Sunday, August 1, 2021

ఆరు పాయింట్లు..పై సదువుకు అప్పుజేస్తరా..తమ పిల్లలు ప్రముఖ యూనివర్సిటీల్లో, విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలంటే

హైదరాబాద్ : 02/07/2021

ఆరు పాయింట్లు..పై సదువుకు అప్పుజేస్తరా..

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
ఆరు పాయింట్లు..పై సదువుకు అప్పుజేస్తరా..

తమ పిల్లలు ప్రముఖ యూనివర్సిటీల్లో, విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలని తల్లిదండ్రులందరూ ఆశిస్తారు. వారి సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌కు అది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తారు. అయితే ఇలాంటి చదువులకయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువే. విదేశాల్లోనైతే డాలర్లలో చెల్లించాలి. కానీ డాలర్‌తో పోల్చితే ప్రస్తుతం రూపాయి మారకం విలువ తరిగిపోతున్నది. ఈ క్రమంలో విదేశీ విద్య మరింత భారంగా మారింది. అందుకే ఇప్పుడు ఎడ్యుకేషన్‌ లోన్‌.. అటు తల్లిదండ్రులకు, ఇటు విద్యార్థులకు ఓ ఆప్షన్‌గా నిలుస్తున్నది. ఇక 2015తో పోల్చితే నేడు సగటు విద్యా రుణం రూ.5.73 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో మీరు మీ పిల్లల ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకోవాలనుకుంటే ఈ అంశాలను తప్పక పరిగణనలోకి తీసుకోండి.


ఆఫర్లను పోల్చండి
దాదాపు అన్ని బ్యాంకులు ఎడ్యుకేషనల్‌ లోన్లను అందిస్తున్నాయి. వీటిలో ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి రుణాన్ని ఇస్తుందో అక్కడే తీసుకోండి. విద్యా లక్ష్మి పోర్టల్‌లో ప్రధాన మంత్రి విద్యా లక్ష్మి స్కీమ్‌ కింద ఎడ్యుకేషనల్‌ లోన్లకు సంబంధించి పూర్తి వివరాలుంటాయి. ఇందులో విద్యార్థులు, వారి తలిదండ్రులు రుణాలను పరిశీలించడం, దరఖాస్తు చేయడం, వాటి ట్రాకింగ్‌కు అవకాశం ఉన్నది. ఒకటి కన్నా ఎక్కువ రుణాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ వడ్డీతో ఫ్లెక్సిబుల్‌ రీపేమెంట్‌ ఆప్షన్లను సూచిస్తుంది.

తనఖా ఎంత?
రుణ మొత్తాన్నిబట్టి బ్యాంకులు చాలావరకు నూరు శాతం రుణాన్ని ఇవ్వొచ్చు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం రూ.4 లక్షల వరకు రుణాలపై మార్జిన్‌ మనీ అవసరం అవుతుంది. దేశంలోనే చదువుతున్నట్టయితే 5 శాతం మార్జిన్‌ మనీని స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుం ది. ఒకవేళ విదేశాల్లో చదుకునేట్టయితే 15 శాతం మార్జిన్‌ మనీ అవసరమవుతుంది. రూ.4 లక్షల లోపు రుణాలకు బ్యాంకులు తనఖా అడగవు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.4.5 లక్షల లోపు ఉంటే పూర్తి వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. అయితే కోర్సు పూర్తయ్యే వరకే ఈ వెసులు బాటు ఉంటుంది. ఇక రూ.4 నుంచి 7.5 లక్షల రుణాలకు గ్యారెంటర్‌ అవసరం అవుతుంది. అంతకు మించిన రుణాలకు మాత్రమే సెక్యూరిటీ కింద బ్యాంకులు తనఖా అడుగుతాయి.

క్రెడిట్‌ స్కోర్‌ ముఖ్యమే
పిల్లల విద్యా రుణానికి దరఖాస్తు చేస్తున్నప్పుడు సాధారణంగా తల్లిదండ్రులే గ్యారంటర్‌ అవుతారు. ఇక రుణ దరఖాస్తు తిరస్కరణకు గురికావద్దనుకుంటే తల్లి లేదా తండ్రికి క్రెడిట్‌ స్కోర్‌ బాగా ఉండాలి. 750కి పైగా క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే వడ్డీరేటు కూడా తక్కువగా ఉంటుంది.

ఆరు పాయింట్లు..పై సదువుకు అప్పుజేస్తరా..

రీపేమెంట్‌కు వ్యూహం
తీసుకున్న రుణం మీద వడ్డీ భారం మొదటి నెల నుంచే పడుతుంది. రుణాన్ని చెల్లించేందుకు ఏడాదిపాటు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. దీన్నే మారటోరియం పీరియడ్‌ అని కూడా అంటారు. ఈ పీరియడ్‌ తర్వాతనే ఈఎంఐ చెల్లింపులు ప్రారంభం అవడం ఎడ్యుకేషనల్‌ లోన్‌కు ఉన్న సౌలభ్యత. ముందుగానే ఈఎంఐ చెల్లించడం ద్వారా రుణాన్ని ముందుగానే తీర్చే వెసులుబాటు కూడా ఉంటుంది. మీమీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రుణాన్ని చెల్లించేందుకు ఎప్పట్నుంచి ఈఎంఐని చెల్లించాలో నిర్ణయించుకోండి.

ఏయే ఖర్చులకు కవరేజీ
ఎడ్యుకేషనల్‌ లోన్‌లో కోర్సు ఫీజుతోపాటు, ఇతర ఫీజులు, కోర్సుకు సంబంధించిన పరికరాలు కూడా కవరేజీ అవుతాయి. అయితే ఇవి తలిదండ్రుల ఆదాయం, తిరిగి


చెల్లించే స్థోమత, క్రెడిట్‌ స్కోర్‌ తదితర అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పిల్లల ఉన్నత విద్య కోసం రుణాన్ని ఎలాంటి చీకూచింతా లేకుండా సులభంగా తీసుకోవచ్చు. ఈఎంఐ సమయానికి చెల్లించడం వల్ల
క్రెడిట్‌ స్కోర్‌తోపాటు పిల్లల క్రెడిట్‌ స్కోరూ మెరుగుపడుతుంది.

అదనపు ప్రయోజనాలు
ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకోవడం వల్ల ఆదాయం పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్‌ 80ఈ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలనూ పొందవచ్చు. రుణంపై చెల్లిస్తున్న వడ్డీ భాగం మొత్తాన్ని ఐటీ నుంచి మినహాయించుకోవచ్చు.

No comments:

Post a Comment