకం._*

*అసలేం జరిగింది..:*
తెలంగాణ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ ను పంజాబ్-హరియాణా కోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన బదిలీని నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. విధులను బహిష్కరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లాలోని న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. సంజయ్‌ కుమార్‌ ను తక్షణమే తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేస్తున్నారు.

*బహిరంగ రహస్యం - భయంకర నిజం..?:*
జస్టిస్ సంజయ్ కుమార్ ది సాధారణ బదిలీ అయితే ఇంత పెద్ద ఎత్తున న్యాయవాదులు రోడ్లు ఎక్కి పోరాటం చేయరు. గత వారం రోజులుగా తెలంగాణ హైకోర్టుతో సహా జిల్లా న్యాయస్థానాలలో న్యాయపరమైన సేవలు నిలిచిపోయాయి. అందరికీ అన్నీ తెలుసు. ఎక్కడా.. బహిరంగంగా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని ఓ రకమైన తెలియని భయం.

*ఆయనే చీఫ్ జస్టీస్..?:*
జస్టిస్ సంజయ్ కుమార్ తండ్రి అడ్వకేట్ జనరల్ గా సుమారు రెండు దశాబ్దాలు సేవలందించారు. ఆయన వారసత్వం పుణికి పుచ్చుకున్న జస్టిస్ సంజయ్ కుమార్ ఆగస్టు 14, 1963న జన్మించారు.1988లో నిజాం కాలేజీ చదువు, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 'లా' పట్టభద్రుడయ్యాడు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో సుధీర్ఘ కేసులపై విలక్షణమైన, నిక్కచ్చిగా తీర్పులు ఇచ్చారు. హైకోర్టు విభజన నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళి ఉంటే తప్పకుండా చీఫ్ జస్టీస్ అయ్యేవారు.! కానీ తెలంగాణ ప్రాతానికి చెందిన వాడు కావడంతో తెలంగాణలో ఉండాలని ఆయన భావించారు. ఆ మేరకే కట్టుబడి ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో సీనియర్ జస్టీస్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడున్న సీనియార్టీ ప్రకారం ఆయన చీఫ్ జస్టీస్ తర్వాత స్థానం ఆయనదే. అన్నీ అనుకున్నట్లు కొనసాగితే మరో రెండు, మూడు సంవత్సరాలలో ఆయన తెలంగాణ చీఫ్ జస్టిస్ అయ్యేవారు.

*తెర వెనుక ఏం జరిగింది..?:*
సుధీర్ఘ అనుభవం ఉన్న జస్టిస్ సంజయ్ కుమార్ కు వాస్తవంగా పదోన్నతి ఇచ్చి గౌరవించాలి. కానీ కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ హైకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జి జస్టిస్ పివి.సంజయ్ కుమార్ ను పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేయాలని, కేంద్రాన్ని సిఫారసు చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల నిర్ణయించింది. కేంద్రం తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. బదిలీ కారణంగా...జస్టిస్ సంజయ్ కుమార్ పంజాబ్, హర్యానా హైకోర్టు సీనియారిటీ జాబితాలో 12వ స్థానంలో ఉంటారు. అదేమిటో మొదట స్థానంలో ఉండాల్సిన ఆయన 12వ స్థానానికి చేరారు. ఇక్కడే ఏదో మతలబు జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

జస్టిస్ సంజయ్ కుమార్ కు మరో 12 ఏళ్ళు ఇంకా కొనసాగుతారు. అంటే తప్పకుండా సుప్రీంకోర్టులో ఆయన కీలకంగా కొనసాగే అవకాశం ఉంది. అంటే ఆయన పదోన్నతులను ఓ పక్కా పథకంతో దెబ్బకొట్టారని తెలుస్తోంది.

*ఇదే(0) నిరసన..:*
జస్టిస్ సంజయ్ కుమార్ బదిలీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో జస్టిస్ సంజయ్ కుమార్ ను పంజాబ్, హర్యానా హైకోర్టు  న్యాయమూర్తిగా బదిలీ చేయడాన్ని ఖండిస్తూ అసాధారణ తీర్మానాన్ని ఆమోదించింది. అంతే కాకుండా ఏదైనా హైకోర్టులో  అతన్ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియాన్ని అసోసియేషన్ కోరింది. అయితే ఆశ్చర్యకరంగా జస్టీస్ సంజయ్ కుమార్ విషయంలో తెరవెనుక  జరిగిన అసలు మతలబు గురించి ఎక్కడా పేర్కొనలేదు. ఎందుకు వెళ్ళలేదనే విషయం లోపలి అంచుల్లోకి 'ఆదాబ్' తొంగిచూడాలని భావించడం లేదు.

*చివరిగా..:*
హిస్టరీలో ఓ న్యాయమూర్తి కోసం రోడ్లపైకి న్యాయవాదులు ఇప్పటిదాకా రాలేదు. అంతేకాదు అందులో ఉన్న అసలు సమస్య గురించి బహిరంగంగా మాట్లాడలేక పోవడం ఓ మిస్టరీ.
----------------------
*హైకోర్టులో 'సమాజిక' ధర్నా..*
ఒకవైపు జస్టీస్ సంజయ్ కుమార్ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతుండగా.. మరో వైపు సామాజిక న్యాయం పేరిట ఓ చిరు ఆందోళన జరిగింది. హైకోర్టు జడ్జీల నియమకాలలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ న్యాయవాదులను దామాషా ప్రకారం జడ్జీలుగా నియమించాలని 'బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సీనియర్ న్యాయవాదుల' పేరిట హైకోర్టు బయట ఆందోళన జరిగింది.
----------------------
*అంకితం:*
'హిస్టరీలో మిస్టరీ' 15 వరస కథనాలను ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు. ఈ  కథనాలు మహనీయులు, భారతరత్న అబ్దుల్ కలాంకు అంకితం ఇస్తున్నాం.

Tuesday, December 13, 2022

#చట్టాలు అంటే చులకన అయిపొయింది


తెలంగాణ ప్రభుత్వం అడ్డదారిలో ఆదాయాన్ని సంపాదించుకోవడానికి మున్సిపల్ చట్టాలను ఉల్లంగించిన #అక్రమార్కులకు వెసులుబాటు కల్పించడం సిగ్గుచేటు.


Bplkm🪶



Monday, December 12, 2022

కేసీఆర్ వైఖరే.. బెటర్ అనుకుంటున్న సన్నిహితులు

*_టార్గెట్ కేటీఆర్_*
_● నెంబర్ 2పై సెంట్రల్ నిఘా..!_
_● ఎక్కడా దొరకని యువరాజు!_
_● మత్తు నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు జల్లెడ_
_● బినామీలంటున్నా.. దొరకని తీగ_
_● పేరు వాడకంలో దేశ ముదుర్లుగా బిల్డర్స్, నేతలు, అధికారులు_
_● పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడ్డ వారి లిస్ట్ రెడీ.?_
_● కేసీఆర్ వైఖరే.. బెటర్ అనుకుంటున్న సన్నిహితులు_
_● తీరు మార్చుకుంటేనే.. ఫ్యూచర్.!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం, 9440000009)_*

*_ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అక్రమ ఆస్తులపై ఈడీ రైడ్స్ పూర్తి. ఇక 'కవితక్క', సిబిఐ 'తైతక్క' పూర్తయింది. ఇక నెక్స్ట్ ఎవరు.? ముసుగులో గుద్దులాట ఎందుకు..? ఇక కేటీఆర్ టార్గెట్ గా కేంద్రం పావులు కదుపుతోందా.? అంటే... ఎవరో ఒకరు 'హైడ్రామా'కు కావాలి కదా.? ఇక కేసీఆర్ కి కేటీఆర్ కి తేడా ఎంటో ఇప్పుడిప్పుడు అర్థం అవుతోంది కుటుంబ సభ్యులకి. కేంద్ర దర్యాప్తు బృందాలు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహిస్తుండటంతో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేటీఆర్ అక్రమాలను, అవినీతిని ఎండగట్టేందుకు బీజేపీకి, కాంగ్రెస్ కి బలమైన సాక్ష్యాధారాలు ఉండటం లేదని తెలుస్తోంది._*

*_ఎన్నో ప్రయత్నాలు..ప్చ్.!:_*
ఆరు నెలలుగా ఐటీ, ఈడీ, సీబీఐ, ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున ఫోకస్ చేశాయి. ఆయన చేసిన అక్రమాలంటూ.. ఇచ్చిన లెటర్స్ ని లోతుగా దర్యాప్తు చేశాయి. కానీ, ఎక్కడా దొరకడం లేదు. స్నేహితుల రూపంలో ఉన్నారని పసిగట్టినా.. నమ్మలేని పరిస్థితి. తనకు దగ్గరగా ఉంటూనే.. ఏదైనా ఒక పని కోసం చెబితే వంద పనులు చేయించుకున్న ఘనులు ఉన్నారు. లోకల్ లీడర్స్ అయితే తమ సొంత పార్టీ నేతలకు, ప్రత్యర్ధులకు కూడా.. కేటీఆర్ దే అంతా అన్నట్లుగా ప్రచారం చేశారు. దీంతో తెలంగాణలో ఎక్కడ 100 ఎకరాలకు పైగా ఒకే బిట్ భూమి కనిపించినా.. ఇదంతా 'కేటీఆర్ దే' అంటూ జోరుగా వదంతులు నడిచాయి. కానీ, అక్కడ 'లిటిగేషన్'ని క్లియర్ చేసుకోవడం కోసమే ఆయన పేరు వాడినట్లు తెలుస్తోంది. ఆంధ్రా బిల్డర్స్ అయితే.. మొత్తం నాకేశారు. బ్యూరో క్రాట్స్ కి ఎప్పుడు లాబీయింగ్ చేసే ఆంధ్రా టీం.. కేటీఆర్ తో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తూ అన్నీ చేశారు. సార్ చెప్పారంటూ.. నగరంలో భారీగా లిటిగేషన్ భూములను క్లియర్ చేసుకున్నారు. అధికారులు సందట్లో సడేమియా అనుకుని వందల కోట్లు పోగేసుకున్నారంటే అశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓ కలెక్టర్ అయితే ఎవరు వెళ్లినా.. బేరం ఆడటమే అలవాటుగా చేసుకున్నారు. దీంతో చెప్పిందేంటి..? చేసిందేంటి అంటూ ఆపరేషన్ ప్రారంభించినట్లు సమాచారం.

*_తండ్రి తీరే బెటర్.!:_*
కేసీఆర్ వర్కింగ్ స్టైల్ కేటీఆర్ కి రాదు. వచ్చినా.. అర్థిక సంబంధాలే అనుకున్నా.. ఎక్కడో ఒక దగ్గర దొరికేసేవారు. అయితే.. కేసీఆర్ 'ఎవరినీ కలవరు. ఏం పని చేయరు' అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అధికారంలో ఉండి నిత్యం కలిస్తే ఎలా వాడుకుంటారో తెలిసి అలా దూరం పెడుతారని టాక్. కానీ, కేటీఆర్ అలా కాదు. మార్కెటింగ్ కంపెనీకి 'సీఈవో'లా ఎలా ప్రచారం చేసుకోవాలో..? ఎవరితో..? ఎలా..? పరిచయాలు పెరుగుతాయో అనుకుంటూ అందరికీ ప్రయార్టీ ఇస్తుంటారు. ఏదైనా పని కావాలంటే.. వెంటనే ఫోన్ చేసి చెప్పేస్తారు. ఇలా చేయడంతో ఆ పేరును అవినీతి తిమింగలాలు బాగా వాడేసుకున్నాయి. తెలిసినా లైట్ తీసుకోవడంతో ఇప్పుడు అదే ప్రచారం జోరుగా ఎక్కడ ఏ భూములు, ఏ హాస్పిటల్, యూనివర్సిటీలు ఉన్నా.. ఇందులో 'కేటీఆర్ ఉన్నారట' అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

*_చెక్ లిస్ట్..!:_*
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారడంతో గులాబీ నేతలకు కొత్త బాధ్యతలు రానున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని తతంగాలు నడిపించినా.. అందరితో సఖ్యత ఉండటం నడిచిపోయింది. కానీ, ఇప్పుడు అలా కాదు. ప్రతీది జవాబుదారీతనం అవసరం. లేదంటే ప్రజల్లో ఇట్టే తేలిపోతారని తెలుసుకుంటున్నారు. దీంతో తన పేరును ఎక్కడెక్కడ ఎవరెవరు వాడుకుంటున్నారో ఎలాంటి ప్రయోజనం లేకుండానే విచ్చలవిడి ప్రచారం చేసుకుంటున్నారో లిస్ట్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ కుటుంబంపై వ్యతిరేకత రావడానికి కారణం ఇలాంటి ప్రచారమేనని తెలుసుకున్నారు. పార్టీ నేతలు ఎవరైనా పేరు వాడుకుంటే.. ఇక నుంచి తీవ్ర మందలింపులు ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

*_ఇన్నాళ్ల అక్రమాలపై ఆధారాలు ఎలా..?:_*
తెలంగాణ సంపద అంతా కేసీఆర్ కుటుంబం మింగేసిందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తోంది. కానీ, ఇప్పటికీ బలమైన ఆధారాలు ప్రజల ముందు ఉంచలేకపోయారు. కాళేశ్వరం 'ఏటీఎం' అని చెబుతున్నా.. ఏడాదిగా ఎక్కడా నిరూపించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపెట్టారు. కానీ, ఇక్కడ ధరణీ భాగోతం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం లేదు. రియల్ ఎస్టేట్ స్కాంలు అంటున్నా.. అది పార్టీలన్నింటికీ ఆదాయం పెంచే మార్గమేనని అంటున్నారు. ప్రైవేట్ ఆస్తుల పెరుగుదల ఉంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. భారీ స్కాంలకు పాల్పడ్డారని ఇప్పటికీ సరైన విధంగా బయటపెట్టడంలో విపక్షాలు విఫలమవుతున్నాయి. ఒకరిద్దరూ ఫైట్ చేసినా.. వ్యవస్థలు అన్నీ కలిసి బూడిదలో పోసిన పన్నీరులా తయారు చేస్తుడటంతో 'క్లీన్ చిట్' వస్తోందని సమాచారం.

*_చివరిగా..:_*
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవు. అయితే కుటుంబంలో పోటీ పడే కవిత ఇక నుంచి బరిలో లేనట్లే..!

Sunday, December 11, 2022

తెలంగాణలో 1,309 మంది రైతులు మృత్యువాత పడ్డారు

*_ఉరికొయ్యకు రైతన్న_*
_● ఐదేళ్లలో దేశవ్యాప్తంగా  41,369 మంది_
_● తెలంగాణలో గత 3ఏళ్లలో 1,309_
_● ఏపీలో 1,673మంది రైతుల ఆత్మహత్య_
_● అధిక శాతం కౌలు రైతులే.!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం, 9440000009)_*

*_స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు. ఇంకా రైతుల ఆత్మహత్యలు అంటే.. ఎక్కడో లోపం ఉంది. అది పసిగట్టలేని పాలకులు 'రాజకీయ పాచికలు' ఆడటం తప్ప లోతైన శోధన చేయడం లేదు. 'రైతు బంధు' అమలు చేస్తున్న తెలంగాణలో సైతం 2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో 1,309 మంది రైతులు, ఆంధ్రప్రదేశ్‌లో 1,673 మంది రైతులు మృత్యువాత పడ్డారు. దీనికి అంతం ఎప్పుడు.? అస్సలు అంతం ఉందా..? లేదా..?_*

*_అసలేం జరిగిందంటే..?:_*
గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. తెలంగాణలో తగ్గుముఖం పట్టాయని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్‌లో తెలిపింది. 2019 నుంచి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాజ్యసభలో వెల్లడించారు.

*_నివేదికలో ఏముంది.?:_*
2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,673 మంది రైతులు మృత్యువాత పడగా, తెలంగాణలో 1,309 మంది తనువు చాలించినట్టు కేంద్రం పేర్కొంది. దేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

*_తెలంగాణలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు:_*
దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టగా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు సంభవించాయని తెలిపింది. 2017లో 375 మంది, 2018లో 365 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 2017, 2018 సంవత్సరాలతో పోల్చితే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. 2017లో తెలంగాణాలో 846 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2021 నాటికి ఆ సంఖ్య 352 కు తగ్గిందని పేర్కొంది. దక్షిణ భారతంలో అధిక ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో ఉంది. కర్ణాటక మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతోందని కేంద్రం తెలిపింది.

*_దేశవ్యాప్తంగా..:_*
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. 2017 నుంచి 2021 మధ్యకాలంలో రాష్ట్రంలో 41,369 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు. 2019లో రాష్ట్రంలో 7,675 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2020నాటికి ఆ సంఖ్య 8058కి, 2021లో 10,171కి పెరిగినట్టు తెలిపారు.

*_సిగ్గుగా లేదూ..:_*
అందరికీ అన్నం పెట్టే రైతన్న ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. దీని కోసం ప్రభుత్వాలు, పాలకులు ఆలోచించే తీరిక లేదా..? ఆత్మహత్యలు తగ్గుతున్నాయని చెప్పి చంకలు గుద్దుకోవడం కాదు. అస్సలు లేవని చెప్పే రోజు రావాలని ఆశిద్దాం. దానికోసం ఉద్యమించాల్సిన తరుణం ఇదే..! జై కిసాన్..

బాక్స్:
*_గుర్తించిన అంశాలు_*
* ఆత్మహత్యకు పాల్పడిన వారిలో దాదాపు అందరూ కౌలు రైతులే.
* చేసిన అప్పు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు.
* జీఓ 43 ప్రకారం వీరెవరికీ ఆర్థిక సాయం, పునరావాస ప్యాకేజీ అందలేదు. ఆర్డీవో, వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ), డీఎస్పీ గ్రామాలను సందర్శించలేదు. చాలా కేసుల్లో తహసీల్దారు, ఏఓ, ఎస్‌ఐతో కూడిన మండలస్థాయి కమిటీ ప్రాథమిక విచారణ జరిపి వివరాలు తీసుకోవడం లేదు.
* ఎక్కువ మంది మిర్చి, పత్తి సాగు చేస్తున్నవారే.
* ఎవరికీ కౌలు రైతు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ) లేవు.
* బాధిత కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
* ప్రైవేటు అప్పులే దిక్కయ్యాయి. వీరెవరికీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రుణాలు అందలేదు.

తెలంగాణలో ఏమి జరుగుతుంది?


తెలంగాణ లో ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వం పరిపాలన చేయడం లేదు

Bplkm🪶

Friday, December 9, 2022

పేరు మారితే జాతీయ పార్టీ కాదు..!

*_ఇదేం పాత్రికేయం.!_*
_● కొత్త జాతీయ పార్టీ ఆప్.._
_● బీఆర్ఎస్ కాదు.._
_● అప్పుడే అంత సీన్ లేదు_
_● సొంత పత్రిక ఓవరాక్షన్.!_
_● మరెందుకీ గోబెల్స్ ప్రచారం…?_
_● పేరు మారితే జాతీయ పార్టీ కాదు..!_
_● ఇక మిగిలింది ఎవరబ్బా..!!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం, 9440000009)_*

*_మళ్లీ మళ్లీ అదే పిచ్చిమోత.. పార్టీ పేరు మారితే జాతీయ పార్టీ అయిపోయినట్టు 'బబ్రాజమానం భజగోవిందం' తరహా పిచ్చి ప్రచారం.. టీఆర్ఎస్ పార్టీ విధేయ మీడియాలోనూ అదే ధోరణి.. పాత్రికేయాన్ని పాతరేసి, కరపాత్రికేయాన్ని మోస్తున్న వైఖరి.. ఎస్, టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకుంది.. దాని ఓనర్‌కు ప్రధాని కుర్చీ కావాలట..! అదెలాగూ ఆయన సొంత పార్టీ.. తన ఇష్టం.. తను చెప్పిందే వేదం.. తను చేసిందే శాసనం.. మేల్ శివగామి స్టయిల్.. మళ్లీ నాలుగు రోజులకు నో, నో, నా తెలంగాణ, జై తెలంగాణ అంటూ మళ్లీ పేరు మార్చుకున్నా సరే, ఆహాశ్చర్యమే అవసరం లేదు..! దయచేసి మీ 'భ్రమల లోకం'లోకి ప్రజలను లాగకండి..వారిని వారిలాగే ఉండనివ్వండి. లేకుంటే భవిష్యత్తులో 'దేవతావస్త్రాలు' ప్రాప్తిరస్తు.!_*

*_సొంత పత్రిక ఓవరాక్షన్..:_*
ఈరోజు కూడా సారు గారి సొంత పత్రిక ఓవరాక్షన్.. అదేదో గొప్ప రాజకీయ పరిణామం అయినట్టుగా.. నిజంగానే టీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోయినట్టుగా.. దేశ రాజకీయ యవనికపై మన జయపతాక అట.! ఎన్నికల సంఘం రాజముద్ర వేయడం జయపతాక ఎగరేసినట్టా..? జాతీయ స్థాయికి 'కొత్త ధ్రువతార కేసీయార్' అంటూ మరో డెక్కు.. మామూలుగా 'ధ్రువతార' అని ఏ సందర్భాల్లో వాడతామో తెలుసా వీళ్లకు అసలు..?

*_ఇదేం ఖర్మ..!:_*
ఒక్క నమస్తే తెలంగాణ మాత్రమే కాదు, దాదాపు కేసీయార్ అదుపాజ్ఞల్లో ఉన్న ప్రతి పత్రిక, ప్రతి టీవీ అంతే.. హబ్బా, జస్ట్, పేరు మారిందే తప్ప, నీకు నువ్వు 'జాతీయ పార్టీ' అని చెప్పుకోవడం తప్ప.. కేంద్ర ఎన్నికల సంఘం నిన్ను జాతీయ పార్టీ అనడం లేదు బాబూ.., పేరు మార్పుకు 'అంగీకరించాం' అని లేఖ పంపించింది. అంతే..!

*_మరెందుకీ గోబెల్స్ ప్రచారం…?:_*
పేరులో తెలంగాణ ఉంది కాబట్టి.. అది మరీ ప్రాంతీయతను సూచిస్తున్నది కాబట్టి, తనకు జాతీయ స్థాయి కావాలి కాబట్టి.. దానికంటూ ఓ కొత్త పార్టీ పెడితే కొన్ని కొత్త చిక్కులు వస్తాయి కాబట్టి.... తెలంగాణతనాన్ని వదిలేసింది. 'భారత రాష్ట్ర సమితి' అని స్వీయ నామకరణం చేసుకుంది. అంతకుమించి ఇప్పటికిప్పుడు జరిగింది లేదు, ఒరిగిందీ లేదు. మరెందుకీ గోబెల్స్ ప్రచారం..?

*_ఇదేం పాత్రికేయం:_*
నిజానికి వార్త అంటే ఆప్ జాతీయ పార్టీగా అవతరించడం.. హఠాత్తుగా రాత్రికిరాత్రి 'అబ్రకదబ్ర' అని గాలిలో మంత్రదండం ఊపి, జాతీయ పార్టీ అయిపోలేదు అది. పార్టీ పేరు సేమ్. మెల్లిమెల్లిగా ఒక్కో రాష్ట్రానికి అక్టోపస్‌లా చేతులు విస్తరిస్తూ..ఓట్లు సాధిస్తూ.. నిజంగానే జాతీయ పార్టీ అయ్యింది. ఒక్కసారి ఈ వార్త చూడండి.

*_'ఆప్' వెనుక ఎంతో శ్రమ, నిజాయితీ:_*
ఇదీ వార్త. కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి. నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు సాధించి ఉండాలి. లాస్ట్ ఎన్నికల్లో కనీసం 2 శాతం సీట్లను కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి. ఆప్ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అప్పట్లో గోవాలో 6.77 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు గుజరాత్‌లో పది శాతం దాటి ఓట్లు తెచ్చుకుంది. హిమాచల్‌లో పెద్ద రిజల్ట్ లేకపోయినా ఓట్ల శాతం బాగానే పెంచుకుంది.

*_పేరు మారితే జాతీయ పార్టీ కాదు..:_*
సో, జాతీయ పార్టీగా గుర్తింపుకు అర్హత సాధించింది. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్‌కన్నా తన తోక లేదా తను తోకగా ఉన్న మజ్లిస్‌ను జాతీయ పార్టీ అనాలి. యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఉనికి ఉంది, కొన్ని ఓట్లు ఉన్నయ్, కొన్ని సీట్లు ఉన్నయ్.! ప్రస్తుతం అధికారికంగా కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, టీఎంసీ మాత్రమే జాతీయ పార్టీలు. ఆప్ ఎనిమిదో జాతీయ పార్టీ. ఏమో, సరిగ్గా లెక్కలు తీస్తే రాబోయే రోజుల్లో మజ్లిస్ దరఖాస్తు చేసుకోవచ్చునేమో.! అదే రాబోయే రోజుల్లో సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, టీఎంసీ తమ జాతీయ హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. అంతే తప్ప, మేం 'జాతీయమహో' అని డప్పు చాటుకుంటే జాతీయ పార్టీ కాలేదు ఏ పార్టీ..!!

*_హేమిటో..:_*
అతిశయోక్తులు, అతిభజన నిజమైన నాయకుడిని ఆవిష్కరించలేవు.. ఆచరణ, ఫలితాలే దేనికైనా గీటురాయి.. గతంలో ఇదే నమస్తే తెలంగాణ 'అతిశయోక్తి' అనే పదమే 'అతి' అని అంగీకరించిన తరహాలో ఓ బొమ్మ, ఓ వార్త వడ్డించింది.. జస్ట్, పార్టీ పేరు మార్పిడి పథకానికి గాంధీ క్విట్ ఇండియా మూమెంట్‌కు లంకె పెట్టినట్టుగా... అంత కలరింగ్ ఇచ్చింది పత్రిక.. అప్పట్లో, యాభై ఏళ్ల కింద జయప్రకాశ్ నారాయణ ఇందిర ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన మహోజ్వల ఘట్టంతో పోల్చింది... ఇలా..!

*_ఇక మిగిలింది ఎవరబ్బా..!!_*
జనసేన యుద్దవాహనం సిద్ధమైంది కదా.! ఇక కొండగట్టులో పూజలు చేసి, ఆయుధం పట్టి, యుద్ధభేరి మోగించడమే.! రెండు రాష్ట్రాలు.. అదీ జాతీయ పార్టీయే.. తెలుగుదేశం పార్టీని కూడా జాతీయీకరించేసి, 'భారతదేశం' అని పేరు మార్చేసి, తమిళనాడు, కర్నాటక, ఒడిశా, అండమాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని చాటడమే.! కేఏపాల్‌ది ఎలాగూ అంతర్జాతీయ పార్టీ..! దానికి ఏ ఫరక్ పడదు.! నిఖార్సయిన తెలంగాణతనానికి నిలువెత్తు ముఖచిత్రం షర్మిలకు జాతీయ సంకల్పాలు, లక్ష్యాలు ఎటూ లేవు..! ఇక మిగిలింది ఎవరబ్బా...!!

మానవ హక్కుల దినోత్సవం

https://www.instagram.com/p/Cl-TdTNv_rg/?igshid=N2ZiY2E3YmU=                              
*ప్రతి మనిషి మనిషిగా జీవించడానికి కొన్ని హక్కులు ఉండాలి. ఇందులో జాతి, భాష, కుల, మతాలకతీతంగా మనిషిగా జీవించే హక్కు కలిగి ఉండడమే ప్రధాన ఉద్దేశ్యం.*

*అలాంటి మానవ హక్కుల దినాన్ని 10.12.1948న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటినుండి ప్రతిసంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 10వ తేదీ ని అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమే ఈ అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యం..... (WD)...... Bplkm🪶(బాపట్ల కృష్ణమోహన్)*