Chanakya Niti: ఆచార్య చాణక్యుడు సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను నీతి శాస్త్రం ద్వారా నేటి ప్రజలకు..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను నీతి శాస్త్రం ద్వారా నేటి ప్రజలకు తెలియజేశాడు. చాణక్య నీతి ప్రకారం.. జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయాలి. లక్ష్యాలను సాధించడానికి, గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. చాణుక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పిన అనే విషయాలు ప్రస్తుత జనరేషన్ కు అనుసరణీయం. ఎవరైనా సరే చాణుక్యుడి చెప్పిన పాఠాలను అనుసరిస్తూ జీవితంలో ముందుకు సాగితే, అతను తన కష్ట కాలాన్ని సులభంగా అధిగమిస్తాడు. చాణుక్యుడు చెప్పిన ఈ ఐదు విషయాలను గుర్తు పెట్టుకుంటే…. జీవితంలో సంతోషంగా సాగుతుంది.
మీ బలహీనతను ఎవరికీ చెప్పకండి: మీ బలహీనతను ఎవ్వరితోనూ చెప్పకూడదని ఆచార్య చాణక్యుడు ఉవాచ. ఈరోజు మీకు సానుభూతిపరులుగా మారిన వ్యక్తులు రేపు మీకు ప్రత్యర్థులుగా మారవచ్చు. అటువంటి పరిస్థితిలో, అదే వ్యక్తులు మీ బలహీనతను ఉపయోగించుకుంటారు.
సోమరితనం వదలండి: ప్రతి మనిషికి సోమరితనం అతి పెద్ద శత్రువని ఆచార్య చాణక్యుడు అన్నారు. కనుక మీ పై సోమరితనం ఆధిపత్యం చెలాయించే అవకాశం ఇవ్వకండి.. సోమరితనం మీ విజయానికి శత్రువు. మీ కష్టార్జితాన్ని నాశనం చేసే శక్తిని కలిగి ఉంది. కనుక సోమరితనాన్ని పూర్తిగా వదులుకున్నవారు జీవితంలో సక్సెస్ అందుకుంటారు.
వర్తమానంలో జీవించండి: గడిచి కాలం మార్చలేం.. అయితే వర్తమానం మంత్రం మీదే..కనుక ఎవరైనా వర్తమానంలో జీవించడం నేర్చుకుంటే,.. వారు ఖచ్చితంగా తమ భవిష్యత్తును మార్చుకోగలరు. గతం నుండి పాఠాలు నేర్చుకోండి.. వర్తమానంలో మెరుగుపరచండి.. భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోండని చాణుక్యుడు చెప్పారు
మీరు చూసిన లేదా విన్న వాటినే నమ్మండి: మీ పై ఎవరికైనా కోపం వస్తుంది.. లేదా ఒకొక్కసారి ఇతరుల మాటలకు ప్రతిస్పందిస్తారు.. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నవారు మీకు హాని కలిగించేలా మీదగ్గరకు చేరవేయవచ్చు. కానీ అవుటువంటి చెప్పుడు మాటలను నమ్మకండి. మీ స్వయంగా విన్న, లేదా చూసిన వాటినే నమ్మండి.
ఎవరినీ అవమానించకండి: వ్యక్తి తాను చేసిన కాలక్రమంలో శిక్షను తానే పొందుతాడని చాణుక్యుడు చెప్పారు. అనవసరంగా ఎవరినీ అవమానపరిచేలా ప్రవర్తించకండి.. మీపై ప్రతికూలత ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు అటువంటి వారి మనస్సు ఎల్లప్పుడూ ఇతరుల హాని గురించి మాత్రమే ఆలోచిస్తుంది. కనుక మీ ఆలోచనలను స్వచ్ఛంగా ఉంచుకోండి. మిమ్మల్ని లేదా మీరు ఇతరులను కించపరచకండి.
No comments:
Post a Comment