Sunday, January 30, 2022

ఐఏఎస్ లు ఉంది ప్రజాసేవకా? నాయకులకు ఊడిగం చేయడానికా?

ఐఏఎస్ లు ఉంది ప్రజాసేవకా? నాయకులకు ఊడిగం చేయడానికా?

తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై ఉద్యమకారులు, మేధావుల్లో చర్చ జరుగుతోంది. ఉద్యోగులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు మొత్తం కుమ్మకై ప్రజల సొమ్ము దొచుకుంటున్నారని అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రజత్ కుమార్ కుమార్తె పెళ్లి బిల్లుల వ్యవహారమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి ఆస్తుల చిట్టా చుట్టూ అనేక సందేహాలను తెరపైకి తెస్తున్నారు.

తాజాగా బయటపడిన 70వేల కోట్ల మేఘా దోపిడీపై ఉద్యమకారులు మండిపడుతున్నారు. జూపల్లి రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి లాంటి బడా వ్యాపారులు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వారి అవినీతిపై ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. కోర్టులను కూడా మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు. ఆ మధ్య పంపకాల్లో ప్రభుత్వానికి మేఘా సంస్థకు అభిప్రాయ బేధాలు వచ్చాయేమో కానీ.. ఆ సంస్థపై ఈడీ, ఐటీ దాడులు జరిగాయని.. కాకపోతే లోపాయికారి ఒప్పందం తర్వాత వాటాలు పంచుకున్నారని చెబుతున్నారు.


ఈ అవినీతిపరులకు ప్రభుత్వ అధికారులు గ్రీన్ కార్పెట్ వేస్తున్నారని మండిపడుతున్నారు ఉద్యమకారులు. ఐఏఎస్ అధికారుల్లో 80శాతం మంది బ్రోకర్లులా తయారయ్యారని అంటున్నారు. రజత్ కుమార్ కూడా ఈ కోవకు చెందిన వారేనని ఆరోపిస్తున్నారు. అందుకే మేఘా సంస్థ ఆయన కుమార్తె పెళ్లి ఖర్చులకు బిల్లులు చెల్లించిందని అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా రజత్ కుమార్ టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించి 23 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నారు.
కింది స్థాయి ఉద్యోగులు 10 వేలు లంచం తీసుకున్నా పట్టుబడతారు కానీ.. ఐఏఎస్ లాంటి ఉన్నతస్థాయి అధికారులు వేల కోట్ల అవినీతి చేసినా, బడా వ్యాపారులు కోట్లు దోచేస్తున్నా దొరకకుండా సిస్టమ్ ని మేనేజ్ చేస్తున్నారని మండిపడుతున్నారు ఉద్యమకారులు. ప్రమోషన్ల కోసం అధికారులు రాజకీయ నాయకులకు, వ్యాపారులకు ఊడిగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఓ కలెక్టర్.. మహిళా రాజకీయ నాయకురాలి కాళ్ల దగ్గర కూర్చున్నాడని గుర్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment