Thursday, January 13, 2022

నిజాం కే దిక్కులేదు.. నీవు ఒక లెక్కా కేసీఆర్ ? తొలివెలుగు స్టూడియోలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు

నిజాం కే దిక్కులేదు.. నీవు ఒక లెక్కా కేసీఆర్ ? తొలివెలుగు స్టూడియోలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఇవాళ నువ్వు, నీ ఆస్తులు, నీ ఫాం హౌస్ చూసుకొని మురిసిపోతున్నావు. ఆనాడు కోట్ల ఆస్తులు, లక్షల ఎకరాలు ఉన్న నిజామే.. ఎలాంటి ఆస్తులు లేని అత్యంత సామాన్యులు అయినా.. ఒక కొమరం భీ, ఒక చాకలి ఐలమ్మ, ఒక తుర్రే బాజ్ ఖాన్, ఒక సోయాబుల్లా ఖాన్, ఒక సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వీరుల పోరాటానికి ది గ్రేట్ నిజాం అనుకున్నవాడే తలవంచక తప్పలేదు. నాటి రైతు కూలీ పోరాటానికి నిజాం అంతటి వాడే గడగడలాడక తప్పలేదు. భారీ సైన్యం ఉన్న నిజాంను కూడా సామాన్యులు చేతికందిన ఆయుధాలతో వణికించారు. నిజాంల పైజామాలు తడిచాయన్న చరిత్ర చదవలేదా కేసీఆర్ అని రేవంత్ సవాల్ విసిరారు.

ఎంతటి నియంత అయినా.. ఒకనాడు కాల గర్భంలో కలిసి పోక తప్పదని నిజాం చరిత్ర మనకు చెబుతోంది. అంటూ.. తొలివెలుగు స్టూడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

No comments:

Post a Comment