Saturday, August 21, 2021

నీళ్లు -క‌న్నీళ్లు.. ఎర్ర‌వ‌ల్లి నేల‌మ‌ట్టం!

హైదరాబాద్ : 22/08/2021

నీళ్లు -క‌న్నీళ్లు.. ఎర్ర‌వ‌ల్లి నేల‌మ‌ట్టం!

నీళ్లు -క‌న్నీళ్లు.. ఎర్ర‌వ‌ల్లి నేల‌మ‌ట్టం!

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ముంపు గ్రామం ఎర్ర‌వ‌ల్లిలో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. రాత్రికి రాత్రి అధికారులు గ్రామాన్ని నేల‌మ‌ట్టం చేశారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చుతున్నారు. గ్రామ‌స్తుల‌ను ఊర్లోకి రానివ్వ‌కుండా పోలీసు బలగాల మధ్య పనులు జరుపుత‌న్నారు. మ‌రోవైపు పూర్తి పరిహారం రాకపోవడంతో కొంత‌మంది నిర్వాసితులు ఇంకా గ్రామంలోనే ఉండ‌గా.. వారిని బ‌ల‌వంతంగా పోలీసులు అక్క‌డి నుంచి త‌ర‌లిస్తున్నారు. ప్ర‌స్తుతం ఎర్ర‌వ‌ల్లి పూర్తిగా పోలీసు దిగ్బంధంలో ఉంది.

ఖాళీ చేసేందుకు ఒకటి, రెండు రోజులు సమయం అడిగినా అధికారులు క‌నిక‌రించ‌లేదు. అర్థరాత్రి నుంచి కూల్చివేత పనులు జ‌రుగుతున్నాయి.. సిద్దిపేట ఏసీపీ- కుకునూర్ పల్లి పోలీసుల‌ ఆధ్వర్యంలో కొన‌సాగుతున్నాయి. పనులను అడ్డుకుంటారనే కార‌ణంతో.. గ్రామస్తులకు ఊరులోకి అడుగుపెట్ట‌నివ్వ‌డం లేదు అధికారులు. గ్రామదేవతలు- ఇళ్లల్లో దేవుళ్లు మట్టిలో కలిసిపోయాని గ్రామ‌స్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప‌నులు ఇలా కొన‌సాగుతుండ‌గానే.. ఎర్ర‌వ‌ల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇళ్లను కూలుస్తుండ‌గా.. పక్కన ఉన్న విద్యుత్ స్తంభం తీగ బలంగా తగిలి ఆరే కనకరాజు అనే యువ‌కుడు మ‌ర‌ణించాడు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌ను నిర్మించారు. ఈ నెలాఖరులోగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేయాల‌ని అధికారులు భావిస్తున్నారు. దీంతో ముంపు గ్రామాల్లోని ఇళ్ల‌ను యుద్ధ ప్రాతిపదికన కూల్చివేస్తున్నారు.


No comments:

Post a Comment